సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ పోరాటం అనేది అందరి బాధ్యత. దాన్ని స్వచ్ఛందంగా చేపట్టి కొందరు సినీ ప్రముఖులు పోరాడుతున్నారు. కొత్వాల్ గూడలో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్.. పర్యావరణానికి పెద్ద ముప్పు కానుందని రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
(ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?)
ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం నిలిపేయాలని కోర్ట్‌ను ప్రముఖులు ఆశ్రయించారు. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో జరిగాయి మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. వీటికి సమాధానంగా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్కులతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. పర్యావరణానికి చేటు చేసేలా ఉన్న ఈ ప్రాజెక్టుపై తమ పోరాటానికి మద్దతు కావాలని పిటీషనర్లలో ఒకరైన శశికిరణ్ తిక్కా చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ లో నీటి సమస్య ఉందని, ఆక్వా మెరైన్ వల్ల అది మరింత ఎక్కువవుతుందని సదా అన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)
Comments
Please login to add a commentAdd a comment