పదండి ఓటేద్దాం
ఓటు...
ప్రజాస్వావ్యు వ్యవస్థలో వజ్రాయుుధం.
పౌర ప్రయోజనాలను
కంటికి రెప్పలా కాపు కాసే
రెండక్షరాల తారకవుంత్రం.
ఓటుకున్న బలం అపారం.
కేంద్రంలో వాజ్‌పేరుు ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో పడిపోరుున వైనమే ఇందుకు తిరుగులేని రుజువు. అరుుతే ఆయుుధం బలంగా ఉన్నంత వూత్రాన సరిపోదు. అవకాశం అందివచ్చినప్పుడు దాన్ని ఒడుపుగా ప్రయోగించగల చేతులు కూడా చాలా వుుఖ్యం. అలాంటి అవకాశం ఇప్పుడు అందివచ్చింది. ఐదేళ్ల పాటు వునల్ని పాలించాల్సిన వారిని ఎంచుకోవాల్సిన రోజు వచ్చేసింది. ఈ ఒక్క రోజు సాకులన్నీ పక్కన పెడదాం. అందరవుూ ఒక్కటై కదులుదాం. వెళ్లి ఓటేద్దాం. సరైన వారిని ఎంచుకుని వురీ ఓటేద్దాం. స్వర్ణయుుగాన్ని సాధించి చూపించే సవుర్థులను ఎన్నుకుందాం. వున భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. ఐదేళ్ల పాటు రోజూ నిశ్చింతగా ఉందాం. నా ఒక్క ఓటు పడకపోతే ఏవువుతుందనే ఆలోచనే వద్దు. ఒక్కో బిందువూ కలిస్తేనే సింధువు. వునవుంతా శాసనకర్తలమేనని, వునం వేసే ఒక్కో ఓటూ వున భవితను శాసిస్తుందని గుర్తుంచుకుందాం. నూరు శాతం పోలింగ్‌తో కొత్త చరిత్ర సృష్టిద్దాం. వున చేతిలోని ఓటును వజ్రాయుుధంగా ప్రయోగించి చూపిద్దాం...
పదండి... ఓట్ల పండుగను
విజయువంతం చేసేందుకు బయుల్దేరదాం...
పదండి... ఓటేసి గెలుద్దాం...
19 - తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలు
1,669 -అసెంబ్లీ బరిలో మొత్తం అభ్యర్థులు
17 - మొత్తం లోక్‌సభ స్థానాలు
267-లోక్‌సభ బరిలో మొత్తం అభ్యర్థులు
మొత్తం ఓటర్లు -2,81,75,055
పురుష ఓటర్లు-1,43,82,661
వుహిళా ఓటర్లు -1,37,81,276
‘ఇతర’ ఓటర్లు- 2,329
సర్వీసు ఓటర్లు - 7,786
ఎన్నారై ఓటర్లు - 3
2009 ఎన్నికల్లో ఇలా...
1. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ భారీగానే నమోదైంది
2. 10 జిల్లాల పరిధిలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో 69.39 శాతం మంది ఓటేశారు
3. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 81.68 శాతం పోలింగ్ జరిగింది
4. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా 53.82 శాతం మంది మాత్రమే ఓటు వేశారు
5. 17 లోకసభ స్థానాల్లో 67.53 శాతం పోలింగ్ జరిగింది
6. ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 80.21 శాతం పోలింగ్ నమోదైంది
7. అత్యల్పంగా మల్కాజిగిరిలో 51.60 శాతం మంది మాత్రమే ఓటు వేశారు
ఓటుకు వెళుతున్నారా... ఇవి చూడండి
పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది
1. పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాలు, ఈవీఎంలో ఉండే వరుస క్రమంలో ప్రచురించిన పత్రాలను పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శిస్తారు. వాటిని ఓటర్లు ముందే చూసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళితే మంచిది.
2. వుుందుగా లోక్‌సభ ఓటు, తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయూలి. పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లగానే కుడి చేరుు చూపుడు వేలిపై ఓటు ఇంకు వుచ్చ పెట్టాక ఓటు వేయూలి. (ఇటీవలే స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలప్పుడు ఎడవు చేరుు చూపుడు వేలిపై ఇంకు గుర్తు పెట్టినందున కుడి చేరుు చూపుడు వేలిపై ఇంకు గుర్తు వేస్తారు.) లోక్‌సభ అభ్యర్థికి ఓటు వేసిన వెంటనే శాసనసభ అభ్యర్థికి ఈవీఎంలో మీట నొక్కి ఓటు వేయూలి.
3. ఈవీఎంపై ఓటరుకు నచ్చిన అభ్యర్థి పేరుకు, ఎన్నికల చిహ్నానికి ఎదురుగా ఉండే నీలం రంగు మీట నొక్కితే దాని పక్కనే బాణం గుర్తుపై ఉండే ఎర్ర బల్బు వెలుగుతుంది. ఆ వెంటనే ‘బీప్’ అనే శబ్దం వస్తుంది. ఓటు వేసేవారు ఈ రెండింటినీ విధిగా గమనించాలి. బీప్ శబ్దం వస్తేనే ఓటు వేయడం పూర్తైట్టు. ఒకవేళ బీప్ శబ్దం రాకపోతే పోలిం గ్ బూత్‌లోని ఎన్నికల పర్యవేక్షణాధికారికి ఫిర్యాదు చేయాలి.
4. తొలిసారిగా ఈవీఎంలో ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌ) అనే బటన్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని ఓటరు తవు అసంతృప్తిని ఈ ఓటు ద్వారా వ్యక్తం చేయవచ్చు.
5. కాసేపట్లో పోలింగ్ సమయం ముగియనుంది లెమ్మని బద్ధకించాల్సిన పని లేదు. నిర్ణీత గడువులోగా పోలింగ్ స్టేషన్ లోనికి వెళ్లి ఓటర్ల క్యూలో నుంచుంటే చాలు, సమయం దాటిపోయినా ఓటేయవచ్చు.
6. పోలింగ్ కేంద్రంలో 2009, 2014 జనవరి 1, 2014 వూర్చి 26... ఈ వుూడు ‘ఓటర్ల తుది జాబితాలు’ వేర్వేరుగా అందుబాటులో ఉంటారుు. తాజా జాబితాలో పేరు లేకున్నా మిగిలిన రెండు జాబితాల్లో దేంట్లో పేరున్నా మీ గుర్తింపు కార్డు చూపి ఓటు వేయొచ్చు.
7. ఈసారి ఎన్నికల సంఘమే ఓటర్ల స్లిప్పులిచ్చింది. వీటిని పంపిణీ చేసేప్పుడు ఇంట్లో లేనివాళ్ల పేర్లను గైర్హాజరు జాబితాలో చేరుస్తారు. ఆ జాబితా కూడా అందుబాటులో ఉంటుంది. అందులో పేరుంటే ఆ ఓటు తనదేనని పేర్కొంటూ స్వీయు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయూలి. ఎడవు చేరుు బొటనవేలి వుుద్ర కూడా వేయూలి. ఆ తర్వాత ఓటు వేయువచ్చు.
8. ఈసీ జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డున్నా ఓటర్ల జాబితాల్లో పేరు లేకపోతే ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యం.
9. ఓటరు స్లిప్పులను పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద కూడా తీసుకోవచ్చు.
10 వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు క్యూలో నుంచోవాల్సిన అవసరం లేదు. వారు నేరుగా వెళ్లి ఓటు వేసేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
11. అంధులకు బ్రెరుులీ లిపిలో ఈవీఎంలు ఏర్పాటు చేశారు.
12. మీ ఓటు వేరే వ్యక్తులు ఎవరైనా వేసేసి ఉంటే.. పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేసి మీ గుర్తింపును చూపిస్తే బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దీన్నే ‘టెండర్డ్ ఓటు’ అంటారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కిం పులో అభ్యర్థుల గెలుపు ఓటవుులు నిర్ణరుుంచలేనట్టుగా సవూన ఓట్లు వచ్చిన సందర్భంలో టెండర్డ్ ఓట్లను లెక్కిస్తారు.