ఓటు వేసి గెలుద్దాం
ఓటే బ్రహ్మాస్త్రం. ప్రజాస్వామ్యంలో ఓటు కంటే విలువైన హక్కు ఏదీ లేదు. ఆ హక్కును సద్వినియోగం చేసుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. తొలిసారి ఓటు హక్కు పొందిన వారి నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అంతా ఓటేయాలి. పెద్దలకు యువత తోడుగా నిలవాలి. సమాజానికి వ్యక్తిగా ఏమీ చేయలేకపోవచ్చు గానీ సరైన నాయకుడిని మాత్రం ఎన్నుకునే అవకాశముంది. అందుకే తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి...
- తమన్నా, హీరోయిన్
సమర్థులనే ఎన్నుకోండి..
ఓటు వేయడం మన బాధ్యతే కాదు పౌరులుగా మన ప్రాథమిక హక్కు కూడా.. అలాంటి ఎంతో విలువైన ఓటు వృథా కాకూడదు. ఒకటికి పదిసార్లు ఆలోచించి సమర్థులెన నేతలనే ఎన్నుకోవాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరైతే ప్రగతిపథంలో నడిపించగలరో.. సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తారో అటువంటి వారినే ఎన్నుకోవాలి. డబ్బులు తీసుకునో, ఇతర బహుమతులు తీసుకునో ఓట్లు వేయద్దు. అలా చేస్తే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టే.
- సదా, హీరోయిన్