తిరుగులేని విజయం.. ప్రత్యర్థికి 9 ఓట్లు | YSRCP Supporter Won By 607 Votes In Guntur District Peda Turakapalem | Sakshi
Sakshi News home page

తిరుగులేని విజయం.. ప్రత్యర్థికి 9 ఓట్లు

Published Sun, Feb 14 2021 3:52 AM | Last Updated on Sun, Feb 14 2021 8:56 AM

YSRCP Supporter Won By 607 Votes In Guntur District Peda Turakapalem - Sakshi

షేక్‌ ఆరిఫ్‌బాషా

సాక్షి, నరసరావుపేట రూరల్‌: ఆ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి పూర్తి ఏకపక్షంగా విజయబావుటా ఎగురవేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం సర్పంచ్‌గా షేక్‌ ఆరిఫ్‌బాషా తన సమీప ప్రత్యర్థిపై 607 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. శనివారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 639 ఓట్లు పోలవగా, వాటిలో ఆరిఫ్‌బాషాకు 616 ఓట్లొచ్చాయి. మిగిలిన నలుగురు అభ్యర్థుల్లో అత్యధికంగా ఓట్లు పొందిన అభ్యర్థి(సమీప ప్రత్యర్థి)కి వచ్చిన ఓట్లు 9. మొత్తం 8 వార్డుల్లో ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు వార్డులకు జరిగిన పోలింగ్‌లో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. చదవండి: (పల్లెల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement