Panchayat Elections in AP
-
యెల్లో బ్యాచ్ ఏడుపే.. వైఎస్సార్సీపీ ఎదుగుదల
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగుతుందని మరోమారు రుజువైంది. ప్రతిపక్షం ఎన్ని కూతలు కూసినా.. యెల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాసినా.. జనాదరణ సంక్షేమ ప్రభుత్వానిదేనని తేలింది. రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థి పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. తాజా గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పురులో వైఎస్సార్సీపీ మద్దతు దారులు గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి ఏడు గంటలలోపే విజేతలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో మరోసారి ఆ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా.. ► శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు మూడు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ► పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14 వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు, ఇతరులు ఒకరు గెలుపొందారు. ► అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ► కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట గెలుపొందారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను నాలుగింటిని వైఎస్సార్సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు గెలుపొందారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► ఏలూరు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం సాధించారు. ► కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో నాలుగింటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► ఎన్టీఆర్ జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. ► గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు. ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► పల్నాడులో ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని వైఎస్సార్సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు. ► ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్సీపీ, ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► నెల్లూరు జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6 చోట్ల వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► తిరుపతిలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ► చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► కర్నూలులో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► అనంతపురంలో టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన అభ్యర్థులు విజయం సాధించారు. ► నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► వైఎస్సార్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో రెండు చోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పరాభవం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందడం విశేషం. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. -
పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులకే పట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్ పదవుల్ని, 47 వార్డుల్ని కైవసం చేసుకున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా.. మొత్తం 69 సర్పంచి, 533 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేశారు. వాటిలో 30 సర్పంచ్, 380 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సర్పంచ్ స్థానాలకు, 85 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 36 సర్పంచ్, 68 వార్డు పదవులకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం వెంటనే ఆ గ్రామంలోనే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. 8 సర్పంచ్ పదవులు, 14 వార్డులను టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. సీపీఐ మద్దతుదారు ఒక సర్పంచ్ పదవిని గెలుచుకోగా, జనసేన మద్దతుదారులు 7 వార్డులను దక్కించుకున్నారు. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన సర్పంచ్, వార్డుల స్థానాలు, గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలు -
పరువు కోసం టీడీపీ అడ్డదారులు
సాక్షి, తిరుపతి/అనంతపురం/పెనుకొండ/పలమనేరు (వి.కోట): వరుస ఓటములతో తీవ్ర పరాభవాల్ని మూటగట్టుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం కుప్పం మున్సిపాల్టీలోనైనా పరువు నిలుపుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. అలజడులు సృష్టించి.. ప్రలోభాలకు గురిచేసైనా పార్టీని నిలబెట్టుకోవాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. ఇక్కడ అల్లర్లు సృష్టించి తద్వారా సానుభూతి ఓట్లు రాబట్టుకోవాలని పథక రచన చేశారు. ఇందులో భాగంగానే.. ప్రచారం ముగిశాక స్థానికేతరులందరూ కుప్పం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన ఉన్నా టీడీపీ నేతలు దానిని ఏమాత్రం లెక్కచేయకుండా అక్కడే తిష్టవేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్, పలమనేరుకు చెందిన మాజీమంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మరో 230 మంది స్థానికేతరులు కుప్పంలోనే మకాం వేశారు. ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు పంచుతున్నారు. తమ అసలు మొబైల్ ఫోన్లను పోలీసులు ట్రాక్ చేస్తారనే ఉద్దేశంతో తాత్కాలికంగా వేరే నెంబర్లతో తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. వీరందరి కొత్త నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. దీనికి అడ్మిన్లుగా చంద్రబాబు, లోకేశ్ ఉంటూ ఎప్పటికప్పుడు ఏం చేయాలనే దానిపై వీరికి దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు.. ఓటర్లకు పెద్దమొత్తంలో డబ్బులు పంచేందుకు కూన రవికుమార్ ఆదివారం కుప్పానికి చేరుకున్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పోలీసులను అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నందుకు నానా యాగీ ఇక మాజీమంత్రి అమర్నాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని కుప్పంలోకి వస్తుండగా పీఈఎస్ మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి రచ్చరచ్చ చేశారు. టీడీపీ నేతలను కొడుతున్నారంటూ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. కుప్పం టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని గొడవను మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ నేతలు ఇంటికొచ్చి తనపై దాడిచేశారంటూ హడావుడి చేశాడు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు కుప్పానికి వచ్చిన ఉద్యోగులను చంద్రబాబు పీఏ మనోహర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలిస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. పెనుకొండలో బరితెగింపు అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడ గెలవాలన్న ధ్యేయంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రలోభాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కీలక నేతలు పెనుగొండ చుట్టుపక్కల మకాం వేసి మద్యం, డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వచేశారు. అలాగే, ఇప్పటికే విచ్చలవిడిగా మద్యంతోపాటు ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పంచారు. అయినా.. చాలాచోట్ల కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నామని గ్రహించిన ఆ పార్టీ నేతలు రెండోసారి డబ్బు పంపిణీకి పూనుకున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా నగదును బదిలీ చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంటికీ ముక్కు పుడకలు కూడా అందించినట్లు తెలిసింది. ఆదివారం మరింత ఎక్కువగా ఈ ప్రలోభాలను కొనసాగించారు. ఇలా నిబంధనలను ఉల్లంఘించిన పార్టీ నేతలు బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల శ్రీరామ్ మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప చెప్పారు. మరికొందరు నేతలపైనా ఇలాగే కేసులు నమోదు చేశామని.. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు.. చిలమత్తూరు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సోమఘట్ట గ్రామంలో వలంటీర్లను బెదిరించారు. అలాగే, వైఎస్సార్సీపీ నేత నసనకోట ముత్యాలును ‘నువ్వెందుకురా ఇక్కడికొచ్చావ్.. చంపుతా’ అంటూ కాలర్ పట్టుకుని బెదిరించారు. -
కాసేపట్లో కౌంటింగ్..
-
ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎలక్షన్స్
-
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్‌గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్‌లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
పల్లె గూటికి పండగొచ్చింది
సాక్షి, అమరావతి: కొత్త సర్పంచ్‌లు కొలువుదీరడంతో పల్లె గూటికి పండగొచ్చింది. రెండున్నరేళ్ల తరువాత పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల్లో శనివారం నుంచి ప్రజా పాలన తిరిగి మొదలైంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్.. వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,099 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలిచిన 1.33 లక్షల మంది బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన తొలి పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల పాలన మొదలైంది. టీడీపీ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకులు బాధ్యతలు చేపట్టారు. పల్లెకు కొత్త రూపు తెస్తా గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని గాంధీ చెప్పిన మాటలు నిజం చేసేలా పల్లెకు కొత్త రూపు తీసుకువస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించడంతో పాటు మరిన్ని పనులు చేపట్టేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నా. పచ్చదనం, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుదల దిశగా మొదటి అడుగులేస్తున్నాం. – బీరం ఉమా, సర్పంచ్, తిమ్మారెడ్డిపల్లె, వైఎస్సార్ జిల్లా ప్రజావసరాలపై ప్రత్యేక దృష్టి 23 ఏళ్ల వయసులో నాకు గ్రామ సర్పంచ్‌గా అవకాశం వచ్చింది. ఇంటింటికీ తాగునీరు అందించడం నా ముందున్న ప్రధాన లక్ష్యం. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతా. గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటు ప్రభుత్వ వైద్యుడి నియామకం జరిగేలా కృషి చేస్తా. – ఎల్ల రాముడు, సర్పంచ్, గోవర్ధనగిరి, కర్నూలు జిల్లా జగనన్న అడుగుజాడల్లో నడుస్తా మొదటిసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యా. పాలనలో మహిళలకు అధిక రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటా. ముఖ్యమంత్రి అడుగు జాడల్లో నడిచి.. ఆయన ఆశయం మేరకు సంక్షేమ పాలనను కొనసాగిస్తాను. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – బోయ శృతి, సర్పంచ్,కెంచానపల్లి, అనంతపురం జిల్లా -
రెండుచోట్ల గెలవడం కొంప ముంచింది
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోటీపడి రెండు చోట్ల గెలిచాడు. ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. కానీ.. చివరకు ఏ పదవీ ఆయనకు దక్కలేదు. అత్యంత అరుదైన, ఆసక్తికరమైన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన చింతపర్రు సర్పంచ్ పదవితో పాటు గ్రామంలోని వార్డు పదవులకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన పెనుమత్స వెంకట రామకృష్ణంరాజు 4, 5 వార్డుల్లో పోటీ చేశారు. రెండుచోట్లా ప్రత్యర్థుల్ని చిత్తు చేసి మరీ గెలిచారు. 4వ వార్డులో 243 మంది ఓటర్లు ఉండగా.. 212 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నలుగురు అభ్యర్థులు రంగంలో ఉండగా రామకృష్ణంరాజు 44 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులోనూ 243 మంది ఓటర్లు ఉండగా.. 214 పోలయ్యాయి. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. 38 ఓట్ల మెజార్టీతో రామకృష్ణంరాజే గెలిచారు. ఆ తర్వాత వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతిన జరిగే ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ రామకృష్ణంరాజు పోటీపడి ఉప సర్పంచ్‌గానూ గెలుపొందారు. కానీ.. చివరకు వార్డు పదవితోపాటు ఉప సర్పంచ్ పదవికి సైతం ఆయన దూరం కావాల్సి వచ్చింది. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో.. పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానానికి మించి పోటీ చేయకూడదు. కానీ.. రామకృష్ణంరాజు మాత్రం రెండు వార్డుల్లో పోటీ చేయడమే కాకుండా రెండుచోట్లా గెలిచారు. నిబంధనల కారణంగా.. ఆయన రెండు వార్డు పదవులతో పాటు ఉప సర్పంచ్ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల నిబంధనావళి రూల్ నంబర్ 8(3) ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకచోట కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి అందులో ఏదో ఒకచోట తప్ప మిగిలిన చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్లన్నీ రద్దవుతాయి. ఈ నిబంధన విషయంలో పోటీ చేసిన అభ్యర్థితోపాటు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఉద్యోగికి సైతం అవగాహన లేకపోవడంతో రామకృష్ణంరాజుకు రెండుచోట్లా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణంరాజు నిబంధనల్ని ఉల్లంఘించి ఎన్నికల్లో గెలిచారంటూ అయనపై పోటీ చేసిన ప్రత్యర్ధులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించిన ఎన్నికల కమిషన్ ఆ రెండు వార్డుల ఎన్నికలతో పాటు ఉప సర్పంచ్ ఎన్నికనూ రద్దు చేసింది. దీంతో ఆయన అన్ని పదవులనూ కోల్పోవాల్సి వచ్చింది. రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్టు గుర్తించిన కలెక్టర్ స్టేజ్–1 రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కె.శ్రీరామమూర్తిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చారని తెలిసింది. ఆ రెండు వార్డుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్ చింతపర్రు గ్రామ పంచాయతీలో 4, 5 రెండు వార్డులతోపాటు ఉప సర్పంచ్ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వార్డు పదవులకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా చేపడతారు. ఇలావుండగా, రామకృష్ణంరాజు రెండు వార్డుల్లోనూ తిరిగి నామినేషన్ వేశారు. ఏ వార్డు అనుకూలమో నిర్ణయించుకుని రెండోచోట నామినేషన్ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. -
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని హత్యాయత్నం
పుట్లూరు: పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదని అనంతపురం జిల్లా తక్కళ్లపల్లిలో ఒక వ్యక్తిపై టీడీపీ కార్యకర్త బుధవారం హత్యాయత్నం చేశాడు. గత నెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తక్కళ్లపల్లి పంచాయతీలో టీడీపీ మద్దతుదారైన వార్డు అభ్యర్థికి ఓటు వేయలేదనే అక్కసుతో గురవయ్యపై ఆ పార్టీ కార్యకర్త సుధాకర్ రాళ్లతో దాడిచేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో గురవయ్యను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తాడిపత్రి రూరల్ సీఐ మల్లికార్జునగుప్తా పరిశీలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
12 పంచాయతీలు, 725 వార్డులకు కొత్త నోటిఫికేషన్
సాక్షి, అమరావతి : ఎన్నికలు జరగని పంచాయతీలు, వార్డులకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సాంకేతిక కారణాలు, నామినేషన్లు దాఖలు కాని 12 పంచాయతీలు, 725 వార్డులకు బుధవారం ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసింది. వార్డులు, గ్రామాల వారీగా ఈనెల 4వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రదర్శన జరగనుంది. 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు.. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.. 8వ తేదీ సా.5 గంటల వరకు నామినేషన్లపై ఫిర్యాదుల స్వీకరణ.. 9వ తేదీ నామినేషన్లపై వచ్చిన అప్పీల్ పరిశీలన.. 10 వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం 4 గంటలకి అభ్యర్ధుల తుది జాబితా విడుదల కానుంది. 13వ తేదీ రాత్రి 7.30 గంటలతో అభ్యర్ధుల ప్రచారం ముగియనుంది. 15వ తేదీ ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్.. సాయంత్ర 4 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. -
పంచాయతీ రీ కౌంటింగ్‌పై ఈసీ మరో కీలక ఉత్తర్వు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపులో ఎక్కడెక్కడ రీ కౌంటింగ్ జరిగింది? ఎందుకు నిర్వహించారు? తదితర అంశాలపై తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికలు జరిగిన ప్రతి చోట కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి వివరాలతో పంచాయతీలవారీగా నివేదికలు అందజేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 5లోగా నివేదిక ఇవ్వాలి ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు మొదలైంది..? లెక్కింపు సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందా? కరెంటు సరఫరా ఎందుకు నిలిచిపోయింది? కౌంటింగ్ పూర్తయ్యాక ఓడిపోయిన అభ్యర్ధి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్నారా? తదితర వివరాలు పంచాయతీల వారీగా స్పష్టంగా ఉండాలని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్‌ను నిమ్మగడ్డ తాజాగా పంచాయతీరాజ్ శాఖకు పంపారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన నివేదికలను ఈనెల 5లోగా పంపాలని పేర్కొన్నారు. ఎలా సాధ్యం? పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పంపే నివేదికలపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వేర్వేరుగా తమ అభిప్రాయాలను జోడించి ఎన్నికల కమిషన్‌కు పంపాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కాకుండా 10,890 పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగిందని, భారీగా ఉన్న పంచాయతీలపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏ ప్రాతిపదికన విడివిడిగా అభిప్రాయాలు వెల్లడించాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా మూడు రోజుల వ్యవధిలోనే ఒక్కో పంచాయతీలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీడీవోకు, అక్కడ నుంచి డీపీవో, జిల్లా కలెక్టర్లకు నివేదికలు అందడం, పరిశీలన జరిపి అభిప్రాయాలు తెలియచేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు అధికారుల్లో ఉత్పన్నమవుతున్నాయి. వివాదాలన్నీ ట్రిబ్యునల్‌లోనే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పది రోజుల క్రితమే ముగిసింది. గెలిచిన సర్పంచి అభ్యర్ధులు, వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి వివాదాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్‌లోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ముగిసిన ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని పేర్కొంటున్నారు. ఇదంతా గందరగోళానికి గురి చేసేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో నైరాశ్యం
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట: పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి కోలుకోక ముందే మున్సిపల్ ఎన్నికల భయం టీడీపీని వణికిస్తోంది. సొంత జిల్లాలో సైతం పార్టీ కోలుకోలేని దెబ్బ తినడంతో తీవ్రంగా డీలా పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే కుప్పంలో పర్యటిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా టీడీపీ శ్రేణుల్లో నిస్పృహ ఆవరించింది. వరుస ఓటములతో ముఖ్య నాయకులు స్తబ్దుగా ఉండిపోవడం, కేడర్ నిస్తేజంగా మారడంతో ఈసారి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని స్పష్టమవుతోంది. ఎలాగూ ఓడిపోతామని తెలియడంతో చాలాచోట్ల టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. ఒకవైపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నా ఇప్పటికీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసుకోలేకపోవడం టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. ఇక విశాఖలో సైకిల్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకపక్క పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువవడం మరోపక్కఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఓటు ఎలా అడగాలో అంతుబట్టక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిలు లేకపోవడం, ఉన్నవారు ఎలాగూ గెలిచే పరిస్థితి లేదని అంటీముట్టనట్లు ఉండటంతో పోటీ చేసే అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. అనేక చోట్ల ముఖ్య నాయకులే చేతులెత్తేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకోలేమని తప్పుకుంటున్నారు. దీంతో చంద్రబాబు జారిపోతున్న నాయకులు, కేడర్‌ను కాపాడుకోలేక నిత్యం ఏదో ఒక హడావుడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బెజవాడలో సిగపట్లు.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని అంతా తానే అనే రీతిలో వ్యవహరిస్తుండడం మిగిలిన నాయకులకు మింగుడు పడడంలేదు. నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గానికి సీట్లు ఇవ్వకపోవడంతో ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరులో దయనీయం.. గుంటూరు కార్పొరేషన్లో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాల గిరి టీడీపీని వీడడంతో పార్టీ కేడర్ చాలావరకూ ఆయన వెంటే నడిచింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్రను మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా నగరంపై ఆయనకు పట్టు లేకపోవడంతో ఈ ఎన్నికల్లో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విజిటింగ్ ప్రొఫెసర్లా పర్యటించినా ప్రయోజనం లేదని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేసిన నేతలు.. తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన సుగుణమ్మ మౌనంగా ఉండటం, ఆమెపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉండడంతో తిరుపతి కార్పొరేషన్లో టీడీపీని నడిపించే వారు లేరు. కడప, కర్నూలు, ఒంగోలు, ఏలూరు, మచిలీపట్నం తదితర కార్పొరేషన్లలోనూ ఎన్నికల బాధ్యతను స్వీకరించే నాయకులు ఎవరూ టీడీపీలో కానరావడం లేదు. విశాఖలో సైకిల్ అస్తవ్యస్తం.. విశాఖపట్నం కార్పొరేషన్లో పురపోరుకు ముందే సైకిల్‌కు పంక్చరైంది. రెండు చోట్ల టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాకపోవడంతో వామపక్షాలకు సీట్లు కేటాయించాల్సిన దుస్థితి నెలకొంది. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సైతం ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ తరఫున అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో 72వ వార్డు సీపీఐకి, 78వ వార్డుని సీపీఎంకు కేటాయించారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగుస్తున్నా మంగళవారం రాత్రికి కూడా అన్ని వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేయలేని దుస్థితి టీడీపీలో నెలకొంది. జీవీఎంసీ 8, 33 వార్డుల్లో స్థానికేతరులకు బీ ఫారాలు ఇచ్చారని నగర పార్టీ ఆందోళనకు కార్యకర్తలు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలోనే బాహాబాహీకి దిగడంతో వారిని వారించలేక ఆయన మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. కాగా ఎమ్మెల్యే గంటా ముఖ్య అనుచరుడు, పార్టీ సీనియర్ నేత కాశీ విశ్వనా«థ్ టీడీపీని వీడి బుధవారం రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. -
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి
తాడికొండ: పంచాయతీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న చంద్రబాబు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 153వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా చంద్రబాబు పర్యటన పేరిట అనుమతులు లేకుండా వెళ్లడమేగాక రాజకీయ లబ్ధి కోసం ఎయిర్‌పోర్టుల్లో నిరసనల పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్ర చేస్తున్నాడన్నారు. బహుజనుల హక్కులను హరించేలా బాబు కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో బహుజనులు టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. -
జగన్ దెబ్బకు కుప్పానికి పరుగు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబు కుప్పం వీధులకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడని కుప్పంలో టీడీపీ శ్రేణులే కీర్తించడం విశేషమన్నారు. జగన్ భయానికి కుప్పం బాట పట్టిన చంద్రబాబు... ఓడిపోయింది తనా? ప్రజాస్వామ్యమా? ఇప్పుడు చెప్పాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. హామీలిచ్చి మోసం చేసే చంద్రబాబు మరోసారి అదే పనిచేస్తున్నాడని, టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఓ డ్రామా అని ధ్వజమెత్తారు. పులివెందులకు నీళ్లిచ్చానని, కుప్పానికి ఎందుకివ్వరని చంద్రబాబు ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆయనే ఒప్పుకోవడం గమనించాలన్నారు. పులివెందులను వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేస్తే చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం అర్థరహితమన్నారు. ‘‘చంద్రబాబూ.. నువ్వు కుప్పాన్నే కాదు.. రాష్ట్రాన్నీ ఎక్కడా అభివృద్ధి చేయలేదు. అందుకే ప్రజలు నిన్ను తరిమికొట్టారు. మళ్లీ అధికారంలోకొస్తాననే పగటి కలలు మానుకో. పుంగనూరులో పోటీ చేస్తానంటున్నావంటే.. కుప్పాన్ని వదిలేసినట్టేగా?’’ అంటూ అంబటి చురకలేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మే దిక్కా? నామినేషన్ రోజు కూడా కుప్పం రాని చంద్రబాబు ఇప్పుడు నాలుగు రోజులపాటు మకాం వేస్తున్నాడు. అక్కడ 89 పంచాయతీల్లో 74 వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలుచుకున్నారు. కేవలం 14 మాత్రమే దక్కడంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అక్కడే కాదు.. రాష్ట్రమంతటా జగన్ ప్రభంజనం ఆయనకు దడ పుట్టిస్తోంది. కుప్పంలో ఊరేగింపులు... అంతర్గత సమావేశాలు.. ఏం చేసినా జనం మాత్రం చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఆఖరుకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్లాల్సిన దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు భయపడ్డ చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి వాడుకున్నారు. ఎన్నికలవ్వగానే అదే వ్యక్తి సినిమాలు కూడా చూడొద్దంటూ అంతర్గత ఆదేశాలిచ్చారు. లోకేష్‌లో ఏదో తేడా! సీఎం జగన్‌పై నారా లోకేష్ అసభ్య పదజాలంతో, పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. బహుశా ఆయనలో ఏదో తేడా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆయన కుటుంబసభ్యులు మంచి డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం మేలు. లోకేష్.. నువ్వొచ్చాకే టీడీపీ పతనమైందని గుర్తుంచుకో. సైకిల్ తునాతునకలైంది నువ్వు అడుగుపెట్టాకే. నీ స్థాయేంటో తెలుసుకో. జగన్ గన్‌లో బుల్లెట్ లేకపోతేనే నువ్వు మంగళగిరిలో శంకరగిరిమాన్యాలు పట్టావా? కుప్పంలో టీడీపీ దిక్కులేని స్థితికెళ్ళిందా? లోకేష్.. సమాధానం చెప్పు. దొడ్డిదారిన మంత్రివయ్యావుగానీ.. సీఎం అయ్యే అర్హత నీకీ జన్మలో లేదు. జనసేన కూడా వైఎస్సార్సీపీని ప్రశ్నించడం విడ్డూరమే. ముందు ఎవరికో సేవ చేయడం ఆపేసి.. జనం వైపు వెళ్తే మంచిది. -
అంత్యక్రియలను అడ్డుకున్న ‘పంచాయతీ’
బుచ్చినాయుడుకండ్రిగ (చిత్తూరు జిల్లా): ‘పంచాయతీ’ ఎన్నికల సంగ్రామం ముగిసినప్పటికీ.. ఇంకా గ్రామాల్లో ఆ నిప్పుల కుంపటి చల్లారలేదు. ఎన్నికల సందర్భంగా తనకిచ్చిన మాట తప్పారనే కారణంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకుంది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కొత్తపాళెం గ్రామంలో శ్మశానం పంట పొలాల మధ్యలో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పొలాల్లో నుంచే మృతదేహాలను శ్మశానానికి తీసుకెళుతున్నారు. బుధవారం ముత్యాలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి బయలు దేరారు. అయితే పొలాల దారి మొదట్లో కాపురం ఉంటున్న బుజ్జమ్మ తన పొలం దారి నుంచి శవాన్ని తీసుకెళ్లవద్దంటూ దారికి అడ్డంగా కంచెను ఏర్పాటు చేసింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏకగ్రీవంగా తమను ఎన్నుకుంటా మని, గ్రామానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్మానం చేసి..అనంతరం మాట తప్పి పోటీ పెట్టి మోసం చేశారని, కాబట్టి తన భూముల నుంచి శవాన్ని తీసుకుపోయేందుకు వీల్లేదని బుజ్జ మ్మ అడ్డుకుంది. దీంతో వృద్ధురాలి శవంతో మూడు గంటల పాటు ఎండలో రోడ్డుపైనే బంధువులు నిరీ క్షించాల్సి వచ్చింది. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడం తో ఆయన ఆదేశాల మేరకు తహసీల్దారు గణేష్, ఎస్ఐ ధర్మారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బుజ్జ మ్మకు నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. -
తాజా నోటిఫికేషన్ అక్కర్లేదు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు కలిపి విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులిచ్చారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పథకాన్ని అడ్డుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణ అవసరమో లేదో ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడి చెబుతామన్నారు. ఇందుకు అంగీకరిం చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘చంద్రగిరి’లో 84% ఓట్లు వైఎస్సార్సీపీ అభిమానికే
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభిమాని రికార్డుస్థాయిలో ఓట్లు సాధించారు. మొత్తం చెల్లిన ఓట్లలో దాదాపు 84 శాతం ఆమెకే వచ్చాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా వైఎస్సార్సీపీ అభిమాని ముద్దికుప్పం రూప.. టీడీపీ మద్దతుదారుగా పోటీచేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బాపనపట్టు అమ్ములుపై 5,751 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పంచాయతీలో మొత్తం 8,987 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 198 ఓట్లు చెల్లలేదు. 116 ఓట్లు నోటాకు పడ్డాయి. మిగిలిన 8,673 ఓట్లలో రూపకు 7,212 ఓట్లు (దాదాపు 84 శాతం) వచ్చాయి. మొత్తం 18 వార్డుల్లోను వైఎస్సార్సీపీ అభిమానులే గెలిచారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి అభివృద్ధికి చేపట్టిన పనులతో వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతుగా నిలిచారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. -
ఏమీ సేతుర లింగా..
‘సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఎంతసేపు ప్రచారం కోసమే పాకులాడారు. దీనివల్లే తుదకు అభాసుపాలయ్యారు. ఇప్పుడు నిత్యం సమీక్షల మీద సమీక్షలు చేస్తూ లేని బలాన్ని ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదని చెప్పిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుప్పం పర్యటన అంటే చంద్రబాబు ఎంతగా భయపడి బెంబేలెత్తిపోతున్నారో ఇంతకంటే నిదర్శనం అవసరమా? అధినేతే ఇంతగా భయపడితే మా గతి ఏమిటి?’ అని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. సాక్షి, అమరావతి: మొన్నటి దాకా తనకు కంచుకోటలా ఉన్న కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో కూలిపోవడంతో చంద్ర బాబు తీవ్ర అంతర్మథనానికి లోనవుతున్నారు. 1989 నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో అయినా గెలుస్తూ వస్తున్న చోట తొలిసారి ఓటమి ఎదురవ్వడంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. 74 పంచాయతీల్లో తాను నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోవడం సామాన్య విషయం కాదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం ఉంటుందనే ఆందోళన ఆయనతోపాటు ముఖ్య నాయకుల్లో వ్యక్తమవుతోంది. కుప్పం ఓటమి ప్రభావం రాష్ట్రం అంతటా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. తామే గెలిచామని చేసే ప్రచారం ప్రజలను నమ్మించేందుకే తప్ప, క్షేత్ర స్థాయిల్లో వాస్తవ పరిస్థితులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం పార్టీలోని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులకూ తెలుసని చెబుతున్నారు. పైకి వ్యక్తం చేయకపోయినా చంద్రబాబు కూడా ఇదే భయంతో ఆందోళన చెందుతున్నట్లు ఆ పార్టీ ప్రముఖుడు ఒకరు తెలిపారు. కానీ తన భయాన్ని బయట పెట్టకుండా తన ఓటమికి అధికార పార్టీయే కారణమని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబుపై కుప్పం కార్యకర్తల ఆగ్రహం కుప్పం కార్యకర్తలు తిరుగుబాటు చేయడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మంగళవారం జరిగిన కుప్పం నియోజకవర్గ సమావేశంలో.. పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కసారిగా స్థానిక నేతలపై విరుచుకు పడడం అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. తమను బలవంతంగా పోటీ చేయించారని, నామినేషన్ వేశాక పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. కనీసం ప్రచారానికి సైతం నియోజకవర్గ, మండల నాయకులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకుని వదిలేశారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తున్నారని నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ గౌరువాని శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం, పీఏ మనోహర్‌పై విరుచుకుపడ్డారు. దీంతో వాళ్లు ముగ్గురూ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, గ్రామాల్లో కీలక నాయకులు వారిని పట్టించుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. సర్దుబాటు సాధ్యమవుతుందా? ఈ నేపథ్యంలో చంద్రబాబు హుటాహుటిన శుక్రవారం కుప్పం వెళుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో దారుణ పరాజయం స్పష్ట మైన రోజే కుప్పంలో తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గమనించిన ఆయన వైఎస్సార్ సీపీ దౌర్జన్యం వల్లే ఓడిపోయామనే పల్లవి అందుకున్నారు. కానీ కుప్పం నేతల సమావేశం తెలుగుదేశం పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేయడం తో అందరికీ వాస్తవం అవగతమవుతోంది. కుప్పం పర్యటనలో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయిం చారు. ఈ సమీక్షల ద్వారా నాయకుల్లో భరోసా నింపాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలా గే రోజూ సమీక్షలు చేసి, కొంప ముంచారని నాయకులు వాపోతున్నారు. అభ్యర్థులు, నాయ కులకు సరైన అండదండలు ఇవ్వకుండా, టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో కాల క్షేపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి
కేవీబీపురం (చిత్తూరు జిల్లా): తమ పార్టీకి ఓటు వేయలేదన్న దుగ్ధతో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన మంగళవారం చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంజూరుకు చెందిన కె.శివయ్య వైఎస్సార్సీపీకి మద్దతుగా పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేత సి.శివయ్య అతడిపై తప్పుడు ప్రచారం చేస్తూ దూషణకు పాల్పడ్డాడు. కె.శివయ్య నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు సి.శివయ్య, వెంకటేశులు, చంద్రశేఖర్, ప్రకాశ్‌లు ఇంట్లో నిద్రిస్తున్న కె.శివయ్యపై దాడికి పాల్పడి ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కె.శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం, భార్య ద్రాక్షాయణికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నలుగురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. శివయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
సంక్షేమమే శ్వాసగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రతిబింబించిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు. శాశ్వత విజయానికి ప్రజల విశ్వాసం పొందడమే నేటితరం రాజకీయమని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ వివరాలివీ.. ప్రజలే మనకు శ్రీరామరక్ష.. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం విజయంతో వైఎస్సార్సీపీకి జనం మద్దతివ్వడానికి సుపరిపాలనే కారణమని పలువురు మంత్రులు ప్రస్తావించారు. ఏడాదిన్నరగా అమలవుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విశ్వసనీయతే కొలమానంగా సరికొత్త రాజకీయాలు తెచ్చామని, ప్రజలను ఓటుబ్యాంకుగా భావించే వారెవరూ ప్రజా మద్దతు కూడగట్టలేరన్న భావనను సీఎం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వాన్ని ఎంతకైనా తెగించి కాపాడుకునేందుకు సిద్ధమవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని అన్ని వేళలా గుర్తించాలని సూచించారు. విష ప్రచారాన్నే నమ్ముకున్న విపక్షం ఏ ఎన్నికల్లోనైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీ బ్రహ్మాస్త్రాలుగా మంత్రివర్గం భావించింది. పథకాల అమలులో లోపాలను గుర్తించే సత్తాలేని టీడీపీ విష ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని సీఎం గుర్తు చేశారు. ఈ దిశగా అన్ని వ్యవస్థలను వాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోదని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవడం లాంటి కుట్రలు జరిగాయన్నారు. సున్నితమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటూ టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. విపక్షం విమర్శలను తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో ప్రజలకు సంక్షేమ ఫలాలను నిబద్ధతతో అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే తప్పుడు ప్రచారం చేసే విపక్షం వైఖరిని ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చిందని, టీడీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని చెప్పారు. పథకాలే ఊపిరి.. పేదలు, బడుగు వర్గాల స్థితిగతులను మార్చే దిశగా తెస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పథకాల రూపకల్పనతోనే సరిపోదని క్షేత్రస్థాయిలో అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇంటి వద్దకే చేరవేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వాలకు భిన్నంగా సాగుతున్న పారదర్శక పాలనను స్వాగతిస్తున్నారని తెలిపారు. దీన్ని దెబ్బతీసేందుకు విపక్షం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు మరింత కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సమస్యలొస్తే తక్షణం పరిష్కరించాలన్నారు. సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. హామీలు నిలబెట్టుకోవడంలో వైఎస్సార్సీïపీ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలే ప్రశంసిస్తున్న కారణంగా విపక్షం వేలెత్తి చూపలేక పోతోందన్నారు. -
