
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగడంలేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లేటరైట్‌కు సంబంధించి 5వేల టన్నులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. 2018లో ఇచ్చిన కోర్టు ఉత్తర్వుల మేరకు 2021లో అనుమతిచ్చామని వెల్లడించారు. కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును అనుసరించి ఒక్కచోటే మైనింగ్ జరుగుతోందన్నారు. నిబంధనలు పాటించని లీజుదారులకు జరిమానా విధించామని తెలిపారు. విశాఖపట్నంలో బాక్సయిట్ మైనింగ్ చేసే ఆలోచనే లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment