జంగా కృష్ణమూర్తి, జంగా సురేష్
సాక్షి, దాచేపల్లి: తండ్రి సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తనయు డు ఇప్పుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇందుకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాల పాడు పంచాయతీ వేదికైంది. తాజా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రెండో కుమారుడు జంగా సురేష్ గామాలపాడు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీసీలకు రిజర్వ్ అయిన ఈ సర్పంచ్ పదవికి గ్రామస్తులంతా కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు సురేష్‌ను సర్పంచ్ బరిలో నిలిపారు. బీటెక్ పూర్తిచేసిన సురేష్ ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్నారు. సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జనసేన మద్దతుదారులు ఉపసంహరించుకున్నా రు. దీంతో సురేష్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణమూర్తి పెద్ద కుమారుడు వెంకట కోటయ్య పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment