సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు( మంగళవారం) తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. అన్నిచోట్లా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాస్కులు, గ్లోజులు, శానిటైజర్లు పంపిణీ చేశామని తెలిపారు. ( పర్యటన రద్దు.. హైదరాబాద్‌కు నిమ్మగడ్డ )
జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. 3 సైజులలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికలకు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా ఉందని, నోటాకి పడిన ఓట్ల లెక్కింపు జరగదని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment