సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణామూర్తి బీ ఫారం అందుకున్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందచేశారు. ఈ నెల 25న ఆయన అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు శాసనమండలి ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
నోటిఫికేషన్ వివరాలు
నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 21, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, నామినేషన్ల పరిశీలన: మార్చి 1, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 5, ఎన్నికల పోలింగ్: మార్చి 12 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు), ఓట్ల లెక్కింపు: మార్చి 12 సాయంత్రం 5 గంటలకు, ఎన్నికల ప్రక్రియ ముగింపు: మార్చి 15
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
Published Thu, Feb 21 2019 2:46 PM | Last Updated on Thu, Feb 21 2019 3:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment