సాక్షి, అమరావతి : ఈ నెల 6న రాష్ట్రంలో ఐదు చోట్ల రీ పోలింగ్ జరగనుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదు చోట్ల 6వ తేదీ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 వరకు రీ పోలింగ్ జరగనుందని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరసరావు పేట అసెంబ్లీ పరిధిలోని కేసనాపల్లి 94వ పోలింగ్ కేంద్రంలో, గుంటూరు పశ్చిమంలోని నల్లచెరువు 244వ పోలింగ్ కేంద్రంలో, నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి పాలెం 41వ పోలింగ్ కేంద్రంలో, సూళ్లురు పేట నియోజకవర్గం అటానితిప్ప 197వ పోలింగ్ కేంద్రంలో , ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనుతల 247వ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
రీ పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగానే పరిగణిస్తామన్నారు. బూత్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామని, అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచుతామని అన్నారు. ప్రతి రీ పోలింగ్ కేంద్రం వద్ద ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment