
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో 400 ఎకరాల భూ వివాదంపై స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna ) స్పందించారు. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "రాత్రికి రాత్రే బుల్డోజర్లు. విద్యార్థుల అరెస్టులు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో నిజంగా ఏమి జరుగుతోంది?" అంటూ ఆమె ప్రశ్నించారు.
ఈ వివాదం గత కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చింది. విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం కోసం వేలం వేయాలని ప్రతిపాదించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాజాగా రాజకీయ పార్టీలు తోడవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
(చదవండి: హార్డ్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!)
400 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లను నరికివేయడంతో, ఆ అడవిపై ఆధారపడిన మూగజీవుల జీవనాధారం కోల్పోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, జీవవైవిధ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిరసనకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా మద్దతు ఇస్త్ననారు. స్టార్ హీరోయిన్ సమంత, నాగ్ అశ్విన్, నటి రేణూ దేశాయ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