టీడీపీ మద్దతుదారులకు ఆరు చోట్ల ‘0’
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మరోసారి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేకపోయారు. పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో విపక్షం మద్దతుదారులు ఒక్కటంటే ఒక్క పంచాయతీలో కూడా గెలవలేదు. మరో 39 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ పంచాయతీలకే పరిమితమయ్యారు. అందులో చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరితోపాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఉండడం విశేషం. నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ జిల్లాలోనూ టీడీపీ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయారు. 13,081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 2,100 పంచాయతీలకే ఆ పార్టీ మద్దతుదారులు పరిమితమయ్యారు. అంటే 16 శాతం సీట్లనే గెలుచుకోగలిగారు. కానీ ఓటమిని ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురుదాడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 41 శాతం పంచాయతీల్లో తాము గెలిచినట్లు ప్రకటించిన చంద్రబాబు 4,230 పంచాయతీలు తమ ఖాతాలో పడినట్లు చెప్పారు. ఈ లెక్క ఏమిటో టీడీపీ నాయకులకే అంతుబట్టని విధంగా మారింది. ఆయన చెప్పిన శాతానికి, గెలిచిన పంచాయతీలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. ఆయన చెప్పినట్లు గెలిచిన పంచాయతీలను బట్టి చూస్తే అది 32 శాతమే. కానీ 41 శాతం ఏమిటనే దానికి సమాధానం లేదు. పోనీ గెలిచిన పంచాయతీలు ఏవో చూపించమన్నా సరైన స్పందన లేదు. చాలా చోట్ల తామే గెలిచినా అధికారులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించారని, కరెంటు కట్ చేసి దౌర్జన్యం చేశారని ఎదురుదాడికి దిగారు. వాస్తవానికి చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నాయకులు సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోలేకపోయారు. ‘అనంత’లో నామమాత్రం.. అనంతపురం జిల్లాలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ కుదేలైంది. అక్కడ కేవలం 8 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. ఈ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి పట్టున్న కిరికెర, లేపాక్షి, చిలమత్తూరు, కోడూరు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నెగ్గారు. హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి సొంత గ్రామం రొద్దంలో వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఆయన నివసిస్తున్న వార్డులో కూడా టీడీపీ ఓడిపోవడం విశేషం. చంద్రగిరిలో రెండు చోట్ల మాత్రమే.. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో 89 పంచాయతీలకు గానూ కేవలం 14 చోట్లే టీడీపీ మద్దతుదారులు గెలిచిన విషయం తెలిసిందే. ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ మద్దతుదారులు రెండు పంచాయతీల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో 121 పంచాయతీలకు టీడీపీ ఒకే ఒక పంచాయతీలో గెలిచింది. మదనపల్లి నియోజకవర్గంలో అతి తక్కువగా ఆరు పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కడప, కర్నూలులో విపక్షం కకావికలం.. ► వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీని కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఖాతా తెరవలేకపోయింది. ► కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకుంది. ఆదోని–5, ఎమ్మిగనూరు–6, నంద్యాల–2, శ్రీశైలంలో 7 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్ధతుదారులు గెలుచుకున్నారు. ► నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేకపోయారు. కావలి నియోజకవర్గంలోనూ నాలుగు పంచాయతీలకే పరిమితమయ్యారు. మాచర్లలో అధికార పార్టీ క్లీన్ స్వీప్.. ► గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. ఇక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజవర్గంలో కేవలం 9 పంచాయతీలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న చోట్ల కూడా టీడీపీ ఓడిపోయింది. రాజధాని పక్కనే ఉన్న తాడికొండ, అమరావతి మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. గురజాల నియోజకవర్గంలో మూడు, నర్సరావుపేట–1, తెనాలిలో 7 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. కృష్ణాలో సైకిల్ బోల్తా ►కృష్ణా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దిగజారింది. మచిలీపట్నం 4, పెనమలూరు 6, మైలవరం 7, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 8 పంచాయతీలు మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. ► పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో మూడు, కొవ్వూరులో 7, తణుకులో 8 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో కొల్లేటి లంకల్లో ఒకే ఒక గ్రామాన్ని టీడీపీ గెలుచుకోవడం విశేషం. గతంలో ఈ గ్రామాలన్నీ టీడీపీకి కంచుకోటలుగా ఉండగా ఇప్పుడు అవి కూలిపోయాయి. ‘తూర్పు’న సింగిల్ డిజిట్... ► తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ పంచాయతీలనే గెలుచుకుంది. కాకినాడ రూరల్ 1, పిఠాపురం 5, ముమ్మిడివరం 8, పెద్దాపురం 6, రామచంద్రాపురం 2, అనపర్తి 7, తుని 3, మండపేటలో 6 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలీలో నిల్... ► విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తొమ్మిది పంచాయతీలనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలి నియోజకవర్గంలో భీమిలి మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. నాలుగో విడతలో 117 పంచాయతీలకు ఎన్నికలు జరిగి™తే కేవలం 24 పంచాయతీలకు పరిమితమైంది. నేతల సొంత గ్రామాల్లోనూ టీడీపీ కుదేలు.. ► శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 5 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావుకు పట్టున్నట్టు చెప్పుకునే రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఆ పార్టీ నామమాత్రంగానే పంచాయతీలను గెలుచుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ సొంత నియోజకవర్గంలో టీడీపీ చతికిలపడింది. టీడీపీ ముఖ్య నాయకులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, కూన రవికుమార్, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, ప్రతిభా భారతి, కొండ్రు మురళీమోహన్ సొంత గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓడిపోయారు. ► విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో 7 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. నాలుగో విడతలో ఇక్కడ 239 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 50 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. 40 ఏళ్ల పాటు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ చేతుల్లో ఉన్న ఆ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయఢంకా మోగించారు. గ్రామస్తులంతా సోమవారం ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. -
నీకు కుప్పంలోనే దిక్కు లేదు: మంత్రి అనిల్
సాక్షి, తాడేపల్లి: భారతదేశ చరిత్రలోనే ఓడిపోతే సంబరాలు చేసుకునేది ఒక్క టీడీపీ మాత్రమేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. 81 శాతం స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే కేవలం 16 శాతం సాధించిన టీడీపీ సంబరాలు జరుపుకోవడం ఏంటని విమర్శించారు. పైగా ప్రతి విడతలో టీడీపీ పుంజుకుంది అని బాబు చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన వల్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు తమకు విజయాన్ని అందించారన్నారు. టీడీపీకి వచ్చిన 16 శాతం కూడా వైఎస్సార్సీపీ రెబల్స్ వల్ల వచ్చిందని, లేదంటే సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 41 శాతం స్థానాలు గెలిచామని బాబు అభూత కల్పన చేస్తున్నారని, దమ్ముంటే ఏ జిల్లాలోనైనా మీ వాళ్లకు కండువా వేసి చూపించగలవా? అని సూటిగా ప్రశ్నించారు. క్షుద్రపూజలు చేయించింది నువ్వు.. "చంద్రగిరిలో 104 వైఎస్సార్సీపీ గెలిస్తే, 4 టీడీపీ గెలిచింది. నారావారిపల్లెలో కేవలం 8 వార్డులు గెలిచి సంబరాలు చేసుకున్నారు. నీ సొంత ఇలాకాలోనే 20 శాతం సాధించలేని నువ్వు 41 శాతం గెలిచావా..? సర్పంచ్ ఎన్నికలకు 25 ప్రెస్ మీట్లు పెట్టిన ఘనుడు చంద్రబాబు. వైఎస్సార్సీపీ పతనం అయ్యిందా...? ఎక్కడో చూపించు. కుప్పంలోనే దిక్కు లేదు, అలాంటిది మరో 10శాతం అదనంగా వచ్చేవి అనడానికి సిగ్గులేదా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి. టీడీపీ అంపశయ్యపై నుంచి చితిలో పడిపోయింది. ఏ దిక్కు లేక స్వరూపానందపై పడ్డాడు...క్షుద్రపూజలు అంటాడు. క్షుద్రపూజలపై పేటెంట్ ఒక్క చంద్రబాబుకే ఉంది. దుర్గగుడి, కాళహస్తిలో నీ కొడుకు కోసం క్షుద్రపూజలు చేయించింది నువ్వు. కేపిటల్ జోన్ అంటున్న తాటికొండలో కూడా మేము 70 శాతం గెలుచుకున్నాం. ప్రజలు 81 శాతం సీట్లు ఇచ్చి సీఎం జగన్‌పై నమ్మకాన్ని ఉంచారు. అందుకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇక బూతుల్లో గెలిచి సంబరాలు చేసుకునే స్థాయికి టీడీపీ దిగజారుతుంది. ఈ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్రకు కూడా పనికిరాడని ప్రజలు తీర్పిచ్చారు." చంద్రబాబుకు ఆ అర్హత లేదు "మేము అధికారంలో ఉండటానికి అర్హత లేదని చెప్పే అర్హత చంద్రబాబుకు అసలే లేదు. ఓ పక్క నువ్వు పెట్టిన నిమ్మగడ్డ అంతా బాగా జరిగిందని అంటే నువ్వేమో రావణకాష్టం అంటావు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. అయినా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఉంది చంద్రబాబు తీరు. వాళ్ళు గెలిచిన 16 శాతం చోట్లలో ఎన్నికలు బాగా జరిగినట్లా? 81శాతం గెలిచిన చోట ఎన్నికలు బాగా జరగలేదా? కౌంటింగ్ కేంద్రాల వద్ద కరెంట్ తీయడం కాదు, వాళ్ల కరెంట్ కట్ అయ్యింది ఇంకా చంద్రబాబు ఆలాంటి గొప్ప వారసుడిని పెట్టుకుని అధికారంలోకి వస్తాను అనడం పగటికల. 2024లో కూడా మా ముఖ్యమంత్రి కూల్‌గా ఆ సీట్లో కూర్చుంటారు" అని మంత్రి అనిల్ కుమార్ కరాఖండిగా చెప్పారు. చదవండి: ‘మా నాయకుడు కుప్పంలో చుక్కలు చూపించారు’ నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! -
పంచాయతీ ఎన్నికలు; ‘అనంత’లో రికార్డ్ మెజారిటీ
సాక్షి, గోరంట్ల: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లాలో భారీ మెజారిటీ నమోదైంది. గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీచేసిన సరోజ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ పరిధిలో గోరంట్ల, సింగిరెడ్డిపల్లి, గుమ్మయ్యగారిపల్లి, కసిరెడ్డిపల్లి, తిరగంవాండ్లపల్లి గ్రామాలు, 20 వార్డులు న్నాయి. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. వైఎస్సార్సీపీ మద్దతుతో సరోజ బరిలో నిలవగా.. టీడీపీ మద్దతుతో రంగమ్మ పోటీపడ్డారు. ఇక్కడ మొత్తం 19,616 మంది ఓటర్లుండగా.. 13,565 మంది (69.03 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరోజ 5,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెళ్లి పీటల నుంచి పోలింగ్ కేంద్రానికి.. మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని చందకచెర్లు ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో నూతన వధూవరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరువపల్లి గ్రామానికి చెందిన కోటానాయక్, కొత్తలం తండాకు చెందిన లావణ్యబాయికి ఆదివారం పావగడలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని నవ దంపతులు చెప్పారు. అలాగే అనంతపురం జిల్లా పరిగికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు వినయ్‌రెడ్డి, శ్రావణిల వివాహం ఆదివారం జరిగింది. మాంగల్యధారణ తర్వాత నూతన వధూవరులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం -
తుదిదశ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దాష్టీకం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం.. నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్ప దని తెలియడం.. వెరసి పల్లెపోరు తుదిదశలోను ఆదివారం టీడీపీ మద్దతుదారులు చెలరేగిపోయారు. కుట్రలకు తెరతీసి వీరంగం వేశారు. ఓవైపు పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలె త్తేలా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబ డ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతుచూస్తా మంటూ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతోపాటు దాడులు చేశారు. మొదటి మూడు విడతల పోలింగ్‌లో ఓటమికి ప్రతిగా దాడులు కొనసాగి స్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను హత్యచేశారు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడిచేశారు. ప్రకాశం జిల్లాలో మహిళ మీద దాడిచేసి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండిళ్లపై దాడిచేసి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపైనా దాడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం ఐదో వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావును ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబురావు కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధుడు నడవలేకపోవడంతో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న ఫకీరయ్య సాయం చేశారు. దీన్ని తప్పుబట్టిన టీడీపీ మద్దతుదార్ల ఏజెంట్లు ఫకీరయ్యతో వాగ్వాదానికి దిగడమేగాక కుర్చీతో ఆయనపై దాడిచేశారు. దీంతో ఫకీరయ్య వర్గీయులు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన కుర్చీల దాడిలో ఫకీరయ్య గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు. దొంగ ఓట్లను.. ప్రశ్నించినందుకు.. సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్సీపీ అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారితో టీడీపీ వారు వాగ్వాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పోలీసులు లాఠీలు ఉపయోగించి చెదరగొట్టారు. లక్కరాజు గార్లపాడులో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ అభిమానులతో వాగ్వాదానికి దిగారు. పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడైన ప్రభాకర్‌తో ఆయన బంధువు సురేశ్ ఓటు వేయించి తీసుకెళుతుండగా పోలింగ్ కేంద్రం బయట ఉన్న టీడీపీ వర్గీయులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. దీంతో సురేశ్ పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రెండువర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలం తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ఒక గ్రామస్తుడిని కొట్టడంతో ఆగ్రహి ంచిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అమ రావతి మండలం ఉంగుటూరు పోలింగ్ కేంద్రం లోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డు కున్నారు. రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది చావపాడులో ఓటు వేయడానికి రావడంతో వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డుకున్నారు. నాలుగు కుటుంబాలపై దాడి సత్తెనపల్లి: దళితులు మా చెప్పుచేతల్లో ఉండాలి.. మాకే ఎదురు నిలబడతారా.. ఏమనుకుంటున్నారు.. అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో నాలుగు దళిత కుటుంబాలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేశారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాని ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారు వల్లెపల్లి శ్రీనివాసరావు సర్పంచి పదవికి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలవడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణసంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారురా.., కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి..’ అంటూ కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. టీడీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచుమర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను, మరో పదిమంది కర్రలు, రాళ్లతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓడిపోయామని దాడి.. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమాని తిప్పిరెడ్డి వెంకటరెడ్డి.. టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై 353 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీ అభిమానులు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా.. ఓటమి పాలైన సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమాని కె.నర్సిరెడ్డి గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వచ్చిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ఎన్నికల్లో రాజీచేస్తావా.. అంటూ చంపేసిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్ జిల్లాలో దారుణం బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండ లం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్‌రెడ్డి (52)ని దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచా యతీల సర్పంచులుగా వైఎస్సార్సీపీ అభిమా నులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకో లేని పలు గురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్‌రెడ్డితో ఘర్షణకు దిగారు. ‘నువ్వు రాజీచేస్తావా..’ అం టూ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. భాస్క ర్‌రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపో యారు. ఈ విషయం తెలిసి భాస్కర్‌రెడ్డి కుటుం బసభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకుగురైన భాస్కర్‌రెడ్డి గుడిసెకు నిప్పు.. మొక్కజొన్న తోట ధ్వంసం కుప్పంరూరల్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీవారు దారుణంగా ఓడిపోవడంతో తట్టుకోలేని టీడీపీ వారు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తు న్నారు. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పం చాయతీ ఊరునాయునిపల్లెలో శనివారం రెండు ఇళ్ల మీద దాడిచేయడమేగాక గుడిసెకు నిప్పం టించారు. మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. ఈ పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్ï Üపీ అభిమాని ఝాన్సీరాణి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్ర శేఖర్, పవన్‌కల్యాణ్, చంద్రబాబు, మురుగేష్, లక్ష్మీపతి, కదిరప్ప, మరో ఇద్దరు టీడీపీ వ్యక్తులు వైఎస్సార్సీపీ అభిమానులైన బాలాజీ, కృష్ణమూర్తి ఇళ్ల మీద దాడిచేశారు. కృష్ణమూర్తి పొలంలోని గుడిసెకు నిప్పుపెట్టి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన కృష్ణమూర్తి, బాలాజీ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ఆహుతైన కృష్ణమూర్తి గుడిసె, ధ్వంసమైన మొక్కజొన్న తోట మహిళపై దాడి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెంలో ఆదివారం తాను చెప్పిన వారికి ఓటు వేయలేదని ఓ మహిళపై గ్రామ టీడీపీ నాయకుడు దాడిచేశాడు. ఈ విషయమై బాధితురాలు బోడా మధుబాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఈనెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి విజయం సాధించారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ వ్యక్తులు రెండు రోజులుగా గ్రామంలో చిన్నచిన్న గొడవలకు దిగారు. ఈ క్రమంలో ఆదివారం బోడా శ్రీను.. వైఎస్సార్సీపీ మద్దతదారుడికి ఓటేశావంటు మధుబాలపై దాడిచేశాడు. దుర్భాషలాడుతూ ఆమె ఇంటి ముందు ఉన్న పందిరిని కూలదోసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశాడు. శ్రీను నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇంటిపై దాడిచేసి కూలదోసిన పందిరి -
పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానుల గెలుపు సంపూర్ణమైంది. నాలుగో విడతలోనూ జైత్ర యాత్ర కొనసాగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు పల్లె ప్రజలు నాలుగు విడతల్లోనూ జైకొట్టారు. పాలనలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పల్లె ముంగిటకు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆలోచనకు గ్రామీణ ప్రజానీకం మొత్తం సానుకూలంగా స్పందించి బ్రహ్మరథం పట్టారు. కుయుక్తులతో రాజకీయాలను నడపాలని ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీకి ప్రజలు ఓటుతో చావు దెబ్బ కొట్టారు. తెలుగుదేశం కంచుకోటలుగా జబ్బలు చరుచుకున్న ఆ పార్టీ నేతలకు దిమ్మ తిరిగే తీర్పును ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం గమనార్హం. కుప్పంలో వైఎస్సార్సీపీ అభిమానులు భారీ విజయం నమోదు చేయడం.. టీడీపీ పతనానికి ప్రత్యక్ష సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 13,097 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే... మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, నాలుగు విడతల్లో కలిపి 13,097 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో మొత్తంగా 10 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. ఒకటి, రెండు, మూడవ విడతల్లో ఎన్నికలు జరిగిన వాటిలో 7,869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులను వైఎస్సార్సీపీ అభిమానులు చేజిక్కించుకున్నారు. నాలుగో విడతలోనూ ఆదివారం రాత్రి 12.30 గంటలకు అందిన సమాచారం మేరకు 80 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ తీర్పు ముఖ్యమంత్రి ప్రజా రంజక పాలనకు నిదర్శనం అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ఓటర్లు ఒక్క మాటగా అనుకొని ఓటు వేశారా.. అన్నట్టు 13 జిల్లాల్లోనూ, నాలుగు విడతల్లో ఒకే రకమైన ఫలితాలు రావడం ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని వారు పేర్కొన్నారు. ఈ తరహా ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటి సారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు.. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం తీసిపోవని అభివర్ణిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద అభిమానులు, కళాకారుల సంబరాలు 2,743 సర్పంచ్ స్థానాలకు పోలింగ్.. చివరి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 2,743 సర్పంచ్ పదవులకు ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఈ విడతలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 554 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో రెండు చోట్ల అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,743 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆయా పంచాయతీల్లో పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగు గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 82.85 శాతం పోలింగ్.. మిగిలిన మూడు విడతల కంటే నాలుగో విడత ఓటింగ్ శాతం కాస్త ఎక్కువగా నమోదైంది. తొలి మూడు విడతల్లో 80 – 82 శాతం మధ్య ఓటింగ్ శాతం నమోదు కాగా, నాలుగో విడతలో 82.85 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 76 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 81.79 శాతం పోలింగ్ నమోదైనట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో వర్షం వల్ల పోలింగ్‌కు స్వల్ప ఆటంకం.. నెల్లూరు జిల్లా కోవూరు, కొడవలూరు, పొదలకూరు మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఆదివారం ఉదయం వర్షం కురిసిన కారణంగా పోలింగ్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం గణపర్రు గ్రామ పంచాయతీలో దివ్యాంగ మహిళలకు సంబంధించిన ఓటు పోలింగ్ అధికారి ఆమె చెప్పిన గుర్తుకు కాకుండా మరో గుర్తుకు వేశాడన్న వివాదంతో ఓటింగ్ ప్రక్రియకు కొంత అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామ పంచాయతీలో బీసీ–బి మహిళకు రిజర్వు చేసిన వార్డులో బీసీ–బి పురుష అభ్యర్థి పోటీలో ఉండడంతో అక్కడ ఎన్నికను నిలిపివేసినట్టు మండల అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో వర్షం కురవడం వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల్లో జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలను చేపట్టారు. గుంటూరు జిల్లా కంబంపాడులో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఆనందోత్సాహం చదవండి: (పులివెందుల ‘పంచ్’ అదిరింది) (మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం)