janaayudham
-
సమైక్య ‘సారథి’
జనసభలోనే కాదు.. చట్టసభలో సైతం సమైక్య శంఖారావాన్ని పూరించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సాక్షాత్తూ పార్లమెంటులో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ ప్లకార్డు పట్టుకుని వెల్‌లో దూసుకెళ్లారు. మన జాతి, నేల విచ్ఛిన్నాన్ని అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలను దునుమాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమానికి ఊపిరి పోశారాయన. అక్రమ కేసులతో జైలులో పెట్టినా సమైక్య రాష్ట్రం కోసం దీక్ష బూనారు. ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారు. బయటికొచ్చాక అలుపెరుగని పోరు సాగించారు. ఢిల్లీలోనూ ‘సమైక్య’ నినాదాన్ని మార్మోగించారు. హైదరాబాద్‌లో ‘శంఖారావం’ పూరించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమానికి అండగా నిలవాలంటూ దేశంలోని వివిధ పార్టీల అధినేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. సమైక్యమన్న మాటకే కట్టుబడి జనహృదయ స్పందనను చాటిన నేత జగన్ మాత్రమే! -
అక్కడో మాట....ఇక్కడో మాట
-
ఈ తిక్కకు లెక్కేది..?
పవనిజం- ఒక గొంతు మూడు నాల్కలు ఎన్నికల్లో విద్వేష ప్రసంగాలు చేస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎన్నికల సంఘం కట్టడి చేస్తోంది. ‘అవును చర్యలుంటాయ’ని డీజీపీ హెచ్చరిస్తున్నారు. మరి రెండు నాల్కల ప్రసంగాలు చేస్తే? బహుశా ఈ విషయంలో తగు చర్యలు తీసుకునే అధికారం/బాధ్యత ఓటర్లదేనని, వారే కట్టడి చేయాలనేది ఎన్నికల సంఘం అభిప్రాయమై ఉంటుంది! ప్రజలు విజ్ఞులు కనుక అదెలాగూ జరుగుతుంది. కానీ, ఈ లోపు నష్టనివారణ చర్యలైతే ఉండాలి కదా! సదరు రెండు నాల్కల నేతలు పరస్పర విరుద్ధంగా ప్రాంతానికో మాట మాట్లాడటం అన్నది ప్రాంతీయ విద్వేషాల్ని రగిలించడం, రెచ్చగొట్టడం.... అవదా? రజల్ని ఆలోచించే మనుషులుగా కాకుండా ఈవీఎంలలో గణాంకాలై తమ తలరాతలు మార్చే పచ్చి ఓటర్లుగా మాత్రమే భావించే నేతలు.... ఏ రోటికాడ ఆ పాట పాడి, అది మీడియాలో కొట్టొచ్చినట్టు కనిపించి... ఎక్కడ ఏం మాట్లాడారో! ఎంత పరస్పర భిన్నంగా ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించారో ఇరు ప్రాంతాల వారికీ తెలిస్తే!?! అదే జరుగుతోందిప్పుడు, నటుడు పవన్ ప్రసంగాలతో! పవనమంటేనే గాలి. ఇది సాధారణ గాలి కాకుండా, యువ హృదయాల్లో దూసుకుపోయే పెనుగాలి అవుతుందని, తమ జోలెలో ఓట్లు రాలుస్తుందని ఆశపడ్డ బడా నేతలిద్దరు ఆయన ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న తీరు తెలుగునాట అడ్డుతెర లేని భాగోతం లాగే రక్తి కడుతోంది. కాకపోతే ఆ గాలి తుపాన్ పిచ్చిగాలిలా ఎటుపడితే అటు వీస్తోంది. పిచ్చి పవనం ముందుకు, మున్ముందుకే వీస్తోంది తప్ప వెనక్కి తిరిగి చూసుకోవటం లేదు, మొన్నకు నిన్న మాట తీరు ఎంత భిన్నంగా ఉంది, నిన్నటి మీద స్వరం నేడెంత విభిన్నంగా ఉంది అని బేరీజు వేసుకుంటే, తన ప్రసంగాల్లోని డొల్ల తనమే కాదు కుళ్లు కూడా బోధపడేది. విధానాలపరంగా కాకుండా వ్యక్తులపరంగా తానెంత కుత్సితపు, కుతంత్రపు మాటలు చెబుతున్నాడో పాపం తనకే తెలిసొచ్చేది. కానీ, ఈ పిచ్చి పవనం వెనక్కి తిరిగి చూడదు. ముక్కు సూటిగా ముందుకే వెళుతుంది, ఏ గొడకో గుద్దుకొని ముక్కు పచ్చడయ్యే వరకో, ఆగ్రహించే వారెదురై సిగదరిగితే గుండు నిగారించే వరకో... అలా వీస్తూనే ఉంటుంది నేల మీద కాళ్లు ఆనని ఈ పవనం. ఎవరో ఏర్పాటు చేసే మైక్(ం)ఉన్నన్ని రోజులు నోటికొచ్చింది మాట్లాడి, తగిన శాస్తి జరిగాక కనుమరుగయితే... మళ్లీ ఇంకో సినిమాల సందడో, ఎన్నికల పండుక్కో తప్ప తెరమీదికి రానే రాదీ పవనం. పోయిన ఎన్నికలప్పుడు అన్న నీడలో తేరగా దొరికిన మైకుల్లో ఊదరగొడుతూ... సామాజిక మార్పని, స్వచ్ఛంద సేవని, పంచలూడగొడతామని పలికిన బీరాలు గాలికిపోయాయి. ఫలితాలతో ప్రజలు ఏకంగా మాడు పగలగొడితే అప్పుడు ఫరారై సరిగ్గా అయిదేళ్లకు, ఈ ఎన్నికల వేళ మళ్లీ దూసుకొచ్చిందీ పవనం. ప్రత్యర్థులు చెప్పినట్టు సంక్రాంతి సమయంలో వచ్చే గంగిరెద్దుల వాళ్లలాంటి (నిజంగా ఆ వినోదపు వృత్తితో పొట్టపోసుకునే వారికి క్షమాపణలతో) ఈ పవనం అద్దె గొంతుతో అరివీర భయంకరంగా రంకెలు వేస్తోంది. అదెలా....? ఒక గొంతు మూడు నాల్కలు మీరే చూడండి ఎంత తేడానో.. సీన్-1 విశాఖపట్నం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇంతవరకు ఇలాంటి రాజకీయ వికృత క్రీడ ఎన్నడూ చూడలేదు. రాష్ట్ర విభజనతో ప్రజ లను రోడ్లపైకి తీసుకువచ్చారు. అర్థంపర్థం లేకుండా అడ్డంగా తెలుగు రాష్ట్రాన్ని విభజించారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించి ఎంగిలి మెతుకులు చల్లినట్టు ప్యాకేజీలు చల్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయగలరా? కాంగ్రెస్ కో హటావో, దేశ్‌కో బచావో! సీన్-2: నిజామాబాద్ జై తెలంగాణ. తెలంగాణ కోసం మొదట్నుంచి నా హృదయం తపిస్తావుంది. తెలంగాణ అంటే నాకెంతో ప్రేమ, నా గుండె లోతుల్లో తెలంగాణ ఉంది. నరనరాల్లో, నా రక్తంలో తెలంగాణ అంటే ఇష్టం. ఎప్పుడో విభజన జరిగి ఉండాల్సింది. రాష్ట్ర ఏర్పాటు జాప్యానికి కాంగ్రెసే కారణం. అందువల్లే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకోవాల్సి వచ్చింది. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ వ్యతిరేక పార్టీల కూటమి అయిన మూడో ఫ్రంట్‌లో కేసీఆర్ ఎలా కలుస్తారు? సీన్-3 : తిరుపతి జగన్ వల్లే తెలంగాణ ఏర్పడింది. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తెలంగాణ ఆకాంక్ష క్రమంగా పెరుగుతూ వచ్చింది. నేటి దుస్థితికి వైఎస్ కుటుంబమే పూర్తిగా కారణం. కేసీఆర్ తెలుగువారిని ఛీకొట్టి చీదరిస్తే.. చేతులు కట్టుకొని చూస్తూ కూర్చుంటారా? తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానం జరుగుతుంటే ప్రశ్నించలేరా? పౌరుషం, ఆత్మగౌరవం చచ్చిపోయిందా? తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడలేని వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అది జరిగే పనికాదు. చూశారుగా నాలుక ఎన్ని మలుపులు తిరిగిందో! పడని వారందరికీ ప్రశ్నలు వేస్తూ పరుగు పరుగున ముందుకు సాగే పవనానికి, తనకెదురయ్యే ప్రశ్నలకు జవాబులివ్వడం తెలుసా? ఇవ్వగలదా? మచ్చుకు అయిదే... 1. ఇంతకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పా, ఒప్పా? (30న పోలింగ్ ముగిసింది కనుక ముమ్మాటికీ తప్పా? లేక నరనరాన మీకు రక్తమార్పిడి జరిగిందా?) 2. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు దారులు పరచిన లేఖ ఇచ్చి సహకరించిందెవరు? 3. రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమైన వేళ, పార్లమెంటు బయట చీకటి ఒప్పందం చేసుకొని, రాజ్యసభ వేదికపై అధికార పక్షానికి అంటకాగి వంత పాడిన పార్టీ ఏది? 4. విభజన బిల్లుకు అనుకూలంగా సంతకం చేసిన మీ అన్నను ఎందుకు ప్రశ్నించలేదు? 5. అవసరం లేకపోయినా... ‘నాకు భయం లేదు’ ‘నాకు భయం లేదు’ అని పదేపదే వల్లెవేస్తున్నారు. ఆ...... ఘటన తర్వాత మీకింకా భయం వీడలేదా? -
ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటా
‘సాక్షి’తో వైఎస్ విజయమ్మ కొన ఊపిరి దాకా విశాఖ ప్రజల పక్షమే ఇక్కడే, ప్రజల మధ్యే ఉంటా.. వైఎస్ కుటుంబానికి ముఖం చాటేసే చరిత్ర ఉందా? మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ అడుగుజాడలే ఆదర్శం అభిమానంతోనే ఓటు తీసుకుంటాం..బాబులా నోటు, మద్యంతో కాదు వైఎస్ కలలన్నింటినీ సాకారం చేస్తా..సంకల్పమే మా బలం ‘మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచినదాన్ని. నాలో కొనఊపిరి ఉన్నంత వరకూ నన్ను అభిమానిస్తున్న విశాఖ ప్రజల వెంటే ఉంటాను. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. దేశంలోనే మోడల్ నగరంగా విశాఖను తీర్చిదిద్ది చూపిస్తాను. విశ్వాసంతో ఓటేసే ప్రతి ఓటరుకూ నేనిస్తున్న హామీ ఇది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. కుట్రలు, కుయుక్తులతో మోసపోతున్న ఉత్తరాంధ్రకు అండగా నిలవడమే తన లక్ష్యమని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉప్పొంగుతున్న జనసంద్రంతో మమేకమవుతున్న విజయమ్మ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. వివరాలు... ‘‘నిజానికి రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాకసలు రాజకీయాలు తెలియవు. జనం కోసమే బతకాలన్న వైఎస్ ఆలోచనలకు విఘాతం కలుగుతుంటే అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేశాను. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల వారికి వైఎస్‌లా విశ్వాసం కలిగించే నాయకత్వం కావాలని జగన్ కోరారు. ఆ ప్రతిపాదనకు యావత్ విశాఖ జిల్లా ప్రజలూ మద్దతిచ్చారు. అంతేకాదు, విశాఖ అభివృద్ధి కోసం మహానేత ఎన్నో ఆలోచనలు చేశారు. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని తపించారు. ఆ ఆశయాలు నెరవేర్చేందుకు, అక్కడి ప్రజలకు అండగా ఉండేందుకే వచ్చాను. జగన్‌ను ఇబ్బందులు పాలు చేసినప్పుడు, తప్పుడు కేసులు బనాయించినప్పుడు పార్టీని భుజాలకెత్తుకున్నాను. రాజకీయాలు తెలియకుండానే జనం సమస్యలు తెలుసుకున్నా. వారి పక్షాన పోరాటాలు చేశాను. ఈ పోరాటాల నేపథ్యంలో విశాఖ జిల్లా ప్రజల సమస్యలు నన్ను కలిచివేశాయి. భద్రత లేని కార్మికుల కన్నీటి గాథలు తెలుసు. మురికివాడల్లో నివసిస్తున్న బడుగు జీవుల దుస్థితిని స్వయంగా చూశాను. వనరులుండీ అభివృద్ధికి నోచుకోని పాలకుల నిర్లక్ష్యం, అవకాశాలుండీ ఉపాధి లేని నిరుద్యోగుల వ్యథలన్నీ స్వయంగా చూశాను. వాళ్ల కన్నీటిని కొంతయినా తుడవాలనే కాంక్ష నాలో బలంగా ఉంది. వాళ్ల మధ్యే, వాళ్ల ప్రతినిధిగానే ఉంటేనే అది సాధ్యమని భావించాను. అది దుష్ర్పచారమే... ఎన్నికల తర్వాత నేను అందుబాటులో ఉండనన్నది దుష్ర్పచారం. ఓటమి భయంతో ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర. విశాఖ జనం అడుగడుగునా నన్ను ఆదరిస్తుంటే తట్టుకోలేని దుష్టశక్తులు పన్నిన కుయుక్తి. ఓటు తీసుకుని ముఖం చాటేసే చరిత్ర వైఎస్ కుటుంబంలో ఉందా? అదే నిజమైతే జగన్ ఇన్ని కష్టాలెందుకు పడేవాడు? కన్నీళ్లను కొంగుతో తుడుచుకుని మేం జనం మధ్యే ఎందుకు ఉండేవాళ్లం? ఇలాంటి ప్రచారం గతంలోనూ చేశారు. నేను పులివెందులకు ప్రాతినిధ్యం వహించాను. ఐదేళ్లలో ఏ ఒక్కరి నుంచైనా ఎలాంటి ఫిర్యాదులైనా వచ్చాయా? ఆ నియోజకవర్గంలో ఏ ఊరికైనా వెళ్లి అడగండి. ఏ వ్యక్తినైనా కనుక్కోండి. వాళ్లకు అండగా నిలబడ్డాను. ఏ చిన్న సమస్య వచ్చినా వెళ్లాను. ఎలాంటి అన్యాయం జరిగినా పోరాడాను. వైఎస్ ఆశయ సాధన కోసం అనుక్షణం కష్టపడ్డాను. మా ప్రభుత్వం లేకున్నా, పులివెందుల ప్రజలకు అవసరమైనవన్నీ తీర్చేందుకు శాయశక్తులా కృషి చేశాను. విశాఖలోనే ఉంటా... విశాఖ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విజయమ్మను నేరుగా కలవచ్చు. ఇక్కడే కార్యాలయం ఉంటుంది. ఏ అవసరమొచ్చినా చెప్పొచ్చు. అది వెంటనే నా దగ్గరకు వస్తుంది. అంతేకాదు, నెలకు కనీసం రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటిస్తాను. ఇప్పటికే అనేక సమస్యలు గుర్తించాను. వైఎస్ ప్రతిపాదించిన పథకాలు కార్యరూపం దాల్చేందుకు ప్రణాళిక రూపొందించాను. ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఈ కుటుంబం జనం కోసం బతుకుతోంది. ఆ మహానేత జనం మధ్యే తిరిగారు. జగన్ కూడా అంతే. షర్మిల సైతం అనుక్షణం ప్రజల సమస్యలపైనే పోరాటం చేసింది. ఢిల్లీలో కూర్చుని ఐదేళ్లకోసారి వచ్చే అలవాటు లేనేలేదు. అభిమానంతో ఓట్లు తీసుకుంటాం తప్ప మద్యం సీసాలతోనో, కరెన్సీ కట్టలతోనూ చంద్రబాబులా చేయనే చేయం. మోడీ, బాబులను చూసి మోసపోరు మోడీని చూసో, చంద్రబాబు జిమ్మిక్కులు చూసో మోసపోయే అమాయకులు కాదు విశాఖ ప్రజలు. అదే నిజమైతే నన్నింతగా ఆదరించేవాళ్లే కాదు. పట్టణ ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. వాళ్లు నాకు ఓటేస్తున్నారని నేననుకోను. వైఎస్ అభివృద్ధికి ఓటేస్తున్నారు. వైఎస్ తరహా నమ్మకం మళ్లీ జగన్ ద్వారా సాధ్యమని భావిస్తున్నారు. ఆ నమ్మకం ముందు మోడీలు, బాబు ఏమాత్రం ప్రభావం చూపలేరు. పల్లెపల్లెనా వైఎస్సే ఉత్తరాంధ్రలో ప్రతి మండలాన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడచూసినా జనం గుండెల్లో వైఎస్ గూడుకట్టుకున్నారు. ఏ పల్లెకు వెళ్లినా ‘అమ్మా... ఆ మహా నేత పెన్షన్ ఇచ్చాడు. ఆరోగ్యశ్రీతో ప్రాణం కాపాడాడు. నా అప్పులు మాఫీ చేయించాడు. మిమ్మల్ని చూస్తుంటే ఆయనే మా దగ్గరకు వచ్చినట్టు ఉంది’ అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని ఇంతగా ఆరాదిస్తున్నారు. వాళ్లు నిర్ణయించుకున్నారు. వైఎస్‌కు కృతజ్ఞతలు చూపాలనుకుంటున్నారు. ఓటు రూపంలో రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఈ నమ్మకాన్ని చూశాక నాకు అన్పిస్తుంది ఒక్కటే... ఇక్కడ ఓటడిగే హక్కు కేవలం వైఎస్సార్సీపీకే ఉంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం మా పార్టీపైనే ఉంది. అన్నివిధాలా అభివృద్ధి చేస్తా విశాఖకే కాదు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకూ నేను ప్రతినిధిని. బీడు పడ్డ భూములకు నీళ్లివ్వాలని ఉంది. ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఉంది. నీటి కోసం అలమటించే జనానికి రక్షిత మంచినీరు ఇవ్వాలని ఉంది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలనుంది. స్టీల్ ప్లాంట్‌ను విస్తరించాలని ఉంది. విశాఖలో రిఫైనరీ యూనిట్ పెట్టే ఆలోచన ఉంది. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, క్యాన్సర్ ఆసుపత్రి, మెట్రోరైలు ప్రాజెక్టు తేవాలని ఉంది. విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలన్న వైఎస్ ఆలోచనను నిజం చేస్త్తా. నగరంలోని వం దల కొద్దీ మురికివాడల్లో ఉన్న ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తా. స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాం దృఢమైన సంకల్పం ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉంటుంది. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే అసాధ్యమన్నది దరిదాపుల్లోకే రాదు. మాకందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నేర్పిన పాఠమిది. ఆ విశ్వాసంతోనే ఆయన బతికారు. అప్పులపాలైన ఈ రాష్ట్రంలో కుప్పల కొద్దీ పంటలు ఎలా ఉండాయి. పడి లేచే రాష్ట్ర బడ్జెట్‌ను లక్ష కోట్లకు వైఎస్ ఎలా తీసుకెళ్లారు? నెర్రెలుబారిన భూములకు నీళ్లెలా ఇచ్చారు. సాధ్యమే! జనం కోసం ఏదైనా సాధ్యమే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రావాలన్నది జనం ఆకాంక్ష. అది నిజమైన రోజు ప్రజల ఆశలూ, ఆకాంక్షలు ఎంతమాత్రం భారం కాబోవు. ఆర్థిక వనరులను పెంచే విధానాలున్నాయి. జనం మెచ్చేలా పాలించే సత్తా వైఎస్సార్సీపీకి ఉంది. దేవుడి ఆశీర్వాదం మాకెప్పుడూ ఉంటుంది. ప్రకృతీ సహకరిస్తుంది. అందుకే వైఎస్ కాలంలో ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారు. జగన్‌పై నమ్మకంతో ఓటేస్తారు నేను, జగన్, షర్మిల ఇంతవరకూ పెద్దగా ఏమీ చేయలేదనే అనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఏం చేసినా మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే సాధ్యమైంది. సంక్షేమం ఆగిపోతే పేదవాడి బతుకే కష్టమవుతుంది. ఆయన తర్వాత అలాంటి పరిస్థితులొచ్చాయి! దానిపైనే మేం పోరాడాం. అందుకే జనం మాకు మద్దతిస్తున్నారు. ఆయన సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. జగన్ మాత్రమే వైఎస్ ఆశయాలు నెరవేరుస్తాడని భావిస్తున్నారు. అందుకే మాకు పట్టం కట్టబోతున్నారు. వైఎస్‌పై కృతజ్ఞతతో, జగన్‌పై నమ్మకంతో ఓటేస్తారనేది మా విశ్వాసం. వారికి ఓటమి భయం... ఓటమి భయంతో ప్రత్యర్థులు ఏం చేసినా, ఏమేం పంచినా ఫలితముండదు. మహా నేత కుటుంబానికి అండగా నిలబడాలన్న విశాఖ ఓటరు నిర్ణయాన్ని ఏ శక్తులూ మార్చలేవు. బాబు హయాంలో అనుభవించిన కష్టాలను, వైఎస్ కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పూసగుచ్చినట్టు చెబుతున్నారు. వారి మనోబలాన్ని డబ్బులతో, మద్యం సీసాలతో కొనడం ఎవరివల్లా కాదు’’ -
ఇప్పుడు మీ అన్న పంచెలూడదీసి కొడతావా?
పవన్‌కు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఆదిశేషగిరిరావు సూటిప్రశ్న 1. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పంచలూడదీసి కొట్టాలన్న మాటలు మరిచావా? 2. పవన్ ఓ పర్వెర్టెడ్ ఫెలో.. బాలకృష్ణ మెంటల్ కేస్.. చిరంజీవి అవకాశవాది.. 3. వీరి వల్ల సినీకళాకారుల పరువు గంగలో కలిసిపోయింది కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి కొట్టాలని గత ఎన్నికల్లో ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్... ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ప్రచారసారథిగా ఉన్న తన అన్నయ్య చిరంజీవికి అదే బుద్ధి చెబుతాడా అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూటిగా ప్రశ్నించారు. ‘పవన్ నువ్వు ముందు నీ అన్న పంచెలూడదీసి కొట్టు... ఆ తర్వాత జనంలోకి వచ్చి మాట్లాడు...’ అని సూచించారు. ఆదిశేషగిరిరావు గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. సినీనటుల పరువు గంగలో కలిపారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీనటులకు ప్రత్యేక గౌరవం ఉండేది. వారు ఎన్నికల్లో ఓడినా, గెలిచినా హుందాతనంగా ఉండేవారు. కానీ అసమర్థుడు, అవకాశవాది చిరంజీవి రాజకీయ ప్రవేశంతో మొదలైన పతనం.. ఇప్పుడు పర్వెర్టెడ్ ఫెలో పవన్‌కల్యాణ్, మెంటల్ కేస్ నందమూరి బాలకృష్ణ పిచ్చి ప్రేలాపనలతో రాజకీయాల్లో సినీనటుల పరువు గంగలో కలసిపోయింది. ఎన్నికలొస్తే చాలు తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రచారం చేస్తుంటుంది.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో పాటు పవన్ కల్యాణ్ లాంటి వారితో ప్యాకేజీలు మాట్లాడుకుని ప్రచారం చేస్తోంది. పవన్, బాలకృష్ణ కనీస విలువలు కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు వాగుతూ సినీ కళాకారుల పరువు తీస్తున్నారు. రాజకీయాల్లో చిరంజీవి, పవన్ ఐరన్లెగ్గులు. వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలు నాశనం కావడం ఖాయం. చిరంజీవి చేరికతో చూస్తుండగానే కాంగ్రెస్ పని అయిపోయింది. రేపు పవన్ ఎఫెక్ట్‌తో టీడీపీ, బీజేపీలకు అదే గతి పడుతుంది. చిరంజీవి సోనియా కాళ్ల వద్ద, పవన్ మోడీకి సాగిలపడి... ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో అని కూడా లేకుండా నటుల స్థాయిని దిగజార్చారు. సొంతూరులో గెలిచే దమ్ము లేదా బాలకృష్ణ? 30 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉంటూ ఇన్నాళ్లకు ఎన్నికల బరిలో దిగిన బాలకృష్ణకు సొంతజిల్లా కృష్ణాలో పోటీచేసే దమ్ములేదా? మీ నాన్న పుట్టినూరు.. సొంత నియోజకవర్గం గుడివాడ ఉంచుకుని హిందూపురంలో పోటీచేయడం ఏంటి? సొంతూరులోనే గెలిచే సీన్ లేని నీకు రాజకీయాలు, వైఎస్ జగన్‌పై అర్థం లేని విమర్శలు అవసరమా? సినీ డైలాగుల మాదిరిగా ప్రసంగాలు చేస్తున్న బాలకృష్ణ ఆవేశం.. మీ నాన్న ఎన్టీఆర్‌పై చెప్పులేయించినప్పుడు ఏమైంది? తండ్రి స్థాపించిన పార్టీని ముందుండి నడింపించాల్సిన నీవు బావ చేతికి పగ్గాలిచ్చి ఒక్క ఎమ్మెల్యే సీటును గెలిచేందుకు ఇంటిల్లిపాదిని అక్కడ తిప్పుతూ నానా కష్టాలు పడుతున్నావ్.. అటువంటి నీకు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత ఉందా? మోడీ గుజరాత్ సీఎంగా ఆంధ్రాను దోచేశాడు.. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మన గోదావరి జిల్లాల్లో ఉన్న సహజవాయువును అక్కడికి పైప్లైన్ల ద్వారా తరలించడం మొదలైంది. ఈ రిలయన్స్ ప్రాజెక్టు వెనుక మోడీ ఉన్నాడనేది అందరికీ తెలిసిన సత్యమే. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగాయి. గ్యాస్‌పై మన ప్రాంతానికి హక్కు లేకుండా చేసిన కుట్రలపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో కూడా పోరాటం చేశారు. మళ్లీ బాబు, మోడీ కలిసి ఈసారి ఆంధ్రాను మొత్తం దోచేసేందుకు ఆరాటపడిపోతున్నారు. వీరిద్దరి విషయంలో సీమాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాబుకు సిగ్గెట్టాలేదో... తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసి రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కి నెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడు. ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు మోడీని కీర్తిస్తున్నాడు. చివరికి పవన్‌కల్యాణ్ ఇంటికి కూడా వెళ్లాడు. అసలు బాబుకు సిగ్గెట్టాలేదో? బాబు హయాంలో సీమాంధ్రలో ఒక్కటంటే ఒక్క ప్రాంతమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్టు వచ్చిందా? అసలు ఏం చూసి బాబును జనం నమ్మాలి? సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న బాబు ఎన్నికలయ్యాక ప్రజలిచ్చే షాక్‌లు చూసి సింగపూర్ వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దేసుకోవాలి. జగన్ వెంటే సీమాంధ్ర ప్రజ.. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే సీమాంధ్ర ప్రజలు ఉన్నారు. ఒక్క జగన్ కోసం చంద్రబాబు, మోడీ, పవన్‌కల్యాణ్ వంటి దుష్టశక్తులు ఏకమైనా జనశక్తి ముందు నిలవలేరు. వాళ్లకు దారుణ పరాభవం తప్పదు. ప్రజలు కూడా ఒక్కడి కోసం ఇంతమంది దిగజారి రాజకీయాలు చేస్తుండటాన్ని ఏవగించుకుంటున్నారు. అందుకే జగన్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను హైదరాబాద్‌లో కూర్చుని ఈ మాట చెప్పడం లేదు. శ్రీకాకుళం వంటి మారుమూల జిల్లాల్లో కూడా తిరిగి ప్రజల నాడి తెలుసుకునే ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నా. మా అన్న సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యాన్స్ మొత్తం జగన్ వెంటే ఉన్నారు. కేంద్రంలో రాబోయేది థర్ట్‌ఫ్రంట్ కేంద్రంలో అందరూ అనుకున్నట్టు మోడీనో, కాంగ్రెస్సో రాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకశక్తిగా ఉండే థర్ట్‌ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. -
ఎవరు తవ్వించిన గుంతలో వారే..
తెలుగుదేశంలో ఓ గురువుగారు ప్రజలకు పంచతంత్రంలో లేని వింతకథ చెప్పసాగారు. అనగనగా ఒక నక్క. అప్పట్లో అది ఓ పులి నుంచి దాని తోలును తస్కరించి, తాను కప్పుకుంది. తానే పులినంటూ నమ్మించి తొమ్మిదేళ్లు పరిపాలించింది. కానీ.. దాని తోలు దాని సొంతం కాదనీ, మామ వరసగా పిలిచే ఒక పులి నుంచి దొంగిలించిందని మిగతా జంతువులు గ్రహించాయి. అది పులితోలు కప్పుకున్న డూప్లికేటు అని తెలుసుకున్న జంతువులు దాని అసలు తోలును వలిచే ప్రోగ్రామ్ పెట్టుకున్నాయి. నక్క మిగతా జంతువుల లీడర్లను కూడగట్టుకుని ఒక మహాకూటమి అనేదాన్ని ఏర్పరచుకుని తన తోలును రక్షించుకునే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో ఓ తాటి చెట్టుకింద నిలబడి కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకుంటుండగా... ఓటమి అనే తాటిపండు ఆ మూలిగే నక్క మీద పడింది. ఆ దెబ్బకు దాని పులితోలు కాస్త చెదిరి పోవడంతో... దాని నిజస్వరూపమెరిగిన ఆ మహాకూటమిలోని జంతునేతలు మళ్లీ దానికి శత్రువులైపోయాయి. నక్క ఎప్పుడూ గోతి కాడ నక్కుతుందనే విషయం తెలిసిందే కదా. ఢిల్లీ నేతలనే క్రూరమృగాలు కొన్ని ఒకచోట రెండు గుంటలు తవ్వడానికి సిద్ధపడ్డాయి. నక్క ఇలా ఆలోచించింది. ‘నక్క అంటేనే గుంట దగ్గర నక్కాలి. అందుకే దాన్ని గుంటనక్క అంటారు. అలాంటప్పుడు ఎన్ని ఎక్కువ గుంటలుంటే నక్కలకు అంత లాభం కదా’ అని అనుకుంది. అందుకే గుంటను తవ్వడానికి యథావిధిగా ఢిల్లీ తవ్వకాల బ్యాచీకి సహకరించింది. మిగతా జంతువులన్నీ ఏదో ఒక గోతి దగ్గర తచ్చాడుతుంటే... అది ఏకకాలంలో రెండు గోతుల దగ్గర తచ్చాడుతుండేది. ఈలోపు రెండు గుంటల తవ్వకం దాదాపు పూర్తయ్యింది. తాను స్వతహాగా నక్క కావడంతో తనకు వేటాడటం రాదని దానికి బాగా తెలుసు. కానీ తాను నక్కనన్న విషయం అది ఒప్పుకోదు కదా. అందుకే సింహం వేషంలో ఉన్న మరో మృగం (ఇది గుజరాత్‌కు చెందినది కాబట్టి ‘గిర్’ సింహాన్నంటూ చెప్పుకునేది.) దగ్గరకు వెళ్లి ‘‘అప్పట్లో నేను తెగవేటాడేదాన్ని. మీరు గోధ్రా లాంటి చోట సాగించిన వేట గురించి అడవంతా చెప్పుకుంటుంటే విన్నాను. బషీర్బాగ్లాంటి చోట్ల నేనూ శక్తికొద్దీ వేట సాగించా’’ అంటూ నక్క వినయాలు పోయింది. ‘‘ఇప్పుడూ వేటడగలనుగానీ... ఎలాగూ తమరు ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి మీరూ, నేనూ ఒక జట్టుగా వేటాడితే... అడవి దద్దరిల్లాల్సిందే. మీరెలాగూ సింహం కాబట్టి సింహభాగమే మీరు తీసుకోండి. నేనెలాగూ పులిని కాబట్టి పులివాటా తీసుకుంటా’’ అంది. సింహం జట్టులోని కొన్ని జీవాలు.. అది నక్క మాత్రమేననీ, దానితో జట్టుకట్టవద్దనీ చెప్పాయి. అయినా తాను కప్పుకున్న తోలు ప్రదర్శించీ, తాను తస్కరించిన గోళ్లు చూపించీ... ఎవరెవరితోనో ఒత్తిడి తెప్పించి మరీ తాను పులినే అని అందరితోనూ నమ్మబలికించింది. పులీ, సింహాలు సాగించే వేట తరహాలోనే తమ వేట సాగుతుందని సింహం గుంపులోని మరికొందరు ఎదురుచూసేవారు. కానీ పులితోలు కప్పుకున్న ఈ నక్క మాత్రం ఎప్పుడు ఎక్కడ గుంట కనిపిస్తే అక్కడ నక్కుతుండటం చూసి గగ్గోలు పెడుతూ ఉండేవి. అయినా మృగాల పెద్దలు మిగతా వాటికి సర్దిచెబుతూ ఉండేవి. ఈలోపు వేషాలేసే ఒక కాకి తన బలాన్ని అధికంగా అంచనా వేసుకుని, జనాకర్షణ అనే ఒక మాంసం ముక్కను నోట కరచుకుని రెండు గుంటల మధ్యనున్న చెట్టు మీద సేవ అనే మంత్రం పఠిస్తూ కూర్చుని ఉంది. ఎలాగైనా ఆ మాంసపు ముక్కను చేజిక్కించుకుందామని చూసిన నక్క... కాసేపు తన ఒంటి మీద ఉన్న పులి చర్మాన్ని సర్దుకుంటూ తన నక్కజిత్తులు ప్రదర్శిస్తూ చెట్టు కిందికి వెళ్లి.. ‘‘ కాకి బావా... కాకిబావా... నీ గొంతు ఎంత మధురమో కదా... సింహాలనే నువ్వు పొగుడుతున్నావు. నీ తియ్యని గొంతుతో ఒకసారి నన్ను కూడా పొగడవా’’ అని అడిగింది. పులులు ఇలా దేబిరించవు కదా.. అని అన్ని జంతువులూ సందేహపడ్డాయి.ఇప్పటివరకూ చెప్పిన కథ ఆపి గురువుగారు ప్రజలను ‘‘నాయనలారా... ఇప్పుడేం జరుగుతుందని మీ ఊహ. దీన్ని సరిగా విశ్లేషించగలిగితే సమకాలీన రాజకీయాలపై అవగాహన వచ్చినట్టే ’’ అన్నారు. అప్పుడు ప్రజలిలా అన్నారు.. ‘‘గతంలో దాని మీద ఓటమి అనే తాటిపండు పడ్డా మూలిగి మళ్లీ లేచింది. అయితే ఈసారి నక్క సరిగ్గా రెండు గుంటల మధ్యన ఉంది. కాబట్టి పైనున్న కాకి పాడగానే అది మాంసపు ముక్కను అందుకుందామని అటో ఇటో దూకడం ఖాయం. ఏదో ఒక గుంటలో పడటం ఖాయం. ఎవరు తవ్విన గుంటలో వారే పడటం అన్నది పాత మాట. కానీ ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కొత్త సూక్తిని అనుసరించి ఎవరు తవ్వించిన గుంటలో వారే పడాలి అనే సిద్ధాంతాన్ని అనుసరించి గుంటలో పడుతుంది. మరోమారు మూలిగే దానిపైనా ‘ఓటమి’ తాటికాయా పడుతుంది. ఇదీ జరగబోయే చరిత్ర’’ అన్నారు ప్రజలు. గురువుగారు సంతృప్తిగా తలూపి.. తధాస్తు అని ఆశీర్వదించారు. - షేక్ యాసీన్ -
బాబు..తేనెపూసిన కత్తి
తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను దుర్మార్గుడు.. మేకవన్నె పులి గాడ్సేనే మించిన వాడు అభినవ ఔరంగజేబు.. మిడత..! మూర్తీభవించిన పదవీ కాంక్ష ప్రజాస్వామ్య హంతకుడు.. కుట్రకు కొలువు గూడుపుఠాణీకి గురువు.. మోసానికి మూలస్తంభం గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు.. గొడ్డు కన్నా హీనం చీమల పుట్టలో పాములా చేరిన వాడు తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజా న్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయమేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. ఇవన్నీ గిట్టని వారి మాటలు కావు. ఎన్నికల వేళ ఎవరి పేరు చెప్పుకుంటూ చంద్రబాబు ఊరూరా ఓట్లడుక్కుంటున్నారో, ఆ అన్నగారే స్వయానా అన్నమాటలు! దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. బాబు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుద రాజాలు. అల్లుడని నమ్మిన వాని చేతిలోనే అడ్డంగా నయవంచనకు, వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు! పిల్లనిచ్చిన మామనే ఇంతగా క్షోభ పెట్టి, ఆయనతో ఇన్ని రకాలుగా తన కీర్తిగానం చేయించుకున్న పుణ్య చరితుడు నారా బాబు. వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోయిన అనంతరం బాబును దునుమాడుతూ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే చదవండి... బాబు ఒక చిన్న మిడత 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడుపుఠాణీ ఆరంభించారు. దీనికిగురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించి, చేరదీస్తున్న గ్రూపుల గురించి పట్టిం చుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందని, అతడి వల్ల ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందని, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందని, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని నేనూహించలేకపోయాను. నా మీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధాభక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్దమనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది!! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చెలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది!!! పేరు చెప్పేందుకూ అనర్హుడే ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తనకంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండేవాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరేవారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం కూడా నాకిష్టం లేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అందరికీ 5 లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్నికల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్డ్ ట్రెచెరీ! మరో ఔరంగజేబు చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లున్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దురదృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజాస్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లినప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగుజాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? గాడ్సేను మించినవాడు ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం? బాబును చరిత్ర క్షమించదు అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడిగట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు. మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవాల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మహక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికితనంతో దాన్ని మరో రకంగా ఉపయోగించకండి.... ఇది ‘అన్న’ మాట. -
మాట మీద నిలబడే నాయకుడు కావాలి
సీమాంధ్ర ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఎదగాలి. నాలుగేళ్లుగా తెలుగు నేల అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమలంతా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. సీమాంధ్రలో జరగాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. యువ నాయకత్వంతోనే మంచి రోజులొస్తాయని పారిశ్రామికవేత్తలంతా కోరుకుంటున్నారు. మాట మీద నిలబడే వ్యక్తితోనే అభివృద్ధి సాధ్యపడుతుందని అంటున్నారు హోలీమేరీ, నలంద విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి, సప్ల ఆర్గానిక్స్ డెరైక్టర్ ఆరిమంద యామినీరెడ్డి. ఆమె మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె) సీమాంధ్ర శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కోవె ద్వారా మహిళలను పరిశ్రమల వైపు ప్రోత్సహిస్తున్నారు. పారిశ్రామికవేత్తలంతా యువ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని యామినీరెడ్డి చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. వైఎస్‌తో మంచి రోజులు వచ్చాయి.. 2004కు ముందు రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య అతిస్వల్పం. వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాకే మంచి రోజులు వచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించారు. మహిళలు పరిశ్రమలు స్థాపించేందుకు స్థలాలు కేటాయించారు. పరిశ్రమల స్థాపనకు ఇప్పుడు ఎందరో సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరం పెరుగుతుంది. 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిబ్బరంగా ఉన్నారు. ఆ పాలన మళ్లీ రావాలి.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్ బాటలు పరిచారు. ఉన్నత విద్యను సామాన్యుడి గుమ్మం ముందు నిలిపారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. అయితే కళాశాలలకు మాత్రం నాలుగేళ్లుగా నిధులు ఆలస్యంగా వస్తున్నాయి. వైఎస్ పాలన మళ్లీ వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు మాఫీ అయితే వారికి పెద్ద ఊరటే. జగన్‌తోనే సాగు-బాగు సీమాంధ్రలో వ్యవసాయం ఎక్కువ. ఈ రంగాన్ని అర్థం చేసుకున్న నాయకుడే వ్యవసాయాధార పరిశ్రమలను ప్రోత్సహించగలడు. ఐటీ రంగం అంటూ బాబు వ్యవసాయాన్ని విస్మరించారు. వ్యవసాయానికి వైఎస్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన వారసుడిగా జగన్ నాయకత్వంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయం. రెండు జిల్లాలకో వ్యవసాయ కళాశాల, ప్రాసెసింగ్ పరిశ్రమలు, అన్ని జిల్లాల్లో శీతల గిడ్డంగులు, రూ.3,000 కోట్ల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ఏటా ప్రత్యేక నిధి ఏర్పాటు హామీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. సామాన్యులకు రాజకీయాలు తెలియవు. వారికి కావాల్సిందల్లా కష్టసుఖాలను అర్థం చేసుకునే నాయకుడు. అండగా ఉంటాడన్న భరోసా వారు కోరుకుంటున్నారు. వైఎస్ అంటేనే 108, ఆరోగ్యశ్రీ. ఈ రెండూ పక్కాగా అమలవ్వాలని ప్రతి ఒక్కరి అభిలాష. మలి వయసులో అన్నం కోసం ఎవరూ చేయి చాచనక్కరలేదని జగన్ హామీ ఇస్తున్నారు. అవ్వా తాతలకు నెలకు రూ.700 పింఛను, వృద్ధాశ్రమాల స్థాపన హామీ ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. -
కల సాకారం కావాలి
ప్రకాశం జిల్లా: వైఎస్ హయాంలో జలసిరులు-ఆయన మరణంతో నిలిచిన నిర్మాణాలు చంద్రబాబు హయాంలో చతికిలపడిన ప్రకాశం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వైఎస్ ఊతమిచ్చారు. అధికారంలోకి రాగానే వాటి నిర్మాణానికి నిధులు కేటాయించి రైతుల్లో ఆశలు చిగురింపజేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిచేసి 30వేల ఎకరాలకు సాగునీరందించిన అపర భగీరథుడాయన. వైఎస్ మరణానంతరం ఆయన ఆశ, ఆశయం నీరుగారిపోయాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి. బాబు హయాంలో.. - చంద్రబాబు హయాంలో జిల్లాలో దాదాపు 36 మండలాలు కరవుతో అల్లాడిపోయేవి. ఏటా భూగర్భ జలమట్టం 1,000 అడుగుల లోతుకు వెళ్లేది. దాదాపు 2 వేల మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఏటా 20 గ్రామాల్లో పూర్తిగా, మరో 50 గ్రామాల్లో పాక్షికంగా వలసలు ఉండేవి. - ఖరీఫ్, రబీ కలిపి కూడా జిల్లాలో 30 శాతం వ్యవసాయం జరగడం గొప్ప. నీళ్లులేక బీళ్లు పడిన భూములను అమ్ముకుందామన్నా కొనే దిక్కులేదు. చాలామంది రైతులు ఎకరం రూ.30 వేలలోపు కూడా తెగనమ్ముకున్న సందర్భాలున్నాయి. - వ్యవసాయం దండగ అని చంద్రబాబే స్వయంగా చెప్పడంతో రైతులు మనోధైర్యం కోల్పోయారు. పశు సంపద కబేళాలకు వెళ్లింది. పశుగ్రాసం లేకపోవడంతో మూగజీవాలు రోదించాయి. - పాజెక్టుల నిర్మాణం దిశగా రైతు సంఘాలు అనేక విజ్ఞప్తులు చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ హయాంలో... హా వైఎస్ పాలనలో ప్రకాశం జిల్లా జలకళ సంతరించుకుంది. గుండ్లకమ్మ గలగలా పారింది. మెట్ట భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి. 2009 లోనే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు వైఎస్. ఇప్పుడు 30వేల ఎకరాల్లో రెండు పంటలు పండుతున్నాయి. పనులు మొత్తం పూర్తయి ఉంటే ఖరీఫ్‌లో 62,368, రబీలో 80,060 ఎకరాలకు నీరందేది. 43 గ్రామాల్లోని 2.56 లక్షల మందికి తాగునీరు అందేది. - వెలిగొండ ప్రాజెక్టుపై వైఎస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కృష్ణా మిగులు జలాల ఆధారంగా నల్లమల కొండల్లో దీని నిర్మాణానికి పూనుకున్నారు. తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, ఈస్టర్న్ కెనాల్ కింద 3,70,800 ఎకరాలు సాగులోనికి తీసుకురావాలన్నది లక్ష్యం. - గుండ్లబ్రహ్మేశ్వరం రిజర్వాయర్ కింద ఉన్న 3,500 ఎకరాలు, రాళ్లవాగు రిజర్వాయర్ కింద ఉన్న 1,500 ఎకరాలతో పాటు ప్రకాశం , నెల్లూరు, కడప జిల్లాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. వైఎస్ తర్వాత.. - మూడు దశల్లో జరగాల్సిన గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను ైవైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అడ్డుకున్నాయి. రూ.592.18 కోట్లు అంచనాలుంటే, ఇప్పటికి 247.37 కోట్లే ఖర్చు చేశారు. - 60.31 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటే, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ. 69.42కోట్లు మాత్రమే వ్యయం చేశారు. - 2013-14లో ఈ ప్యాకేజీ కింద రూ.29 కోట్లు కేటాయించినా.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. - మొత్తం 7 ప్యాకేజీలుగా వెలిగొండ పనులు పూర్తిచేయాలని నిర్ణయించినా ఒక్కటీ ముందుకు సాగడం లేదు - ఒకటో టన్నెల్ కింద ఇంకా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. - సుంకేసుల డ్యాం పరిధిలో తీగలేరు ఫీడరు కెనాల్ ఇప్పటికీ పూర్తికాలేదు. గుర్తించిన భూమిలో ఇంకా 9,483 ఎకరాలను సేకరించాల్సి ఉంది. వైఎస్ ఉంటే ఆగేవా? జిల్లాలో వెనుకబడిన ప్రాంతాన్ని కరువు కోరల నుంచి కాపాడేందుకు వెలిగొండ పనులను ప్రారంభించారు వైఎస్. ఆయన ఉన్నంత వరకు పనులు త్వరగా జరిగాయి. తరువాత వచ్చిన సీఎంలు ఎవరూ పట్టించుకోలేదు. - గంజి శంకరరెడ్డి, రైతు మా త్యాగానికి విలువ లేదా? వెలిగొండ కోసం మా భూములనే త్యాగం చేశాం. వైఎస్‌పై నమ్మకంతో భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్నాం. ఈ ప్రాంతం పచ్చగా అవుతుందనుకున్నాం. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు. - తుమ్మా వెంకటరెడ్డి -
ఇదీ చరిత్ర: ప్రగతి పరిశీలన
నంద్యాల లోక్‌సభ స్థానం 1952లో ఏర్పడింది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శేషగిరిరావు విజయుం సాధించారు. ఆ తర్వాత ఈ స్థానం ఒకసారి ఆదోని, వురోసారి మార్కాపురం నియోజకవర్గాల్లో అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. 1967లో తిరిగి నంద్యాల నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికలతో పాటు 1971, 19-0లోనూ పెండేకంటి వెంకటసుబ్బయ్యు (కాంగ్రెస్) ఎన్నికయ్యూరు. ఈయున కేంద్రంలో మంత్రి పదవులను నిర్వహించారు. గవర్నర్‌గానూ పనిచేశారు. 1977 ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గానూ పని చేశారు. తర్వాత కొంతకాలానికే రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. పెండేకంటి గెలుపొందారు. 19-4లో ఈ స్థానాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వుద్దూరు సుబ్బారెడ్డి గెలుపొం దారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బొజ్జా వెంకటరెడ్డి (19-9), గంగుల ప్రతాపరెడ్డి(1991) ఎంపీలుగా పనిచేశారు. ప్రతాపరెడ్డి ఎన్నికైన కొంతకాలానికే పదవికి రాజీనావూ చేసి..అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుకు అవకాశమిచ్చారు. పీవీ 1991-1996 వుధ్య ప్రాతినిధ్యం వహించారు. 1996 ఎన్నికల్లో ఆయన నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపురం నుంచి గెలుపొందారు. నంద్యాల కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 199-, 1999లోనూ ఇక్కడి నుంచి గెలిచారు. గత రెండు పర్యాయూలూ ఎస్పీవై రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. సమాధి రాళ్లు - చంద్రబాబు హయూంలో నంద్యాల పట్టణంలోని పేదలు ఇళ్లస్థలాలు లేక ఇబ్బందిపడ్డారు. - రెండు కార్లకు సాగునీరు అందక నియోజకవర్గ రైతులు నష్టపోయూరు. - వరదలు వచ్చి నంద్యాల పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోరుునా చంద్రబాబు పట్టించుకోలేదు. - విజయా, నంది డెయిరీల నుంచి నంద్యాల పట్టణంలోకి బైపాస్ రోడ్లు లేక రాకపోకలకు కష్టంగా ఉండేది. వీటిపై బాబు ఏనాడూ దృష్టి పెట్టలేదు. - చంద్రబాబు హయూంలో నంద్యాల చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారు. ఆ సమయంలో ఎంపీగా ఉన్న భూమా నాగిరెడ్డి అభ్యంతరం తెలిపినా బాబు వినలేదు. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని కేవలం రూ.6.50 కోట్లకు విక్రయించారు. అభివృద్ధికి ఆనవాళ్లు - వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో వరద రక్షణ చర్యల కోసం రూ.100 కోట్లు వుంజూరు చేశారు. - నంద్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.75 కోట్లను మంజూరు చేశారు. - నంద్యాల పట్టణంలో ఏడు వేల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా పక్కాగృహాలను కూడా మంజూరు చేశారు. - నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. - అవుకు రిజర్వాయర్ నుంచి 36 గ్రామాలకు తాగునీటి వసతి కల్పించారు. - డోన్‌కు రూ.53 కోట్లతో, ఆత్మకూరుకు రూ.14 కోట్లతో మంచినీటి పథకాలు వుంజూరు చేశారు. నంద్యాలలో రూ.10 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, రూ.2 కోట్లతో స్టేడియం నిర్మించారు. - శెలం అసెంబ్లీ సెగ్మెంట్లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి రూ.110 కోట్లు, నందికొట్కూరు నియోజకవర్గంలో వుల్యాల ఎత్తిపోతల పథకానికి రూ.3వేల కోట్లు వుుంజూరు చేశారు. శివాపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలనూ చేపట్టారు. -
నంద్యాలలో నెగ్గేదెవరు!
నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి జాతీయు స్థారుులో గుర్తింపు ఉంది. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహరావు లాంటి ఉద్దండులను పార్లమెంటుకు పంపిన చరిత్ర ఈ స్థానానిది. ప్రస్తుతం ఇక్కడ సార్వత్రిక ఎన్నికల పోరు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికైన ఎస్పీవై రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రైతు నేతగా గుర్తింపు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ఆయునకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయు విశ్లేషకులు భావిస్తున్నారు. మారంరెడ్డి జనార్దన్‌రెడ్డి - నంద్యాల: నంద్యాల లోక్‌సభ స్థానంలో సిటింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి(వైఎస్సార్ సీపీ)తో టీడీపీ తరఫున వూజీ వుంత్రి ఎన్ఎండీ ఫరూక్ తలపడుతున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా బీవై రామయ్య బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆయున చరిష్మా వల్లే 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. గత రెండు పర్యాయూలూ ఎస్పీవై రెడ్డి ప్రజల అభివూనాన్ని చూరగొన్నారు. సేవా కార్యక్రవూలు, పోరాటాలే అండ... సావూజిక సేవా కార్యక్రవూలు, పోరాటాల ద్వారా ఎస్పీవై రెడ్డి వుంచి పేరు సంపాదించారు. రైతు నాయుకుడిగా గుర్తింపు ఉంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో సాగు, తాగునీటి సవుస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ తదితర ప్రాజెక్టుల కింద సాగునీటి సమస్య తలెత్తినప్పుడు రైతుల తరఫున వుుందుండి పోరాడారు. కాలువల్లో నీటి పారకానికి అడ్డంకులు ఏర్పడినప్పుడు సొంత పొక్లరుున్లతో పూడిక తీరుుంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా 500 మినరల్ వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేరుుంచారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. వీటికితోడు వైఎస్‌పై ప్రజల్లో ఉన్న అభివూనం, జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ఆయునకు కలిసొస్తాయుని రాజకీయు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫరూక్‌కు కష్టాలు టీడీపీ గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. ఫరూక్ 2009లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయూరు. వాస్తవానికి ఆయునకు ఈసారి ఎంపీగా పోటీ చేయుడం ఇష్టం లేదని తెలుస్తోంది. టీడీపీకి సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో చంద్రబాబు బలవంతంగా బరిలోకి దించారు. ముస్లిం ఓట్లు సానుకూలం అవుతాయని టీడీపీ అంచనా వేస్తున్నా... వాస్తవ పరిస్థితి వూత్రం భిన్నంగా ఉంది. సొంత అసెంబ్లీ(నంద్యాల) సెగ్మెంట్లోనే ఆయునకు ఆ వర్గం ఓట్లు పడే సూచనలు కన్పించడం లేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. 2004లో అసెంబ్లీకి పోటీ చేయగా దాదాపు 50 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నంద్యాల సెగ్మెంట్ పరిధిలో ప్రత్యర్థి కంటే 35వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీపై వుుస్లిం మైనార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్... నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవూత్రవుూ బాగోలేదు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే.. రాష్ట్ర విభజన దెబ్బతో పూర్తిగా కుదేలైంది. ఆ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానికంగా మరో అభ్యర్థి దొరకకపోవడంతో పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్యను ఆ పార్టీ బరిలోకి దించింది. ఏ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారుు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎంపీ: శేషగిరిరావు (ఇండిపెండెంట్) ప్రస్తుత ఎంపీ: ఎస్పీవై రెడ్డి ప్రస్తుత రిజర్వేషన్: జనరల్ ప్రధాన అభ్యర్థులు వీరే ఎస్పీవెరైడ్డి, (వైఎస్సార్ సీపీ) ఎన్ఎండీ ఫరూక్, (టీడీపీ) బీవై రామయ్య (కాంగ్రెస్) అసెంబ్లీ సెగ్మెంట్లు.. బలాబలాలు ఆళ్లగడ్డ ప్రస్తుతం ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూవూ శోభా నాగిరెడ్డి దాదాపు 36 వేల ఓట్ల మెజార్టీతో విజయుం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆమె పోటీకి దిగారు. అరుుతే, దురదృష్టవశాత్తూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వురణించారు. ఆమె చనిపోయే నాటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియు పూర్తరుు..అభ్యర్థులకు గుర్తులు కూడా కేటారుుంచడంతో ఇక్కడ ఎన్నిక కొనసాగుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. శోభా నాగిరెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు పరిగణిస్తావుని పేర్కొంది. దీంతో శోభా నాగిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి...ఆమెకు ఘన నివాళి అర్పించాలని పార్టీ నాయుకులు, కార్యకర్తలు, అభివూనులు కృతనిశ్చయుంతో ఉన్నారు. ఇక టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యూరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డితో అంతర్గత విభేదాలు ఉన్నాయి. శ్రీశైలం టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి స్థానికేతరుడు కావడంతో ప్రజలు అంతగా మొగ్గు చూపడం లేదు. దీనికితోడు ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గమిది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి మంచి పేరు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు, జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ఆయనకు సానుకూలాంశాలు. డోన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన సావూజిక సేవా కార్యక్రవూల్లో వుుందుంటారు. రూ.50 లక్షల సొంత డబ్బుతో డోన్ బాలికల పాఠశాలలో భవనాలను నిర్మించారు. ప్యాపిలిలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. టీడీపీ తరఫున కేఈ ప్రతాప్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన సోదరులు కేఈ ప్రభాకర్, కృష్ణమూర్తిలకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్గముంది. అయితే, ప్రతాప్‌కు ప్రజల్లో అంత పలుకుబడి లేకపోవడం ప్రతికూలాంశం. నందికొట్కూరు ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన తాజా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు తెలుగు తవుు్మళ్లు సహకరించడం లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఐజయ్య పోటీ చేస్తున్నారు. ఈయున ప్రజల్లోకి చురుగ్గా వెళుతున్నారు. పాణ్యం టీడీపీలోని అంతర్గత పోరు వైఎస్సార్ సీపీకి లాభించే అవకాశవుుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ కేజే రెడ్డిని కాదని చివరి నిమిషంలో పార్టీలోకి చేరిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని టీడీపీ ఎన్నికల బరిలోకి దింపింది. దీంతో కేజే రెడ్డి వర్గం అంటీవుుట్టనట్లు ఉంటోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమెకు మహిళల్లో మంచి పలుకుబడి ఉంది. భర్త గౌరు వెంకటరెడ్డి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చరితారెడ్డికి లాభిస్తుందని రాజకీయు విశ్లేషకులు భావిస్తున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయున 2009లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సారి కూడా అదే స్థారుులో గెలిపించుకుంటావుని పార్టీ శ్రేణులు ధీవూ వ్యక్తం చేస్తున్నారుు. టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయున రాజకీయూలకు కొత్త. ఏ మండలంలోనూ చెప్పుకోదగ్గ స్థారుులో పట్టు లేదు. నంద్యాల వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా భూవూ నాగిరెడ్డి, టీడీపీ తరఫున వూజీ వుంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వుుస్లిం ఓట్లు కీలకం. బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ పట్ల వుుస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా, వుంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయులేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. టికెట్ కోసం ఇటీవలే పార్టీ వూరడం కూడా మైనస్. వీటికితోడు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫరూక్‌తో అంతర్గత విభేదాలు తీవ్రస్థారుులో ఉన్నారుు. నంద్యాల లోక్‌సభ స్థానం ఓటర్ల సంఖ్య 15,75,677 ఇతరులు: 249 అసెంబ్లీ సెగ్మెంట్లు 1. నంద్యాల 2. ఆళ్లగడ్డ 3. బనగానపల్లె 4. శ్రీశైలం 5. నందికొట్కూరు 6. డోన్ 7. పాణ్యం నియోజకవర్గ ప్రత్యేకతలు - మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. - నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. - {పపంచ స్థాయిలో ఖ్యాతిగాంచిన సోనా మసూరి బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం. జనం మాట పిల్లలు బాగుపడతారు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘అవ్ము ఒడి’ పథకం చాలా బాగుంది. దీనివల్ల పేదలు సైతం పిల్లలను చదివించుకునేందుకు అవకాశం కలుగుతుంది. పిల్లల చదువు కోసం తల్లి బ్యాంకు ఖాతాలో డబ్బు వేసే ఆలోచన అద్భుతం. - పాణ్యం ధనలక్ష్మి, ఎన్జీఓ కాలనీ, నంద్యాల మహిళలకు రుణ విముక్తి పొదుపు మహిళలు రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు వూఫీ చేస్తారు. అప్పుడు అప్పుల బాధ తప్పుతుంది. - వెంకట రత్నమ్మ, నంద్యాల సొంతింటి కల నెరవేరుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారమే. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని జగన్ మోహన్‌రెడ్డి చెబుతుండటం సంతోషదాయకం. -శ్రీనివాసులు గౌడ్, నంద్యాల తిప్పలు తప్పుతారుు వైఎస్సార్ సీపీ ప్రభుత్వమొస్తే వ్యవసాయూనికి పగటిపూట ఉచిత కరెంటిస్తానని జగన్మోహన్రెడ్డి చెబుతున్నారు. దీంతో వూలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నారుు. ప్రస్తుతం రాత్రిపూట ఇస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం. - పెద్ద వెంకటరెడ్డి, వెంకటాపురం, బనగానపల్లె చంద్రబాబు రైతుద్రోహి చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు రైతులను హీనంగా చూశారు. వైఎస్ వచ్చాకే వూకు అండ దొరికింది. ఆ తర్వాత వుళ్లీ కష్టాలే. జగన్ అధికారంలోకి వస్తే వుళ్లీ వుంచిరోజులు వస్తాయుని భావిస్తున్నాం. - కుందూరు శివారెడ్డి, ఆత్మకూరు ప్రకాశం జిల్లా వెలిగొండ, ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, పాలేరు రిజర్వాయర్ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం. గుండ్లకమ్మతో మా జీవితాలు బాగుపడ్డాయి ఇంతకుముందు నీరు సరిగ్గా లేక మా చేలు ఎండిపోయేవి. పంటలు పండేవి కావు. వైఎస్ పుణ్యమా అని ఈ ప్రాంతంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పుడు మా పొలాలు పంటలతో కళకళలాడుతున్నాయి. ఎడమ కాలువ కింద నీళ్లు మా చేలకు పెట్టుకుంటూ పండించుకుంటున్నాం. నాలుగు రూకలు సంపాదించుకున్నాం.మా బిడ్డల చదువులు పూర్తి కావచ్చాయి. ఆ మహా నుభావుడిని దేవుడు తీసుకెళ్లాడని ఎవరన్నారు. ఆయన నాలాంటి రైతుల గుండెల్లోనే ఉన్నాడు. - యేమిరెడ్డి విజయభాస్కరరెడ్డి, మద్దిపాడు జగన్‌తోనే ‘బైరేని గుండాల’ పూర్తి బైరేని గుండాల ప్రాజెక్టు పూర్తయితే గిద్దలూరు పట్టణంతో పాటు 14 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్య తీర్చేందుకు వైఎస్ 2006లో బైరేని గుండాల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందుకు రూ.12కోట్లు విడుదల చేశారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనులు నిలిచాయి. అనంతరం వచ్చిన పాలకులు ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. దీంతో తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ సమస్యలు తీరయాని నమ్ముతున్నాం. - పి.రామసుబ్బయ్య, గిద్దలూరు జీవనాడి ప్రాణదాతకు రుణపడి ఉన్నాం... మేం పేదోళ్లం. నేను, నా భార్య శివలక్ష్మి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. వూకు ఇద్దరు కువూర్తెలు. 2009లో స్వగ్రామమైన వెలుగోడు మండలం రేగడగూడూరుకుపనుల నిమిత్తం వెళ్లా. ఇంటిపెకైక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డా. నడుము వద్ద తీవ్ర గాయాలయ్యూరుు. కాళ్లు చచ్చు పడ్డాయి. చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరి స్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. అసలు బతికి బట్టకడ తానా అని ఆందోళనకు గురయ్యా. డాక్టర్లు ఆపరేషన్ చేయూలన్నారు. డబ్బెలా తేవాలో అర్థం కాలేదు. అయితే, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడంతో ధైర్యం వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. రూ.-0 వేల వరకు లబ్ధి చేకూరింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కోలుకున్నా. రెండు కాళ్లు చచ్చు పడినా...ప్రాణాలు దక్కారుు. నా భార్య, పిల్లలను చూసుకోగలుగుతున్నా. ఇదంతా వైఎస్ రాజశేఖరరెడ్డి చలవే. ఆయునకు రుణపడి ఉన్నాం. - బాలరాజు, రైతునగర్ (నంద్యాల) -
విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా బాబు పట్టించుకోలేదు
‘చంద్రబాబు నాయుడు విధానాల వల్లే రాష్ట్రంలో విద్యారంగం నాశనమైంది. చదువును మార్కెట్ వస్తువుగా మార్చి... పేదలకు దూరం చేశారు. విజన్-2020 పేరిట ఓ పథకం ప్రకారం ప్రభుత్వ విద్యావ్యవస్థను దెబ్బతీశారు. ఆయన చర్యల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దారుణం చరిత్రలో మరెక్కడా చూడలేద’ని సీపీఎం అంతర్జాతీయ వ్యవహారాల విభాగం సభ్యుడు, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జాతీయ పూర్వ అధ్యక్షుడు ఆర్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలివీ... ప్రైవేటు శక్తులకు బాబు దాసోహం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే అమలులో ఉన్న ప్రైవేటీకరణ విధానాలను మరింత వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా మారుస్తానంటూ వెలువరించిన విజన్-2020 విధానపత్రం దీనికి భూమిక అయ్యింది. అప్పటివరకు విద్యారంగంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ప్రభుత్వం... క్రమంగా తన బాధ్యతను వదిలించుకుంటూ ప్రైవేటు శక్తుల పాత్రను పెంచింది. విద్య ఒక వినిమయ వస్తువుగా, మార్కెట్లో సరుకుగా మారింది. సమాజ శ్రేయస్సు కోసం విద్య అనే విధానాన్ని ‘మార్కెట్ అవసరాల కోసం విద్య’గా మార్చివేశారు. ప్రభుత్వ కళాశాలలను దెబ్బతీశారు.. సాంకేతిక విద్యను బలపర్చాలనే పేరుతో సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని చంద్రబాబు నీరుగార్చారు. రాష్ట్రంలో అప్పటివరకు 70 శాతానికి పైగా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివేవారు. ఈ కళాశాలలకు ప్రభుత్వ కేటాయింపులను క్రమంగా తగ్గించుకుంటూ రావడం వల్ల వీటిలో కనీస సౌకర్యాలు మొదలుకుని లెక్చరర్ల వరకు ప్రతిదానికి కొరత ఏర్పడింది. విద్యా ప్రమాణాలను ఓ పథకం ప్రకారం కాలరాశారు. ప్రైవేటు కళాశాలలకు పెద్దసంఖ్యలో అనుమతిచ్చారు. వాటి లో చేరేటట్లు విద్యార్థులను, తల్లిదండ్రులను పరోక్షంగా అప్పటి ప్రభుత్వమే ప్రోత్సహించింది. ఈ రకంగా ప్రారంభమైన ప్రైవేటు కళాశాలలు క్రమంగా ఎదిగి కార్పొరేట్ స్థాయిని సంతరించుకున్నాయి. మొత్తం విద్యారంగాన్నే శాసించే స్థాయికి చేరాయి. చిన్న విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలు మింగివేశాయి. ఉన్నత విద్యావకాశాల కోసం అనారోగ్యకరమైన పోటీని పెంచి పోషించారు. టీడీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాల ఫలితంగా చరిత్రలో ఇదివరకెన్నడూ చూడని విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్రం చూడాల్సి వచ్చింది. వీటిని నివారించేందుకు ఆనాటి ప్రభుత్వం చేసింది శూన్యం. ై ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యతారాహిత్యాన్ని, వ్యాపారతత్వాన్ని ఎండగట్టిన విద్యార్థి ఉద్యమాన్ని కర్కశంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. సామాజిక బాధ్యతను పట్టించుకోలేదు... సమాజ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యారంగంలో, ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలో కొత్తగా కళాశాలలు తెరవడానికి చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించింది. ఆ స్థానంలో ప్రైవేటు వ్యాపారులు కళాశాలలు తెరుచుకునేలా ప్రోత్సహించింది. ‘విజన్’ పేరిట వికృత చర్యలు సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వాన్ని తప్పించడం చంద్రబాబు ‘విజన్’లో ముఖ్యమైన అంశం. విద్యార్థుల స్కాలర్‌షిప్పులను తగ్గించేందుకు పథకాలు రూపొందించారు. దీంతో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు పెరుగుతున్న ధరలు, చాలీచాలని స్కాలర్షిప్పులతో మనోవేదనకు గురయ్యారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు... టీడీపీ ప్రభుత్వ చర్యలు శ్రుతి మించడంతో ఆనాడు విద్యార్థులు ఉద్యమాల బాట పట్టారు. విద్యార్థులతో చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా చంద్రబాబు కదలలేదు. పైగా విద్యార్థులు సంఘటితం కాకుండా నిలవరించేందుకు ప్రయత్నించారు. విద్యార్థి సంఘాలను నిషేధించాలని చూశారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉండమనే వారు మూర్ఖులు గానీ, తమ మోసాలు ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు గానీ అయ్యి ఉంటారని లాలాలజపతి రాయ్ అన్నారు. చంద్రబాబు కచ్చితంగా తన మోసాలు ప్రజల దృష్టికి చేరకుండా కుటిల పన్నాగాలు పన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇటువంటి ప్రయత్నాలు నిరోధించేందుకు విద్యార్థులు అనేక పోరాటాలు చేశారు. దీనికితోడు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి, విద్యార్థి పోరాటాలు కూడా తోడయ్యాయి. -
నవ్యాంధ్ర వికాసం
యువనాయకత్వంతోనే జగన్‌పైనే యువత ఆశలు వైఎస్ పథకాలన్నీ మళ్లీ గాడిన పడతాయన్న నమ్మకం బాబు పాలన వద్దంటున్న జనం సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అవమానకరరీతిలో రాష్ట్రం ముక్కలైన తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నూతన రాష్ట్ర వికాసం ఎవరి వల్ల సాధ్యం.. ఏ పార్టీకి పట్టం కడితే తమ జీవితాల్లో మళ్లీ వెలుగులు విరబూస్తాయి.. ఏ నాయకుడికి తోడుంటే తమ కష్టాలు తీరతాయి అన్నవాటిపైనే ఆలోచిస్తున్నారు. వైఎస్ సువర్ణయుగంతో పాటు నవ్యాంధ్ర వికాసం యువనేతతోనే సాధ్యమని వారు విశ్వసిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కాకినాడ రూరల్, అనపర్తి, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో ‘సాక్షి ప్రత్యేక ప్రతినిధి’ రోడ్‌షో నిర్వహించారు. ప్రజల మనోగతం వారి మాటల్లోనే.... ఆదివారం ఉదయం కాకినాడ జగన్నాథపురం వంతెన వద్ద నుంచి ‘సాక్షి రోడ్ షో’ మొదలైంది. అంబేద్కర్ సెంటర్లోని టాక్సీ స్టాండ్‌లో ఉన్న కారు డ్రైవర్లు, ఓనర్లను ప్రస్తుత రాజకీయాలపై ప్రశ్నించగా కొందరు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. వారిలో పందిరి రాజు, ఒక్కిబట్ల శ్రీను మాత్రం జగనే రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం ముక్కలైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో వచ్చే సీఎం సమర్ధుడు కావాలని, ఆ సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికే తాము మద్దతిస్తామని మరో డ్రైవర్ కె. సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్కడ నుండి సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి వెళ్లాం. అక్కడ మార్కెట్లో ఉన్న సత్తి బాబు, పెంకె గోపి, ఆదినారాయణ, రాయుడులతో మాట్లాడగా తాము టీడీపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిపారు. గ్రామంలో సైకిల్‌పై తిరుగుతూ కల్లు విక్రయిస్తున్న రమణను పలకరించగా, ‘తనకు రాజకీయాల గురించి తెలియదని తమ కులపోళ్లు ఎటు చెప్తే అటే ఉంటాననన్నాడు. ఈ సారి వాళ్లు ఫ్యాన్‌కు మద్దతివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అక్కడి నుంచి పెదపూడి మండలం రామేశ్వరం పై కొత్తూరు గ్రామానికి చేరుకున్నాము. ఊళ్లో రోడ్డు పక్కన రైతు చల్లపు రాంబాబుతో మాట్లాడగా తాను జగన్‌కే మద్దతిస్తున్నట్లు తెలిపాడు. అక్కడ నుంచి రామేశ్వరం గ్రామానికి చేరుకున్నాం. అక్కడ మార్కెట్లో రైతు తొండిపూడి వీరభద్ర రాజును కదిలిస్తే తాను వైఎస్ బిడ్డకే మద్దతిస్తానన్నాడు. వైఎస్ హయాంలో రైతులకు భరోసా ఉండేదని తెలిపాడు. ఆ కృతజ్ఞత తనకుందన్నాడు. ఆ తర్వాత అచ్యుతాపురం వెళ్లి గ్రామంలో తాపీ పని చేస్తున్న యువకుడు శ్రీనుతో మాట్లాడగా రాష్ట్రంలో చిన్నవయస్సులో పార్టీ పెట్టి చరిత్ర సృష్టించిన జగన్ వెంటే ఉంటానన్నాడు. గ్రామ చివర ఉన్న దళిత వాడ లో మహిళలతో మాట్లాడగా తమ వాడల్లోకి ఇంతవరకు నాయకులెవరూ రాలేదని.. షర్మిలమ్మ పాదయాత్ర చేస్తూ అక్కడికి వచ్చి తమతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిందన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చిందన్నారు. అందుకే ఈ సారి జగన్‌ను గెలిపించుకునేందుకు తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి వేట్లపాలెం వైపు బయలు దేరాం. పొలంలో ఉన్న మార్నె బుచ్చయ్య చౌదరి, మార్నె వెంక ట్రావు, మాడ శివసత్య బాబులతో మాట కలపగా రైతులందరూ వైఎస్ బిడ్డకే మద్దతిస్తారన్నారు. కాస్త ముందుకెళ్లి రైతులు శివరామకృష్ణ, నరసింహారావు, ధర్మారావులతో మాట్లాడగా.. ‘చంద్రబాబు పాలన భయానకమని.. మళ్లీ ఆ రోజులు మా కొద్దు...కలలో కూడా ఊహించని రోజులవి’..అన్నారు. అక్కడ నుండి వేట్లపాలెం గ్రామానికి వెళ్లాం. వెంకటరాజు, వీర్రాజులుతో మాట్లాడగా విడిపోయిన రాష్ట్రం బాగుపడాలన్నా, పేదల బతుకుల్లో వెలుగులు రావాలన్నా జగన్ అధికారంలోకి రావాలన్నారు. జగన్ కొత్తగా ఏమీ చేయనక్కర లేదని, వాళ్ల నాన్న పథకాలు సరిగ్గా అమలు చేస్తే చాలన్నారు. అక్కడ నుంచి సామర్లకోటకు చేరుకున్నాం. అక్కడ రైల్వే స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్లతో మాట్లాడగా రాష్ట్రం ముక్కలైనా ఎవరూ పట్టించుకోనందుననోటా బటన్ నొక్కి వచ్చేస్తానని.. రాజు అనే డ్రైవర్ అన్నాడు. అక్కడి నుంచి కోదండరామపురం గ్రామం వచ్చాం. అక్కడ చెరుకు రసం అమ్మే నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు అంతా జగన్ గాలి వీస్తుందన్నాడు. అదే గ్రామానికి చెందిన ఇక్కుర్తి సాంబశివరావు, కొండిశెట్టి సోమేశ్వరరావు, జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. అక్కడ నుంచి జల్లూరు గ్రామానికి వచ్చాం అక్కడ హోటల్లో కూర్చున్న పదిమందిలో ఆరుగురు జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. అక్కడ నుంచి ఫకృద్ధీన్పాలెం వెళ్లి షేక్ ఖాజావలితో మాట కలిపితే... వైఎస్సార్ అంటే మైనారిటీలకు మాత్రం నాలుగు శాతం రిజర్వేషన్లు గుర్తుకువస్తాయన్నారు.. అక్కడి నుంచి పిఠాపురం చేరుకున్నాం పిఠాపురం ఆలయానికి వచ్చిన అనంత పద్మనాభశాస్త్రితో మాట్లాడగా, పూజారులకు గౌరవ వేతనం పెరిగింది వైఎస్ హయంలోనేనని... ధూపదీప నైవేద్యాలకు నోచని గుడులకు ఆయన ఆసరాగా నిలిచారన్నారు. వాళ్లబ్బాయి అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. రాపర్తి గ్రామంలో ఎలక్ట్రీషియన్ శ్రీనివాసుతో మాట్లాడగా, కొత్త వాళ్లకు మద్దతివ్వడం గోదావరి జిల్లాలకు అలవాటేనని ఈసారి జగన్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి చిత్రాడకు వెళ్లి సామ్రాజ్యం, జ్యోతి, కస్తూరి, రత్నకుమారిలతో మాట్లాడగా.. వైఎస్ కొడుకుపై కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకు బయటికి వచ్చిన విజయమ్మ తన భర్త ఆశయ సాధనకు ముందుకు సాగుతున్నారన్నారు. జగన్ సోదరి షర్మిల పాదయాత్రతో స్త్రీ శక్తిని లోకానికి చాటిందన్నారు. ఆ కుటుంబం అధికారంలోకి రావాల న్నారు. పండూరు గ్రామంలో రైతులను కదిలిస్తే రైతులెవరూ బాబును నమ్మరన్నారు. బాబు పాలనలో తమ జిల్లాలో కూడా కరువు వచ్చిందని.. వ్యవసాయం కష్టమైపోయిందన్నారు. ఆరోజులను ఎప్పటికీ మర్చిపోలేమని కట్టా మల్లికార్జునరావు, కావూరి సత్యనారాయణ అన్నారు. మరో రైతు నరసింహం.. మాట్లాడుతూ జగన్ వాళ్ల నాన్నలా చేస్తారనే అనుకుంటున్నాం. ఈసారికి ఆయనకే మద్దతిస్తాం... అని స్పష్టం చేశారు. వైఎస్ కార్డుతోనే ఇలా ఉన్నా.. నేను జగన్ కే మద్దతిస్తా... వాళ్ల నాన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతోనే నేను ఈ రోజు నడవగలుగుతున్నా. నా నడుము పడిపోతే కాకినాడ పెద్దాస్పత్రిలో వైఎస్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచితంగా ఆపరేషన్ చేయించారు. ఆయన బిడ్డకు మద్దతిచ్చి రుణం తీర్చుకుంటా. - నాగమణి, మాధవ పట్నం -
రైతుల పాలిట హంతకుడు
ఏలేరు స్కామ్‌లో అసలు దోషి ఖల్ నాయక్ నమ్మకద్రోహి ప్రజా కంటకుడు అవినీతిపరుడు అతిపెద్ద దివాలాకోరు ...ఇవన్నీ ఏమిటో తెలుసా? చంద్రబాబుకు బీజేపీ పెట్టిన భుజకీర్తులు పాపం చంద్రబాబు. ఎన్నికల గోదారిని ఏకాకిగా ఈదలేనని అర్థమై, మరో గతి లేక బీజేపీతో అంటకాగుతూ పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు. మతతత్వ పార్టీ అంటూ నిన్నామొన్నటిదాకా దుమ్మెత్తిపోసిన నోటితోనే ‘లోక కల్యాణార్థమే బీజేపీతో పొత్తు’ అంటున్నారు. ‘మసీదులు కూల్చాడు. మైనారిటీలను ఊచకోత కోయించాడు’ అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా నరేంద్ర మోడీని తిట్టిన బాబు, ఇప్పుడాయనపై ప్రశంసల వర్షమే కురిపిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగానే తగడని, తక్షణం తప్పుకోవాలని డిమాండ్ చేసిన నోటితోనే, ‘ప్రధాని పదవికి మోడీయే అత్యంత అర్హుడు’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. కానీ బాబు ఇంతగా భజన చేస్తున్న ఆ బీజేపీయే... ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును ‘అక్షరాలా’ చీల్చి చెండాడింది. బాబు దివాలాకోరు రాజకీయాలను ఎండగడుతూ ఏకంగా ‘ప్రజాకోర్టులో చార్జిషీటు’ దాఖలు చేసింది. అన్నదాత నోట్లో బాబు మట్టికొట్టిన వైనాన్ని, ప్రజలనూ వారి సంక్షేమాన్నీ గాలికొదిలి తొమ్మిదేళ్ల పాలనా కాలం పొడవునా అవినీతిలో మునిగితేలిన క్రమాన్ని దునుమాడుతూ పార్టీపరంగా అధికారికంగా పుస్తకాలకు పుస్తకాలే ప్రచురించింది. ఆ పుస్తకాల్లో బీజేపీ బయటపెట్టిన పలు పచ్చి నిజాల్లో మచ్చుకు కొన్ని... ‘‘అన్నదాత హంతకులెవరు?’’ అనే శీర్షికతో 1998లో బీజేపీ విడుదల చేసిన పుస్తకం తాలూకు ముఖచిత్రమిది. బాబు రూపంలో తన వెన్నులో దిగిన బాకు దెబ్బకు అన్నదాత నెత్తురోడుతూ నేలకొరిగి ఆక్రందన చేస్తుంటే, ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నట్టుగా చూపడం ద్వారా టీడీపీ పాలనను బీజేపీ దునుమాడింది. బాబు పాలనలో, ముఖ్యంగా 1998 జనవరి నెలలో రాష్ట్రంలో నెలకొన్న హృదయ విదారక పరిస్థితులకు ఈ పుస్తకం అద్దం పట్టింది. బాబు విధానాల వల్ల వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ వైనాన్ని వివరించడంతో పాటు ఆ బలవన్మరణాల తాలూకు వార్తల క్లిప్పింగులను పుస్తకంలో బీజేపీ గుదిగుచ్చింది -
రైతు నోట బాబు కొట్టిన మట్టి
చుకుంటే ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు ప్రయత్నాలను ఆపేందుకు గట్టిగా ప్రయత్నించగలిగే స్థాయిలో ఉండి కూడా కళ్లు మూసుకున్నారంటూ బీజేపీ దుమ్మెత్తిపోసింది. ‘‘ఆలమట్టి... ఆంధ్రుల నోట మట్టి’’ అంటూ 1996 ఆగస్టులో ప్రచురించిన పుస్తకంలో ఆయన్ను ఎలా ఏకిపారేసిందో చూడండి... ‘‘నీటిపారుదల ప్రాజెక్టులంటే బాబుకు గిట్టేది కాదు. అందుకే, తాను మద్దతిస్తున్న ప్రధాని దేవెగౌడే అడ్డగోలుగా ఆలమట్టి ఎత్తు పెంచినా కిమ్మనలేదు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు, 119 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నిల్వ చేసుకునేందుకు కర్ణాటకకు కేంద్రం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదంటూ కేంద్ర జలవనరుల మంత్రి జ్ఞానేశ్వర్ మిశ్రా 1996 జూలై 11న బాబుకు లేఖ రాశారు. కానీ అంతకు వారం ముందే, అంటే జూలై 4వ తేదీనే ఆలమట్టి ఎత్తు పెంపుకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది! అది కూడా... జూలై 3న ప్రధాని దేవెగౌడకు బాబు లేఖ రాసిన మర్నాడు! పైగా ఆ మర్నాడు, అంటే జూలై 5న బాబు స్వయంగా దేవెగౌడను కలిశారు. అయినా, అలమట్టి ఎత్తు పెంపునకు ముం దు రోజే అనుమతించినట్టు బాబుకు ఆయన మాట మాత్రంగానైనా చెప్పలేదు. ఇందుకు నిరసనగా కేంద్రానికి బాబు మద్దతు ఉపసంహరించాల్సింది. కానీ ఆయన అలా చేయలేదు. చివరికి ఆగస్టు 2న పత్రికల్లో వచ్చే దాకా, ఆలమట్టి ఎత్తు పెంపునకు అనుమతి గురించి ఎవరికీ తెలియదు. ప్రధానులుగా ఎవరుండాలో తానే నిర్ణయించానని చెప్పుకునే చంద్రబాబు, ఆ పలుకుబడితో రాష్ట్రానికి ఒనగూర్చిన ప్రయోజనం... ఇదీ. ఒకరకంగా ఢిల్లీలో బాబు కరివేపాకే’’. ుుఖ్యమంత్రిగా చంద్రబాబు రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘రెండేళ్ల చంద్రజాలం’ పేరుతో 1997 సెప్టెంబర్‌లో బీజేపీ మరో పుస్తకం వేసింది. అందులో ఏమందంటే...‘‘చంద్రబాబు సొంతమామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదోవన గద్దెనెక్కి పెత్తనం చెలాయించడం మొదలుపెట్టిన నాటి నుంచీ ప్రభుత్వం వ్యాపారమైపోయింది. ఎన్టీఆర్‌కు ప్రజా సంక్షేమ దృష్టి ఒకటుండేది. బాబుకు మాత్రం లాభనష్టాల లావాదేవీలే తప్ప జనసంక్షేమం పట్టదు. కొత్త సంక్షేమ చర్యలు దేవుడెరుగు. ఎన్నికల వాగ్దానాలకే దిక్కు లేదు’’ పథకాలన్నీ అటకెక్కించిన ఘనుడు ‘‘రెండు రూపాయల కిలో బియ్యం పథకం తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం కదా! 1992లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ పథకాన్ని నీరుగారిస్తే ఇదే బాబు ప్రతిపక్షంలో ఉండి మన్నూ మిన్నూ ఏకం చేశారే! కానీ తాను అధికారంలోకి రాగానే మొహమాటం లేకుండా తక్షణం కిలో బియ్యాన్ని రూ.3.5కు పెంచేయడం నమ్మకద్రోహం కాదా? శ్వేతపత్రాలు పట్టుకు ఊరూరా తిరిగి మరీ మద్యనిషేధాన్నీ ఎత్తేశారు’’ నిషేధాన్ని బూచిగా చూపి చార్జీలు పెంచాడు ‘‘విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల మీద బాబు ఏకంగా రూ.1,492 కోట్ల భారం మోపారు. సబ్సిడీ బియ్యం ధర పెంపుతో అదనంగా రూ.611 కోట్లు, టర్నోవర్ టాక్స్‌తో రూ.220 కోట్లు, రూ.60 కోట్ల వృత్తి పన్ను, మరో రూ.50 కోట్ల ఎంట్రీ టాక్స్, రూ.25 కోట్ల లగ్జరీ టాక్స్, రూ.200 కోట్ల వాటర్ సెస్.. ఇలా అక్షరాలా రూ.2,658 కోట్లు గుంజారు. అది కూడా.. మద్యనిషేధం వల్ల ఆదాయం తగ్గిందన్న సాకుతో! (తర్వాత నిషేధాన్ని ఎత్తేసి కూడా, పెంచిన ఈ పన్నులను యథాతథంగా ఉంచారు). -
అన్నదాతల హంతకుడు బాబు
హైటెక్ పాలనతో రైతుల ఉసురు పోసుకుంటున్న ఘనుడంటూ చంద్రబాబుపై బీజేపీ దుమ్మెత్తిపోసింది. ‘అన్నదాత హంతకుడెవరు?’ పుస్తకంలో, ‘బాబు పాలన తాలూకు 100 తప్పుల చార్జిషీట్’లో ఏమందంటే...‘‘బాబు హైటెక్ ప్రభుత్వంలో అన్నదాతకు ఆత్మహత్యలే శరణ్యం. నీళ్లుండి కూడా, కేవలం కరెంటు లేని కారణంగా నిలువునా ఎండిన పైరును చూడలేక మెదక్ జిల్లా దేవనకూచినపల్లి వాసి కుర్మ దుర్గయ్య 1997 మార్చి 13న ఉరేసుకున్నాడు. దీనిపై అసెంబ్లీ అట్టుడికింది. కానీ బాబు మాత్రం పట్టించుకోలేదు. అప్పుల బాధకే మరణించాడు పొమ్మంటూ బుకాయించారు!’’ బాబు సభలోనే... ‘‘మార్కాపురంలో సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సభలోనే ఓ పత్తి రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లోనే ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా వీపనగండ్లలో అప్పుల బాధతో ఆదర్శ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కేబీ పురం వాసి గోవిందరాజులు అప్పు దొరక్క ఆత్మహత్య చేసుకున్నాడు’’ హైటెక్ బాబు దృష్టిలో ఇవన్నీ లోటెక్! ‘‘ఏలూరు సమీపంలో పి.వెంకటరామారావు అనే రైతు బొమ్మిడి సహకార పరపతి సంఘం నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో అధికారులు ఇల్లు జప్తు చేశారు. వస్తువులు బయట పడేసి అవమానించారు. భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మర్నాడే ఏలూరులో కర్షక సదస్సు పెట్టిన బాబు... కనీసం సంతాపం కూడా తెలపలేదు! హైటెక్ సీఎం కదా! ఇలాంటి లోటెక్ విషయాలు పట్టించుకోడు’’ టీడీపీ కార్యకర్త అయినా... ‘‘నెల్లూరు జిల్లా మరపల్లికి చెందిన ముని రామయ్య తుఫాను బాధితుడు. బ్యాంకు నోటీసులతో బెంబేలెత్తి, బాబుకు చెప్పుకుందామని హైదరాబాద్ టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగాడు. కానీ... స్వయంగా టీడీపీ కార్యకర్త అయి కూడా కనీసం లోనికైనా వెళ్లలేకపోయాడు. శత ప్రయత్నాలు చేసినా, చివరికి పోలీసులతో గెంటివేతకు గురయ్యాడు. ఆ నిసృ్పహతో టీడీపీ కార్యాలయం ముందే పురుగుల మందు తాగేశాడు’’ ఒకరా, ఇద్దరా...! ‘‘పత్తి పంట ఎండి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పగులాపూర్కు చెందిన పిల్ల కొమరయ్య, మంథని మండలం ధర్మారం వాసి కటుకూరి భీమయ్య, సైదాపూర్ మండలం ఆకునూరు వాసి మద్దూరు హన్మిరెడ్డి, కమాన్‌పూర్ మండలం జూలపల్లికి చెందిన పత్తి రైతు, సింగిల్ విండో డెరైక్టర్ కోల బాపు, వరంగల్జిల్లా రేగొండ మండలం గేరికొత్తపల్లి రైతు రాజేశ్వరరావు, గీసుకొండ మండలం నందనాయక తండా వాసి బదావత్ మంగ్యా, పరకాల మండలం వెంకటాపురానికి చెందిన జుంగు రవి, ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ వాసి కొమ్ముల మల్లయ్య, సంగెం మండలం చింతపల్లికి చెందిన చాపర్తి వీరాస్వామి, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగొర్లపాడు వాసి మారిశెట్టి కోదండరామయ్య, మేడికొండూరు మండలం పాలడుగు వాసి గుంటుపల్లి సుబ్బారావు, అనంతపురం జిల్లా బెళుగుప్ప వాసి విశ్వనాథం, కర్నూలు జిల్లా మద్దికెర మండలం పందెర్లపల్లికి చెందిన తిరుమలరెడ్డి... ఇలా ఎందరెందరో రైతులు బలవన్మరణాల పాలయ్యారు’’ -
ఏలేరు రైతుల పరిహారం మింగేసిన బాబు
ఏలేరు కుంభకోణంలో అసలు దోషి చంద్రబాబేనని 1997లోనే బీజేపీ నిక్కచ్చిగా తేల్చిచెప్పింది. ‘ఉదయకమలం’ సిరీస్‌లో భాగంగా... ‘అవినీతి ఏరులై పారిన ఏలేరు స్కామ్’ పేరుతో 1997 ఫిబ్రవరిలో పుస్తకం వేసింది. ఆ కుంభకోణం కథాకమామిషును, అందులో బాబు పోషించిన ప్రధాన పాత్రను అందులో పూసగుచ్చింది. ఆ పుస్తకంలో బీజేపీ ఏం రాసిందో చూడండి... ముఖ్యమంత్రికి లెక్కలు రావా?... ‘‘ఏలేరు భూములకు అక్రమంగా పెంచిన నష్టపరిహారం కింద ఇంతవరకు ఖజానా కోల్పోయింది రూ.5.9 కోట్లేనని ముఖ్యమంత్రి (బాబు) ప్రకటించారు. కానీ వాస్తవాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రూ.14 కోట్ల చెల్లింపు పూర్తయింది. పైగా మరో రూ.5 కోట్లకు కూడా లెక్కలే లేవు. ఉదాహరణకు రూ.4.43 లక్షల నష్టపరిహారం పొందినట్టు చెబుతున్న జగన్నాథం అనే లబ్ధిదారు పేరు ముఖ్యమంత్రి (బాబు) చెప్పిన లెక్కల జాబితాలో లేదు. అంటే చంద్రబాబు చెవిలో అధికారులు పువ్వులు పెట్టారనుకోవాలా? లేక చంద్రబాబే ప్రజల చెవిలో పువ్వులు పెట్టారనుకోవాలా?’’ అసలు దోషి చంద్రబాబే... ‘‘ఏలేరు కుంభకోణంలో అసలు దోషి ముఖ్యమంత్రి చంద్రబాబే. రైతులకు అసాధారణ మొత్తాలలో జరిగిన చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లపై ఆయన స్వయంగా సంతకాలు చేశారు. పైగా... ‘డబ్బు వెంటనే చెల్లించకపోతే కోర్డు ధిక్కారమవుతుందేమోనన్న భయంతోనే నేను, నా మంత్రివర్గ సహచరులు త్వరత్వరగా సంతకాలు చేశాం. అంతే తప్ప అవినీతి ఆలోచన మాలో ఏ కోశానా లేదు’ అంటూ శాసనసభలో సన్నాయి నొక్కులు నొక్కారు. పరిహారం అసాధారణంగా పెరిగిపోయినా, కోట్లాది రూపాయల ప్రజాధనం చేజారిపోయినా, ‘కోర్టు ధిక్కార నేరం భయంతోనే చూస్తూ ఊరుకున్నాం’ అంటూ జనం చెవుల్లో బాబు పూలు పెట్టారు. అసాధారణ తీర్పులపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు గానీ, ఆయన ప్రభుత్వానికి గానీ లేదనుకోవాలా? ముఖ్యమంత్రిగా బాబు చేసిన సంతకం వల్లే ప్రజాధనం ఖజానా దాటిపోయిందన్నది వాస్తవం. పైగా దీనిపై ఎవరో ఒకరిపై చర్య తీసుకున్నట్టు కనిపించకపోతే బాగుండదని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి కోసలరాంను బదిలీ చేశారు బాబు. ఇంతకీ ఆయనపై మోపిన అభియోగం ఏమిటి? సీఎంగా లబ్ధిదారులైన రైతుల వివరాలను, పరిహారం ఎంత పెరిగిందన్న వివరాలను, ఇలాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయన్న వివరాలను సేకరించలేదని! స్వయంగా ముఖ్యమంత్రి సంతకం చేసిన ఫైలును ఆపేందుకు ఏ అధికారి మాత్రం సాహసించగలడు?! బాబు ఇలా ఎక్కడ లేని ఆసక్తితో ఏలేరు ఫైళ్లపై చకచకా సంతకం చేయడానికి కారణం ఒక్కటే... విశాఖ జిల్లాలో అధికార టీడీపీ నేతలు పలువురు పీలా పోతినాయుడు (ఏలేరు కుంభకోణంలో పాత్రధారి)తో షరీకై చెల్లింపులు నిరాటంకంగా జరిగేందుకు దోహదపడ్డారు.’’ చూపుడు వేళ్లన్నీ సచివాలయం వైపే... ‘‘ఏలేరు కుంభకోణం మొత్తం స్వామి, పోతినాయుడు చేతుల మీదుగానే జరిగిపోయినట్టు బయటికి కనిపిస్తున్నా... జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉన్నతాధికారులు అందించిన సహకారం వల్లే అవినీతి ఇన్నాళ్లూ గుట్టుగా సాగిందని స్పష్టమవుతుంది. దర్యాప్తు ఇంకాస్త ముందుకు కదిలితే చంద్రబాబు తెరవెనుక పోషించిన పాత్ర కూడా వెల్లడవుతుంది. కాబట్టే అలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు స్పష్టమవుతూనే ఉంది. పైగా ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా చంద్రబాబు స్పందించిన తీరు, దర్యాప్తుకు ఆదేశించిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన అంతరంగం ఏమిటన్నది తెలిసిపోతోంది. హైకోర్టు తనంతట తాను కదిలి, అక్రమ చెల్లింపులను నిలిపేసింది. లేదంటే రూ.40 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమయ్యేది’’ (‘‘పోతినాయుడుకు గడ్డం ఉండేదిట. అది నల్లగడ్డం. కానీ ఏలేరు స్కామ్‌లో మరో గడ్డం నాయుడే అసలైన నిందితుడు. అయితే ఆ గడ్డం తెల్లగడ్డం. పైగా ఆ నాయుడు విశాఖలో కాకుండా హైదరాబాద్‌లో, సచివాలయంలో ఉంటాడు’’ అంటూ కూడా పుస్తకంలో బీజేపీ విసుర్లు విసిరింది! కేసు విచారణ సందర్భంగా కోర్టులో లాయర్లు కూడా ఈ మేరకు చలోక్తులు విసురుకున్నారని పేర్కొంది!!) -
ఆర్టీసీకి బాబు యాక్సిడెంట్
కార్మికుల కడుపు కొట్టాడు ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు అర్రులు చాచారు. కార్మికుల పొట్ట కొట్టేందుకు చూశారు. కడుపు కాలి నోరెత్తితే జీతం కట్‌చేసి కేసులు పెట్టారు. ఆందోళనకు దిగితే జైలుపాలు చేశారు. లక్షకుపైగా కార్మికులను రోడ్డుపాలు చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చూపించిన రాక్షసత్వం ఇదంతా. లోపభూయిష్ట విధానాలతో ఆర్టీసీని అధోగతి పాలుచేసి చార్జీల పెంపుతో ప్రయూణికుల నడ్డి విరవడమే కాదు.. కార్మికులను రోడ్డెక్కేలా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆరుసార్లు బస్సు చార్జీలు పెంచి ప్రయాణికుల ను ఉక్కిరిబిక్కిరి చేసిన బాబు నిర్వాకంపై ప్రత్యేక కథనం. షేక్ పోలుకల్ యూసుఫ్, కర్నూలు, ‘వద్దు బాబోయ్.. ఆ కష్టాల పాలన మళ్లీ మాకొద్దు.. ఆ తొమ్మిదేళ్లు అర్ధాకలితో అలమటించాం.. సంస్థ అభివృద్ధికి రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసినా ఇల్లు గడిచేది కాదు. క్యాజువల్ పేరుతో ఉద్యోగులను తీసుకుని సక్రమంగా పనిచేయట్లేదని ఇంటికి పంపారు. న్యాయం కోసం ఆందోళన చేస్తే జైలుకు పంపారు. రెగ్యులర్ చేయాలని కోరితే నిలుపుదల చేస్తూ జీవోలిచ్చారు. వద్దు బాబోయ్ వద్దు.. చంద్రబాబు పాలన మాకొద్దు..’ అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రైవేటీకరణ కోసం ఆర్టీసీని ముక్కలు చేయాలనుకున్న బాబు పాలన గుర్తుచేసుకుని భయపడిపోతున్నారు. జీతం పెంచమని 24 రోజులు సమ్మెచేస్తే జైలులో పెట్టించిన ఘటనలను వారు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. కార్మికులపై కాటు వేసిన కాంగ్రెస్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూసిన బాబు ఆలోచనల్ని అనుసరిం చాలని వైఎస్ మరణం తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్టీసీని నాలుగు ముక్కలు చేయాలనే ఆలో చనకు కూడా వచ్చింది. దీంతో మళ్లీ కార్మికుల్లో అభద్రతాభావం ఏర్పడింది. ప్రైవేటు బస్సులు అద్దె ప్రతిపాదికన పెద్ద ఎత్తున తీసుకోవడం, రిజర్వేషన్, గుడ్‌విల్ కేంద్రాలతోపాటు గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం వంటి వాటితో పాటు డిస్ ఎంగేజ్ పేరుతో కార్మికులను ఇంటికి కూడా పంపింది. సత్తా ఉన్న నేతకే ఓటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ కూడా రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో కష్టాలు తప్పవని భావించిన కార్మికులు, ఉద్యోగులు చంద్రబాబు వస్తే అవి అధికమై సంస్థ ప్రైవేటుపరం అవుతుందని భయాందోళనకు గురవుతున్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం పనిచేసే నాయకుడిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. బాబు హయాంలో... - తొమ్మిదేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారు. - నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనుకున్నారు. - రూ.480కోట్ల మేర భారం వేశారు. - 1995లో అరకొర డ్రైవర్లు, కండక్టర్లను క్యాజువల్ పద్ధతిలో తీసుకుని ఆ తరువాత ఉద్యోగుల భర్తీకి బ్రేక్ వేశారు. క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయరాదని యాక్ట్-2ను జారీ చేశారు. - వేతనాలు పెంచాలంటూ 24 రోజులు నిరవధికంగా సమ్మెచేసిన కార్మికులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వారిపై కేసులు పెట్టించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో 9.5 శాతం పెంచి చేతులు దులుపుకొన్నారు. - పదివేల మంది కార్మికులను ఇంటికి పంపారు. - ఔట్ సోర్సింగ్ ఆన్ కాంట్రాక్ట్ సిస్టమ్, హైర్ బసెస్ వంటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఆర్టీసీలో ప్రవేశపెట్టడమే కాకుండా ఉద్యోగులను తగ్గించి, ప్రైవేటుకు దారి సుగమం చేశారు. పెరిగిన చార్జీలు - 1994లో ఆర్డినరీ బస్సులో ప్రయాణించే వారి నుంచి కిలోమీటరుకు 17 పైసలు వసూలు చేస్తే, 2003 నాటికి 35 పైసలు చేశారు. - కిలోమీటరుకు 21 పైసలు ఉన్న ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీని 40 పైసలు పెంచారు. - సెమీ లగ్జరీ చార్జీని 45 పైసలు చేశారు. - 1995లో రూ.120కోట్లు, 1996లో 30 కోట్లు, 1997లో 60కోట్లు, 1999లో 150 కోట్లు, 2000లో 60 కోట్లు, 2003లో 60 కోట్ల చొప్పున ప్రయాణికులపై భారం వేశారు. వైఎస్ హయాంలో లాభాల బాట - మహానేత వైఎస్ పాలనలో రూ.117 కోట్ల లాభాలను ఆర్టీసీ ఆర్జించింది. - ఆర్టీసీని ప్రైవేటీకరిస్తానని చంద్రబాబు చెప్పడంతో కార్మికుల్లో ఏర్పడిన అభద్రతా భావాన్ని వైఎస్ తొలగించారు. - 2007, 2008, 2009లో కండక్టర్, డ్రైవర్ల పోస్టులు భర్తీ చేశారు. - బాబు చేసిన చట్టం-2ను ఎత్తేసి 240 రోజుల సర్వీసు పూర్తిచేసిన 12వేల మంది కాంట్రాక్టు - కార్మికులను రెగ్యులర్ చేయించారు. - వేతనాలు పెంచి ఉద్యోగుల మన్ననలు పొందారు. - రాజన్న తన పాలనలో ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. - ఆర్టీసీ నష్టాల నివారణకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఐఏఎం నివేదిక ప్రకారం రూ.600కోట్లు మంజూరు చేశారు. - పన్ను భారాన్ని రెగ్యులర్ సర్వీసులపై 12.5 నుంచి 7 శాతం, సిటీ సర్వీసులపై 10 నుంచి ఐదు శాతానికి తగ్గించి ఆర్టీసీకి రూ.250 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. - పల్లెవెలుగు సర్వీసులు ప్రవేశపెట్టి గ్రామీణులకు మేలు చేశారు. రోశయ్య, కిరణ్ హయాంలో ధరాభారం - రోశయ్య అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే బస్ చార్జీలు పెంచారు. ఆ తరువాత బాధ్యతలు స్వీకరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్లలో మూడుసార్లు పెంచారు. అంతటితో ఆగకుండా డెవలప్మెంట్ సెస్ పేరుతో మరో చార్జీ వేశారు. - నెలవారీ సీజన్ టికెట్, జెట్, జూబ్లీ హైటెక్ టికెట్లు, కపుల్ గిఫ్ట్ కార్డుల ద్వారా టోల్‌ప్లాజా చార్జీలను రూ.3 నుంచి రూ.5కు, ఇంద్ర, వెన్నెల, గరుడ, వెన్నెల ప్లస్ తదితర సర్వీసుల టోల్‌ప్లాజా చార్జీని రూ.3 నుంచి రూ.6కు పెంచారు. - పల్లె వెలుగు కనీస చార్జీ రూ.3 నుంచి రూ.5 చేశారు. - 2009లో లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు 57 పైసల చొప్పున వసూలుచేస్తే, ఇప్పుడు ఆర్డినరీ బస్సుకే 59 పైసలు తీసుకుంటున్నారు. - వీరి హయాంలో ఆర్టీసీకి రూ.650 కోట్ల నష్టం వచ్చింది. కార్మికుల డిమాండ్లు ఇవీ.. - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. - అధికారుల వేధింపులు అరికట్టడంతోపాటు పనిభారాన్ని తగ్గించేందుకు ఖాళీలు భర్తీ చేయాలి. - ప్రతి కార్మికుడు, ఉద్యోగికి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి. - పభుత్వాస్పత్రులతో పాటు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలి. - పిల్లలకు మెరుగైన, ఉన్నత విద్య కోసం చేయూతనివ్వాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పింఛన్ ఇవ్వడంతోపాటు సమస్యలు పరిష్కరించాలి. వైద్య సేవలు మెరుగుపరచా లి. బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలి. చంద్రబాబు కార్మికద్రోహి చంద్రబాబు ఆర్టీసీతో ఆటలాడుకున్నారు. చాలా మండలాల్లో బస్టాపులకు దూరంగా బస్స్టేషన్లు నిర్మించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఆర్టీసీ యూనియన్లు కలిసి 24 రోజులు సమ్మెచేస్తే కేవలం 2.5 శాతం టాక్స్ తగ్గించిన పిసినారి బాబు. తాను జారీచేసిన రాయితీల జీవోలకు ఒక్క పైసా కూడా విదల్చకుండా కుట్రలు పన్నారు. కండక్టర్లు, డ్రైవర్లను పర్మినెంట్ చేయకుండా క్యాజువల్‌గానే ఉంచిన కార్మికద్రోహి. ప్రస్తుతం ఉన్న రూ.5వేల కోట్ల అప్పులకు చంద్రబాబే బాధ్యుడు. వైఎస్ నిర్ణయాలు, చేయూతతో సంస్థకు రూ.5వేల కోట్ల మేలు చేకూరింది. కార్మికులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించి మన్ననలు పొందారు. - ఎ.రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు -
విశాఖ లో విజయ వీచిక
ఎన్నికలంటే పోటీ అనివార్యం. అందునా విశాఖపట్నం వంటి ప్రతిష్టాత్మక స్థానంలో సహజంగానే ఆసక్తికరమైన పోరు సాగుతుంది. కానీ... ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ తీరంలో ‘విజయ’ వీచికలు ముందే వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులూ భావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో పోరు ఏకపక్షమైంది. విజయమ్మ రాకతో విశాఖ జిల్లాలోనే కాక, ఉత్తరాంధ్రలోనూ వైఎస్సార్ సీపీకి సరికొత్త ఉత్తేజం వచ్చింది. విశాఖ లోక్‌సభ స్థానంలో సార్వత్రిక ఎన్నికల పోరు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. వైఎస్ సతీమణిగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ‘మా ఇంటి ఆడపడచు’ అంటూ ఆదరిస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ..బీజేపీకి అప్పగించింది. ఆ పార్టీ తరఫున సీమాంధ్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బొలిశెట్టి సత్యనారాయణ, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున సబ్బం హరి బరిలోకి దిగినా... కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. జోరుగా వీస్తున్న ‘ఫ్యాన్’ గాలి వైఎస్ పట్ల విశాఖ ప్రజలకు ప్రత్యేకాభిమానం ఉంది. ఆయనకూ విశాఖ అంటే ఎంతో ఇష్టం. విజయమ్మ కూడా ఇదే మాట చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రకటించిన పార్టీ మేనిఫెస్టో కూడా విశాఖపై ఆ కుటుంబానికి ఉన్న అభిమానాన్ని చాటింది. మేనిఫెస్టోలో ప్రకటించిన మెట్రో రైలు, కాలుష్యం నుంచి విముక్తి, ఈ ప్రాంతానికి ఉపయోగపడే రీతిలో పెట్రో యూనివర్సిటీ లాంటి అంశాలపై ఇప్పటికే ప్రజల్లో చర్చ నడుస్తోంది. వైఎస్ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారెందరో ఇక్కడ ఉన్నారు. విజయమ్మ లాంటి ప్రముఖ నాయకురాలు ఎంపీగా ఎన్నికైతే విశాఖ రూపురేఖలు మారిపోతాయని, మేనిఫెస్టోను జగన్మోహన్రెడ్డి తప్పనిసరిగా అమలుచేసి.. మేలు చేస్తారని ఇక్కడి ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకూ ఎవరికీ రాని మెజారిటీతో ఆమెను గెలిపించాలన్న పట్టుదల వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కన్పిస్తోంది. విశాఖపై స్పష్టమైన ఆలోచనతో ఉన్న విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ఇందుకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. కళ తప్పిన ‘కమలం’ బీజేపీ అభ్యర్థి హరిబాబు రేసులో వెనుకబడ్డారు. ఆ పార్టీ ఇక్కడ గతంలో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. 1981లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికలలో అత్యధిక డివిజన్లలో గెలుపొంది.. విశాఖ మేయర్ పదవినీ చేపట్టింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సీటును పట్టుబట్టి ఇప్పించుకుంది. ఈ స్థానంలో ఎలాగూ గెలవలేమని భావించిన టీడీపీ... ఈ సీటును బీజేపీకి అప్పజెప్పడానికి పెద్దగా అభ్యంతరాలు తెలపలేదు. దీంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. బీజేపీ ప్రచారంలో వారు పాల్గొనడం లేదు. హరిబాబు నామినేషన్ కార్యక్రమానికి కూడా కనీస స్థాయిలో హాజరుకాకపోవడం ఇందుకు నిదర్శనం. అటుపక్క బలమైన అభ్యర్థి(విజయమ్మ) కావడంతో కమలనాథులకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. ‘తమ్ముళ్ల’కు తాయిలాలు ఇచ్చినా సరైన స్పందన కనిపించడం లేదు. ఇటీవల బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు నిర్వహించిన రోడ్‌షో వెలవెలబోయింది. హరిబాబు విషయానికొస్తే... ఈయన ఇటీవల పార్టీ సీమాంధ్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.1999లో విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పనిచేసింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో బీజేపీ నగరంలో ప్రభావం చూపిన సందర్భాలు లేవు. స్థానికేతరులకు పట్టం విశాఖ ఓటర్లు విశాల దృక్పథాన్ని చాటుకుంటున్నారు. వివిధ సందర్భాల్లో ఇది రుజువైంది. స్థానికేతరులైనా పట్టం కడుతున్నారు. సమర్థ నేతలే ముఖ్యమని, స్థానికాంశం ఏమాత్రమూ సరికాదనే భావనతో తీర్పు ఇస్తున్నారు. పీవీజీరాజు(విజయనగరం), ఉమ(విజయనగరం), ఎంవీవీఎస్ మూర్తి(తూర్పు గోదావరి), కొమ్మూరి అప్పలస్వామి(విజయనగరం), టి.సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి(నెల్లూరు),దగ్గుబాటి పురందేశ్వరి(ప్రకాశం)లను గెలిపించడమే ఇందుకు తార్కాణం. అసెంబ్లీ సెగ్మెంట్లు.. బలాబలాలు భీమిలి వైఎస్సార్ సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(టీడీపీ)తో తలపడుతున్నారు. ఎన్నికకో నియోజకవర్గాన్ని మార్చడం.. టీడీపీ శ్రేణులు కలసి రాకపోవడం గంటాకు ప్రతికూలంగా పరిణమించాయి. దీనికితోడు టీడీపీ రెబల్ అభ్యర్థి అనితా సకురు ఆ పార్టీ ఓట్లను చీల్చనుండటం సైకిల్ శిబిరాన్ని కలవరపరుస్తోంది. స్థానికుడు కావడం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి సానుకూలాంశం. విశాఖ తూర్పు ఈసారీ పాత అభ్యర్థులే తలపడుతున్నారు. గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున రెండో స్థానంలో నిలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఈసారి వైఎస్సార్ సీపీ పక్షాన బరిలోకి దిగారు. పాత ప్రత్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు(టీడీపీ)కు గట్టి సవాలు విసురుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేగా వ్యతిరేకత, వివిధ కేసుల్లో నిందితుడు కావడం, రాష్ట్ర విభజనకు టీడీపీ సహకరించడం వెలగపూడికి మైనస్ పాయింట్లు. విశాఖ దక్షిణం గత ఎన్నికల్లో త్రుటిలో విజయానికి దూరమైన కోలా గురువులు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నిల్చున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, వాసుపల్లి గణేష్‌కుమార్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గురువులు స్థానిక మత్స్యకార వర్గానికి చెందిన నేత. ఇక్కడ టీడీపీకి అంత పట్టులేకపోవడం... కాలుష్య అంశం వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ఉండటం ఆ పార్టీ అభ్యర్థికి లాభిస్తున్నాయి. విశాఖ ఉత్తరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజును ఎదుర్కొంటున్నారు. బలమైన సామాజిక వర్గం, సేవాతత్పరుడిగా గుర్తింపు, ప్రత్యర్థికి టీడీపీ శ్రేణులు సహకరించకపోవడం... తదితర అంశాలు వెంకటరావుకు అనుకూలంగా మారాయి. ఇక్కడ కాంగ్రెస్ పోటీ నామమాత్రమే. విశాఖ పశ్చిమం వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాడి రత్నాకర్, టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు మధ్య పోటీ నెలకొంది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమైనా అన్ని వర్గాలనూ కలుపుకుని రత్నాకర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారనే ముద్ర గణబాబుకు మైనస్‌గా మారింది. తండ్రి దాడి వీరభద్రరావు ఎన్నికల అనుభవం, వైఎస్ సంక్షేమ పథకాలు, ప్రణాళికాయుతమైన ప్రచార వ్యూహం రత్నాకర్‌కు సానుకూల అంశాలుగా మారాయి. గాజువాక తిప్పల నాగిరెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పల్లా శ్రీనివాస్(టీడీపీ)ను ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్‌కు పార్టీలో అసమ్మతి తలనొప్పిగా మారింది. తాజా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి కాంగ్రెస్, టీడీపీ టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడి అసమ్మతితో రగిలిపోతున్నారు. దీర్ఘకాలిక పరిచయాలు, కుటుంబ నేపథ్యం, వైఎస్ పథకాలు.. నాగిరెడ్డికి లాభిస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శృంగవరపుకోట ఎస్.కోటగా పిలిచే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ విజయనగరం జిల్లా పరిధిలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రొంగలి జగన్నాథం పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున కోళ్ల లలితకుమారి(తాజా మాజీ ఎమ్మెల్యే) మరోసారి బరిలోకి దిగారు. ఈమెపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ప్రచారంలో ప్రజల నుంచి విశేషాదరణ లభిస్తోంది. -
ఓటు వేసి గెలుద్దాం
ఓటే బ్రహ్మాస్త్రం. ప్రజాస్వామ్యంలో ఓటు కంటే విలువైన హక్కు ఏదీ లేదు. ఆ హక్కును సద్వినియోగం చేసుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. తొలిసారి ఓటు హక్కు పొందిన వారి నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అంతా ఓటేయాలి. పెద్దలకు యువత తోడుగా నిలవాలి. సమాజానికి వ్యక్తిగా ఏమీ చేయలేకపోవచ్చు గానీ సరైన నాయకుడిని మాత్రం ఎన్నుకునే అవకాశముంది. అందుకే తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి... - తమన్నా, హీరోయిన్ సమర్థులనే ఎన్నుకోండి.. ఓటు వేయడం మన బాధ్యతే కాదు పౌరులుగా మన ప్రాథమిక హక్కు కూడా.. అలాంటి ఎంతో విలువైన ఓటు వృథా కాకూడదు. ఒకటికి పదిసార్లు ఆలోచించి సమర్థులెన నేతలనే ఎన్నుకోవాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరైతే ప్రగతిపథంలో నడిపించగలరో.. సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తారో అటువంటి వారినే ఎన్నుకోవాలి. డబ్బులు తీసుకునో, ఇతర బహుమతులు తీసుకునో ఓట్లు వేయద్దు. అలా చేస్తే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టే. - సదా, హీరోయిన్ -
నోరారా తిట్టుకున్నారు...
ఈ ఎన్నికల స్పెషల్ మోడీని ఏమైనా అంటే కేసీఆర్ తాట తీస్తా.... పవన్‌కల్యాణ్ వాడెవడు? నేను చిటికేస్తే వేయి తుకడలైతడు... కేసీఆర్ కేసీఆర్ ద్రోహి, నమ్మించి మోసం చేయడం అలవాటు... సోనియా రాక్షసుడు, మోసకారి, అబద్ధాలకోరు, సైకిల్‌తో తొక్కేస్తా... చంద్రబాబు దొంగ పాస్‌పోర్టులు, మనుషుల అక్రమ రవాణా... పొన్నాల తెలంగాణలో మైకులు మూగబోయాయి. కానీ ఈసారి పార్టీల ప్రచార సరళిని పరిశీలిస్తే.. వివిధ పార్టీల నాయకుల నడుమ మునుపెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత వివుర్శల దాడి జోరుగా జరిగింది. కాలంతోపాటు రాజకీయ ప్రచారాల్లో ప్రమాణాల పతనం కనిపిస్తున్నా.. గడువు సవుయుం దగ్గరపడేకొద్దీ ఎన్నికల వేడి పెరుగుతూ తిట్ల పురాణానికి తెరలేచింది. వ్యక్తిగత వివుర్శలు, ప్రతి వివుర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, బెదిరింపులు, ఎదురుదాడి యథేచ్ఛగా సాగిన తీరు మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఎన్నికలనగానే పార్టీలు, నాయకుల మధ్య వాగ్వివాదాలు, ఆరోపణలు పరిపాటే. కానీ పార్టీల సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, గత ప్రభుత్వాల పనితీరు, కొత్త హామీల గురించి ఉద్రిక్త వాతావరణం ఉందా అనే స్థారుులో వేడెక్కించే విమర్శలు కూడా సాధారణమే. కానీ, ఈసారి తెలంగాణ ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నడుమ నెలకొన్న పోటాపోటీ వాతావరణం, ఎంత ప్రయత్నించినా తన ఉనికి ప్రదర్శించలేకపోతున్న టీడీపీ ఉడుకుమోత్తనం, బీజేపీ కోసం పరిణతి లేని పవన్‌కల్యాణ్ రంగప్రవేశం కారణంగా ఈ పార్టీల నడు మ విమర్శలు కొన్ని ‘లక్ష్మణరేఖలు’ దాటేశారుు. వాస్తవానికి ముప్పేట దాడికీ, అన్ని వైపుల నుం చీ ఈ నిందారోపణలకు గురై న నాయకుడు కేసీఆర్ కాగా, వాచాలతను తీవ్ర స్థాయిలో ప్రదర్శించి, పరిస్థితిని మరింత దిగజార్చింది మాత్రం పవన్‌కల్యాణేనని చెప్పవచ్చు. పోటీ పెరిగే కొద్దీ వూటల సవురం పోటీ ఏకపక్షంగా లేదు. విలీనమనే మాట వదిలేసి ఒంటరిపోరుకు సిద్ధపడిన వెంటనే కేసీఆర్ కాంగ్రెస్ నాయకులకు లక్ష్యంగా మారారు. సుడిగాలిలా ఆయన తెలంగాణ అంతటా విసృ్తతంగా పర్యటిస్తూ ప్రచారంలో ముందుండేసరికి, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం విజయం కోసం చెమటోచ్చాల్సిన దుస్థితి నెలకొంది. దాంతో ఇక ఆ పార్టీ నేతలు కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శల దాడి మొదలెట్టారు. కేసీఆర్ కూడా మాటకుమాట అన్నట్లుగా ఎదురుదాడి ఆరంభించారు. ఇటు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అటు కేసీఆర్ రోజూ తమ విమర్శల తీవ్రతను పెంచుతూ వెళ్లారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ మరింత బలపడుతున్న తీరు గమనించిన కాంగ్రెస్ నాయకులు చివరకు సోనియా, రాహుల్ ద్వారా కేసీఆర్‌పై వాగ్బాణాలు సంధించేలా చేరుుంచడంలో సఫలీకృతవుయ్యూరు. ఢిల్లీ నుంచి గల్లీ నాయకుల దాకా కేసీఆర్ లక్ష్యంగా మారా రు. మరోవైపు ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి వీసమెత్తు ఆదరణ కనిపించని టీడీపీ అధినేత చంద్రబాబునాయుుడు కూడా కే సీఆర్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ధోరణితో ఆయనలో పెరిగిపోతున్న నిరాశాని సృహల్ని బయుటపెట్టేశారు. ఎప్పుడైతే పవన్‌కల్యాణ్ రంగప్రవేశం చేశారో అప్పుడే ఈ విమర్శల పర్వం పక్కదోవ పట్టి పరిస్థితి మరింత దిగజారింది. పవన్ దుందుడుకు ధోరణి నాయకుల నడుమ విపరీత ధోరణిలో సాగే తిట్లు, వ్యక్తిగత నిందారోపణలను ప్రజలు ఎప్పుడూ స్వాగతించరు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్ ‘పంచెలూడదీసి కొడతా’ వంటి తీవ్ర పదజాలాన్ని వాడిన తీరు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. రాజకీయ పార్టీల చరిత్రలో తొలిసారిగా అన్నట్లు... బీజేపీ, టీడీపీలకు ప్రచారం చేయడం కోసమే సొంతంగా పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్ ఈసారి కూడా తన పరిణతిలేమిని, సంస్కార రాహిత్యాన్ని బయటపెట్టేశారు. కేసీఆర్ తాటతీస్తా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ మాటల ధోరణి పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గమనించి చివరకు టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం తలలుపట్టుకుంటున్నాయి. ప్రచారంలో సోవువారం సా యుంత్రం వుుగియుడంతో ఓటర్లు ఒక్కసారిగా హమ్మయ్య అంటూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. పార్టీలు, నాయకులను విమర్శించడంలో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కొందరు ప్రశంసనీయమైన సంయమనం పాటించారు. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసిన వైఎస్ జగన్, షర్మిల ఈవిషయంలో హుందాగా వ్యవహరించారు. చంద్రబాబు రాజకీయపరమైన సంస్కారాన్ని, మర్యాదలను తుంగలోతొక్కి ఏకవచనంలో జగన్‌పై ఇష్టారాజ్యంగా నిందారోపణలు చేస్తున్నా సరే... జగన్ ఒక్కసారైనా చంద్రబాబును తన ప్రసంగాల్లో కనీసం ఏకవచనంలో కూడా సంబోధించకపోవడం గవునార్హం. -
పదండి ఓటేద్దాం
ఓటు... ప్రజాస్వావ్యు వ్యవస్థలో వజ్రాయుుధం. పౌర ప్రయోజనాలను కంటికి రెప్పలా కాపు కాసే రెండక్షరాల తారకవుంత్రం. ఓటుకున్న బలం అపారం. కేంద్రంలో వాజ్‌పేరుు ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో పడిపోరుున వైనమే ఇందుకు తిరుగులేని రుజువు. అరుుతే ఆయుుధం బలంగా ఉన్నంత వూత్రాన సరిపోదు. అవకాశం అందివచ్చినప్పుడు దాన్ని ఒడుపుగా ప్రయోగించగల చేతులు కూడా చాలా వుుఖ్యం. అలాంటి అవకాశం ఇప్పుడు అందివచ్చింది. ఐదేళ్ల పాటు వునల్ని పాలించాల్సిన వారిని ఎంచుకోవాల్సిన రోజు వచ్చేసింది. ఈ ఒక్క రోజు సాకులన్నీ పక్కన పెడదాం. అందరవుూ ఒక్కటై కదులుదాం. వెళ్లి ఓటేద్దాం. సరైన వారిని ఎంచుకుని వురీ ఓటేద్దాం. స్వర్ణయుుగాన్ని సాధించి చూపించే సవుర్థులను ఎన్నుకుందాం. వున భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. ఐదేళ్ల పాటు రోజూ నిశ్చింతగా ఉందాం. నా ఒక్క ఓటు పడకపోతే ఏవువుతుందనే ఆలోచనే వద్దు. ఒక్కో బిందువూ కలిస్తేనే సింధువు. వునవుంతా శాసనకర్తలమేనని, వునం వేసే ఒక్కో ఓటూ వున భవితను శాసిస్తుందని గుర్తుంచుకుందాం. నూరు శాతం పోలింగ్‌తో కొత్త చరిత్ర సృష్టిద్దాం. వున చేతిలోని ఓటును వజ్రాయుుధంగా ప్రయోగించి చూపిద్దాం... పదండి... ఓట్ల పండుగను విజయువంతం చేసేందుకు బయుల్దేరదాం... పదండి... ఓటేసి గెలుద్దాం... 19 - తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలు 1,669 -అసెంబ్లీ బరిలో మొత్తం అభ్యర్థులు 17 - మొత్తం లోక్‌సభ స్థానాలు 267-లోక్‌సభ బరిలో మొత్తం అభ్యర్థులు మొత్తం ఓటర్లు -2,81,75,055 పురుష ఓటర్లు-1,43,82,661 వుహిళా ఓటర్లు -1,37,81,276 ‘ఇతర’ ఓటర్లు- 2,329 సర్వీసు ఓటర్లు - 7,786 ఎన్నారై ఓటర్లు - 3 2009 ఎన్నికల్లో ఇలా... 1. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ భారీగానే నమోదైంది 2. 10 జిల్లాల పరిధిలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో 69.39 శాతం మంది ఓటేశారు 3. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 81.68 శాతం పోలింగ్ జరిగింది 4. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా 53.82 శాతం మంది మాత్రమే ఓటు వేశారు 5. 17 లోకసభ స్థానాల్లో 67.53 శాతం పోలింగ్ జరిగింది 6. ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 80.21 శాతం పోలింగ్ నమోదైంది 7. అత్యల్పంగా మల్కాజిగిరిలో 51.60 శాతం మంది మాత్రమే ఓటు వేశారు ఓటుకు వెళుతున్నారా... ఇవి చూడండి పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది 1. పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాలు, ఈవీఎంలో ఉండే వరుస క్రమంలో ప్రచురించిన పత్రాలను పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శిస్తారు. వాటిని ఓటర్లు ముందే చూసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళితే మంచిది. 2. వుుందుగా లోక్‌సభ ఓటు, తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయూలి. పోలింగ్ స్టేషన్లోకి వెళ్లగానే కుడి చేరుు చూపుడు వేలిపై ఓటు ఇంకు వుచ్చ పెట్టాక ఓటు వేయూలి. (ఇటీవలే స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలప్పుడు ఎడవు చేరుు చూపుడు వేలిపై ఇంకు గుర్తు పెట్టినందున కుడి చేరుు చూపుడు వేలిపై ఇంకు గుర్తు వేస్తారు.) లోక్‌సభ అభ్యర్థికి ఓటు వేసిన వెంటనే శాసనసభ అభ్యర్థికి ఈవీఎంలో మీట నొక్కి ఓటు వేయూలి. 3. ఈవీఎంపై ఓటరుకు నచ్చిన అభ్యర్థి పేరుకు, ఎన్నికల చిహ్నానికి ఎదురుగా ఉండే నీలం రంగు మీట నొక్కితే దాని పక్కనే బాణం గుర్తుపై ఉండే ఎర్ర బల్బు వెలుగుతుంది. ఆ వెంటనే ‘బీప్’ అనే శబ్దం వస్తుంది. ఓటు వేసేవారు ఈ రెండింటినీ విధిగా గమనించాలి. బీప్ శబ్దం వస్తేనే ఓటు వేయడం పూర్తైట్టు. ఒకవేళ బీప్ శబ్దం రాకపోతే పోలిం గ్ బూత్‌లోని ఎన్నికల పర్యవేక్షణాధికారికి ఫిర్యాదు చేయాలి. 4. తొలిసారిగా ఈవీఎంలో ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌ) అనే బటన్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని ఓటరు తవు అసంతృప్తిని ఈ ఓటు ద్వారా వ్యక్తం చేయవచ్చు. 5. కాసేపట్లో పోలింగ్ సమయం ముగియనుంది లెమ్మని బద్ధకించాల్సిన పని లేదు. నిర్ణీత గడువులోగా పోలింగ్ స్టేషన్ లోనికి వెళ్లి ఓటర్ల క్యూలో నుంచుంటే చాలు, సమయం దాటిపోయినా ఓటేయవచ్చు. 6. పోలింగ్ కేంద్రంలో 2009, 2014 జనవరి 1, 2014 వూర్చి 26... ఈ వుూడు ‘ఓటర్ల తుది జాబితాలు’ వేర్వేరుగా అందుబాటులో ఉంటారుు. తాజా జాబితాలో పేరు లేకున్నా మిగిలిన రెండు జాబితాల్లో దేంట్లో పేరున్నా మీ గుర్తింపు కార్డు చూపి ఓటు వేయొచ్చు. 7. ఈసారి ఎన్నికల సంఘమే ఓటర్ల స్లిప్పులిచ్చింది. వీటిని పంపిణీ చేసేప్పుడు ఇంట్లో లేనివాళ్ల పేర్లను గైర్హాజరు జాబితాలో చేరుస్తారు. ఆ జాబితా కూడా అందుబాటులో ఉంటుంది. అందులో పేరుంటే ఆ ఓటు తనదేనని పేర్కొంటూ స్వీయు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయూలి. ఎడవు చేరుు బొటనవేలి వుుద్ర కూడా వేయూలి. ఆ తర్వాత ఓటు వేయువచ్చు. 8. ఈసీ జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డున్నా ఓటర్ల జాబితాల్లో పేరు లేకపోతే ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యం. 9. ఓటరు స్లిప్పులను పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద కూడా తీసుకోవచ్చు. 10 వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు క్యూలో నుంచోవాల్సిన అవసరం లేదు. వారు నేరుగా వెళ్లి ఓటు వేసేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 11. అంధులకు బ్రెరుులీ లిపిలో ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 12. మీ ఓటు వేరే వ్యక్తులు ఎవరైనా వేసేసి ఉంటే.. పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేసి మీ గుర్తింపును చూపిస్తే బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దీన్నే ‘టెండర్డ్ ఓటు’ అంటారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కిం పులో అభ్యర్థుల గెలుపు ఓటవుులు నిర్ణరుుంచలేనట్టుగా సవూన ఓట్లు వచ్చిన సందర్భంలో టెండర్డ్ ఓట్లను లెక్కిస్తారు. -
మళ్లీ అదే మోసం...
మద్యం బెల్టు షాపులకు తలుపులు తెరిచిన నాటి సీఎం నారా చంద్రబాబునాయుుడు ఇప్పుడు ఆ బెల్టు షాపుల్ని ఎత్తివేస్తావుని హామీలిచ్చి వురోసారి వుహిళల్ని మోసం చేయుబోతున్నారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వుద్య నిషేధ సవుయుంలో అక్రవు వుద్యం వ్యాపారం చేసిన తెలుగుదేశం నాయుకుల్ని పార్టీ నుంచి వెలివేయూలి. అధికారం ఇస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా వూర్చేస్తావుంటున్న బాబు.. వుద్యానికి బానిసలై వురణించడంతో వారి భార్యలు వితంతువులుగా వూరడంపై ఏం జవాబు చెబుతారు? వారికి జీవి తాలు ఏంకావాలి? మద్యానికి దాసులవ్వడంతో చాలా వుంది వుధ్యవయుసులోనే చనిపోతున్నారు. ప్రజల జీవితాలు, ఆరోగ్యంపై దెబ్బతీయుడం దారుణం. వుద్యం వూఫియూను శిక్షించే ప్రయుత్నాలు చంద్రబాబు ఏనాడూ చేయులేదు. అక్రవు వుద్యం ఏరులై పారుతోందని చెప్పి.. ఎన్నికల హామీని తుంగలోకి తొక్కి.. వుద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబుకు బెల్టు షాపులపై వివుర్శ చేసే అర్హత కూడా లేదు. - పశ్య పద్మ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -
ఆ పాపం బాబుదే
ఎన్టీఆర్ ఆశయానికి తూట్లు పొడిచి నిషేధాన్ని ఎత్తేశారు ఆనాడు ఎంత వద్దన్నా వినిపించుకోలేదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే డా.వెంకటేశ్వర్రావు ‘‘చంద్రబాబునాయుుడు మద్య నిషేధాన్ని ఎత్తివేసి గ్రామాల్లోచిచ్చు పెట్టారు. టీడీపీ ఆవిర్భావం, ప్రజల్లో వచ్చిన ఆదరణకు ప్రధాన కారణం మూడు అంశాలే. ఒకటి రెండు రూపాయలకు కిలో బియ్యం, మరోటి సంపూ ర్ణ మద్య నిషేధం, ఇంకోటి రూ.50కి పేదలకు ఉచిత విద్యుత్. కానీ... ఈ మూడింటికీ చంద్రబాబు పాలనలో చరమగీతం పాడారు. దీనికోసం పార్టీలోని సిన్సియర్ లీడర్లను దూరం చేసుకున్నారు. అన్నగారు ఉన్నప్పుడు నిషేధం కచ్చితంగా అమల్లో పెట్టారు. చాలా ఇబ్బందులు, ఒత్తిళ్లు వచ్చినా.. సారా దుకాణాలను రద్దు చేశారు. సరిగ్గా 1995 జనవరి 16న మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాత సీఎం పీఠం కోసం వైస్రాయ్ హోటల్ నుంచి చక్రం తిప్పిన చంద్రబాబు.. 1995 సెప్టెంబర్ 1న కుర్చీ ఎక్కారు. అప్పటి నుంచి మద్యం వ్యాపారులు, సారా కాంట్రాక్టర్లు బాబుగారి కోటరీలో చేరిపోయారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేతబట్టుకుని అన్నగారి ఆశయాలన్నీ బురదలో పోశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మద్యం సరఫరాపై కాంట్రాక్టర్లు, వ్యాపారులకు చాటుమాటుగా అవకాశం కల్పించారు. చివరికి 1997 జూలై 7న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సరిగ్గా 12 రోజుల ముందు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి నేను కూడా వెళ్లా. ఆ మీటింగ్‌లో నేనొక్కడినే చాలా వాదించాను. నిషేధాన్ని ఎత్తి వేయరాదని చెప్పా. కానీ... నన్ను బయటకు వెళ్లాలన్నట్లుగా పరిగణించారు. ఆ తర్వాత నిషేధం ఎత్తివేస్తున్నారని తెలియగానే చంద్రబాబుకు దాదాపు 4 పేజీల లేఖ రాశా. దీంతో నన్ను పార్టీలో వ్యతిరేకుడిగా చూశారు. నాకు మళ్లీ టికెట్ కూడా ఇవ్వలే. టికెట్ కోసం వెళ్తే కూడా పట్టించుకోలేదు. మద్య నిషేధం ఎత్తివేశాక.. ఊరూరా వుద్యాన్ని విచ్చలవిడిగా దొరికేలా చేశారు. బెల్ట్ దుకాణాలకు పర్మిషన్ ఇప్పించారు. ఇప్పుడు మద్యం ప్రతీ ఊళ్లో దొరికేందుకు ఆద్యుడు అక్షరాలా నూటికి నూరుపాళ్లు చంద్రబాబే కారణం. -
మహిళల ఉసురు బాబుకు తగులుతుంది
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, మద్య నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబునాయుడే. ఏరులై పారుతున్న మద్యానికి కుటుంబ పెద్దలు బానిసలయ్యారు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. 30 శాతం మహిళలు అనాథలుగా మారారు. వారి తల్లి, బిడ్డల ఉసురు బాబుకు తగలక మానదు. ఎన్టీఆర్ చేతుల నుంచి అధికారం లాక్కొని రైతులకు ఇచ్చే కరెంటును కూడా దూరం చేసిన ఘనత బాబుకే దక్కింది. కరెంటు ఇవ్వాలని అడిగిన పాపానికి అన్నదాతలపై కాల్పులు జరిపించి తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో రైతుల సంక్షేమానికి పాటుపడతానని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. బీజేపీ చెంత చేరి దేశంలో చక్రం తిప్పుతానని పగటి కలలు కంటున్నాడు. కాంగ్రెస్ కూడా మద్యం అమ్మకాలను యథేచ్ఛగా ప్రోత్సహిస్తోం ది. కేవలం మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే పాలన కొనసాగించే స్థాయికి కాంగ్రెస్ సర్కారు దిగజారడం సిగ్గుచేటు. మద్య నిషేధాన్ని అమలు చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలను కలిపి ఓడించాలి. - మల్లు స్వరాజ్యం, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలు -
....ఏరులు పారించారు
ఊరూ వాడా బెల్టు షాపులు పెట్టింది బాబు హయాంలోనే మద్యం వూఫియూకు పాలనలో చోటిచ్చిన ఘనుడు - వి. సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రగతిశీల వుహిళా సంఘం ‘వారుణివాహిని.. ఖజానాకు బంగారు బాతు..’ అని సాక్షాతు అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. సీసాల్లో ఉండే వుద్యం చిన్నపాటి ప్యాకెట్ల ద్వారా ఇంటింటికీ అందేలా చేసిందీ ఆ ప్రభుత్వమే. వుద్యం అవ్ముకాలపై టార్గెట్స్ నిర్ణరుుంచిందీ.. ఊరూవాడల్లో బెల్టు షాపులు పెట్టిందీ.. ఐఎంఎఫ్ఎల్ చీప్ లిక్కర్‌ను వూర్కెట్లోకి తెచ్చింది నాటి వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడి సర్కారే. చివరికి వుద్యం వూఫియూ నేరుగా ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకునే స్థారుుకి తీసుకొచ్చిన అపకీర్తిని వుూటగట్టుకున్నది చంద్రబాబే! అసెంబ్లీలోనే ఒప్పుకున్న బాబు అసెంబ్లీలో మద్యం వూఫియూ ఆగడాలపై చర్చ జరిగి నప్పుడు ప్రభుత్వం ప్రకటించిన బూట్‌లెగ్గర్స్ (అక్ర వు వుద్యం వ్యాపారి) జాబితాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబునాయుుడి తవుు్మడు, నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నారా రావుూ్మర్తినాయుుడికి కూడా వుద్యం వూఫియూతో సంబంధాలున్నారుు. అలాంటి వాళ్లపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోగా వాళ్లు ఎగిరెగిరిపడకుం డా లొంగదీసుకునేందుకు రాజకీయుంగా వాడుకున్నా రు. పాతిక సంవత్సరాలుగా వుద ్యం వూఫియూ రాజకీయూల్ని శాసిస్తోంది. మద్యం మాఫియా ఇది వరకు సినివూ, రియుల్ ఎస్టేట్, విద్యా వ్యాపారాలకు ఆర్థిక సాయుం చేసే స్థారుులో ఉండేది. రాజకీయుపార్టీల్ని ప్రభావితం చేసే స్థారుులో ఉండేది. క్రవుంగా చంద్రబాబునాయుుడి పాలనలో ఏకంగా విధాన నిర్ణయూల్లో జోక్యం చేసుకునే స్థారుుకి చేరింది. అంతకు వుుందే వుద్యం వుహవ్మూరికి ఎంతో వుంది బాని సలు కావడంతో గ్రామీణ వుహిళలు ఉద్యమించారు. కారం, చీపుళ్లు పట్టుకుని సారా దుకాణాల్ని ధ్వంసం చేశారు. దూబగుంటలోనే కాదు అనేక గ్రావూల్లో వుహిళలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారు. అప్పుడు వుద్య వ్యతిరేక పోరాట కమిటీలో టీడీపీ లేదు. వావుపక్షాలు, పీవోడబ్ల్యూ వంటి సంస్థలతో కమిటీ పనిచేసింది. ఉద్యవూన్ని సొవుు్మ చేసుకున్న టీడీపీ 1993 అక్టోబర్ 2న హైదరాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల వూలలు వేసేందుకు ప్రతిపక్ష నాయుకుడి హోదాలో ఎన్టీ రా వూరావు, ఆయున వెంట నారా చంద్రబాబునాయుుడు వస్తే అడ్డుకున్నాం. టీడీపీకి కూడా వుద్యం వూఫియూతో సంబంధాలు ఉన్నారుు. రేపు వుళ్లీ అధికారంలోకి వచ్చినా టీడీపీలో వూర్పేమీ ఉండదనే ఉద్దేశంతో అడ్డుకున్నాం. ప్రతిపక్ష నాయుకుడ్ని కూడా ఉద్యవుం లోకి రానీయురా.. గాంధీ విగ్రహానికి దండ వేయునీయురా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. వారుణివాహిని పేరుతో సారాను ప్యాకెట్ల ద్వారా విచ్చలవిడిగా వుద్యం వినియోగంలోకి తేవడమే కాకుండా వారుణివాహిని ప్రభుత్వ ఖజానాకు బంగారు బాతు.. అని అసెంబ్లీలో చెప్పుకున్నారు. మీరు గాంధీ విగ్రహానికి దండ వేయుడానికి వీల్లేదు.. అని బదులిచ్చాం. ఎన్టీ రావూరావుకు బాగా కోపం వచ్చింది. మీకు ఏం కావాలో చెప్పండి.. అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ వుద్య నిషేధం అవులు చేయూలన్న డివూండ్ ఆయున వుుందు పెట్టగానే అందుకు ఎన్టీఆర్ అంగీకరించాకే గాంధీ విగ్రహానికి దండ వేశారు. ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ దండ వేశాక సీఎం కోట్ల విజయుభాస్కరరెడ్డి గాంధీ విగ్రహానికి దండ వేయుకపోతే ప్రతిష్ట దెబ్బతింటుందని పోలీసులు భావించి పెద్ద ఎత్తున లాఠీచార్జి చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వుద్యం వ్యతిరేక ఉద్యవూన్ని రాజకీయుంగా అందివచ్చిన ప్రతి వేదికపైనా వాడుకుంది. పన్ను పోటు పొడిచి.. ఆపై వుద్యం ఏరులైపారించి.. అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ హెల్త్ పర్మిట్లు మినహా సం పూర్ణ వుద్య నిషేధం ఫైలుపై తొలి సంతకం చేశారు. వెన్నుపోటుదారుడు చంద్రబాబునాయుుడు అడ్డదారిలో సీఎం పగ్గాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయున కంటే తనకే వుద్యనిషేధంపై ఎక్కువ చిత్తశుద్ధి ఉందని చెప్పుకుని నాటకాలు ఆడారు. వుద్యం హెల్త్ పర్మిట్లను సైతం రద్దు చేశారు. సంపూర్ణ వుద్య నిషేధం వల్ల రోడ్డు ప్రవూదాలు తగ్గారుు. జనం కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. జనం జీవన ప్రవూణాలు మెరుగుపడ్డారుు.. అని తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. హెల్త్ పర్మిట్లు రద్దు చేసిన కొద్ది రోజులకే దశలవారీగా వుద్యానికి ద్వారాలు తెరిచేందుకు చంద్రబాబు చకచకా పావులు కదిపారు. దశలవారీగా వుద్య నిషేధాన్ని సడలించుకుపోయూరు. అప్పటికే వుద్యనిషేధం కారణంగా రాష్ట్ర ఆదాయుం పడిపోరుుందని చెప్పి జనంపై వేల కోట్ల రూపాయుల మేరకు మోపిన పన్నుల భారాన్ని వూత్రం యుథాతథంగా వసూలు చేరుుంచారు. బార్లకు తలుపులు బార్లా తీశారు. బ్రూవరీస్‌కు కూడా అనువుతులు ఇచ్చేశారు. ఇక్కడ వుద్యం ఉత్పత్తులు ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు చేసి ఆ మేరకు వుద్యంబాబుల నుంచి వసూళ్లు చేశారు. ఇలా చేసిన వాళ్లల్లో కిరణ్‌కువూర్‌రెడ్డి కూడా ఉన్నారు. మద్యం అవ్ముకాలకు టార్గెట్లు: వుద్యం అవ్ముకాలకు టార్గెట్లు నిర్ణరుుంచిన చంద్రబాబు అందుకోసం పల్లెలకు, వాడలకు కూడా వుద్యం అందుబాటులో ఉండేలా బెల్ట్ షా పులు పెట్టడంతో జనంలో వుళ్లీ వ్యతిరేకత వచ్చింది. వుద్యం వుహవ్మూరికి ఎంతోవుంది యుువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారుు. గ్రావూల్లో 35-50 వుధ్య వయుస్కుల చావులు పెరిగారుు. బతికి ఉన్నా వుద్యం తాగడం తప్ప ఏ పనీ చేయులేని నిస్సహాయుతతో కాలం వెళ్లదీస్తున్నారు. గ్రావూల్లో యుువ వితంతువుల సంఖ్య పెరుగుతోంది. వారితోబాటు తాగుబోతులతో బతుకువెళ్లదీయులేక ఒంటరి జీవితం గడుపుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. విం తువుల్లో 36 శాతం వుంది ఇలాంటి వారే ఉన్నారంటే వుద్యం ఎంతగా ప్రతికూల ఫలితాలిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ప్రభుత్వం వుద్యం ఏరుల్లా పారించి భర్త ప్రాణాలు పోయేలా చేసి వురో పక్క వితంతువులకు పింఛన్లు ఇవ్వడవుంటే ఎంత దుర్మార్గమో చెప్పడానికి వూటలు రావడం లేదు. ఒకప్పుడు ఆదివాసీలు కల్లు, విప్పసారా తాగేవారు. ఇప్పుడు సర్కార్ పుణ్యవూని అక్కడ కూడా బెల్టు షాపులు ప్రత్యక్షం అయ్యూరుు. వ్యభిచారకూపంలో కూరుకుపోరుున 38 వుందికి వివుుక్తి కలిగినప్పుడు వారిని విచారిస్తే అందులో పన్నెండు వుంది భర్తలు తాగి హింసకు గురిచేయుడం వల్లే ఆ వూర్గంలో ఉన్నారని తేలింది. వురోసారి 125 వుందికి వివుుక్తి లభిస్తే, భర్త తాగడం వల్ల తవు కుటుంబం, పిల్లల పోషణ కోసం గత్యంతరం లేకే ఈ దారికి వచ్చావుని చెప్పా రు. చంద్రబాబు పాలనలో వుద్యం ఏరులై పారడంతో వుళ్లీ జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తే, ఈసారి కాంగ్రెస్ సొవుు్మ చేసుకునే ప్రయుత్నం చేసింది. దశలవారీగా వుద్యనియుంత్రణ చేస్తావుని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా చేసిం ది. ఉపాధి కూలీల సొవ్ముంతా వుద్యం కొనుగోళ్ల ద్వారా తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరింది. జేబులో పెట్టుకునేంత చిన్న సైజు సీసాల్లో వుద్యం వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వ బలహీనతల్ని సొవుు్మ చేసుకుని ఖజానాను నింపుకునే నేతల్ని, రాజకీయుపార్టీల్నీ వుహిళలు నిలదీయూలి. -
సారాసురులు
ఎన్టీఆర్ విధించిన మద్య నిషేధానికి తూట్లు నిషేధమెందుకంటూ ‘ఈనాడు’ వార్తలు.. నిషేధముంటే వృద్ధి అసాధ్యమన్న బాబు ప్రజల కోసమంటూ మద్య నిషేధం ఎత్తివేత బెల్టు షాపులతో ఊరూరా మద్యం తప్పుడు రాతలతో కల్లుగీ కార్మికుల పొట్ట కొట్టిన ‘ఈనాడు’ టీడీపీ నేతల చేతికి గౌడ సంఘాలు...అప్పటి నుంచే కల్తీ కల్లు స్వైరవిహారం తమ పాపాన్ని వైఎస్‌కు అంటగట్టేందుకు రామోజీ కుయుక్తులు 1995 సెప్టెంబర్ 1. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికి ఏడు నెలలుగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం కచ్చితంగా అమలవుతోంది. కానీ మద్యం ముడుపుల మత్తులో చంద్రబాబు, తన హోటళ్ల వ్యాపార అవసరాల కోసం ‘ఈనాడు’ రామోజీ... కలిసికట్టుగా మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. సజావుగా సాగని నిషేధం అవసరమా అనే సన్నాయి నొక్కులతో సంపాదకీయాలు... కల్తీ కల్లుతో జనారోగ్యం కుదేలవుతోందంటూ పతాక శీర్షికల్లో బూటకపు వార్తలు... ఇలా నెలల తరబడి పథకం ప్రకారం ‘ఈనాడు’లో రోత రాతలు రాయడం ద్వారా రామోజీ రంగం సిద్ధం చేశారు. బాబు కూడా తనవంతుగా, ‘మద్యనిషేధంతో ఖజానా బక్కచిక్కిపోతోంద’ంటూ మొసలి కన్నీళ్లతో నాటకాన్ని రక్తి కట్టించారు. అందులో భాగంగా, ‘‘మద్యనిషేధం, సబ్సిడీ బియ్యం రెండూ అమల్లో ఉండే పక్షంలో అభివృద్ధి అసాధ్యం’’ అంటూ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ప్రజా వ్యతిరేకి చంద్రబాబు! మొత్తానికి రాజగురువుతో కలిసి నెలల తరబడి నాటకం నడిపిన అనంతరం మద్య నిషేధాన్ని బాబు అటకెక్కించారు. అది కూడా అలా ఇలా కాదు. ఏకంగా మద్య మహా ప్రవాహానికే గేట్లెత్తేశారు. అందుకోసం బెల్టుషాపులు అనే నయా కాన్సెప్టుకు తెర తీశారు. ఒక్క లెసైన్సుపై ఎన్నో మద్యం షాపులు తెరిపించిన ‘మార్గదర్శి’గా చంద్రబాబు. ఆయన పుణ్యమా అని రాష్ట్రంలో ఊరూరూ, వాడవాడలా మద్యం దుకాణాలు వెలిశాయి. అలా అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌ను కాస్తా మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసిన ఘనుడు చంద్రబాబు. రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పే వాస్తవమిది. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ రాజ గురివింద, నారా బాబు షరామామూలుగా నానా రకాల నాటకాలకు తెర తీస్తున్నారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిన చందంగా, తామిద్దరికి మాత్రమే సంయుక్తంగా చెందే మద్య ప్రవాహం తాలూకు పాపాన్ని దివంగత నేత వైఎస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆశించిన ప్రయోజనాలు సాధించకపోగా, ఖజానాకు చేటు చేస్తున్న మద్య నిషేధం అవసరమా?’ అని నాడు బాబు తరఫున వకాల్తా పుచ్చుకుంటూ ప్రశ్నించిన తన పత్రికలోనే... ‘పేదింటి కాపురాలు కూల్చి ప్రభుత్వం ఖజానా నింపుకోవాలా?’ అంటూ వైఎస్ పాలనను ఉద్దేశించి నేడు నంగనాచి రాతలు రాస్తున్న నయ వంచకుడు రామోజీ. ఇది చాలదన్నట్టు కల్తీ కల్లు పాపాన్ని కూడా దివంగత నేతకు అంటగట్టేందుకు ప్రయత్నించడం దారుణాలోకెల్లా దారుణం. నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి నిషేధించింది... రాజధానిలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న కల్తీ కల్లును. తద్వారా ఎందరో అమాయకులు కల్తీ కల్లు బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడిన నాయకుడాయన. తన హయాంలో కల్లు సొసైటీలపై అస్మదీయులకు పెత్తనం కట్టబెట్టి, విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయించి ప్రజల ఉసురు తీసిన పాపాత్ముడు నారా బాబు. ఈ వాస్తవాలకు మసి పూసి, తన తాబేదారు బాబు చేసిన పాపాలన్నింటినీ వైఎస్‌కు అంటగట్టేందుకు రామోజీ పడుతున్న పాట్లు జనానికి రోత పుట్టిస్తున్నాయి. ‘చంద్రబాబు. లిక్కర్ లాబీ. ఈనాడు రామోజీ 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్ర గమనాన్ని మార్చిన శక్తులివి. వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. ఆ కత్తిని కొనిచ్చింది లిక్కర్ లాబీ. దాన్ని బాబుకు అందజేసింది రామోజీ. రామోజీ చేసిన ధ్వంస రచనను బాబు తూచా తప్పకుండా అమలు చేశారు. అందుకవసరమైన సొమ్మును లిక్కర్ లాబీ సమకూర్చింది. అలా రాష్ట్రంలో మద్య నిషేధం కఠినంగా అమలవుతున్న వేళ అందుకు కారకుడైన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి బాబు గద్దెనెక్కారు. పథకం ప్రకారం... ఏడాదిన్నర కూడా గడవక ముందే లిక్కర్ లాబీయింగ్ ఒప్పందాన్ని అమలు చేశారు. ‘మద్య నిషేధం, సబ్సీడీ బియ్యం పథకాలుంటే ఇక రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుకునే పనే ఉండదు. బడ్జెట్ డిమాండ్లపై చర్చ కూడా అనవసరమే’ అంటూ 1997 ఫిబ్రవరి 26న అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వాఖ్యలను ‘ఈనాడు’ అందిపుచ్చుకుంది. పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసిపారేంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ కల్లు పెరిగిపోతోందంటూ చెలరేగింది. అలా గౌడ సంఘాల నోట్లో మట్టికొట్టింది. మద్యం మాఫియా అక్రమ లిక్కర్‌తో రాష్ట్రంపైకి ఎత్తి వస్తోందంటూ భయపెట్టింది. నిషేధాన్ని ఎత్తేయకపోతే రాష్ట్రంలో ఏదో ఘోరం జరుగబోతోందంటూ ఆరు నెలల పాటు హైడ్రామా నడిపింది. నిషేధాన్ని వ్యతిరేకించిన విపక్ష ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా సస్పెండ్ చేసి మరీ మద్య నిషేధానికి బాబు విజయవంతంగా మంగళం పాడారు. ఆ తరవాత వినాశనమే... ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేశాక రాష్ట్రాన్ని లిక్కర్ లాబీకి అక్షరాలా దోచిపెట్టారు బాబు. 1998లో ఒక వివాదాస్పద జీవో (ఎల్ఆర్ఎల్ నెంబర్ 25967/ఈఎక్స్111-1/98 నంబర్) తెచ్చారు. మద్యం కంపెనీల యాజమాన్యాలకు పొరుగునున్న తమిళనాడు కంటే 16 శాతం ధర అదనంగా చెల్లించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. ఆ కారణంగా 1998-2000 మధ్య రెండేళ్లలోనే ఖజానాకు రూ.600 కోట్లు గండి పడ్డట్టు విజిలెన్స్ నిగ్గుదేల్చి బాబు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం డబ్బును మూడు లిక్కర్ కంపెనీలకు దోచి పెట్టినట్లు కూడా విజిలెన్స్ పసిగట్టింది. ‘‘పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఫుల్ బాటిల్ మీద ఏకంగా రూ.500 దాకా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) నిర్వాకం మూలంగా ప్రభుత్వం ఏటా అదనంగా రూ.356 కోట్లను ప్రైవేటు డిస్టిలరీకి చెల్లించింది. అలాగాక మద్యాన్ని తమిళనాడులో అక్కడి ధరలకు కొనుగోలు చేసి, రాష్ట్రంలో ఉన్న ధరలకు అమ్మితే రూ.300 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది’’ అని తెలపింది. ఈ మద్యం కుంభకోణంపై విపక్షాలన్నీ నిలదీసినా, న్యాయ విచారణకు డిమాండ్ చేసినా బాబు ఖాతరు చేయలేదు. అంతేకాదు... విచిత్రంగా చంద్రబాబు అధికారం కోల్పోయే ముందు, అంటే 2003లో ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైలును బాబు సర్కారు అధికారికంగానే తగలబెట్టించింది. 1998లో జరిగిన ఆ మద్యం కుంభకోణంపై వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2005లో విచారణ చేపట్టగా ఈ విషయం వెలుగు చూసింది. కుంభకోణానికి సబంధించిన ఫైలు వివరాలు అందించాలన్న వైఎస్ ఆదేశాల మేరకు అధికారులు 60 రోజుల పాటు వెదికి, చివరకు అసలు విషయం తెలుసుకొని నోరెళ్లబెట్టారు. మద్యం క్రయవిక్రయాలకు సంబంధించి కనీసం కనీసం నోట్ ఫైల్ కూడా లేకుండా చంద్రబాబు అధికారికంగానే వాటిని తగలబెట్టించినట్టు రికార్డు రూము అధికారులు లిఖతపూర్వకంగా రాసివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. 1998 నుంచి 2003 వరకు మద్యం టెండర్లు, ధరల నిర్ణయాలను ముఖ్యమంత్రి అయిన బాబే స్వయంగా చూసుకున్నారు. మద్యం మార్కెట్లో ఎక్కువ శాతం అమ్మకాలున్న రాష్ట్రానికి చెందిన ఓ మూడు కంపెనీలు మాత్రమే టెండర్లలో పాల్గొనటానికి వీలుగా, టెండర్లలో రాష్ట్ర కంపెనీలే పాల్గొనాలనే నిబంధన పెట్టారు. వైఎస్ వచ్చాక దాన్ని ఎత్తేశారు. పారదర్శకంగా ఎవరైనా టెండర్లలో పాల్గొన వచ్చనే నిబంధన అమల్లోకి తెచ్చారు. ‘బెల్టు’ పెట్టి.... కల్లును ముంచి... 1998కి ముందు రాష్ట్రంలో మద్యం దుకాణాలు పరిమితంగానే ఉండేవి. మండలానికి ఒకటి, లేదా రెండు మండలాలకు 3 చొప్పున దాదాపు 3,000 మద్యం దుకాణాలుండేవి. అవి తమకు దూరంగా ఉండటం వల్ల కూడా కావచ్చు... గ్రామీణులు మద్యంపై పెద్దగా ఆసక్తి చూపేవాళ్లు కాదు. దాంతో దాని అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేవి. దాంతో లిక్కర్ లాబీ రంగంలోకి దిగింది. గ్రామాల్లో సర్వే చేసింది. మద్యం తమ పొలిమేరల దాకా రావడం లేదు కాబట్టే అమ్మకాలు పెరగడం లేదనే అంచనాకు వచ్చింది. ఊరూరా చిన్న చిన్న మద్యం దుకాణాలు పెట్టి వీలైనంతగా అమ్ముకోవాలని ప్లాన్ వేసింది. కానీ గ్రామీణుల కల్లు అలవాటు అందుకు అడ్డంకిగా మారింది. అప్పట్లో ప్రతి గ్రామంలో 2,000 నుంచి 5,000 వరకు తాటి చెట్లుండేవి. ఎన్టీఆర్ కూడా గౌడ సంఘాలను ప్రోత్సహించారు. గీత కార్మికులకు ఐదు ఎకరాల స్థలమిచ్చి తాటి, ఈత వనాల పెంపకాన్ని పోత్సహించారు. ‘గీసేవాడిదే చెట్టు’ నినాదాన్ని అమలు చేశారు. కాబట్టి జనానికి మద్యం అలవాటు చేయలంటే ముందుగా కల్లును చావుదెబ్బ తీయాలి. అందుకు లిక్కర్ లాబీ, రామోజీ, చంద్రబాబులతో కూడిన దుష్ట త్రయం పక్కాగా ఎత్తు వేసింది. కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చిదంటూ ప్రచారం చేయాలన్న సూత్రాన్ని అమలు చేశారు. కల్లుపై ‘కల్తీ’ అంటూ ముద్ర వేశారు. ఎక్సైజ్ అధికారులను గౌడ సంఘాలపైకి బాబు ఉసిగొల్పి కల్తీ కల్లు కేసులు పెట్టించడం... మర్నాడే ‘ఈనాడు’ దాన్ని పతాక శీర్షికన ప్రచురించడం... ఇదీ వరస. ఇంకేముంది? నెల తిరక్కముందే కల్లుపై విష ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో మద్యం లాబీ గ్రామాలపై పడింది. ఊరూరా చిన్న చిన్న దుకాణాలు పెట్టి మద్యం అమ్మించింది. వీటినే చంద్రబాబు ముద్దుగా బెల్టు దుకాణాలని పిలిచారు. వాటి పుణ్యాన మద్యం విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎంతగా అంటే... 1999-2000 ఎక్సైజ్ సంవత్సరంలో రూ1,500 కోట్లున్న మద్యం విక్రయాలు బెల్టు దుకాణాల రాకతో ఒక్కసారిగా రూ.3,000 కోట్లకు చేరాయి! కేవలం మూడేళ్ల కాలంలో దాదాపు 70 శాతం మంది గ్రామీణులు మద్యం మహమ్మారికి బానిసలుగా మారారు! -
గ్యాంగ్ లీడర్లు...
రాజకీయ నేతలుగా మారిన దాదాపు డజను మంది డాన్లు (స్థానికంగా వారిని బాహుబలి అంటారు) బీహార్ ఎన్నికల బరిలో ఉన్నారు. వారే కాదు కొందరు డాన్ల భార్యలు, గ్యాంగ్‌వార్‌లలో చనిపోయినవారి భార్యలు కూడా ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ పప్పూయాదవ్ ఆర్జేడీ తరఫున మాధేపుర నుంచి జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌పై పోటీ చేస్తున్నారు. సీపీఎం నేత అజిత్‌సర్కార్‌ను హత్య చేసిన కేసు నుంచి ఇటీవలే ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. పప్పూయాదవ్ భార్య, మాజీ ఎంపీ రంజిత రంజన్ కూడా కాంగ్రెస్ టికెట్‌పై సుపాల్‌నుంచి బరిలో ఉన్నారు. పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి మొహమ్మద్ తస్లీముద్దీన్ ఆర్జేడీ టికెట్‌పై అరారియా నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులున్న వారికి టికెట్లివ్వడంలో ఆర్జేడీనే ముందుంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవించినవారి తరఫున వారి భార్యలు పోటీలో దిగారు. ఇలాంటి వారు బీహార్ లోక్‌సభ బరిలో దాదాపు ఆరుగురున్నారు. శివహర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రమాదేవి.. ప్రత్యర్ధుల దాడిలో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్‌బిహారీ ప్రసాద్ భార్య. ఓ క్రిమినల్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆనంద్‌మోహన్ భార్య లవ్లీ ఆనంద్ కూడా శివహర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. -
యూపీలో ‘పవర్’ పాలిటిక్స్...
పాలిటిక్స్ అంతా ‘పవర్’ కోసమే కదా అనుకుంటున్నారా..? నిజమే! ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ‘పవర్’కి పాలిటిక్స్‌కి ఉన్న లింకే వేరు. రాజకీయ హేమాహేమీల రాష్ట్రమైన యూపీలో ఏటా దాదాపు మూడోవంతు విద్యుత్తుకు ఎలాంటి బిల్లులూ ఉండవు. విద్యుత్‌చౌర్యం ఇక్కడ చాలా మామూలు. యూపీలో విద్యుత్ నష్టాలకు సాంకేతిక, ఆర్థిక కారణాలే కావు, రాజకీయ కారణాలూ ఉన్నాయి. మిచిగాన్ వర్సిటీ ఈ అంశంపై నిర్వహించిన అధ్యయనంలో ‘పవర్’ పాలిటిక్స్ గురిం చి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఏం తేలిందంటే.. యూపీలో 1970-2010 కాలంలో 29 శాతం విద్యుత్తుకు ఎలాంటి బిల్లులూ వసూలు కాలేదు. కొన్నేళ్లుగా ఎన్ని సంస్కరణలు తెచ్చినా, విధానాల్లో మార్పులు తెచ్చినా పరిస్థితి మరింత దిగజారిందే తప్ప ఎలాంటి మార్పు లేదు. రాజకీయ కుటుంబాలు ఎక్కువగా ఉండే యూపీ పశ్చిమ ప్రాంతంలోనే అత్యధికంగా విద్యుత్ సరఫరా నష్టాలు నమోదయ్యాయి. హత్రాస్, మెయిన్‌పురి జిల్లాల్లో ఏకంగా 50 శాతం విద్యుత్తు సరఫరాలోనే నష్టపోవడం లేదా బిల్లులు వసూలు కాకపోవడం జరిగింది. దీనికి భిన్నంగా బహుళజాతి కంపెనీలు ఎక్కువగా ఉన్న గౌతమబుద్ధనగర్ ప్రాంతంలో అత్యల్పంగా 13.8 శాతం విద్యుత్తు నష్టాలు మాత్రమే నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మీటర్లు అమర్చకుండా ఫ్లాట్‌రేటు పద్ధతిలో బిల్లులు వసూలు చేయడం కూడా నష్టాలకు కారణమవుతోంది. ఎన్నికలకు ముందు గ్రామాలకు రోజుకు 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగేది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో 18 గంటలకు పైగా సరఫరా జరుగుతోంది. గ్రామాలకు విద్యుత్ సరఫరా పెరిగినా, వసూలవుతున్న బిల్లుల మొత్తాలు మాత్రం యథాతథంగానే ఉంటున్నాయి. యూపీలో రాజకీయ దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో, ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు అలహాబాద్ హైకోర్టులో విచారణలో ఉంది. ఓట్లు రాబట్టుకునేందుకు, తమ తమ ప్రాంతాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రాజకీయ నేతలు విద్యుత్తును సాధనంగా ఉపయోగించుకుంటున్నారని మిచిగాన్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రియాన్ మిన్ చెబుతున్నారు. -
అమెరికా తర్వాత మనమే..
ఎన్నికల ఖర్చు రూ.30 వేల కోట్లు... ఈసారి లోక్‌సభ ఎన్నికలకు రూ.30 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ మేరకు ఖర్చు చేయనున్నారు. రెండేళ్ల కిందట జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 700 కోట్ల డాలర్లు (సుమారు రూ.42 వేల కోట్లు) ఖర్చు కాగా, ఎన్నికల ఖర్చులో అమెరికా తర్వాతి స్థానం మనదే. లెక్కలకు చిక్కని భారీ సొమ్ము ఎన్నికల కోసం ఖర్చయ్యే అవకాశాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెబుతోంది. కోటీశ్వరులైన అభ్యర్థులు ఎన్నికల్లో భారీ ఎత్తున సొమ్ము వెదజల్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఖర్చుగా అంచనా వేసిన మొత్తం రూ.30 వేల కోట్లలో ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.7 వేల నుంచి రూ.8 వేల కోట్ల దాకా వెచ్చించాల్సి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ రూ.3,500 కోట్లు ఖర్చు చేయనుంది. ఎన్నికల సమయంలో భద్రత, రవాణా వంటి అవసరాల కోసం హోంశాఖ, రైల్వే శాఖలు కూడా దాదాపు ఎన్నికల కమిషన్ స్థాయిలోనే ఖర్చు చేయనున్నాయి. అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని రూ.70 లక్షలకు పెంచడం వల్ల కూడా ఈసారి ఎన్నికల ఖర్చు మొత్తం రూ.30 వేల కోట్లు దాట వచ్చనే అంచనాలు ఉన్నాయి. లోక్‌సభ బరిలోని 543 స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులు దాదాపు రూ.4 వేల కోట్ల మేరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు అభ్యర్థుల కంటే, వారిని బరిలోకి దించిన రాజకీయ పార్టీలే ఎక్కువగా ఖర్చు చేసేవి. ఇటీవల కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. కొన్నిచోట్ల పార్టీల కంటే భారీగా అభ్యర్థులే ఖర్చు చేస్తున్నారు. ఈ సొమ్మంతా కోటీశ్వరులైన అభ్యర్థులు, కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి వచ్చి పడుతోందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెబుతోంది. -
తెలంగాణలో తెల్లముఖమే
పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన టీడీపీ ఎదురీదుతున్న అభ్యర్థులు బాబు రోజుకోజిల్లా తిరిగినా ఫలితం శూన్యం తెలంగాణలో పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. నేటితో ఎన్నికల ప్రచారానికి కూడా తెరే! కానీ, గెలుపు ధీమా లేకపోయినా... ఉనికినైనా నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో బరిలోకి దిగిన తెలుగుదేశం అభ్యర్థులు మాత్రం పోలింగ్‌కు రెండు రోజుల ముందే చేతులెత్తేశారు.చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ కాళ్లకు బలపాలు కట్టుకుని జిల్లాల్లో తిరిగినా, సినీ మోజు మురిపిస్తుందనే ఆశతో పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించినా వీసమెత్తు కూడా ప్రయోజనం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలంగాణవాదం ముందు బాబు చెప్పే కబుర్లు జనం నెత్తికెక్కలేదంటున్నారు. స్థానిక పరిస్థితులు, ప్రచార సరళి, బట్టి చూస్తే తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తున్న 72 సీట్లలో ఏకంగా 50 పైచిలుకు చోట్ల మూడో స్థానానికే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పని చేయని అగ్ర నేతల ప్రచారం హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం చేసినా, బాబు, లోకేశ్ రోజుకో జిల్లా తిరిగినా ఓటర్లు వారిని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆదిలాబాద్ పర్యటనలోనైతే బాబుపై కోడిగుడ్లతో దాడికే ప్రయత్నిం చారు. పవన్ పర్యటనలకు జనం వచ్చినా ఆయన ప్రసంగాల్లో స్పష్టత, గానీ జోష్ గానీ లేక వెనుదిరిగారు. దాదాపుగా అన్ని చోట్లా టీడీపీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. పలుచోట్ల ఆశలు వదులుకుని ప్రచారాన్ని కూడా పక్కన పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘ఎన్టీఆర్ భవన్ (టీడీపీ ప్రధాన కార్యాలయం) నుంచి నిధులొస్తే ఏదో మా ఉనికి కాపాడుకోవడానికి డబ్బులు పంచి ప్రచారం చేస్తాం. లేదంటే మాత్రం ఈసారికింతే’ అనే ధోరణి టీడీపీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. పలుచోట్ల, ‘పార్టీని పక్కన పెట్టి, మమ్మల్ని చూసి ఓటేయండి’ అంటూ వారు ఓటర్లను ప్రాధేయపడుతున్నారు! అంతటా ఎదురీతే ఉత్తర తెలంగాణలోనే గాక గత ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించిన మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నూ ఈసారి టీడీపీ పూర్తిగా వెనకబడిపోయింది. మహబూబ్‌నగర్‌లో కొడంగల్, ఆలంపూర్లలో మాత్రమే కాస్త గట్టి పోటీ ఇస్తోంది. అందుకు పార్టీ కంటే కూడా వ్యక్తిగత, ఇతరత్రా కారణాలే పనిచేస్తున్నాయి. కొడంగల్‌ను టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఆలంపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అబ్రహంకు కలిసి రావచ్చ న్న అంచనాలున్నాయి. నిజామాబాద్‌లోని బాల్కొండలో మాత్రమే టీడీపీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డి కాస్త పోటీ ఇస్తున్నారు. అదిలాబాద్‌లో బోథ్ మినహా మిగతా వాటిల్లో టీడీపీకి మూడో స్థానమేనని తెలుస్తోంది.కరీంనగర్లోనైతే తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ సహా అభ్యర్థులందరికీ గడ్డు పరిస్థితే. గజ్వేల్, నారాయణఖేడ్లలో మాత్రమే కాస్త పోటీ ఇస్తోంది. వరంగంల్‌లో ములుగు, నర్సంపేట, పాలకుర్తి, పరకాలలో కాస్త పోటీలో ఉంది. ఖమ్మంలో టీడీపీ అభ్యర్థులు పూర్తిగా ఎదురీదుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ప్రజాదరణ అనూహ్యంగా పెరగడంతో చతుర్ముఖ పోటీలో టీడీపీ అభ్యర్థులు చమటోడుస్తున్నారు. ఖమ్మం, మధిర, వైరా, అశ్వరావుపేటల్లో మాత్రమే కాస్త పోటీ ఇస్తున్నారు. నామా, తుమ్మల వర్గ పోరు అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. నల్లగొండలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ హవాయే కొనసాగుతోంది. ఇక్కడ పరువు నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. రంగారెడ్డి అర్బన్ ప్రాంతంలోని ఏడు సీట్లలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ అభ్యర్థుల నుంచి టీడీపీ గట్టి పోటీ ఎదుర్కొం టోంది. ‘సీఎం అభ్యర్థి’ ప్రకటనఎల్బీ నగర్లో తన రాత మారుస్తుందేమోనని ఆర్.కృష్ణయ్య ఆశపడుతున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, మేడ్చల్, శేరిలింగంపల్లిల్లో పోటీ ఇవ్వకపోతామా అన్న భావన ఉంది. జిల్లాలోని రూరల్ స్థానాల్లో రెండో స్థానం కోసమే పోటీ పడుతోంది. పాతబస్తీలోని ఏడు సీట్లు ఎంఐఎం ఖాతాలోకేనని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్లలో చెమటోడుస్తున్నాయి. -
ఈసీ కళ్లు మూసి...
- అసెంబ్లీకి రూ.10 కోట్లు.. - పార్లమెంటుకు రూ.30 కోట్ల ఖర్చు - రాష్ట్రంలో సగటున ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చిది! - ఎన్నికల ఖర్చు అధికంగా చేసేది మన రాష్ట్రమే అభ్యర్థి ఎన్నికల ఖర్చును ప్రధానంగా మూడు భాగాలుగా చూడవచ్చు 1 ప్రచార పటాటోపం, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణ ఖర్చులు ఒక భాగం. అభ్యర్థి మొత్తం ఎన్నికల ఖర్చులో ఇది 15 శాతం దాకా ఉండవచ్చు. ఈ ఖర్చులో ఈసీకి చూపేది కొంత మాత్రమే. 2 గ్రామాల్లో వివిధ వర్గాల మూకుమ్మడి మద్దతు కూడగట్టేందుకు గుడి, చర్చి, మసీదు, కళ్యాణమండపం వంటి నిర్మాణాలు చేపట్టడం, లేదా అందుకవసరమైన డబ్బును గ్రామ పెద్దల వద్ద డిపాజిట్ చేయడం, గ్రామంలో బోర్లు వేయించడం, రోడ్లు నిర్మించడం వం టివాటికి తోడు గ్రామ స్థాయి నేతల అలకలు తీర్చడం వంటివాటికి చేసే ఖర్చు రెండో రకం. మొత్తం ఎన్నిల ఖర్చులో ఇది ఏకంగా 35శాతం దాకా ఉండవచ్చు. కానీ ఇది ఈసీ లెక్కల్లోకి అసలే రాదు! 3 ఇక ప్రధానమైన ఖర్చు పోలింగ్ రోజుకు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ! మొత్తం ఖర్చులో 50 శాతం దాకా ఉంటుంది. గత ఎన్నికల్లో కొన్నిచోట్ల ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 దాకా పంచిన దాఖలాలున్నాయి. ఈసారీ అదే పరిస్థితి ఉండొచ్చని పలు పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. పార్టీలకు, నేతలకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న పెట్టుబడిదారీ, వ్యాపార వర్గాల ప్రతినిధులు ఇప్పుడు నేరుగా రాజకీయ రంగప్రవేశం చేస్తుండటం వల్లే ఎన్నికల వ్యయం భారీ గా పెరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలక్షన్ సెల్ ఘుమఘుమలాడే, నోరూరుంచే బిర్యానీ కేవలం రెండు రూపాయలే. రుచికరమైన శాకాహార భోజనమైతే రూపాయే! ఇక గరం గరం చాయ్ కేవలం పావలా!! ‘ఎక్కడ? ఆ భూతల స్వర్గం ఎక్కడ?’ అంటున్నారా? ఆగండాగండి. ప్రచార వ్యయం విషయంలో ఎన్నికల సంఘం కళ్లు గప్పేందుకు అభ్యర్థులు చూపించే కాకి లెక్కలివి. ఇలాంటి విచిత్ర విన్యాసాలెన్నో గత ఎన్నికల్లో వెలుగు చూశాయి. ఆ దృష్ట్యా ఎన్నికల్లో ఖర్చును నియంత్రించేందుకు ఈసీ ఎన్ని కొత్త నిబంధనలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా అభ్యర్థులు కూడా అంతగా తెలివి మీరుతున్నారు. ఈసీ కళ్లుగప్పి ఈసారి కూడా కోట్లు గుమ్మరించేస్తున్నారు. ఈ విషయంలో దేశం మొత్తంలోనూ ఆంధ్రప్రదేశే ముందుంది! ఆంధ్రప్రదేశ్‌ను డబ్బు ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రంగా ఈసీ గుర్తించినా, ఆ మేరకు ప్రత్యేకంగా పలు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. తనిఖీల్లో ఇప్పటికే వందలాది కోట్లు పట్టుబడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అభ్యర్థులు ఈసీని కాకి లెక్కలతో ఏమారుస్తూ ఎడాపెడా ఖర్చుపెట్టేస్తున్నారు... ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల కోసం లోక్‌సభ అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షల కన్నా ఎక్కువగా ఖర్చు చేయకూడదు. అంతకు మించితే సదరు అభ్యర్థుల ఎన్నిక చెల్లదని ఈసీ హెచ్చరిస్తోంది. అనధికార అంచనాల మేరకు మన రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.10 కోట్లు, లోక్‌సభకైతే రూ.30 కోట్లు ఉంటోంది. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లోనైతే ఇది మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. గత ఎన్నికల్లో అధికారుల రొటీన్ తనిఖీల్లోనే ఏకంగా రూ.38 కోట్లు పట్టుబడ్డాయి. ఎన్నికల్లో పెరిగిపోతున్న డబ్బు ప్రాధాన్యతపై ఓ సీనియర్ నాయకుడు నిర్వేదం వెలిబుచ్చారు. ‘మాది ఒక రకంగా పులి మీద స్వారి వంటి వ్యవహారం. ఎవరూ ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాలని అనుకోడు. కానీ ఒకసారి బరిలో దిగాక అవతలి వాడు ఓటుకు వందిస్తే ఇవతలి వాడూ ఇవ్వక తప్పని పరిస్థితి’ అంటూ ముక్తాయించారు. -
ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయి
కోట్లాది తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ కొలువు {పజలు కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం ఆదుకుంది ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండడం కనీస బాధ్యత ఖమ్మం జిల్లా దశ, దిశను మార్చేందుకు ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు రికార్డులు తిరగరాసే రోజు త్వరలోనే ఉంది సీపీఎంతో ఎన్నికల అవగాహనతో వెళుతున్నాం నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైఎస్సార్ సీపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘సంక్షేమ పథకాలే ఆలంబనగా, పేదవారికి సేవే పరమావధిగా, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాలనకొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. వైఎస్ మరణంతో వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ వైఎస్సార్ పాలన లాంటి సువర్ణయుగం రావాలంటే అది ఆయన తనయుడు, పేద ప్రజల మనసెరిగిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే సాధ్యం. అందుకే ఆయన నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జగన్ ఆలోచనలు, ఆయన ఆశయాలు మేలు చేస్తాయి. పేదలకు పట్టం కడతాయి.’ అని అంటున్నారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పొంగులేటి గత రెండురోజులుగా జగన్ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ విశేషాలివి.... కూడు, గూడు, గుడ్డ కోసం పేదలు ఎంతగానో శ్రమిస్తారు. కుటుంబ పోషణకు కష్టపడతారు. అయితే, ఆ పేదవ్యక్తికి ఏదైనా అనుకోని ఆపద వస్తే పరిస్థితేంటి.. అనుకోకుండా ఏదైనా జబ్బు చేస్తోనో.. వేలు, లక్షల రూపాయులు చెల్లించి పిల్లలను చదివించాలంటే.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట విపత్తులతో కళ్లముందే పాడైపోతే.. ఇలా అన్ని విషయాలపై ఆలోచన చేసిన ఏకైక మఖ్యమంత్రి వైఎస్సార్. ఎంతోవుంది సీఎంలు అయ్యూ రు. కానీ జనం గురించి ఇంతగా ఆలోచించిన నాయకుడే లేరు. ప్రజాప్రస్థానం పాదయాత్రతో వైఎస్ పేదల కష్టాలు తెలుసుకోగలిగారు. అధికారంలోకి రాగా నే రైతు రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ అవులు చేశారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు భరోసా ఇచ్చారు. ఆయన పాలన లో పేదలు గుండెపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీకార్డు ఉందిలే... పిల్లల చదువులకు ఫీజు ఆ ముఖ్యమంత్రే కడతాడులే... రైతన్నను కూడా ఆదుకుంటాడులే అనే నమ్మకం ప్రజలందరిలోనూ ఉండేది. వైఎస్ కూడా ఇచ్చిన వూటకు కట్టుబడేవాడు. మడమ తిప్పేవాడు కాదు. అందుకే ప్రజలకు ఆయనపై విశ్వాసం, ప్రేమ. అప్పుడు పేదలను ఆదుకున్నందుకు.... చంద్రబాబు పాలనలో వరుస కరువు, కాటకాలు, హైటెక్ పాలనతో జనం అల్లాడారు. వైఎస్ వచ్చాక ప్రజలను సురక్షిత తీరాలకు చేర్చేందుకు చాలా కష్టపడ్డారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ తేడా లేకుండా కష్టంలో ఉన్న వారికి సేవ చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం కష్టాల్లో ఉంది. ఈ తరుణంలో పేదలంతా ఆ కుటుంబానికి అండ గా నిలవడం కనీస బాధ్యత. కచ్చితంగా వైఎస్‌కు నిజమైన వారసుడు జగనేనని ప్రజలు ఓట్లు ద్వారా నిరూపించబోతున్నారు. ఆ నమ్మకం మాకుంది. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన వారున్నారు. వారి ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాం. జన తెలంగాణ కావాలి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరుదశాబ్దాలుగా తెలంగాణ బిడ్డలు సాగించిన పోరాటం అద్వితీయమైనది. ఈ క్రమంలో సిద్ధించిన నూతన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలన్నదే వైఎస్సార్సీపీ ఆకాంక్ష. దీనికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తన పాలన సాగుతుందని జగన్ చెపుతున్నారు. సీమాంధ్రలో గెలిచి ముఖ్యమంత్రి అయినా తాను తెలంగాణ విడిచిపెట్టబోనని హామీ ఇస్తున్నారు. తన తండ్రి ఇచ్చి వెళ్లిన కుటుంబాన్ని వదులుకోబోనని ఆత్మీయత చూపెడుతున్నారు. అయితే దొరలు, విదేశీయుల పాలన కన్నా ప్రజలు ..తమను తాము పాలించుకునే తెలంగాణను చూడాలన్నది నా ఆరాటం. జన తెలంగాణ స్థాపన జరిగినపుడే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సార్థకత చేకూరినట్టు. అమరవీరుల స్వప్నం నెరవేరినట్టు. వైఎస్సార్సీపీ తెలంగాణలో క్రియాశీలకంగా పనిచేస్తుంద ని, కీలకపాత్ర పోషిస్తుందని గట్టిగా చెప్పగలుగుతున్నాం. మాది విభిన్న రాజకీయ పరిస్థితి ఖమ్మం జిల్లాలో రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది. రాజకీయంగా చైతన్యవంతులయిన ఈ జిల్లా ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు అనేక ప్రజాస్వామిక పోరాటాల్లో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఈ జిల్లాలో రాజకీయంగా ఎదగడం కత్తిమీద సాము లాంటిదే. వైఎస్‌పై ఉన్న అభిమానం, అనురాగంతో పాటు రైతులపై ఉన్న వాత్సల్యం నన్ను రాజకీయాల వైపునకు మళ్లించింది. రైతులకు, పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఓ వైపు పార్టీని నడిపిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై పోరాడాను. జిల్లాలో విస్తృతంగా పర్యటించాను. ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నా. వారిలో ఒకడిగా ఇమిడిపోయా. ఇప్పుడు అందరూ ఆప్యాయంగా నన్ను శీనన్న అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటోంది. ఎంత కష్టపడ్డా శ్రమ అనిపించడం లేదు. వీరందరికీ సేవ చేసే భాగ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా. ప్రజలు కూడా నన్ను గెలిపించేందుకు సిద్ధమయ్యారు. స్థానికేతరులను గెలిపించిన దాని కన్నా జిల్లా కు చెందిన నేను గెలిస్తే జిల్లా దశ, దిశ మారిపోతాయని వారు భావిస్తున్నారు. ఖమ్మంలో రికార్డులు తిరగరాసే రోజు త్వరలోనే ఉంది. మార్క్సిస్టులతో కలిసే ప్రయాణం ఈ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో సీపీఎంతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని ముందుకెళుతున్నాం. జిల్లాలో పట్టున్న సీపీఎంతో కలిసి మా కేడర్ అవగాహనతో ముందుకెళుతోంది. ఇరుపార్టీలు ఇరు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో మా రెండు పార్టీల మధ్య కొంత అంతరాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కానీ మేం మాత్రం మానసికం గా ఎన్నికల అవగాహనకే సిద్ధమై ఉన్నాం. వైఎస్సార్ సీపీ లేని చోట్ల సీపీఎం అభ్యర్థులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. సీపీఎం శ్రేణులు కూడా అదే తరహాలో పనిచేస్తున్నాయి. జిల్లాలో మేం క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాబును నమ్మరు.. కేసీఆర్, కాంగ్రెస్‌లకు ఓట్లేయరు తొమ్మిదేళ్ల పాలనలో పేదల ఉసురు పోసుకున్న చంద్రబాబుని నమ్మి ప్రజలు ఓటేస్తారని అనుకోవడంలేదు. బాబు పాలన కోరుకోవడమంటే మళ్లీ ప్రజలు కష్టాలు కొనితెచ్చుకోవడమే. ఇక తెలంగాణ సాధన క్రమంలో దోబూచులాడిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను కూడా ప్రజలు ఆదరించరు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కలిపేస్తానని ఒకసారి, నేనెందుకు కలపాలని మరోసారి కేసీఆర్ చెప్పడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు రాష్ట్రాలు ఏర్పాటు చేసేది పార్టీలను కలుపుకోవడం కోసమా అనిపిస్తుంది. ఇక, 2011, డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి, వెంటనే తోకముడిచేయుడం వల్లే తెలంగాణ విద్యార్థులు, యువకుల వుృతికి కారణవుయ్యూరు, ప్రాణా ల్ని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేయాలనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఆ పార్టీకి ప్రచారం చేసే వారే కరువయ్యారు. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్సీపీ పక్షాన కీలక పాత్ర పోషించబోతున్నాం. నవతెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నాం. నాకో వ్యూ ఉంది ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన తర్వాత ప్రజలకు ఎలా సేవ చేయాలన్న దానిపై నాకిప్పటికే ఓ అవగాహన ఉంది. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా నివసించే జిల్లాలో వారి సంక్షేమమే ప్రధానం. అందుకే వారి అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించుకున్నాం. సంక్షోభంలో ఉన్న జిల్లా గ్రానైట్ పరిశ్రమను గట్టెక్కించేందుకు, విద్యుత్‌కోతలు, పన్ను మోతలు లేకుండా చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించా. సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, జిల్లాలోని టెయిలెండ్ భూములకు సాగునీరు, అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో తాగునీటి సమస్య లేకుండా చేయడం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా పోరాటం... ఇలా చాలా చేయాలని ఉంది. ప్రజలు నాకు అవకాశమిస్తే నేనేంటో రుజువు చేసుకుంటా... ప్రజలకు భరోసాగా ఉంటా -
కొత్తందం కొనేద్దాం
- ముచ్చటైన ముఖాల కోసం నేతల తాపత్రయం - ఎన్నికలకు ముందు ప్లాస్టిక్ సర్జన్లకు పెరిగిన గిరాకీ ఎన్నికల బరిలోకి దిగిన నేతలు ప్రత్యర్థులపై సంధించే ఆరోపణాస్త్రాలను, విమర్శనాస్త్రాలను మాత్రమే నమ్ముకోవడం లేదు. టీవీ చానళ్ల హడావుడి పెరగడంతో బుల్లితెరపై ఆకర్షణీయంగా కనిపించే లక్ష్యంతో ముచ్చటైన ముఖ కవళికల కోసం ‘శస్త్ర’మార్గాన్ని ఆశ్రయించేందుకు సైతం వారు వెనుకాడటం లేదు. ఇదివరకు ఎక్కువగా సినీతారలు తమ అందచందాల కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించేవారు. వారికి పోటీగా రాజకీయ నేతలు సైతం ప్లాస్టిక్ సర్జన్ల వద్ద క్యూ కడుతుండటంతో శస్త్ర వైద్యులకు కాసుల పంట పండుతోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడేందుకు కొద్దినెలల ముందే పలువురు నేతలు ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించి, తమ ముఖ కవళికలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ ఎన్నికల సీజన్‌కు ముందు నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించిన వారిలో కుర్ర నేతలతో పాటు వయసు మళ్లిన నేతలూ ఉన్నారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఎన్నికలకు కొద్ది నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఎంపీ ముంబై వెళ్లి, తన ముఖానికి మెరుగులు దిద్దించుకున్నారు. ప్రముఖ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ మోహన్ థామస్ వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన బండ ముక్కును, లావాటి మెడను సరిచేయించుకునేందుకు ఆ ఎంపీ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘దాదా మాదిరిగా కాదు, నేత మాదిరిగా కనిపించాలనుకుంటున్నాను’ అని ఆయన కోరుకున్నారని తెలిపారు. ముక్కును సరిచేసేందుకు రినోప్లాస్టీ, లావాటి మెడను సన్నగా తీర్చిదిద్దేందుకు లైపోసెక్షన్ చికిత్సలు చేసినట్లు వివరించారు. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళా నేత తన లావాటి నడుమును తగ్గించుకునేందుకు లైపోసెక్షన్ చికిత్స చేయించుకున్నారు. ముఖంపైన మచ్చలు, పులిపిర్లు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల పరిష్కారం కోసం డెర్మటాలజిస్టులను ఆశ్రయించే నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. దక్షిణ ముంబై, నాగపూర్, ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఎన్నికలకు ముందు తన వద్ద ఇలాంటి చికిత్సల కోసం వచ్చారని ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ రేఖా సేథ్ చెప్పారు. ఇలాంటి చికిత్సల కోసం వస్తున్న వారిలో మహిళా నేతల కంటే పురుష నేతల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కోపిష్టి ముఖాలతో కనిపించే నేతలను ఎవరూ చూడాలనుకోరని డాక్టర్ కల్పేశ్ అనే ప్లాస్టిక్ సర్జన్ వ్యాఖ్యానించారు. ముఖం జేవురించి, ఉబ్బిపోయి కోపిష్టుల్లా కనిపించే నేతలు, శస్త్రచికిత్సల ద్వారా తమ ముఖ కవళికలను సౌమ్యంగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల ఇలాంటి సమస్యలతో తన వద్దకు వచ్చిన ఇద్దరు ఎంపీలకు, ఒక స్థానిక మహిళా నేతలకు చికిత్స చేశానని తెలిపారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆస్పత్రులకు వెళితే, ప్రజలు, మీడియా తమను గుర్తిస్తే ఇబ్బందనే ఉద్దేశంతో వైద్యులనే ఇళ్ల వద్దకు రప్పించుకుంటున్న నేతలూ ఉంటున్నారని డాక్టర్ అప్రతిమ్ గోయల్ చెప్పారు. -
ఏక్సే బడ్కర్ ఏక్
కాక కతలు సెప్తుంటడు. గవి గిప్పటి కతలు గావు. ఎన్కటి జమాన కతలు.అట్లిట్ల జేసి గా కతలను గాయిన గిప్పటి జమానకు గల్పుతుంటడు. గీ నడ్మ మా కాక ఒక కత జెప్పిండు. ఎన్కట ఒక పంతులుండె. గాయినకు పెండ్లాం పిల్లలు లేరు. గాయిన తాన పోరగాండ్లు సద్వుకునెటోల్లు. ఒక దినం పక్కూరుకెల్లి ఒక పోరడు గాయిన తాన్కి వొచ్చిండు. గాడు గున్నకుగున్నున్నడు. రాంగనే గాడు పంతులు కాల్లు మొక్కిండు. నాకెవ్వరు లేరు. మీ తాన సద్వుకునేతందుకొచ్చిన. నన్ను మీ కొడ్కనుకొండ్రి. మీ తాన్నె ఉంచుకొండ్రి అని ఒక్క తీర్గ బత్మిలాడిండు. గాని మాటలకు పంతులు మనసు బరఫ్ లెక్క గర్గింది. నాతాన్నే ఉండి సదువుకో అని గాయిన అన్నడు. గాడు పొద్దుగాల్లే నిద్రలేసెటోడు. ఆకిలూకెటోడు. సాన్పు సల్లి ముగ్గ్గేసెటోడు. పంతులు లెవ్వంగనే యాప్పుల్ల దెంపి ఇచ్చెటోడు. గాయిన మొకం గడ్గంగనే ఛాయ్ ఇచ్చెటోడు. గాయిన తానం జేసెతందుకు చేదబాయిల కెల్లి నీల్లు దోడిచ్చెటోడు. నాస్త బెట్టెటోడు. వొంటజేసెటోడు. పంతులు పండుకుంటె కాల్లు పిస్కెటోడు. గాన్ని పంతులు గూడ కొడ్కులెక్క జూసెటోడు. గా పంతులు తాన ఒక బొంత ఉండేది. గూసున్నా, నిలవడ్డా, పండుకున్నా, గీడున్నా, గాడున్నా ఎప్పుడు గా బొంతను గాయిన ఇడ్సెటోడు గాదు. ఒక్క మినిట్ గూడ ఎవ్వరికి ఇచ్చెటోడు గాదు. గది గాయిన పానం. ఒకసారి పంతులుకు పక్కూర్ల పనిబడ్డది. మీరు మా వూరికే బోదమనుకుంటున్నరు. నేను గూడ మీతోని వొస్త అని గాడు అన్నడు. మంచిది రారా అని పంతులన్నడు. పంతులు బొంత దీసి సంకల బెట్టుకున్నడు. ఇద్దరు గల్సి నడ్సుకుంట పక్కూరికి బోబట్టిండ్రు. ఎండ ఎక్వ ఉండబట్కె చెమ్టతోని ఇద్దరు తోపుతోపైండ్రు. నడ్మల ఒక చెర్వు గండ్లబడ్డది. పంతులూ! పెయ్యంత చీదరచీదరున్నది. చెర్ల తానం జేసొస్త అని గాడన్నడు. చెర్ల దుంకి తానం జేసిండు. నాగ్గూడ పెయ్యి చీదరచీదరగున్నది. నేను గూడ చెర్ల తానం జేస్తే బాగుండు గని గీ బొంత నా పానమసుంటిది. ఏం జెయ్యాలె ? అని పంతులు జెరసేపు సోంచాయించిండు. గీడు నాతాన్నే ఉంటడాయె. నన్నిడ్సి యాడికి బోతడు గీనిక నా బొంత ఇచ్చి చెర్ల తానం జేస్త అని పంతులు మనసుల అనుకుండు. అనుకోని గానికి బొంత ఇచ్చిండు. చెర్లకు దిగిండు. పంతులిట్ల చెర్లకు దిగంగనే బొంత దీస్కోని చెంగోబిల్లన్నడు. పెయి మీద బట్ట పామై గర్సిందని పంతులనుకున్నడు. బొంత బోయిందనే ఫికర్తోనే సచ్చిండు. అసల్ సంగతేందంటె గా బొంత నిండ బంగారమున్నది. బొంతనెత్కబోయెతందుకే గాడు పంతులు తాని కొచ్చిండు. బంగారం తోని గాడు మజా ఉడాయించుకుంట బత్కిండు. కొన్నేండ్లకు గాడు గూడ సచ్చిండు. పంతులు ఎన్టీఆర్గ బుట్టిండు. బొంతనెత్కబోయిన గాడు చెంద్రబాబుగా బుట్టిండు. అని మా కాక కత జెప్పిండు. గీ జల్మల గూడ బాబుకు ఎన్కటి గునం బోలేదన్నడు. ఎప్పటి తీర్గనే గా దినం గూడ పాన్ డబ్బా కాడికి బోయిన. గాడ్కి మా దోస్తులొస్తుంటరు. పాన్ దినెటోడు పాన్ దింటడు. సిగిలేటు దాగెటోడు సిగిలేటు దాగుతడు. ‘ చెంద్రబాబు సీమాంద్రను బంగారి సీమాంద్ర జేస్తనంటున్నడు’అని మా సత్నారి అన్నడు.గానికి మా కాక జెప్పిన కత జెప్పిన. ‘గిప్పుడు గూడ బాబుకు బంగారమంటె శానిస్టమున్నట్టు గొడ్తున్నది.’ అని సిగిలెటు దాక్కుంట మా యాద్గిరి అన్నడు. ‘ గట్లే గొడ్తున్నది బంగారం గాయినకు .. పచ్చంగిలు, పచ్చ జెండలు. పస్కలు కడ్మోల్లకు’ అని పాన్ నమ్లుకుంట సత్నారి అన్నడు. ‘చెంద్రబాబు సైకిల్ గేరు బద్లాయించి స్పీడ్ బెంచుతడట. ఎదురుంగ ఎవ్వరొచ్చిన కిందికి తొక్కుతడట.’ అని మా లచ్చినారి అంటే - ‘ఎవ్వరన్న బుడ్డ మొలతోని గాయిన సైకి ల్ గాలిదీస్తే ఎం జేస్తడు’ అని సత్నారి అడిగిండు.‘బిజెపితోని సోపతి జెయ్యబట్కే మా సైకిల్ గాలి బోయిందని అంటడు’ మా ముచ్చట ఇంటున్న పాన్డబ్బోడన్నడు.‘చెంద్రబాబు కడ్మ పార్టిల లీడర్ల గుండెలల్ల నిద్రబోతనంటున్నడు.’ అనా యాద్గిరి అన్నడు. ‘ముక్యమంత్రి కుర్సి ఉండంగ గది యాడ బోతదో అనే బయంతోని గాయిన నిద్రబోలేడు. గిప్పుడు ముక్యమంత్రి కుర్సి దొరుక్తదో లేదో అనేటి పరేషాన్తోని నిద్రబోతలేడు. ఇగ గాల్ల గుండెల గీల్ల గుండెల గాయిన నిద్రబోయే సవాలే లేదు.’ అని సిగిలేటు ముట్టించుకుంట సత్నారి అన్నడు. ‘గీ పారి సీమాంద్రల తప్పకుంట ముక్యమంత్రినైతనని చెంద్రబాబు అంటున్నడు’ యాద్గిరి పాన్ ఉంచుకుంట అన్నడు. ‘ఏం జేసిండని అయితదడట. పాదయాత్ర జేసినందుకా? ప్రజాగర్జన మీటింగ్‌లు బెట్టినందుకా? కోట్లకు కోట్లున్నోల్లను టిడిపిల శరీక్ జేస్కున్నందుకా? ఎందుకైతడట’ అని పత్నారి అడిగిండు. గీ యాడాది ఆనలు సరిగ గుర్వయి. కర్వుకాలం వొస్తున్నదని బాబుకు ఎర్కైంది. నేను ముక్యమంత్రిగ ఉండంగ దప్పిడ్సి ఎవ్వరు ముక్యమంత్రిగ ఉండంగ కర్వుకాలం రాలేదు. కర్వుకాలమొస్తున్నదంటె నేను ముక్యమంత్రి అయితున్నట్టే గదా అని గాయినంటున్నడు’ అనా యాద్గిరి జెప్పిండు. ‘పవన్‌కల్యాన్ గీయినను జూసి మొకం దిప్పుకున్నా గాయిన ఇంటికి బొయిండు. టిడిపి దిక్కుకెల్లి ప్రచారం జెయ్యుమని ఒక్క తీర్గ బత్మిలాడిండు. మోడి, నువ్వు, నేను ఒక్కతీర్గనేసోంచాయిస్తమన్నడు. మోడి ఈన్న తీర్గ 1+1+1= 3 గాదు 111 అన్నడు.మనం ముగ్గురం గలిస్తేనే 111 అని మల్లొక్కపారి పవన్‌కు జెప్పిండు.’ అని లచ్చినారి అన్నడు. ‘అవ్ పవన్ ఏక్ మోడి గ్యారా చెంద్రబాబు ఏక్సౌగ్యారా. ఏక్సే బడ్కర్ ఏక్. ఏదాంట్ల అంటె ఎన్కకెల్లి పొడ్సుట్ల.’ అని సత్నారి అన్నడు. గీ తీర్గ రాత్రి పదిగొట్టె దాంక ముచ్చట బెట్టి ఎవ్వరింటికి గాల్లు బోయినం. తోక : గాంగ్రెస్ సెంటర్మంత్రి సర్వే సత్యనారాయన ఎలచ్చన్ల ప్రచారం జేస్కుంట దిర్గబట్టిండు. ఒక తాన మీటింగ్బెట్టిండ్రు. కడ్మ లీడర్లు స్పీచ్ గొడ్తుంటే స్టేజి మీద కూసొనే గాయిన నిద్రబోయిండు. ‘అన్న ఐదేండ్లు మంచిగ నిద్రబోయిండు. గిప్పుడు గుడ్క నిద్రబోతె ఎట్లరా బై’ అని గల్లి కాంగ్రెస్ లీడర్ పక్కనున్నోని తోని అన్నడు. -
ఎవరి పోరు వారిదే
వామపక్షాలు - ప్రస్థానం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా సీపీఐది ఒంటరి పోరే సవుంజసమైన ప్రాతినిధ్యం కోసం సీపీఎం పోరాటం ఈసారి ఎన్నికల రణక్షేత్రంలో కామ్రేడ్లు ఎవరి వ్యూహం వారిది అన్నట్టుగా సాగుతున్నారు. తెలంగాణ శాసనసభలో ప్రాతినిధ్యం కోసం సీపీఎం, సీపీఐ వేర్వేరు పంథాల్లో పయునిస్తున్నారుు. సాధారణంగా తవులో ఎన్ని వైరుధ్యాలున్నా ఎన్నికల క్షేత్రంలోకి వచ్చేసరికి అవి పరస్పరం సహకరించుకునేవి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయి. ఎవరి వ్యూహాలు వారివి, ఎవరి ఎత్తుగడలు వారివి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సీట్ల అవగాహన కుదుర్చుకుని సీపీఎం ముందుకెళుతోంది. నిజానికి సీపీఎం మొదటి నుంచీ సమైక్యవాదానికి కట్టుబడగా, సీపీఐ తెలంగాణ ఆకాంక్షకు వుద్దతు పలికింది. తీరా ఎన్నికల బరిలో నిలిచే సవుయూనికి కాంగ్రెస్, టీఆర్ఎస్లతో పొత్తు కోసం సీపీఐ తీవ్రంగా ప్రయుత్నించింది. చివరకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నావునిపించింది. సీపీఎం వూత్రం రాష్ట్ర విభజన ఓ కొలిక్కి వచ్చీ రాగానే రెండు రాష్ట్రాలకూ వేర్వేరు శాఖలు ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ కోసం ప్రత్యేక వ్యూహంతో కదిలింది. ప్రస్తుతం ఉవ్ముడి అసెంబ్లీలో సీపీఐకి నాలుగు సీట్లు, సీపీఎంకు ఒక సీటు ఉన్నారుు. ఇవన్నీ తెలంగాణలోని సీట్లే. అందుకే ఈసారి అక్కడ తవు బలాన్ని మరింత పెంచుకునేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ... చిత్రమైన పరిస్థితి! ఇక ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతు తెలిపిన సీపీఐ, విభజన తర్వాత చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో రాకెట్ వేగంతో దూసుకెళ్లాలని భావించిన కంకి కొడవలికి పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2009 ఎన్నికల్లో మహాకూటమితో జట్టు కట్టి నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న సీపీఐ, కొత్త అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసం నానా తంటాలు పడుతోంది. అందుకోసం ఏకంగా అజెండాను పక్కకు పెట్టి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఆశించిన ఫలితం దక్కేలా లేదు. సీపీఐకి కేటాయించిన ఏడు స్థానాల్లో ఏకంగా ఐదు చోట్ల కాంగ్రెస్ రెబల్స్ బరిలో దిగడంతో కామ్రేడ్లు కంగుతిన్నారు. దాంతో ఆయూ స్థానాల్లో సీపీఐది ఒంటరి పోరే అన్నట్లు తయూరైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయుణ స్వయుంగా పోటీ చేస్తున్న ఖవ్ముం లోక్‌సభ స్థానంపై పార్టీ బాగా దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల పోటీ చేసే అవకాశం లేక పలు జిల్లాల్లో సీపీఐ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారుు. నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే మెదక్ జిల్లాలోని సీపీఐ కార్యవర్గం మొత్తం జెండా ఎత్తేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోయింది. మిగతా జిల్లాల్లో కూడా సీపీఐ పరిస్థితి అంతంత మాత్రంగానే తయారైంది. కొత్త వ్యూహంతో సీపీఎం! ఇన్నాళ్లు సమైక్యవాదం వినిపించిన సీపీఎం... రాష్ట్ర విభజన ఖాయమవడంతో తెలంగాణ నవనిర్మాణంపై దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో తమ ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క జూలకంటి రంగారెడ్డి మాత్రమే అసెంబ్లీలో సీపీఎంకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి మరిన్ని సీట్లను గెలుచుకుని చట్టసభల్లో తమ గొంతును మరింత గట్టిగా వినిపించేందుకు సీపీఎం అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగింది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో తమకు కార్యకర్తల బలవుుందని నవుు్మతున్న చోట్ల మాత్రమే అభ్యర్థులను బరిలోకి దించింది. కచ్చితంగా గెలుస్తామనుకున్న చోట్ల సంప్రదాయ పార్టీలతో, నాయుకులతో అవగాహన కుదుర్చుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీతో అవగాహన కుదుర్చుకోవడంతో పాటు మిగతా జిల్లాల్లో స్థానికంగా టీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతు తీసుకోవడానికి, ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా శాఖలకు కొంత స్వేచ్ఛ కూడా ఇచ్చారు. తవు బలవుున్న స్థానాల్లో పోటీలో ఉండి పార్టీ శ్రేణులను కాపాడుకోవడం, వీలైన చోట్ల గెలుపుజెండా ఎగరేయుడం... ఇదీ సీపీఎం వ్యూహం! ఈ వ్యూహాలన్నింటికీ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వం వహిస్తున్నారు. వుధిర, పాలేరు, భద్రాచలం, వుహబూబాబాద్, నర్సంపేట అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ వుద్దతు సీపీఎంకు బాగా అనుకూలంగా ఉంది. సూర్యాపేటలో స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు వుద్దతిస్తున్నారు. అక్కడక్కడా టీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా సీపీఎం వుద్దతిస్తోంది. -
బాబు ఓ శిఖండి
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని, ప్రజల ఆశించే తెలంగాణను సాధించడం కోసమే ఒంటరిగా పోటీ చేస్తున్నామని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తెలంగాణ విభజన కోసం మూడు తరాలుగా ఉద్యమం జరుగుతోంది. కానీ 2001లో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చిందనేది పచ్చి నిజం. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా, టీఆర్ఎస్ పోరాట పటిమను గుర్తించి ప్రజల ఆకాంక్షకు పట్టం కట్టారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అంటున్నాం. ప్రజలు గుర్తించారు... సస్యశామలమైన, సామాజిక దృక్పథం కలిగిన తెలంగాణను సాధించి ఇస్తామని ప్రజలకు మేం మాట ఇచ్చాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అధికారం కూడా కావాలి. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్తోనే సాధ్యం. మళ్లీ ప్రాంతీయేతర పార్టీలకు అధికారమిస్తే తెలంగాణకు అర్థం లేకుండా పోతుంది. కుటుంబ పార్టీలకు మూలం కాంగ్రెస్సే నెహ్రూ నుంచి రాహుల్‌గాంధీ వరకు దశాబ్దాలుగా ఆ పార్టీని శాసిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిసి ్థతి ఉంది. టీడీపీ కూడా అంతే. వీటికి మా పార్టీ భిన్నమే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న కేసీఆర్‌తో పాటు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్, తెలంగాణ జాగృతితో చైతన్యం తెచ్చిన కవిత గురించి అందరికీ తెలుసు. హరీష్‌రావు కూడా ఉద్యమకారుడే. వీరు పోటీ చేయడం తప్పెలా అవుతుంది. అర్థం లేని విమర్శలు విలీనం చేస్తామనే మాట మా పార్టీ ఎవ్వరికీ ఇవ్వలేదు. సాయం చేసిన వారికి మర్యాదపూర్వకంగా కలవడం తెలంగాణ బిడ్డల నైజం. అందుకే సోనియాకు, తెలంగాణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. కానీ కాంగ్రెస్ తెరవెనుక కుట్రలకు పాల్పడింది. 1200 మంది అమరుల ప్రాణత్యాగాలను బలిగొని, మా పార్టీకి చెందిన విజయశాంతి, వివేక్, అరవిందరెడ్డి, విజయరామారావులను కాంగ్రెస్‌లో కలుపుకొంది. టీడీపీ భూస్థాపితం... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పెద్ద శిఖండి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదు. తెలంగాణలో మునిగిపోతున్న టీడీపీని భుజాన మోస్తున్న బీజేపీ కూడా మునిగిపోక తప్పదు. తెలంగాణ పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్కే ఉంది. టీడీపీ మా పార్టీ నాయకులపై మొదట్లోనే కేసులు పెట్టించింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఎంతమందితో కలిసినా, సినిమా యాక్టర్లను తిప్పినా భూస్థాపితమయ్యే పార్టీ అది. పక్కా ప్రణాళికతో హామీలు నెరవేరుస్తాం... మా మేనిఫెస్టోకు పక్కా ప్రణాళిక ఉంది. తెలంగాణలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటాం. ప్రజలకు అవసరమయ్యే ప్రతి పనిని చేసి చూపెడతాం. ఎన్నికల హామీలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి ఆ దిశగా పనిచేస్తాం. తెలంగాణ ఆంక్షాల మేరకే మద్దతు మా లక్ష్యం బంగారు తెలంగాణ. అధికారం కన్నా మాకు ఆకాంక్షే ముఖ్యం. మా డిమాండ్లను స్వాగతించి ఆ దిశగా అమలు చేసే వాళ్లకే కేంద్రంలో మా మద్దతు ఉంటుంది. ఫలితాల తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాం. ఏ పార్టీతో -
మేడ్చల్‌లో హస్తం హల్చల్
అభివృద్ధే మంత్రంగా కాంగ్రెస్ తెలంగాణవాదాన్నే నమ్ముకున్న టీఆర్ఎస్ అయోమయంలో టీడీపీ వైఎస్ సంక్షేమ పథకాలే అండగా ముందుకెళ్తున్న వైఎస్సార్ సీపీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. పట్టణ, గ్రామ ప్రాంతాల మిళితమైన ఈ నియోజకవర్గంలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్), టీడీ పీ అభ్యర్థిగా తోటకూర జంగయ్యయాదవ్, టీఆర్ఎస్ నుంచి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ బలపర్చిన డాక్టర్ బీవీ ప్రకాశ్ వంజరి బరిలో ఉన్నారు. అభివృద్ధే గెలిపిస్తుందని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయతీరాలకు చేరుస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్లార్ ధీమాగా ఉన్నారు. లీడ్ ఇండియా ద్వారా చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, కేఎల్లార్ ట్రస్ట్ సౌజన్యంతో ప్రతీ ఇంటికీ రక్షిత మంచినీరు అందించడం వంటివి ఆయనకు సానుకూలంగా మారా యి. జిల్లాలోనే అత్యధికంగా రూ. 1300కోట్ల నిధులు రాబట్టిన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న కేఎల్లార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే సొంత పార్టీలోనే కొందరు నేతలు వేరుకుంపటి పెట్టడం ఆయనను ఆందోళనకు గురి చేసి నా అంతిమంగా కేఎల్ఆర్కు విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు తోడు తెలంగాణ తెచ్చిన పార్టీ అభ్యర్థిగా పోటీచేయడం లక్ష్మారెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. బుజ్జగింపులతోనే సరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక్కడ దారుణంగా తయారైంది. టికెట్ ఆశించి భంగపడ్డ నియోజకవర్గ ఇన్చార్జి నక్కా ప్రభాకర్‌గౌడ్ టీఆర్ఎస్ గూటికి చేరడం, సీనియర్లు అలకపాన్పు ఎక్కడంతో ఆ పార్టీ అభ్యర్థి తోట కూర జంగయ్య యాదవ్‌కు అసంతుష్టులను బుజ్జగించడంతోనే సరిపోతోంది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న తన సామాజికవర్గం ఓట్లతో గట్టెక్కుతాననే ధీమాలో ఉన్నా రు. అయితే నేతల మధ్య సమన్వయలేమి, కొందరు దిగువశ్రేణి నాయకులు ‘కారె’ క్కడం టీడీపీని కలవరపరుస్తోంది. స్పీడు పెంచిన ‘కారు’ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి టీఆర్ఎస్కు కొంత కలి సొచ్చే అవకాశంగా మారినా, అవి ఓట్ల రూపంలో ఎంత వరకు లాభిస్తుందో లేదోనని గులాబీ శ్రేణుల్లో అనుమా నాలు నెలకొన్నాయి. తెలుగుతమ్ముళ్లు కొందరు ‘కారె’క్కడంతో తమకు కలిసి వస్తుందని గులాబీ శిబిరం భావి స్తోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి నక్కా ప్రభాకర్‌గౌడ్ తమ పంచన చేరడం తనకు అనుకూలమవుతుందని టీఆర్ఎస్ అభ్యర్థి మలిపెద్ది సుధీర్‌రెడ్డికి అంచనా వేస్తున్నాడు. కాగా ఆయన ముక్కుసూటితనం కొంత ప్రభావం చూపనుంది. వడివడిగా వైఎస్సార్ సీపీ వైఎస్ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ఓటర్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థివైపు చూస్తుండడం అన్ని పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం డాక్టర్ బీవీ ప్రకాశ్ వంజరికి అనుకూలాంశంగా మారింది. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రత్యర్థి పార్టీలకు ఇది కొంత ఇబ్బందిగా మారింది. -
యువతకు భరోసా
నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న జగన్ వయో పరిమితి ఒకసారి 40 ఏళ్లకు పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీ గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకమే కారణం సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయని వైనం రోశయ్య, కిరణ్ ఇద్దరి హయాంలోనూ అంతే అర్హతలున్నా పోటీ పడలేకపోయిన వారందరో వారికి న్యాయమైన అవకాశం దక్కాలంటున్న జగన్ వయసే అడ్డంకి కారాదన్నదే ఆయన ఉద్దేశం మూడుసార్లు వయో పరిమితిని పెంచిన వైఎస్ రెండుసార్లు నాలుగేళ్ల చొప్పున, ఒకసారి ఐదేళ్లు బాబు హయాంలో నోటిఫికేషన్లే అరకొర దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు ముందు, తరవాత ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో అక్షరాలా ఆటలాడుకున్నాయి. ఉద్యోగులను నిరంతరం చెండుకు తిన్న చంద్రబాబు, తన పాలనలో ఎప్పుడూ గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల భర్తీని పట్టించుకున్న పాపాన పోలేదు! తొమ్మిదేళ్లు పాలించి కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా కనీసం 100 ఉద్యోగాలైనా భర్తీ చేయని ఘనుడు బాబు! ఇక వైఎస్ అనంతరం సీఎంగిరీ చేసిన రోశయ్యదీ అదే తీరు. ప్రభుత్వపరంగా బోలెడన్ని ఖాళీలున్నా భర్తీ మాటే తలపెట్టకుండా మీనమేషాలు లెక్కింపుతోనే కాలం గడిపి గద్దె దిగారాయన. తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితిని కేవలం రెండేళ్లు పెంచడంతో సరిపట్టారు. ఇలా వారిద్దరూ బాబుకు తీసిపోని తీరుతో లక్షలాది మంది ఆశావహ యువతీ యువకుల ఉసురు పోసుకున్నారు. అందుకే... వైఎస్ స్వర్ణయుగాన్ని తిరిగి తీసకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల ఆవేదనను తండ్రి మాదిరిగానే పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. వైఎస్ తదనంతరం గడచిన ఐదేళ్లలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భావించారు. అధికారంలోకి వచ్చాక ఒకసారి వయో పరిమితిని 40 ఏళ్లకు పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు. నిరుద్యోగుల ఆవేదనను దివంగత వైఎస్ సానుభూతితో అర్థం చేసుకున్నారు. అందుకే మూడుసార్లు గరిష్ట వయోపరిమితిని నాలుగేళ్లు, ఐదేళ్లు పెంచారు. బాబు 2003లో కేవలం ఎన్నికలపై దృష్టితో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇచ్చినా గరిష్ట వయో పరిమితిని మాత్రం పెంచలేదు. కాని వైఎస్ అలా కాదు. 2004లో అధికారంలోకి రాగానే దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటిదాకా పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాని వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని గరిష్ట వయోపరిమితిని నాలుగేళ్లు సడలించి మరీ పోస్టులను భర్తీ చేశారు. తరవాత 2007లో మరోసారి నాలుగేళ్లు, ఇక 2008లో ఏకంగా ఐదేళ్ల పాటు గరిష్ట వయో పరిమితిని సడలించిన ఘనత వైఎస్‌దే. చంద్రబాబు పాలనలో... 1. ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లు పెద్దగా లేవు 2. {Vూపు-1, గ్రూపు-2 వంటి నోటిఫకేషన్లు అంతంతే 3. 9 ఏళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు తక్కువే. ఏపీసీఎస్సీ ద్వారా కనీసం ఏటా 100 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు 4. నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి పెంపును ఏనాడూ పట్టించుకోలేదు 5. 2003లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చినా ఆ పోస్టులను భర్తీ చేయలేదు వైఎస్ పాలనలో... 1.2004లో అధికారంలోకి రాగానే బాబు ఇచ్చిన నోటిఫికేషన్‌కు మరిన్ని ఖాళీలను కలిపి మరో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు 2. అప్పటిదాకా పెద్దగా నోటిఫికేషన్లు జారీ కాని దృష్ట్యా వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు కోరారు గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన స్తంభించి ఏటా రిక్రూట్మెంట్ జరగనందున, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు (వన్‌టైమ్) పెంచుతాం. మిగతా వర్గాలకు కూడా తదనుగుణంగా వయోపరిమితిని (వన్‌టైమ్) పెంచుతాం. ఏపీపీఎస్సీని సమూలంగా తీర్చిదిద్దుతాం. క్యాలెండర్ రూపొందించి ఏటా ఉద్యోగ నియామకాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేపడతాం. వయోపరిమితి పెంపు ఎందుకంటే... 1. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతి 100 ఖాళీల్లో 66 శాతం పోస్టులను యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీల ద్వారా... 33 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. పైగా ఖాళీలను ఎప్పటికప్పుడు ఏటా భర్తీ చేస్తున్నారు 2. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధం. ఇక్కడ ఏకంగా 66 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, కేవలం 33 శాతాన్ని మాత్రమే డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అది కూడా అరకొరగా, నాలుగైదేళ్లకోసారి మాత్రమే. అందుకే వయో పరిమితి సమస్య తలెత్తుతోంది 3. ఇక యూనిఫామ్ పోస్టులై న ఐపీఎస్‌కు జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 30 ఏళ్లుగా, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లుగా కేంద్రం నిర్ణయించింది 4. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీఎస్పీ (సివిల్, జైల్స్) పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్ల వయో పరిమితిని నిర్ధారించింది 5.అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, ఎక్సైజ్ ఎస్ఐల కైతే జనరల్‌కు 26 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 31 ఏళ్లుగా నిర్దేశించింది. -
కేసీఆర్ గెలిస్తే గడీల పాలనే
ఇంటర్వ్యూ దామోదర రాజనర్సింహ కేసీఆర్ మాటలు నమ్మొద్దు గడీల పాలన మనకొద్దు స్థానికత కచ్చితంగా ఉంటుంది వైఎస్ డైనమిక్ నాయకుడు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి ‘తెలంగాణ పసిబిడ్డ తల్లి పొత్తిళ్లలో ఉంది. దాని బాగోగులు చూసే బాధ్యత తల్లి సోనియాకే ఇవ్వాలి. పూటకో మాట మాట్లాడే మాయల మరాఠి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు. ప్రాణాలు త్యాగం చేసి...కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ‘బాంఛన్ నీ కాల్మొక్త’ అనే గడీల పాలన వద్దే వద్దు’ అంటున్నారు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సిలారపు దామోదర రాజనర్సింహ. సోనియాగాంధీ బహిరంగ సభకు వేదిక ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా సాక్షికిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. కేసీఆర్ మెర్జ్.. డీ మెర్జ్ అన్నాడు. మా దగ్గర రికార్డు ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. కానీ పర్యావరణం, అక్కడి గిరిజనులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రాజెక్టు కట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల ఆప్షన్లు అంటారా..! రాష్ట్రాల విభజన కొత్తేమీ కాదు. ఈ రోజే జరుగుతున్న అంశం కాదు. కేసీఆర్ మాట మార్చి ఓట్ల కోసం ఉద్యోగుల ఆప్షన్లను తెర మీదకు తెచ్చాడు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అందులో కచ్చితంగా స్థానికత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఉద్యోగుల బదిలీలుంటాయి. కేసీఆర్‌ను ఒక్క మాట అడుగుతున్న... పోలవరం ముంపు సమస్య ఉన్నప్పుడు, ఉద్యోగుల ఆప్షన్ల సమస్య ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు తెలంగాణ వచ్చిన రోజు ఒంటెల మీద, గుర్రాల మీద కూర్చొని ఊరేగి సంబరాలు చేసుకున్నడు. అప్పుడు కనిపించలేదా ఈ సమస్యలు?. కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్‌ని ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ ఇదే ఆందోల్‌లో మీటింగ్ పెట్టి సింగూరు కట్ట మీద కుర్చీ వేసుకొని కూ ర్చుంటానని చెప్పాడు. సింగూరు నీళ్లను మెదక్ జిల్లాకు పారిస్తానని చెప్పాడు. సింగూరు నీళ్లే నిజాం సాగర్ వెళ్తాయి. నిజామాబాద్ పోయి ఏం చెప్పాడు? నిజాం సాగర్ కట్ట మీద కుర్చీ వేసుకొని కూర్చొని నిజామాబాద్‌కు నీళ్లు పారిస్తానని చెప్పాడు. ఇందులో ఏది నిజమో ఆయనే చెప్పాలి. కేసీఆర్ మాటలను ప్రజలు గమనిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలే తగిన విధంగా స్పందిస్తారు. మోడీ గురించి తక్కువ మాట్లాడాలి మోడీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాకుంటే మోడీని చూసి మీడియాను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవచ్చు. ఆందోల్ ప్రగతికి ఎంతో కృషి పదేళ్ల కిందట ఆందోల్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా తయారైంది. ఆందోల్ ప్రజలు ఎప్పుడైనా కలగన్నారా? జేఎన్టీయూ వస్తుందని. సింగూరు జలాల ట్రయల్ రన్ జరుగుతుందని ప్రజలు ఊహించారా? జోగిపేటలో మూడు పాలిటెక్నిక్, రెండు డిగ్రీ కళాశాలలు, పీజీ సెంటర్ ఉన్నాయి. మార్కెట్, రోడ్లు, సబ్స్టేషన్లు అన్ని తెచ్చాను. నా వంతు కృషి చేశాను. మిగిలింది ప్రజలు నిర్ణయిస్తారు. కేసీఆర్ మీడియా తయారు చేసిన నేత మీడియాకు, కేసీఆర్‌కు ఉన్న సంబంధమేంటో భగవంతుడికే తెలియాలి. కేసీఆర్ మీడియా తయారు చేసిన నాయకుడు. మీరు సామాన్యుని దగ్గరకు వెళ్లి తెలంగాణ వైఎస్ లాంటి డైనమిక్ లీడర్ లేడు వైఎస్సార్ లాంటి డైనమిక్ లీడర్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్లంత తోసుకొని ముందుకు పోయాం. అలాంటి నేత ఇప్పుడు లేడు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా ఈ గడ్డ మీద కాలు పెడుతుంటే... ఆ తల్లిని చూడాలని లక్షలాది జనం ఆరాట పడుతున్నారు. కానీ వారందరినీ తీసుకొని రావడంలో మేం విఫలమయ్యాం. ఇది మా దౌర్భాగ్యం. -
మూడోసారి.. కష్టమే !
ఏ ఎదురీదుతున్న సిట్టింగ్ ఎంపీ రమేష్ రాథోడ్ ఏ టీఆర్ఎస్కు కలసి వచ్చిన అభ్యర్థి మార్పు ఏ ఏకమైన ఆదివాసి గిరిజనులు ఏ ఆదిలాబాద్ ఎంపీ ముఖ చిత్రంట ఆదిలాబాద్ సిట్టంగ్ ఎంపీ రమేష్ రాథోడ్ ఈ సారి ఎదురీదుతున్నారు. ఆయనకు టీఆర్ఎస్ అభ్యర్థి పెను సవాల్‌గా మారారు. ఆదివాసీ గిరిజనులు, లంబాడీల్లో చీలిక వచ్చింది. దాంతో రెండోసారి గెలవాలని రంగంలోకి దిగిన సిట్టింగ్ ఎంపీకి చెమటలు పడుతున్నాయి. ఇదీ స్వరూపం.. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల స్థానాలు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మిగిలిన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్ అసెంబ్లీ స్థానాలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్, టీఆర్ఎస్ నుంచి గొడెం నగేష్, టీడీపీ నుంచి రాథోడ్ రమేష్‌లు రంగంలో ఉన్నారు. వీరితో పాటు మరో ఆరు మంది పోటీ చేస్తున్నారు. కాగా ఈ పోటీలో టీఆర్ఎస్ కొంత ముందంజలో ఉండగా, రెండవ స్థానానికి టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎందుకంటే... రమేష్ రాథోడ్ మొదటిసారి 2009 ఎన్నికల్లో తొలిసారి గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి గెలవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే....రాజకీయ సమీకరణలు ఆయనకు వ్యతిరేకంగా మారాయి. ముఖ్యంగా గత ఐదేళ్లుగా సిట్టింగ్ ఎంపీగా ఉండి తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఈ విషయంలో ఆదివాసీ గిరిజనుల నుంచి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎస్టీలకు వచ్చే ప్రయోజనాలన్నీ లంబాడిలే ఎగరేసుకుపోతున్నారనే ఆవేదన ఆదివాసీల్లో నెలకొంది. ఈ సారి తమ వర్గం అభ్యర్థికే మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వారు వచ్చారు. పైగా టీడీపీ అంటే ప్రజల్లో కొంత వ్యతిరేక భావం నెలకొంది. పైగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటి వరకు పార్టీలో కొనసాగిన క్యాడర్ టీఆర్ఎస్ వైపు వెళ్లారు. అలాగే పొత్తు ఉన్న బీజేపీ నుంచి సరైన మద్దతు లభించడం లేదు. దాంతో రమేష్ రాథోడ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. టీఆర్ఎస్ తరపున పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న గోడెం నగేష్ బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి ఆయన అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ రంగంలోకి దిగారు. ఇతను ఆదివాసీ గిరిజన వర్గానికి చెందడంతో నియోజకవర్గంలోని ఆ వర్గ ప్రజల ఆదరణ పొందుతున్నారు. అయితే...ఆయనకు బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఈ విషయాన్ని అంచనా వేసే....అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నారనే వాదన ఉంది. దాంతో పాటు పాటు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా ఉన్నారు. ముఖ్యంగా సిర్పూర్ నుంచి కవేటి సమ్మయ్య, ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, నిర్మల్ నుంచి కె. శ్రీహరిరావు, ముథోల్ నుంచి వేణుగోపాలాచారి వంటి వారి వల్ల ఎంపీ అభ్యర్థికి మరింత మేలు జరిగే అవకాశం ఉంది. పైగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల బట్టి వేరే పార్టీలకు ఓట్లు వెళ్లినా....పార్లమెంట్ స్థానానికి వచ్చే సరికి టీఆర్ఎస్కు మొగ్గు చూపే (క్రాస్ ఓటింగ్) అవకాశం ఉంది. ఉదాహరణకు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు లంబాడా వర్గం వారిని పోటీకి నిలబెట్టాయి. దాంతో ఇక్కడ మెస్రం ఆనందరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి ఈయనను బలపరిచి, పార్లమెంట్‌కు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే మూడ్‌లో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. నగేష్ పార్లమెంట్‌కు పోటీ చేయడం ఇదే మొదటిసారి. దాంతో ఆదివాసీ గిరిజనులు ఈయన వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే రమేష్ రాథోడ్ ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. కొంత వ్యతిరేకత ఉంది. పైగా పార్టీ పరిస్థితి కూడా అప్పటి మాదిరిగా లేదు. దాంతో కష్టాలు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరే ష్ జాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి. ఆసిఫాబాద్ పోటీలో ఉన్న ఆత్రం సక్కు, ముధోల్ నుంచి విఠల్‌రెడ్డి వంటి వారు తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. దాంతో రెండో స్థానానికి టీఆర్ఎస్తో పోటీ పడే పరిస్థితి నెలకొంది. -
జగనే సీఎం కావాలి..
రాష్ర్టం ముక్కలై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంక్షోభం నెలకొన్న ప్రస్తుత నేపథ్యంలో ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి శక్తివంతమైన నాయకుడి అవసరం చాలా ఉంది. మాది విజయవాడ.. నేను రాష్ట్రంలోనే పుట్టి పెరిగాను.. ఉన్నత విద్యావంతురాలిగాఇక్కడి రాజకీయ పరిస్థితులన్నీ నాకు తెలుసు. మా బంధువులు కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో మంచిస్థాయిల్లో ఉన్నారు.. అయితే నా ఓటు మాత్రం జగన్‌కే... వైఎస్సార్సీపీనే బలపరుస్తా.. అసలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేదా.. ఎవరైనా చెబుతారు కాదు అని... మరి అలాంటి మహానేత కుమారుడు వైఎస్ జగన్‌కే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలున్నాయి. అందుకే ఆయనే సీఎం కావాలి.. మరో ముఖ్య విషయం... ప్రతి ఒక్కరూ ఓటు తమ హక్కును వినియోగించుకోవాలి... - మానస హిమవర్ష, ‘రొమాన్స’ ఫేం -
మెదక్ జిల్లాలో పోటాపోటీ
పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ ముందంజ.. అసెంబ్లీ స్థానాల్లో పలుచోట్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉత్కంఠ ప్రతిష్టాత్మకమైన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చతుర్ముఖపోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగిన విషయం విదితమే. కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి రంగంలో దిగగా.. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి వదిలిపెట్టింది. బీజేపీ నుంచి చాగన్ల నరేంద్రనాథ్ బరిలో ఉన్నారు. ైవె ఎస్సార్సీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ రంగంలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాల నుంచి గెలుపొందిన చంద్రశేఖరరావు ఈసారి సొంత జిల్లా నుంచి అభ్యర్థిగా రంగంలో దిగడంతో.. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త ఊపు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభించిన చంద్రశేఖరరావుకు ఎంపీగా విజయం సునాయాసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఆ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అదీ సిద్దిపేట ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. మిగిలిన ఆరింటిలో ఒకటి తెలుగుదేశం, ఐదింటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14.76 లక్షల మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో.. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరువు ఉన్నాయి. ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న చంద్రశేఖరరావు ఎలాగైనా తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. కేసీఆర్ ప్రత్యర్థులకు రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న చాగన్ల నరేంద్రనాథ్ గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కేసీఆర్ స్వయంగా ఈ స్థానం పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారన్న విషయంపైనే అందరి దృష్టి ఉంది. కేసీఆర్ సాధించే మెజారిటీ సిద్దిపేటలో వచ్చే మెజారిటీపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తీవ్రపోటీ నెలకొన్న నేపథ్యంలో అక్కడ నుంచి భారీ మెజారిటీ ఆశించలేకపోతున్నారు. అసెంబ్లీ కంటే పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇతర నియోజకవర్గాల నుంచి క్రాస్‌ఓటింగ్ భారీగా జరిగే అవకాశం ఉంది. మెదక్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నరేంద్రనాథ్ నిల్చున్నా.. తెలుగుదేశం వర్గాలు సంపూర్ణంగా సహకరించడం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్‌రెడ్డి ఒక ఓటు తనకు, రెండో ఓటు కేసీఆర్‌కు వేయాలని అంతర్గతంగా చెబుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసేవారు ఎంపీ స్థానానికి వచ్చేసరికి కేసీఆర్‌వైపు మొగ్గుచూపుతున్నారు. చతుర్ముఖపోటీలో కేసీఆర్ విజయం సాధించడం తేలిక అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. గజ్వేల్: ఈ నియోజకవర్గంలో కేసీఆర్ స్వయంగా రంగంలో ఉన్నారు. టీడీపీ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి పురుషోత్తమరెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. స్వల్ప మెజారిటీతో ఎవరినైనా విజయం వరించనుంది. సిద్దిపేట: సిద్ధిపేట నియోజకవర్గం మొదటి నుంచి టీఆర్ఎస్కు పట్టుగొమ్మగా నిలుస్తోంది. ఈసారి కూడా హరీశ్‌రావు విజయం సులభమే అన్న అభిప్రాయం వ్యకమవుతోంది. టీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ నుంచి విద్యాసాగర్ పోటీ చేస్తుండగా, వైఎస్సార్సీపీ నుంచి జగదీశ్వర్ రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ కంటే ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. దుబ్బాక: ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, వైఎస్సార్సీపీ నుంచి శ్రావణ్‌కుమార్ గుప్తా పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడంతో ముత్యంరెడ్డికి ప్రజల్లో మంచి పేరుంది. అయన అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నా.. నోటి దురుసుతనం కొంత ఇబ్బంది కలిగిస్తుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుదగ్గ స్థాయిలో లేకపోవడం గమనార్హం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు అటు నుంచి బీజేపీలో చేరిన రఘునందన్‌రావు ఇక్కడ పోటీ చేయడం వల్ల టీఆర్ఎస్ ఓట్లను చీలుస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మెదక్: ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో చతుర్ముఖ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య నెలకొంది. టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న విజయశాంతి పార్టీ మారి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగితే.. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పద్మా దేవేందర్‌రెడ్డి ఈసారి టీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్నారు. తెలుగుదేశం నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బట్టి జగపతి, వైఎస్సార్ సీపీ తరపున క్రీస్తుదాసు పోటీ చేస్తున్నారు. నర్సాపూర్: నర్సాపూర్ సెగ్మెంట్లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మరోసారి బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి మదన్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి చాగన్ల నరేంద్రనాథ్ కుమారుడు బల్వీందర్‌నాథ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి దందె బస్వానందం పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా పోటీ టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. పటాన్చెరు: పటాన్చెరులో చతుర్ముఖపోటీ నెలకొంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి నందీశ్వర్‌గౌడ్, టీఆర్ఎస్ నుంచి మహిపాల్‌రెడ్డి, టీడీపీ నుంచి సపానదేవ్, వైఎస్సార్సీపీ నుంచి శ్రీనివాస్‌గౌడ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఎవరు విజయం సాధించినా స్వల్ప ఆధిక్యతతోనే అన్న అభిప్రాయం ఉంది. సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీని గట్టిగా వ్యతిరేకించే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్నారు. టీఆర్ ఎస్ నుంచి చింతా ప్రభాకర్, బీజేపీ నుంచి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శ్రీధర్‌రెడ్డి రంగలో ఉన్నారు. పోటీ ప్రధానంగా టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. -
హస్తిన హస్తాల్లో
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చేతుల్లోకి తీసుకున్న అధిష్టానం స్థానికంగా మకాం వేసి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ పెద్దలు తెలంగాణ సీనియర్ల తీరుపై అసహనం.. నామమాత్రంగా పొన్నాల పసునూరు మధు పేరుకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇక పెత్తనమంతా ఢిల్లీ పెద్దలదే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, ఎన్నికల వ్యవహారాన్ని అధిష్టానం పెద్దలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఏఐసీసీకి చెందిన ఏడుగురు ప్రముఖులు ప్రస్తుతం తెలంగాణలోనే పూర్తిగా మకాం వేసి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది? అధిగమించేందుకు ఏం చేయాలి? అభ్యర్థుల ప్రచార సరళి ఎలా ఉంది? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు వారికి అప్పగించిన బాధ్యతలను ఏ విధంగా నెరవేరుస్తున్నారు? ఇలాంటి అంశాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలను సమాయత్తపరుస్తున్నారు. పోలింగ్‌కు మరో మూడు రోజులే వ్యవధి ఉండటంతో పోల్ మేనేజ్మెంట్ దిశగా పావులు కదుపుతున్నారు. నియెజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న పోలింగ్ స్టేషన్ల వివరాలు తెప్పించుకుని అక్కడ స్థానికంగా పట్టున్న నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని అభ్యర్థులకు వివరిస్తూ అవసరమైతే ఆర్థిక వనరులను కూడా సమకూర్చే పనిలో పడ్డారు. ఏడుగురూ హేమాహేమీలే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నా కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో ఓట్లు రాలే పరిస్థితి లేకపోవడంతో అధిష్టానం పెద్దలంతా ఇప్పుడు తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధానమం త్రి మన్మోహన్సింగ్, సోనియాగాంధీ ఒక్కోసారి, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండుసార్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివావారం సోనియాగాంధీ మరోమారు తెలంగాణలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రచారానికి సిద్దమయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్ మెజారిటీ సాధించే పరిస్థితి కన్పించకపోవడం, అదే సమయంలో టీఆర్ఎస్ దూసుకుపోతుండటంతో పునరాలోచనలో పడిన సోనియా, రాహుల్... రాష్ట్ర వ్యవహారాలతో సంబంధమున్న ఏఐసీసీ నేతలందరినీ రంగంలోకి దించారు. కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు పక్షం రోజులుగా తెలంగాణలోనే మకాం వేయడం తెలి సిందే. దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, కేబీ కృష్ణమూర్తి కూడా రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. రోజూ వీరంతా సమావేశమై ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ గెలుపు కోసం అభ్యర్థులు, నాయకులు ఏం చేస్తున్నారంటూ సమీక్షిస్తున్నారు. పొన్నాల నామమాత్రమే ఏ రాష్ట్రంలోనైనా పీసీసీ అధ్యక్షుడి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి, ప్రభుత్వం లేనిచోట్లలోనైతే ఆయన నిర్ణయాలే శిరోధార్యాలవుతాయి. కానీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తొలి అధ్యక్షుడిగా నియమితుడైన పొన్నాల లక్ష్మయ్య పాత్ర ఎన్నికల్లో నామమాత్రంగా మారింది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు మొదలుకుని ఆర్థిక వనరుల వినియోగం దాకా అంతా అధిష్టానమే పర్యవేక్షిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు ఆంధ్రా నేత చేతికి! టికెట్ల ఎంపికలో తన మాట చెల్లుబాటు కాకపోవడం తో ఆర్థిక వనరుల విషయంలో పెద్దలతో పొన్నాల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో కాం గ్రెస్ అధిష్టానం టీపీసీసీ ద్వారా నిధుల వినియోగం, ఇతరత్రా అవసరాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ సీమాంధ్రకు చెందిన పీసీసీ మాజీ చీఫ్ చేతిలో పెట్టింది. ఇక సీఎం ఆశావహులైన పలువురు కాంగ్రెస్ సీనియర్లను కూడా నియోజకవర్గాలకే పరిమితం చేసింది అధిష్టానం. ఒక్కొక్కరికీ మూడు సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించింది. అక్కడి అభ్యర్థుల గెలుపును పూర్తిగా వారి చేతుల్లోనే పెట్టింది! -
బాబు గారి సింగ్‌పూర్
హైటెక్ పేరు తో హైదరాబాద్ గుల్ల చేసిన చంద్రబాబు హైదరాబాద్... ఈ పేరెత్తితే చాలు.. చంద్రబాబు పూనకంతో ఊగిపోతారు. టక్కున హైటెక్ మంత్రం అందుకుంటారు. అభివృద్ధికి చిరునామా, అంతర్జాతీయ ఖ్యాతికి కేరాఫ్ తానేనంటూ ఊదర గొడతారు. మాట్లాడితే మారిషస్... లేదంటే సింగ్‌పూర్, ఈ రెంటి మీది నుంచి ఏమాత్రం దిగరు. ఐటీకి ఆద్యుడినని.. అలియాస్నూ తానేనని అంటారు... అస్తమానం హైటెక్ సిటీ భవనం వైపు వేలు చూపించి... అదే హైదరాబాద్ అభివృద్ధి అంటారు. ‘ఫ్లై ఓవర్’లు ఎక్కేస్తారు.. గాల్లోనే తిరిగేస్తారు. మరి తూట్లు పడ్డ ఫై ఓవర్ల సంగతేమిటంటే... అది మాత్రం నన్నడగొద్దు... అంతా ‘తమ్ముళ్ల’ మాయాజాలం అంటూ తప్పించుకుంటారు. సెల్ ఫోన్ కనిపిస్తే చాలు... ‘తమ్ముళ్లూ! అది నేనే తెచ్చా’నంటూ తెగ బిల్డప్ ఇస్తారు. హైదరాబాద్‌ను నిర్మించిన కులీ కుతుబ్‌షా కూడా అన్నింటా తనకన్నా తక్కువేనంటారు.తొమ్మిదేళ్ల పాలనలో షాయర్ లాంటి షహర్‌ను కుదేలు చేశారు బాబు. ఆల్విన్‌కు అల్విదా చెప్పించారు. ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా దాని ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. నష్టాల సాకుతో ప్రభుత్వ పరిశ్రమలను అయినవారికి అప్పగింత పెట్టారు. అత్తరు పరిమళాలతో గుబాళించే నగరాన్ని ‘మూసీ’ కంపుతో మురికిమయం చేశారు. ఇరానీ చాయ్ కమ్మదనంతో తెల్లారే బతుకుల్లో కన్నీళ్లు మిగిల్చారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లను చూపించి అదే అభివృద్ధి అంటూ ఊదరగొట్టారు. గరీబ్ గల్లీలు, బస్తీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నందనవనాల నిర్మాణం పేరుతో బస్తీలను ఖాళీ చేయించి పేదలను అనాథల్ని చేశారు. క్లింటన్‌కు ఎర్రతివాచీ పరిచి, రాత్రికి రాత్రే బిచ్చ గాళ్లను తరిమించి ఆకలితో చంపేశారు. హైదరాబాద్‌ను పేద, మధ్య తరగతి ప్రజలు లేని మార్కెట్‌గా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చార్ సౌ సాల్ షహర్ చరిత్రకు చరమగీతం పాడారు... ఇవన్నీ వదిలేసి... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ మళ్లీ అధికారమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటున్నారు. సీమాంధ్రను సింగపూర్‌లా మార్చేస్తానంటున్నారు. హైటెక్ పేరుతో హైదరాబాద్‌ను గుల్ల చేసిన చంద్రబాబు 1. అభివృద్ధి పేర అడుగడుగునా విధ్వంసం 2. మొదట బాబు లీకులు.. ఆపై బినామీ ‘జయభేరి’ కారుచౌక కొనుగోళ్లు 3. ‘సెలెక్టెడ్ ఏరియా డెవలప్మెంట్’తో సొమ్ము చేసుకున్న బాబు బినామీలు 4. ఫ్లై ఓవర్ల పేరుతో అనుయాయులకు నిర్మాణ కాంట్రాక్టులు 5. భూ సేకరణ పేరుతో భారీ దందా.. బావమరిది బాలకృష్ణ, ఆయన భార్య వసుంధరలతో కారుచౌకగా నానక్‌రామ్‌గూడలో భూముల కొనుగోళ్లు 6. సీడీఏ పరిధి నుంచి కొండాపూర్‌కు మినహాయింపు.. భార్య భువనేశ్వరి, బినామీ సంస్థ జయభేరి, బంధుమిత్రుల కోసమేనంటూ విమర్శలు 7. ఎల్అండ్టీకి సైబర్ టవర్స్ .. గిఫ్ట్‌గా బాబుకు ఎన్టీఆర్ భవన్ 8. గుక్కెడు తాగునీటికి కూడా దూరమైన నగర వాసులు 9. ఐటీ అభివృద్ధంటూ జనం కళ్లకు గంతలు.. తొమ్మిదేళ్లలో సైబర్ టవర్స కూడా దాటని ఐటీ రంగం.. ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగిన నిరుద్యోగులు 10 పరిశ్రమల మూసివేతతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు ఆల్విన్‌తో పాటు అనేక సంస్థలకు బాబు హయాంలోనే మంగళం 11 మూసీని మురుగు కూపంగా మార్చేసిన ఘనుడు.. పరిశ్రమలకు విచ్చలవిడి అనుమతులు.. విషతుల్యమైన కాలుష్యంతో పెను ముప్పు 12. పాతబస్తీ గోసను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు 13. కరెంటు బిల్లులు కట్టకుంటే నేరుగా జైలుకే 14 రోగుల నుంచి కూడా యూజర్ చార్జీలు వసూలు 15. బిచ్చగాళ్లనూ నగరం నుంచి తరిమేసిన హైటెక్ పాలన ఐటీ.. ‘టవర్స’ దాటితే ఒట్టు ఐటీ.. అంటే అదేదో తనే సృష్టించినట్టు.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు.. పోజులు కొట్టే చంద్రబాబు హయాంలో నిజానికి ఐటీ అభివృద్ధి శూన్యం. సైబర్ టవర్స్ నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో తొలుత అందులోకి వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం తర్వాత సైబర్ టవర్స్‌కు టాటా చెప్పేశాయి. బాబుగారు ఇంత గొప్పగా చెప్పుకునే ఐటీ వల్ల అప్పట్లో వచ్చిన ఉద్యోగాలు ఐదువేలేనంటే నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం. ఇక ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ అభివృద్ధి సైబర్టవర్స్ గడపదాటితే ఒట్టు. జలాసురుడు.. ఒకనాడు గోల్కొండ కోటకు తాగునీరు అందించిన దుర్గం చెరువు.... నేడు చిన్న తటాకాన్ని తలపి స్తుంది.. 200 ఎకరాల విస్తీర్ణం నుంచి 80 ఎకరాలకు కుదించుకుపోయింది. ఇదొక్కటే కాదు....1995 నుంచి 2004 మధ్యకాలంలో యథేచ్ఛ ఆక్రమణలతో చెరువులన్నీ సహజ స్వరూపాన్ని కోల్పోగా, దాదాపు 104 చెరువులు పూర్తిగా మాయమైపోయాయి... ఇవి హెచ్ఎండీఏ అధికారి సర్వేలో వెల్లడైన వాస్తవాలు. చంద్రబాబు జమానాలో హైదరాబాద్‌లో నిరాటంకంగా సాగిన జలవనరుల విధ్వంసాలకు శిథిల సాక్ష్యాలు. విధ్వంసకారుడు.. హైటెక్ సిటీ నిర్మాణం కోసం పురాతన శిలలు ముక్కలైపోయాయి. తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో జరిగిన చారిత్రక విధ్వంసం అంతా ఇంతా కాదు. మస్కతి డెయిరీకి ప్రాచీన మల్వాల ప్యాలెస్ ధారాదత్తమైపోయింది. అందమైన ముష్క్ మహల్ నామరూపాల్లేకుండా పోయింది.. ఇలాంటివెన్నో. చరిత్రలో గుర్తుండిపోయే ఈ చారిత్రక విషాదానికి మౌన సాక్షి హైదరాబాద్ నగరం. వారసత్వ కట్టడాలపై విరుచుకుపడిన ఆ ముష్కరులు ఆంగ్లేయులు కారు.. తాలిబన్లు అంతకన్నా కాదు. ఈ దండయాత్రకు నాయకత్వం వహించిన సేనాని చంద్రబాబే. ఫ్లై ఓవర్స.. ఫర్ కాంట్రాక్టర్స ఫ్లై ఓవర్లు అనగానే నగర ప్రజలు తెగ సంతోష పడిపోయారు. ట్రాఫిక్ కష్టాలకు ఫుల్స్టాప్ పడుతుందని మురిసిపోయారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. అగ్గిపెట్టెల్లాంటి ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా ట్రా‘ఫికర్’ మరింత పెరిగింది. ఆరు లేన్లతో నిర్మించాల్సిన వాటిని అడ్డగోలుగా నిర్మించి ప్రజల కష్టాలను రెట్టింపు చేశారు. భవిష్యత్ అవసరాలు తీర్చాల్సిన ఇవి ప్రస్తుత అవసరాలకే పనికిరాకుండా పోయాయి. అయితే బాబును నమ్ముకున్న కాంట్రాక్టర్లు మాత్రం బాగా లాభపడ్డారు. -
విధ్వంసకారుడు
చరిత్రను సమాధి చేసిన చంద్రబాబు మస్కతీ డెయిరీకి మల్వాల ప్యాలెస్.. భాగ్యనగరంలో నాలుగు వందల ఏళ్ల సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు కూలిపోయాయి. ఆ దుష్కీర్తిని మూటగట్టుకున్న చంద్రబాబునాయుడు గురించి తాలిబాన్లకు తెలియదు. తెలిసుంటే అఖండ భారతావనిలో తమకూ ఓ ప్రతినిధి ఉన్నాడని మురిసిపోయేవారు. బాబు హయాం చారిత్రక మహా విధ్వంసానికి నిలువెత్తు సాక్ష్యం. పాఠ్యపుస్తకాల్లోనే కాదు... విశ్వవిద్యాలయాల్లో చరిత్ర శాఖ ను తొలగించాలని పట్టుబట్టిన ఘనత ఆయనది. పర్యావరణంపై ‘హైటెక్’ దాడి హైటెక్ సిటీ నిర్మాణానికి విలువైన రాతి సంపద విధ్వంసం జరిగింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని అందమైన కొండలు, గుట్ట లు, రాతిశిలలను సమూలంగా తొలగించారు. నగర పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసేలా వేల ఏళ్ల వయసున్న రాతి శిలలు, వృక్షాలను తొలగించడంపై పర్యావరణవేత్తలు అప్పట్లో తీవ్ర నిరసన తెలిపారు. మల్వాల ప్యాలెస్ నేలమట్టం చారిత్రక చార్మినార్ సమీపంలోని ఖాన్మైదాన్ ఖాన్ రోడ్డులో ఉన్న అద్భుతమైన కట్టడం మల్వాల ప్యాలెస్. ఆసఫ్‌జాహీల కాలంలో కట్టించిన ఈ రాజమందిరంలో నిజాం నవాబులకు ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఉండేవారు. ఆకట్టుకునే కళాత్మకమైన నిర్మాణశైలి, కర్రతో రూపొందించిన వరండా, కర్రతో చేసిన గేట్ ఈ భవనం ప్రత్యేకతలు. దీనిని ప్రభుత్వం గ్రేడ్-1 భవనంగా గుర్తించింది. అలాంటి చారిత్రక వారసత్వ కట్టడాన్ని బాబు నేలమట్టం చేసి మస్కతీ డెయిరీకి ధారాదత్తం చేశారు. ముష్క్ మహల్ కుతుబ్‌షాహీల శైలిలో కట్టించిన ఈ భవనం బహదూర్‌పుర సమీపంలో ఉంటుంది. అబుల్ హసన్ తానీషా కాలంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా, కమాండర్‌గా ఉన్న మియాన్ ముష్క్ ఈ భవనాన్ని కట్టించాడు. చుట్టూ ప్రహరీ, చక్కటి ఉద్యానవనాల నడుమ, ఓ కాలువతో పాటు ఎన్నో ఆరుబయలు ప్రదేశాలతో అందంగా కట్టించిన అతిపెద్ద ముష్క్‌మహల్ చంద్రబాబు కాలంలో నామరూపాల్లేకుండా పోయింది. ఆదిల్ అలాన్ మాన్షన్ (గద్వాల్ మాన్షన్) నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గద్వాల్ మహారాజులు కట్టించిన ఈ చారిత్రక కట్టడం అప్పటి నిర్మాణ శైలికి ప్రతిబింబం. విశాలమైన ఈ భవనం సైతం చంద్రబాబు హయాంలోనే నేలమట్టమైంది. రవిబార్ ఉర్దూగల్లీ రోడ్డును, ట్రూప్‌బజార్ రోడ్డును కలిపే ప్రదేశంలో రవిబార్ ఉండేది. ఈ భవనం నిజాం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అబ్దుల్ రహీం ఆధీనంలో ఉండేది. భవనం ముందు భాగంలో ఇండో యురోపియన్ నిర్మాణ శైలితో ఆకర్షణీయంగా ఉండేది. దీన్ని రవి బార్ యజమాని కొనుగోలు చేశారు. కొంతకాలం పాటు బార్ కొనసాగింది. ఆర్కిటెక్చర్ విలువల దృష్ట్యా దీనిని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు. హెరిటేజ్ కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం దీనిని కూల్చేసింది. బేగంపేట్‌లోని కంట్రీక్లబ్‌లో ఒక భాగమైన చారిత్రక విలాయత్ మంజిల్ సైతం బాబు కాలంలో నేలమట్టమైంది. మరికొన్ని... 1. మూడో నిజాం కాలంలోని అశ్విక దళపతి, రాజ్‌పుత్ యోధుడు జాంసింగ్ పేరుతో కార్వాన్లో జాంసింగ్ ఆలయాన్ని నిర్మించారు. పదిహేను అడుగుల ఎత్తయిన రాతి ద్వారబంధం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారసత్వ కట్టడాల పరిరక్షకులు అడ్డుకున్నారు. 2. సచివాలయంలోని జీ బ్లాక్‌ను కూడా కూలగొట్టేందు కు ప్రయత్నించారు. 3. బహీర్‌బాగ్‌లోని గాంధీ వైద్య కళాశాల కూల్చివేతకు వ్యతిరేకంగా పలు సంస్థలు పెద్ద ఎత్తున పోరాడాయి. 4. మలక్‌పేట్‌లోని మహబూబ్ మాన్షన్ బాబు హయాం లోనే పూర్తిగా శిథిలమైంది. -
జలాసురుడు..
బాబు హయాంలో రియల్ దాష్టీకం హైదరాబాద్‌లో 104 చెరువులు మాయం చిన్న తటాకాన్ని తలపిస్తుంది.. 200 ఎకరాల విస్తీర్ణం నుంచి 80 ఎకరాలకు కుదించుకుపోయింది. ఇదొక్కటే కాదు.. 1995 నుంచి 2004 మధ్యకాలంలో యథేచ్ఛ ఆక్రమణలతో చెరువులన్నీ సహజ స్వరూపాన్ని కోల్పోగా దాదాపు 104 చెరువులు పూర్తిగా మాయమైపోయాయి.. హెచ్ఎండీఏ అధికారి సర్వేలో వెల్లడైన వాస్తవాలివి. చంద్రబాబు జమానాలో హైదరాబాద్‌లో నిరాటంకంగా సాగిన జలవనరుల విధ్వంసాలకు శిథిలసాక్ష్యాలు. భాగ్యనగరం, దానిచుట్టుపక్కల ఒకప్పుడు 500లకు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు ఉండేవి. ఎంతపెద్ద వర్షం కురిసినా గొలుసుకట్టుగా ఒక చెరువు నిండగానే మరో చెరువులోకి నీళ్లు వచ్చేవి. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో విచ్చలవిడిగా జరిగిన ఆక్రమణల వల్ల ఇవన్నీ కుచించుకుపోయాయి. 2004 సంవత్సరం నాటికి 10 హెక్టార్ల పైన విస్తీర్ణం కలిగిన చెరువులు కేవలం 169 మాత్రమే మిగిలి ఉన్నట్లు హెచ్ఎండీఏ సర్వేలో తేలింది. 111 జీవోకు తూట్లు: బాబు అండదండలతో కొందరు రాజకీయ ప్రముఖులు జలాశయాల శిఖాన్నే ఆక్రమించి రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, విద్యాసంస్థలను నిర్మించుకొన్నారు. 111జీవోలో ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేకపోయినా అది ఈ బడా వ్యక్తులను అడ్డుకోలేక పోయిం ది. దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా మారుస్తున్నట్లు ప్రకటనలు చేసి న బాబు చెరువులు ఆక్రమణలకు గురికాకుండా బఫర్‌జోన్‌ను అమలు చేయలేకపోయారు. దుర్గం చెరువు వద్ద నిర్మాణాలకు అనుమతులిచ్చేటప్పుడు ఎఫ్టీఎల్ను కూడా ఖాతరు చేయలేదు. ఇక్కడ బహుళ అంత స్తు భవనాలు నిర్మించినవారంతా బాబు పరివారంలోని ప్రముఖులే. ‘రియల్’దాష్టీకం: సుమారు 240 చ.కి.మీ పరిధిలోని హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. వర్షాకాలంలో కూకట్పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండి ఆ నీరు నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు వెలిశాయి. కూకట్పల్లి ప్రగతినగర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, కుత్బుల్లాపూర్ కుంట, పంతులు చెరువు, రంగధాముని చెరువులు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. శేరిలింగపల్లి మండల పరిధిలోని గంగారం పెద్దచెరువు, మదీనాగూడ చెరువు, చందానగర్ వద్ద బచ్చుకుంట, మల్లయ్య కుంట, మియాపూర్ పటేల్‌చెరువు, గోపన్‌పల్లి వద్ద నల్లకుంటలదీ అదే దుస్థితి. బాలానగర్ మండలం పరిధిలో 16 చెరువులున్నట్లు రికార్టులు సూచిస్తున్నాయి. అయితే సున్నం చెరువు, కాజాకుంట, ఈదుల కుంట, ఈదుల కుంట, భీముని కుంట,అలీ తలాబ్‌చెరువు, నల్లచెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. సరూర్‌నగర్ చెరువు, కర్మన్‌ఘాట్‌లోని చేపల చెరువు, రామంతపూర్ చెరువు, ఉప్పల్ నల్ల చెరువులూ ఆక్రమణదారుల పాలయ్యాయి. రియల్టర్లు, డెవలపర్స్ నుంచి అప్పట్లో పార్టీ ఫండ్ రూపంలో పెద్దమొత్తంలో ముడుపులు అందడంతో ఆక్రమణదారులపై బాబు వల్లమాలిన ప్రేమను ఒలకబోశారు. ఫలితంగా చెరువులు మాయమైపోయాయి -
ఎంచుకో.. దోచుకో
సెలక్ట్ ఏరియా డెవలప్మెంట్.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డంపెట్టి తన బినామీలు, బంధుమిత్రులకు లాభం చేకూర్చేందుకు ఉద్దేశించిన బృహత్తర పథకం. ఇది అక్కడి రైతులను బికారీలుగా మారిస్తే తనవారిని రూ.వందల కోట్లకు అధిపతులను చేసింది. శిల్పారామం, సైబర్టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబ రాబాద్ పోలీస్ కమిషనరేట్.. ఇలా ప్రతీసంస్థను ఆనుకుని తన బినామీ మురళీమోహన్‌కు చెందిన ‘జయభేరి’ ఎన్క్లేవ్, కౌంటీ,వ్యాలీలు ఉండేటట్టు ప్రణాళిక రూపొందించిన బాబు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని వేలాది ఎకరాలను పథకం ప్రకారం కొల్లగొట్టారు. శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయన బినామీలు రెచ్చిపోయారు. మాదాపూర్‌లో సైబర్ టవర్స్ ఏర్పాటు యోచనను మురళీమోహన్ బృందానికి బాబు లీక్ చేసిందే తడవుగా మాదాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 65, 65(అ), 67(అ)లో రమీజా బీ, చాంద్ పాషా, నజీర్ అనే సాధారణ రైతుల నుంచి అతి చౌకగా ‘జయభేరి’ పేరుతో 22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు వ్యవహారం పూర్తవగానే 1997 ఏప్రిల్ 27న చంద్రబాబు సైబర్ టవర్స్‌కు శంకుస్థాపన చేసి 1998 నవంబర్ 22న ప్రారంభించారు. సైబర్ టవర్స్, శిల్పారామాలను ఆనుకుని ఉన్న భూమిని ముందస్తు లీకులతో సొంతం చేసుకున్న మురళీమోహన్ అక్కడ జయభేరి ఎన్క్లేవ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మూడు వెంచర్లు.. ఆరు కౌంటీలుగా శేరిలింగంపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వరంగ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల వివరాలన్నీ భూసేకరణకు ముందుగానే బాబు తన బినామీలకు లీక్ చేశారు. దీంతో వారు కొనుగోలు చేసిన భూములను ఏపీఐఐసీ భూ సేకరణ నోటిఫికేషన్లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత జయభేరి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనతికాలంలోనే మూడు వెంచర్లు, ఆరు కౌంటీలుగా వెలిగిపోయింది. గచ్చిబౌలిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చంద్రబాబు జనవరి 2004లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే గచ్చిబౌలి సర్వే న ంబర్ 55,56,57,58లలో 18 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్న మురళీమోహన్‌కు చెందిన పయొనీర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ, ఆ తర్వాత దాన్ని ‘జయభేరి పైన్ వ్యాలీ’ పేరుతో అభివృద్ధి చేసి విక్రయించింది. అదే పంథాలో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను అనుకుని ఉండే సర్వే నంబర్ 103, 105, 106,109లలో పదిహేను ఎకరాల్లో జయభేరి ఎన్క్లేవ్ పేరుతో వెంచర్ చేసి విక్రయించారు. కొండాపూర్‌లో జయభేరి నిర్మించిన సిలికాన్ కౌంటీ భూములు కూడా బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొనుగోలు చేసినవే. కారుచౌకగా భూములు కొట్టేసిన ‘జయభేరి’.. చివరకు విక్రయించిన భూమిని సైతం కబ్జా చేసేం దుకు వెనుకాడలేదు. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని మరో సంస్థకు జయభేరి అమ్మినట్టు బండరెడ్డి మధుసూదన్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో మురళీమోహన్‌పై 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. భూ సేకరణ పేరుతో భారీ దందా 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోసం నానక్‌రాంగూడలో భూ సేకరణ పేరుతో భారీ దందా నడిపింది. ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరిస్తున్నామంటూ ఏపీఐఐసీ సర్వే బృందాలను రంగంలోకి దింపి అక్కడి రైతులు, భూ యజమానుల్లో భయాందోళనలు రేకెత్తించారు. తర్వాత ఆ భూములను ఏపీఐఐసీ నోటిఫికేషన్ నుంచి మినహాయించి సొంత బావమరిది బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర తదితరుల చేత చౌకగా కొనుగోలు చేయించారు. ఈ భూముల్లోనే నేడు భారీ భవంతులు లేవగా, దాన్ని ఆనుకునే జయభేరి ఆరెంజ్ కౌంటీ విస్తరించింది. ‘సైబరాబాద్’లోనూ అవినీతి సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ(సీడీఏ) ఏర్పాటులోనూ చంద్రబాబు అవినీతికి తెరతీశారు. ఐటీ జోన్లో మౌలిక సదుపాయాల సత్వర కల్పన కోసం జీఓ ఎస్ఎం నంబర్ 21(జనవరి 20,2001) జారీ చేసి శేరిలింగంపల్లి మునిసిపాలిటీలోని 17 గ్రామాల పరిధిలో 51.70 చదరపు కిలోమీటర్ల మేరకు సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ( సీడీఏ)ను విస్తరించారు. సీడీఏలో సైబర్‌టవర్స్‌కు 12 కి.మీల దూరంలో ఉన్న గోపనపల్లి మురికివాడలు, లంబాడీతండాలను చేర్చిన ప్రభుత్వం సైబర్‌టవర్స్‌ను ఆనుకుని ఉన్న కొండాపూర్‌ను మాత్రం మినహాయించింది. ఇక్కడ తన భార్య భువనేశ్వరి, తన బినామీ సంస్థ జయభేరితోపాటు తన బంధువుల ఆస్తులుండడమే అందుకు కారణమంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. సీడీఏ ఉత్తర్వులు వచ్చిన సమయంలో కొండాపూర్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో జయభేరి సిలికాన్ టవర్స్, మరో నాలుగు ఎకరాల్లో జయభేరి క్లబ్ నిర్మాణాలు ప్రారంభం కావడంతో డెవలప్మెంట్ చార్జీల భారాన్ని తప్పించేందుకే బాబు అలా చేశారన్న ఫిర్యాదులున్నాయి. అంతేకాక సీడీఏ ప్లాన్‌లో పేర్కొన్నట్టుగా దారిని 120:120 అడుగుల మేర విస్తరించాల్సి ఉన్నా తన జేబు సంస్థ జయభేరి భూములకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో విస్తరణను నిలిపేశారు. మురికివాడలపై ప్రతాపం హైటెక్ సిటీలో విస్తృత మౌలిక సదుపాయాల కోసం సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అసలు ప్రాంతాలను వదిలేసి మురికివాడలపై తన ప్రతాపాన్ని చూపింది. సీడీఎ అమలు వల్ల నిర్మాణ చార్జీలు మూడింతలయ్యాయి. 2002 నుంచి సీడీఏ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని నిబంధన విధించారు. హైదరాబాద్ మునిసిపల్, శివారు మునిసిపాలిటీల కంటే రెట్టింపు బెటర్మెంట్ చార్జీలు వడ్డించారు. నిర్మాణాల అనుమతులకు చదరపు మీటరుకు రూ.200 అదనంగా చెల్లించాలని షరతులు విధించారు. ఇది సాధారణ ప్రజలకు పెను శాపమైంది. -
కాంట్రాక్టర్ల కోసమే ఫ్లై ఓవర్లు
కాంట్రాక్టర్ల కోసమే తలపెట్టినట్లుగా ఎలాంటి ప్రణాళిక, ముందుచూపు లేకుండా కట్టించిన ఫ్లైఓవర్లు ప్రస్తుతం అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలోని 16 ఫ్లైఓవర్లలో ఎనిమిది బాబు జమానాకు సంబంధించినవే. వీటివల్ల ట్రాఫిక్ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రకాష్‌నగర్ ‘టి’ జంక్షన్ ఫై ్లఓవర్ను బేగంపేట వరకు మరో 500 మీటర్లు పొడిగిస్తే అత్యంత రద్దీ చౌరస్తాల్లో ఒకటైన రసూల్‌పుర మీదుగా ప్రయాణించే వారికి కొంత ఊరట లభించేది. కానీ అలా చేయకపోవడం వల్ల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. బేగంపేట-సంగీత్ థియేటర్ చౌరస్తాల మధ్య నిర్మించిన చీఫ్ టెలికామ్ ఆఫీసర్ (సీటీఓ) ఫై ్లఓవర్,మాసబ్‌ట్యాంక్, నారాయణగూడ ఫ్లై ఓవర్లు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో తెలియక ఏడేళ్ల పాటు దానిని గాలి లోనే ఉంచారు. మరోవైపు ఫ్లైఓవర్లను ఇరుగ్గా నిర్మించి ట్రాఫిక్ కష్టాలను రెట్టింపు చేశారు. నిజానికి వీటిని ఆరు లేన్లగా తీర్చిదిద్దాల్సి ఉండాల్సిందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ఇరుగ్గా అగ్గిపెట్టెల్లా నిర్మించారనే ఆరోపణలున్నాయి. వీటి నిర్వహణలో అశ్రద్ధ కారణంగా పదేళ్లకే బీటలు వారుతున్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు పగళ్లు ఏర్పడటం నాణ్యతా లోపమే కారణమని ఇంజనీర్లు చెబుతున్నారు. -
గోబెల్స్ బాబు.. సైబర్ డాబు
ఐటీ అనగానే హైదరాబాద్‌లోసైబర్‌టవర్స్‌ను చూపి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు జమానాలో ఐటీ అభివృద్ధి గోరంతే.1999లో ప్రారంభమైన సైబర్ టవర్స్‌లో ఐటీ అభివృద్ధి టవర్స్ గడప కూడా దాటలేదు. అప్పట్లో ఆరు కంపెనీలు మాత్రమే ఇందులో తాత్కాలికంగా కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. సరిపడా మౌలిక వసతులు లేకపోవడంతో సొంత భవనాలు ఏర్పాటు చేసుకున్నాక అవి సైబర్ టవర్స్‌కు గుడ్‌బై చెప్పేశాయి. ఈ టవర్స్‌లో మరో 28 సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసుకునే స్థలం ఉన్నా బాబు సర్కారు నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో అవి ముందుకురాలేదు. దీంతో సైబర్టవర్స్ నాలుగేళ్ల పాటు బోసిపోయింది. పరువుపోతుందన్న ఆందోళనతో ప్రభుత్వం విధాన నిర్ణయాలు మార్చుకోవడంతో 2003 చివరి నాటికి మరో 28 కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో అప్పటి వరకు ఉపాధి పొందుతున్న ఐదువేల మందితోపాటు మరో మూడువేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. రూ.120 కోట్ల విలువైన సైబర్టవర్స్ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ సంస్థతో బాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని ప్రతిగా ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను కొట్టేశారు. -
చరిత్ర చూడని విధ్వంసం
పరిశ్రమల ఉసురు తీసిన బాబు చంద్రబాబు నాయుడు అమలు చేసిన అప్రజాస్వామిక విధానాలతో వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. రూ.వందల కోట్ల లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి, నష్టాల్లో ఉన్నవాటిని నిర్దాక్షిణ్యంగా మూసివేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కువ శాతం చంద్రబాబు హయాంలోనే మూతపడ్డాయి. నగరంలోని ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్, ప్రాగా టూల్స్, స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, మీట్ అండ్ పౌల్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ టెక్స్టైల్ కో ఆపరే షన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలతో పాటు ఐడీపీఎల్ వంటి కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా మూతపడ్డాయి. ఒక్కో పరిశ్రమ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను తొల గించారు. అప్పటి వరకు లాభాల్లో నడుస్తున్న ఆల్విన్ రిఫ్రిజిరేటర్ కంపెనీని ఓల్టాస్ అనే ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేశారు. దీంతో సుమారు 3000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అలాగే 18 షుగర్ మిల్లులను, 12 స్పిన్నింగ్ మిల్లులను బాబు మూసివేశారు. కేసులు పెట్టి.. బలవంతపు వసూళ్లకు పాల్పడి.. చంద్రబాబు పాలనలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా చితికి పోయాయి. విద్యుత్ బిల్లులు కట్టలేక భారీ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, గృహాలు రోజుల తరబడి అంధకారంలో మగ్గిపోయాయి. కరె ంటు బిల్లులు చెల్లించని వినియోగదారులపై చంద్రబాబు కేసులు పెట్టించి జైళ్లలో వేయించారు. రోగులనూ వదలని బాబు టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో సర్కారు వైద్యం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. ఉచిత వైద్యానికి స్వస్తిచెప్పి ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసిన ఘనుడు చంద్రబా బు. ‘గాంధీ’ సహా పలు ఆస్పత్రులను ప్రైవేటీకరించేం దుకు పన్నిన కుట్రలను వైద్యులు తిప్పి కొట్టారు. పాతబస్తీ బతుకులు చిన్నాభిన్నం చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో పాతబస్తీ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జన్మభూమి పేరుతో పర్యటనలు తప్ప పాతబస్తీ అభివృద్ధికి నయాపైసా విడుదల చేయలేదు. నిజాం కాలం నాటి డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థ, శిథిలావస్థకు చేరిన రోడ్లు, పాఠశాల భవనాలు, ఇరుకు గల్లీలు, మురుగు కాలువల పరిస్థితిలో మార్పులేక పాతబస్తీ పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో పేదల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు పెద్దగా నిధుల కేటాయించకపోవడంతో స్వయం ఉపాధి కూడా అందని ద్రాక్షగా మారింది. మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన దుకాణ్-మకాన్ పథకం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయిం ది. దీంతో దాదాపు లక్షమంది ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. ఇంకొందరు అక్రమ కేసులు, కక్ష సాధింపులకు గురై జైళ్లపాలయ్యారు. -
మూసీ మురుగుకు ఆద్యుడు
రాష్ట్ర రాజధాని నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న చారిత్రక మూసీనది కాలుష్య కోరల్లో చిక్కుకుని శిథిలమయ్యేందుకు బాబు జమానాలోనే పునాది రాయి పడింది. బాబు జమానాలో 1996 నుంచి 2003 మధ్య ఫార్మా, బల్క్‌డ్రగ్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అనుమతులిచ్చారు. ఫాక్స్‌సాగర్, జీడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి, పికెట్‌నాలా, బోయిన్పల్లి నాలా, బల్కాపూర్నాలాల పరిసరాల్లో విస్తరించిన ఈ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు తొలుత హుస్సేన్‌సాగర్‌లో చేరి అక్కడి నుంచి మూసీలో కలుస్తున్నాయి. ఫలితంగా దేశంలో అత్యంత విషతుల్యమైన నదుల్లో మూసీ నాలుగో స్థానంలో నిలిచి ఆందోళన కలిగిస్తోంది. బల్క్‌డ్రగ్స్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వదులుతున్న వ్యర్థాల్లో ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం వంటి హానికారక మూలకాల మోతాదు శ్రుతిమించిందని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మూలకాల కారణంగా వ్యవసాయ పంటలు, నీటిలోని ఆల్గే, వృక్ష, జంతు ఫ్లవకాలు, భూగర్భ జలాలు విషతుల్యమై పరీవాహక ప్రాంతాల్లో మానవ మనుగడకే పెనుముప్పు వాటిల్లుతోంద ని ఎన్జీఆర్ఐ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. మూసీనది సుందరీకరణకు చంద్రబాబు హయాంలో రూ.200 కోట్లతో సిద్ధం చేసిన ప్రాజెక్టు ప్రహసనంగా మారింది. అంతేకాక నది మధ్యలో అప్పట్లో వాణిజ్య కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సన్నాహాలు చేయడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బాబు సర్కారు వెనక్కి తగ్గింది. -
మట్టి మనిషి
రైతు పచ్చగా కళకళ లాడిన నాడు మాత్రమే రాష్ట్రం స్వర్ణయుగం అవుతుందన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మాటనే తన బాటగా మలచుకున్నారు ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. తండ్రి మాదిరిగానే అహర్నిశలూ అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా పోరాడుతున్న రైతు పక్షపాతి వైఎస్ జగన్. రైతులకు మద్దతు ధర కోసం రోడ్డెక్కినా, రుణాల రీ షెడ్యూలింగ్ కోరుతూ ధర్నా చేసినా, కరెంటు కోతలతో అల్లాడుతున్న అన్నదాతకు మద్దతుగా కలెక్టరేట్లను ముట్టడించినా... అన్నం పెట్టే ఆ చేయి చల్లగా ఉండాలన్న వైఎస్ జగన్ తపన అన్నింట్లోనూ అడుగడుగునా కన్పిస్తుంది. తొమ్మిదేళ్ల పాలనతో వ్యవసాయ రంగం ఉసురు పోసుకుని, అసలు సాగే దండగంటూ ఎద్దేవా చేసి, అదే నోటితో ఇప్పుడు అధికారం కోసం రైతు పాట పాడుతున్న ఆల్‌ఫ్రీ బాబుల తరహా ఎన్నికల రాజకీయాలు జగన్‌కు అస్సలు చేతకావు. మాటకు మనసుండాలని, నాయకుడన్న వాడికి విశ్వసనీయత ఉండాలని త్రికరణశుద్ధిగా నమ్మే నేత ఆయన. తండ్రి నుంచి తనకు అందివచ్చిన వారసత్వం కూడా అదేనని ఎప్పుడూ చెబుతుంటారు వైఎస్ జగన్. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచీ ఇప్పటిదాకా జగన్ ఎప్పుడూ రైతు పక్షమే. గత నాలుగేళ్లుగా రైతుల పక్షాన ఆయన చేపట్టిన దీక్షలే అందుకు సాక్షి. రైతన్నకు అన్యాయం జరిగిన ప్రతిసారీ, ప్రకృతి ప్రకోపానికి వారు బలైనప్పుడల్లా నేనున్నానంటూ ముందుకొచ్చారు జగన్. అధైర్యపడొద్దంటూ వారి వెన్ను తట్టారు. బాధ్యతను విస్మరించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను రైతుల పక్షాన ఎప్పటికప్పుడు నిలదీశారు. దీక్షలు, ఆందోళనలు, ఓదార్పు యాత్రల్లో తాను గమనించిన రైతు సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పలు వాగ్దానాలు చేశారు జగన్. వీటన్నింటి వెనకా ఆయన లక్ష్యం ఒక్కటే... రైతు రాజ్యాన్ని, రైతే రాజుగా మారే రోజును తేవడం... లక్ష్య దీక్ష -21-12-2010 రైతుల సమస్యలపై (48 గంటలు) విజయవాడ తుపాన్లు, భారీ వర్షాల దెబ్బకు పంట కోల్పోయి 15 రోజుల్లో 126 మంది రైతులు మరణించినా కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదంటూ మండిపడ్డారు. సర్వం కోల్పోయి రైతులు అల్లాడుతుంటే, వారి నుంచి సగం ధాన్యాన్ని మాత్రమే కొంటానంటూ వ్యాపారుల కంటే అధ్వానంగా వ్యవహరిస్తోందం టూ దుయ్యబట్టారు. రైతును విస్మరిస్తే సర్కారుకు మూడినట్టేనని హెచ్చరించారు. ‘నాణ్యత ప్రమాణాల షరతుల్లేకుండా మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ఇన్పుట్ రాయితీ ని రూ.1,800 నుంచి కనీసం రూ.3,600 కు పెంచాలి. వ్యవసాయ రుణాలను రీ షెడ్యూల్ చేయాలి. వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలి. వచ్చే రబీలో రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి. నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.5,000 అదనపు సాయం అందించాలి. పంటను పూర్తిగా కోల్పోయిన కౌలు రైతులను అన్నిరకాలా ఆదుకోవాలి. వారికి గుర్తింపు కార్డులిచ్చి, పావలా వడ్డీని వర్తింపజేయాల’ని డిమాండ్ చేశారు. జలదీక్ష-11-01-2011 ఢిల్లీ: కృష్ణానదీ జలాల్లో రాష్ట్రానికి అన్యాయంపై (24 గంటలు) కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జలదీక్ష చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులతో పాటు భారీగా రైతులు కూడా దీక్షలో పాల్గొన్నారు. ‘‘ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు అనుమతించరాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణం ట్రిబ్యునల్‌లో అప్పీలుకు వెళ్లాలి. రాష్ట్రం తరఫున కేంద్రం కూడా ఇంప్లీడ్ కావాలి’’ అని జగన్ డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును తిరగదోడాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. హరితయాత్ర 07-02-2011 పోలవరం నిర్మాణం కోసం (4రోజులపాటు పాదయాత్ర) రావులపాలం-పోలవరం పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలనే డిమాండ్‌తో 4 రోజుల పాటు 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రైతులు తదితరులు భారీ సంఖ్యలో వెంట నడిచారు. పోటెత్తిన జనసందోహం నడుమ ఆఖరి రోజున చివరి ఆరు కిలోమీటర్ల దూరం నడిచేందుకు జగన్‌కు ఏకంగా ఐదు గంటలు పట్టింది! కేంద్రం పట్టించుకోకపోతే పోలవరాన్ని మీరు కట్టలేరా అంటూ యాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై జగన్ నిప్పులు చెరిగారు. 32 మంది ఎంపీలను పంపి కూడా అడుక్కునే దుస్థితి ఎందుకంటూ నిలదీశారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం ఆలోచన చేసినా పోలవరం ఎప్పుడో పూర్తయి ఉండేదన్నారు. కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా తక్షణం పోలవరం నిర్మాణానికి టెండర్లు పిలవాలని, లేదంటే తీవ్ర ఆందోళన తప్పదంటూ హెచ్చరించారు. రైతు దీక్ష 15-05-2011 రైతుల సమస్యలపై (48 గంటలు) గుంటూరు కనీస మద్దతు ధర అందక అల్లాడుతున్న రైతులకు దన్నుగా చేసిన దీక్ష. ‘‘ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు తక్షణం రూ.1,000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. క్వింటాలుకు రూ.100 బోనస్ ధర ప్రకటించాలి’’ అంటూ ఈ సందర్భంగా జగన్ పలు డిమాండ్లు చేశారు. దీక్షలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పురుషులు, యువత, అభిమానులు అసంఖ్యాకంగా దీక్షకు తరలివచ్చి జగన్‌కు సంఘీభావం ప్రకటించాు. సాగుపోరు 13-06-2011 రైతు సమస్యలపై ధర్నా చిత్తూరు రైతు సమస్యల తక్షణ పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్ష. రైతులు అడుగడుగునా కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదంటూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొని జగన్ నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్దా భారీ స్థాయిలో రైతులు ధర్నాలు నిర్వహించారు. మహాధర్నా 01-10-2011 రైతులు సమస్యలపై ధర్నా విజయవాడ అన్నదాత సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ‘‘మద్దతు ధరను రైతుకు హక్కులా మార్చాలి. క్వింటాలుకు కనీసం రూ.300 మిగిలేలా చూడాలి. వ్యవసాయ రుణాలివ్వడంతో పాటు పంటల బీమాను కూడా రైతు హక్కులుగా మార్చాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరల్లో పెరుగుదలను ప్రభుత్వమే భరించాలి. ప్రాకృతిక నష్టాలు రైతు వెన్ను విరవకుండా చూసేందుకు రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. గోదాముల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. కరెంటు పోరు 11-10-2011 కరెంటు కోతలకు నిరసనగా వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ కరెంటు కోతలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. కడప కలెక్టరేట్ వద్ద జగన్ స్వయంగా పాల్గొన్నారు. ‘‘సాగుకు కరెంటివ్వరు. అడిగితే అన్నదాతను అరెస్టులు చేయిస్తారు. తప్పుడు కేసులు, దొంగ కేసులు పెడతారు’’ అంటూ దుయ్యబట్టారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా సాగుకు సజావుగా కనీసం ఏడు గంటల పాటు కరెంటివ్వాలని డిమాండ్ చేశారు. అల్ప వర్షపాతం నమోదైన 435 పై చిలుకు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, అక్కడి రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. రబీ సీజన్లో కూడా వారికి తిరిగి రుణాలివ్వాలన్నారు. రైతుదీక్ష 10-01-2012 రైతులకు గిట్టుబాటు ధరల కోసం (48 గంటలు) ఆర్మూరు (నిజామాబాద్) ‘సర్కారు మొద్దు నిద్ర’ను వదిలిచేందుకు చేపట్టిన దీక్ష. రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ రెండేళ్లుగా ఎంతగా ఉద్యమించి నా, ఎన్ని దీక్షలు, ధర్నాలు చేసినా ఈ చెవిటి సర్కారుకు పట్టడం లేదంటూ దుమ్మెత్తిపోశారు జగన్. రైతులను, రైతు కూలీలను గాలికొదిలేసిందంటూ మండిపడ్డారు. ‘పసుపు, చెరకు, మిరప, పత్తి, వరి రైతును ఆదుకునేందుకు రూ.3,000 కోట్లతో తక్షణం మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. సాగుకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలి. ప్రకటించిన 800 పైచిలుకు కరువు మండలాల్లో రైతులకు తక్షణం సాయం అందజేయాల’ని డిమాండ్ చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా పల్లెలకు పల్లెలే కదిలి వచ్చిన అపూర్వ దృశ్యం రైతు దీక్ష సందర్భంగా ఆవిష్కృతమైంది. నిరాశ చెందొద్దని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని, మంచి రోజులు వస్తాయని పసుపు రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘సర్కారు మొద్దు నిద్ర’ను వదిలిచేందుకు చేపట్టిన దీక్ష. రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ రెండేళ్లుగా ఎంతగా ఉద్యమించి నా, ఎన్ని దీక్షలు, ధర్నాలు చేసినా ఈ చెవిటి సర్కారుకు పట్టడం లేదంటూ దుమ్మెత్తిపోశారు జగన్. రైతులను, రైతు కూలీలను గాలికొదిలేసిందంటూ మండిపడ్డారు. ‘పసుపు, చెరకు, మిరప, పత్తి, వరి రైతును ఆదుకునేందుకు రూ.3,000 కోట్లతో తక్షణం మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. సాగుకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలి. ప్రకటించిన 800 పైచిలుకు కరువు మండలాల్లో రైతులకు తక్షణం సాయం అందజేయాల’ని డిమాండ్ చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా పల్లెలకు పల్లెలే కదిలి వచ్చిన అపూర్వ దృశ్యం రైతు దీక్ష సందర్భంగా ఆవిష్కృతమైంది. నిరాశ చెందొద్దని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని, మంచి రోజులు వస్తాయని పసుపు రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. విద్యుత్ పోరు 03-04-2012 విద్యుత్ చార్జీల పెంపున కు నిరసన ధర్నా మొగల్తూరు (పశ్చిమగోదావరి) కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ దీక్షకు దిగారు. రైతుల కష్టాలను పట్టించుకోని, కన్నీళ్లను తుడిచేందుకు ప్రయత్నం కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం... కరెంటు చార్జీలను మాత్రం ఎడాపెడా పెంచుతూ మోయలేని భారం మోపుతోందంటూ తూర్పారబట్టారు.(ఇవేగాక రాష్ట్రవ్యాప్తంగా 300 రోజులకుపైగా ఓదార్పు యాత్ర చేసి పలు రైతు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు జగన్) 11-03-2012 పత్తి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి జగన్ లేఖ రాశారు. నిషేధం వల్ల పత్తి ధరలు దారుణంగా పడిపోతున్నాయంటూ ఆవేదన వెలిబుచ్చారు. పత్తి ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దాని మద్దతు ధరను రూ.5,500కు పెంచాలని కోరారు. విద్యుత్ పోరు 02-04-2013 విద్యుత్ చార్జీల పంపున కు నిరసన ధర్నా ఎమ్మెల్యే క్వార్టర్స హైదరాబాద్ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష కరెంటు చార్జీల పెంపు, ఎడాపెడా కోతలకు నిరసనగా వైఎస్సార్సీపీ 30 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఏకధాటిగా వర్షం కురిసినా లెక్క చేయకుండా దీక్షను కొనసాగించారు. ఐదు రోజుల అనంతరం దీక్షపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపింది. అర్ధరాత్రి వేళ ఖాకీలు ఒక్కసారిగా విరుచుకుపడి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అమానుషంగా లాక్కెళ్లారు. అంతేగాక విద్యుత్ సంక్షోభం తదితరాలపై కూడా ఎప్పటికప్పుడు విజయమ్మ ధర్నాలు, దీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబు సర్కారు బాటలోనే నడుస్తోందంటూ నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా ప్రజా సమస్యలు, రైతుల ఇక్కట్లపై ఎప్పటికప్పుడు ధర్నాలు, దీక్షలు నిర్వహించారు. అంతేగాక తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే ‘మరో ప్రజాప్రస్థానం’ వేలాది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి రాష్ట్ర చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్నారు షర్మిల. 07-09-2011 ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్య పరిష్కారం కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను కలిశారు. ఒకదాని వెనక ఒకటిగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వాటి పరిష్కారానికి తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలన్నారు. కౌలు రైతులకూ రుణాలు లభించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 08-09-2011 పవార్‌ను కలిసిన మర్నాడే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కూడా జగన్ భేటీ అయ్యారు. అన్నిరకాలుగా సమస్యల్లో కూరుకుపోయిన రాష్ట్ర రైతులకు అండనివ్వాలని కోరారు. ‘కనీస మద్దతు ధర పెంచండి. అందుకు ఒక శాశ్వత యంత్రాంగాన్ని నెలకొల్పండి. ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి వెంటనే వాటి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి మంచి జరుగుతుంది వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయరంగానికి ఇద్దరు మంత్రులుండాలన్న నిర్ణయం బాగానే ఉంది. కానీ వారు వ్యవసాయ కుటుంబాలకు చెందినవారైతే మరీ మంచిది. రెండు జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల ఉండాల్సిన అవసరాన్ని గుర్తించడం మంచి పరిణామం. ప్రతి జిల్లాలో అగ్రోప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుతో రైతుల ఉత్పత్తులకు అధిక ధర పలుకుతుంది. రూ.3 వేల కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న హామీ రైతులకు వరం. - డాక్టర్ ఎం.మల్లారెడ్డి, అసోసియేట్ డీన్, వ్యవసాయ కళాశాల, జగిత్యాల వైఎస్ హయాంలోనే రైతు సంక్షేమం వైఎస్ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.లక్ష నష్టపరిహారం అందించడం గొప్ప విషయం. విత్తు వేసేనాటికి బ్యాంకు రుణాల పంపిణీ, అదనపు గోడౌన్ల నిర్మాణం, రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేస్తానన్న జగన్ హామీలు రైతాంగానికి మేలు చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1300 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేసి, ఉచిత విద్యుత్ ఇవ్వడం రైతాంగాన్ని బలోపేతం చేసింది. కరువు, వరదలతో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ రాయితీ అందజేస్తూ ఆసరాగా నిలవడం గొప్ప విషయం. - డాక్టర్ వాణిశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, జగిత్యాల ధరల స్థిరీకరణ నిధితో కొండంత భరోసా రైతులకు పూర్తిగా న్యాయం జరగాలంటే ఓట్లతో నిమిత్తం లేకుండా చిత్తశుద్ధితో రైతు గురించి ఆలోచించే నాయకుడు కావాలి. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వురణం తరువాత నాయుకులెవరూ రైతును పట్టించుకోలేదు. రాష్ట్రంలో రైతు పరిస్థితి దారుణంగా మారిన తరుణలో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిం ది. రైతులకు ‘ధరల స్థిరీకరణ నిధి’ భరోసా కల్పిస్తుంది. పంటలకు మద్దతు ధర ప్రకటించే అధికారం రాష్ర్ట ప్రభుత్వాలకు లేకపోవడంతో గిట్టుబాటు ధర ప్రకటనలకే పరిమితమైంది. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. భూసార పరీక్షలు, పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు 102, పాడి రైతుల సంక్షేమానికి 103, రెండు జిల్లాలకు ఓ వ్యవసాయ కళాశాల వంటివి రైతాంగానికి కొండంత భరోసా కల్పించేలా ఉన్నాయి. - డాక్టర్ కళత్తూరు సుధాకర్‌రెడ్డి, డీన్, విన్స్ కళాశాల, తిరుపతి నాకు అయిదెకరాల భూమి ఉంది. మూడు విద్యుత్ మోటార్లున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక్కొక్క మోటార్‌కు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు బిల్లు కట్టెటోడిని. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే నా మూడు మోటార్ల బకాయిలు రూ.10 వేలతో పాటు, ఏటా కట్టే రూ.9 వేలు మాఫీ అయ్యాయి. - సంగెపు రాంరెడ్డి, గ్రామైక్య రైతు సంఘాధ్యక్షుడు, లక్ష్మిపూర్, కరీంనగర్ జిల్లా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది నాడు దివంగత నేత వైఎస్ ఒక్కరే రైతుల గురించి ఆలోచించి రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు. నేడు జగన్ రూపొందించిన మేనిఫెస్టోలో రైతులకు ప్రాధాన్యత ఇచ్చాడు. రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయడం.. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. జగన్‌తో మళ్లీ రాజన్న రాజ్యం రావడం ఖాయం. - ఎం.ఈశ్వరరెడ్డి, కావలి (నెల్లూరు జిల్లా) రైతు రాజ్యం వస్తుంది ప్రకృతి వైపరీత్యాలతో నాలుగేళ్లుగా పంటలు కోల్పోతున్నాం. ప్రభుత్వం నేటికీ నష్టపరిహారం అందించలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి వ్యవసాయం చేయాలంటేనే భయంగా ఉంది. పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైఎస్సార్ లాగానే జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకుంటారని ఎన్నో ఆశలతో ఉన్నాం. - రైతు కోటిపల్లి భగవాన్, అన్నవరప్పాడు (పశ్చిమగోదావరి జిల్లా) రైతుకు భద్రత రైతు సంక్షేమమే లక్ష్యంగా రూపొందించిన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో రూ. మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొనడం దేశ చరిత్రలో అపూర్వం. అతివృష్టి, అనావృష్టి, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలతో రైతు కుదేలవుతున్నాడు. అటువంటి విపత్కర పరిస్థితులలో రైతును ఆదుకునేందుకు ప్రతి ఏటా రూ. రెండు వేల కోట్లతో సహాయనిధి ఏర్పాటు చేసి రైతు సోదరులకు భద్రత కల్పించడం ప్రశంసనీయం. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావాలతో పంటకు గిట్టుబాటు ధరలేక దళారీల దోపిడీకి గురవుతున్న స్థితిలో రైతుకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించడం రైతు సంక్షేమానికి ఎంతో ఆవశ్యం. రూ. 20 లక్షల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ మహిళాభ్యుదయానికి మకుటాయమానం. రైతు సోదరులంతా రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్సీపీకి ఓటేస్తారనడం నిస్సందేహం. - డాక్టర్ పి.వి. సుబ్బారావు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, చిలకలూరిపేట -
రానున్నది రైతు రాజ్యామే...
రైతు సంక్షేమమే వైఎస్ జగన్ ధ్యేయం అన్నదాత పక్షాన వైఎస్ తనయుడి నిత్య పోరాటాలు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోనూ ప్రతిఫలించిన లక్ష్యం సాగును లాభదాయకం చేసేలా నిండైన భరోసా పిన్నింటి గోపాల్ 1. రైతులకు ఆసరాగా నిలవాల్సిందే. గిట్టుబాటు ధర కల్పించాల్సిందే. అందుకు 3 వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం 2. కరువులు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల్లో రైతులకు ఆసరాగా ఉండాలి. పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి, వీలైనంత త్వరగా పరిహారం చెల్లించాలి. అందుకు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. తర్వాతి పంట నాటికల్లా పరిహారం రైతు చేతికందిస్తాం 3. వ్యవసాయానికి ఇద్దరు మంత్రులుంటారు. ఒకరు వ్యవసాయ ఉత్పత్తులను, మరొకరు ఆ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు 4. {పాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలు.. వ్యవసాయానికి విడిగా బడ్జెట్ 5. {పతి జిల్లానూ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దుతాం. దేశంలో ఈ తరహా పద్ధతి మరెక్కడా లేదు. దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి రాబోయే రైతు రాజ్యానికి సంకేతాలు ఇలా విత్తనం నుంచి పంట విక్రయం దాకా ప్రతి దశలోనూ అన్నదాతలకు అన్ని రకాలుగా భరోసా కల్పించే అంశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. అందరికీ అన్నం పెట్టే రైతు కుటుంబంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా వ్యవసాయానికి మేనిఫెస్టోలో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతు సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం గత నాలుగేళ్లుగా నిత్యం గళమెత్తుతూ, పాలకులను నిలదీస్తూ సాగుతున్న రైతు పక్షపాతి జగన్. రైతు రాజ్యాన్ని స్థాపిస్తానన్న ఆయన వాగ్దానం అన్నదాతకు భరోసాగా నిలుస్తోంది. విత్తనాల దశ నుంచీ అన్ని రకాలుగా ప్రభుత్వ సాయం, గిట్టుబాటు ధర కోసం స్థిరీకరణ నిధి... ఇద్దరు మంత్రులతో పూర్తిస్థాయి పర్యవేక్షణ, సాగుకు విడిగా బడ్జెట్... సాగు చల్లగా సాగేందుకు పలు అంశాలతో జగన్ ఆవిష్కరించిన భావి ప్రణాళిక రైతన్నలో ధీమా నింపుతోంది. తాను అధికారంలోకి రాగానే రైతులు తిరిగి తలెత్తుకునేలా, అన్నదాత స్థైర్యాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో ఐదేళ్లుగా తిష్ట వేసిన పలు సమస్యల పరిష్కారం కోసం పలు మార్గాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాటన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామనే ధీమాను కూడా కల్పించారు. ఇవన్నీ ఎన్నికల గిమ్మిక్కులు కాదు. ఓట్ల ఎత్తుగడలు అసలే కావు. రైతు బాంధవుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయునిగా... రైతుల కోసం అనుక్షణం పరితపించే నైజం జగన్‌కు వారసత్వంగా వచ్చింది. పైగా వైఎస్ మాదిరిగానే రైతుల ఇక్కట్లను అతి దగ్గరగా చూశారు జగన్. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న వాస్తవం ఆయనకు బాగా తెలుసు. అందుకే అన్నదాత సమస్యల పరిష్కారం కోసం పాలకులపై ఒత్తిడి తెచ్చారు. దీక్షలు చేశారు. ప్రకృతి విపత్తులు రైతులను కుంగదీసినప్పుడల్లా వారి మధ్యకు వెళ్లారు. మనో నిబ్బరం కల్పించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర దక్కక దిగాలు పడ్డ రైతుకు ధైర్యం చెప్పారు. వారి తరఫున తాను రోడ్డెక్కారు. కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు. న్యాయం కోసం ఢిల్లీ దాకా వెళ్లారు. ప్రధానిని కదిలించారు. ఏం చేసినా కదలికే లేని పాలకుల నిర్వాకాన్ని క ళ్లారా చూశారు. వైఎస్ హయాంలో మాదిరిగా వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మార్చాలంటే ఏం చేయాలో స్పష్టమైన అంచనాకు వచ్చారు. దాని ఫలితమే... వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో రైతు సంక్షేమానికి పెద్దపీట. మేనిఫెస్టోలోని మరికొన్ని కీలకాంశాలు.. 1. ఆరునూరైనా సాగుకు ఉచితంగా 9 గంటలు విద్యుత్. అందులో 7 గంటలు పగలే నిరంతరాయంగా సరఫరా 2. రైతులకు వడ్డీ లేని రుణాలు, యాంత్రీకరణను ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ 3. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతుల కోసం సరికొత్త రుణ మాఫీ పథకం కోసం కేంద్రంపై ఒత్తిడి 4. పెట్టుబడుల్లేని దుస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు విత్తు వేసేనాటికే రైతులకు బ్యాంకు రుణాలు 5. అదనంగా 40 లక్షల అడుగుల గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యం. ఆధునిక, శీతల గిడ్డంగుల నిర్మాణం 6. రాష్ట్రంలో మూడు వ్యవసాయ వర్సిటీలు. రెండు జిల్లాలకో వ్యవసాయ డిగ్రీ కళాశాల, పరిశోధన కేంద్రం 7. రైతులకు సూచనలిచ్చేందుకు 102 మొబైల్ క్లినిక్‌లు. పొలాల వద్దకెళ్లి నమూనాల సేకరణ, భూసార పరీక్షలు 8. పశువులకు 103 సంచార వైద్యశాలలు. రైతుల చెంతకే పశు వైద్య సేవలు. మండలానికో పశు వైద్యశాల వైఎస్సే స్ఫూర్తి వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి పాటుపడాలన్న వైఎస్ జగన్ తపనకు స్ఫూర్తి ఆయన తండ్రి, మహా నేత దివంగత వైఎస్సే. అన్నదాత బాగుండాలని నిత్యం తపించిన నిజమైన నాయకుడు వైఎస్సార్. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేశారు. సాగుకు ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. రూ.1,259 కోట్ల విద్యుత్ బకాయిలనూ రద్దు చేశారు. రైతులకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే రాష్ట్రానికి మేలే తప్ప భారం కాదని రుజువు చేసి చూపారు. అదనులో పెట్టుబడి ఉంటేనే రైతులకు సాంత్వన అని గ్రహించి పంట రుణాలపై వడ్డీని పావలాకు తగ్గించారు. ప్రకృతి విపత్తుల బారి నుంచి రైతుకు రక్షణ కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా పంటల బీమా పథకాన్ని అమలు చేసిన ఆదర్శ పాలకుడు వైఎస్. ఆయన ప్రతి నిర్ణయమూ రైతుల ప్రయోజనమే పరమావధిగా జరిగింది. మోన్శాంటోకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మరీ అది దిగొచ్చేలా చేశారు. బీటీ పత్తి విత్తనాల ధరను రూ.750కి తగ్గించి రైతు ముఖంలో చిరునవ్వులు పూయించారు. జగన్ మాట... రెతును విస్మరిస్తే సర్కారుకు మూడినట్టే. సర్వం కోల్పోయి వారు అల్లాడుతుంటే, సగం ధాన్యమే కొంటానంటూ వ్యాపారుల కంటే అధ్వానంగా వ్యవహరిస్తోంది - విజయవాడ ‘లక్ష్య దీక్ష’లో రైతు కంట కన్నీరు రాష్ట్రానికే అరిష్టం. అన్నదాతను పట్టించుకోని ఈ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిలో దూకడం మేలు - విజయవాడ ‘మహా ధర్నా’లో కేంద్రం పట్టించుకుంటే తప్ప పోలవరం ప్రాజెక్టును మీరు కట్టలేరా? - ‘హరితయాత్ర’లో రాష్ర్ట కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్న ఇది ముందుచూపు ఏమాత్రమూ లేని గుడ్డి సర్కారు. పంట నష్టపోతే చచ్చేది రైతే కదా. చస్తే చావనీ అన్నట్టు వ్యవహరిస్తోందీ అధ్వాన ప్రభుత్వం - కడప కలెక్టరేట్ వద్ద ‘కరెంటు పోరు’లో రైతుల సమస్యలపై సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. లేదంటే మేమే తెరిపిస్తాం బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలన్న చంద్రబాబుకు వారి పేరెత్తే అర్హతే లేదు - ఆర్మూరు ‘రైతు దీక్ష’లో -
అలాంటి లీడర్నే ఎన్నుకోండి..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పౌరులకు ఓటే ఏకైక ఆయుధం. ఎంతో విలువైన ఆ ఓటు వృథా కాకుండా సమర్థులైన నేతలనే ఎన్నుకోవాలి. ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా, ప్రజలకు మంచి చేసే నాయకుడికే పట్టం కట్టాలి. నాకు తెలిసి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు గానీ ప్రజలకు ఉపయోగపడే లీడర్ మాత్రం లేడు. అటువంటి లీడర్నే ప్రజలు ఎన్నుకోవాలి. . మరో ముఖ్య విషయం... చాలామందికి ఓటు విలువ తెలియకో, నిర్లక్ష్యంతోనో, బయటకు వెళ్లేందుకు బద్ధకంతోనో ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ప్రమాదకర ధోరణి. ఈసారి అలా కాకూడదు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మన భవిష్యత్తును తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని ఏ ఒక్కరూ చేజార్చుకోవద్దు. - శ్రద్ధా దాస్, హీరోయిన్ -
మాజీల ఎదురీత
ప్రత్యర్థుల నుంచి మాజీ మంత్రులకు తీవ్రమైన పోటీ పక్క నియోజకవర్గాల్లోకి తొంగి చూడకుండా ప్రచారంలో తలమునకలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌కు సొంత పార్టీ నుంచే సహాయ నిరాకరణ! గెలుపు కోసం చెమటోడుస్తున్న డీఎస్, జానా, పొన్నాల, }ధర్‌బాబు, ఉత్తమ్, అరుణ, గీతారెడ్డి కె.యాదగిరిరెడ్డి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష తామే నేరవేర్చామని కాంగ్రెస్ పార్టీ ఎంతగా మొత్తుకుంటున్నా.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే అంటూ ఆ పార్టీ నేతలంతా ఢంకా బజారుుస్తున్నా ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు! ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తాజా మాజీ మంత్రులు టీఆర్ఎస్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ఆంధోల్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మంథనిలో శ్రీధర్‌బాబు, బోధన్‌లో సుదర్శన్‌రెడ్డిలు తవు ప్రత్యర్థుల కంటే వెనుకబడినట్టే కనిపిస్తోంది. జనగామలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరో మాజీ మంత్రి బసవరాజు సారయ్య గెలుపు కోసం చెమటోడ్సాలిన పరిస్థితి నెలకొంది. పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో పడరాని పాట్లు పడుతున్నారు. గద్వాలలో డీకే ఆరుణ, జహీరాబాద్‌లో గీతారెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నియోజకవర్గాలు దాటని మంత్రులు తెలంగాణ జిల్లాల్లో తాజా మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. కనీసం పక్క స్థానాల్లోకి కూడా తొంగిచూసే పరిస్థితి కూడా లేదంటూ పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐదేళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉండి జిల్లా రాజకీయాలను శాసించిన ఈ నేతలు తీరా ఎన్నికలు వచ్చాక ఇతర నియోజకవర్గాల ఊసెత్తకపోవడం పార్టీ కేడర్‌ను నిస్తేజానికి గురి చేస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్, పొన్నాల, ఉత్తమ్‌కుమార్ తమ నియోజకవర్గాలకే పరిమితమవడం గమనార్హం. జానా కోటలో నువ్వా.. నేనా.. తెలంగాణలో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ (చలకుర్తి) నుంచి టీడీపీ తరపున రెండుస్లారు, కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడోసారి రేసులో ఉన్న జానాకు ఈ ఎన్నికల్లో గట్టెక్కడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇక్కడ్నుంచి చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కొందరు నేతలను అభివృద్ది పథంలోకి తీసుకురావడం తప్పితే నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. మండలానికి ఒక్కరో ఇద్దరో నాయకులను ఎంపిక చేసుకుని వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడం, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలు, ప్రజలను పట్టించుకోకపోవడంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సీపీఎంలో సుదీర్ఘకాలం పనిచేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సిం హయ్య టీఆర్ఎస్ తరఫున ఇక్కడ్నుంచి బరిలో దిగారు. తెలంగాణ సెంటిమెంట్‌తోపాటు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉన్న తన సామాజికవర్గం ఓట్లను రాబట్టుకునేందుకు నోముల ప్రయత్నిస్తున్నారు. జానారెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. దామోదరకు ఇంటిపోరు.. తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ మెదక్ జిల్లా ఆంధోల్‌లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి సినీ హాస్య నటుడు బాబూమోహన్ ఈసారి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కంటే దామోదర్‌పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు బాబూమోహన్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం లోపాయికారిగా టీఆర్ఎస్కు సహకరిస్తున్న వైనం దామోదర్‌కు ఆందోళన కలిగిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అనేక సందర్భాల్లో ఆయన కుటుంబంపై విరుచుకుపడిన తీరును ఓ సామాజికవర్గం గుర్తుచేసుకుని దామోదర్‌పై ఆగ్రహంతో ఉంది అరుణ, గీతారెడ్డిలకు గట్టి పోటీ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో డీకే ఆరుణ తన సమీప బంధువు, టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. జహీరాబాద్‌లో గీతారెడ్డి కూడా గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. జనగామలో పొన్నాల ఎదురీత.. వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి గట్టి పోటీకి తోడు పొన్నాలపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నేతల్లో ఎక్కువ మంది పొన్నాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. పొన్నాలను గెలిపిస్తే సీఎం అవుతారనే ప్రచారం కాంగ్రెస్‌కు కొంత మేలు చేస్తున్నా.. మంత్రిగా ఉన్నప్పుడే అందుబాటులో లేడు.. ఇక ముఖ్యమంత్రి అయితే అసలే అందుబాటులో ఉండరనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. శ్రీధర్‌కు ముచ్చెమటలు.. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్న తాజా మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గడచిన సాధారణ ఎన్నికల్లోనూ వీరిద్దరూ తీవ్రస్థాయిలో పోటీ పడ్డా శ్రీధర్‌బాబును విజయం వరించింది. మధు ఈసారి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలవడంతో మంత్రి ఎదురీదుతున్నారు. 2009తో పోలిస్తే పోటీ తీవ్రత బాగా పెరిగిపోయింది. ఉత్తమ్‌కు దూరమైన కేడర్ మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్నగర్ నుంచి బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పార్టీ కేడర్‌కు దూరంగా ఉండడం, జిల్లా కాం గ్రెస్‌లోని ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటం, టీఆర్ఎస్ నుంచి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బరిలో ఉండడం వల్ల ఉత్తమ్ గెలుపు అంత సులువు కాదని పరిశీ లకులు అంటున్నారు. సారయ్యకు అష్టకష్టాలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బస్వరాజు సారయ్య గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉండటం, టీఆర్ఎస్ నుంచి కొండా సురేఖ తలపడుతుండటంతో పోటీ తీవ్రస్థాయిలో సాగుతోంది. ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 1999 నుంచి గెలుస్తూ వస్తున్న సారయ్యపై నియోజకవర్గం ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. -
సామాజిక సమతూకం
సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన అంబేద్కర్‌కు నివాళులర్పించి జాబితా విడుదల చేసిన జగన్ 170 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు వెల్లడి మహిళలు సహా అన్ని సామాజిక వర్గాలకూ సముచిత స్థానం కాపు, బలిజ వర్గాలకు ప్రాధాన్యం.. 25 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు కలిపి 32 శాతం సీట్లు బీసీల్లో అన్ని సామాజిక వర్గాల వారికీ జాబితాలో ప్రాతినిధ్యం 26 ఎస్సీ అసెంబ్లీ స్థానాల్లో మాలలకు 18, మాదిగలకు 8 సీట్లు {పకటించిన 24 లోక్‌సభ స్థానాల్లో 5 చోట్ల మహిళలకు టికెట్లు శాసనసభ నియోజకవర్గాల్లో 11 చోట్ల మహిళలకు అవకాశం త్తం 170 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లు సహా 103 చోట్ల ఎస్సీ, బీసీ, కాపు, బలిజ, మైనారిటీలకు టికెట్లు పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నంటి ఉన్నవారికి ప్రాధాన్యం పదవులను వదులుకుని వచ్చిన వారికీ టికెట్ల కేటాయింపు ‘అవిశ్వాస తీర్మానం’లో అనర్హతకు గురైన వారందరికీ చోటు పులివెందుల నుంచి శాసనసభకు జగన్మోహన్రెడ్డి, విశాఖపట్నం నుంచి లోక్‌సభకు విజయమ్మ పోటీ బాపట్ల లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలు పెండింగ్ హైదరాబాద్: అన్ని వర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తూ.. సామాజిక సమతూకం పాటిస్తూ సీమాంధ్ర ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో.. కేవలం 6 స్థానాలకు మినహా మిగతా స్థానాలన్నిటికీ ఒకేసారి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. సోమవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన తర్వాత.. మొత్తం 170 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈసారి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలతో సహా అన్ని సామాజిక వర్గాలకూ ఈ జాబితాలో సముచిత ప్రాతినిధ్యం కల్పించింది. పార్టీ ఏర్పాటు నుంచి కొనసాగుతున్న నేతలకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టమౌతోంది. అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యం... ఆయా ప్రాంతాల్లో ఆయా వర్గాల ప్రాబల్యాన్ని బట్టి ఎవరినీ విస్మరించకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఎంపికలో సమతౌల్యం పాటించినట్టు కనిపిస్తోంది. జాబితాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కింది. కాపు, బలిజ సామాజిక వర్గానికి అత్యధికంగా 25 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాలను కేటాయించటం విశేషం. వెనుకబడిన తరగతులు (బీసీ), మైనారిటీలకు కలిపి మొత్తం 32 శాతం అసెంబ్లీ టికెట్లిచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన 170 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 స్థానాలు, 24 లోక్‌సభ నియోజకవర్గాల్లో 3 స్థానాలు బీసీలకు కేటాయించారు. బీసీల్లో అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యం కల్పించారు. కాలింగ, వెలమ, తూర్పుకాపు, యాదవ, మత్స్యకార, గవర, శెట్టిబలిజ, పద్మశాలి, గౌడ, బోయ, కురువ, వన్యకాపు తదితర సామాజిక వర్గాలకు చోటు దక్కింది. ముస్లిం మైనారిటీలకు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇచ్చారు. ఇప్పటి వరకూ ప్రకటించిన 26 ఎస్సీ రిజర్వుడ్ శాసనసభ స్థానాల్లో 18 చోట్ల మాల సామాజికవర్గానికి, 8 నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించారు. ప్రకటించిన మూడు ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానాల్లో రెండు చోట్ల మాల వర్గానికి, ఒక చోట మాదిగ వర్గానికి అవకాశం కల్పించారు. ఎస్టీలకు ఒక లోక్‌సభ స్థానం, 7 అసెంబ్లీ స్థానాలు రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. ఇక ప్రకటించిన 24 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు మహిళలకు కేటాయించడం విశేషం. శాసనభ స్థానాల్లో 11 చోట్ల మహిళలకు టికెట్లు కేటాయించారు. ఈ జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి 52 అసెంబ్లీ, 9 లోక్‌సభ సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి 11 శాసనసభ, 2 లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. అలాగే బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించారు. మొత్తం 170 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వుడ్ స్థానాలతో సహా 103 చోట్ల ఎస్సీ, బీసీ, కాపు, బలిజ, మైనారిటీ వర్గాలకు టికెట్లు కేటాయించినట్లయింది. పార్టీ వెన్నంటి ఉన్న వారికి పెద్దపీట... మహానేత, తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించే వరకూ ప్రాతినిధ్యం వహించిన పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల బరిలోకి దిగాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. పులివెందుల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈసారి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ వెన్నంటి ఉన్న వారి విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసినట్టు జాబితాలో చోటుచేసుకున్న పేర్లను బట్టి తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం అధికారపక్షం నుంచి పదవులను వదులుకుని వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో సముచిత ప్రాధాన్యం లభించింది. పార్టీలో క్రియాశీలంగా ఉన్న సీనియర్లు, కొత్త రక్తంతో ముందుకు వచ్చిన యువతకు సాధ్యమైనంత మేరకు జగన్ ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు పార్టీ నిర్ణయానుసారం ప్రజల పక్షాన నిలబడి వ్యతిరేకంగా ఓట్లు వేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలందరికీ జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాలి రాజేశ్‌కుమార్ మాత్రం తాము స్వచ్ఛందంగా తప్పుకుని తమ కుటుంబీకులకు అవకాశం కల్పించారు. -
ఒక హక్కుగా ..ఒక బాధ్యతగా.. ఓటడుగుతున్నాం.
వైఎస్సార్సీపీ తెలంగాణ మేనిఫెస్టో తెలంగాణ అభివృద్ధి వైఎస్ పుణ్యమే చంద్రబాబు పరిపాలనలో వల్లకాడు టీఆర్ఎస్, బీజేపీలకు పాలన చరిత్ర లేదు టీడీపీ, కాంగ్రెస్ తమ పాలనను చెప్పుకోలేవు పగటికలల సౌధాలతో మభ్యపెడుతున్నాయి జాతీయ ప్రాజెక్టుగా ప్రాణహిత-చేవెళ్ల విద్య, వైద్య రంగాల సమగ్రాభివృద్ధి ‘‘అభివృద్ధి-సంక్షేమం. ఇవి రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు. మిగతా పార్టీలకు, వైఎస్సార్సీపీకి మధ్య అనేక తేడాలున్నాయి. తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న మిగతా పార్టీలన్నీ చిటికెల పందిరి వేస్తున్నాయి. పగటికల సౌధాన్ని చూపెడుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ రెండూ తమ పాలనలో తెలంగాణ బాగుపడిందన్న నినాదంతో ప్రజల ముందుకు రావడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇక టీఆర్ఎస్, బీజేపీలకు పాలించిన చరిత్రే లేదు. వైఎస్సార్ హయూంలోనే మొత్తం తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందింది. అందుకే.... ఆ అభివృద్ధిని చూపి ఓటు అడుగుతున్నాం... ప్రజలకు, పల్లెలకు మేలు చేసిన చరిత్రతో ఓటడుగుతున్నాం... ఒక హక్కుగా ఓటడుగుతున్నాం. ఒక బాధ్యతగా ఓటడుగుతున్నాం. ఇది మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి జీవితాన్నీ మంచిగా మలచిన పార్టీగా అడుగుతున్న ఓటు’’ - వైఎస్సార్సీపీ తొలి సంతకాలివే... ముఖ్యమంత్రిగా తాను తొలి సంతకాలు చేయబోయే పథకాలు, విధానాల గురించి జగన్ వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. ‘అమ్మ ఒడి’తో అక్కాచెల్లెళ్లకు భరోసా క్కాచెల్లెమ్మల కోసం తొలి సంతకం పెట్టబోతున్నా. పూట గడవడానికి పనులకు పోవాల్సిన పరిస్థితి ప్రస్తుతముంది. ఒక్క రోజు కూలికెళ్తే రూ.100-150 వస్తుంది. దాంతో మూడు రోజులు గడిచిపోతుంది. నాలుగో రోజు పనికెళ్లకపోతే పూట గడవదు. పిల్లలను కూడా పన్లోకి తీసుకెళ్తే మరో రూ.50 వస్తాయి కదా అనుకునే పరిస్థితి. అలాంటి అక్కాచెల్లెళ్ల జీవితాన్ని మార్చేలా మొదటి సంతకం చేయబోతున్నా. వారు చేయాల్సింది తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపడమే. వారిని డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్ల వంటి పెద్ద చదువులు చదివించే బాధ్యత నాది. అలా బడికి పంపిన అక్కాచెల్లెళ్లకు ఒక బిడ్డకు రూ.500 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ.1000 ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నా. పిల్లలు పై చదువులు చదివి, పెద్ద ఉద్యోగాల్లో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలన్నదే నా ఆశ. రూ.700 పించన్ అవ్వా తాతల కోసం మంచి మనవడిలా రెండో సంతకం పెట్టబోతున్నా. వయసు, శరీరం సహకరించకపోతున్నా అవ్వాతాతలు పనికి పోతున్నారు. నేను చాలా గ్రామాల్లో వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తే, ‘నాయనా, మీ నాయన పుణ్యంతో ఇస్తున్న రూ.200 పింఛను ఒక పూట భోజనానికే సరిపోతోంది. రెండు పూటలా తినాలంటే పనికి పోవాలి కదా’ అంటున్నారు. అలాంటి అవ్వాతాతలకు భరోసా ఇస్తూ.. దివంగత మహానేత పై నుంచి చూసి గర్వపడేలా రూ.200 పింఛన్‌ను రూ.700 చేస్తా. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి మూడో సంతకం రైతన్నల కోసం. రైతులు రేయింబవళ్లు కష్టపడి పంటలు పండిస్తున్నా మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర దొరక్క సతమతమవుతున్నారు. పండిన పంట ధర కాస్తా, వారు అమ్ముకున్న రెండు మాసాలకే రెండింతలవుతోంది. ఇక మీదట రైతన్నలు మద్దతు ధర కోసం ఆందోళన చెందాల్సిన పని లేదు. వారిలో భరోసా నింపేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. మద్దతు ధరపై భరోసా ఇస్తా. డ్వాక్రా రుణాలు రద్దు నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసమే. డ్వాక్రా రుణాలకు నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీన వాయిదా కట్టకపోతే వడ్డీ మీద వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. దాంతో తమ పిల్లలను కూడా పనిలోకి తీసుకెళ్తున్న దుస్థితి. అందుకే వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని స్పష్టమైన హామీ ఇస్తున్నా. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాన్ని కిందా మీదా పడైనా తీరుస్తా. ఏ కార్డు అయినా 24 గంటల్లోనే ఏ వార్డుకు, గ్రామానికి వెళ్లినా, ‘అన్నా మాకు ఇల్లు లేదు, రేషన్‌కార్డు లేదు, పెన్షన్ లేదు’ అని చెబుతున్నారు. ఏ కార్డు కావాలన్నా నాయకుల చుట్టూ తిరగక్కర్లేకుండా మీ గ్రామంలోనే, మీ వార్డులోనే ఒక కార్యాలయం, అందులో కంప్యూటర్, ప్రింటర్ వంటి వన్నీ పెట్టి 24 గంటల్లో ఏ కార్డయినా అందించేలా ఐదో సంతకం పెట్టబోతున్నా. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు... మీ ఇంట ప్రతి ఒక్కరి భవితకు, తెలంగాణలో మరో చరిత్రకు మేలిమలుపు!’’ అని తెలంగాణ మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ పేర్కొంది. చంద్రబాబు పాలనలో తెలంగాణ ఎలా వల్లకాడుగా మారిందో మేనిఫెస్టో వివరించింది. వైఎస్సార్ హాయంలో తెలంగాణను అభివృద్ధి చేసిన విధానాన్నీ పేర్కొం ది. విభజన బిల్లులో పేర్కొన్న అన్ని హామీలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేసింది. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తమకు ఓట్లు వేయాలని... అభివృద్ధి-సంక్షేమం అనే రెండు నినాదాలతో ముందుకు సాగుతామని పేర్కొంది. హైదరాబాద్‌కు నౌకాశ్రయంతో అనుసంధానం కోసం హైదరాబాద్ నుంచి మచిలీపట్నం దాకా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్టు వివరించింది. బాబు హయాంలో బోసిపోయిన పల్లెలు... బాబు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ పల్లెలన్నీ కన్నీరు పెట్టాయని వివరించింది. ‘‘పంటలు పండక, తిండి లేక, కూలీ చేద్దామన్నా పనులు లేక... దారుణ పరిస్థితులుండేవి. ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక బతుకు జీవుడా... అంటూ పల్లె ప్రజలు పొట్ట చేతపట్టుకుని పిల్లాజెల్లతో ముంబై వంటి నగరాలకు వలసలు వెళ్లారు. దుబాయి లాంటి గల్ఫ్ దేశాలకూ వెళ్లారు. ఎందుకంటే బాబు పాలనలో తాగటానికి నీరుండేది కాదు. పైర్లకు సాగునీరు లేదు. వ్యవసాయ బోర్లకు కరెంటుండేది కాదు. ఆ పరిస్థితుల్లో కూడా కరెంటు చార్జీల పేరుతో రైతులను, ప్రజలను బాబు పీల్చి పిప్పి చేశారు. కరువొచ్చి తినడానికి తిండిలేని దయనీయ పరిస్థితుల్లో రైతులుంటే, వ్యవసాయ బోర్లకు కరెంటు బిల్లులు చెల్లించాలంటూ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరీ పోలీసులతో ఒత్తిళ్లు చేయించారు. 14 వేల మంది రైతులపై కేసులు పెట్టించారు. దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టించారు. బిల్లులు కట్టకుంటే గ్రామాలపై పడి రైతుల ఇళ్లల్లో చెం బూ, తపేలా కూడా తీసుకుపోయారు. ఆ అవమానం భరించలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని పేర్కొంది. వైఎస్సార్ హయాంలో బంగారు తెలంగాణ తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీ వైఎస్ మేలు చేశారని మేనిఫెస్టో గుర్తుచేసింది. ‘‘వైఎస్సార్ ఏనాడూ రాయలసీమ నాయకుడు అనిపించుకోలేదు. ఇంటింటి మనిషిగా పరిపాలన చేశారు. అందుకే వైఎస్ఆర్ హఠాన్మరణంతో ఎక్కువగా తెలంగాణ బిడ్డలే గుండె ఆగి మరణించా రు. తెలంగాణ ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గరగా చూడబట్టే వైఎస్ అధికారం చేపట్టగానే ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రైతు రుణాల మాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, సాగుకు 7 గంటల ఉచిత విద్యుత్, జలయజ్ఞం పథకాలను అమలు చేశారు. జలయజ్ఞం కింద శ్రీకారం చుట్టిన 86 ప్రాజెక్టుల్లో సగం తెలంగాణలోనే ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, అలీసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, కొయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలతో పాటు మరె న్నో ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆయన ఉండగా చకాచకా జరిగాయి. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల పథకాలకు కేంద్రం నుంచి అనుమతులు కూడా సంపాదించారు. కానీ ఆయన మరణం తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఇప్పటి పాలకుల్లో లోపించడం వల్లే ఏ ప్రాజెక్టూ ముందుకు సాగడం లేదు’’ అని మేనిఫెస్టో గుర్తు చేసింది. హామీలన్నీ అమలు చేయాల్సిందే... విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని వైఎస్సార్సీపీ మేనిఫెస్టో డిమాండ్ చేసింది. అవి... 1. రెండు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం టాక్స్ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం 2. రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా గిరిజన వర్సిటీలు 3. తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ 4. 4 వేల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్కేంద్రం 5. ఖమ్మం జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం 6. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 7. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ముఖ్యనగరాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు కనెక్టివిటీ చరిత్ర వూర్చిన వైఎస్ ఉచిత విద్యుత్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లుంటే, వాటిలో 17 లక్షలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయని మేనిఫెస్టో గుర్తు చేసింది. ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ, 32 లక్షల మంది రైతులకు రూ.5,000 చొప్పున ప్రోత్సాహక రాయితీ.... ఈ మూడు నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో నుంచి బయట పడగలిగారని పేర్కొంది. ‘‘జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా వైఎస్ న ల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో వర్సిటీలు నెలకొల్పారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ, మెదక్ జిల్లా కందిలో ఐఐటీ ఏర్పాటు చేసింది బాబు చక్రం తిప్పడం వల్ల కాదు, వైఎస్సార్ ఒత్తిడి తీసుకురావడం వల్ల మాత్రమే! దేశంలోనే తొలిసారిగా మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటైంది. బీబీనగర్ వద్ద నిమ్స్ విశ్వవిద్యాలయం, వరంగల్‌కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆదిలాబాద్‌కు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగాయి. దేశంలోనే తొలిసారిగా గిరిజనులకు దాదాపు 13 లక్షల ఎకరాల భూమిని పట్టాలిచ్చి పంపిణీ చేసిందీ అప్పుడే’’ అని మేనిఫెస్టో గుర్తు చేసింది. వ్యవసాయానికి ఇద్దరు మంత్రులు రాష్ట్రంలో ఇద్దరు వ్యవసాయ మంత్రులను నియమిస్తామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టో పేర్కొంది. ఒకరు వ్యవసాయోత్పత్తులను, మరొకరు పంట నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వివరించింది. వ్యవసాయోత్పత్తుల నిల్వ కోసం అదనంగా 40 లక్షల చదరపు అడుగుల మేర గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. సహకార ఉద్యమ పద్ధతిలో సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినా ప్రతి ఎకరాపై రైతుకు లభించే ఆదాయం మా త్రం పెరగడం లేదు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒకట్రెండు గ్రామాలను ఎన్నుకుని వాణిజ్య బ్యాం కుల మద్దతుతో సమీకృత విధానం ద్వారా సహకారోద్యమ పద్ధతిలో సాగును ముందుకు తీసుకెళ్తాం. ప్రతి రైతుకూ వ్యవసాయంపై కనీస రాబ డులు, ఆదాయం వచ్చేలా చేసేందుకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది’’ అని స్పష్టం చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రాణహిత-చేవెళ్ల కొండల్ని సైతం తొలిచి తెలంగాణలో సాగునీటి సదుపాయం కల్పించేందుకు వైఎస్సార్ భగీరథ ప్రయత్నం చేశారని మేనిఫెస్టో గుర్తు చేసింది. ఆయన మరణానంతరం ఆగిపోయిన, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, దాన్ని కేంద్రమే చేపట్టేలా ఒత్తిడి తెస్తామని ప్రకటించింది. ప్రాచీన ఆలయాల అభివృద్ధి తెలంగాణలో ముఖ్యమైన, చారిత్రక ప్రాధాన్యమున్న వేములవాడ, యాదగిరిగుట్ట, బాసర, కొలనుపాక జైన్ మందిర్, కొండగట్టు, కాళేశ్వరం, పాకాల, అలంపూర్, రామప్ప వంటి ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవరం ప్రాజెక్టు, చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులు, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్లను సుందర పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. విద్యుత్ యజ్ఞం తెలంగాణలో వెలుగులు నింపేందుకు విద్యుత్ యజ్ఞాన్ని చేపడతామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ప్రకటించింది. ‘‘చిన్నపాటి జల, పవన, సౌర విద్యుత్కేంద్రాల వంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేస్తాం. కరీంనగర్లో 700 మెగావాట్లు, శంకర్‌పల్లిలో 1,000 మెగావాట్ల గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు వరంగల్‌లో చెరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు థర్మల్ ప్లాంట్లు, 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ ప్లాంట్లు, ఎన్టీపీసీ తలపెట్టిన 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’’ అని ప్రకటించింది. వైఎస్సార్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందని, ఇప్పుడు దాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని మేనిఫోస్టో ఆకాంక్షించింది. వచ్చే పదేళ్లల్లో అక్షరాస్యత రేటును 99 శాతానికి పెంచేందుకు ఉద్యమంలా ఒక కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల విద్యా, ఆరోగ్యాల కోసం మందులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో కూడిన 20 మొబైల్ హెల్త్ వాహనాలు, ప్రతి రెవెన్యూ డివిజన్లో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ ప్రమాణాలున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పింది. రూ.100కే 150 యూనిట్ల విద్యుత్ నెలకు 150 యూనిట్ల లోపు వాడకముండే గృహ వినియోగదారులందరికీ కేవలం 100 రూపాయలకే విద్యుత్ సరఫరా చేస్తామని వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో కోటి 76 లక్షల మందికిపైగా లబ్ధి చేకూరనుంది. పెరగబోయే చార్జీలతో లెక్కిస్తే వారు ప్రస్తుతం రూ.600కు పైగా చెల్లించాల్సి ఉంటుంది. మర మగ్గాలకు యూనిట్‌కు 1.5 రూపాయలకే కరెంటు ప్రస్తుతం కాటేజీ పరిశ్రమల కింద వచ్చే మర మగ్గాల చేనేత కార్మికులకు యూనిట్ విద్యుత్ ధర రూ.3.75 ఉంది. దాన్ని రూ.4.42కు పెంచేందుకు ఇప్పటికే ఈఆర్సీ వద్ద ప్రతిపాదనలున్నాయి. ఎన్నికలు ముగియగానే చార్జీలు పెరగనున్నాయి. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే యూనిట్ చార్జీని రూ.1.5కి తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రార్థనా మందిరాలు, మతపరమైన ఆరాధన కేంద్రాలను కూడా ప్రస్తుతం వాణిజ్య సంస్థలుగానే పరిగణించి యూనిట్‌కు రూ.4.72 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై వాటినీ గృహ వినియోగ కేటగిరీ కిందే పరిగణిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. -
పగటిపూట.. 7 గంటలు
పస్తుతం వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ అంటూ కేవలం 2-3 గంటలు మాత్రమే వస్తోందని పార్టీ విమర్శించింది. అది కూడా రాత్రి సమయాల్లో వస్తుండటంతో పొలాలకు వెళ్లిన రైతులు పాముకాటుకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రైతులకు పగటి పూట కచ్చితంగా 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీనిచ్చింది. తేకాకుండా 2019 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా... ప్రతి పల్లెకు కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటించింది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది. -
సామాజిక రక్షణ- సమగ్రాభివృద్ధి
వైఎస్సే శ్వాస... శ్రేయస్సే ధ్యాస ఉద్యోగాల జాతర నియామకాలకు వయోపరిమితి పెంపు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో పాలన స్తంభించిందని... తద్వారా ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీ నిలిచిపోయిన విషయాన్ని మేనిఫెస్టోలో పార్టీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా వయోపరిమితిని పెంచుతామని... ఇందుకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు కూడా వయోపరిమితిని పెంచుతామని ప్రకటించింది. అదేవిధంగా అర్హతలను బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని హామీనిచ్చింది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన మరిన్ని హామీలు... 1. రాష్ట్రంలో ఎనలేని సేవలు అందిస్తున్న విద్యుత్కార్మికుల ప్రయోజనాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షిస్తుంది. 2. కాంట్రాక్టు ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం. 3. హెచ్ఆర్ విధానంలో కవర్‌కాని బీమా మిత్ర, వీవోఏ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంచుతాం. 4. అంగన్వాడీ వర్కర్ల జీతాలను పెంచుతాం. వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తాం. పదవీ విరమణ లభించాల్సిన బెనిఫిట్స్‌పై సానుకూలంగా స్పందిస్తాం. 5. హోం గార్డులు, గోపాలమిత్ర జీతాలు పెంచుతాం. 6. క్యాలెండర్ ఏర్పాటు ద్వారా ఏటా ఉద్యోగ నియామకాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేపడతాం. సగటు కుటుంబానికి సామాజిక రక్షణ...! సమర్థ పాలనతో సమగ్రాభివృద్ధి...! ఎన్నికల హామీలకు ఇవే అంతస్సూత్రాలుగా... ఓ విజన్ డాక్యుమెంట్‌గా... వైఎస్ పాలన స్ఫూర్తి శ్వాసగా... ప్రజా శ్రేయస్సే ధ్యాసగా... వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు పార్శ్వాలుగా రూపొందిన ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన నిర్మాణాత్మక, ఆచరణీయ హామీలు రాష్ట్ర దిశను, దశను మార్చాలనేది పార్టీ సంకల్పం. దీంట్లోని పలు ప్రధాన హామీల అవసరం, ప్రాధాన్యం, వివరణలు ఇలా... ఆరోగ్యమస్తు కోలుకునే వరకూ నెలకు రూ.3 వేల సహాయం పేదలు, వృద్ధులకు ఉచిత కళ్లద్దాలు జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటు తక్కువ ధరకు మినరల్‌వాటర్ ప్రజల ఆరోగ్య ధీమాకు తనదీ పూచీ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. ఆపరేషన్ జరిగినా, తీవ్రంగా ఫ్రాక్చర్లకు వైద్యం పొంది పనిచేయలేని స్థితిలో ఉండేవారికి నెలకు రూ. 3 వేల చొప్పున సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది. ఆపరేషన్ జరిగిన తర్వాత పనులకు వెళ్లలేని స్థితిలో ఉండే రోగులకు ఉపాధి, మందుల కోసం నెలకు రూ.3 వేల చొప్పున సహాయం చేస్తామని వివరించింది. పేదలు, వృద్ధులకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య శ్రీ జాబితా నుంచి తొలగించిన 133 వ్యాధులను తిరిగి జాబితాలో చేరుస్తానని స్పష్టం చేసింది. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు తక్కువ ధరకే మినలర్ వాటర్‌ను అందిస్తామని హామీనిచ్చింది. ప్రజల ఆరోగ్య ధీమాకు ప్రకటించిన మరికొన్ని పథకాలు... 1. 108, 104 పథకాల పునరుద్ధరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం. డాక్టర్ల కొరత లేకుండా చూస్తాం. 2. రాష్ట్ర రాజధానిలోని 17-20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో జిల్లాల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అనుసంధానం. రొటేషన్పద్ధతిలో స్పెషాలిటీ వైద్యుల్ని ప్రతి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండేలా చూడటం. 3. ఆరోగ్యశ్రీ జాబితాలోని 938 వ్యాధుల్లో నుంచి కార్పొరేట్ వైద్యం నుంచి 133 వ్యాధులను మళ్లీ జాబితాలో చేర్చి... ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం. 4. బధిరులు, మూగవారికి ప్రత్యేకంగా కాక్లియర్ ఇంప్లాంట్ వైద్యానికి అయ్యే ఖర్చు రీయింబర్స్మెంట్. 5. 108 వాహనాలు, సంచార వైద్యశాలలైన 104 వాహనాలను మరింతగా పెంచి ఆరోగ్యసేవల రంగం మరింత బలోపేతం. 6. మధుమేహం, రక్తపోటు వ్యాధులకు 104 వాహనాల ద్వారా ఉచిత పరీక్షలు, చికిత్స. 7. {పతి జిల్లా కేంద్రంలోనూ వైద్య కళాశాలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం. 8. {పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ సరిపడా మందులతో పాటు, వైద్యులు, సిబ్బంది ఏర్పాటు. 9. {పాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి అత్యధిక ప్రాధాన్యత. 10. ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటు. పీజీ సీట్ల రెట్టింపు. 11. {పతీ గ్రామానికి తక్కువ ధరకే మినరల్‌వాటర్ సరఫరా. నీటి కాలుష్యంతో వచ్చే రోగాలను అరికట్టేందుకు ప్రతి గ్రామంలోను ఆర్వో, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ల ఏర్పాటు. 12. నిర్ణీత వ్యవధుల్లో పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి నూరు శాతం టీకాలు వేసేలా చర్యలు. అర్చకులకు పింఛను పెంపు హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తామని పార్టీ ప్రకటించింది. అర్చకులకు, దేవాలయ సిబ్బందికి పనిచేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని పేర్కొంది. ధూపదీప నైవేద్యాల కోసం ప్రస్తుతం నెలకు ఇస్తున్న కనీస మొత్తాన్ని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచుతామని ప్రకటించింది. హిందూ దేవాలయాల విషయంలో గతంలో వైఎస్ అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తామని... అర్చకుల పింఛన్ పెంచుతామని హామీనిచ్చింది. ప్రార్థనా మందిరాలు, ఆలయాలకు సరఫరా చేసే విద్యుత్‌కు వాణిజ్య ధరలు కాకుండా గృహ విద్యుత్ ధరలు అమలు చేస్తామని పేర్కొంది. ఆర్టీసీని ఆదుకుంటాం తెలుగుదేశం ప్రభుత్వ హ యాంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ అంచులా దాకా తీసుకెళ్లిందని వైఎస్సార్సీపీ మండిపడింది. ఆపదలో ఉన్న ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుం టామని హామీనిచ్చింది. అధికారం లోకి వచ్చిన వెంటనే కమిటీ ఏర్పాటు చేసి కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌కు సిఫార్సులు కోరతామని స్పష్టం చేసింది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా కార్మికులను రెగ్యులర్ పే స్కేళ్లలో నియమిస్తామని ప్రకటించింది. సిలిండర్‌పై వంద సబ్సిడీ బియ్యం కోటా 30 కేజీలకు పెంపు పింఛన్ల వయోపరిమితి 60 ఏళ్లకు కుదింపు బీసీలకు 12 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అమలు అభివృద్ధి- సంక్షేమ పథకాల అమలును కొనసాగిస్తామని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా వంటగ్యాసు సిలిండర్ఫై వంద రూపాయల సబ్సిడీని భరిస్తామని హామీనిచ్చింది. ఈ విధంగా ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరకే సరఫరా చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం వంటగ్యాసు సబ్సిడీ సిలిండరు రూ.441కు లభిస్తోంది. వంద రూపాయల సబ్సిడీ అనంతరం ఇది కేవలం రూ. 331కే లభించనుంది. గతంలో గ్యాసు ధరలను కేంద్రం పెంచిన సమయంలో రూ. 50ల సబ్సిడీని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని తదనంతర ప్రభుత్వాలు ఎత్తేశాయి. తిరిగి తాము అధికారంలోకి వస్తే వంద రూపాయల సబ్సిడీపై సిలిండర్లను సరఫరా చేస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. అదేవిధంగా 2009 ఎన్నికల సమయంలో వైఎస్ హామీ ఇచ్చినమేరకు బియ్యం కోటాను ఒక్కొక్కరికీ కిలో రూపాయికే ఆరు కిలోల చొప్పున కార్డుకు 30 కిలోలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బియ్యం కోటా ఒక్కొక్కరికీ కేవలం నాలుగు కిలోలు మాత్రమే ఉంది. వృద్ధుల పింఛను వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని స్పష్టం చేసింది. చేనేత రుణాల మాఫీ, బీసీలకు 12 వేల కోట్లతో సబ్‌ప్లాను వంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్సార్ సీపీ ప్రకటించింది. ఆ వివరాలు... 1. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లకుండా తగిన చర్యలు చేపడతాం. ఎస్సీ, ఎస్టీల్లో భూమిలేని పేద కుటుంబాలకు ఎకరం భూమి ఇచ్చి, సాగునీటి సౌకర్యం కల్పిస్తాం. దళిత క్రిస్టియన్ల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా కేవలం మతమార్పిడి చేసుకున్నారనే ఒకే కారణంతో ఎస్సీ హోదా లభించట్లేదు. వారిని ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. వైఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. 2. బీసీల సంక్షేమానికి రూ.12వేల కోట్లతో సబ్‌ప్లాన్ రూపొందిస్తాం. చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.1200 కోట్లు కేటాయిస్తాం. ఆయా సామాజిక వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి చర్యలు చేపడతాం. బలహీన వర్గాల నివాస కాలనీల్లో రోడ్లు, పారిశుధ్య వసతులు, విద్యుత్, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. 3. బీసీలతో సమానంగా ఈబీసీల ఆదాయ పరిమితిని 2.5 లక్షలకు పెంచి విద్య, వైద్య పథకాలైన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. 4. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అరకొరగా చెల్లించి పథకం స్ఫూర్తిని దెబ్బతీశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. 5. అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు విస్తృ తపరిచి ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుతాం. 6. కల్లుగీసే సమయంలో చెట్ల మీద నుంచి ప్రమాదవశాత్తూ పడి మరణించిన కల్లు గీత కార్మికుల కుటుంబాలకు రూ.3లక్షల వరకు పరిహారం నెల రోజుల్లోనే చెల్లిస్తాం. అంగవైకల్యానికి గురై శాశ్వతంగా వృత్తికి దూరమైతే రూ.1.5 లక్షల పరిహారం చెల్లిస్తాం. తాటి, ఈత, కొబ్బరి, ఖర్జూర ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. చే‘నేతన్న’కు బాసట 1. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తాం. రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వటమే కాకుండా వారికి చేనేత షెడ్డుతో కలిపి ఇల్లు నిర్మించి ఇస్తాం. మరమగ్గాల చేనేత కార్మికులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున కరెంట్ ఇస్తాం. ముడి పదార్థాల మీద సబ్సిడీ పెంచుతాం. జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరిస్తాం. తద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, పాఠశాలల్లో చేనేత వస్త్రాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తాం. ఆర్టిజాన్ కార్డులపై ప్రయోజనాల కల్పన. 2. చేనేత పింఛను వెయ్యి రూపాయలకు పెంచుతాం. వారి జీవన మెరుగుదలకు కావాల్సిన మరికొన్ని చర్యలు చేపట్టడం. 3. బోయ, వాల్మీకి, కొండ కుమ్మరి, వడ్డెర, మత్స్యకారుల్లోని మరికొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం. 4. వృద్ధులు, అనాథల కోసం ప్రతి నియోజకవర్గంలో ఆశ్రమాలు నిర్మిస్తాం. క్రమేపీ వాటిని మండలాలకు విస్తరణ. 5. {పతి గ్రామానికీ మినరల్ వాటర్‌ను నామమాత్రపు ధరలకే సరఫరా చేసేందుకు ప్రభుత్వ నిధులతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా నీటి కాలుష్య వ్యాధులను నివారిస్తాం. ప్లాంట్ల నిర్వహణలో స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత. బెల్టుషాపుల రద్దు వెయ్యి జనాభా దాటిన గ్రామాల్లో 10 మంది మహిళా పోలీసులు మద్యం మహమ్మారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందుకోసం బెల్టు షాపులను రద్దు చేయడంతో పాటు కల్తీ సారా అమ్మకాలను లేకుండా చేస్తామని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని... తద్వారా గ్రామీణ ప్రజలు ఆదాయాన్ని కోల్పోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల మద్యానికి వ్యతిరేకంగా ఒకవైపు ప్రచారాన్ని చేపట్టి అవగాహన కల్పించడంతో పాటు దశలవారీగా మద్యపాన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇందుకోసం కనీసం వెయ్యికి పైగా జనాభా ఉన్న ప్రతి గ్రామలోనూ 10 మంది మహిళా పోలీసులను ఆ గ్రామం నుంచే నియమిస్తామని ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రాల్లో మాత్రమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. మేనిఫెస్టో బాగుంది వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేసి ముందుకు వచ్చిన్నట్లు స్పష్టమవుతోంది. పేదల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ కార్యాచరణ ఉండటం శుభ పరిణామం. వై.ఎస్.రాజశేఖర రెడ్డి పేదల అభివృద్ధే ధ్యేయంగా పని చేశాడు. ఆయన ఆశయసాధనకు తనయుడు జగన్ కృషి చేస్తుండడం అభినందనీయం. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టో ఉంది. మహిళలు, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అభినందనీయం. పేదల గురించి ఆలోచించే నాయకులకు ప్రజల అండ ఉంటుందనడంతో సందేహం లేదు. - భీమగాని యాదగిరి గౌడ్, జనగామ -
నేతలను నడిపించే నీడలు
శత్రు సైన్యంపై దండెత్తేందుకు వెళ్లే యోధుల్లో ముందుండేది సేనాని. సారథిగా ముందున్నా.. ఆయన వెనుక ఎందరో వ్యూహకర్తలు.. మరెందరో యుద్ధ తాంత్రికులు! పొరుగు సైన్యం ఎత్తుల్ని చిత్తు చేస్తూ ముందుకు సాగేందుకు కావాల్సిన ఎత్తుగడల వ్యూహాన్ని తెరవెనుక రచించేది వారే. అస్త్రశస్త్రాలు ఎన్ని ఉన్నా వాటిని ఎప్పుడు, ఎలా, ఎవరిపై ప్రయోగించాలో సేనానికి చెప్పే ఆంతరంగికులు వారు! మరి ఈ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ సారథి రాహుల్‌గాంధీ, బీజేపీ సేనాని నరేంద్ర మోడీ వెనుక ఉన్న వ్యూహకర్తలు, నమ్మిన బంట్లు ఎవరు..? వీరిద్దరి వెనుక ఉన్న అదృశ్య శక్తులను ఓసారి చూద్దాం.. ఎలక్షన్ సెల్ సలహాదారులు రాజేష్ జైన్, (53) పనిచేసే స్థానం: ముంబై పారిశ్రామికవేత్త. ఇండియా ఇన్ఫోలైన్, నీతి సెంట్రల్ వ్యవస్థాపకుడు. దేశంలో ఓటర్ల వివరాలతో సమగ్రమైన డేటాబేస్‌ను ఒకచోట చేర్చడంలో సహాయపడుతున్నారు. పీయూష్ గోయల్, (55) పనిచేసే స్థానం: ముంబై మోడీకి సన్నిహితుడు. విధాన రూపకల్పన, సామాజిక మీడియా, వ్యూహరచన వంటి అంశా ల్లో ఈయనది కీలకపాత్ర. వికాస్ సాంకృత్యాయన్, (32) పనిచేసే స్థానం: ఢిల్లీ మోడీ సోషల్ మీడియా బృందానికి కొన్ని స్వతంత్ర బృందాలు మద్దతు అందిస్తున్నాయి.సాంకృత్యాయన్ నడిపే ‘ఐ సపోర్ట్ నమో’ పేజీ ఇందులో భాగమే. బిపిన్ చౌహాన్ మోడీ జనంలోకి వెళ్తే ఎలా ఉండాలి..? ఎలా కనిపించాలి...? ఎలాంటి డ్రెస్సు వేసుకోవాలి..? ఈ వ్యవహారాలన్నీ ఈయనే చూస్తారు. ప్రచారకర్తలు జగదీశ్ ఠక్కర్ (69) సంజయ్ భావ్సార్ (49) పనిచేసేస్థానం: గాంధీనగర్ మోడీ కార్యక్రమాలు ప్రభావశీలంగా ఉండేందుకు వీరి బృందం సాయపడుతుంది. మోడీ సమావేశాలు, అపాయింట్మెంట్ల నిర్వహణ చూస్తుంది. మోడీ మీడియానూ, ప్రజలను కలిసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మిగిలిన బృందాలను, నాయకులను సమన్వయపరుస్తారు. ఐటీ బృందం అరవింద్ గుప్తా (43) బీజేపీ ఐటీ సెల్ అధిపతి పనిచేసేస్థానం: ఢిల్లీ, ఈ సెల్ మోడీ సామాజిక మీడియా బాధ్యతలను చూస్తోంది. ఈ విభాగంలో స్వచ్ఛంద కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఉన్నారు. సామాజిక మీడియా బృందం హీరేన్ జోషీ (43) పనిచేసేస్థానం: గాంధీనగర్ గుజరాత్ సీఎం ఆఫీసులోని ఐటీ నిపుణుల్లో ఈయన ఒకరు. సోషల్ మీడియాలో ఇండియా 272 ప్లస్ ప్రచారంతోపాటు మోడీ ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తున్నారు. జైరాం రమేశ్ (59) రాహుల్‌గాంధీకి ప్రధాన సలహాదారు. దిగ్విజయ్‌సింగ్‌ను సైతం వెనక్కినెట్టి ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నికల ప్రధాన వ్యూహకర్త. అశోక్ తన్వర్ (37) రాహుల్ బృందంలో దళితుల ప్రతినిధి. హర్యానా రాష్ట్ర పార్టీ విభాగానికి సారథి. కనిష్క సింగ్ (35) రాహుల్ సొంత మనిషి. ఢిల్లీలోని 12-తుగ్లక్ లేన్ నివాసం నుంచి రాహుల్ కార్యాలయ నిర్వహణ పనులను పర్యవేక్షిస్తారు. సచిన్ రావు (42) విధాన నిర్ణయాల సమన్వయకర్త. ప్రత్యేకించి సామాజిక, సంక్షేమ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. రాహుల్ కార్యాలయం, ప్రజా సంఘాల సమన్వయం ఈయన పని. జితేందర్ సింగ్ (42) యూపీ ఇన్చార్జి. రాహుల్‌తో కలిసి సన్నిహితంగా పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య పంథాకు మార్గదర్శి. మాణిక్ ఠాగూర్ (38) అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇన్చార్జి. రాహుల్ ఆఫీసులో కీలక వ్యక్తి. 2009 ఎన్నికల్లో ఎండీఎంకే అధినేత వై.గోపాలస్వామిని ఓడించారు. మీనాక్షి నటరాజన్ (40) ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా ఇన్చార్జి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ సిటింగ్ ఎంపీ. ఎన్ఎస్యూఐ సెక్రటరీ ఇన్చార్జి. రాహుల్‌కు నమ్మిన బంటు. శుభంకర్ సర్కార్ (53) కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు వ్యవహారాల ఇన్చార్జి. ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ ఎన్ఎస్యూఐ దళపతి. పరేశ్ ధనానీ (37) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి. గుజ రాత్ మాజీ ఎమ్మెల్యే. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. కులజీత్ నాగ్రా (48) రాజస్థాన్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్, గుజరాత్ వ్యవహారాల ఇన్చార్జి. రాహుల్ ఎంపిక చేసుకున్న 20 మంది యువతరం సెక్రెటరీల్లో ఒకరు. భక్తచరణ్ దాస్ (55) గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి. గిరిజన హక్కుల యోధుడు. పార్టీ అధికార ప్రతినిధి. హరీశ్ చౌధరీ (43) హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ వ్యవహారాల ఇన్చార్జి. రాజస్థాన్‌లోని బార్మేర్ ఎంపీ. రాహుల్ బృందంలో కొత్త ముఖం. 2012లో యూపీ ఎన్నికల పోరాటంలో దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి పనిచేశారు. రాజీవ్ సాతవ్ (39) మహారాష్ట్ర కాంగ్రెస్ యువనేత. యువజన కాంగ్రెస్ సంస్కరణల భారం నెత్తిన వేసుకున్నారు. మధుసూదన్ మిస్త్రీ (69) ఒకప్పుడు ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు చూశారు. నిన్నమొన్నటి వరకు ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు చూశారు. దీపేందర్ హుడా (36) ఈయన హర్యానా సీఎం భూపీందర్ హుడా కుమారుడు. రాహుల్‌కు సామాజిక మీడియాలో ప్రచారం కల్పించే బాధ్యతను చూస్తుంటారు. -
యువ సత్తా చాటిన జగన్
వర్తమాన రాజకీయాల్లో యువ సత్తా చాటిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డే. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి చిన్న వయస్సులో సొంతంగా పార్టీ పెట్టి బలమైన శక్తిగా ఎదగడం రాజకీయాల్లో యువశక్తి ఏమి టో చాటింది. రాజకీయాల్లో యువత క్రియాశీలకమైతే ఎలా ఉంటుందనేందుకు ఇదే నిదర్శనం. క్రికెట్, ఇతర వ్యాపకాలపై గంటల సమయం గడిపే యువత మన జీవితాలను ప్రభావితం చేసే పాలిటిక్స్‌పై దృష్టిసారించాలి. ఇందుకు తొలి అడుగు ఎన్నికల్లో ఓటు చేయడమే. ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకుని సమర్థులైన పాలకులనే ఎన్నుకోవాలి... -ఇషా (‘అంతకుముందు ఆ తర్వాత’ ఫేం) -
నన్ను మోయండి.. మా పార్టీని గెలిపించండి...
ఈ ఫొటోలో ఉన్నది తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే సంపత్‌కుమార్. వేలూరు లోక్‌సభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి సెంగుత్తవన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఇలా కావడిలో బయల్దేరారు! ఆయన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,000 అడుగుల ఎత్తున ఉండే నెగ్నకొండలో 600 మంది ఓటర్లున్నారు. వెళ్లి వారిని ఆకట్టుకోవాలన్నది ప్లాను. కానీ ఆ కొండ ఎక్కాలంటే 8 కిలోమీటర్ల దూరం కాలినడకే శరణ్యం. ఎమ్మెల్యేగారికేమో కాలికి గాయమైంది. గాయపడ్డ కాలితో కొండెక్కలేనంటూ చేతులెత్తేయడంతో ఆయన అనుచరగణం ఇలా దుప్పటితో కావడి సిద్ధం చేసింది. ఎమ్మెల్యేను అందులో కూర్చోబెట్టి మోసుకుంటూ కొండపైకి తీసుకెళ్లారు. ఎలాగైతేనేం... తొలిసారిగా ఎమ్మెల్యే తమ వద్దకు రావడంతో నెగ్నకొండ ప్రజలు సంబరపడిపోయారు. - సి. నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
‘2జీ’ని పట్టించుకోం!
దేశాన్ని కుదిపేసిన రూ. 1.76 లక్షల కోట్ల 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదు. ‘అది మాకు అసలు విషయమే కాదు. తాగునీరు లేకపోవడం, నిరుద్యోగం లాంటి మా స్థానిక సమస్యలే మాకు ముఖ్యం’ అని వారు కుండబద్ధలు కొడ్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, 2జీ స్కామ్‌లో 15 నెలల పాటు తీహార్ జైలు పాలయిన ఏ రాజా డీఎంకే పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. స్థానిక ప్రజలు పట్టించుకోకపోయినా అక్కడి ఎన్నికల్లో 2జీ కుంభకోణమే ప్రధాన ప్రచారాంశమైంది. ఒకవైపు, ఏఐఏడీఎంకే 2జీ స్కామ్ అవినీతిని, అందులో రాజా పాత్రను ప్రచారం చేస్తుండగా.. మరోవైపు 2జీ స్కామ్‌లో తనను బలిపశువును చేశారంటూ సానుభూతి ఓట్లకు రాజా గాలమేస్తున్నారు. టెలికాం విప్లవం ఫలితాలను ప్రజలందరికీ అందించేందుకు తాను కృషి చేశానని, అది నచ్చకే కొందరు తనను స్కామ్‌లో ఇరికించారని చెబుతున్నారు. ‘కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం ఉంది. అయితే, అంతకన్నా ముందు మీ తీర్పు నాక్కావాలి’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీగా ఉన్న దళిత ఓట్లపై రాజా ఆశలు పెట్టుకున్నారు. అయితే, నీలగిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడింట ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలే ఉన్నారు. -
బీజేపీ కోసండాకూ మల్ఖాన్ సింగ్ ప్రచారం
డాకూ మల్ఖాన్ సింగ్... ఒకప్పుడు ఈ పేరు వింటేనే చంబల్ లోయ వణికిపోయేది. ఆరడుగులకు మించిన ఎత్తు, మెలితిరిగిన గుబురు మీసాలతో అతడు ఎదురుపడితే, జనం కకావికలమై పరుగులు తీసేవారు. అదంతా చంబల్ లోయలో బందిపోట్ల ప్రాబల్యం కొనసాగినప్పుటి మాట. తర్వాతి కాలంలో చాలామంది బందిపోట్ల మాదిరిగానే మల్ఖాన్ సింగ్ కూడా లొంగు‘బాట’ పట్టాడు. మధ్యప్రదేశ్‌లోని అప్పటి అర్జున్ సింగ్ ప్రభుత్వం డాకూ మల్ఖాన్ సింగ్‌కు, అతడి అనుచరులకు భూదాన్ భూములు ఇచ్చి పునరావాసం కల్పించింది. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలపై దృష్టి సారించిన మల్ఖాన్ సింగ్, ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం సాగిస్తున్నాడు. కాంగ్రెస్ హయాంలో సామాజిక అసమానతలకు వ్యతిరేకంతా తామంతా తిరుగుబాటుదారులుగా మారామని చెప్పుకుంటున్న మల్ఖాన్ సింగ్, బీజేపీకి ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నాడు. దేశానికి నరేంద్ర మోడీ వంటి నాయకుడు అవసరమని, సుపరిపాలన కోసం బీజేపీని గెలిపించాలని చెబుతున్నాడు. గ్వాలియర్ బీజేపీ అభ్యర్థి నరేంద్రసింగ్ తోమర్, భిండ్ బీజేపీ అభ్యర్థి భగీరథ్ ప్రసాద్‌లతో కలసి మల్ఖాన్ సింగ్ విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొంటున్నాడు. -
గిప్పుడన్నా మాకు న్యాయం జరగాలె
అమరుడు నర్ముల పుల్లయ్య తల్లి లచ్చమ్మ గ్రామం: ధర్మపురి, కరీంనగర్ జిల్లా అమ్మ మాట.. తెలంగాణ రాదని ఎవలో అన్నరని బెంగతో నా కొడుకు పుల్లయ్య(31) ఉరేసుకుని పాణాలు తీసుకున్నడు. తెలంగాణ అంటే సాలు అన్ని మర్చిపోయేటోడు. ఉద్యమంల తిరిగెటోడు. ఇంటిపట్టున పెద్దగా ఉండకుండె. గింత తిని మళ్లీ ఉరికెటోడు. ఉద్యమం ఎంత జేసినా ఇంక తెలంగాణ రాదని ఎవ రో అన్నరంట.. గంతే ఆమాటకే మనసు పాడుజేసుకున్నడు. ఆ దినం నుంచి సక్కగ మాట్లాడేటోడు కాదు. ఒకదినం ఉరేసుకుని సచ్చిపోయిండు. కొడుక్కి భార్య సుజాత, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆడు సచ్చిపోవడంతో ఆళ్లంతా ఇప్పుడు అనాథలైండ్రు. ఇంట్లో అందరికీ ఆవేదన మిగిల్చిండు. నా బిడ్డడు సచ్చిపోయినంక తెలంగాణ అచ్చింది. గిప్పుడాడుంటే బాగుండె. తెలంగాణ అచ్చింది కాబట్టి మాలాంటోళ్లకి న్యాయం చెయ్యాలె. అన్ని వసతులు కల్పించాలి. కూడు, గూడు, గుడ్డకు కరువుండకుండా చేయాలె. తాగునీరు అందించాల. పంటలకు నీళ్లు అందించే ఏర్పాట్లు చేయాల. అన్ని వసతులు కల్పిస్తేనే మాలాంటోళ్ల కష్టాలు తీరుతయి. గప్పుడే నా బిడ్డ ఆత్మ శాంతిస్తది. - సేకరణ : శ్రీరాములు, ధర్మపురి -
బహుముఖ పోరు
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం.. ఇప్పుడు హాట్‌స్పాట్‌గా మారింది. ఓటర్ల సంఖ్యపరంగా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన ఈ స్థానం నుంచి జయకేతనం ఎగరేసేందుకు ఉద్దండులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి పోటీకి సిద్ధం కాగా ఆయన్ను ఢీ కొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర తాజా మాజీ పోలీస్ డెరైక్టర్ జనరల్ వి.దినేశ్‌రెడ్డిని రంగంలోకి దింపింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సీఎంఆర్ విద్యాసంస్థల అధిపతి చామకూర మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, లోక్‌సత్తా అభ్యర్థిగా డాక్టర్ జయప్రకాశ్ నారాయణతో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆమ్ఆద్మీ పార్టీ నుంచిమాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు డాక్టర్ ఎన్వీ సుధాకిరణ్‌తో కలిపి మొత్తం పదిహేడు మంది బరిలో నిలిచారు. (శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి) 2009లో ఏర్పడ్డ ఈ లోక్‌సభ జనరల్ స్థానం నుంచి మంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ మరోసారి పోటీకి దిగారు. అయితే సర్వేపై స్థానికంగా వ్యతిరేకతకు తోడు శాసనసభ టికెట్ల పంపిణీ వ్యవహారం, పలు సందర్భాల్లో ఆయన అనుసరించిన తీరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమైంది. కాంగ్రెస్‌లో కొనసాగిన నాయకులే ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా శాసనసభకు పోటీ చేస్తుండటం, మల్కాజిగిరిలో ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్న ఆకుల రాజేందర్ సర్వేకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించటం, నియోజకవర్గ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఇప్పటికీ ఆయనకు సఖ్యత లేకపోవటం, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఇతర పార్టీల్లో తన సానుభూతిపరులుగా ముద్రపడిన వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న తీరు ఈ ఎన్నికల్లో సర్వేను రెంటికి చెడ్డ రేవడిని చేసే అవకాశం లేకపోలేదు. దీనికితోడు ఈ నియోజకవర్గంలో ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్న ఓ ప్రాంతం ప్రజలను పలుమార్లు అవమానించే తీరుగా సర్వే చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. లోక్‌సత్తా..‘దేశం’ చెరో రూటు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ నియో జకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీఎంఆర్ విద్యాసంస్థల అధిపతి చామకూర మల్లారెడ్డి సైతం లోక్‌సభ బరిలో నిలిచారు. అయితే గత ఆర్నెళ్ల నుంచి లోక్‌సత్తా, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఉంటుందన్న సంకేతాలుండటం, చివరి నిమిషంలో ఎవరికీ వారే పోటీకి దిగటంతో లోక్‌సత్తా పరిస్థితి పూర్తి ఇబ్బంది కరంగా తయారైంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతు లేదని తేలిపోవటంతో లోక్‌సత్తా కార్యకర్తలు పూర్తిగా డీలాపడ్డారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఎంఎల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉండటం లోక్‌సత్తాకు పెద్దదెబ్బగా భావించవచ్చు. ఇక తెలుగు దేశం విషయానికి వస్తే ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులంతా పార్టీని వదిలిపెట్టారు. ఎల్బీనగర్ స్థానాన్ని ఆర్.కృష్ణయ్యకు ఇవ్వటాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణప్రసాద్, ముఖ్య నాయకులు సామ రంగారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీని వదిలిపెట్టడంతో ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఉప్పల్ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. కారుకు స్టార్టింగ్ ట్రబుల్స్ తెలుగుదేశం, ఆపై కాంగ్రెస్ పార్టీలను వదిలి చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ప్రాంతాల్లో పార్టీకి పునాదులు లేకపోవటం, ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరిన వారికి టికెట్లు ఇవ్వటంతో కారు జోరందుకునేందుకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ నుంచి పీవీ మనవడు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ ప్రధాని పీవీ మనవడు ఎన్వీ సుధాకిరణ్ పోటీ చేస్తున్నారు. ఈయన పీవీ పెద్దకూతురు శారద కుమారుడు. చాలాకాలం పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసిన సుధాకిరణ్ ఆమ్ ఆద్మీ పిలుపుతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. దూసుకుపోతున్న.. దినేశ్‌రెడ్డి తాజా మాజీ డీజీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వి.దినేశ్‌రెడ్డి ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. సౌమ్యుడిగా పేరున్న దినేశ్‌రెడ్డికి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో బంధువులు, మిత్రులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో చేరిన రోజు నుంచే నియోజకవర్గంలో హంగూ ఆర్భాటం లేకుండా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. పోలీస్ శాఖలో అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైన తనను, ఎంపీగా ఎందుకు గెలిపించాలో.. ఓటర్లకు వివరిస్తున్నారు. నిజాయితీపరుడిగా ముద్రపడిన దినేశ్‌రెడ్డికి ఈ నియోజకవర్గంలో అనేకమంది ముఖ్యులతో వ్యక్తిగత సంబంధాలకు తోడు వైఎస్ అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దినేశ్రెడ్డ్డి కోసం ప్రచారాన్ని ప్రారంభించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే దినేశ్‌రెడ్డికి మద్దతు ప్రకటించాయి. ఇక వైఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్, ముస్లిం రిజర్వేషన్లు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ తదితర పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య 70 శాతం వరకు ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. ఈ దఫా నియోజకవర్గం రూపురేఖలు మారుస్తా. నా శాఖకు సంబంధించి నియోజకవర్గం మీదుగా వెళ్లే రహదారులన్నింటినీ భారీ ఎత్తున విస్తరించాం. మంచినీటి పథకాలకు మోక్షం కల్పించాను. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే నా ప్రాధాన్యం - సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్) నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను కలిపే విధంగా మెట్రోరైల్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల విస్తరణ. మంచినీరు, రహదారులు, డ్రైనేజీ, వీధిలైట్ల వంటి అంశాలతోపాటు విద్య, వైద్యం, ఉపాధి అంశాలకు ప్రాధాన్యమిస్తా. - వి.దినేశ్‌రెడ్డి,(వైఎస్సార్సీపీ) నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఐటీఐల ఏర్పాటుకు కృషిచేస్తా. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల జోన్ ఏర్పాటుకు కృషిచేస్తా. నగరాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేస్తా నిరుపేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం - సి.మల్లారెడ్డి (టీడీపీ) జనాభా నిష్పత్తి మేరకు ఆయా వార్డులకు బడ్జెట్‌ను కేటాయించి, పనులను స్థానిక కమిటీలకే అప్పగించేలా చూస్తా. రూ.7000 కోట్ల నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మంచినీటి వ్యవస్థను మెరుగుపరుస్తా. నియోజకవర్గంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తా. - జయప్రకాశ్ నారాయణ (లోక్‌సత్తా) ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా. కృష్ణా మూడో దశ, గోదావరి జలాలను రప్పిం చటం, డ్రైనేజీ, నిర్మాణ ం నా తొలి ప్రాధాన్యత. నగరం చుట్టూ వ్యవసాయ భూములను హార్టికల్చర్ జోన్‌గా అభివృద్ధి చేయటం - డాక్టర్ సి.నాగేశ్వర్ (స్వతంత్ర) తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా స్థానికులకు ప్రత్యేక కోటాలు లేకపోతే ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా విద్య, ఉపాధి రంగాల్లో స్థానికుల కోసం ప్రత్యేక కోటాను కేటాయించేందుకు కృషి. మౌలిక సదుపాయాలకు అవకాశం కల్పిస్తూ, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం. - మైనంపల్లి హన్మంతరావు (టీఆర్ఎస్) రాజకీయాలంటే అధికారాన్ని అనుభవించటం కాదు. కేవలం ప్రజాసేవకు ఓ మంచి మార్గం. అధికారం కోసం అడ్డమైన పార్టీలతో పొత్తులకు దిగే పార్టీల నిజస్వరూపాన్ని ఎండగడతాం. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్వచ్ఛమైన పరిపాలన, సేవలు అందించేందుకు కృషిచేస్తా. - డాక్టర్ ఎన్వీ సుధాకిరణ్(ఆమ్ ఆద్మీ) -
వామపక్షానికి వరం
చిన్ననాడే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమబాట పట్టారు. ఖాకీల కాఠిన్యాన్నీ చూశారు. కవుల లాలిత్యాన్నీ ఆస్వాదించారు. మంచి చదువరి. ఉత్తమ వక్త. ఒకప్పటి సమైక్యవాది, నేటి తెలంగాణ వాది. ఓ జాతీయ పార్టీని నడిపిస్తున్న తెలుగువాడు.. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. ఎ.అమరయ్య దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి పదేళ్లయింది. స్కూలుకు బ్లాక్‌బోర్డు, చాక్‌పీసులు, నోటు పుస్తకాలు ఎందుకివ్వరని పదిహేనేళ్లు కూడా లేని బాలుడు.. అధికారులను నిలదీశాడు. ఆ బాలుడి నినాదం కర్నూలు జిల్లా విద్యాశాఖను కదిలించింది. ప్రతి పాఠశాలకు నల్లబోర్డులు ఏర్పాటు చేసింది. అతనే నేటి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. ఆ స్కూలే కర్నూలులోని మున్సిపల్ హైస్కూలు. 1957లో జరిగిన ఈ సంఘటన అధికార యంత్రాంగాన్ని మునికాళ్లపై నిలబెట్టింది. సుధాకర్‌రెడ్డి 1942 మార్చి 25న సమరయోధుల ఇంట జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తల్లి ఈశ్వరమ్మ. ఇద్దరు సోదరులు, ఒక సోదరి. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం కంచుపాడు స్వగ్రామం. సురవరం హైస్కూ లు విద్యను కర్నూలులోనే పూర్తి చేశారు. ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. 1967లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సులో చేరారు. అప్పటికే కమ్యూనిస్టు రాజకీయాలతో ఉన్న అనుబంధం కారణంగా 19 ఏళ్లకే ఏఐఎస్ఎఫ్ కర్నూలు టౌన్ కార్యదర్శిగాను, 1960లో జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. ప్రతి విద్యార్థికి చదువు, పోరాటం.. రెండు కళ్లని చెప్పే సురవరం జీవితంలో రెండు మరచిపోని సంఘటనలున్నాయి. ఒకటి బ్లాక్‌బోర్డుల ఉద్యమమైతే, మరొకటి 1962లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన 62 రోజుల నిరవధిక సమ్మె. ఆయన నాయకత్వంలోనే జరిగింది. ఆ తర్వాత ఆయన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. ఆ మరుసటి ఏడాది జాతీయ కార్యదర్శిగా ఎన్నిక య్యారు. ప్రధాన కార్యదర్శి పదవిని రెండుసార్లు నిర్వహించిన సురవరం ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ పలు అంతర్జాతీయ సదస్సులకు ప్రాతినిధ్యం వహించారు. ఈ కాలంలో జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేశారు. కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ జాతీయ మహాసభలో జాతీయ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన సురవరం పార్టీ రాష్ట్ర వ్యవహారాలలో క్రియాశీలకమయ్యూరు. 1974 ఫిబ్రవరి 19న బీవీ విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఎన్నికల ప్రస్థానం ... 1985లో తొలిసారి, 1990లో రెండోసారి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1994లో కర్నూలు జిల్లా డోన్ నుంచి ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై పోటీకి దిగారు. అసెంబ్లీకి వరుసగా మూడుసార్లు ప్రయత్నించి విఫలమైన సురవరం .. 1998లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ కాలంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా పనిచేశారు. ఎంపీగా ఉంటూ పార్టీ కార్యదర్శి పదవిని నిర్వహించిన వ్యక్తి కూడా సురవరమే. 2000వ సంవత్సరంలో చంద్రబాబు సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బషీర్‌బాగ్ ఘటనలో లాఠీ దెబ్బలు తిని ఆస్పత్రి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో నల్లగొండ నుంచి రెండోసారి ఎన్నికై... కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘ చైర్మన్‌గా పనిచేశారు. చండ్ర రాజేశ్వరరావు తర్వాత సీపీఐకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన రెండో తెలుగు వ్యక్తి సురవరమే. ప్రొఫైల్ పేరు: సురవరం సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు: ఈశ్వరమ్మ, వెంకట్రామిరెడ్డి పుట్టిన తేదీ: 25-03-1942 పుట్టిన ఊరు: కొండ్రావ్పల్లె స్వగ్రామం: కంచుపాడు, మానవపాడు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా విద్య: బీఏ, ఎల్ఎల్బీ భార్య: డాక్టర్ బీవీ విజయలక్ష్మి సంతానం: ఇద్దరు కుమారులు ప్రస్తుత హోదా: సీపీఐ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన పదవులు: పార్లమెంటు సభ్యుడు సహా అనేకం -
పంచ్
చంద్రబాబు నా వెనుక మోడీ ఉన్నాడు.. నా వెనుక రామోజీ ఉన్నాడు.. నా వెనుక పవన్‌కల్యాణ్ ఉన్నాడు.. నా వెనుక బాలకృష్ణ ఉన్నాడు... నా వెనుక జూ.ఎన్టీయార్ ఉన్నాడు.. జగన్ నా వెనుక ప్రజలు ఉన్నారు... అన్ని పార్టీలకు ‘అల్లు’డే..! టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అన్ని రాజకీయపార్టీలకు అల్లుడైపోయాడు.... ఆయన మేనమామలు చిరంజీవి కాంగ్రెస్‌పార్టీలో ఉంటే...పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి బీజేపీ, టీడీపీలకు జై కొడుతున్నారు. ఇక అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (శేఖర్‌రెడ్డి) ఇటీవల టీఆర్ఎస్లో చేరి వెంటనే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగారు. పాపం...చిరంజీవి రాజకీయాల్లో చేరి కొందరివాడు అయితే, ఆయన అల్లుడు అల్లు అర్జున్ మాత్రం ఇలా రాజకీయ పార్టీలన్నింటికీ అల్లుడైపోయాడు. - ప్రవీణ్‌కుమార్ కాసం -
దిగ్గజాల్లో నెగ్గేదెవరు?
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉద్దండులు తలపడుతున్న పలు లోక్‌సభ స్థానాలు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. పార్టీలు సైతం అక్కడతమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్... అందరూ ప్రముఖులే. ఇలాంటి పలువురు దిగ్గజాల్లో సునాయాసంగా గెలిచేదెవరు, కనాకష్టంగా గట్టెక్కేదెవరు, అనూహ్యంగా ఓడేదెవరు, ఎవరికెంత మెజారిటీ వస్తుంది... ఇలాంటి అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ నేపథ్యంలో వారు బరిలో ఉన్నలోక్‌సభ స్థానాలపై విహంగ వీక్షణం... హేమాహేమీలు తలపడుతున్న కీలక స్థానాల ముఖచిత్రం.. వారణాసి దేశంలో అత్యధికుల దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఇదే. ఉత్తరప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రమైన వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్నారు. ఇక్కడి నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులే కరువయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్‌ని నిలిపింది. సిటింగ్ ఎంపీ అయిన బీజేపీ అగ్ర నేత మురళీ మనోహర్ జోషీ తప్పుకునేందుకు తొలుత ససేమిరా అన్నా, ఆయన్ను ‘ఒప్పించి’ మరీ హిందువులకు పరమపవిత్రమైన ఈ స్థానం నుంచి వ్యూహాత్మకంగా బరిలోకి దిగారు మోడీ! అయితే ఆ వెంటనే కేజ్రీవాల్ ఎంట్రీ ఇచ్చి ఏకపక్షమనుకున్న పోరును ఆసక్తికరంగా మార్చారు. ఇక్కడ మే 12న పోలింగ్ జరగనుంది. రాయ్‌బరేలీ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమె వరుసగా మూడుసార్లు గెలిచారు. ‘ఆప్’ బరిలోకి దించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఫక్రుద్దీన్ ఉపసంహరించుకోవడంతో ఆయన బదులు సామాజిక కార్యకర్త అర్చనా శ్రీవాస్తవ పోటీ చేస్తున్నారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అజయ్ అగర్వాల్‌ను బీజేపీ నిలిపింది. వారణాసిలో కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలిపితే, రాయ్‌బరేలీ నుంచి బీజేపీ కూడా అదే పని చేయడం విశేషం. గట్టి ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో ఈసారి కూడా సోనియా గెలుపు సునాయాసమే. యూపీఏకు బయటి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ పోటీకి దూరంగా ఉండటం మరింత కలిసొచ్చే అంశం. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది. అమేథీ యూపీలో కాంగ్రెస్‌కు మరో కంచుకోట. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి టీవీ నటి స్మృతి ఇరానీ, ఆప్ తరఫున ‘వికటకవి’ కుమార్ విశ్వాస్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ కొంత ప్రముఖులే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, ‘ఈసారి రాహుల్‌పైనే పోటీ చేస్తా’నని ప్రకటించి మరీ బరిలో దిగిన విశ్వాస్ అమేథీలోనే మకాం వేశారు. ‘ఇరానీ అయినా రానీ, పాకిస్థానీ అయినా రానీ...’ అంటూ స్మృతిని విమర్శించి వివాదానికి తెర తీశారు. మహిళలను గౌరవించడం తెలియదంటూ ఆమె మండిపడ్డారు. రాహుల్‌ను ఓడిస్తామంటూ వచ్చిన వీరిద్దరూ వాగ్యుద్ధానికి దిగడం ఓటర్లకు వినోదంగా మారింది. సమాజ్‌వాదీ ఇక్కడ అభ్యర్థిని నిలపడం లేదు! ఇక్కడ మే 7న పోలింగ్ జరగనుంది. వుథుర కృష్ణ జన్మస్థానంగా ప్రసిద్ధికెక్కిన పశ్చివు ఉత్తరప్రదేశ్‌లోని వుథుర ఈసారి దక్షిణాదికి చెందిన బాలీవుడ్ నటి హేవువూలిని (65) బీజేపీ తరఫున పోటీకి దిగడంతో వార్తల్లోకెక్కింది. గాజియూబాద్, గౌతంబుద్ధనగర్ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినా వాటిని కాదని శ్రీకృష్ణ జన్మస్థలినే ఎంచుకున్నానని ఆమె ప్రకటించారు. హేమ రాకతో సిటింగ్ ఎంపీ, ఆరెల్డీ నేత అజిత్‌సింగ్ కువూరుడు జయుంత్ చౌధరీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో నాలుగుసార్లు వుథురలో నెగ్గిన బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. జాట్లు బాగా ఉన్న ఈ స్థానంలో వారి ఆదరణ ఉన్న జయుంత్కే వూవుూలుగా సానుకూలత ఉండాలి. కానీ ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల వాతావరణముందనే ప్రచారం, వుుజఫర్నగర్ వుత ఘర్షణలు తదితరాలు ఈసారి ఆయనకు ప్రతికూలంగా మారవచ్చంటున్నారు. పైగా తన భర్త, నిన్నటి తరం సూపర్ హీరో ధర్మేంద్ర జాట్ కాబట్టి తాను జాట్ల కోడలిననీ, ఆ వర్గం ఓట్లు తనకే పడతాయుని హేవువూలిని చెబుతున్నారు. ఇక జయుంత్ గత ఐదేళ్లలో నియోజకవర్గ ముఖం చూసింది తక్కువే అయినా ఇప్పుడు వూత్రం ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరిస్తూ చెమటోడుస్తున్నారు. హేవు మాత్రం ఖరీదైన ఆడీ కారు దిగకుండానే సుతారంగా చేతులూపుతూ సాగిపోతున్నారు. పోలింగ్ ఏప్రిల్ 24న జరగనుంది. లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయిని ఆదరించిన ఈ స్థానంలో బీజేపీకి గణనీయమైన బలముంది. కాంగ్రెస్ తరఫున యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ బరిలో ఉన్నారు. ఆప్ తరఫున బాలీవుడ్ నటుడు జావేద్ జఫ్రీ కూడా ఉన్నా పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది. విదిశ లోక్‌సభలో విపక్షనేత, సిటింగ్ ఎంపీ సుష్మా స్వరాజ్ మరోసారి పోటీ చేస్తుండటంతో విదిశాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఒకసారి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఐదుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. ‘కమలం’ కంచుకోట అయిన ఈ స్థానాన్ని కాంగ్రెస్ సహజంగానే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్‌ను బరిలోకి దించి విస్తృతంగా ప్రచారం సాగిస్తుండటంతో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అమృత్ సర్ పంజాబ్‌లో రెండు ప్రధాన జాతీయు పార్టీల నుంచి బడా నేతలైన అరుణ్ జైట్లీ (బీజేపీ), కెప్టెన్ అవురీందర్సింగ్ (కాంగ్రెస్) తలపడుతుండటంతో సిక్కుల ప్రధాన పుణ్యక్షేత్రం అవుృతసర్లో ఎన్నికల వేడి ఎప్పుడూ లేనంతగా పెరిగింది. బీజేపీలోని కొత్త తరం నేతగా, మోడీ కొత్త కోటరీలో వుుఖ్యునిగా అవతరించిన జైట్లీ గెలుపు ఖావుయునే అభిప్రాయుం తొలుత వ్యక్తమైంది. బీజేపీ తరఫున గెలిచిన సిటింగ్ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజోత్‌సింగ్ సిద్ధూ, జైట్లీకి ‘గురుద క్షిణ’గా తప్పుకున్నారు. అత్యధిక సిక్కు ఓటర్లున్న ఈ స్థానంలో హిందూ అభ్యర్థులు ఏకంగా ఎనిమిదిసార్లు గెలిచారు. అందుకే సిక్కుల పార్టీ అరుున శిరోవుణి అకాలీదళ్ వుద్దతుతో జైట్లీ ధైర్యంగా రంగంలోకి దిగారు. కానీ పంజాబ్ వూజీ సీఎం, పాటియూలా సంస్థానం వూజీ ‘యుువరాజు’ అవురీందర్ తొలుత తటపటారుుంచినా, చివరికి బరిలో దిగడంతో జైట్లీకి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అరుణ్ పంజాబీ కాదని, బయుటివాడని పేర్కొంటూ అవురీందర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాను పరాయినేమీ కాదని, తన తల్లి అవుృతసర్ ఆడపడచేనని జైట్లీ చెబుతున్నారు. ఢిల్లీ తరహా పంజాబీలో ప్రసంగిస్తూ నానా తంటాలు పడుతున్నారు. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది. బెంగళూరు సౌత్ దేశ ప్రజలందరికీ ఆధార్ కార్డు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన యుునీక్ ఐడెండిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియూ (యుూఐఏడీఐ) చైర్మన్‌గా పని చేసిన ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వూజీ ఉన్నతాధికారి నందన్ నీలేకని కాంగ్రెస్ తరఫున ఇక్కడ బరిలోకి దిగడంతో ఒక్కసారిగా ఈ స్థానం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయుకత్వంలోని యూపీఏకు మెజారిటీ వస్తే వున్మోహన్‌సింగ్‌కు వచ్చినట్టుగానే ప్రధాని పదవి నీలేకనికి దక్కవచ్చని ఒక దశలో మీడియూలో ఊహాగానాలు కూడా వచ్చారుు. ఆయన ప్రత్యర్థి అయిన 53 ఏళ్ల హెచ్ఎన్ అనంతకువూర్ వూజీ కేంద్రవుంత్రి, బీజేపీ నేత. ప్రస్తుతం సిటింగ్ ఎంపీ అయిన ఆయన 1996 నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. జేడీఎస్ తరఫున రూత్ వునోరవు, ఆమ్ఆద్మీ పార్టీ టికెట్‌పై నీనా పి.నాయుక్ రంగంలో ఉన్నా పోటీ ప్రధానంగా నీలేకని, అనంతకువూర్ వుధ్యనే ఉంటుంది. ఈసారి కూడా నరేంద్రమోడీ గాలిలో గెలిచి కేంద్ర కేబినెట్లో స్థానం ఆశిస్తున్న ఆయనకు నీలేకని పెద్ద అడ్డంకిగా వూరారు. వరుసగా ఐదుసార్లు ఎన్నికవడం, రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం, యుువతరాన్ని ఆకర్షించే అభ్యర్థిగా నిలేకని బరిలో దిగడం అనంతకువూర్ను కుంగదీసే అంశాలు. పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. గాంధీనగర్ గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బీజేపీ కురువృద్ధుడు, సిట్టింగ్ ఎంపీ అద్వానీ మరోసారి పోటీ చేస్తున్నారు. కాకపోతే ఈసారి ఆయన అయిష్టంగానే బరిలోకి దిగారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచీ పార్టీపై కినుక వహిం చిన ఆయన ఈసారి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్లి పార్టీకి నష్టం కలగవచ్చనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు ఆయనకు నచ్చజెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి కిరీట్ పటేల్ ఐదుసార్లు గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వానీకి దీటైన అభ్యర్థి కాదు. ఆయన గెలుపు లాంఛనప్రాయమే. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది. సుల్తాన్పూర్ యూపీలో సోనియూ, రాహుల్ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, అమేథీలకు పొరుగునే ఉన్న సుల్తాన్పూర్ నుంచి నెహ్రూ-గాంధీ కుటుంబానికే చెందిన వరుణ్‌గాంధీ బీజేపీ తరఫున బరిలో దిగడంతో సుల్తాన్పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కిందటిసారి తొలిసారి లోక్‌సభకు పిలిభిత్ నుంచి గెలిచిన వరుణ్, తన తండ్రి సంజయ్‌కి సుల్తాన్‌పూర్‌తో అనుబంధం ఉందనే కారణంతో ఇక్కడికొచ్చారు. కాంగ్రెస్ తరఫున అమేథీ వూజీ సంస్థానాధీశుని కోడలు అమితాసింగ్ రంగంలో ఉన్నా వరుణ్ గెలుపు తేలికేనంటున్నారు. రాహుల్ తన చిన్నాన్న కొడుకైన వరుణ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయుడం లేదు. వరుణ్ కూడా ఇదే సూత్రం పాటిస్తున్నారు. పైగా, పొరపాటున అమేథీలో రాహుల్ ప్రజలకు చేసిన మేలును ప్రశంసించి వివాదం సృష్టించారు కూడా! పిలిభిత్ నుంచి ఈసారి వరుణ్ తల్లి మేనకాగాంధీ పోటీ చేస్తున్నారు. అమితాసింగ్ తరఫున ఆమె భర్త, వూజీ యుువరాజు, రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ గట్టి ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ మే 7న జరగనుంది. వడోదరా వారణాసితో పాటు గుజరాత్‌లోని వడోదరా నుంచి కూడా మోడీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ, ఆప్ నుంచి సునీల్ దిగంబర్ కులకర్ణి బరిలో ఉన్నారు. మిస్త్రీ సీనియర్ నేతే అయినా మోడీ గాలి ముందు నిలవడం అనుమానమే. మెకానికల్ ఇంజనీర్ అయిన కులకర్ణీ రాజకీయాలకే కొత్త. ఆయన గురించి జనాలకు తెలిసిందీ తక్కువే. కాబట్టి తన బలానికి స్థాన బలమూ తోడై మోడీ తేలిగ్గా నెగ్గుతారంటున్నారు. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది. -
డైనమిక్ లీడర్లనే ఎన్నుకోండి: స్నేహ
ప్రజాస్వామ్యంలో మనిషికి ఓటే ఏకైక ఆయుధం.. ఐదేళ్లకోసారి పాలకుల తలరాత మార్చే ఆయుధం ఓటు.. అటువంటి పవిత్రమైన, ఎంతో విలువైన ఓటును డబ్బులు తీసుకుని వేయొద్దు.. ప్రలోభాలకు ఓటును అమ్ముకోవద్దు... అలా చేస్తే దేశాన్ని మోసం చేసినట్టు.. ఓరకంగా దేశాన్ని అమ్మేసినట్టు.. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.. అది దేశ పౌరులుగా మన కనీస బాధ్యత.. మన చుట్టూ ఉన్న సమాజానికి ఎవరైతే మేలు చేయగలరో ఒకటికి పదిసార్లు ఆలోచించి అలాంటి వారికే ఓటేయండి.. డైనమిక్ లీడర్లు అని మీరు ఎవరని భావిస్తారో అలాంటి నేతలకే ఓటేయండి... -
మహిళల భద్రతే కీలకాంశం
ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పన.. మహిళల భద్రత, మహిళా సాధికారత.. ఆర్థికాభివృద్ధి, మెరుగైన ఆర్థిక విధానాలు.. మత సామరస్యం, నేరాల కట్టడి.. ఇవీ నవ యువ ఓటర్లు కొత్త ప్రభుత్వం నుంచి కోరుకుంటున్న ముఖ్యమైన హామీలు. ముఖ్యంగా మహిళల భద్రతను ఢిల్లీ యువతులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తమ ఆశలు, ఆశయాలను నెరవేర్చే అభ్యర్థులను, పార్టీలను గుర్తించి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేశామంటున్నారు ఓటుహక్కును మొదటిసారి వినియోగించుకున్న యువ ఓటర్లు. ‘నేరాలు పెరిగిపోతున్నాయని, అవినీతి అని, తాగునీరు లేదని.. ఇలా రకరకాల సమస్యలపై ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఓటేసేందుకు ముందుకు రారు. మార్పు కోరుకునే వారు కచ్చితంగా తమ ఓటును అందుకు ఆయుధంగా ఉపయోగించుకోవాలి’ అని ఢిల్లీ వర్సిటీకి చెందిన కార్తీక్ చెప్పారు. ‘మహిళల భద్రత చాలా ముఖ్యమైన అంశం. కానీ ఏ పార్టీ ఢిల్లీని సేఫ్ సిటీగా చేస్తుందనుకోను’ అని 23 ఏళ్ల సురభి రంజన్ అన్నారు. -
యువ అభ్యర్థుల జోరు
మధ్యప్రదేశ్‌లో మొదటిసారి ఓటేయబోతున్న ఓటర్లతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థుల్లో యువ నాయకులకు భారీగానే అవకాశాలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో అత్యంత తక్కువ వయసున్న వ్యక్తిగా హీనా కావ్రే నిలిచారు. 29 ఏళ్ల హీనా కావ్రే మాజీ మంత్రి లిఖిరాం కావ్రే కుమార్తె. ఆమె బాలాఘాట్‌నుంచి బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థుల్లో ధార్ నుంచి పోటీ చేస్తున్న 35 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అత్యంత పిన్న వయస్కురాలు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల సగటు వయసు 50 ఏళ్లు కాగా, బీజేపీ అభ్యర్థుల సగటు వయసు 55 సంవత్సరాలు. ఈ రాష్ర్టం నుంచి పోటీ చేస్తున్న వారిలో 73 ఏళ్ల లక్ష్మి నారాయణ్ యాదవ్(సాగర్) అత్యంత పెద్ద వయస్కుడు. రాష్ట్రంలోని మొత్తం 4.7 కోట్ల ఓటర్లలో 18-29 ఏళ్ల మధ్యనున్న యువత 33% ఉండడం విశేషం. -
తూచ్... నేనింతే!
-
రామోజీ.. నీ పేపర్ జనం కోసమా.. జగన్ కోసమా?
ఎన్నికలొస్తే చాలు ఈనాడు అధినేత రామోజీరావుకు ఎక్కడలేని పూనకం వచ్చేస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డి మొదలు కుటుంబం మొత్తం మీద ఈనాడులో పేజీలకు పేజీలు విషం చిమ్మేస్తారు. దుర్మార్గమైన రామోజీ కుయుక్తులను ప్రజలు ఇప్పటికే రెండు ఎన్నికల్లో తిప్పికొట్టినా ఇంకా ఆయన తీరు మారలేదని ప్రముఖ సినీరచయిత, నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డే లక్ష్యంగా ఈనాడు తప్పుడు కథనాలతో బరితెగిస్తోందన్నారు.. పోసాని కృష్ణమురళి మాటలివీ... తప్పుగా రాశాం అని క్షమాపణ చెప్పాలి రామోజీ.. నువ్వు సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీలో డబ్బుతో ఓట్లు కొనకుండా, మందుతో ఓట్లు కొనకుండా కులం కార్డు వాడకుండా కేవలం ప్రజల ప్రేమతో ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలను చూపించు.. అదీ చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీలోనే... ఇలా చూపిస్తే నా ఒంటిమీద బట్టలన్నీ తీసి తెలుగుదేశం జెండాతో బట్టలు కుట్టించుకుని, మెడలో చంద్రబాబు బొమ్మ పెట్టుకుని రాష్ర్టమంతా తిరుగుతా.. నీ కిష్టమైన పదం జై చంద్రబాబు అని కూడా అంటా...నేను చనిపోయేవరకు.. తెలుగుదేశం జెండా నా భుజం మీద వేసుకుని తిరుగుతా... కానీ అలా చూపించలేనిపక్షంలో నువ్వు నీ మెడలో జగన్ బొమ్మ పెట్టుకుని తిరగాలి.. నీకొడుకు కూడా మెడలో జగన్ బొమ్మ వేలాడేసుకోవాలి... ఇన్నాళ్లూ తప్పుగా రాశాం... వాగాం అని క్షమాపణ చెప్పాలి... జగన్‌ను తిట్టడానికి పేపర్ కావాలా.. ప్రపంచం మొత్తం మీద జగన్ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నది రామోజీ... ఆయన కొడుకే. రామోజీ.. నీ పేపర్ జనం కోసమా... జగన్ కోసమా... ప్రజలకోసం పెట్టిన పేపర్లో రోజూ రెండు పేజీలు జగన్ కోసం కేటాయిస్తావా... అంతనిద్ర లేకుండా చేస్తున్నాడా జగన్ నీకు.. కోర్టులు ప్రూవ్ చేయకుండా ఏవో ఆరోపణలంటూ బురదజల్లేందుకు నానాకష్టాలు పడుతున్నారు.. మీరే క్వొశ్చన్ వేసుకుంటారు... మీరే ఆన్సరేసుకుంటారు... మీరే ఆనందపడిపోతుంటారు... రాజశేఖరరరెడ్డి ఉన్నప్పుడూ ఇలానే చేశారు... ఆయన మీద లేనిపోని రాతలు రాశారు.. ఫ్రంట్ పేజీలో బొమ్మలేసి 2004, 2009 ఎన్నికలప్పుడు విషం చిమ్మారు. కానీ ఏమైంది... ప్రజలు వైఎస్ వెంటే నిలిచారు.. ఇప్పుడు నువ్వు జగన్ మీద పడుతున్నావ్... పెద్ద అవినీతి, బురద, రొచ్చు నీ కళ్లముందు పెట్టుకుని ఎందుకయ్యా 24గంటలూ జగన్ మీద పడతారు.. రామోజీ... అంత దమ్ముందా నీకు... అవినీతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు.. రామోజీ అవినీతి గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు... బహుశా రామోజీకి కమ్మ వారే సీఎం కావాలని కోరికున్నట్టుంది. రెడ్లు, కాపులు, బీసీలు, దళితులు.. మరే ఇతర కులం రాకూడదని నీ ఫీలింగ్... ఏమిటంత కులం పిచ్చి... బాబు తప్ప మరెవరినీ సీఎంగా ఊహించుకోలేని భావదారిద్య్రం నుంచి ముందు బయటపడు. మళ్లీ రిపీట్ చేయగలవా ఎన్నికలు రాగానే నీకు ఎక్కడ లేని పూనకం వస్తుంది... వైఎస్ కుటుంబం మొత్తం మీద విషం చిమ్మేస్తారు. పేజీలకు పేజీలు రాస్తారు... మరి అదే ఈనాడు ఫ్రంట్ పేజీలో నీవు సపోర్ట్ చేసే టీడీపీ నేతల గురించి ఎందుకు రాయవు.. కొత్తగా ఏమీ రాయక్కరలేదు.. గతంలో నీవు రాసిన కథనాలే మళ్లీ ఎన్నికల సమయంలో పునర్ముద్రించగలవా? * ఫ్రంట్ పేజీలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కోట్లు నొక్కేశారని గతంలో రాశావ్.. మళ్లీ రిపీట్ చేయగలవా? * చంద్రబాబు కారణంగా బషీర్‌బాగ్ కాల్పుల్లో మృతి చెందిన వారి ఫొటోలు ఇప్పుడేయగలరా? * బాబు అవినీతి జమానా గురించి రాయగలవా? * ఇక్కడ జై తెలంగాణా... అక్కడ జై సమైక్యాంధ్ర ఉన్న చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం ఏవిధంగా కరెక్టో రాయగలవా? * బాబును గురించి ఎన్టీఆర్ మాట్లాడిన జామాతా దశమగ్రహ క్యాసెట్లోని అంశాలను వివరించగలవా? కొత్త రాష్ట్రానికి జగనే సీఎం కావాలి సమైక్యాంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. పాలకుల్లో సమర్థులు లేకపోవడం వల్లనే ఇలా జరిగింది. కనీసం కొత్త ఆంధ్రప్రదేశ్‌కైనా ఓ సమర్థ నాయకుడు కావాలి... ఆ నాయకుడు జగనే అని నా నమ్మకం.. నేనే కాదు.. సీమాంధ్రప్రజల విశ్వాసం కూడా అదే. సమైక్య రాష్ట్రానికి ఎందరు ముఖ్యమంత్రులు చేసినా రాష్ట్రంపై బలమైన ముద్ర వేసింది. ఎన్టీఆర్... వైఎస్ రాజశేఖరరెడ్డిలే... వీరిలో జనంతో బాగా మమేకమైంది వైఎస్సే.. ఆయన నిజమైన వారసుడిగా జగన్‌ను జనం గుర్తించారు.. ధైర్యం, నిజాయితీగా ముందుకెళ్లడం, మంచిపని చేయాలనుక్నుప్పుడు, నమ్మినవారికోసం ఎంతదూరమైనా ముందుకెళ్లడం... ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలను కోవడం... ఇవన్నీ జనం జగన్‌లో చూశారు. నాయకుడు కులం నుంచి కాదు జనం నుంచి పుట్టాలి... వైఎస్ ఇదే అనేవారు.. జగన్ శక్తివంతమైన నాయకుడిగా జనం నుంచి పుట్టారు.. జగన్‌కు డ్రామాలు తెలియవు జగన్‌కు కులం డ్రామాలు ఆడడు.. మతం డ్రామాలు తెలియవు.. నాటకాలు ఆడటం రాదు.. ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు.. నమ్మితే వైఎస్ లాగే కష్టమొచ్చినా అంటిపెట్టుకుంటాడు.. వేల కోట్లున్న వారితో ఎలా ఉంటాడో కటిక నిరుపేదతోకూడా అంతే ప్రేమగా ఉంటాడు.. ఎన్టీఆర్ పెద్దవయస్సులో జనం వద్దకు వెళ్లి దగ్గరకు తీసున్నాడు.. కానీ జగన్ 36ఏళ్ల వయస్సులో పేదవాళ్ల వద్దకు వెళ్లి అమ్మ అని, అక్కని, అవ్వని, చెల్లె, పిన్ని, బాబాయి తాత అని దగ్గరకు తీసుకున్నాడు.. వాళ్ల కూడా జగన్‌ను సొంతమనిషిగా భావిస్తున్నారు కాబట్టే అంత దగ్గరయ్యారు. ఇదంతా నేను స్వయంగా ఓదార్పు యాత్రల్లో చూశా.. ఈయనకు ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయి.. మన బతుకులు చల్లగా ఉంటాయి అని జగన్‌ను చూసి జనం అనుకుంటున్నారు. ఇదీ జగన్‌కు, బాబుకు తేడా... తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదు... జెండా, ఎజెండా బాబువి కావు.. సైకిల్ గుర్తు చంద్రబాబుది కాదు.. అన్న ఎన్టీఆర్ కష్టార్జితాన్ని వెన్నుపోటుతో నొక్కేసిన చరిత్ర చంద్రబాబుది.. రామారావు నచ్చలేదు.... లక్ష్మీపార్వతి నచ్చలేదు బయటకు వచ్చేసి బాబు సొంత పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్లాలి.. కానీ చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు. కానీ జగన్ అలా కాదు.. కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నాడు.. కేంద్రమంత్రి ఇస్తానన్నా,, భవిష్యత్తులో సీఎం చేస్తానన్నా వినలేదు.. వైఎస్ చనిపోయిన తర్వాత పార్టీ తీరు నచ్చక బయటకు వచ్చేశాడు.. సొంత పార్టీ పెట్టుకుని సత్తా చూపించాడు. అదీ మగతనం.. నాయకత్వం.. అందుకే నేనంటాను జగన్ రైట్ రాయల్. నీ 420 కేసులు గురించి ఎందుకురాసుకోవు పేపర్లో చాలా నీతులు చెబుతావు...... చాలా సుద్దులు చెబుతావు కదా.. మరీ నీ మీద కేసులు ఎందుకు రాసుకోవు.. విశాఖ సీతమ్మధారలో ఈనాడు ఆఫీసు స్థలం కబ్జా మొదలు ఎన్నో 420కేసులు ఉన్నాయి కదా వాటి గురించి రాసుకోవెందుకుని... నీ మోసపూరిత చరిత్ర చాలా ఉంది కదా... మనకు వంద బొక్కలు ఉన్నాయి.... కింద నుంచి పైదాకా బొక్కలే... వాటి గురించి మాత్రం రాసుకోకు. ప్రజాస్వామ్యంలో కారణాలు లేకుండా పార్టీలు జంప్ చేయడం, డబ్బు-మందు పారించి ఓట్లను కొనుక్కోవడం, కులం కార్డు వాడటం రాజకీయ వ్యభిచారం, ప్రజాస్వామ్యాన్ని రేప్ చేయడం. వీటి గురించి మీ ఈనాడు పత్రికలో ఎందుకు రాయవు? సీ అంటే చెరుకూరిఎందుకు కాదు.. టైటానియం కుంభకోణంలో సీ అంటే జగన్ అని నువ్వే రాశావు.. ఇంకోరోజు కాదు వేరెవరి పేరో రాశావు... అసలు సీ అంచే చంద్రబాబే ఎందుకు కాకూడదు.. రేపు బాబుతో గొడవైతే సీ అంటే కచ్చి తంగా చంద్రబాబే అని రాస్తావు... నేనైతే సీ అంటే చెరుకూరి రామోజీరావు అని అనే అనుకుంటున్నా... ఎందుకు కాకూడదు. అమెరికా వాళ్లు ఏమీ చెప్పకుండానే ఇష్టమొచ్చినట్లు ఎలా రాస్తావు. గరికిపాటి ఉమాకాంత్, ఎలక్షన్ సెల్ -
తూచ్... నేనింతే!
* మాటమార్చి.. ప్రజలను ఏమార్చి బీజేపీతో పొత్తు * 2004లో బీజేపీ వల్లే ఓడిపోయామన్న టీడీపీ అధినేత * వారితో పొత్తుపెట్టుకుని తప్పుచేశానని తర్వాత క్షమాపణ * ఇప్పుడు అదే కమలదళంతో మళ్లీ పొత్తు * బాబు వైఖరితో విసిగిపోతున్న ఆ పార్టీ ముఖ్య నేతలు యాచమనేని పార్థసారధి: రాజకీయాల్లో నాయకుడనేవాడు ఒక మాట చెబితే కచ్చితంగా నిలబడి ఉండాలి. అప్పుడే ప్రజల్లో అతనిపై నమ్మకం ఏర్పడుతుంది. పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతం ప్రకారం నడవాలి. అప్పుడే ఆ పార్టీ మనగలుగుతుంది. అధికారమే పరమావధిగా... అవసరానికి అనుగుణంగా ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకులు ప్రజల్లో పలచనవుతారు. నమ్మకం కోల్పోతారు. అధికారం కోసం ఏ గడ్డయినా కరిచే నాయకులను ప్రజలు సైతం తిరస్కరిస్తారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. చంద్రబాబు నాయుడికి అవేమీ పట్టడం లేదు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పుకునే చంద్రబాబు మైనారి టీలను నట్టేట ముంచారు. అందుకు ఆయన చెప్పిన మాటలే ప్రత్యక్ష నిదర్శనం. ఒకటి, రెండుసార్లు కాదు..స్వయంగా శాసనసభ వేదికగా ముస్లింలకు క్షమాపణ చెబుతున్నా నన్నారు. మరోసారి ఆ తప్పు చేయనన్నారు. గోద్రా అల్లర్లకు కారణమైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మళ్లీ జీవితంలో అలాంటి తప్పు చేయనన్నారు. ఇప్పుడా చంద్రబాబే మళ్లీ బీజేపీ పంచన చేరారు. మోడీ ప్రభావం తనకు కలిసొస్తుందన్న ఆశతో... ఇన్నాళ్లు వేసుకున్న లౌకిక ముసుగుతీసి మరోసారి మైనారిటీలను నట్టేట ముంచారు. ఏ ఎండకా గొడుగు గోద్రా అల్లర్లకు కార కుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని సాకుగా చూపి బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బహిరంగంగా లెంపలేసుకున్న చంద్రబాబు ఇప్పుడదే మోడీని కీర్తిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును ఆ పార్టీ ఖరారు చేసిన రోజు నుంచి చంద్రబాబు ఆయన వెంటపడ్డారు. నిత్యం మోడీ జపం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా పనికిరాడని, ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబే ఇప్పుడు అదే మోడీ ఆసరాగా ఎన్నికల్లో లబ్ధిపొందొచ్చన్న నిర్ణయానికి వచ్చారంటే ఆయన నైజమేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తనకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా లేకపోతే మరో రకంగా మాట్లాడటం బాబు నైజం. 1998లో లోక్‌సభకు ఎన్నికలు జరిగే వరకూ చంద్రబాబు బీజేపీకి దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆయన బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ మసీదు (బాబ్రీ మసీదు)లను కూలుస్తుంటే తమ పార్టీ మసీదులు, షాదీఖానాలు నిర్మిస్తోందని ప్రచారం చేసుకున్నారు. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు ఒక్కసారిగా మాట మార్చారు. ఎన్నికల ముందు వరకూ ఏ పార్టీని మసీదులు కూలుస్తోందని విమర్శించారో, ఆ తరువాత అదే పార్టీతో జత కట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందారు. 2003లో అసెంబ్లీని రద్దు చేసిన చంద్రబాబు అదే పార్టీతో కలిసి 2004లో సాధారణ ఎన్నికల బరిలోకి దిగి అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. మరోవైపు ఏ ఎండకాగొడుగు పడుతున్న అధినేత వైఖరి తమను నిండా ముంచేలా ఉందని ఆపార్టీ ముఖ్య నేతలే గగ్గోలు పెడుతున్నారు. మేం అధికారంలో ఉన్నపుడు మా విధానాల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవటం తప్పు. ఎన్డీఏ హయాంలో జరిగిన గోద్రా అల్లర్ల ప్రభావం మా పైనా పడింది. మేం ఆ అల్లర్లను ఖండించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. మైనారిటీలు మాకు దూరమయ్యారు. తర్వాత మైనారిటీలకు రిజర్వేషన్లు వంటి వాగ్దానాలు ఫలితం చూపలేక పోయాయి. మా తప్పులు సరిదిద్దుకుంటాం. భవిష్యత్‌లో ఇకపై ఎపుడూ మతతత్వ వాదులతో పొత్తు పెట్టుకునేది లేదు. - ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవటంపై 28-05-2011 జరిగిన మహానాడులో చంద్రబాబు చెప్పిన మాటలు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నరేంద్రమోడీ నియామకం వల్ల రాష్ర్టంలో ఎలాంటి ప్రభావం ఉండదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయి. కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తుంది. గుజరా త్లో నరేంద్ర మోడీ కొత్తగా చేసింది ఏమీ లేదు. నేను ఇక్కడ అధికారంలో ఉన్నపుడు తెచ్చిన పథకాలనే మోడీ సీఎం అయ్యాక గుజరాత్లో అమలు చేశారు. మేం బీజేపీతో పొత్తు పెట్టుకోబోం. -11 జూన్ 2013న బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా మోడీని ఆ పార్టీ నియమించిన సందర్భంగా.. బీజేపీతో పొత్తు వల్ల మేం నష్టపోయాం. ఆ పార్టీ గుజరాత్లో అధికారం కోసం కేంద్రంలో అధికారాన్ని వదులుకుంది. ఒకవేళ గోద్రా ఘటన జరగకపోతే కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో మేము అధికారంలోకి వచ్చేవాళ్లం. -టీడీపీ 30వ వ్యవస్థాపక దినోత్సవం నాడు మీడియాతో.. మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి వెంటనే బీజేపీ తొలగించాలి. లేకపోతే ప్రజలు నమ్మరు. -11 ఏప్రిల్ 2002న గోద్రా అల్లర్ల అనంతరం చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోనని శపథం చేస్తున్నా..! తెలుగుదేశం పార్టీ లౌకిక ప్రాతిపదికన స్థాపించబడింది. ఈ పార్టీలో అన్ని మతాలు, కులాలకు సముచిత స్థానం ఉంది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ముస్లింలు, లౌకికవాదులు దూరమయ్యారు. 2004లో తెలుగుదేశం ఘోరంగా పరాజయం పాలైంది. ఇకపై బీజేపీతో పొత్తు పెట్టుకోనని శపథం చేస్తున్నా. - 2012 సెప్టెంబర్ 26న.. ముస్లిం మత గురువులు, ముస్లిం సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు -
మేనిఫెస్టోలు మార్చినట్టు.. ఓటర్లను ఏమార్చగలరా!
ఎన్నికల మేనిఫెస్టో... అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు రాజకీయ పార్టీల ప్రధాన సాధనం. ఒక ఎన్నికల్లో చెప్పింది మరో ఎన్నికల్లో చెప్పకుండా ఎడాపెడా వాగ్దానాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలకు అర్థాన్నే మార్చేశారు. హామీల చిట్టానే మేనిఫెస్టోగా మార్చిన ఘనత ఆయనది. ఆయన గతంలో ఇచ్చిన హామీలు ప్రస్తుతం సోదిలోకే రావు. ప్రస్తుతం ఇస్తున్న హామీలకు భవిష్యత్తులో ఎలాంటి భరోసా ఉండదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలను, తాజాగా 2014 ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోతో పోల్చి చూస్తే అసలు సంగతి ఇట్టే అర్థమవుతుంది... పోలంపల్లి ఆంజనేయులు/ కె.జి.రాఘవేంద్రరెడ్డి: వ్యవసాయానికి పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తానని 2009 మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానని అంటున్నారు. అధికారంలోకి రాకముందే హామీని బుట్టదాఖలు చేసిన బాబు... రేపు అధికారంలోకి పొరపాటున వస్తే ఉచిత విద్యుత్ గతి ఏమిటనే రైతాంగం ఆందోళన చెందుతోంది. * వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే మొదట్లో హేళన చేసిన బాబు, తీరా అమలు చేసిన తర్వాత అసలు విషయం బయటపెట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, లేదంటే అమలు చేసేవాడినని సెలవిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులూ కరెంటు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టారు. కరెంటు చార్జీలను తగ్గించమంటే బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలను హార్స్పవర్ (హెచ్‌పీ)కి రూ.50 నుంచి 250కు పెంచారు. నగదు బదిలీ ఏమైందో..? * ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదాయంలో నిరుపేద, పేద, మధ్యతరగతి వర్గాలకు వాటా కల్పించడమే ‘నగదు బదిలీ’ అని గొప్పగా 2009 మేనిఫెస్టోలో బాబు బృందం నిర్వచించింది. ఈ పథకం కింద కుటుంబ మహిళా పెద్ద పేరుమీద బ్యాంకు ఖాతా తెరచి ప్రతి నెలా నిరుపేదలకు 2 వేలు, పేదలకు రూ.1500, మధ్యతరగతికి వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తామని ఇందులో ప్రకటించారు. ఈ ‘సర్వరోగ నివారిణి’కి తాజా మేనిఫెస్టోలో స్థానం దక్కలేదు. ‘ఛార్జీల’ బాదుడు మరిచారా? చేనేత వర్గాలు, ప్రార్థనా మందిరాలు, కులవృత్తులు, వీధి దీపాలకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని తాజాగా బాబు ప్రకటించారు. వాస్తవానికి బాబు హయాంలో 9 ఏళ్లల్లో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. తన గత చరిత్ర ఘనతను ఏ‘మారుస్తూ’ కొత్త హామీలతో మభ్య పెట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. జనతా వస్త్రాలు మళ్లీ గుర్తొచ్చాయి...! తక్కువ ధరకే చేనేత వస్త్రాల సరఫరా కోసం జనతా వస్త్రాల పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఆయనకు వెన్నుపోటు పొడవడంతో పాటు ఈ పథకాన్ని కూడా బాబు ఎత్తివేశారు. తాజాగా మళ్లీ జనతా వస్త్రాల పథకాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘బెల్ట్’ తీస్తారట... 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లో నిషేధాన్ని ఎత్తేయడమే కాకుండా, ఊరూరా బెల్టు షాపులను ఏర్పాటు చేశారు.అలాంటిది, ఇప్పుడు బెల్టు షాపులను రద్దు చేస్తానని నమ్మబలుకుతున్నారు. పింఛను హామీ నమ్మేదెలా.. వృద్ధులకు, వికలాంగులకు పింఛను మొత్తాన్ని పెంచుతానని బాబు అంటున్నారు. బాబు హయాంలో నెలకు కేవలం 75 రూపాయలు మాత్రమే పింఛను ఇచ్చేవారు.కొత్త పింఛను రావాృంటే ఎవరో ఒకరు చనిపోతే కానీ వచ్చేది కాదు. వైఎస్ హయాంలోనే పింఛను మొత్తం రూ.500కు పెరిగింది. అధికారంలో ఉండగా, వారి బాధలను పట్టించుకోని బాబు ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేస్తానని ప్రకటిస్తే నమ్మేదెవరు? కొత్త వ్యవసాయ కనెక్షన్లకు ‘కోత’ ఏటా 50 వేల ఉచిత వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేస్తానని బాబు గొప్పగా ప్రకటించారు. నిజానికి ప్రస్తుతం ఏడాదికి లక్షన్నర ఉచిత వ్యవసాయ కనెక్షన్లను జారీచేస్తున్నారు. ఇది వైఎస్ ప్రవేశపెట్టిన పథకం. 2004 నుంచి ఇది అమలవుతోంది. అయితే, బాబు అధికారంలోకి వస్తే వీటిని 50 వేలకు తగ్గిస్తారట. మాఫీ అయిన రుణాలు మళ్లీ మాఫీ చేస్తారట! నేత వృత్తి గిట్టుబాటుకాక ఆత్మహత్యల బాట పట్టిన చేనేత కార్మికుల ఉసురు పోసుకున్న బాబు.. ఇప్పుడు మాఫీ అయిన రుణాలను మళ్లీ మాఫీ చేస్తానంటున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు హయాంలో మరణించిన చేనేత కార్మికులకు కూడా నష్టపరిహారం అందించారు. వీరికి వృద్ధాప్య పింఛను పొందేందుకు వయస్సును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకే తగ్గించారు. ఈ రుణాలను మాఫీ చేస్తానని 2009 ఎన్నికల్లోనే వైఎస్ ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.317 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం చేనేత రుణాలు మాఫీ అయ్యాయి. మాఫీ అయిన రుణాలను మళ్లీ ఎలా మాఫీ చేస్తారో బాబుగారే చెప్పాలి. గిరిజనులకు రూ. 5 లక్షల వరకు రుణాలు ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వారందరికీ కోటి రూపాయల వరకూ పూచీకత్తు లేని రుణాలను ప్రస్తుతం అందిస్తున్నారు. దీనికి రూ.5 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్ ప్రయత్నించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కోటి రూపాయల మేరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తుంటే దీనిని రూ.5 లక్షలకే పరిమితం చేసే కుట్రకు బాబు పన్నాగం పన్నుతున్నారు. నాడు ఉద్యోగాలు ఊడగొట్టి... రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉన్నాయి. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నమాట. అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వరంగాన్ని కలుపుకున్నా ఇది సాధ్యం కాదు. మరోవైపు తన హయాంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడేమో ఇంటికో ఉద్యోగం అంటూ మభ్యపెడుతున్నారు. కలర్ టీవీల పథకం * టీవీ అంటే కేవలం వినోదానికే పరిమితం అనుకుంటే పొరపాటు అని టీవీల ద్వారా విద్య, వినోదం, ఆరోగ్యం తదితర కార్యక్రమాలు ప్రతీ రోజూ ప్రసారమవుతాయని 2009 మేనిఫెస్టోలో టీడీపీ లెక్చరర్లు దంచింది. అయితే, 2014 వచ్చే సరికి లెక్చరర్లు అన్నీ కట్టిపెట్టింది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో తనకు తానే సాటి అని బాబు మరోసారి నిరూపించుకున్నారు. * ప్రతి పేద కుటుంబానికి 20 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తానని 2009లో అన్నారు. అది కాస్తా తాజా మేనిఫెస్టోలో మరిచారు. * నిరుపేదలకు కిరోసిన్ కోటాను 10 లీటర్ల నుంచి 15 లీటర్లకు పెంచుతామన్నారు. దీనిని కాస్తా మంటల్లో తగలెట్టేశారు. * పేద కుటుంబాలకు ఒక టీవీ, రెండు బల్బులు, రెండు ఫ్యాన్లకు ఉచిత కరెంటు అన్నారు. ఇప్పుడేమో విస్మరించారు. * సాగునీటి సెస్సు బకాయిలు రద్దు, సాగు నీటి సెస్సు రద్దు అన్నారు. ఇవి తాజా మేనిఫెస్టోలో లేవు. * వ్యవసాయ భూములపై రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతం మించకుండా నియంత్రించడం, మహిళల పేరిట జరిగే రిజిస్ట్రేషన్లపై 2 శాతం రాయితీ అన్నారు. దీనినీ అటకెక్కించారు. * ఈ విధంగా ఇచ్చిన హామీలను వెంటనే మరచిపోయే అలవాటు తనకు ఉందని బాబు మరోసారి నిరూపించుకున్నారు. ఉద్యోగులకు వల అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను రాచిరంపాన పెట్టిన చరిత్ర బాబుది. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేటు ఉద్యోగులే బెటరని మనసా, వాచా, కర్మణా నమ్మిన వ్యక్తి ఆయన. 2009 ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే అనుమానంతో ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. అటువంటి బాబు... వారికి పదవీ విరమణ వయసు పెంపు, వారంలో ఐదురోజుల పనిదినాలంటూ వలలో వేసుకునేందుకు పన్నాగం చేస్తున్నారు.