Backward Classes Welfare
-
బీజేపీతోనే బడుగుల అభ్యున్నతి: రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్
గన్‌ఫౌండ్రి(హైదరాబాద్): బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త సైతం అత్యున్నత పదవిని అందుకోవడం బీజేపీలోనే జరుగుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై శనివారం హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. యూపీ అభివృద్ధిపై గతంలో మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారని, తనతో పాటు వస్తే ప్రగతిని చూపిస్తానని చెప్పారు. యూపీలోని బుల్డోజర్ తరహా పాలన తెలంగాణలోనూ వస్తుందన్నారు. బీజేపీకి కులం, మత భేదాల్లేవని.. పేదరికమే ప్రాథమికం గా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో సగం జనాభా ముస్లింలేనని, అక్కడ వారికి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో పాత, కొత్త కలయికల వైరం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఈటల రాజేందర్, స్వామిగౌడ్, వివేక్‌వెంకటస్వామి వంటి వారు బీజేపీలో చేరారని వివరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు, మాజీ శాసన సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం ... లక్ష్మణ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా, సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, డాక్టర్ ఎన్. గౌతమ్ స్వాగతం పలికారు. శంషాబాద్, ఆరాంఘర్ చౌరస్తా, మెహదీపట్నం మీదుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రయాణించిన లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఎస్సీసెల్ ప్రొటోకాల్ కో–కన్వీనర్ కె. ప్రశాంత్, హైదరాబాద్ నాయకులు సూర్యప్రకాశ్, సందీప్‌యాదవ్ తదితరులున్నారు. -
వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్ను
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. విద్య, ఉపాధి రంగాల్లో కొండంత భరోసా ఇచ్చింది. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో బీసీల్లోని ఏబీసీడీఈ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు మరో పదేళ్లపాటు కొనసాగించనుంది. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగాల్లో గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇవ్వడంతో ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు మరింత మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ ఏడాది జూన్ నుంచి 2031 మే 31 వరకు (పదేళ్లపాటు) బీసీల్లోని ఏబీసీడీఈ కేటగిరిల్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కొనసాగుతాయి. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లో (బీసీల్లో) దాదాపు 142 కులాలున్నాయి. రాష్ట్ర జనాభాలో 49.55 శాతం మంది బీసీలు ఉంటారని అంచనా. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీలు విద్య, ఉద్యోగాల్లో పురోగమించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని బీసీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీల్లోనూ అభివృద్ది చెందిన (ఫార్వర్డ్) కులాలతోపాటు అత్యంత వెనుకబడిన (మోస్ట్ బ్యాక్వర్డ్) కులాలు కూడా ఉన్నాయి. బీసీల్లోని జనాభా ప్రాతిపదికగా ఏబీసీడీఈ విభాగాల వారీగా విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల కొనసాగింపుతో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా కులాలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందని బీసీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో బీసీల హక్కుల పరిరక్షణ మరో పదేళ్లు కొనసాగే అవకాశం ఏర్పడిందన్నారు. మంత్రివర్గం మంచి నిర్ణయం బీసీలకు చదువు, ఉద్యోగాల్లో పదేళ్లపాటు రిజర్వేషన్లు కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ఉద్యోగాల్లో బీసీలకు గరిష్ట వయో పరిమితి ఐదేళ్లు సడలించడం వల్ల వయో పరిమితి తీరిన బీసీ యువత కూడా ఐదేళ్లపాటు ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నించుకునే వీలు కలుగుతుంది. దీంతో ఎంతోమంది వెనుకబడిన తరగతులకు చెందిన యువతకు విద్య, ఉద్యోగాల్లో మేలు జరుగుతుంది. ఇదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో స్థానిక సంస్థల్లోనూ ఏబీసీడీఈ కేటగిరీల్లో బీసీ జనాభాకు రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. – కేశన శంకర్రావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హక్కుల పరిరక్షణకు గొప్ప నిర్ణయం బీసీలకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ గత 70 ఏళ్లుగా జరగకపోవడం వల్ల బీసీ కులాల్లో ఉన్న అణగారిన జాతులకు రాజ్యాంగ ఫలాలు అందని పరిస్థితి. ఇటువంటి స్థితిలో విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు ఉన్న హక్కులకు కాలదోషం పట్టకుండా వాటి పరిరక్షణకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నాను. బీసీ కులాల్లో ఏబీసీడీఈ వర్గీకరణ దేశంలో తొమ్మిది, పది రాష్ట్రాల్లో మినహా ఎక్కడా జరగలేదు. దీనివల్ల కొన్ని రాష్ట్రాల్లో బలమైన బీసీలు, అభివృద్ధి చెందని బలహీనమైన బీసీ వర్గాలకు చెందిన ఫలాలు అనుభవించే పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా బీసీల్లోని అట్టడుగు జాతులకు కూడా మేలు జరిగేలా విద్య, ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీఈ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు కొనసాగించే నిర్ణయం మంచి పరిణామం. దీనివల్ల బీసీల్లోని అట్టడుగున ఉన్న సంచార జాతుల వారికి సైతం సమాన అవకాశాలు దక్కేలా ఈ రిజర్వేషన్లు దోహదం చేస్తాయి. అటువంటి హక్కుల పరిరక్షణ దిశగా అడుగులు వేసిన రాష్ట్ర మంత్రివర్గానికి అభినందనలు తెలుపుకొంటున్నాం. – పాకా వెంకటసత్యనారాయణ, బీసీ హక్కుల పోరాట సమితి, రాష్ట్ర కన్వీనర్ -
56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
సాక్షి, తాడేపల్లి : బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కాగా, చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. (బీసీ కార్పొరేషన్లతో 728 మందికి పదవులు) ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లు 1. రజక: రంగన్న (అనంతపురం) 2. కురుబ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం) 3. తొగట : గడ్డం సునీత (అనంతపురం) 4. కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం) 5. వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు) 6. పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు) 7. ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు) 8. ఈడిగ : కె.శాంతి (చిత్తూరు) 9. గాండ్ల : భవానీ ప్రియ (తూ.గో) 10. పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో) 11. అగ్నికుల క్షత్రియ: బందన హరి (తూ.గో) 12. అయ్యారక: రాజేశ్వరం (తూ.గో) 13. షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు) 14. వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు) 15. కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు) 16. కృష్ణ బలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు) 17. యాదవ: హరీష్‌కుమార్ (కడప) 18. నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప) 19. పద్మశాలీ: విజయలక్ష్మి (కడప) 20.నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప) 21. సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప) 22. విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) 23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా) 24. వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా) 25. భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా) 26. వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు) 27. కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు) 28. వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు) 30. బెస్త : తెలుగు సుధారాణి (కర్నూలు) 31. ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు) 31. జంగం: ప్రసన్న (నెల్లూరు) 32. బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు) 33. ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) 34. చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం) 35. ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం) 36. దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం) 37. మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం) 38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం) 39. కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం) 40. రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం) 41. పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం) 42. కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం) 43. శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం) 44. మత్స్యకార : కోలా గురువులు (విశాఖ) 45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) 46.నగరాల: పిల్లా సుజాత (విశాఖ) 47. యాత: పి.సుజాత (విశాఖ) 48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) 49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం) 50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం) 51. శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) 52 .దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం) 53. సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో) 54. శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో) 55. అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో) 56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్ రావు (ప.గో) ఈ కార్పొరేషన్లకు గానూ 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు చేపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదవులు దక్కని కులాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా న్యాయం చేకూర్చింది. ► కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 30 వేలకు తగ్గకుండా జనాభా ఉంటే బాగుంటుందని భావించి.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి ఇవ్వనుంది. ► జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం బీసీ కార్పొరేషన్లకుంది. ఎవరి ష్యూరిటీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ష్యూరిటీతో బీసీలకు ఈ సంస్థ రుణాలిస్తుంది. -
బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది సీఎం జగన్ ఒక్కరే
-
‘బీసీలకు వెన్నుదన్నుగా సీఎం జగన్’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను తనకు ఇవ్వటం ఎంతో సంతోషం ఉందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు బీసీలందరికీ సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని ప్రాధాన్యత బీసీలకు సీఎం జగన్ ఇస్తున్నారని గుర్తుచేశారు. బీసీలకు ఏడాదిలోనే రూ. 22 వేల కోట్ల సంక్షేమ పధకాలిచ్చారని తెలిపారు. బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. (మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి) త్వరలో 52 కార్పొరేషన్లతో బీసీలకు గొప్ప మేలు జరగబోతోందని మంత్రి పేర్కొన్నారు. బీసీలకు నామినేటెడ్ పదవుల్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. బీసీలకు సీఎం జగన్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. బీసీలను చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభాకు తగ్గట్టుగా బీసీలకు పధకాలు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. ఇక బుధవారం శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బీసీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
త్వరలో ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం
సాక్షి, అమరావతి: నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ. 10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ప్రతి ఏడాది రూ. 10వేల చొప్పున అందిచాలని సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. -
110 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
-
‘110 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా బాబూ’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నిప్పులు చెరిగారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేస్తున్న హడావుడి విడ్డూరంగా ఉందని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇప్పడు నీకు ఇబ్బంది వస్తే ఇతరులు కావాలా’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే... డీజీపీతో తప్పుడు ప్రకటనలు చేయించారని అన్నారు. అవినీతిపై మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కుట్రలు కుతంత్రాలే ఉన్నాయని అన్నారు. 110 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? చంద్రబాబు బీసీ ద్రోహి కృష్ణమూర్తి వాఖ్యానించారు. బీసీలకు ఇచ్చిన 110 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే బాబు బీసీల వైపు చూస్తారని విమర్శలు గుప్పించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై ప్రేమే ఉంటే బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చుచేయలేదని ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్ ఏమైందని మండిపడ్డారు. వెనబడిన తరగతులకు ఇచ్చిన హామీలపై చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చే చంద్రబాబు నిజస్వరూపం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. -
బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం
హైదరాబాద్: వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన చరిత్ర బీజేపీ సొంతమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేతివృత్తులు, కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంటు, బీసీ సబ్‌ప్లాన్ అమలు కోసం నిరాహారదీక్షలు చేపట్టామని గుర్తు చేశారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రధాని మోడీని కలిసి కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. మరోవైపు హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కిషన్‌రెడ్డి సీఎంకు వినతిపత్రం సమర్పించారు. కిషన్‌రెడ్డితో ఓయూ విద్యార్థుల భేటీ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బుధవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని ఆయనను కోరారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలకు కొదవ ఉండదని ఆశపడ్డామని... ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో తమకు అవకాశాలు లేకుండా పోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.