పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, జేసీ
వెన్నంపల్లి(సైదాపూర్ రూరల్) న్యూస్‌లైన్ : సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి 170వ పోలింగ్ కేంద్రంలో మంగళవారం రీపోలింగ్ జరగనుంది. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎం మొరారుుంచింది. మరో ఈవీఎం ఏర్పాటుచేసినా మొదటి ఈవీఎం ఎర్రర్ అని చూపడంతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మంగళవారం నిర్వహించే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాటుచేశారు.
రీపోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ సోమవారం తనిఖీచేశారు. పోలింగ్ కేంద్రంలోని సౌకర్యాలను, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్, తహశీల్దార్ మల్లేశం ఉన్నారు.
కిడ్నాప్‌లకు పాల్పడితే చర్యలు: ఓఎస్డీ
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : కార్పొరేటర్లుగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను కిడ్నాప్‌లు, శిబిరాలకు తరలించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓఎస్డీ సుబ్బారాయుడు హెచ్చరించారు. రామగుండంలో సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజేతలతో ఓఎస్డీ సమీక్ష జరిపారు. ఒక్కో ఇండిపెండెంట్‌కు ఒక్కో కానిస్టేబుల్‌ను సెక్యూరిటీ నియమిస్తున్నట్లు తెలిపారు.
ఎవరైనా బెదిరించినా, ఇతర అసౌకర్యాలు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఎవరైనా ఓడిపోయిన అభ్యర్థులను రెచ్చగొట్టే తరహాలో ప్రవర్తించినా, నినాదాలు చేస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీ, డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి, కమిషనర్ ఎస్.రవీంద్ర, సీఐలు పాల్గొన్నారు.
నేడు వెన్నంపల్లిలో రీపోలింగ్
Published Tue, May 13 2014 3:11 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement