Government of telagana
-
సమగ్ర కుటుంబ సర్వే.. ఎందుకీ ఆలస్యం?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వేలో వివరాలు వెల్లడించేందుకు చాలామంది నిరాకస్తున్నారు. వివరాలు గోప్యంగానే ఉంటాయని ప్రభుత్వం భరోసాస్తున్నప్పటికీ ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించడం లేదు. దీనికి తోడు.. ఫామ్‌లో మార్పుల వల్ల ఒకరోజు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో నిన్నటి వరకు స్టిక్కరింగ్ కార్యక్రమం కొనసాగింది. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వే చేశారు. సర్వే కోసం ఒక్కో ఇంటివద్ద 20 నుంచి 35 నిమిషాల సమయం తీసుకున్నారు. చాలాచోట్ల.. ఇంటి యజమానులు ఎన్నికల హామీలపై నిలదీస్తుండడంతో ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సర్వే సాఫీగా సాగుతుందనే ధీమాతో ఉంది.చదవండి: కులగణనపై కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి: పొన్నం -
డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీశ్‌రావు మండిపడ్డారు. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం.కెసిఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను… pic.twitter.com/CwnErdltSu— Harish Rao Thanneeru (@BRSHarish) May 20, 2024 -
తెలంగాణలో రైతుల సమస్యలు పరిష్కరించామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కుల వృత్తులకు కేసీఆర్ అండ
కొడంగల్: గొల్లకురుమల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బొంరాస్‌పేట మండలం ఎనికెపల్లికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెలు ఇస్తున్నట్లు చెప్పారు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నట్లు తెలిపారు. యూనిట్‌ను ధరను రూ. లక్షా 75వేలకు పెంచినట్లు చెప్పారు. ఇందులో లక్షా 31వేల 250 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు తమ వాటా కింద రూ.43,750 చెల్లిస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధు యాదవ్, మాజీ సర్పంచ్ రమేష్‌బాబు, గొల్ల కురుమ సంఘం నాయకులు, పశువైద్యాధికారులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుదాం పట్టణంలోని మున్సిపల్ పార్క్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత్సోవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉషారాణి, కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు మధుసూదన్‌రావ్ యాదవ్, రమేష్, మాజీ సర్పంచ్ రమేష్‌బాబు, మహిళా సమాఖ్య సభ్యులు ఆనందమ్మ, అన్నపూర్ణ, మున్సిపల్ సిబ్బంది క్రాంతి, భరత్ పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలి దౌల్తాబాద్: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమెల్యే నరేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో హరితోత్సవంలో భాగంగా పెద్ద చెరువు కట్టపై మొక్కలను నటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ఏటా హరితహారం నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్. వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ తిరుమల స్వామి, ఏపీఓ రంజిత్ కుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణలో ఈ ఏడాది స్కూళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల వరకు నేరుగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ మేరకు స్కూళ్ల బంద్ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల బంద్ నిర్ణయం ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా వర్తించనుంది. -
క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్..
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో గత ఆరు నెలలుగా (మార్చి 14 నుంచి) మూతబడిన బార్లు, క్లబ్బులు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న బార్లు, క్లబ్బులను తక్షణమే తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులను తక్షణమే తెర వచ్చు. అయితే ఆయా ప్రదేశాల్లో సమూహాల ఏర్పాటు, మ్యూజికల్ ఈవెంట్లు, డ్యాన్స్ ఫ్లోర్లపై నిషేధం కొనసాగుతుంది. దీంతో పబ్బులు మళ్లీ తెరుస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెల కొంది. అయితే బార్లకు అనుమతిచ్చిన ప్రభు త్వం వైన్‌షాపుల వద్ద పర్మిట్ రూంలపై ఉన్న నిషేధాజ్ఞలను ఎత్తేయలేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్మిట్ రూంలపై నిషేధం కొనసాగు తుందని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన షరతులు... ►బార్లలో ప్రవేశద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. థర్మల్ స్క్రీనింగ్ స్పర్శరహితంగా ఉండాలి. ►బార్లు, క్లబ్బుల్లో పరిశుభ్రత పాటించాలి. నిబంధనలకు అనుగుణంగా క్యూ పద్ధతి పాటించాలి. ►పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలి. ►హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. బార్ సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు ధరించి సర్వీసు చేయాలి. ►ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు బార్ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శుభ్రపరచాలి. కస్టమర్ మారే ప్రతిసారీ సీట్లను శానిటైజ్ చేయాలి. ►బార్లు, క్లబ్బుల ప్రాంగణాల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టాలి. -
‘చేయి దాటిపోయింది.. చర్చలు జరపలేం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున అడిషినల్ అడ్వొకేట్ జనరల్( ఏజీ) వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్టవిరుద్ధమని కోర్టుకు వివరించారు. ‘ పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్22(1)ఏ, ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్ యాక్ట్ ప్రకారం సమ్మె ఇల్లీగల్. చట్టం ప్రకారం ఆరు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. సమ్మెకు కనీసం 14 రోజుల ముందు ప్రభుత్వంకు తెలపాలి. కానీ కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సెక్షన్ 24 ప్రకారం కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం’ అని ఏజీ హైకోర్టుకు వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టుకు తెలిపారు. డిమాండ్లను పరిష్కరించలేం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్పొరేషన్ పరిస్థితి అస్సలు బాగాలేదని, సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44శాతం నష్టపోయినట్లు కోర్టుకు వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. యూనియన్లు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకుపెట్టినా, తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తిసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందన్నారు. కొతంమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం టీఎస్ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించింది. సమ్మె అన్నది కార్మికుల కోసం కాకుండా, యూనియన్ నేతలు తమ ఉనికి చాటుకునేందుకు చేస్తున్నారని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. -
క్లైమాక్స్‌కువిద్యుత్ విభజన
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం క్లైమాక్స్‌కు చేరుకుంది. జస్టిస్ ఎం.ధర్మాధికారి ఏకసభ్య కమిటీ డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశమై ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఏపీ, తెలంగాణకు ఈ విషయాన్ని తెలుపుతూ జస్టిస్ ఎం.ధర్మాధి కారి కమిటీ తాజాగా లేఖ రాసింది. ఏపీ స్థానికత కలిగి ఉన్నారని 1,157 మంది ఉద్యో గులను తెలంగాణ విద్యుత్ సం స్థలు 2015 జూన్‌లో ఏకపక్షంగా ఏపీకి రిలీవ్ చేయ డంతో గత ఐదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం నడు స్తోంది. దీని పరిష్కారానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ధర్మాధికారి నేతృ త్వంలో సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యో గుల విభజనకు ధర్మాధి కారి కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు రిలీవైన 1,157 మందితో సహా తమ స్టేట్ కేడర్ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించగా, రిలీవైన 1,157 మందిలో 613 మంది ఏపీకి, 504 మంది తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా 42 మంది ఏ రాష్ట్రానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇక ఏపీలో పనిచేస్తున్న మరో 265 మంది తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా, తెలంగాణ నుంచి ఒక్కరూ ఏపీకి ఆప్షన్ ఇవ్వలేదు. ఉద్యో గులిచ్చిన ఆప్షన్ల ప్రకారం.. రెండు రాష్ట్రాలు ప్రాథమిక కేటాయిం పుల జాబితాలను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాలని గత నెలలో ధర్మాధికారి కమిటీ ఆదేశించింది. ఆ మేరకు ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రాథమిక కేటాయింపుల జాబితా లను ప్రకటించి అభ్యంతరాల స్వీకరణను ప్రారంభించాయి. అంతమందిని తీసుకోలేం.. ఇటు తమ రాష్ట్రానికి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని స్వీకరించేందుకు ఖాళీ పోస్టులు లేవని, వీరి కోసం ప్రత్యేకంగా సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించడం ఆర్థికపరంగా సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం ధర్మాధికారికి లేఖ ద్వారా తెలియజేసింది. అయితే, ఏపీ నుంచి 202 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు ఐదేళ్ల కిందే స్వచ్ఛందంగా సొంత రాష్ట్రం తెలంగాణకు వచ్చి చేరారు. వీరు తెలంగాణకు రావడంతో ఏపీలో ఖాళీ అయిన పోస్టుల్లో 613 మంది నుంచి 202 మందిని తీసుకునేందుకు ప్రాథమిక కేటాయింపుల జాబితాను ప్రకటించి ఈ నెలాఖరులోగా అభ్యంతరాల స్వీకరణను పూర్తి చేయాలని తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది. డిసెంబర్ 14, 15వ తేదీల్లో రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి తుది కేటాయింపుల జాబితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. 265 మందిలో 72 మంది మాత్రమే! ఇక ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 265 మందిలో కేవలం 72 మంది మాత్రమే కమిటీ మార్గదర్శకాల ప్రకారం అర్హులని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గత ఐదేళ్లలో పదవీ విరమణలతో ఏపీలో వందల పోస్టులు ఖాళీ అయ్యాయని, పోస్టులు లేవని ఏపీ చేస్తున్న వాదనలో వాస్తవాలు లేవని తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు పేర్కొంటున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జాబితాలను ధర్మాధికారి కమిటీకి అందజేసి ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించాలని కోరుతామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
వర్సిటీలకు అదనపు నిధులు
మంజూరుకు తెలంగాణ సీఎస్ సుముఖం సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల నిధుల కొరత తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి నేతృత్వంలో వివిధ విశ్వవిద్యాలయాల ఉద్యోగ, అధ్యాపక సంఘాల నేతలు గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. ఉన్నతవిద్యాశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బందికి ప్రతినెల వేతనాలు, పెన్షన్ మొత్తం వివరాలను, బడ్జెట్లో చేసిన కేటాయింపుల ను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదికి రూ.650 కోట్లకుపైగా అవసరంకాగా బడ్జెట్లో సర్కార్ రూ. 280 కోట్లే కేటాయించిందని, అది వేతనాలకు, పెన్షన్లకే సరిపోదని వర్సిటీల అధికారులు తెలిపారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం బడ్జెట్లో కొద్ది మొత్తాన్నే కేటాయించడంతో ఇక్కట్లు తలెత్తాయన్నా రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతి కొనసాగడంతో వర్సిటీల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. అదనపు నిధులను ఇచ్చేందుకు సీఎస్ అంగీకరించినట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అనంతరం విలేకరులకు తెలిపారు.