repoling
-
‘కౌంటింగ్ తర్వాత కూడా రీపోలింగ్ అవకాశాలు’
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈవీఎంలు మొరాయించి, వీవీప్యాట్ లెక్కలో తేడా వచ్చినా, మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. -
రీపోలింగ్ అంటే బాబుకు ఎందుకంత గగ్గోలు
-
రీ పోలింగ్.. బీఅలర్ట్!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లెపాళెంలో ఉన్న పోలింగ్ కేంద్రం 41లో, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని సూళ్లూరుపేట మండలంలోని అటకానితిప్పలో ఉన్న బూత్ నంబర్ 197లో ఈ నెల 6వ తేదీన పార్లమెంట్ అభ్యర్థి ఓటుకు సంబంధించి రీ పోలింగ్ జరగనుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ రేవు ముత్యాలరాజు పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కూడా అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేసే తరహాలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు వైఎస్సార్సీపీ, టీడీపీలు బూత్‌లోని ఓటర్లపై దృష్టి సారించారు. అధికార టీడీపీ అయితే మళ్లీ ప్రలోభాల పర్వాన్ని నమ్ముకొని కసరత్తు మొదలు పెట్టింది. ఆయా బూత్‌ల పరిధిలో ఉన్న సామాజిక సమీకరణాలపై దృష్టి నిలిపి ప్రలోభాల కొనసాగించడానికి సన్నద్ధం అయింది. వాస్తవానికి రాజకీయ పార్టీలు జిల్లాలో ఫలితాలపై రకరకాల చర్చలు, లెక్కలు వేసుకొని గెలుపు తమదేనని ఇప్పటికే ప్రకటించకున్నాయి. ఈ క్రమంలో రీపోల్ రావడంతో అందరి దృష్టి దానిపై నెలకొంది. అది కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన ఒక్క ఓటు కావటంతో ఎంపీ అభ్యర్థులు రీపోల్ జరిగే ప్రాంతాల్లో బూత్ ఏజెంట్ల నుంచి అందరితో మాట్లాడుతున్నారు. పల్లెపాళెం బూత్ పరిధిలో 1,084 ఓట్లు, అటకాని తిప్ప బూత్ పరిధిలో 5,53 ఓట్లు ఉన్నాయి. రిజర్వ్‌లోని ఈవీఎంలతో.. జిల్లాలో ఒక్కొక్క పార్లమెంట్ సెక్టార్ పరిధిలో రిజర్వ్‌లో ఈవీఎంలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. వాటిలో ఒక్కొక్క ఈవీఎంను ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఎంపీ ఓటు ఒక్కటే వినియోగించుకోవాల్సి ఉండటంతో రెండు చోట్ల ఒక్కొక్క ఈవీఎంను ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వ్‌లో మరో ఈవీంను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వేసవి కాలం కావడంతో వడగాలులు అధికంగా ఉన్న క్రమంలో రెండు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయటంతో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. శుక్రవారం ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం పోలింగ్ స్టేషన్‌కు సిబ్బంది కేటాయింపుపై సృష్టత ఇచ్చే అవకాశం ఉంది. రీపోలింగ్ జరిగే రెండు చోట్ల అధికారులను సస్పెండ్ చేసిన క్రమంలో వారి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశం ఉంది. ఒక్కొక్క స్టేషన్‌కు పోలింగ్ అధికారితో కలిపి ఆరుగురు సిబ్బందిని నియమిస్తారు. 4వ తేదీన రెండు పోలింగ్ స్టేషన్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ ముత్యాలరాజు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. జనరల్ అబ్జర్వర్‌తో పాటు మరో అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్లు ఈ నెల 4 నుంచి విధుల్లో ఉంటారని వివరించారు. నేడు నగరంలో డీజీపీ సమీక్ష 6న రీపోలింగ్ జరగనున్న రెండు సెంటర్లలో బందోబస్తు వ్యవహారాలపై శుక్రవారం డీజీపీ ఆర్పీ ఠాగూర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటికే నెల్లూరు నగరానికి చేరుకున్నారు. రీపోల్ ఏర్పాటుతో పాటు 23న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించి స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించనున్నారు. బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని ఇస్కపాళెం పంచాయతీ పల్లిపాళెంలోని 41వ పోలింగ్‌స్టేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన 41వ పోలింగ్ స్టేషన్లో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధిం చి రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ స్టేషన్‌లోని వసతులను పరిశీలించేందుకు వచ్చామన్నారు. వసతుల కల్పనపై స్థానిక అధికారులతో మాట్లాడామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ డి.వి.నరసింహారావు, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. అట్టకానితిప్పపైనేఅందరి దృష్టి సూళ్లూరుపేట రూరల్: అందరి దృషి ఈ నెల 6వ తేదీన రీపోలింగ్ జరుగనున్న అట్టకానితిప్పపైనే ఉంది. 197వ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఉత్తర్వులు జారీచేయడంతో రాజకీయనాయకులు కన్నేశారు. గత నెల 11వ తేదీన జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో అటకానితిప్పలో ఎంపీ స్థానానికి చెందిన ఈవీఎం మొరాయించింది. దాని స్థానంలో వేరే ఈవీఎం మిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే మొరాయించిన ఈవీఎం మిషిన్‌లో అప్పటికే దాదాపు 200 ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికలు పూర్తయిన అనంతరం అదనపు ఈవీఎం మిషన్‌ను సీల్‌వేసి స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. అక్కడ ఈవీఎంలు లెక్క తేలలేదు. దీంతో ఈసీ ఈ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వాహించాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు 558 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీ నాయకులు నేతలు సంప్రదింపులు జరిపి ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులకు మాత్రం రీ పోలింగ్ సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని చెబుతున్నారు. -
రీ పోలింగ్ బూత్‌లు సమస్యాత్మకమే
సాక్షి, అమరావతి : ఈ నెల 6న రాష్ట్రంలో ఐదు చోట్ల రీ పోలింగ్ జరగనుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదు చోట్ల 6వ తేదీ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 వరకు రీ పోలింగ్ జరగనుందని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరసరావు పేట అసెంబ్లీ పరిధిలోని కేసనాపల్లి 94వ పోలింగ్ కేంద్రంలో, గుంటూరు పశ్చిమంలోని నల్లచెరువు 244వ పోలింగ్ కేంద్రంలో, నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి పాలెం 41వ పోలింగ్ కేంద్రంలో, సూళ్లురు పేట నియోజకవర్గం అటానితిప్ప 197వ పోలింగ్ కేంద్రంలో , ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనుతల 247వ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రీ పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగానే పరిగణిస్తామన్నారు. బూత్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామని, అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచుతామని అన్నారు. ప్రతి రీ పోలింగ్ కేంద్రం వద్ద ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని తెలిపారు. -
రీపోలింగ్‌కు ఇంకా అనుమతి రాలేదు : ద్వివేది
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూతుల్లో నిర్వహించాల్సిన రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం రావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాతే రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఒకే పేరుపై రెండు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చే అవకాశం లేదని, అలా ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌కు గంట ముందు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఫీల్డ్ అసిస్టెంట్‌ను బెదిరించినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణ జరపాలని నెల్లూరు కలెక్టర్‌ను ఆదేశించానన్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం 21వేల మంది వరకూ సిబ్బంది అవసరమని చెప్పారు. ఆఖరి నిమిషం వరకూ ఎవరూ ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్త పడుతున్నామని తెలిపారు. రెండు సార్లు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్‌కు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని చెప్పారు. -
ఏపీలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు స్థానిక కలెక్టర్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి నివేదికలు పంపారు. ఆయన వాటిని పరిశీలించిన అనంతరం ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు ఈవీఎంల్లో లోపాలు తలెత్తిన ఐదు కేంద్రాలను గుర్తించిన.. సీఈసీకి పంపారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ద్వివేది ఈసీని కోరారు. జిల్లా కలెక్టర్ల నుంచి పూర్తి నివేదికలు వస్తే మరికొంతమందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కాగా ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన కారణంగా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. -
రీపోలింగ్ పై నేడు నిర్ణయం
-
ఉపఎన్నికల్లో ఈవీఎం పంచాయితీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం 14 చోట్ల ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో రెండు, యూపీలో ఒకటి, నాగాలాండ్‌లో ఒక పార్లమెంటు స్థానాలకు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 31న జరగనుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో ఈవీఎంల గందరగోళంపై శివసేన, ఎన్సీపీలు మండిపడ్డాయి. 25శాతం ఈవీఎంలు సరిగా పనిచేయలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్ అన్నారు. చాలాచోట్ల వీవీపీఏటీ (ఓటు ధ్రువీకరణ యంత్రం)లు పనిచేయలేదన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై విచారణ జరిపించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. భండారా–గోందియాలో 40%, పాల్ఘర్లో 46% ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ లోక్‌సభ స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది. కైరానాలో హైరానా! అటు యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం, నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో అధికార, విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఎన్నికల సంఘం వేరే ఈవీఎంలను ఏర్పాటుచేసింది. వీలుకాని చోట్ల రీపోలింగ్ జరపనుంది. కాగా, ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని ఎస్పీ, బీఎస్పీలు ఆరోపించాయి. పలుచోట్ల ఈవీఎంలు చాలాసేపు పనిచేయకపోవడంపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కైరానాలో 54.17% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలోని రాజరాజేశ్వర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమేనని.. కానీ విపక్షాలు దీన్ని ఎక్కువచేసి చూపిస్తున్నాయని ఈసీ పేర్కొంది. చాలాచోట్ల ముందుగానే అదనపు ఈవీఎంలు ఏర్పాటుచేశామని తెలిపింది. ఉప ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలు కైరానా (యూపీ) 2014 ఎన్నికల్లో విజేత: హుకుమ్‌సింగ్ (బీజేపీ) ప్రత్యర్థి: నహీద్ హసన్ (ఎస్పీ) మెజారిటీ: 2,36,828 పాల్ఘర్ (మహారాష్ట్ర) 2014లో విజేత: చింతామన్ వానగా (బీజేపీ) ప్రత్యర్థి: బలిరాం (బహుజన్ వికాస్ అఘాడీ) మెజారిటీ: 2,39,520 భండారా–గోందియా (మహారాష్ట్ర) 2014లో విజేత: నానాభావ్ పటోలే (బీజేపీ) ప్రత్యర్థి: ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ) మెజారిటీ: 1,49,254 నాగాలాండ్ 2014లో విజేత: – నీఫియూ రియో (ఎన్పీఎఫ్) ప్రత్యర్థి: కేవీ పుసా (కాంగ్రెస్) మెజారిటీ: 4,00,225 -
పురానాపూల్‌లో భారీ బందోబస్తు
హైదరాబాద్: పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ వెల్లడించారు. విధుల్లో 1500 మంది పోలీసులను మోహరించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది. -
నేడు వెన్నంపల్లిలో రీపోలింగ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, జేసీ వెన్నంపల్లి(సైదాపూర్ రూరల్) న్యూస్‌లైన్ : సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి 170వ పోలింగ్ కేంద్రంలో మంగళవారం రీపోలింగ్ జరగనుంది. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎం మొరారుుంచింది. మరో ఈవీఎం ఏర్పాటుచేసినా మొదటి ఈవీఎం ఎర్రర్ అని చూపడంతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మంగళవారం నిర్వహించే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాటుచేశారు. రీపోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ సోమవారం తనిఖీచేశారు. పోలింగ్ కేంద్రంలోని సౌకర్యాలను, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్, తహశీల్దార్ మల్లేశం ఉన్నారు. కిడ్నాప్‌లకు పాల్పడితే చర్యలు: ఓఎస్డీ కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : కార్పొరేటర్లుగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను కిడ్నాప్‌లు, శిబిరాలకు తరలించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓఎస్డీ సుబ్బారాయుడు హెచ్చరించారు. రామగుండంలో సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజేతలతో ఓఎస్డీ సమీక్ష జరిపారు. ఒక్కో ఇండిపెండెంట్‌కు ఒక్కో కానిస్టేబుల్‌ను సెక్యూరిటీ నియమిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బెదిరించినా, ఇతర అసౌకర్యాలు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఎవరైనా ఓడిపోయిన అభ్యర్థులను రెచ్చగొట్టే తరహాలో ప్రవర్తించినా, నినాదాలు చేస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీ, డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి, కమిషనర్ ఎస్.రవీంద్ర, సీఐలు పాల్గొన్నారు. -
అది అప్రజాస్వామికం
జమ్మలమడుగులో రీపోలింగ్‌పై వైఎస్సార్సీపీ అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 80, 81, 82 పోలింగ్ కేంద్రాల్లో (అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు) రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సంబంధిత అధికారుల సిఫారసులు, ఇతర పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల అభ్యంతరాలు లేకుండా దేవగుడి గ్రామంలోని ఈ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నేరుగా నిర్ణయించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని పార్టీ పేర్కొంది. రీపోలింగ్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పీఎన్వీ ప్రసాద్ ఈ మేరకు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావుకు ఆదివారం వినతిపత్రం సమర్పించారు. ‘ఈనెల 7న పోలింగ్ సందర్భంగా ఈ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ ఏజెంట్ల నుంచి గానీ, పోలింగ్ అధికారి నుంచి గానీ, సెక్టార్ అధికారి నుంచి గానీ, మైక్రో అబ్జర్వర్ నుంచి గానీ ఎలాంటి ఫిర్యాదులు లేవు. అరుునప్పటికీ ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించడం అప్రజాస్వామికం. దీనిపై కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాం’ అని అందులో పేర్కొన్నారు. అనంతరం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎందుకు నిర్ణయించాల్సి వచ్చిందో ఈసీ పేర్కొనలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నాం. ఇది కచ్చితంగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే. ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా రీపోలింగ్ నిర్ణయూన్ని కమిషన్ పునస్సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని చెప్పారు. -
పలకజీడిలో 13న రీపోలింగ్
- భారీగా పోలీసు భద్రత - రేపు ఈవీఎంలు, సిబ్బంది తరలింపు పాడేరు,న్యూస్‌లైన్: కొయ్యూరు మండలం పలకజీడిలో ఈ నెల13న రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మావోయిస్టులు ఈవీఎంలు,ఎన్నికల సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేయడంతో ఈ నేల 7న ఇక్కడ పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈమేరకు పలకజీడిలో రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రాజకుమారి తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలకు అక్కడికి తరలిస్తామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మంగళవారంనాటి రీపోలింగ్‌కు భారీగా భద్రత చర్యలు చేపడుతున్నామని నర్సీపట్నం ఓఎస్డీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పోలీసు కూంబింగ్ పార్టీలు విస్త్రృతంగా గాలిస్తున్నాయన్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగి,ఎన్నికల సిబ్బంది క్షేమంగా వచ్చేంత వరకు పోలీసుల భద్రత ఉంటుందన్నారు. గిరిజనులు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.