జయం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న సదా ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు నాట గుర్తింపు సంపాదించుకుంది. అయితే కొద్దికాలంగా సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ షోలో పాల్గొని సినిమాలు సహా పలు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినీ పరివ్రమలోకి అడుగుపెట్టానిని, అమ్మ సహకారతోనే హీరోయిన్ అయ్యానని తెలిపింది. జయం చిత్రీకరణ సమయంలో ఓ పెద్ద యాక్సిడెంట్ క్షేమంగా బయటపడ్డాని చెప్పింది.
ఇక 2015లో తన తల్లికి క్యాన్సర్ అని తేలడంతో ఒక్కసారిగా మా జీవితాలు మారిపోయాయి. అమ్మ రిటైర్మెంట్‌కు పది రోజుల ముందు ఆమె పుట్టినరోజు నాడే క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసింది. దీంతో నేను, నాన్న చాలా కృంగిపోయాం. ఆ సమయంలో సినిమా అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేశాను. అసలు అవతలి వాళ్లు ఎవరు? ఏ బ్యానర్? కథేంటి అన్న విషయాలు కూడా పట్టించుకోకుండా అన్ని ప్రాజెక్టులకు నో చెప్పేదాన్ని.. ఆ సమయంలోనే సినిమాలు దూరమయ్యాయి.
అలా చంద్రముఖి, ఆనంద్ సహా పలు సినిమాలను వదులుకున్నాను అని పేర్కొంది. ఇక కొన్నాళ్లు క్రితమే వీగన్‌గా మారిపోయిన సదా..జంతువులకు హానీ కలిగించే ఏ పదార్థాన్ని తీసుకోనని, ఆఖరికి లెదర్ బ్యాగ్ లాంటివి కూడా వాడనని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ..తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వంద శాతం వీగన్ అయి ఉండాలని, అలా ఉంటేనే చేసుకుంటానని, లేదంటే ఇలాగే సింగిల్‌గానే లైఫ్ గడిపేస్తానని వెల్లడించింది.
చదవండి : హీరోయిన్‌ను ఆ విషయం గురించి డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్
భర్తతో కలిసి ఆ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత
Comments
Please login to add a commentAdd a comment