Janga Krishna Murthy
-
జంగా కృష్ణ మూర్తిపై అనర్హత వేటు
-
జంగా ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు విచారణ నిర్వహించారు. ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. చివరకు.. ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జంగా కృష్ణమూర్తి.. 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు మండలిలో విప్‌గా కూడా పని చేశారు. -
పార్టీ ఫిరాయించిన కృష్ణమూర్తిపై విప్ అప్పిరెడ్డి ఫిర్యాదు
-
వచ్చే నెల 8న విజయవాడ లో బీసీల ఆత్మీయ సమ్మేళనం
-
YSR Congress Party: డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాలనాయుడు, వేణుగోపాలకృష్ణ, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, పార్థసారథి, ఎంపీ మోపిదేవి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ.. డిసెంబర్ 8న విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 10వేల మందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. మాది బీసీల ప్రభుత్వమన్నారు. మూడున్నరేళ్లలో బీసీలకు ఎన్నో పథకాలు అందించామన్నారు. డిక్లరేషన్‌లోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని బీసీ నాయకులు పేర్కొన్నారు. చదవండి: (కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే) -
AP: శాసన మండలిలో ఇద్దరు విప్ల నియామకం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమిస్తూ సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులిచ్చారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తా: జంగా కృష్ణమూర్తి దాచేపల్లి: శాసన మండలిలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేస్తానని మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. గామాలపాడు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా తనను నియమించటంపై కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. (క్లిక్: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు) తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా డొక్కా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావును తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. (క్లిక్: గుంటూరులో బీజేపీకి బిగ్ షాక్) -
సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
-
తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్..
సాక్షి, దాచేపల్లి: తండ్రి సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తనయు డు ఇప్పుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇందుకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాల పాడు పంచాయతీ వేదికైంది. తాజా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రెండో కుమారుడు జంగా సురేష్ గామాలపాడు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీలకు రిజర్వ్ అయిన ఈ సర్పంచ్ పదవికి గ్రామస్తులంతా కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు సురేష్‌ను సర్పంచ్ బరిలో నిలిపారు. బీటెక్ పూర్తిచేసిన సురేష్ ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్నారు. సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జనసేన మద్దతుదారులు ఉపసంహరించుకున్నా రు. దీంతో సురేష్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణమూర్తి పెద్ద కుమారుడు వెంకట కోటయ్య పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ) -
బీసీలు చంద్రబాబును నమ్మరు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఎన్ని పాచికలు వేసినా ఆయనను బీసీలు నమ్మరని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల ఆత్మాభిమానంతో ఆడుకుని.. ఇప్పుడు వారి పట్ల బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. పూలే, అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా జగన్ పాలన సాగుతోందన్నారు. పథకాలకు అర్హులై ఉండి సకాలంలో దరఖాస్తులు చేసుకోకుండా మిగిలిపోయిన వారికి సైతం సీఎం లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఇందుకోసం అర్హులకు మళ్లీ నెల రోజులు గడువిచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న తీరును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు స్వాగతిస్తున్నాయని తెలిపారు. బాబు హయాంలో లబ్ధిదారులకు పథకాలను ఎగ్గొట్టడంతోపాటు కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో వివిధ పథకాలకు సంబంధించి నేరుగా లబ్ధిదారులకు సొమ్మును జమ చేయబోతుందని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు 61 శాతం పార్టీ పదవులు కేటాయించామని టీడీపీ ప్రచారం చేసుకోవడం ఆ వర్గాలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు అధికారిక పదవులు ఇవ్వలేదని నిలదీశారు. -
కరోనా వచ్చింది రాష్ట్రానికి కాదు.. టీడీపీకి‘
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని సవాల్ చేసిన చంద్రబాబు ఎందుకు మాట మార్చుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడించమని ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఎందుకు ఓడించాలో కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు వైఎస్సార్సీని ఒడించాలా.. బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ఓడించాలా అని జోగి రమేష్ చంద్రబాబును ప్రశ్నించారు. (స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల) చంద్రబాబును ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా మళ్లీ మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెబుతున్నారని ఆయన విమర్శించారు. కరోనా వైరస్ రాష్ట్రానికి రాలేదని, టీడీపీకి వచ్చిందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, అభ్యర్థులు దొరికిన డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ పక్షాన ఉన్నారన్నారు. (‘ఏ క్షణంలో ఎన్నికలైనా మేము సిద్ధం’) గత ఎన్నికల్లో చంద్రబాబు అనే శనిని బీసీలు వదిలించుకున్నారని జంగా కృష్ణమూర్తి దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన నిజ స్వరూపం బీసీలు తెలుసుకున్నారని అన్నారు. బాబు బీసీల ద్రోహి అని, బీసీలకు మూడవ వంతు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పదివేల కోట్లు ఇస్తానని చెప్పి, బీసీ కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాడని మండిపడ్డారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌లో పెట్టిన ఒక్క హామీ అయినా నెరవేర్చరా అని నిలదీశారు. 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వలేదని చంద్రబాబే సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారని గుర్తు చేశారు. బీసీలకు సీఎం జగన్ అండగా ఉన్నారన్న దురుద్ధేశంతోనే బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిది అని ప్రశంసించారు. (ఎప్పటికైనా ఆ ఒక్కడినే అనుమతిస్తా: కరీనా) -
'తాను,కొడుకు బాగుంటే చాలు.. ఇంకేం అవసరం లేదు'
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విశాఖ అశీలమెట్ట వద్ద వేమన మందిరంలో మంగళవారం అభివృద్ది, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర బిసి కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు సుధీర్ఘకాలంగా సిఎంగా చేసినా ఇంతటి మంచి ఆలోచన చేయలేదని, శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అమరావతి రాజధానిగా సానుకూలం కాదని నివేదికలు చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. పచ్చనిపంట భూములను రాజధాని పేరుతో బలవంతంగా సేకరించి రూ. 94 వేల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులను పెంచారని ఎద్దేవా చేశారు. తాను, తన కొడుకు లోకేష్, తన వర్గం బాగుంటే చాలన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వానికి అభివృద్ది, సంక్షేమం అనేవి రెండు కళ్లలాంటివని కృష్ణమూర్తి పేర్కొన్నారు.(‘చంద్రబాబు రాజకీయ వ్యభిచారి’) విశాఖలో పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని తెలిపారు. మండలిలో రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన టీడీపీ వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుందని దుయ్యబట్టారు. టీడిపి సూచనలతో సెలెక్ట్ కమిటీ వేయడం కుదరదని, శాసన సభతో సంబంధం లేకుండా సబ్ కమిటీ వేయడం సాధ్యంకాదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధాని కావడం వల్ల బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కృష్ణమూర్తి వెల్లడించారు.ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల బిసి విభాగం అధ్యక్షుడు ఫక్కి దివాకర్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, బీసీ నేతలు కోలా గురువులు, రామన్నపాత్రుడు, రొంగలి జగన్నాధం, సత్యాల సాగరిక, పీలా వెంకటలక్ష్మి, యువశ్రీ, బొడ్డేటి గంగామహేష్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ ఒక విజన్ ఉన్న నాయకుడు
-
ఇసుక విషయంలో ప్రతిపక్షాలు డ్రామాలాడుతున్నాయి
-
విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్ జగన్ పెద్దపీట
సాక్షి, తాడేపల్లి: విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులు, పనుల్లో సీఎం ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. బీసీ సమస్యల పరిష్కారానికి శాశ్వతంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. విశ్వకర్మ భగవానుడు విశ్వాన్ని సృష్టించిన వ్యక్తి అని.. విశ్వకర్మలను విశ్వ భగవానుడి వారసులుగా ఆయన పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణలు లేని వృత్తి లేదని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
ప్రజలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంది
-
వ్యవసాయాన్ని పండుగ చేసేలా బడ్జెట్
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండుగ అన్న ముఖ్యమంత్రి పాలించిన రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అని నిరూపించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే బడ్జెట్ అన్నారు. విద్య, వైద్య, రైతు సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం : జంగా కృష్ణమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. పారదర్శక పాలన, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. వెనకబడిన ప్రాంతాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. -
వైఎస్ జగన్ నాయకత్వంలోనే బీసీల అభివృద్ధి
-
రణజ్వాల.. గురజాల
సాక్షి, గురజాల : చాపకూటి సిద్ధాంతంలాంటి సమానత్వాన్ని చాటుకున్న చోటే.. ఫ్యాక్షన్ రక్తపు మరకల్లో తడిచి ముద్దయిన ప్రాంతం పల్నాడు. నాయకురాలు నాగమ్మ పౌరుషాలను పుణికిపుచ్చుకుని.. బ్రహ్మనాయుడు వంటి సౌమ్య గుణాన్ని కలిగిన ఈ ప్రాంతంలో గురజాల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగార్జున సాగర్ జలాలతో సిరుల పంటలిచ్చిన భూములు.. ఐదేళ్లలో కాలంలో మళ్లీ బీడువారాయి. ఫ్యాక్షన్ హత్యలను పక్కన పెట్టి విద్యా, వ్యాపారాల్లో ముద్ర వేస్తున్న ఈ ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యం చూపిస్తున్నారు.పల్నాడు ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. బాలచంద్రుడు, కన్నమదాసు, నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని అమలు చేసి సమానత్వాన్ని చాటారు. తరువాత కాలనుగుణంగా పల్నాడు ప్రాంతం కక్ష్యలు, కార్పణ్యాలతో రగిలిపోయింది. అనంతరం గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెరగడంతో ప్రశాంత వాతావరణం నెలకొని శాంతి కపోతాలు ఎగురుతున్నాయి. గురజాల విశిష్టత గురజాల మండలం పులిపాడు, దైద, తేలుకుట్ల గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలు ఫ్యాక్షన్ విడిచిపెట్టి వ్యాపారాలపై మక్కువ చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వరి, పత్తి, మిరప పంటలు సాగవుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి కాలువలకు నీరు రాకపోవడంతో వరి సాగు తగ్గి పత్తి, మిరప వైపు రైతాంగం మళ్లింది. ప్రస్తుతం బోర్లు, చెరువులు కింద మాత్రమే వరి సాగవుతోంది. నాగార్జున సాగర్ రాకముందు ఈ ప్రాంతం బీడుగా మారింది. 1967లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి పలనాట సిరుల పంటలు పండుతున్నాయి. ఎన్నికల విజేతలు 1952లో కాసు బ్రహ్మానందరెడ్డి (కాంగ్రెస్)పై కోలా సుబ్బారెడ్డి(సీపీఐ) 11,673 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1955లో కోలా సుబ్బారెడ్డి (సీపీఐ)పై మండవ బాపయ్య చౌదరి (కేఎల్పీ) 6,907 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962లో కోలా సుబ్బారెడ్డి(సీపీఐ)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 4,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో గడిపూడి మల్లికార్జునరావు(ఇండిపెండెంట్)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 7,167 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. 1972లో కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్)పై మందపాటి నాగిరెడ్డి (సీపీఐ) 8,377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో మందపాటి నాగిరెడ్డి(సీపీఐ)పై గడిపూడి మల్లికార్జునరావు(కాంగ్రెస్) 23,248 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్)పై జూలకంటి నాగిరెడ్డి (ఇండిపెండెంట్) 12,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో కాయితి వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్)పై అంకిరెడ్డి ముత్యం (టీడీపీ) 3,603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో రాచమడుగు సాంబశివరావు (టీడీపీ)పై కాయితీ వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్) 8,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో కనకం రమేష్ చంద్రదత్తుపై యరపతినేని శ్రీనివాసరావు 23,967 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 131 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 7,126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో ఆలా వెంకటేశ్వర్లుపై యరపతినేని శ్రీనివాసరావు 10,565 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో జంగా కృష్ణమూర్తిపై యరపతినేని శ్రీనివాసరావు 7,896 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మార్పు– కూర్పు పునర్విభజన కాక ముందు గురజాల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేవి (గురజాల, రెంటచింతల, మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల) మండలాలు కలిసి ఉండేవి. రెంటచింతల మండలాన్ని మాచర్ల నియోజకవర్గంలో కలిపారు. విద్యా రంగం గురజాల మండల పరిధిలోని జంగమహేశ్వరపురం వద్ద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్ కళాశాలతోపాటు ప్రైవేట్ కళాశాలలు–2, డిగ్రీ కళాశాల ఒకటి కలవు. బీఎడ్, బీఈడీ ప్రైవేట్ ళాశాలలు ఉన్నాయి. దాచేపల్లి మండలంలో ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వైఎస్ హయాంలో.. గురజాల మండలం మాడుగుల–శ్యామరాజుపురం గ్రామాల మధ్య బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పైపు లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద వేల ఎకరాల వరి పంటలు సాగవుతున్నాయి. దాచేపల్లిలోని దండివాగు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించారు. శ్రీనగర్‌లో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. శ్రీనగర్ నుంచి దాచేపల్లికి మంచినీటి ఇరిగేషన్ ఏర్పాటు చేసి అనేక గ్రామాల దాహార్తి తీర్చారు. పొందుగుల–దాచేపల్లికి వాటర్ పైప్‌లైన్ నిర్మించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించారు. మాచవరం మండలంలోని మోర్జంపాడు లిప్టు ఇరిగేషన్ ఏర్పాటు చేసి సుమారుగా 5 వేల ఎకరాలను సస్యశ్యామంలం చేశారు. పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు గోవిందాపురం జలాలను అందించేందుకు రూ.37 కోట్ల నిధులతో పైపు లైన్లు నిర్మించారు. పిడుగురాళ్లలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిని పట్టణం గుండా వెళ్లేలా చేశారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణామూర్తి బీ ఫారం అందుకున్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందచేశారు. ఈ నెల 25న ఆయన అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు శాసనమండలి ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 21, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, నామినేషన్ల పరిశీలన: మార్చి 1, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 5, ఎన్నికల పోలింగ్: మార్చి 12 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు), ఓట్ల లెక్కింపు: మార్చి 12 సాయంత్రం 5 గంటలకు, ఎన్నికల ప్రక్రియ ముగింపు: మార్చి 15 -
నాడు మాట ఇచ్చారు.. నేడు మాట నిలబెట్టుకున్నారు..
-
బీసీల అభివృద్ధితోనే రాష్ట్ర పునర్నిర్మాణం
మన సమాజం బాగుపడాలంటే సమాజంలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో స్థిరపడి నిలబడగలగాలి. ఏ సమాజమైనా బాగుపడాలంటే ఉత్పత్తి శక్తులతో సంపదలు సృష్టింపచేసి, తిరిగి ఆ సంపదను వాళ్లకే పంచి పెట్టాలి. ఇక్కడ ఉత్పత్తి శక్తులంటే బీసీలు, ఈ బీసీల బతుకులలో, జీవన విధానంలో సమగ్రమైన మార్పు రావాలి. తెలుగు సమాజం రెండు రాష్ట్రాలుగా విభజింపబడిన తర్వాత ఏపీలో బీసీల జీవనంలో వచ్చిన మార్పు ఏమిటి? అన్న సందర్భం వచ్చింది. అమరావతి సాక్షిగా ఈ 55 నెలల పాలనలో బీసీ బతుకులలో వచ్చిన మార్పు ఏమీలేదు. తెచ్చిన మార్పు కూడా ఏమీలేదు. పునాది నుంచి చూస్తే బీసీలలో అట్టడుగున ఉన్నవారిని పైకి తీసుకువచ్చే పనిమొదలు కావాలి. కానీ, అది ఇప్పటికీ జరగటం లేదు. బీసీలు మరింత వెనుకబడిన ఎంబీసీల స్థితి దారుణంగా ఉంది. అభివృద్ధి ఫలాలు కొందరికే అందుతున్నాయి. అవి అందరికీ అందించాలి. ప్రపంచీకరణ ప్రభావం వలన అనేక కులవృత్తుల చేతులు విరిగిపోయాయి. కొన్ని కులవృత్తులు నడుస్తున్నప్పటికీ ఈ వృత్తులకు ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవటం వలన దెబ్బతింటున్నారు. బతుకుపైన బీసీలకు భరోసా కలిగించాలి. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెలమగ్గం, శరీర కష్టం స్ఫురింపచేసే రంపం, కొడవలి, నాగలి సమస్త వృత్తుల సమస్త చిహ్నాలను శ్రీశ్రీ తన కవితా చిహ్నాలుగా చేసుకుని పలవరిం చారు. సరిగ్గా పాలకులు కూడా తమ పాలనా చిహ్నాలుగా బీసీల జీవితాలను మార్చటమే ధ్యేయంగా ముందుకుసాగాలి. బాబు 55 నెలల పాలనను చూశాక అది ఆయనవల్ల కాదని తేలిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో వైస్సార్సీపీ అధినేత జగనన్న ఏపీలో అన్ని రంగాలలో మార్పు రావాలని, ప్రధానంగా ఉత్పత్తి శక్తులైన బీసీల జీవితాలు బాగుపడాలని తపన పడుతున్నారు. అందుకోసం ఆలోచిస్తున్నారు, పథక రచనలు చేస్తున్నారు. బీసీ బతుకులకు భరోసా కల్పించేందుకు ఎంత సాహసం చేయ టానికైనా సిద్ధపడుతున్న జగనన్ననే బడుగు జనులు అర్థం చేసుకుంటున్నారు. బీసీలంటే ప్రభు త్వ పథకాలు కాదని, వారి జీవన విధానాన్ని పరిపూర్ణంగా మార్చటానికి జగన్ ముందుకొస్తున్నారు. బీసీల జీవితాల్లో మార్పు రావాలంటే విద్యా, వైద్య రంగాలు రెండూ వీరికి అందుబాటులోకి రావాలి. చదువులేకపోతే పరిణామ క్రమం లేదు. వైద్యరంగం ద్వారా ప్రతి ఒక్క పేదకు, బహుజనావళికి ఉచితంగా వైద్యం అందాలి. ఈ రెండు పనులు చేయటమే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బీసీల చదువుల కోసం రీయింబర్స్మెంట్ పథకాన్ని చేపట్టారు. అదే విధంగా వైఎస్ జగన్ ఏపీలో ఏ రాజకీయపార్టీ ఆలోచించని విధంగా, ఒక నూతన శకానికి నాంది పలికేందుకు రాష్ట్ర జనాభాలో సగభాగంగావున్న వెనుక బడిన తరగతుల, అత్యంత వెనుకబడిన తరగతుల, సంచారజాతులలో వెలుగు నింపాలని, వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా పురోభివృద్ధికి చేయూతనివ్వాలని, అధికారానికి రాకముందే రాష్ట్రంలో బీసీల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి అధ్యయన కమిటీని వేయటం బీసీ వర్గాలు హర్షిస్తున్నాయి. ఈ నేప«థ్యంలో బీసీ అధ్యయన కమిటి కన్వీనర్‌గా బాధ్యతలు తీసు కుని రాష్ట్రంలో బీసీల జీవన విధానాన్ని అధ్యయనం చేసే అవకాశం కలగటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. బీసీల గురించి లోతుగా తెలుసుకునేందుకు ఈ కమిటి ద్వారా క్షేత్రస్థాయికి వెళ్ళేందుకు జగనన్న నాకు అవకాశం కల్పించారు. క్షేత్రస్థాయిలో బీసీలకు సంబంధించిన విషయాలపై అవగాహన చేసుకుని వారికి అండగా నిలవడమే ధ్యేయంగా జగన్ అడుగులు వేయడంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర నూతనశకానికి నాంది కాబోతుంది. స్వాతంత్య్రం అనంతరం ప్రపంచ మేధావి, శ్రమ జీవుల పక్షపాతి బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మహాత్మాజ్యోతిబాపూలే ఆలోచనల ధారలో అంబేడ్కర్ బహుజనం గురించి లోతుగా ఆలోచించి రాజ్యాంగ రచనను కొనసాగించారు. స్వాతంత్య్రం వచ్చి 72 సం‘‘లు అయినప్పటికి కూడా ఆశించిన మేరకు వెనుకబడిన వర్గాల, నిమ్నజాతుల యొక్క జీవన ప్రమాణాలలో మార్పురాలేదు. వర్ణ, కుల, లింగ వివక్షత కొనసాగుతూనే వుంది. సమాజంలో ఒక అభద్రతాభావం, రాజకీయ అనిశ్చితస్థితి, వైషమ్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అసమానతల గోడలను కూల్చకుండా అభివృద్ధి సాధ్యం కాదని వై.ఎస్ బాటలో జగన్ బీసీ పథక రచనలను రూపొందించారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక రాజ్యం కొనసాగుతోంది. అప్రజాస్వామిక పాలకవర్గ విధానాలు, రోజురోజుకు బడుగు, బలహీనుల జీవితాలను దిగజారుస్తున్నాయి. అధికారకాంక్ష, సంపాదనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ కుళ్ళిన వ్యవస్థను బాగుచేయాలంటే బహుజన పక్షపాతి అయిన జగనన్నే ముందుండాలని ఆ వర్గాలు కోరుకుంటున్నాయి. బహుజన వర్గాలకు విశ్వాసం, నమ్మకం కలిగించటమే కాదు వారికి అండగా నిలబడవలసిన సమయమిది. ఆ పనిని జగన్ తన భుజస్కందాలపై వేసుకున్నారు. అన్నివర్గాల ప్రజల జీవన విధానాలు తెలుసుకొని, అలుపెరగని యోధుడుగా నిరంతర శ్రామికుడిగా వెలుగొందుతున్న జగనన్న నాయ కత్వం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా తాడిత, పీడిత ప్రజానీకానికి న్యాయం జరుగుతుం దని ఆ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. రాష్ట్రంలోని అన్ని రంగాలతో పోల్చుకొని చూస్తే బీసీల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది.బీసీల అభివృద్ధిలో తారతమ్యాలున్నాయి. మైదాన, మెట్ట, దిగువ, కొండప్రాంతాలు, నగర, మహానగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బీసీలలో ఊహించనంత వ్యత్యాసం ఉంది. ఇంకా బీసీలలో గుర్తింపు లభించని కులాలున్నాయి. కులంపేరు తెలియని అభాగ్యులున్నారు. వీరిని గుర్తించి బీసీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉంది. సంచారజాతుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి. పెద్దనాయకుల పిల్లలు అమెరికా పోయి చదువుకోవడం గొప్పతనం కాదని, ఆర్థికంగా, బలహీనంగా ఉన్న పిల్లలు చదువులో ఎదిగి దేశదేశాల్లో స్థిరపడాలని జగన్ ఆలోచిస్తూ బీసీ డిక్లరేషన్ని తయారుచేస్తున్నారు. ప్రతిభ కొన్ని వర్గాల సొత్తుకాదని అది అందరిలో ఉంటుందని, బీసీలలో వున్న ప్రతిభను వెలికితీయడానికి వారికి విద్యారంగంలో ఎన్నో అండదండలు అందించవల్సి ఉందని జగన్ ప్రతిపాదిస్తున్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాపితంగా ఈ విషయంపై అన్ని పార్టీలను ఏకం చేసి నిలబడతానని జగనన్న మాటిచ్చాడు. బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్న దశలో పల్లెకన్నీరు పెడుతున్న దశను చూసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వీరి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలకు మరింత కొనసాగింపుగా, బీసీల ప్రామాణికమైన అభివృద్ధికి అండదండలుగా నిలవాలి. ఆ పని చేయగలిగిన శక్తివంతులెవ్వరో బీసీలకు తెలుసు. అందుకే బీసీలు జగన్ పాదయాత్రలో అడుగడుగునా అండదండలతో నిలిచారు. వారి కన్నీళ్లను, కష్టాలను దగ్గరకెళ్లి ఆయన చూశారు. బీసీలు శిరసెత్తుకుని నిలబడగలిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందినట్లుగా భావించాలి. నవసమాజ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు బీసీలే, ఊరుకు ప్రాణం బీసీలే, వ్యవస్థకు ప్రాణం బీసీలే. వీరి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి. బీసీలకు అండగా, వారికి గుండెదండుగా జగన్ నిలబడతారన్న నమ్మకముంది. బీసీలు నమ్మకంపై నమ్మకం వున్నవారు. బీసీలకు అండగా నిలిచే శక్తులను బీసీలే కాపాడుకుంటారు. నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి జగన్‌కు అండగా బీసీలు చీమలదండులా కదలివస్తారు. బహుజన తాత్త్వికతతో నిర్మించబోయే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తలావొకచేయి వేసి నిలుద్దాం. జగనన్న మార్గంలో బహుజనపథాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుదాం. పదండి. (నేడు ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ సందర్భంగా) వ్యాసకర్త : జంగా కృష్ణమూర్తి, బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్ -
‘చంద్రబాబు కరివేపాకులా వాడుకున్నారు’
ఏలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): అధ్యయన కమిటీ ద్వారా బీసీల కష్టాలు తెలుసుకున్న మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నెల 17న ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ గర్జన బహిరంగ సభా ప్రాంగణాన్ని జంగా కృష్ణమూర్తితో పాటు, మాజీ మంత్రి నరిసే గౌడ్, ఏలూరు పార్లమెంటు బీసీ సెల్ కన్వీనర్ ఘంటా ప్రసాద రావు తదితరులు పరిశీలించారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఒక్క వైఎస్సార్సీపీ తప్ప బీసీల సమస్యలను తెలుసుకోవడానికి అధ్యయన కమిటీ వేసిన పార్టీలు లేవని అన్నారు. బీసీ వర్గాలను రాజకీయ పార్టీలు ఓట్లయంత్రాల్లాగా వాడుకుంటున్నారే తప్ప బీసీ కులాల అభివృద్ధికి పాటుపడింది లేదన్నారు. పార్లమెంటు స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో బీసీల జీవనవిధానం స్థితిగతులపై తమ కమిటీ అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. బీసీలను చంద్రబాబు కరివేపాకులా వాడుకున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుపరిపాలనను సాగించడానికే జగన్ పాదయాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో అందరి సమస్యలను తెలుసుకున్నారని అన్నారు. అధ్యయన కమిటీ ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని వైఎస్ జగన్ డిక్లరేషన్ చేస్తారని చెప్పారు. జడ్జీలుగా బీసీలు పనిరారని లేఖ రాసి బీసీలను చంద్రబాబు అవమానించారని విమర్శలు సంధించారు. బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ , కులవృత్తులను ప్రోత్సహించడానికి, పారిశ్రామికవేత్తలను తయారుచేయడానికి డిక్లరేషన్ ఉండబోతోందని అన్నారు. సంచార జాతుల అభివృద్ధికి వారి జీవన స్థితిగతులు మార్చే విధంగా బీసీ డిక్లరేషన్ ఉంటుందని తెలిపారు. జీతాలు పెంచాలని అడిగిన నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు తాట తీస్తానన్నారు.. అదీ ఆయనకు బీసీలపై ఉన్న ప్రేమ అని మండిపడ్డారు. గతంలో 9 ఏళ్లు.. ఇప్పుడు ఐదేళ్లు ఏం చేశావ్: మాజీ మంత్ర నరిసే గౌడ్ గతంలొ 9 ఏళ్లు, ఇప్పుడు ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. బీసీలకు భరోసా కావాలని, అది వైఎస్ జగన్ ద్వారా మాత్రమే వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బీసీ గర్జన మహాసభ ద్వారా వైఎస్ జగన్ ఎన్నికల సమర శంఖారావానికి శ్రీకారం చుడతారని చెప్పారు. -
‘భయాన్ని సృష్టించి నానా యాగీ చేస్తున్నారు’
హైదరాబాద్: కాపీ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారని, కాపీ కొట్టడంలో ఆయనను మించిన వారు లేరని వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారధి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరులతో మాట్లాడారు. రైతులను నాలుగేళ్లు పట్టించుకోలేదు.. ఎన్నికలకు ముందు పండుగ అంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు. ఒక్క పంటకు కూడా టీడీపీ ప్రభుత్వం కనీస మద్ధతు ధర ఇవ్వలేదని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధిని ఖర్చు చేయలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని తూర్పారబట్టారు. రైతులు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే వాళ్లను జైళ్లలో పెట్టించారని, టీడీపీ నాయకులు భయాన్ని సృష్టించి నానా యాగీ చేస్తున్నారని అన్నారు. తిథిలీ తుపానుతో రూ.3600 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే చెప్పింది..కానీ వారిని ప్రభుత్వమే ఆదుకోలేదని గుర్తు చేశారు. ఒక పక్క పెథాయ్ తుపాను ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతుంటే.. రాజకీయాలు చేయడానికి పరాయి రాష్ట్రంలో చంద్రబాబు పర్యటించారని తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని, నాలుగేళ్లు ఒక రంగు.. ఎన్నికల ఏడాది మరో రంగుతో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడి ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. అప్పుడే ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు రద్దు చేసేవారని అన్నారు. వ్యవసాయ రుణాలు అన్నీ రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీకి రూ.24 వేల కోట్లు ఇస్తామని చెప్పి... రూ.14 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.10 వేలు ఇస్తామని మరో నాటకానికి చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపెట్టారని, బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు నిధులే కేటాయించలేదని తెలిపారు. చంద్రబాబు, సీఎం కుర్చీ కోసమే మోసపూరిత హామీలు ఇస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రకటించిన 2 సంవత్సరాల తర్వాత పింఛన్ 2 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. బాబుకు దమ్ముంటే ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలకు ఎన్ని ఎకరాల భూమి సేకరించారో బయటపెట్టలన్నారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు తీసుకుని మళ్లీ పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 17న ఏలూరులో జరగబోయే బీసీ గర్జన గురించి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌తో చర్చించినట్లు తెలిపారు. బీసీలకు నామినేటెడ్ పదవులు: జంగా ఈ నెల 17న ఏలూరులో బీసీ గర్జన సభ జరగనుందని వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీ డిక్లరేషన్ విషయంలో బీసీ నేతల సూచనలు వైఎస్ జగన్ తీసుకుంటారని తెలిపారు. ప్రతీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్‌పై వైఎస్ జగన్‌తో కూలంకశంగా చర్చించినట్లు తెలిపారు. నామినేటెడ్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేలా.. దానికి చట్టబద్ధత తీసుకుని వచ్చేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. బీసీలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్చించామని, బీసీ గర్జన బీసీలకు దశ, దిశ నిర్ధేశంగా మారనుందని వ్యాఖ్యానించారు. -
సబ్ ప్లాన్ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారు
-
‘అసెంబ్లీ సాక్షిగా బీసీలను మోసం చేసిన బాబు’
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సబ్ ప్లాన్ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలను వంచన చేయడం కోసమే సబ్ ప్లాన్ బిల్లును ప్రవేశపెట్టారని మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమంత్రిగాని, ఆర్థికమంత్రిగాని సభలో లేరంటేనే బీసీల పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందని విమర్శించారు. బీసీ బిల్లు అనేది ఓ నాటకమని ఆయన ఆరోపించారు. టీడీపీకి బీసీలే వెన్నుముక అంటూ వాళ్లని ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం తప్పితే మరోటికాదన్నారు. ఏపీ బడ్జెట్లో ఖర్చులు మాత్రమే ఉంటున్నాయని కానీ కేటాయింపులు కానరావడం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకు సబ్ ప్లాన్ బిల్లుపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు ఎంత కేటాయించారో మంత్రి చెప్పలేకపోవడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ ప్రభుత్వ నాటకాలన్నీ తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏ విధంగా దారిమళ్లించారో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తేలుస్తామని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. -
బీసీ న్యాయమూర్తులను అణగదొక్కిన చరిత్ర బాబుది
-
పార్టీ బీసీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ
-
చంద్రబాబు వైఎస్సార్ సీపీ నవరత్నాలు కాపీ కొడుతున్నారు
-
ఫిబ్రవరి 19న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌లో బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పలు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల స్థితిగతులను, జీవన ప్రమాణాలను తెలుసుకునే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర క్రితం బీసీ అధ్యయన కమిటీ నియమించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని, అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్ జగన్‌కు అందజేశామని పేర్కొన్నారు. వాటి గురించి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో సమీక్షించారని తెలిపారు. (పార్టీ బీసీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ) నవరత్నాలు కాపీ కొడుతున్నారు.. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు.. వాటినే మళ్లీ కొత్తగా చెబుతున్నారని కృష్ణమూర్తి మండిపడ్డారు. 2014 మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను టీడీపీ ఏమేరకు అమలు చేసిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బీసీలను అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రలోభ పెట్టి, వారి ఓట్లు వేయించుకుని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని.. ఈ విషయాన్ని స్వయంగా జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారని పేర్కొన్నారు. బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేసిన చంద్రబాబుకు జయహో బీసీ అనే అర్హత లేదని విమర్శించారు. తమ అధ్యయనంలో భాగంగా సంచార జాతులను కూడా కలిశామని.. కొంత మంది బీసీలకు తమ కులం ఏమిటో కూడా స్పష్టంగా తెలియదనడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు.. ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప బీసీల పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి విమర్శించారు. మెడికల్ సీట్ల విషయంలో బీసీలు నష్టపోతున్నా టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఫీజు రియంబర్స్మెంట్పై ఒక్కమాట కూడా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రతి కాబినెట్ మీటింగ్‌లో భూములు, ఇసుక గురించి చర్చించారు.. ఒక్క బీసీకైనా ఎకరా భూమి కేటాయించారా అని ప్రశ్నించారు. బీసీల జీవితాలు మార్చడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై కేటీఆర్.. జగన్‌ని కలిస్తే నిస్సిగ్గుగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పథకాలనే కాపీ కొడుతున్న చంద్రబాబుకు అసలు సిగ్గుందా అంటూ ధ్వజమెత్తారు. -
పార్టీ బీసీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో వైఎస్సార్ సీపీ కీలక నేతలు జంగా కృష్ణమూర్తి, బొత్స సత్యనారాయణ, జోగు రమేష్, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేపిదేవి వెంకటరమణ, విజయసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయి?
-
పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయి?
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణామూర్తి విమర్శించారు. 20లక్షల కోట్ల పెట్టుబడులు, 40లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయని నిరుద్యోగులు చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకే ఒకేఒక్కసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం అధిక జనాభా ఉన్న బీసీలకు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీలకు అన్యాయం చేసే విధంగా నిభందనలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, దీనిపై సీఎస్‌కు లేఖ కూడా రాశామని ఆయన వెల్లడించారు. గతంలో మెడికల్ సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ పోరాటం చేసిందని జంగా కృష్ణమూర్తి గుర్తుచేశారు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. -
బీసీలకు న్యాయం.. ఆయనతోనే సాధ్యం
సాక్షి, గన్నవరం (కృష్ణా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పత్రిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాలతోనే బీసీలకు గౌరవం, న్యాయం జరుగుతుందన్నారు. శనివారం గన్నవరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను మభ్యపెట్టడానికే ఆదరణ పథకం పెట్టారని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో ఆదరణ పథకం అవినీతిమయమైందన్నారు. ఆదరణ పథకంలో నాణ్యత లోపమున్నట్లు, ఆరు శాతం అవినీతి జరిగినట్లు స్వయంగా చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఆదరణ పథకం బూటకమని, అవినీతిమయమని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 2014లో ఇచ్చిన హామీలు ‘బీసీ డిక్లరేషన్’, ‘ప్రతి సంవత్సరం పది వేల కోట్ల నిధులతో బీసీ సబ్ ప్లాన్’, నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
110 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
-
‘110 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా బాబూ’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నిప్పులు చెరిగారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేస్తున్న హడావుడి విడ్డూరంగా ఉందని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇప్పడు నీకు ఇబ్బంది వస్తే ఇతరులు కావాలా’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే... డీజీపీతో తప్పుడు ప్రకటనలు చేయించారని అన్నారు. అవినీతిపై మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కుట్రలు కుతంత్రాలే ఉన్నాయని అన్నారు. 110 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? చంద్రబాబు బీసీ ద్రోహి కృష్ణమూర్తి వాఖ్యానించారు. బీసీలకు ఇచ్చిన 110 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే బాబు బీసీల వైపు చూస్తారని విమర్శలు గుప్పించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై ప్రేమే ఉంటే బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చుచేయలేదని ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్ ఏమైందని మండిపడ్డారు. వెనబడిన తరగతులకు ఇచ్చిన హామీలపై చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చే చంద్రబాబు నిజస్వరూపం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. -
సామాజిక అన్యాయం
సాక్షి, అమరావతి: అక్షరాలా 12 కార్పొరేషన్లు, 11 బీసీ ఫెడరేషన్లు.. వీటికి బడ్జెట్ కేటాయింపులు రూ.3,746.8 కోట్లు. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3.30 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా ఎంతమందికి, ఎన్ని రుణాలు ఇచ్చారో చూస్తే.. కనిపించేది పెద్ద గుండుసున్నా. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు తదితర సామాజిక వర్గాల సంక్షేమం పట్ల నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త డ్రామాకు శ్రీకారం చుడుతోంది. ఆన్లైన్ దరఖాస్తులకు మోక్షమెప్పుడో? లబ్ధిదారులకు రుణాలు విడిగా ఇవ్వకుండా ఎన్నికల ముందు మేళాలు నిర్వహించి, ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా పైసా కూడా రుణాలు ఇవ్వకుండా దగా చేసిన సర్కారు తీరుపై లబ్ధిదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నెలకోసారి రుణమేళాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. వచ్చే నెల నుంచి రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కొన్ని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ఈ దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గతంలో ఏడు కార్పొరేషన్లు ఉండేవి. కొత్తగా ఎంబీసీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, దూదేకుల ముస్లిం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీసీల్లో వెనుకబడిన కులాల కోసం 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఒక్కో ఫెడరేషన్లకు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయించారు. రజక, కల్లుగీత కార్మిక ఫెడరేషన్లకు మాత్రం రూ.70 కోట్లు కేటాయించారు. ఈ అరకొర నిధులతో ఎక్కువ మందికి రుణాలు దక్కే అవకాశం లేదని బీసీ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారికి, టీడీపీ కార్యకర్తలకే రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీసీల్లో అన్ని వర్గాలనూ మోసం చేశారు ‘‘వెనుకబడిన తరగతుల్లో అన్ని వర్గాల వారినీ తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజమైన లబ్ధిదారులకు రుణాలు అందడం లేదు. రుణమేళాలు పెట్టి అధికార పార్టీ కార్యకర్తలకు రుణాలు ఇవ్వాలని చూస్తున్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీ కులాలకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైగా బీసీ సబ్‌ప్లాన్ అంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రుణమేళాల పేరుతో మరో గిమ్మిక్కు ‘‘గత ఏడాది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి, అధికార పార్టీ నేతల బినామీలకే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఇప్పుడు రుణమేళాల పేరుతో ప్రభుత్వం మరో గిమ్మిక్కు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచింది. ఇప్పటిదాకా ఇవ్వని రుణాలను ఎన్నికల ముందు ఇస్తామని చెబుతున్నారంటే ప్రభుత్వ పెద్దల కుట్రను అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకుంటే సరిపోదు. – ఆండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేత -
ఆదరణ పేరుతో మళ్ళీ కొత్త డ్రామాలు
-
ఆదరణ పేరుతో మళ్ళీ కొత్త డ్రామాలు : జంగా కృష్ణమూర్తి
సాక్షి, విజయవాడ : ప్రతి మహిళను లక్షాధికారి చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం అని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైఎస్సార్ కలలు సాకారం చేయడం లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 11వ జిల్లాలో కొనసాగుతోందని, ప్రతిచోటా మహిళలు తమ సమస్యలు వైఎస్ జగన్‌కి మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్ ఒక అడుగు ముందుకేసి అధికారంలోకి రాగానే వైఎస్సార్ చేయూత కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలపై అందరూ చర్చించుకుంటున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఆదరణ పేరుతో మళ్ళీ కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. ఆదరణ పథకంలో అన్ని నాసిరకం పనిముట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు అందరికి వైఎస్సార్ చేయూత ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. -
‘బీసీలను అన్నివిధాల ముంచింది బాబే’
సాక్షి, వైఎస్సార్ : ‘బీసీలను ఎన్నికలలో అన్ని విధాల వాడుకుని మోసం చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే. బీసీలకు అన్ని విధాల న్యాయం జరగబోయేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. అందుకే ప్రజా సంకల్ప యాత్ర అనంతరం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నా’మని వైఎస్సార్సీపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన వారిని నట్టేట ముంచే నైజం చంద్రబాబుది. ఎన్నికల సమయంలో బీసీలను వాడుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి బీసీలు ఆయనను గెలిపించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక బీసీల గురించి పట్టించుకోకుండా వారిని నట్టేట ముంచారని విమర్శించారు. కానీ వైఎస్సార్ కుటుంబం అలా కాదు. మాట తప్పని, మడమ తిప్పని నైజం వారిది. నమ్మిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్దపడతారని తెలిపారు. బాబు హయాంలో బీసీలకు ఒరిగిందేం లేదని ఆరోపించారు. బీసీలకు తగు న్యాయం జరగాలంటే అది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని తెలిపారు. అందుకే ప్రజా సంకల్ప యాత్ర అనంతరం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో బీసీ గర్జన సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాక త్వరలోనే బీసీ అధ్యాయన కమిటీ నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందచేయనున్నట్లు తెలిపారు. బీసీలకు న్యాయం చేసేది జగన్ మోహన్ రెడ్డి : ఆకేపాటి అమరనాథరెడ్డి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందని బీసీలు విశ్వసిస్తున్నారని రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి తెలిపారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అనే విశ్వాసం ప్రజల్లో పాతుకుపోయిందని అన్నారు. అందుకే కేవలం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో బీసీలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. -
‘ఆ బిల్లుతో సామాజిక న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు (బీసీ) రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. దీనిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన వివిధ పార్టీల గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవనీయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ బీసీ ప్రజల తరుఫున, వైఎస్సార్సీపీ తరుఫున ధన్యావాదాలు. బీసీ మేధావులు, ప్రజాసంఘాల ఉద్యమ ఫలితమే ఈ బిల్లు. రాజ్యాంగంలోని 123వ సవరణ బిల్లును రాజ్యసభ ప్రతిపాదనలను త్రోసిపుచ్చుతూ సభకు హాజరైన 406 మంది లోక్‌సభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం హార్షనీయం. రాజ్యసభ సవరణలతో ఆమోదించిన బిల్లును లోక్‌సభ సవరించడం చరిత్రలోనే ప్రప్రధమం. ఇప్పటి వరకు పాలకవర్గాలు బీసీల సామాజిక ఆర్థిక గణనచేసి బహిర్గతం చేయలేదు. రాజ్యసభ సభ్యులు కూడా బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాము. బీసీ కమిషన్‌కు ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఈ బిల్లుతో బీసీ వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత కలుగుతాయి’ అని పేర్కొన్నారు. బీసీలకు చట్టసభలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించాలని, ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్స్ కొనసాగించాలని కోరుతూ.. వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లు త్వరలో చర్చకు రానుంది. దీనిపై కూడా జంగా హర్షం వ్యక్తం చేశారు. -
‘ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం’
సాక్షి, విజయవాడ : ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని, వెంటనే రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ విషయంపై హెల్త్ యూనివర్సిటీ వీసీకి మెమోరండం ఇచ్చామన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించి రీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు రీ కౌన్సెలింగ్ నిర్వహించలేదని, జీవో 550ను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని మండిపడ్డారు. బీసీల హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని, రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. హెల్త్ యూనివర్సిటీ అధికారులు వెంటనే రీ కౌన్సెలింగ్ చేయాలని, లేని పక్షంలో అన్ని మెడికల్ కాలేజీల వద్ద ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. -
రిజర్వేషన్ల పై సర్కారుకు చిత్తశుద్ధి లేదు
-
మంత్రుల గోబెల్స్ ప్రచారం..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బీసీలకు అన్యాయం జరిగిందనే గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని.. బీసీలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కులవృత్తి చేసుకునే వారిని నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని అన్నారు. బీసీలకు సమాజంలో గౌరవప్రదమైన జీవనం లేకుండా చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌దేనని కృష్ణమూర్తి గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్ ఏమైందంటూ ప్రశ్నించిన ఆయన దీనిపై యనమల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బడ్జెట్ నిధులు, సబ్ ప్లాన్‌కి చట్టబద్ధత, బీసీలకు ఇస్తామన్న నామినేటెడ్ పోస్టులు ఎక్కడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తుంటే ఎందుకు నోరు మోదపడం లేదంటూ కాల్వ, యనమల తీరుపై విరుచుకుపడ్డారు. టీటీడీ చైర్మన్ పదవి యనమల వియ్యంకుడుకి ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. టీడీపీ హయంలో బీసీలకు ఏం చేశారో చెప్పలేని మీరు.. బీసీలు టీడీపీ వెంటే ఉంటారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
‘బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం’
సాక్షి, విజయవాడ: బీసీలకు సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్కహామీని చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని, బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్ పాటుపడతారని చెప్పారు. బీసీలోని అన్ని కులాలకు జగన్ న్యాయం చేస్తారని అన్నారు. అన్ని బీసీ వర్గాలకు న్యాయం చేసేలా వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్ ఉంటుందని తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్ర బీసీ వర్గాలకు భరోసాయాత్రగా సాగుతోందన్నారు. బీసీ డిక్లరేషన్ ఎలా ఉండాలనే దానిపై బీసీ మేధావులు, ప్రజాసంఘాలతో తమ పార్టీ బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని.. అందరి అభిప్రాయాలు సేకరించి నివేదికను జగన్‌ను అందజేస్తామని తెలిపారు. -
బీసీలు, కాపులను టీడీపీ మోసం చేస్తోంది
ఒంగోలు వన్‌టౌన్: ‘యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. మరోవైపు ప్రధాని కూడా ఇదే విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?’ అని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాజకీయ అవసరాల కోసం బీసీలు, కాపులను టీడీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. జస్టిస్ మంజునాథ్ కమిషన్ నివేదికను అధ్యయనం చేయకుండా.. కాపులకు రిజర్వేషన్లంటూ తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు ఈ విధంగా కులాల మధ్య కుంపటి పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మార్పీఎస్‌ను దగ్గరకు తీసిన చంద్రబాబు.. అవసరం తీరిపోయాక వారిని కరివేపాకులా పక్కన పడేసిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. 2012 బీసీ డిక్లరేషన్‌లో దాదాపు 120 హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కటీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సమగ్రాభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుమ్మరి, నాయీబ్రాహ్మణ, రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామస్థాయి నుంచి వివిధ కులాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర నాయకులు అవ్వారు ముసలయ్య, గోలి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, మద్దిబోయిన సురేష్, కటారి ప్రసాద్, జువ్వి రాము, బత్తుల ప్రమీల పాల్గొన్నారు. -
వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు న్యాయం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్సార్‌సీపీతోనే బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గంలోని 135 కులాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ కులాల సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని చెప్పారు. గురువారం కర్నూలులోని నంద్యాల రోడ్డులో ఉన్న మెగాసిరి ఫంక్షన్ హాలులో జిల్లా బీసీ నాయకుల సదస్సు జరిగింది. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మ«ధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో జంగా కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి బీసీల పార్టీ అని చెప్పుకొంటున్నా.. చేసింది మాత్రం ఏమీలేదని విమర్శించారు. బీసీల్లో 135 కులాలుంటే ఓటర్లు అధికంగా ఉన్న 10–15 కులాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి మిగతా వారిని అన్యాయం చేసిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 135 కులాల వారికీ న్యాయం చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు బీసీ కులాలు మద్దతు తెలిపేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే పార్టీపై టీడీపీ నాయకులు, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మధుసూదన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీలకు టీడీపీ చేస్తున్న మోసాలను గుర్తించారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి బీసీల బలోపేతానికి పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. తమ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. కర్నూలు పార్లమెంట్లో బీసీలదే ఆధిపత్యమన్నారు. పార్టీ పదవుల్లోనూ వారికి స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు వడ్డెర్లు, రజకులు, కురువలను ఎస్టీ, ఎస్సీ జాబితాలో చేర్చుతానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీసీ కులాల సమస్యలను పాదయాత్రలో జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర కార్యదర్శి పీజీ రాంపుల్లయ్యయాదవ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలైన బీసీలకు ఇళ్లు, స్థలాలు, రేషన్, పెన్షన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ స్ఫూర్తితో పేదలందరికీ సదుపాయాలను కల్పించేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య తెలిపారు. బీసీలందరూ ఏకమై టీడీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్రలో ప్రతి బీసీ కుల సభ్యుణ్ని జగన్‌తో కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వారు తమ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తేవాలని సూచించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ తమ పార్టీలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను ఇచ్చి గెలిపించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు ఏడాదికి రూ.10 వేల కోట్ల ప్రకారం నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. మళ్లీ ఇప్పుడు ఆదరణ పథకం అంటే ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలోకి తెచ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ పథకాలకు నిధులు విడుదల చేయకుండా సీఎం చంద్రబాబు బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. జగన్ పాదయాత్రకు బీసీలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. సదస్సులో నాయకులు నరసింహులు యాదవ్, రాజశేఖర్, మునిస్వామి, సత్యంయాదవ్, రమణ, అనిల్‌కుమార్, కుంకనూరు శ్రీనివాస్, మల్లికార్జున, పందికొన నాగరాజు, ఆలూరు ఎంపీపీ బసప్ప,, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘు, ఎల్లప్ప, అయ్యప్ప, మునిసిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
'బీసీలకు ఏం ఒరగబెట్టారో చెప్పండి'
సాక్షి, కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో బీసీలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలతో పాటు బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నది వైఎస్సార్ మాత్రమేనని గుర్తు చేశారు. తొమ్మిది సంవత్సరాలు పాలించిన కాలంలో చంద్రబాబుకు బీసీలు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదరణ పేరుతో బీసీలను మభ్య పెట్టారే తప్ప వారి ఆర్థిక స్వావలంబనకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు రూ. 10 వేల కోట్లతో సబ్ ప్లాన్ నిధులు ఏర్పాటు చేస్తాం అన్నారు.. బీసీలకు స్పెషల్ బడ్జెట్ ఏర్పాటు చేస్తాం అన్నారు.. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టభద్రత కల్పిస్తామన్నారు.. కానీ అన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని కులాల వారిని మోసం చేసిన చంద్రబాబు నేడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు చేసిన మోసాలను తెలియజేసేందుకు వైఎస్సార్పీపీ కార్యాచరణ రూపొందించిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రలో బీసీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
దాచేపల్లిలో గురజాల డీఎస్పీ ఓవరాక్షన్..
గుంటూరు: గుంటూరు జిల్లాలో గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ నేత జంగా కృష్ణమూర్తిపై డీఎస్పీ చేయి చేసుకున్నారు. అంతేకాక జంగాతోపాటు మరో 12మందిని దాచేపల్లి పోలీసు స్టేషన్లో నిర్భందించారు. డీఎస్పీ ఓవరాక్షన్‌పై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. డీఎస్పీ చర్యకు నిరసనగా దాచేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. డీఎస్పీ నాగేశ్వరరావు చర్యపై నిరసనకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అప్పిరెడ్డి సంఘీభావం తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శిగా విజయ సాయిరెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయ సాయిరెడ్డి నియమితులయ్యారు. ఆయనకు గ్రామ కమిటీలు, యువత, మహిళ, విద్యార్థి, సామాజిక అనుసంధాన బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నియమించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రధాన కార్యదర్శులు గొల్ల బాబూరావు, సుజయకృష్ణ రంగారావు(ఉత్తరాంధ్ర), ధర్మాన ప్రసాదరావు(తూర్పు, పశ్చిమగోదావరి), మోపిదేవి వెంకటరమణ(కృష్ణా, గుంటూరు), జంగా కృష్ణమూర్తి(చిత్తూరు, వైఎస్సార్), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(ప్రకాశం), భూమన కరుణాకర్‌రెడ్డి(అనంతపురం, కర్నూలు), పీఎన్వీ ప్రసాద్(పరిపాలన). కార్యదర్శులు మేడపాటి వెంకట్, రాజీవ్ కృష్ణ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తలశిల రఘురాం, జక్కంపూడి రాజా, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ముదునూరి ప్రసాద్ రాజు, అనిల్ యాదవ్, మేకతోటి సుచరిత, వై నాగిరెడ్డి.