Heroine Sadha Interesting Comments About Her Marriage - Sakshi
Sakshi News home page

Sadha: అందుకే సింగిల్‌గా ఉంటున్నా..పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Jul 12 2023 6:37 PM | Updated on Jul 12 2023 7:48 PM

Heroine Sadha Interesting Comments About Her Marriage - Sakshi

జయం చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది సదా. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి, స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో పాటు తమిళ్‌లోనూ నటించింది. విక్రమ్‌తో నటించిన ‘అపరిచితుడు’తో సదాకు సౌత్‌ లెవల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పట్లో సదా పేరు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మారుమోగింది. అయితే ఆ చిత్రం తర్వాత సదా నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.

దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇటీవల సెకండ్‌ ఇన్సింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. ఒకవైపు సినిమాలతో పాటు పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇలా కెరీర్‌ పరంగా మళ్లీ బిజీగా అయిన సదా.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆమెతో పాటు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌ అంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కూడా కన్నారు. కానీ సదా మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో చెప్పింది. ‘పెళ్లి చేసుకుంటే ఫ్రీడం పోతుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నాకిష్టమైన పని చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉంటాయో ఉండవో తెలియదు. మనల్ని అర్థం చేసుకునే వాళ్లు దొరికితే పర్వాలేదు కానీ.. లేకపోతే? పైగా ఇప్పుడు చాలా మంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని.. కొద్ది రోజులకే విడిపోతున్నారు. ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోవడం ఎందుకు? దాని కంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్‌ కదా’అని సదా చెపుకొచ్చింది.

(చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement