ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నిప్పులు చెరిగారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేస్తున్న హడావుడి విడ్డూరంగా ఉందని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇప్పడు నీకు ఇబ్బంది వస్తే ఇతరులు కావాలా’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే... డీజీపీతో తప్పుడు ప్రకటనలు చేయించారని అన్నారు. అవినీతిపై మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కుట్రలు కుతంత్రాలే ఉన్నాయని అన్నారు.