
‘వెళ్లవయ్యా.. వెళ్లు..’ అనే డైలాగ్ వినపడగానే టక్కున గుర్తోచ్చే హీరోయిన్ సదా. ‘జయం’ మూవీతో తెలుగు తెరపై కనిపించిన సదా తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. అందులో ఆమె చెప్పే ఈ డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ సిగ్నేచర్ డైలాగ్‌ను చాలా మంది ఫాలోవుతున్నారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ జయం ఇచ్చిన గుర్తింపును ఆమె నిలుపుకోలేకపోయింది. క్రమంగా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చింది. దీంతో బుల్లితెర డాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్న తాజాగా హోల్డ్ వరల్డ్ అనే సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది.
చదవండి: స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు
ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె పెళ్లి, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా సదా మూడు పదుల వయసులో ఉన్న ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాబోయే భర్త గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఈ సందర్భం ఆమె పెళ్లిపై స్పందిస్తూ.. ‘నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది నన్ను పెళ్లి చేసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. మన జీవితం మీద కామెంట్స్ చేసే హక్కును వారికెవరిచ్చారు. అలాంటి వారికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పది మంది పెళ్లి చేసుకుంటే అందులో 5 జంటలైనా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నాయా? ఎవరూ హ్యాపీగా ఉండడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన
అలాగే కాబోయే భర్త గురించి చెబుతూ.. ‘నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. పార్టీలకు, పబ్స్‌కు వెళ్లను. ఆల్కహల్, నైట్ ఔట్స్ చేయను. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరు. ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలి. నీ సంతోషం కోసం నువ్వు మరో వ్యక్తిపై ఆధారపడాల్సిన అవసం ఏముంది. నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటెరియన్ అయ్యి ఉండాలి. అతడు ధనవంతుడు కానక్కర్లేదు. ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. ముఖ్యంగా నా సంపాదనపై అతడు ఆధారపడొద్దు. అలాంటి వాడు దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటా’ అంటూ వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment