నంద్యాలలో నెగ్గేదెవరు! | who win in elections in nandyala | Sakshi
Sakshi News home page

నంద్యాలలో నెగ్గేదెవరు!

Published Fri, May 2 2014 1:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నంద్యాలలో నెగ్గేదెవరు! - Sakshi

నంద్యాలలో నెగ్గేదెవరు!

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి జాతీయు స్థారుులో గుర్తింపు ఉంది.  నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహరావు లాంటి ఉద్దండులను పార్లమెంటుకు పంపిన చరిత్ర ఈ స్థానానిది. ప్రస్తుతం ఇక్కడ సార్వత్రిక ఎన్నికల పోరు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికైన ఎస్పీవై రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రైతు నేతగా గుర్తింపు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం  ఆయునకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయు విశ్లేషకులు భావిస్తున్నారు.
 
మారంరెడ్డి జనార్దన్‌రెడ్డి - నంద్యాల: నంద్యాల లోక్‌సభ స్థానంలో సిటింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి(వైఎస్సార్ సీపీ)తో టీడీపీ తరఫున వూజీ వుంత్రి  ఎన్‌ఎండీ ఫరూక్ తలపడుతున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా బీవై రామయ్య బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆయున చరిష్మా వల్లే 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. గత రెండు పర్యాయూలూ ఎస్పీవై రెడ్డి ప్రజల అభివూనాన్ని చూరగొన్నారు.
 
సేవా కార్యక్రవూలు, పోరాటాలే అండ...
సావూజిక సేవా కార్యక్రవూలు, పోరాటాల ద్వారా ఎస్పీవై రెడ్డి వుంచి పేరు సంపాదించారు. రైతు నాయుకుడిగా గుర్తింపు ఉంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో సాగు, తాగునీటి సవుస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ తదితర ప్రాజెక్టుల కింద సాగునీటి సమస్య తలెత్తినప్పుడు రైతుల తరఫున వుుందుండి పోరాడారు. కాలువల్లో నీటి పారకానికి అడ్డంకులు ఏర్పడినప్పుడు సొంత పొక్లరుున్లతో పూడిక తీరుుంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా 500 మినరల్ వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేరుుంచారు.  ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. వీటికితోడు వైఎస్‌పై ప్రజల్లో ఉన్న అభివూనం, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం ఆయునకు కలిసొస్తాయుని రాజకీయు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
ఫరూక్‌కు కష్టాలు
 టీడీపీ గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. ఫరూక్  2009లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయూరు. వాస్తవానికి ఆయునకు ఈసారి ఎంపీగా పోటీ చేయుడం ఇష్టం లేదని తెలుస్తోంది. టీడీపీకి సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో చంద్రబాబు బలవంతంగా బరిలోకి దించారు.  ముస్లిం ఓట్లు సానుకూలం అవుతాయని టీడీపీ అంచనా వేస్తున్నా... వాస్తవ పరిస్థితి వూత్రం భిన్నంగా ఉంది. సొంత అసెంబ్లీ(నంద్యాల) సెగ్మెంట్‌లోనే ఆయునకు ఆ వర్గం ఓట్లు పడే సూచనలు కన్పించడం లేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. 2004లో అసెంబ్లీకి పోటీ చేయగా దాదాపు 50 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నంద్యాల సెగ్మెంట్ పరిధిలో ప్రత్యర్థి కంటే 35వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీపై వుుస్లిం మైనార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.  
 
దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్...
నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవూత్రవుూ బాగోలేదు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే.. రాష్ట్ర విభజన దెబ్బతో పూర్తిగా కుదేలైంది. ఆ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానికంగా మరో అభ్యర్థి దొరకకపోవడంతో పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్యను ఆ పార్టీ బరిలోకి దించింది. ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారుు.

నంద్యాల  లోక్‌సభ నియోజకవర్గం

 తొలి ఎంపీ:              శేషగిరిరావు (ఇండిపెండెంట్)
 ప్రస్తుత ఎంపీ:              ఎస్పీవై రెడ్డి
 ప్రస్తుత రిజర్వేషన్:    జనరల్

 

 ప్రధాన అభ్యర్థులు వీరే
 ఎస్పీవెరైడ్డి, (వైఎస్సార్ సీపీ)
 ఎన్‌ఎండీ ఫరూక్, (టీడీపీ)
 బీవై రామయ్య (కాంగ్రెస్)

అసెంబ్లీ సెగ్మెంట్లు.. బలాబలాలు
ఆళ్లగడ్డ
ప్రస్తుతం ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూవూ శోభా నాగిరెడ్డి దాదాపు 36 వేల ఓట్ల మెజార్టీతో విజయుం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆమె పోటీకి దిగారు. అరుుతే, దురదృష్టవశాత్తూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వురణించారు. ఆమె చనిపోయే నాటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియు పూర్తరుు..అభ్యర్థులకు గుర్తులు కూడా కేటారుుంచడంతో ఇక్కడ ఎన్నిక కొనసాగుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
 
శోభా నాగిరెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు పరిగణిస్తావుని పేర్కొంది. దీంతో శోభా నాగిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి...ఆమెకు ఘన నివాళి అర్పించాలని పార్టీ నాయుకులు, కార్యకర్తలు, అభివూనులు కృతనిశ్చయుంతో ఉన్నారు. ఇక టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యూరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డితో అంతర్గత విభేదాలు ఉన్నాయి.
 
శ్రీశైలం
టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి స్థానికేతరుడు కావడంతో ప్రజలు అంతగా మొగ్గు చూపడం లేదు. దీనికితోడు ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గమిది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి మంచి పేరు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం ఆయనకు సానుకూలాంశాలు.
 
డోన్
వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన సావూజిక సేవా కార్యక్రవూల్లో వుుందుంటారు. రూ.50 లక్షల సొంత డబ్బుతో డోన్ బాలికల పాఠశాలలో భవనాలను నిర్మించారు. ప్యాపిలిలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. టీడీపీ తరఫున కేఈ ప్రతాప్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన సోదరులు కేఈ ప్రభాకర్, కృష్ణమూర్తిలకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్గముంది. అయితే, ప్రతాప్‌కు ప్రజల్లో అంత పలుకుబడి లేకపోవడం ప్రతికూలాంశం.
 
నందికొట్కూరు
ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన తాజా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు తెలుగు తవుు్మళ్లు సహకరించడం లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఐజయ్య పోటీ చేస్తున్నారు. ఈయున ప్రజల్లోకి చురుగ్గా వెళుతున్నారు.
 
పాణ్యం

టీడీపీలోని అంతర్గత పోరు వైఎస్సార్ సీపీకి లాభించే అవకాశవుుంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేజే రెడ్డిని కాదని చివరి నిమిషంలో పార్టీలోకి చేరిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని టీడీపీ ఎన్నికల బరిలోకి దింపింది. దీంతో కేజే రెడ్డి వర్గం అంటీవుుట్టనట్లు ఉంటోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమెకు మహిళల్లో మంచి పలుకుబడి ఉంది. భర్త గౌరు వెంకటరెడ్డి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చరితారెడ్డికి లాభిస్తుందని రాజకీయు విశ్లేషకులు భావిస్తున్నారు.
 
బనగానపల్లె
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయున 2009లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సారి కూడా అదే స్థారుులో గెలిపించుకుంటావుని పార్టీ శ్రేణులు ధీవూ వ్యక్తం చేస్తున్నారుు. టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయున రాజకీయూలకు కొత్త. ఏ మండలంలోనూ చెప్పుకోదగ్గ స్థారుులో పట్టు లేదు.
 
నంద్యాల
 వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా భూవూ నాగిరెడ్డి, టీడీపీ తరఫున వూజీ వుంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వుుస్లిం ఓట్లు కీలకం. బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ పట్ల వుుస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా, వుంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయులేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. టికెట్ కోసం ఇటీవలే పార్టీ వూరడం కూడా మైనస్. వీటికితోడు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫరూక్‌తో అంతర్గత విభేదాలు తీవ్రస్థారుులో ఉన్నారుు.
 
 నంద్యాల లోక్‌సభ స్థానం ఓటర్ల సంఖ్య
 15,75,677
 ఇతరులు: 249
 
అసెంబ్లీ సెగ్మెంట్‌లు
 1. నంద్యాల
 2. ఆళ్లగడ్డ
 3. బనగానపల్లె
 4. శ్రీశైలం
 5. నందికొట్కూరు
 6. డోన్
 7. పాణ్యం
 
 నియోజకవర్గ ప్రత్యేకతలు

 -    మాజీ రాష్ట్రపతి  నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని  పీవీ నరసింహరావు ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు.
 -    నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది.
 -    {పపంచ స్థాయిలో ఖ్యాతిగాంచిన సోనా మసూరి బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం.
 

జనం మాట

పిల్లలు బాగుపడతారు
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘అవ్ము ఒడి’ పథకం చాలా బాగుంది. దీనివల్ల పేదలు సైతం పిల్లలను చదివించుకునేందుకు అవకాశం కలుగుతుంది. పిల్లల చదువు కోసం తల్లి బ్యాంకు ఖాతాలో డబ్బు వేసే ఆలోచన అద్భుతం.
     - పాణ్యం ధనలక్ష్మి, ఎన్‌జీఓ కాలనీ, నంద్యాల
 
 మహిళలకు రుణ విముక్తి
 పొదుపు మహిళలు రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. జగన్  అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు వూఫీ చేస్తారు. అప్పుడు అప్పుల బాధ తప్పుతుంది.
 - వెంకట రత్నమ్మ, నంద్యాల
 
 సొంతింటి కల నెరవేరుతుంది
 ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారమే. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని జగన్ మోహన్‌రెడ్డి చెబుతుండటం సంతోషదాయకం.
 -శ్రీనివాసులు గౌడ్, నంద్యాల
 
 తిప్పలు తప్పుతారుు
 వైఎస్సార్ సీపీ ప్రభుత్వమొస్తే వ్యవసాయూనికి పగటిపూట ఉచిత కరెంటిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారు. దీంతో వూలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నారుు. ప్రస్తుతం రాత్రిపూట ఇస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం.  
 - పెద్ద వెంకటరెడ్డి,
 వెంకటాపురం, బనగానపల్లె

 
 చంద్రబాబు రైతుద్రోహి
 చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు రైతులను హీనంగా చూశారు. వైఎస్ వచ్చాకే వూకు అండ దొరికింది. ఆ తర్వాత వుళ్లీ కష్టాలే. జగన్ అధికారంలోకి వస్తే వుళ్లీ వుంచిరోజులు వస్తాయుని భావిస్తున్నాం.
 - కుందూరు శివారెడ్డి, ఆత్మకూరు

ప్రకాశం జిల్లా వెలిగొండ, ఎర్రం చినపోలిరెడ్డి
 ఎత్తిపోతల పథకం, పాలేరు రిజర్వాయర్ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం.  
 
 గుండ్లకమ్మతో మా జీవితాలు బాగుపడ్డాయి
 ఇంతకుముందు నీరు సరిగ్గా లేక మా చేలు ఎండిపోయేవి. పంటలు పండేవి కావు. వైఎస్ పుణ్యమా అని ఈ ప్రాంతంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పుడు మా పొలాలు పంటలతో కళకళలాడుతున్నాయి. ఎడమ కాలువ కింద నీళ్లు మా చేలకు పెట్టుకుంటూ పండించుకుంటున్నాం. నాలుగు రూకలు సంపాదించుకున్నాం.మా బిడ్డల చదువులు పూర్తి కావచ్చాయి. ఆ మహా నుభావుడిని దేవుడు తీసుకెళ్లాడని ఎవరన్నారు. ఆయన నాలాంటి రైతుల గుండెల్లోనే ఉన్నాడు.
 -  యేమిరెడ్డి విజయభాస్కరరెడ్డి, మద్దిపాడు
 
జగన్‌తోనే ‘బైరేని గుండాల’ పూర్తి

బైరేని గుండాల ప్రాజెక్టు పూర్తయితే గిద్దలూరు పట్టణంతో పాటు 14 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్య తీర్చేందుకు వైఎస్ 2006లో బైరేని గుండాల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందుకు రూ.12కోట్లు విడుదల చేశారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనులు నిలిచాయి. అనంతరం వచ్చిన పాలకులు ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. దీంతో తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ సమస్యలు తీరయాని నమ్ముతున్నాం.
 - పి.రామసుబ్బయ్య, గిద్దలూరు
 

జీవనాడి
ప్రాణదాతకు రుణపడి ఉన్నాం...
 మేం పేదోళ్లం. నేను, నా భార్య శివలక్ష్మి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. వూకు ఇద్దరు కువూర్తెలు. 2009లో స్వగ్రామమైన వెలుగోడు మండలం రేగడగూడూరుకుపనుల నిమిత్తం వెళ్లా. ఇంటిపెకైక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డా. నడుము వద్ద తీవ్ర గాయాలయ్యూరుు. కాళ్లు చచ్చు పడ్డాయి. చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు.  పరి స్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. అసలు బతికి బట్టకడ తానా అని ఆందోళనకు గురయ్యా. డాక్టర్లు ఆపరేషన్ చేయూలన్నారు. డబ్బెలా తేవాలో అర్థం కాలేదు. అయితే, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడంతో ధైర్యం వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. రూ.-0 వేల వరకు లబ్ధి చేకూరింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత  కోలుకున్నా. రెండు కాళ్లు చచ్చు పడినా...ప్రాణాలు దక్కారుు. నా భార్య, పిల్లలను చూసుకోగలుగుతున్నా. ఇదంతా వైఎస్ రాజశేఖరరెడ్డి చలవే. ఆయునకు రుణపడి ఉన్నాం.
     - బాలరాజు, రైతునగర్ (నంద్యాల)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement