
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. శనివారం సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఎన్యుమరేటర్లపై ఓ ఇంటి యజమాని కుక్కలను వదిలారు.
ఈ ఘటన బంజారాహిల్స్ ఆరోరా కాలనీలో చోటుచేసుకుంది. సర్వే పేరుతో తమ టైం వేస్ట్ చేస్తున్నారని ఎన్యుమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు సెక్యూరీటీ కావాలని ఎన్యుమరేటర్లు కోరుతున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే.. నవంబర్ 6న ప్రారంభం కాగా.. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్ రూపంలో సేకరిస్తారు. వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా హౌస్ లిస్టింగ్‌లో నమోదు చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు.

Comments
Please login to add a commentAdd a comment