ప్రతి మహిళను లక్షాధికారి చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం అని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైఎస్సార్ కలలు సాకారం చేయడం లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 11వ జిల్లాలో కొనసాగుతోందని, ప్రతిచోటా మహిళలు తమ సమస్యలు వైఎస్ జగన్‌కి మొరపెట్టుకుంటున్నారని తెలిపారు.