హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వేలో వివరాలు వెల్లడించేందుకు చాలామంది నిరాకస్తున్నారు. వివరాలు గోప్యంగానే ఉంటాయని ప్రభుత్వం భరోసాస్తున్నప్పటికీ ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించడం లేదు. దీనికి తోడు..
ఫామ్‌లో మార్పుల వల్ల ఒకరోజు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో నిన్నటి వరకు స్టిక్కరింగ్ కార్యక్రమం కొనసాగింది. ఆదివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 వేల ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వే చేశారు. సర్వే కోసం ఒక్కో ఇంటివద్ద 20 నుంచి 35 నిమిషాల సమయం తీసుకున్నారు.
చాలాచోట్ల.. ఇంటి యజమానులు ఎన్నికల హామీలపై నిలదీస్తుండడంతో ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సర్వే సాఫీగా సాగుతుందనే ధీమాతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment