v vijayasai reddy
-
‘ఐక్యరాజ్య సమితి’లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సందర్శించారు. అంతకు ముందు.. జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, అహింస, ఐక్యత ప్రపంచానికి ఆదర్శమైందని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ కు భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి సభ్యులుగా వెళ్లిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ అవకాశంపై ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. This week, I am in New York as part of India’s Non-Official Delegation to the 79th Session of the UNGA. Engaging with global stakeholders on critical issues of peace and conflict, we have had the opportunity to interact with UN organizations and representatives from the Permanent… pic.twitter.com/2pMdbTiTvX— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024శాంతి, అంతర్యుద్ధాలు.. లాంటి ఎన్నో అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు సాధారణ అసెంబ్లీలో మాట్లాడతారు. నవంబర్ 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది.Offered floral tributes at the Mahatma Gandhi Bust on the United Nations Lawn during the 79th Session of the UNGA. A moment to honor the ideals of peace, nonviolence, and unity that continue to inspire the world. #UNGA79 #MahatmaGandhi #PeaceForAll #GlobalUnity pic.twitter.com/elppFhiAun— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 -
అది వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం: విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి కీలక నేతల వలసలు ఉండబోతున్నాయంటూ ఈ ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా తెగ హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఐ-టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు సైతం ఆ ప్రచారానికి కొన్ని పేర్లను జోడించి పోస్టులు వైరల్ చేస్తున్నాయి. అయితే..ఆ దుష్ప్రచారం తీవ్రంగా స్పందించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైఎస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.తాను ఎప్పటికీ వైస్సార్సీపీలోనే ఉంటానని.. మరో పార్టీలో చేరబోతున్నారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు. I wish to make it clear that I am a loyal, dedicated, and committed worker of the YSRCP. I will remain with YSRCP and work under the leadership of Sri @ysjagan Garu. I condemn the baseless speculation and misinformation being spread by a section of the media about me quitting…— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2024 -
తోడేళ్ల ముఠాతో సింహం తలపడుతోంది.. ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు.. ఏం జరిగినా సరే చంద్రబాబు వెంటనే తాను ఉంటానని జనసేన పవన్ కల్యాణ్ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో రానున్న ఎన్నికలపై వైఎస్సార్సీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘తోడేళ్ల ముఠాతో సింహం తలపడుతోంది. వచ్చే ఎన్నికలు దురాశ, ప్రజాసంక్షేమం మధ్య ఉండబోతున్నాయి. కుల రాజకీయాలు, ఐక్యత మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయి. అవకాశవాదం, నిజాయితీ మధ్య ఎన్నికలు జరుగుతాయి’ అని కామెంట్స్ చేశారు. The 2024 AP elections is going to be between TDP vs. YSRCP respectively which can be compared as a pack of wolves versus a lion, greed for power vs. public welfare, U-turn politics vs. credibility, instability vs. stability, opportunism vs. honesty, caste politics vs. unity,… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2023 మరోవైపు.. ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ఎప్పుడో చెప్పాం. ఆ మాటలు దత్తపుత్రుడు నిజం చేశాడు. టీడీపీ, జనసేన పొత్తును జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ, జనసేన బంగాళాఖాతంలో కలవడం ఖాయం అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే.. మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు -
చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్లో బైపీసీ చేయాలంటూ ఇటీవల ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మరోసారి తన అజ్జానాన్ని ప్రదర్శించి పరువును దిగజార్చుకోవడంతో ఇదెక్కడి విజనరీ అనుకోవడం ప్రజల వంతైతే.. తాజాగా బాబు ‘ఇంజినీరింగ్ బైపీసీ’ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో దానిని చమత్కరించారు. ‘చంద్రబాబు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీర్ కావొచ్చు . పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావొచ్చు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు - అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చు’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు గారు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీర్ కావచ్చు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చు, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు. అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చు. — Vijayasai Reddy V (@VSReddy_MP) August 21, 2023 -
చిరంజీవికి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్
సాక్షి, ఢిల్లీ: రాజకీయాలు, సినీ రంగంలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో.. ‘సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని తెలిపారు. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల… — Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2023 అలాంటి వారికి హాట్సాఫ్.. ఇదే సమయంలో.. ‘కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్’ అంటూ కామెంట్స్ చేశారు. కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి… — Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2023 ఇది కూడా చదవండి: చిరు లీక్స్ అందుకే.. ఆ భయంతోనే బీజేపీకి బ్రదర్స్ సరెండర్: కేఏ పాల్ సంచలన ఆరోపణలు -
ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి కౌంటర్
సాక్షి, ఢిల్లీ: ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ కౌంటరిచ్చారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు అంటూ ఎద్దేవా చేశారు. మీ నాన్నాగారు(ఎన్టీఆర్) మహానటులు.. మీరు(పురంధేశ్వరి) కాదనుకున్నాం అంటూ పొలిటికల్ పంచ్ ఇచ్చారు. కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ట్విట్టర్ ‘అమ్మా, పురందేశ్వరిగారు.. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్.. వదినది డైలాగ్! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్!. మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!’ అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే, 2013లో పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పురంధశ్వేరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘వెన్నుతట్టి ప్రొత్సహించిన నాయకురాలు, కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీకి, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, పురంధేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమ్మా, పురందేశ్వరిగారు...బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్... వదినది డైలాగ్! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ...మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్! మీ నాన్నగారు మహానటులు... మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన… pic.twitter.com/5ZJnpdxqWQ — Vijayasai Reddy V (@VSReddy_MP) July 30, 2023 ఇది కూడా చదవండి: ‘ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా ప్రచారం’ -
అమెరికాలో సైతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత
ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో (వాటిని కౌంటీలు అని పిలుస్తారు) దేశ జనాభాలో కేవలం 20 శాతం జనమే నివసిస్తున్నారు. పట్టణాలు, నగరాలకు దూరంగా ఉండే ఈ ప్రాంతాల్లో 80 శాతం ప్రజలకు అవసరమైనన్ని వైద్య సౌకర్యాలు లేవని అమెరికా కేంద్ర (ఫెడరల్ ) ప్రభుత్వం భావిస్తోంది. ఈ కౌంటీల్లో దేశ ప్రజల్లో 20% నివసిస్తున్నాగాని మొత్తం డాక్టర్లలో కేవలం పది శాతం మందే అక్కడ ప్రాక్టీసు చేస్తున్నారు. వైద్యసేవలు అరకొరగా అందిస్తున్నారు. అంటే డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా పట్టణ, నగర ప్రాంతాల్లోనే నివసిస్తూ వైద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఇష్టపడతారనేది జగమెరిగిన సత్యం. 2010–2017 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ కౌంటీలలో ప్రాథమిక వైద్య సేవలందించే డాక్టర్ల సంఖ్య అక్కడి జనాభాతో పోల్చితే బాగా తగ్గిపోయిందని అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ స్కాలర్లు గత ఏడాది చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సర్వేకు సంబంధించిన ఏడేళ్ల కాలంలో గ్రామీణ కౌంటీల్లో ప్రాథమిక వైద్యుల సంఖ్య తగ్గిపోగా, నగర (మెట్రోపాలిటన్ ఏరియాలు) ప్రాంతాల్లో డాక్టర్ల సంఖ్య పెరిగింది. మొత్తంమీద అమెరికాలో డాక్లర్ల సంఖ్య అవసరమైన స్థాయిలో లేకపోవడం ఒకటైతే, కొన్ని ప్రాంతాల్లో వైద్యులు మరీ తక్కువగా ఉండడం పెద్ద లోపంగా ప్రభుత్వాధికారులు గుర్తించారు. నగర, పట్టణ ప్రాంతాల ప్రజలతో పోల్చితే గ్రామీణ కౌంటీల్లోని జనానికి గుండె జబ్బులు, కేన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, అన్ని రకాల స్ట్రోకులు ఎక్కువ పీడిస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. అగ్రరాజ్యానికి సంబంధించిన ఈ సమస్య గురించి ఇక్కడ వివరించడానికి కారణాలు లేకపోలేదు. ఇండియాలో పల్లె ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య బాగా తక్కువే, ఏపీలో కొత్త పరిష్కారం వైద్య కళాశాలల సంఖ్య, డాక్టర్ల సంఖ్య ఈమధ్యనే పెరుగున్న భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు తగినంత మంది వైద్యులు అందుబాటులో లేక కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజారోగ్యానికి మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ప్రాధాన్యం ఇచ్చారు దివంగత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. 2004 నుంచి 2009 వరకూ ఐదేళ్లకు పైగా సాగిన ఆయన పాలనా కాలంలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్య సౌకర్యాల కోసం విశేష కృషి చేశారు వైఎస్ గారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల పోస్టులు పెద్ద సంఖ్యలో ఆయన ప్రభుత్వం భర్తీ చేసింది. 108 వంటి అత్యవసర వైద్య సేవలతో పాటు పేదలు, బడుగు వర్గాల కోసం ఉచిత వైద్యానికి ఆరోగ్య శ్రీ పథకం రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు. నవ్యాంధ్రలో నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజన్న మార్గంలో పయనిస్తూ గ్రామీణ ప్రాంతాల వైద్య, ఆరోగ్య అవసరాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తోంది. అనేక వ్యాధులను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వీటన్నింటికీ తోడు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యులు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండేలా చేయడానికి కొత్తగా ‘ఫ్యామిలీ డాక్టర్’ పథకం ప్రవేశపెట్టింది. ఈ వినూత్న వైద్య–ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలయ్యే నాటికి పల్లెల్లో ప్రజలందరికీ డాక్టర్లు పిలిస్తే పలికే మంచి రోజులొస్తాయి. 10,032 డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్కుల ద్వారా పనిచేసే వైద్యుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజారోగ్య సంరక్షణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆంధ్ర రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. వైద్యులే స్వయంగా పల్లె ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జనం ఆరోగ్యం గురించి వాకబు చేసి వైద్య సహాయం అందిస్తే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలుగునాట సాకారమౌతుంది. అప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలు సైతం ఏపీ వచ్చి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
ఏపీలో కులాల పోరు కాదు, వర్గ పోరాటమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది కులాల మధ్య పోరు కాదు. ఇది ధనిక, పేద వర్గాల మధ్య పోరాటం అనే వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం కొందరికి విస్మయం కలిగించింది. చాలా మందికి మింగుడు పడడం లేదు. గడచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని పేదలు, దిగువ మధ్య తరగతి, ఇంకా ప్రభుత్వ సాయం, ఆసరా అవసరమైన అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అన్ని ఆర్థిక ఇబ్బందులనూ అధిగమించి, ఎంతో శ్రమకోర్చి సకల జనుల కల్యాణమే పరమార్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఐదున్నర కోట్ల జనసంఖ్య ఉన్న రాష్ట్రంలో ఏ కుటుంబమూ ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యతో బాధపడకుండా చూడడానికి ప్రభుత్వమూ, పాలకపక్షమూ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పి మరీ వేలాది కోట్ల రూపాయలు ఏపీకి మంజూరు చేయించి, బడుగు బలహీనవర్గాల ఆయురారోగ్యాల కోసం ఆ ధనాన్ని రాష్ట్ర సర్కారు ఖర్చుచేస్తోంది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఇంత మంచి శుభకార్యాలు జరగుతుంటే కులాల మధ్య కుమ్ములాటలు ఉన్నట్టు కొందరు చాలా కాలంగా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాదాపు మూడున్నర సంవత్సరాలు ఓపిక పట్టిన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ కిందటేడాది డిసెంబర్ నెలలోనే ఈ విషయంపై సూటిగా అర్ధమయ్యే మాటలతో స్పష్టత ఇచ్చారు. అంతరాలు తొలగాలి, బడుగులు బాగుపడాలి 2023 డిసెంబర్ 16న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ అనే ప్రజా సంపర్క కార్యక్రమం తీరుతెన్నెలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన మంత్రులు, పార్టీ శాసనసభ్యుల సమావేశంలో సీఎం జగన్ ఈ విషయం గురించి మాట్లాడారు. ‘రాష్ట్రంలో జరుగుతున్నది కుల పోరాటం కాదు, వర్గ పోరాటం. ఇది ధనికులు, పేదలకూ మధ్య యుద్ధం. ఈ సందర్భంలో పేదలకు న్యాయం జరిగేలా చూడడం మన బాధ్యత. మనం ఈ పోరాటంలో పేదల పక్షానే నిలబడాలి’ అని ముఖ్యమంత్రి చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ధనికులకు, పేదలకు మధ్య పోరు అంటే ఈ రెండు వర్గాల మధ్య హింసాత్మక భౌతిక పోరాటం కాదు. తమ సంపద మరింత పెంచుకోవడానికి సంపన్నులు అక్రమ మార్గంలో పేదలను దోపిడీ చేయడానికి ప్రయత్నించినప్పుడు, బడుగులు వారిని ప్రతిఘటించడం అని గ్రహించాలి. ఈ ప్రతిఘటనలో పేదల పక్షాన పాలకపక్షమైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాయకులు, కార్యకర్తలు ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశం. ఈ ఏడాది జనవరి మొదటి వారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తూ.. ‘రాష్ట్రంలో నేడు జరుతున్నది పేదలకూ, పెట్టుబడిదారులకు మధ్య వర్గపోరాటం. అంతేగాని కులాల కుమ్ములాట కాదు. పేద ప్రజలను దోచుకోవడానికి సిద్ధమైన వారితో నేను పోరాడుతున్నా. ఈ పోరాటంలో నాకు బలహీనవర్గాలు, దేవుడి తోడ్పాటు అవసరం’ అని స్పష్టంచేశారు. చదువు+సంక్షేమం=అభివృద్ధి ఇంగ్లీష్ మీడియంలో బోధన ద్వారా పేదలకు మేలు చేయడం ఇష్టంలేని ధనికవర్గాలతో తమ పార్టీ పోరాడుతోందని కూడా ఆయన తేల్చిచెప్పారు ఈ బహిరంగ సభలో. ఇంకా, మే నెల 12 శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ప్రజా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నేను వర్గ పోరాటంలో నిమగ్నమయ్యాను. నా పోరు పేదల సంక్షేమం కోసమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ధనిక, పెత్తందారీ వర్గాలు నాపై పోరు సలుపుతున్నారు. పేదలకు న్యాయం చేసే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ–పేదల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ) పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఈ వర్గాలు నాతో తలపడుతున్నాయి’ అంటూ సీఎం జగన్ వివరించారు. పేదలకు ఎలాంటి లోపాలు లేకుండా నేరుగా నగదు బదిలీ ద్వారా, ఇతరత్రా మేలు చేసే పథకాలను అడ్డుకునేవారు స్వార్ధపరులైన ధనికులనీ, వారు తమ పోకడల ద్వారా పేదలతో యుద్ధం చేస్తున్నారని అంటూ ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చెప్పినా.. కొందరు మాత్రం వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆరు నెలల కాలంలో మూడు వేర్వేరు సందర్భాల్లో జగన్ వర్గపోరు అనే మాట వాడటంతో సామాన్య ప్రజానీకానికి మాత్రం దాని భావం చక్కగా బోధపడింది. - విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
‘భారత్ కోరుకునేది పాకిస్తాన్లో శాంతి, సుస్థిరత’
‘పొరుగు దేశాలు చల్లగా ఉండాలి. వాటితో మనకు సుహృద్భావ సంబంధాలు ఉండాలి’ అనేది భారత విదేశాంగ విధానం ముఖ్యసూత్రం. ఇప్పుడు పశ్చిమాన సరిహద్దు దేశం పాకిస్తాన్ రాజకీయ అశాంతిని చుట్టుముట్టే పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలిటరీ రేంజర్లు దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని హైకోర్టు ముందు అరెస్టు చేయడంతో సంక్షోభం తీవ్రమౌతోంది. కిందటేడాది ఏప్రిల్ మొదటివారం పాక్ కేంద్ర చట్టసభ నేషనల్ అసెంబ్లీలో నాటి ప్రధాని ఇమ్రాన్ మెజారిటీ కోల్పోవడంతో మన దాయాది దేశంలో రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి షెహబాజ్ నాయకత్వాన రెండు ప్రధాన పార్టీల (పాకిస్తాన్ ముస్లింలీగ్–ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ)తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాది కాలంగా అధికారంలో ఉన్న ప్రస్తుత పాక్ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. 2022 ఆగస్ట్ మాసంలో వచ్చిన వరదలు దేశంలో మున్నెన్నడూ కనీవినీ ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఈ వరదలు దేశంలో తీవ్ర ఆహార కొరత సృష్టించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఆహార ధాన్యాల కొరత.. ఇటీవలి రంజాన్ మాసంలో ఆహార ధాన్యాల కొరత, ఆర్థిక సమస్యలు ప్రజలను కుంగదీశాయి. ఈ నేపథ్యంలో పాత కేసులకు సంబంధించి మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్షం పాకిస్తాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) నేతను అరెస్టు చేయడంతో పాక్ ప్రధాన నగరాలు భగ్గుమన్నాయి. జాతీయ రాజకీయాల్లో పాక్ ఆర్మీ తెరవెనుక నుంచి క్రియాశీల పాత్ర పోషించడం జగమెరిగిన సత్యం. కొత్త పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ ఆరోపణలు, ఆర్మీతో విభేదాలు దేశ రాజకీయాలను మరిన్ని చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటి అరెస్టు తర్వాత సర్వశక్తిమంతమైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల కార్యాలయాలపై ఇమ్రాన్ అనుచరులు, అభిమానులు చేసిన దాడులు పాక్ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. అసలే ఆర్థిక, సామాజిక సమస్యలు తీవ్రమైన సమయంలో మాజీ ప్రధాని, మంచి జనాకర్షణ శక్తి ఉన్న ఇమ్రాన్ అరెస్టు పాకిస్తాన్‌ను ‘అగ్నిగుండం’లోకి నెట్టివేసే ప్రమాదం ఉందని భారత రక్షణ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1947 నుంచీ నాలుగు యుద్ధాలు.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మధ్య నాలుగు (1947–48, 1965, 1971, 1999) యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల రెండు దేశాలకూ ఆర్థికంగా నష్టమే జరిగింది. అయినా, ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌తో శాశ్వత శాంతి కోసమే భారత్ ప్రయత్నిస్తోంది. 1947 ఆగస్ట్ 14 వరకూ ఒకే దేశంగా ఉన్న ఈ రెండు దక్షిణాసియా దేశాలు కశ్మీర్ కారణంగా 20వ శతాబ్దంలో పోరుకు తలపడడం దురదృష్టకర పరిణామం. మతం ఆధారంగా జరిగిన దేశ విభజన పర్యవసానాల వల్ల ఇప్పటికీ రెండు దేశాలూ మానసికంగా బాధపడుతూనే ఉన్నాయి. 1947కు ముందు అంటే బ్రిటిష్ ఇండియాలోని అవిభక్త పంజాబ్‌లో జన్మించిన (ఈ ప్రాంతాలు ఇప్పుడు పాక్ పంజాబ్‌లో చేరి ఉన్నాయి) ముగ్గురు నేతలు గుల్జారీలాల్ నందా, ఇందర్ కుమార్ గుజ్రాల్, డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రధానులుగా పనిచేశారు. రెండు సర్వసత్తాక దేశాలుగా విడిపోయి 75 ఏళ్లు దాటినాగాని భారత్, పాక్ దేశాల మధ్య దౌత్య, సాంస్కృతిక, ఇతర సంబధాలు కొనసాగుతున్నాయి. వేలాది సంవత్సరాల అనుబంధం ఉన్న పాకిస్తాన్ ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంటేనే దానికి ఆనుకుని ఉన్న అతిపెద్ద సరిహద్దుదేశం ఇండియాకు కూడా మంచిదని భారత ప్రజలు భావిస్తున్నారు. భూభాగంలో, జనాభాలో పాకిస్తాన్ కన్నా చాలా పెద్దదైన భారత దేశం పెద్ద మనుసుతో పాకిస్తాన్ ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి త్వరగా కోలుకుని బయటపడాలని ఆశిస్తోంది. 22 కోట్ల ప్రజలున్న పాక్‌లో శాంతి, సుస్థిరత 142 కోట్ల ప్రజలు నివసించే భారతదేశానికి కొండంత బలం. పొరుగు ఇంట మంటలు ఎప్పుడూ మన ఇంటికి క్షేమం కాదని నమ్మే భారత ప్రజల విశ్వాసం ఎంతో విలువైనది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. ఇది కూడా చదవండి: సోరెన్‌తో నితీశ్ భేటీ -
నిరంతరంగా జాబ్‌మేళాలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున జాబ్‌మేళాలు కొనసాగుతాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటుచేసిన రెండ్రోజుల వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జాబ్‌మేళా నిరంతర ప్రక్రియని, అవకాశం ఉన్న ప్రతిచోటా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని చెప్పారు. మూడు విడతల్లో 40,243 మందికి.. తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో 30 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఏఎన్‌యూలో నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా 10,480 మంది ఉద్యోగాలు పొందారన్నారు. మూడు జాబ్‌మేళాల్లో మొత్తం 40,243 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మరో 2వేల మందిని రెండోరౌండ్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారన్నారు. మూడు విడతల్లో 540 కంపెనీల రాక మూడు విడతల జాబ్‌మేళాల్లో దాదాపు 540 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించారని.. వారందరికీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగో జాబ్‌మేళాను జూన్ మొదటి వారంలో వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో నిర్వహిస్తామని తెలిపారు. దీంతో మొదటి దశ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత రెండో దశను ప్రారంభిస్తామన్నారు. గరిష్టంగా రూ.11లక్షల వార్షిక ప్యాకేజీ జాబ్‌మేళాలపై విపక్షంతో పాటు, ఒక వర్గం మీడియా విమర్శలు చేస్తున్నాయని, అవన్నీ నైతిక విలువల్లేని వారి విమర్శలుగా విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. జాబ్‌మేళాల్లో చిన్న ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారన్న విమర్శలో వాస్తవం లేదన్నారు. రూ.15 వేల నుంచి రూ.లక్ష దాకా నెలసరి వేతనంతో ఉద్యోగాలు కల్పించామని, గరిష్టంగా రూ.11 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం లభించిందన్నారు. కార్యక్రమంలో మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రోశయ్య, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సోషల్ జస్టిస్ సలహాదారు జూపూడి ప్రభాకర్, సీఎం సలహాదారు ధనుంజయరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వీసీ రాజశేఖర్ పాల్గొన్నారు. -
AP: జాబ్‌మేళాకు 210 కంపెనీలు
ఏఎన్‌యూ/పాత గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో శని, ఆదివారాల్లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 26,300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని వివరించారు. మేళాలో పాల్గొనేందుకు ‘వైఎస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కామ్’ వెబ్సైట్లో ఇప్పటికే 97 వేలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. యూనివర్సిటీలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారికి ఈ జాబ్‌మేళాలో అవకాశం కల్పిస్తున్నామన్నారు.అర్హతలను బట్టి ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలకైనా హాజరుకావచ్చని చెప్పారు. గత రెండు జాబ్‌మేళాల్లో 30,473 మందికి ఉద్యోగాలు ప్రభుత్వపరంగా ఇస్తున్న ఉద్యోగాలతోపాటు అర్హత, ఆసక్తి ఉన్నవారికి ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో 347 కంపెనీలు పాల్గొని మొత్తం 30,473 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పారు. జాబ్‌మేళాల్లో ఉద్యోగాలు రానివారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి సంబంధిత శిక్షణ ఇచ్చి మళ్లీ జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేవరకు జాబ్‌మేళాల నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. ఏఎన్‌యూలో జాబ్‌మేళా కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ముందుగా యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ వద్ద క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్లో స్కాన్ చేయాలని చెప్పారు. స్కాన్ చేయగానే.. ఏ బ్లాక్‌లో ఏయే ఉద్యోగాల ఇంటర్వ్యూలు అన్న వివరాలు తెలుస్తాయన్నారు. డైరెక్షన్ ఆప్షన్ నొక్కితే అక్కడికి ఎలా వెళ్లాలో తెలుస్తుందని, బ్లాక్ ఇన్చార్జి అన్నది ప్రెస్చేస్తే ఆయన పేరు, ఫోన్ నంబరు వివరాలు, కంపెనీల జాబితాను ప్రెస్చేస్తే ఏ బ్లాక్‌లో ఏ కంపెనీల ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నది తెలుస్తుందని వివరించారు. -
ధన్య మాత వైఎస్ విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మనిచ్చిన ధన్య మాత వైఎస్ విజయమ్మ అని అన్నారు. ‘వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/Iy64wWb5vc — Vijayasai Reddy V (@VSReddy_MP) April 19, 2022 -
ప్రధానితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
YSRCP MP Meets PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారాయన. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతేకాదు దేశ చరిత్రలో తొలిసారిగా మన విద్యా రంగానికి బడ్జెట్ గ్రాంట్ రూ. 1 లక్ష కోట్లు వచ్చిందని, దీని అర్థం దేశంలో చాలా కాలంగా ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య యొక్క నాణ్యతను పెంచడమే అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ ద్వారా తెలిపారు. Met honourable PM Shri @NarendraModi ji today in Delhi and discussed various issues pertaining to Andhra Pradesh. pic.twitter.com/fobTH656sN — Vijayasai Reddy V (@VSReddy_MP) March 24, 2022 -
అరకు లోయ పర్యాటకులకు రైల్వే శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికా విరాళంగా అందించిన 200 ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్లను, దేశంలోని 29 కేంద్ర ప్రభుత్వాస్పత్రులు, ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అందజేసినట్లు ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వెల్లడించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌కు 5 అమెరికన్ వెంటిలేటర్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బదులుగా మంత్రి అశ్వినీ కుమార్ సమాధానమిచ్చారు.(చదవండి: 'రూ. 3,805 కోట్లు వెంటనే విడుదల చేయాలి') ప్రమాదాలు నివారించాలి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా విజయసాయిరెడ్డి సభలో మాట్లాడుతూ.. విమాన ప్రమాదాలను నివారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. టేబుల్ టాప్ రన్‌వే కలిగిన విమానాశ్రయాలలో భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కేరళలోని కోళికోడ్, కర్ణాటకలోని మంగళూరు వంటి టేబుల్ టాప్ విమానాశ్రయాలలో జరిగిన ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,627 కోట్ల మేర జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సభలో స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు జవాబు ఇచ్చారు. అరకు లోయ పర్యాటకులకు రైల్వే శాఖ శుభవార్త అరకు లోయ అందాలను వీక్షించాలని ఉవ్విళ్లూరే పర్యాటకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి రైల్వే మంత్రి లేఖ రాశారు. -
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయని, దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వ్యవసాయ, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై స్థాయీ సంఘం జరిపిన అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి బుధవారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య ఉత్పాదనల ఎగుమతుల ప్రోత్సాహానికి నివేదికలో స్థాయీ సంఘం ప్రభుత్వానికి చేసిన కొన్ని ప్రధానమైన సిఫార్సులను వివరించారు. ‘వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య శాఖ తక్షణమే నడుం బిగించాలి. వ్యవసాయోత్పత్తుల సప్లై చైన్ సామర్థ్యాన్ని పటిష్టం చేయాలి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి. వ్యవసాయోత్పత్తులకు అత్యధిక విలువ చేకూరేలా చర్యలు తీసుకోవాలి..’అని కమిటీ సిఫార్సు చేసినట్లు చైర్మన్ తెలిపారు. శాస్త్రీయ పద్దతుల ద్వారా రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదనలు సాధించేందుకు ప్రభుత్వం వారికి తగిన మద్ధతు, ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను గణనీయంగా వృద్ధి చేయవచ్చునని కమిటీ సిఫార్సు చేసింది. ఈజిప్టు, మెక్సికో, మలేíసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతుల కోసం మార్కెట్లను అన్వేషించాలని కోరింది. మత్స్య ఉత్పాదనల ఎగుమతులపై దృష్టి సారించాలి... 2010–11 నుంచి 2014–15 వరకు మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో కనిపించిన వృద్ధి 2015–16 నుంచి క్షీణించడం మొదలైంది. ఈ పరిస్థితిని అధిగమించి తిరిగి మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో వృద్ధి సాధించడానికి కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ‘చేపలు, రొయ్యల సాగులో మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగాన్ని ఆరికట్టేందుకు శాఖాపరమైన నియంత్రణ, అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు యాంటీబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో అందుబాటులోకి తీసుకురావాలి..’అని కమిటీ సిఫార్సు చేసింది. ‘మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాలి. ట్యూనా చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో ట్యూనా చేపల వాటా పెంచడానికి చర్యలు తీసుకోవాలి’అని వాణిజ్య శాఖకు కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీతో సంప్రదించి పథకాన్ని రూపొందించాలని కమిటీ సూచించింది. పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018–19 గణాంకాల ప్రకారం) సుమారు రూ. 6 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. పొగాకు పరిశోధనకు అరకొర నిధుల కేటాయింపు కారణంగా ప్రపంచ మార్కెట్లలో దేశీయ పొగాకు ఉత్పాదనలు పోటీకి నిలవలేకపోతున్నాయి. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా పొగాకు పండించడానికి పర్యావరణ ప్రతికూలతలను తట్టుకోగల అత్యత్తుమ నాణ్యత, అధిక దిగుబడి సాధించగల వెరైటీలను సాగు చేయడానికి పొగాకు పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. అందుకు పొగాకు పరిశోధనకు అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి. 2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. దీని వల్ల మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని చెప్పారు. -
మాలోకం చిన్న మెదడు చితికినట్లుంది
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. "చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది" అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. (పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన ట్రైలర్‌కే.. కలుగులో దాక్కున్న ఎలుకలా బాబు హైదరాబాద్‌లో గడుపుతున్నారని విమర్శిస్తూ మరో ట్వీట్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతారోనని ఎద్దేవా చేశారు. అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయారన్నారు. ఈ దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందేనని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. (దొంగే దొంగా.. దొంగా అంటున్నాడు!) -
‘ఆ విద్యార్ధులను తీసుకురండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా విమానాశ్రయంలో మూడు రోజులుగా చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది మెడికల్ విద్యార్ధులను తక్షణమే స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. తిండి, నీరు లేకుండా కటిక నేలపై నిద్రిస్తూ మనీలా ఎయిర్‌పోర్ట్‌లో తెలుగు విద్యార్ధులు పడుతున్న కష్టాలను ఆయన మంత్రికి వివరించారు. ఈ విద్యార్ధులంతా మనీలాలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మనీలాలో విద్యా సంస్థలు మూసివేయడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులంతా మూడు రోజుల క్రితమే మనీలా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే మనీలా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు కూడా స్తంభించిపోవడంతో విద్యార్దులు దిక్కుతోచని స్థితిలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. ఎయిర్పోర్ట్ మూసివేయడంతో తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేని దుర్భరమైన పరిస్థితుల్లో సహాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. రవాణా వ్యవస్థ యావత్తు నిలిచిపోవడంతో వారు ఎయిర్పోర్ట్ నుంచి తమ హాస్టళ్ళకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మనీలా ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుబడిపోయిన 70 మంది విద్యార్ధులలో 36 మంది యువతులు ఉన్నారని, టాయిలెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారని మంత్రికి తెలియచేశారు. విద్యార్ధులు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని విద్యార్ధులు వాపోతున్నట్లు మంత్రి జైశంకర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మనీలాలో చిక్కుబడిపోయిన విద్యార్ధులను స్వదేశానికి రప్పించాలని విజయసాయి రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
వనధన్ కేంద్రాల కోసం ఏపీకి 10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో 21 వనధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 10.64 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు గిరిజన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) ఆధ్వర్యంలో వనధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల్లో సేకరించే చిన్నపాటి అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా అధిక విలువ చేకూర్చేలా వనధన్ కేంద్రాలు పని చేస్తాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మొత్తం 211 వనధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. (చదవండి : ‘చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనివ్వండి’) 1185 కోట్లతో ఆర్గానిక్ పత్తి సాగుకు ప్రోత్సాహం ఆర్గానిక్ పత్తి సాగు ప్రోత్సాహకం కోసం 1185 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు జౌళి శాఖ మంత్రి స్పృతి ఇరానీ రాజ్యసభలో వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ సాంప్రదాయక, బీటీ పత్తి విత్తనాల సాగుకంటే కూడా సగటున ఆర్గానిక్ పత్తి సాగుకయ్యే వ్యయం తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. దేశీయ పత్తి విత్తనాల వాడకంతోపాటు ఆర్గానిక్ ఎరువుల వాడకం వలన సాగు వ్యయం బాగా తగ్గుతుందని తెలిపారు. పరంపరగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) పథకం కింద సర్టిఫైడ్ ఆర్గానిక్ పత్తి ఉత్పాదనలకు మంచి రేటు కల్పించేందుకు రైతులతో వినియోగదారులను అనుసంధానించడం జరుగుతుంది. ఆర్గానిక్ పత్తి సాగుకు అవసరమైన ఇన్పుట్లు, విత్తనాలు, సర్టిఫికేషన్ నుంచి పంట సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్ వంటి ప్రక్రియలను ఈ పథకం కింద చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రధానంగా ఎగుమతులపై దృష్టి పెట్టి ఆర్గానిక్ పత్తి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద అయిదేళ్ళ పాటు ఆర్గానిక్ పత్తి సాగు చేసే రైతుకు హెక్టారుకు ఏటా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ మొత్తంలో 31 వేల రూపాయలను నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్‌కు బదలీ చేయడం జరుగుతంది. ఇందుకోసం 2018-19, 2010-21 సంవత్సరాలకు గాను 4 లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ పత్తి సాగు కోసం 1185 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. -
‘అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నం-అరకులోయ మధ్య నడిచే పర్యాటక రైలుకు అదనంగా ఐదు విస్టాడోమ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బుధవారం ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్) ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. బీచ్‌లు, గుహలు, జలపాతాలు, ఘాట్లతో విశాఖపట్నం జిల్లా పర్యాటకుల స్వర్గధామంగా విరాజిల్లుతోందని అన్నారు. ‘తూర్పు కోస్తాకు మణిహారంగా విశాఖ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో పర్యాటకానికి విశేష ఆకర్షణగా నిలిచిన వాటిలో విస్టాడోమ్ కోచ్ ఒకటి. ప్రస్తుతం పర్యాటక రైలుగా పరిగణించే విశాఖపట్నం-అరకు లోయ రైలుకు అనుసంధానించిన ఈ విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణం పట్ల పర్యాటకులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు’ ఆయన అన్నారు. తూర్పు కనుమల్లో విస్తరించిన సువిశాలమైన ఆకుపచ్చని అడవులు, లోయలు, టన్నెల్స్ వంటి ప్రకృతి దృశ్యాలను పర్యాటకులు నిలువెత్తు అద్దాల గుండా నలుదిక్కులా వీక్షించే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన విస్టాడోమ్ కోచ్ ప్రారంభించిన రోజు నుంచే పర్యాటకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నట్లు ఆయన చెప్పారు. అమిత ప్రజాదరణ పొందిన విస్టాడోమ్ కోచ్‌కు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడినప్పటికీ రైలులో కేవలం ఒకే ఒక కోచ్ అందుబాటులో ఉండటం పర్యాటకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని అన్నారు. ‘విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణానికి టిక్కెట్ల కోసం ప్రతి రోజు సుదీర్ఘమైన వెయిటింగ్ లిస్ట్ ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం-అరకులోయ రైలుకు కనీసం మరో అయిదు విస్టాడోమ్ కోచ్‌లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి పర్యాటకుల అవసరాన్ని తీర్చాలి. అదనంగా ఏర్పాటు చేసే విస్టాడోమ్ కోచ్‌ల వలన విశాఖపట్నంలో పర్యాటక రంగానికి మరింత ఊపు ఇచ్చినట్లువుతుంది. అలాగే రైల్వేలకు కూడా దండిగా ఆదాయం లభిస్తుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ కారణాల దృష్ట్యా అరకు రైలుకు అదనంగా అయిదు విస్టాడోమ్ కోచ్‌ల ఏర్పాటు కోసం తగిన చర్యలు చేపట్టవలసిందిగా రైల్వే మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’
సాక్షి, అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేశ్‌కు నోటి దూల ఎక్కువైందని, అతన్ని కరోనా క్వారంటైన్లో పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. 'మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : ‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం) -
అటల్ భూజల్ యోజనలో ఏపీ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: అటల్ భూజల్ యోజన కింద ఎంపిక చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం రాజ్యసభలో రాతపూర్వకంగా జవాబిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాల నిర్వహణ కోసం రూ.6,000 కోట్ల ఖర్చుతో ప్రతిపాదించిన ఈ పథకం గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆ జిల్లాల్లో 11.50 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు(పీఎన్జీఆర్బీ) కాకినాడ–విజయవాడ–నెల్లూరు గ్యాస్ పైప్‌లైన్ పనులను ఐఎంసీ లిమిటెడ్‌కు అప్పగించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభకు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు ఆయన సోమవారం సమాధానం ఇచ్చారు. ఈ నాలుగు జిల్లాల్లో కనీసంగా 11.50 లక్షల పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు. ఏపీకి రూ.387 కోట్లు విడుదల చేశాం అక్టోబర్–నవంబర్ 2019 కాలానికి ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్టీ పరిహారం కింద రూ. 682 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.387 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. జిల్లా సహకార బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులు 11.85 శాతం జిల్లా సహకార బ్యాంకుల్లో 2019 మార్చి చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తులుగా మారినవి మొత్తం రుణాల్లో 11.85 శాతంగా ఉన్నాయని, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, బెల్లాన చంద్రశేఖర్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. డిమాండ్‌కు సరిపడా ఐరన్ ఓర్ ఉంది దేశంలో స్టీలు పరిశ్రమ అవసరాలకు సరిపడా ఐరన్ ఓర్ ఉత్పత్తి అవుతోందని, అయితే మరో ముడి సరుకు అయిన కోకింగ్ కోల్ నిల్వలు తగినంత లేనందున దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీ దిశ చట్టం త్వరగా ఆమోదం పొందేలా చూడాలి ఏపీ దిశ చట్టం–2019 త్వరితగతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగ గీతావిశ్వనాథ్ కేంద్రాన్ని కోరారు. సోమవారం ఆమె జీరోఅవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ఇటీవల మహిళలపై అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చినట్టు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, సుశిక్షితులైన సిబ్బందిని అందుబాటులో ఉంచడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. -
‘పెప్పర్ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదిలారు’
సాక్షి, అమరావతి: అమరావతి భూముల కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న నాయకులు, మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకుంటున్నాడని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లె పెప్పర్ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదిలాడన్నారు. వీరంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతీదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయటపడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడు’. ‘అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా 40 ఏళ్ల అనుభవం అంటే? ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి’ అంటూ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లలో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్‌పై దుమ్మెత్తిపోశారు. ఇక చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ దురాగతాలను విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు తన అధికారిక ట్విటర్లో ఎండగడుతున్న విషయం తెలిసిందే. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నాడు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలాడు. వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే. — Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2020 పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడు. — Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2020 చదవండి: 'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?' చంద్రబాబు పన్నాగంతోనే దాడి ఇదీ.. నా కల -
‘ఆ విషయాన్ని పత్రికలు చిన్నదిగా చేసి రాశాయి’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న కొందరు దోపిడీదారులు ఇతరులపై నిందలు మోపుతూ, మరోవైపు నీతి సూక్తులు వల్లిస్తున్నారని విమర్శించారు.‘దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన పరమాన్నం ఇంకా చల్లారనే లేదని నీతి సూక్తులు వల్లిస్తుంటారు’ అని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించిందన్న విషయాన్ని ఎల్లోమీడియా చిన్నదిగా చేసి రాశాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తారా అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు బ్యాచ్ ఇప్పుడు కిక్కురుమనడం లేదని ఎద్దేవా చేశారు. ‘ ఏబీవీ సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. డిజిపి స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తారా అని గగ్గోలు పెట్టిన బాబు బ్యాచ్ కిక్కురుమనడం లేదు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా తమ జాతి రత్నాన్ని వెనకేసుకొచ్చింది. స్టే దొరకలేదనే విషయాన్ని పత్రికల్లో చిన్నదిగా చేసి రాశాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
‘జీవీఎల్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణం’
సాక్షి, అమరావతి : రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా.. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని విమర్శించారు. ‘రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్లో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌పై దుష్ర్పచారానికి ఒడిగట్టడం దారుణం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. లోకేశ్ తర్వాత ఆయనే చక్రం తిప్పారు ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గత ఐదేళ్లలో అక్రమ పద్దతిలో రూ.వేలకోట్ల ఆస్తులను పోగేసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త. బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం) -
ఆ ఘనత ప్రధాని మోదీదే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కియా మోటార్స్ తమిళనాడుకు తరలివెళ్లే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొట్టమొదటిసారి జోక్యం చేసుకొని.. దానిని ఏపీకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. కియా మోటార్స్ ఏపీకి రావడంలో చంద్రబాబునాయుడు కృషి ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. కియా మోటార్స్ కు చంద్రబాబు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. కియా మోటార్స్ ఎక్కడికో తరలిపోతోందని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం తగదని, కియా మోటార్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఏపీలో మరో ప్లాంట్ నిర్మాణానికి కియా మోటార్ ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు. కియా మోటార్స్‌పై పార్లమెంట్ లోపల, బయట టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ దుష్ప్రచారానికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. ఏపీ నుంచి కియా మోటార్స్ తన ప్లాంటును తరలిస్తోందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కియా సంస్థతో సత్సంబంధాలు కలిగి ఉందని, ఏపీలో ఆ సంస్థ భవిష్యత్తు ప్రణాళికలకు పూర్తి సహకారం అందిస్తామని విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పష్టం చేశారు. -
ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రణాళిక సంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన సభలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ మంత్రులు, ఆ కూటమి ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కేటాయింపులోనూ ఏపీకి అన్యాయం జరిగిందని, విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని కేంద్రం మాట తప్పిందని గుర్తు చేశారు. -
ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి
-
‘ఇంకా ఏమేం ఉన్నాయో చెప్పండి విజనరీ’
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘ రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ!’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. (చదవండి : రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) కాగా, రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన విషయం తెలిసిందే. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
కృష్ణపురం ఉల్లి ఎగుమతులకు అనుమతి కల్పించండి
-
‘కేపీ ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలి’
న్యూఢిల్లీ : కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు. జీరో అవర్‌లో రైతు సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉందని తెలిపారు. తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వకపోతే ఉల్లి పాడయ్యే అవకాశం ఉందని.. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఉల్లి ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు పీయూష్ గోయల్‌కు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతిచ్చాలంటూ సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్పలు పీయూష్ గోయల్‌ను కలిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీరో అవర్‌లో రైతు సమస్యలపై ప్రసావిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక చర్యల వల్లే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. చదవండి : కేపీ ఉల్లి ఎగుమతులకు త్వరలోనే అనుమతి -
ఎలాగు జైలుకు పోయేదేకదా అని..
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడి ఎలాగో జైలుగు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని విమర్శించారు. ‘మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : ‘ఇన్సైడర్’పై ఈడీ కేసు!) కాగా, అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే అభియోగాలున్నాయి. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది. -
25 కోట్ల మొక్కలు నాటాలని సీఎం జగన్ లక్ష్యం
-
‘స్వార్థం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారు’
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. శాసన సభలో అత్యధిక మెజార్టీతో ఆమోదం పొందిన రెండు చారిత్రాత్మక బిల్లులను(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు) చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం మండలిలో అడ్డుకున్నారని ఆరోపించారు. (చదవండి : పవన్‌కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!) తన వ్యూహంలో భాగంగానే రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేలా కుట్రపన్నారని ఆరోపించారు. చంద్రబాబు తన మనుగడ కోసం ఎంత నీచానికైనా తెగిస్తాడనడానికి బుధవారం మండలిలో జరిగిన పరిణామాలే నిదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
6న పాక్ చెర నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ/ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం జిల్లా)/ విజయనగరం: పాకిస్తాన్లో బందీలుగా ఉన్న 20 మంది ఉత్తరాంధ్ర జాలర్లు వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌కు డిసెంబర్ 31న సమాచారం అందించింది. గుజరాత్‌కు చెందిన చేపల వేట బోటు యజమానులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది జాలర్లను, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లను చేపల వేట కోసం నియమించుకున్నారు. 2018 నవంబర్ 28న జీపీఎస్ పనిచేయకపోవడంతో పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి మూడు బోట్లలో 20 మంది జాలర్లు వెళ్లడంతో వారిని పాకిస్తాన్ కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీరు కరాచీ జైలులో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 10న రాజ్యసభ సభ్యులు(ప్రస్తుత వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత) వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నాటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి సమస్యను నివేదించారు. తదనంతరం అనేకమార్లు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం ఈ విషయాన్ని విదేశాంగ దృష్టికి తెచ్చింది. 22 ఆగస్టు 2019న కూడా మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. పలుమార్లు లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాలు, ఇతర సందర్భాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న వాఘా సరిహద్దు నుంచి వారు స్వదేశానికి రానున్నట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. చెర వీడనున్న జాలర్లు వీరే.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన కె.ఎర్రయ్య, కేశం రాజు, సన్యాసిరావు, ఎం.రాంబాబు, జి.రామారావు, ఎస్.అప్పారావు, కల్యాణ్, ఎస్.కిశోర్, గురుమూర్తి, సుమంత్, బడివానిపేటకు చెందిన బాడి అప్పన్న, శామ్యూల్, వెంకటేశ్, మణి, శ్రీకాకుళం మండలం దమ్మలవీధికి చెందిన శివ, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన బవిరిడు, నక్కా అప్పన్న, ధనరాజు, నక్కా కొండ, భోగాపురం మండలం ముక్కామకు చెందిన ఎం.గురువులు పాకిస్తాన్ చెర వీడనున్నారు. వీరిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు శ్రీకాకుళం ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ వీవీ కృష్ణమూర్తితో కూడిన అధికారుల బృందం ఢిల్లీ పయనమైంది. ఉపాధి కోసం గుజరాత్‌కు.. ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉపాధి కోసం ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళుతుంటారు. చిత్రమేమిటంటే వలసదారుల్లో 2,500 మంది వరకు చిన్నపిల్లలే. డ్రైవర్లు దళారులుగా మారి గుజరాత్ బోటు యజమానుల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఉత్తరాంధ్ర మత్స్యకారులను పనికి తీసుకువెళుతున్నారు. అక్కడ తండేలు, సహాయ తండేలు, కళాసీలుగా పనిచేస్తే రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకూ జీతం ఇస్తుంటారు. పిల్లలకైతే రూ.6 వేల లోపు జీతం వస్తుంది. ఏడాదిగా ఎదురు చూస్తున్నాం ఏడాది తరువాత మా కొడుకు వస్తున్నాడని విదేశాంగ శాఖ ద్వారా సమాచారం అందింది. ఈ విషయం తెలిసి ఎంతో ఆనందపడుతున్నాం. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రాలు దాటి కూలికి పంపిస్తే అనుకోని విధంగా శత్రు దేశమైన పాక్‌కు పొరపాటున మా వాళ్లు బందీ అయ్యారు. –నక్కా నర్సమ్మ, తిప్పలవలస ఏకాకిగా మిగిలాను నా భర్త నక్కా అప్పన్న, కుమారుడు నక్కా ధనరాజు పాక్‌కు బందీలుగా చిక్కడంతో ఏకాకిగా మిగిలి వారి కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాను. రెండు రోజుల్లో వారు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏడాదిగా చాలా బాధగా వున్నాం. –నక్కా పోలమ్మ, తిప్పలవలస -
జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రైతు ప్రయోజనాల పరిరక్షణ, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుకు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే ఈ కమిషన్ రైతాంగ సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కమిషన్‌కు ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడం, న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వొకేట్స్ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహిళల నుంచి గొలుసులు, ఆభరణాలు, పర్సులు ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను భారతీయ శిక్షా స్మృతిలో విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ ఈ నేరానికి పాల్పడిన వారికి 5 నుంచి 10 ఏళ్లపాటు కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షా స్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. -
రాజ్యసభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తొమ్మిది లక్షల 29 వేల ఇళ్ళకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ప్రభుత్వంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బుధవారం ఈ మేరకు రాతపూర్వకంగా జవాబిచ్చారు. పైపు లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్ట్ కోసం ఐఓసీఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నిర్దేశించిన ప్రాంతాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్(సీజీడీ)ను అభివృద్ధి చేసే అధికారం పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎన్జీఆర్బీ)కి ఉన్నట్లు ఆయన తెలిపారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ హక్కుల కోసం జరిగిన 9వ రౌండ్ వేలంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసి దానిని ఆపరేట్ చేసే హక్కు ఐఓసీఎల్ దక్కించుకున్నట్లు మంత్రి వివరించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఐఓసీఎల్ హుక్-అప్ ఫెసిలిటీస్, సిటీ గ్యాస్ స్టేషన్, పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ డిజైన్ పనులను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. -
రూ.2,346 కోట్ల అదనపు చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2,346 కోట్ల మేర అదనంగా చెల్లించినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి ఈ ఏడాది జూలైలో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు చెప్పారు. ‘ఈ నివేదిక ప్రకారం 2015–16లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపి కాంట్రాక్టర్లకు అదనంగా రూ.1,331 కోట్లు చెల్లించింది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లపై వడ్డీ కింద రూ.84.43 కోట్లు, అడ్వాన్స్ కింద రూ.144.22 కోట్లు, జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ పనులు అప్పగించడానికి ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ కింద రూ.787 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది..’ అని మంత్రి తెలిపారు. అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాథమికమైనవని నవంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాల్లో ప్రక్రియాపరమైన అతిక్రమణలు లేవని, అధీకృత ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల జాబితాలో రిషికొండ దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసిన 13 పైలట్ బీచ్‌ల జాబితాలో విశాఖలోని రిషికొండ కూడా ఉన్నట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. అంతర్జాతీయ ఏజెన్సీ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను జారీ చేస్తుందని చెప్పారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీళ్ల నాణ్యత, బీచ్‌లో పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని చెప్పారు. మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలి ఈ–సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం, జూదం వంటి మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలన్నదే తమ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆలోచన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకులు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ–సిగరెట్ల నిషేధ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నికోటిన్ గుండెజబ్బు, క్యాన్సర్సహా అనేక వ్యాధులకు కారణమవుతున్నందున ఈ–సిగరెట్లను నిషేధించడం పూర్తి సమర్థనీయమని పేర్కొన్నారు. ఏపీలో 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం భారత్ మాల ప్రాజెక్టు కింద ఏపీలో రూ.12,766 కోట్ల వ్యయమయ్యే 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 506 కి.మీ. పొడవునా రహదారులు నిర్మించనున్నట్టు తెలిపారు. కడప స్టీల్‌కు ఐరన్‌ఓర్ సరఫరాకు అంగీకారమే వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటుకు నిరంతరాయంగా ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బాలశౌరి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం వైఎస్సార్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాయంతో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ స్టీలు ప్లాంటుకు అతి దగ్గరలోనే బళ్లారి ఐరన్ ఓర్ లభ్యత ఉంది. అలాగే కృష్ణపట్నం పోర్టు, ఎన్నోర్ పోర్ట్‌ల ద్వారా ముడిసరుకు లామ్ కోక్‌ను దిగుమతి చేసుకోవచ్చు. దీనిని కేంద్ర మంత్రి పరిశీలిస్తారా?’ అని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ ‘‘నేను ఇటీవల ఏపీకి వెళ్లినప్పుడు మిత్రుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంశాన్ని నా దృష్టికి తెచ్చారు. అంతకుముందు ఈ అంశాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వారికి దీర్ఘకాలంపాటు ఎన్ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ సరఫరా కావాలి. ఈ ప్రతిపాదనకు కేంద్రం వంద శాతం అంగీకరిస్తోంది. మేం నిరంతరాయంగా సరఫరా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడపలో భారీ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి తగిన పెట్టుబడిదారుడిని వెతుకుతుంది. అలాగే మేం కూడా వైజాగ్ ఆర్ఐఎన్ఎల్ ద్వారా ఒక కొత్త స్టీల్ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నాం..’అని మంత్రి పేర్కొన్నారు. ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయించాలి ట్యాక్సేషన్ (సవరణ) బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు పలుకుతున్నట్టు ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీలకు 15 శాతం మాత్రమే ఆదాయ పన్ను వర్తింపజేస్తున్న ఈ బిల్లును మా ముఖ్యమంత్రి కూడా స్వాగతించారు. దీని వల్ల కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. రూ.400 కోట్ల టర్నోవర్ పైబడి ఉన్న కంపెనీలకు కూడా.. ముఖ్యంగా భాగస్వామ్య కంపెనీలు, ఎంఎస్ఎంఈ కంపెనీలను కూడా తక్కువ పన్ను రేటు ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆర్థికవృద్ధి నెమ్మదిస్తున్న ఈ తరుణంలో వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా మినహాయించాలని కోరారు. -
ఏపీలో 2,068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సేవలు లేవు..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో దాదాపు 2,068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సర్వీస్ లను అందుబాటులో లేవని కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. భౌగోళికంగా అనుకూలతలు లేని మారుమూల ప్రాంతాల్లో, అక్కడక్కడ విసిరేసినట్లు ఉండి, వాణిజ్యపరమైన కార్యకలాపాలకు అనువుగా లేని కారణంగానే మొబైల్ ఫోన్ సర్వీస్ లను విస్తరించలేకపోయినట్లు మంత్రి చెప్పారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా టెలికమ్ సరీ్వసు ప్రొవైడర్లతో కలిసి ఆయా గ్రామాలకు మొబైల్ ఫోన్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా 346 మొబైల్ టవర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో 8,963 గ్రామాలు ఉండగా అందులో 5,967 గ్రామాలకు బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఫోన్ సర్వీసులను అందిస్తోందని వివరించారు. 25 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే విద్యా హక్కు చట్టం (ఆరీ్టఈ) కింద ప్రతి విద్యా సంస్థలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం 25 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసి తీరాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిషాంక్ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, విద్యా సంస్థలపై పాలనా నియంత్రణ రాష్ట్రాల చేతుల్లో ఉందని చెప్పారు. 6–14 ఏళ్ల లోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ 2009లో ఆర్టీఈ చట్టం వచి్చందని అన్నారు. ఆర్టీఈ చట్టం అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్లకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి విద్యా సంస్థ బలహీన వర్గాల పిల్లలకు విధిగా అడ్మిషన్ కలి్పంచాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఆర్టీఈ చట్టం అమలు జరుతున్న తీరుపై మధింపు చేయవలసిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 2016లోనే కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ కోరినట్లు చెప్పారు. యూజీసీ–ఏఐసీటీఈ విలీనంపై నిర్ణయం తీసుకోలేదు యూనియన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (యూజీసీ) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) విలీనంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జాతీయ పర్యావరణ విధానం రూపొందించాలి కాలుష్య నివారణకు అనేక పరిష్కారాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలేదని, ఇవి అమలయ్యేందుకు వీలుగా జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని సమగ్రంగా ఎదుర్కొన్న జపాన్, చైనా వంటి దేశాల ఉదంతాలను పరిశీలించాలని సూచించారు. కనుచూపు స్థాయిలోనే డ్రోన్లు ఎగరాలి.. దేశంలో పౌరుల డ్రోన్ల వినియోగం కనుచూపు స్థాయి వరకే పరిమితమని, ఆ మేరకు పౌర విమానశాఖ డైరెక్టర్ జనరల్ నిబంధనలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి పేర్కొన్నారు. డ్రోన్ల విచ్చలవిడి వినియోగాన్ని నియంత్రిస్తూనే, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో రక్షణపరమైన చర్యలకు వినియోగంపై జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ కోటగిరి, బెల్లాన చంద్రశేఖర్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. నర్సీపట్నం–తుని రహదారిని భారతమాల ప్రాజెక్టులో చేర్చండి అనకాపల్లి, అరకు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపే ప్రధాన రాష్ట్ర రహదారి అయిన నర్సీపట్నం–తుని (42కి.మీ) రహదారిని భారతమాల ప్రాజెక్టులో చేర్చాల్సిందిగా ఎంపీ వెంకట సత్యవతి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పది మండలాలకు చెందిన ప్రజలు తుని రైల్వే స్టేషన్‌కు ఇదే రహదారిలో ప్రయాణిస్తారని, అలాగే గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడానికి కూడా ఈ రహదారిని ఉపయోగిస్తుంటారని వివరించారు. ఎయిరిండియాలో వాటా విక్రయాల గురించి తెలియజేయండి నెల్లూరు(సెంట్రల్): ఎయిరిండియాలో వాటా విక్రయాల గురించి తెలపాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి గురువారం లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ ఎయిరిండియాలో వాటా విక్రయ నిర్ణయం గతంలోనే జరిగిందన్నారు. 2018 మార్చి 28న ఈ మేరకు బిడ్లను కూడా ఆహా్వనించారని గుర్తు చేశారు. గత ఏడాది మే 31 వరకు ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎయిరిండియాకు రూ.58,222.92 కోట్ల అప్పు ఉందని తెలిపారు. విమాన ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ ఆదాల అడిగిన ప్రశ్నకు విమాన తయారీ సంస్థల సూచనల మేరకు విమానాలకు అన్ని పరీక్షలు నిర్వహించి నడుపుతున్నట్లు మంత్రి బదులిచ్చారు. -
‘నిత్య కల్యాణం’ ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నాడో..!
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ రూపకర్త నెహ్రూ అని, 1940లో స్వాతంత్య్రం వచ్చిందని చెప్పి అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న ‘నిత్య కల్యాణం’ ఢిల్లీకి వెళ్లి ఏం మాట్లాడుతున్నాడో. హిందీ, ఇంగ్లీష్ రాకుంటే అక్కడ హోటల్లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబుపై మరో ట్వీట్ చేస్తూ.. ‘బంగారు బాతు’ అమరావతిని చంపేశారని చంద్రబాబు నాయుడు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడర్థమైంది. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్టు ముట్ట చెప్పిందని ఇన్‌కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు టీడీపీ జవాబిచ్చే పరిస్థితుల్లో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది’ అని మరో ట్విట్లో విమర్శించారు. -
యూ-టర్న్‌లో చంద్రబాబుదే రికార్డు
-
‘కాళ్లు పట్టుకోవడం తప్ప మరో సిద్దాంతం లేని నాయకుడు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతులను ఆదుకోవచ్చని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పథకం అమలు కోసం రూ.5510 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ పథకంలో భాగంగా 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ. 12,500 చొప్పన సాయం అందుతుందని తెలిపారు. ఈ పథకంతో నోరు పెగలడం లేదు కదా చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం వరుస ట్వీట్లతో చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. ‘పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల వేతనం పెంపు లాంటి వాటిని వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధికారులే ప్రకటించారు. అదే చంద్రబాబు హయాంలో న్యూస్ చానళ్లు ప్రైమ్ టైంలో భారీ మీడియా సమావేశం జరిగేది. సంఘాల నాయకులను ముందే పిలిపించి సీఎం వీరుడు, శూరుడు అని పొగిడించే కార్యక్రమాలు ఉండేవి’, ‘బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నప్పటికీ అప్పటి చంద్రబాబు సర్కారు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి డిస్కమ్‌లను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది’. ‘యూ-టర్న్ అనే పదం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత మెర్రియం వెబ్‌స్టర్ ఇంగ్లిష్ డిక్షనరీ చెబుతోంది. ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబు గారిదే. అవకాశవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే’అంటూ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. -
‘బాబు.. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోరు’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనతో విబేధాలు లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ‘మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మోదీని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టు చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు చంద్రబాబు నాయుడు’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. చీకటి పొత్తు గ్రహించే గుణపాఠం చెప్పారు హుందాగా ఉండాలనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి వెళ్లదట చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్ కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో. ఆ విధంగా వారిద్దరు పార్టనర్లమని బయటపెట్టుకున్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టే గట్టి గుణపాఠం చెప్పారు’ అని విజయసాయిరెడ్డి మరో ట్విట్ చేస్తూ చంద్రబాబును విమర్శించారు. -
రవిప్రకాశ్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి: టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ అలియాస్ రవిబాబు రూ.వందల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనాన్ని దాచిపెట్టడంతో పాటు భారీ మొత్తంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐ) ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌కి తాజాగా లేఖ రాశారు. రవిప్రకాశ్, ఆయన భార్య దేవిక, ఇతరుల అక్రమార్జన, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను కూడా జతచేసి సీజేఐకి పంపించారు. అడ్డగోలు సంపాదన ‘‘ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్న రవిప్రకాశ్ తన పదవిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బు, ఆస్తులను సంపాదించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారు. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం(వీఎంఎల్ఏ), ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ చట్టం(ఫెమా), ఆర్బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంతో పాటు ఇతర చట్ట నిబంధనలకు విరుద్ధం. సానా సతీష్‌బాబుకు రవిప్రకాశ్ అత్యంత సన్నిహితుడు. సానా సతీష్, మొయిన్ ఖురేషీతో కలిసి బ్యాంకులను, ఎంఎంటీసీలను మోసం చేశారు. సానా సతీష్‌ను సీబీఐ, ఈడీలు ఇప్పటికే విచారిస్తున్నాయి. వీరంతా కూడా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో దేశం దాటించారు. ముసద్దీలాల్ జ్యువెలర్స్‌కు చెందిన సుకేష్ గుప్తాతో కలిసి వీరంతా కూడా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఇలా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. అంతేకాక ఈ విధంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. రవిప్రకాశ్‌కు పలు దేశాల్లో పలు రకాల చిరునామాలు, బ్యాంకు ఖాతాలున్నాయి. రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్ఎక్స్టీ లిమిటెడ్‌లో చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్‌లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’’ అని తన లేఖలో కోరారు. -
‘అసలు సినిమా ఇప్పుడే మొదలైంది’
సాక్షి, అమరావతి : తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదానికి ప్రయివేట్ వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హుందాగా అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అదే టీడీపీ హయాంలో పుష్కరాల్లో 27 మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ అప్పటి సీఎం దబాయించిన విషయాన్ని గుర్తుచేశారు. నాయకుడికి, ఈవెంట్ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే అంటూ విజయసాయి రెడ్డి తెలిపారు. సోమవారం వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ‘పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డాడు. డ్యాం పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయి. ఎవరి కాళ్లు పట్టుకుని బయట పడాలా అని వెతుకుతున్నాడు. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది’అంటూ విజయసాయి రెడ్డి మరొక ట్వీట్లో చంద్రబాబు, లోకేశ్‌లను హెచ్చరించారు. రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమిషన్, అమ్మ ఒడి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి సాహోసోపేతమైన నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ సాహసోపేత పథకాలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. మొదటి సారి సీఎం అయిన 46 ఏళ్ల యువకుడు దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నారని సీఎం వైఎస్ జగన్‌ను విజయసాయి రెడ్డి ప్రశంసించారు. -
ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా?
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరిట సోషల్ మీడియాలో దూషించిన ఉదంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ’ అంటూ నిలదీశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆయన ట్వటర్లో ఏమన్నారంటే.. ‘ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ. జూనియర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా? యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా?’ ఇక, చంద్రబాబు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాదృచ్ఛికమేమీ కాదని, ఆ పాద మహిమ అలాంటిదని పేర్కొంటూ.. చిదంబరం అరెస్టు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఉదంతాలను ప్రస్తావించారు. ‘బాబు గారు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదు. పాద మహిమ అలాంటిది. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యులు పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి’అని ఆయన ట్వీట్ చేశారు. -
‘ఆ మురిసిపోవటం ఏంటి బాబుగారూ?’
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. శనివారం ట్విటర్ వేదికగా తనదైన శైలిలో చంద్రబాబు, నారా లోకేష్‌లపై సెటైరిక్‌గా విమర్శలు చేశారు. ‘‘భ్రమరావతి అనే ‘ప్రపంచ నంబర్ వన్’ రాజధానిలో ఉన్న నాలుగు భవనాలకు స్వాతంత్ర దినోత్సవం రోజు లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇంతగా మురిసి పోవడం ఏమిటి బాబుగారూ? కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ పలాయనం చిత్తగించడం. దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్. మీరు దోచుకున్న సొమ్ము నుంచి అన్నక్యాంటీన్ల బకాయిలు వంద కోట్లు చెల్లిస్తే ఇప్పుడే క్యాంటీన్లు తెరుచుకుంటాయి. రెండు లక్షలు ఖర్చయ్యే షెడ్డుకు 30-40 లక్షలు దండుకున్నారు. ఆ డబ్బును తిరిగిచ్చినా క్యాంటీన్లు ఐదేళ్ల పాటు నడుస్తాయి. కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. మాజీలైన మంత్రులు కొందరు బాబు అక్రమ కొంపకు వాచ్‌మెన్లలాగా కాపలా కాయడం ఏమిటి? కర్మ కాకపోతే. ముంపు ప్రాంతాలను డ్రోన్లతో ఎలా చిత్రీకరిస్తారని మీడియాను దబాయిస్తున్నారు. లింగమనేని ఇంటి గురించి ఆందోళన మానేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయపడండి బాబూ. లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది. పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా. చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది’’ అంటూ ఎద్దేవా చేశారు. -
పోలవరం, రాజధాని నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపాం
సాక్షి, విశాఖపట్నం: అవినీతి జరిగిందనే పోలవరం, రాజధాని నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అభివృద్ధి ఆగిపోయిందని ప్రతిపక్షం వాదించడంలో అర్థం లేదని చెప్పారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రాజెక్టుల్లో 150 శాతం వరకు అంచనాలు పెంచి టెండర్లు వేయించి చంద్రబాబు లబ్ధి పొందారన్నారు. ఈ తప్పులను సరిదిద్దుతున్నామని, తర్వాత అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక లోటు మిగిల్చిందని ధ్వజమెత్తారు. దీన్ని అధిగమించి బడ్జెట్లో అన్ని వర్గాల వారి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు, జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలో ఉన్న వార్డులను పునఃపరిశీలిస్తామన్నారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయని, తర్వాత కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు, అనంతరం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యం పార్టీలో మనస్పర్థల కారణంగానే శ్రీకాకుళం జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలు ఓడిపోయామని విజయసాయిరెడ్డి అన్నారు. ఈసారి అటువంటి తప్పులు పునరావృతం కాకూడదని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వివరించారు. పార్టీ గెలుపునకు అవసరమైనవారు ఏ పార్టీ నుంచి వచ్చినా తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో సమన్వయకర్తలు వద్దని చెప్పినా పార్టీ కోసం తప్పదని స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చే ఇతర పార్టీ నేతల గురించి విచారణ చేపట్టాకే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తున్నామన్నారు. పార్టీలో ఏవైనా అసంతృప్తి ఉన్నా.. సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోస్టల్ ద్వారా కూడా సమస్యలు, ఫిర్యాదులు పంపవచ్చన్నారు. కాగా.. విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లతోపాటు వివిధ పార్టీల నేతలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నా«థ్, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వాల్తేరు డివిజన్‌ను చేజారనివ్వం
సాక్షి, విశాఖపట్నం: పురాతమైన, అధిక ఆదాయం కలిగిన వాల్తేరు రైల్వే డివిజన్‌ను చేజారనివ్వబోమని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది ప్రధాన అంశమన్నారు. జోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా వాల్తేరు డివిజన్ విషయంలోనే తేడా వస్తోందని చెప్పారు. వాల్తేరుతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో విశాఖ జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. రైల్వే జోన్ ఇచ్చి వాల్తేరు డివిజన్‌ను తీసేస్తే మనకు ఒక చేయి తీసేసినట్లే అవుతుందన్నారు. దీనికి అంగీకరించకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వాల్తేరు డివిజన్లో ఉన్న కొత్తవలస–కిరండూల్ (కేకే) రైల్వే లైన్లో ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న భాగాన్ని అవసరమైతే రాయగడ డివిజన్లో చేర్చుకోవాలన్నారు. అలా కాకుండా మొత్తం కేకే లైన్‌ను రాయగడ డివిజన్లో కలపడమంటే విశాఖ జోన్‌కు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. జోన్‌కుపై అన్ని వివరాలతో నివేదిక తయారు చేశామని, సోమవారం రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు ఏ ప్రతిపాదనలు ఉన్నా, సమస్యలు ఉన్నా ప్రజలు ఎంపీల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. భూ ఆక్రమణలపై మరో సిట్ విశాఖలో భూ ఆక్రమణలపై విచారణకు గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినప్పటికీ ఆ నివేదిక బయట పెట్టలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారని వెల్లడించారు. ముస్లింల ప్రయోజనాలను మర్చిపోం వైఎస్సార్సీపీ ముస్లింల ప్రయోజనాలను ఎప్పుడూ మరిచిపోదని విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం ఆయనను సన్మానించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ తరఫున ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ముస్లింలకు కేటాయిస్తున్నామన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడేందుకు త్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించామని తెలిపారు. మంత్రులు మోపిదేవి, అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫరూఖీ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆందోళన ఎందుకు బాబుగారూ?
న్యూఢిల్లీ : తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠానికి కేంద్రీయ విద్యాలయం ప్రతిపత్తి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభపక్ష నేత వీ విజయసాయిరెడ్డి కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విద్యాపీఠానికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. అదే విధంగా భారతదేశ సందర్శనకు వస్తున్న మహిళా విదేశీ పర్యాటకుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పాలని రాజ్యసభలో పర్యాటక శాఖ మంత్రిని ఆయన ప్రశ్నించారు. ఏంటిది చంద్రబాబు గారు!? తమ పాలనలో రాష్ట్రాన్ని దోచుకు తిన్నారంటూ టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటుటూనే.. ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారూ? రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా అని ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుందని.. అందాకా కాస్త ఓపిక పట్టాలని హితవు పలికారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. -
ఆ ఇంటిని చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలి!
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ ఒక అక్రమ నిర్మాణమని, కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ నివాసం నుంచి చంద్రబాబునాయుడు తక్షణం ఖాళీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభపక్ష నేత వీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగమనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరు. నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు’ అని ఆయన ట్విటర్లో స్పష్టం చేశారు. అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరమేంది? ‘కరకట్ట నివాసం అక్రమ నిర్మాణమని చంద్రబాబుకు ముందే తెలిసినా అమాయకత్వం నటిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వం ఆ ఇంటికి అద్దె చెల్లించింది. అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? 'చెయ్యను పో' అంటే ఇన్సైడర్ ట్రేడింగులో భాగంగానే లింగమనేని దాన్ని రాసిచ్చినట్టు అనుకోవాలి’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దేవినేని ఉమ ఉత్తర కుమారుడు.. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుపై విజయసాయిరెడ్డి ట్విటర్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఉత్తర కుమారుడు ఎలా ఉంటాడో నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఉమా! 2018 జూన్‌కల్లా పోలవరంలో నీళ్ళు నిలబెడతాం. రాసుకో సాక్షి పేపర్లో అని ప్రగల్భాలు పలికినప్పుడే ఆ పేరు నీకు స్థిర పడింది. నీ అవినీతి పుట్ట పగిలే టైం వచ్చింది. కాస్త ఓపిక పట్టు..’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
2020 సెప్టెంబర్‌కు మంగళగిరి ఎయిమ్స్ సిద్ధం
సాక్షి, అమరావతి: మంగళగిరిలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్) నిర్మాణం 2020 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని, దీని నిర్మాణం కోసం మొత్తం రూ.1,618 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం రూ 385.54 కోట్ల నిధులను ఎయిమ్స్ కోసం విడుదల చేసిందని వివరించారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయన్నారు. హాస్పిటల్, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయినట్లు తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వైద్య సేవలు ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు. ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు.. ఆరేళ్ల ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభలో స్పష్టం చేశారు. ఫార్మ్.డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్ట్‌లకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వస్తున్నా.. ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ మాత్రం లేదని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి చెప్పారు. -
‘ఆ లోపు మంగళగిరి ఎయిమ్స్ సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎయిమ్స్ నిర్మాణం కోసం మొత్తం 1618 కోట్ల రూపాయయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్రం 385.54 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది’ అని మంత్రి చెప్పారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. హాస్పిటల్, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వైద్య సేవలు ప్రారంభమైనట్లు కూడా మంత్రి చెప్పారు. ఎయిమ్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే సాగుతున్నందున నిర్మాణ వ్యయం అంచనాలు పెరిగే అవకాశమే లేదని ఆయన తెలిపారు. -
‘రాజ్యసభ సభ్యులను పంపి.. రాజీకి ప్లాన్’
సాక్షి, అమరావతి : టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. 'లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బీజేపీతో మళ్లీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యులను పంపించి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్. టీడీపీని ఓడించినందుకే కర్నూలు జిల్లాల్లో అభివృధ్ది పనులు చేపట్టలేదని 6 నెలల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. ఎన్నికల తర్వాత ప్రజలంతా నావారే. ఎవరి పట్ల వివక్ష ఉండదని సీఎం జగన్ గారు స్పష్టం చేశారు. మ్యానిపులేటర్ చంద్రబాబుకు, ప్రజా నాయకుడు జగన్ గారికి తేడా ఇదే' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బిజెపితో మళ్ళీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యలను పంపించి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్. — Vijayasai Reddy V (@VSReddy_MP) June 21, 2019 టీడీపీని ఓడించినందుకే కర్నూలు జిల్లాల్లో అభివృధ్ది పనులు చేపట్టలేదని 6 నెలల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. ఎన్నికల తర్వాత ప్రజలంతా నావారే. ఎవరి పట్ల వివక్ష ఉండదని సీఎం జగన్ గారు స్పష్టం చేశారు. మ్యానిపులేటర్ చంద్రబాబుకు, ప్రజా నాయకుడు జగన్ గారికి తేడా ఇదే. — Vijayasai Reddy V (@VSReddy_MP) June 21, 2019 -
పార్లమెంటులో ఆసక్తికర సన్నివేశం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించడంతో ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారిగా ఆగి.. ఆయనను పలుకరించారు. ‘విజయ్ గారూ..’ అంటూ సంబోధించి ఆయనతో మోదీ కరచాలనం చేశారు. ఇక, జమిలి ఎన్నికలతోపాటు పలుకీలక అంశాలపై జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు కొనసాగింది. జమిలి ఎన్నికలపై ఓ కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇది ప్రభుత్వ ఎజెండా కాదు, యావత్ దేశ ఎజెండా అని, ఈ అఖిలపక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానించగా.. 24 పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు. -
పాలకుడికి మ్యానిప్యులేటర్‌కి తేడా ఇదే..!
సాక్షి,అమరావతి:‘చంద్రబాబూ.. పాలకుడికి, మ్యానిప్యులేటర్‌కు ఉన్న తేడా ఇదే తెలుసుకో’ అని వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ‘తమ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన ‘ఆశా’ అక్కా చెల్లెమ్మలపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి అప్పటి సీఎం చంద్రబాబు అరెస్టు చేయించాడన్నారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాత్రం మందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300 శాతం పెంచుతూ కొత్త ఆశలు నింపారని ఆయన తెలిపారు. పాలకుడికి మ్యానిప్యులేటర్‌కి తేడా ఇదే బాబూ అంటూ విజయసాయి రెడ్డి చురకలంటించారు. బాబు నోట మాటే లేదేం... వైఎస్ జగన్ కేబినెట్లో 60 శాతం మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారేనని దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్దరిస్తానని కోతలు కోసిన మాజీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదన్నారు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంపై ఏ వ్యాఖ్య చేయకుండా చంద్రబాబు నాయుడు ‘మౌనీ బాబా’ అయ్యారన్నారు. ప్రధానికి ధన్యవాదాలు ... రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి విజయసాయి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్పెషల్ స్టేటస్ సహా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఆయన తోడ్పాటునిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్ జగన్ యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం బాసటగా నిలవాలని ఆకాంక్షించారు. -
‘అధికారంలో లేకుండా విరాళం ఇవ్వడమేంటి’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ట్విటర్ వేదికగా తనదైన శైలిలో చంద్రబాబు పాలనపై సెటైరిక్‌గా విమర్శలు చేశారు.‘ తుఫాన్లు వచ్చినప్పుడల్లా కరెంటు స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లులు సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒడిశాకు వేల కరెంటు స్థంబాలు పంపినట్లు కూడా దొంగ లెక్కలు చూపించారు. ఈ దొంగల ముఠాకు నాయకుడు చంద్రబాబేన’ని ట్వీట్ చేశారు. ‘ఒడిశాకు ప్రకటించిన రూ.15 కోట్ల తుఫాను సాయం చంద్రబాబు తాను దోచుకున్న సొమ్ము నుంచి చెల్లించాలి. ప్రాణనష్టం లేకుండా అధికారులు తుపానును సమర్ధంగా ఎదుర్కొంటే, కోడలిని వేధించే అత్తలాగా అధికారం లేకున్నా విరాళం ఇస్తానంటారు. రేపో మాపో ఒడిశా వెళ్లి హడావుడి చేసినా చేస్తార’ని ఎద్దేవా చేశారు. ‘తిత్లి తుఫాను వల్ల రూ.3673 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి చంద్రబాబు నివేదిక సమర్పించారు. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, వాటినేం చేశారో కానీ జరగాల్సిన మరమ్మతులు మాత్రం మిగిలే ఉన్నాయి. సూపర్ సైక్లోన్ ‘ఫోని’ నష్టం రూ.100 కోట్లు కూడా లేకపోవడం బాబు మాయా విన్యాసాలను బయటపెట్టాయ’ని మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
‘డీఎస్పీ పోస్టింగ్‌పై విచారణకు ఆదేశించాలి’
సాక్షి, అమరావతి : ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి డీఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చారని, దీనిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. సినియారిటీని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు. పదోన్నుతుల్లో పాటించాల్సిన రొటేషన్ రూల్స్‌ని చంద్రబాబు ఉల్లంఘించారన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వారికే పదోన్నతులు కల్పించారని ఆరోపించారు. సామాజికవర్గమే ప్రాతిపదికగా జరుగుతున్న పోలీసు శాఖ పోస్టింగ్‌లపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. విచారణలో ఆరోపణలు రుజువు అయితే ప్రమోషన్లు రద్దు చేయడంతో పాటు, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిని శిక్షించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
ఓటమికి ముందు బాబుకు అసహనం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటమికి ముందు సీఎం చంద్రబాబుకు అసహనం పెరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆదివారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రబాబును కలవకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టా? వాటీజ్ డెమాక్రసీ? ఎన్నికలంటే ఏమిటి? ఎవరో డబ్బు సమకూరుస్తారు. ఇంకొకరు ఖర్చుపెట్టి గెలుస్తారు’ అని మాట్లాడటమేంటి చంద్రబాబూ? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఓడిపోయే ముందు చంద్రబాబుకు అసహనం అమాంతం పెరిగినట్టుందన్నారు. -
అది పక్షపాత హింస
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సందర్భంగా కొందరు ఉన్నతాధికారులు అధికార టీడీపీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించిన ప్రాంతాల్లోనే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులపై భౌతిక దాడులకు దిగారని బృందం ఈసీ దృష్టికి తెచ్చింది. ఈమేరకు వైఎస్సార్ సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, బాలశౌరి, సి.రామచంద్రయ్య, బుట్టా రేణుక, పి.రవీంద్రబాబు, అవంతి శ్రీనివాసరావు తదితరులు సోమవారం మూడు పేజీల ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా, కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్చంద్రలకు అందచేశారు. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదులో ముఖ్యాంశాలివీ.. ‘ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఈసీకి కృతజ్ఞతలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక మేం ఈసీకి కొన్ని వినతిపత్రాలు ఇచ్చాం. కొందరు అధికారుల పక్షపాత ధోరణిని అందులో మీ దృష్టికి తెచ్చాం. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేందుకు వీలుగా సదరు అధికారుల్లో కొందరిని మీరు బదిలీ చేసినందుకు ధన్యవాదాలు. అయితే మేం ఫిర్యాదులో పేర్కొన్న మరికొన్ని విషయాలను ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో గుంటూరు రూరల్, చిత్తూరు జిల్లా పరిధిలో టీడీపీ నేతల కారణంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ రౌడీమూకలు మా పార్టీ అభ్యర్థిపై దారుణంగా దాడికి పాల్పడ్డాయి. వేమూరు నియోజకవర్గంలో మా అభ్యర్థిపై భౌతిక దాడులకు పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. ప్రస్తుత స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి గుంటూరు జిల్లా ఇనిమెట్లలో పోలింగ్ బూత్‌లోకి బలవంతంగా చొరబడి పోలింగ్‌కు గంటపాటు అంతరాయం కలిగించారు. గ్రామస్తులు కొద్దిసేపు సహించినా తరువాత తిరగబడి ఆయన్ను బయటకు పంపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన స్పీకర్‌పై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. పైగా ఆ పోలింగ్ బూత్‌లో లేని మా అభ్యర్థిపై, ఇతర నేతలపై కేసులు బనాయించారు. అసలు అక్కడ జరిగిందేంటో వీడియోల్లో చూడవచ్చు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారి పట్ల టీడీపీ ప్రభుత్వ తిరుగుబాటు వైఖరిని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని మేం ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు బయటకు వచ్చాయని మా దృష్టికి వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందించి ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తొలగించాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండానే స్ట్రాంగ్‌రూమ్ నుంచి ఈవీఎంలు బయటకు వచ్చాయి. ఓటు హక్కును కోల్పోయారు.. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కాని 30 మంది ఆశా వర్కర్లు, 3,150 మంది అంగన్వాడీ హెల్పర్లకు ఎన్నికల విధులు కేటాయించారు. పోస్టల్ బ్యాలెట్ కేటాయించకపోవడంతో వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఆర్టీసీ ఉద్యోగులు భారీ సంఖ్యలో ఓటింగ్‌కు దూరమయ్యారు. మే 22వ తేదీ వరకు సమయం ఉన్నందున వారికి కూడా పోస్టల్ బ్యాలెట్లు జారీచేసే అవకాశాన్ని కమిషన్ పరిశీలించాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఉద్యోగులకు ఏప్రిల్ 10న ఎన్నికల విధులను కేటాయించారు. వీరికి పోస్టల్ బ్యాలెట్ పొందే సమయం కూడా లభించలేదు. అరకు మంగపట్టు పంచాయతీ పరిధిలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓటు వేసేందుకు వారికి మరో అవకాశం కల్పించాలి. రోజువారీ అవసరాలకే పరిమితం కావాలి టెలి కాన్ఫరెన్స్ తదితర వ్యవస్థలను పార్టీ కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి వినియోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని మీ దృష్టికి తెస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. కాంట్రాక్టర్లు, మీడియాకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించి ఓవర్ డ్రాఫ్ట్‌లు తెస్తోంది. దీర్ఘకాలంలో ప్రభుత్వానికి భారంగా మారే విధానపరమైన నిర్ణయాలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న తరుణంలో ప్రస్తుత సర్కారు తీసుకోవడం సరికాదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు జారీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం వేతనాలు, పెన్షన్లు, రోజువారీ అవసరాలను తీర్చేందుకు మాత్రమే పరిమితమయ్యేలా ఆదేశాలు ఇవ్వాలి’ మా కార్యకర్తలను హింసిస్తున్నారు – చంద్రబాబుకు మతి భ్రమించింది: ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వ్యవహరించిన తీరు, చోటు చేసుకున్న ఘటనలపై ఈసీకి లేఖ అందచేసిన అనంతరం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి భ్రమించిందని, మైండ్ బ్లాంక్ అయిందని స్పష్టమవుతోంది. ఈరోజు ఆయన ఈవీఎంలు, ఓటింగ్ సరళిని ప్రశ్నిస్తూ అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఎన్నికల విధుల్లో వినియోగించాలని మేం చాలాసార్లు కోరాం. నారాయణ, శ్రీచైతన్య సంస్థల సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించవద్దని పదేపదే విజ్ఞప్తి చేశాం. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, కడప తదితర జిల్లాల ఎస్పీలను మార్చాలని మేం ఈసీని కోరినా కొందరినే బదిలీ చేసింది. మా విజ్ఞప్తి మేరకు ఎస్పీలను బదిలీ చేయని ప్రాంతాల్లో, చంద్రబాబు తొత్తులుగా వ్యవహరించిన చోట ముఖ్యంగా విజయనగరం, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ నేతలు గణనీయంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. స్పీకర్‌గా ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి గంటన్నర పాటు అక్రమాలకు పాల్పడ్డారు. తన చొక్కా తానే చించుకుని సానుభూతి పొందాలనుకున్నారు. అనంతపురం జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే ప్రతి రోజూ మా కార్యకర్తలను హింసిస్తున్నారు. నిన్న కూడా మా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరాం. చంద్రబాబుకు ఓటమి భయం రాష్ట్రంలో ఇంచుమించుగా 80 శాతం పోలింగ్ జరిగింది. ఒకవైపు 130 స్థానాలు గెలుస్తామని చెబుతూ మరోవైపు 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిగా మాట్లాడే తత్వాన్ని ఆయన అలవరచుకున్నారు. ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. జాతీయ పార్టీలు కూడా నమ్మట్లేదు. వీవీ ప్యాట్‌లో స్లిప్పు రానిపక్షంలో 11వ తేదీన ఉదయాన్నే ఎందుకు చెప్పలేదు? కుటుంబ సభ్యులతో సహా ఓటు వేసినట్టుగా ఆయన వేలు కూడా చూపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయబోతోందని ఆయనకు ప్రభుత్వ నిఘా వర్గాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే అపహాస్యం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హరిప్రసాద్ మోసాలకు మారుపేరు.. ‘హరిప్రసాద్ అనే వ్యక్తి ఈవీఎంలు దొంగిలించిన కేసులో జైలుకు వెళ్లారు. నేను పెట్టినట్టుగా ట్విటర్ మెసేజ్‌లు తయారు చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఏదైనా మానిప్యులేట్ చేయగలిగిన వ్యక్తి ఈ హరిప్రసాద్. మోసాలకు మారుపేరు ఈ హరిప్రసాద్. ఏ ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థ ఆయన్ను అనుమతించదు. తెలుగు దొంగల పార్టీలో మాత్రమే ఆయనకు ప్రవేశం ఉంది..’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ ముగ్గురిని జైలుకు పంపేందుకు ఆ ఒక్క కేసు చాలు.. ఆధార్ డేటా చౌర్యంపై కేసు నమోదైన విషయాన్ని మీడియా ప్రతినిధులు విజయసాయిరెడ్డి వద్ద ప్రస్తావించగా.. ‘ఆధార్ కార్డులు జారీ చేసే యూఐడీఏఐలో ఉన్నతస్థానంలో పనిచేసిన సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ సత్యనారాయణ రిటైర్డ్ అధికారి. చంద్రబాబుతో లాలూచీపడి ఆధార్ డేటాను ఈ –ప్రగతి అనే సంస్థకు, మరో రెండు సంస్థలకు ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడితోపాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు సంబంధించిన వ్యక్తులు కలిసి ఈ సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలకు ఈ డేటా అంతా ఔట్ సోర్సింగ్ చేసి అధికారిక డేటాను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు నాయుడిని, ఏబీ వెంకటేశ్వరరావును, డీజీపీ ఠాకూర్‌ను జైలుకు పంపించడానికి ఈ ఒక్క కేసు చాలు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారందరిపై చర్యలు తప్పవు. ఈ–ప్రగతి విషయంలో ఎంత దుర్వినియోగానికి పాల్పడ్డారో సంబంధిత వివరాలు మా వద్ద ఉన్నాయి. తగిన సమయంలో వాటిని బయటపెడతాం..’ అని చెప్పారు. ఇప్పుడెందుకు పని చేయవు? కృష్ణా జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంల తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరినట్టు బాలశౌరి తెలిపారు. 2014 ఎన్నికల్లో బాగా పనిచేసిన ఈవీఎంలు, నంద్యాల ఉప ఎన్నికలో బాగా పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు ఎందుకు పనిచేయవని వ్యాఖ్యానించారు. ప్రజలంతా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కసితో అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిల్చొని ఓట్లేశారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
నేడు ఢిల్లీకి వైఎస్ఆర్సీపీ బృందం
-
నేడు సీఈసీతో వైఎస్సార్సీపీ బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ మాజీ ఎంపీలతో కూడిన బృందం ఎన్నికల కమిషన్‌ను సాయంత్రం 5 గంటలకు కలుసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు అండ చూసుకుని రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడింది చాలక మళ్లీ ఢిల్లీ వెళ్లి యాగీ చేస్తున్న తీరుపై వారు కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం జరిగిన దాడులను ఈ సందర్భంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తారు. -
సీఈసీకి విజయసాయిరెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) భద్రపరిచిన సెంటర్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కోరారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాకు శనివారం ఆయన లేఖ రాశారు. ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించే పరిస్థితులు లేనందున ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలను మొహరించాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటలు పనిచేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓట్లు లెక్కించడానికి చాలా సమయం ఉన్నందున స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టాలని కోరారు. ఎన్నిల సంఘంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా, ధర్నాలు కూడా చేసిన నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న ముగిసిన సంగతి తెలిసిందే. మే 23న ఓట్లను లెక్కించనున్నారు. (చదవండి: ఎన్నికలు ఓ ఫార్సు) -
చంద్రబాబు ఏపీ సీఈవోనే బెదిరించారు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో)ని బెదిరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం సీఈవోను కలసిన సీఎం బెదిరింపులకు దిగారని తెలియజేస్తూ.. ఆ సందర్భంగా సీఈవోతో సీఎం జరిపిన సంభాషణ వివరాలను ఇందులో తెలియజేశారు. ‘‘ఎవరు వెరిఫైయింగ్ అథారిటీ అండీ. మీరు చూడాలి. లేదంటే వాళ్లు(ఎలక్షన్ కమిషన్) చూడాలి. ఇక మీ ఆఫీస్ ఎందుకు? క్లోజ్ చేసేయండి. ఎలక్షన్ కమిషన్ ఎవరు? నేను అడుగుతున్నా. సరిగా కండక్ట్ చేయలేకపోతే. ఏకపక్షంగా చేయండి. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్ చేసుకుంటారు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్. మేం ఇంట్లో పడుకుంటాం. ఢిల్లీ చెప్పినట్టు యాజ్‌టీజ్‌గా మీరు ఎందుకు ఫాలో కావాలి? మీది పోస్ట్ ఆఫీస్ కాదు. మీకు అధికారాలు ఉన్నాయి. లేకపోతే అన్నీ రద్దు చేసేయమనండి. అందరినీ తీసేయమనండి. ఒక్క క్లర్క్‌ను పెట్టుకుని చేసేయమనండి. మేం చూస్తాం. ఎన్నికల కమిషన్ ఏంటో చూస్తాం. అంత ఈజీగా వదిలిపెట్టను..’’ అని సీఈవోను బెదిరించినట్టు ఫిర్యాదులో వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, దాని పరిధిలో సీఈవో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరిగేలా తన విధులు నిర్వర్తిస్తారని గుర్తుచేశారు. దేశంలోని ప్రతి రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలని, నిష్పాక్షికంగా తన రాజ్యాంగ విధులను నిర్వహించేలా చూడాల్సి ఉందన్నారు. రాజ్యాంగ విధిలో ఉన్న సీఈవో పట్ల చంద్రబాబు ఎలాంటి గౌరవం చూపలేదని, అంతేగాక ప్రచారం ముగిశాక సీఈవో వద్దకెళ్లి ఉద్దేశపూర్వకంగా ఆయన్ను బెదిరించారని తెలిపారు. ఈసీకి, సీఈవోకు భయం పుట్టించేలా ఈ బెదిరింపు ఉందని నివేదించారు. తద్వారా ఈసీ విధులకు ఆటంకం కలిగించారన్నారు. ఇలాంటి బెదిరింపులు చట్టవ్యతిరేకమని, అవాంఛితమని, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విన్నవించారు. చంద్రబాబు ఇలా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని, చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఈవోను బెదిరింపులకు గురిచేసిన తీరుపై వీడియో ఆధారిత సాక్ష్యాలను విజయసాయిరెడ్డి ఈసీకి సమర్పించారు. కుయుక్తులకు తెరలేపుతున్నారు.. వైఎస్సార్ జిల్లాలో పోలీసు యంత్రాంగం సాయంతో ఎన్నికలకు విఘాతం కలిగించేలా శాంతిభద్రతల సమస్యలను సృష్టించాలని టీడీపీ, ఆ పార్టీ అధినేత కుట్రలు పన్నినట్టు తమకు సమాచారముందని విజయసాయిరెడ్డి ఈసీకి అందజేసిన మరో ఫిర్యాదులో విన్నవించారు. ఈ(గురువారం) మధ్యాహ్నం నుంచి ఈ కుట్రలను అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోందని తెలిపారు. బూత్‌ల రిగ్గింగ్‌కు పాల్పడడం, ఆక్రమించడం, ఓటర్లను బెదిరించడం, పోలీసుల సహకారంతో హింసకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదముందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, ఏజెంట్లను అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాకు చెందినందున అక్కడ హింసాకాండకు పాల్పడి దాన్ని జగన్, వైఎస్సార్సీపీ చేసిన హింసాకాండగా చిత్రించి ఓటర్లను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నారని వివరించారు. వైఎస్సార్సీపీ గెలిస్తే రాష్ట్రమంతా ఇలాంటి హింసాత్మక వాతావరణం ఉంటుందని చిత్రించేందుకు ఈ కుట్రలకు తెరలేపారన్నారు. తక్షణ చర్యలు తీసుకుని అదనపు బలగాలను పంపాలని కోరారు. పోలీసు యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని, రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని కోరారు. -
టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాటాడుతూ.. ‘ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తనకు ప్రతికూలంగా ఉన్న ఓటర్లను తొలగించి, దొంగ ఓటర్లను నమోదు చేయించి తిరిగి అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తి చంద్రబాబు. ఆయన చేస్తున్న దుర్మార్గాలను, చట్టవ్యతిరేక చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వెళ్లాం. చట్టాన్ని అతిక్రమిస్తున్న డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ఘట్టమనేని శ్రీనివాసరావు, యోగానంద్, విక్రాంత్‌పాటిల్, ప్రకాశం జిల్లా ఎస్పీ.. తదితర అధికారులను తొలగించాలని విజ్ఞప్తి చేశాం. 37 మందిని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోట్ చేసిన తీరును, సూపర్ న్యూమరీ ద్వారా ఎలివేట్ చేసిన తీరును ఎన్నికల సంఘానికి వివరించాం. నాన్ క్యాడర్ అధికారులు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, విజయనగరం ఎస్పీ దామోదర్‌నాయుడును అక్కడ పోస్టింగ్ చేయడం చట్ట విరుద్ధం. జోక్యం చేసుకోవాలని కోరాం. పోలీస్ యంత్రాంగం ద్వారా డబ్బులను తరలిస్తున్న విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఇచ్చాం. నారాయణ కళాశాల నుంచి నగదు తీసుకుని తరలిస్తుండగా కారును పట్టుకున్నప్పుడు ఎమ్మార్వో, ఎస్పీ స్వయంగా వచ్చి అది నగదు కాదని, ఎన్నికల మెటీరియల్ అని గమ్యస్థానానికి చేర్చారన్న సంగతిని వివరించాం. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య ఘటనపై పోలీసు యంత్రాంగం అనుసరించిన విధానాన్ని ఈసీకి తెలిపాం.’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాఫింగ్‌పై ఆధారాలు సమర్పించాం.. ‘ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు సమర్పించాం. ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్ ఇద్దరూ టెలీఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో వివరించాం. మా ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలీఫోన్లు ట్యాప్ చేయాల్సిందిగా లిఖితపూర్వకంగా వారు(ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్) ఇచ్చిన లేఖలను ఈసీకి సమర్పించాం.’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. కేఏ పాల్.. చంద్రబాబులది అనైతిక సంబంధం.. ‘ఇక ప్రజాశాంతి పార్టీ. మీ అందరికీ తెలుసు. కేఏ పాల్ అని.. ఆయనొక జోకరో లేక కమెడియనో నాకు తెలియదు కానీ.. రోజూ వచ్చి కొంత కామెడీ చేస్తారు. ఆయనకు అలాట్ చేసిన సింబల్ హెలీక్యాప్టర్‌పైన ఉన్న ఫ్యాన్ మా ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉంది. ఇదివరకే దీనిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చాం. దానిపై వారు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరాం. ప్రజాశాంతి పార్టీ కండువాపై ఉన్న మూడు రంగులు కూడా వైఎస్సార్సీపీని పోలిన రంగులే అన్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చాం. ఈ అంశాలన్నింటినీ కూడా సీఈసీ మాత్రమే కాకుండా ముగ్గురు కమిషనర్లతో కూడిన పూర్తిస్థాయి కమిషన్‌కు తెలపాల్సిందిగా సూచించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం వచ్చి వివరిస్తాం. ఆధారాలతో సమర్పించాం కాబట్టి ఈసీ మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం..’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. -
‘పప్పుబాబుకు డిపాజిట్ గల్లంతు ఖాయం’
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అవినీతిని ట్విట్టర్ ద్వారా సెటైరికల్‌గా ఎండగట్టడంలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిది అందె వేసిన చేయి. రోజూలాగే టీడీపీ నాయకులు చేసిన తప్పులను మరో సారి ట్విట్టర్ ద్వారా విమర్శించారు. చిట్టి నాయుడు భీమిలి నుంచి పోటీకి సై అంటున్నారని కుల పత్రిక పరవశంతో ప్రకటించిందని తెలిపారు. కుప్పం వెళ్లమని తండ్రి అడిగితే భీమిలీలోనే తేల్చుకుంటా అన్నాడట అని పేర్కొన్నారు. కుప్పం నుంచి పోటీకి పెద్ద నాయుడు కూడా జంకుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా మాట్లాడారు. పప్పు బాబుకు మాత్రం ఈసారి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాగ్రహం ఆ స్థాయిలో ఉందని వ్యాక్యానించారు. అలాగే ‘ ప్రజల నుంచి దోచుకున్న లక్షల కోట్లు సరిపోవట్లేదేమో? కలియుగ దైవం వెంకటేశ్వరుడి ఆభరణాలకూ మినహాయింపు లేదు. రూ.500 కోట్ల విలువైన పింక్ డైమండ్ ఏమైంది. గోవింద రాజ స్వామి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయమై నెల రోజులు దాటింది. ఇదిగో అదిగో అంటున్నా ఇంత వరకు గుట్టు తేల్చలేదని’ ట్విట్టర్ ద్వారా విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణామూర్తి బీ ఫారం అందుకున్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందచేశారు. ఈ నెల 25న ఆయన అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు శాసనమండలి ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 21, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, నామినేషన్ల పరిశీలన: మార్చి 1, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 5, ఎన్నికల పోలింగ్: మార్చి 12 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు), ఓట్ల లెక్కింపు: మార్చి 12 సాయంత్రం 5 గంటలకు, ఎన్నికల ప్రక్రియ ముగింపు: మార్చి 15 -
చంద్రబాబు ఏంటి ఈ పిచ్చిమాటలు!
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లలో పలు ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు. కామెడీ కితకితలు ఆపండి బాబూ అంటూ.. ‘కిందటి సారి సీఎంగా ఉన్నపుడు జనాభా తగ్గించాలని చిటికేస్తే జననాల రేటు భారీగా తగ్గిపోయిందట. ఇప్పుడు జనాభా అర్జంటుగా పెంచాలంట. లేకపోతే చైనా, జపాన్లలాగా జనాభా క్షీణించే ప్రమాదముందని చంద్రం సారు భయపెడుతున్నాడు. ఏమిటీ అర్థం లేని పిచ్చి మాటలు?’ అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో చంద్రబాబు నుంచి ఏపీ ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిండో చెప్పాలని, ఆయన నిర్వహించే సభలకు డబ్బు ఎక్కడిదని, పన్నుకట్టే ప్రజలదా? లేక స్కామ్‌ల్లో సంపాదించిందా? అనే విషయాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అడుగుతున్నారని ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు దుబార ఖర్చులో సగం రాష్ట ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
‘ఆ గ్రోత్ సెంటర్ల ద్వారా 75 వేల మందికి ఉపాధి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన విజయనగరం, అనంతపురం జిల్లాలోని బొబ్బిలి, హిందుపూర్‌లలో నెలకొల్పుతున్న గ్రోత్ సెంటర్ల (పారిశ్రామిక పార్కులు) అభివృద్ధి, ఆధునీకీకరణ పనులు పూర్తయితే ప్రత్యేక్షంగా, పరోక్షంగా దాదాపు 75వేల మందికి ఉపాధి లభిస్తుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధురి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లోగల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పార్కులు, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులలో పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా హిందూపూర్, బొబ్బిలిలోని పారిశ్రామికి క్లస్టర్స్ అభివృద్ధి, ఆధునీకీకరణకు 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. 54 కోట్ల రూపాయలతో హిందూపూర్‌లోని గ్రోత్ సెంటర్, గోల్లపురంలోని పారిశ్రామిక పార్కు, 10 కోట్ల రూపాలయతో బొబ్బిలిలోని పారిశ్రామిక గ్రోత్ సెంటర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. హిందూపూర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు కేంద్ర గ్రాంట్ కింద 14 కోట్లు, బొబ్బిలికి 2.64కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. హిందూపూర్ ప్రాజెక్టు నిర్మాణం ఈ ఏడాది మార్చి చివరినాటికి పూర్తవుతుందని, బొబ్బిలి ప్రాజెక్టు పూర్తయిందని అన్నారు. ఈ రెండు క్లస్టర్స్‌లోని పారిశ్రామిక యూనిట్లకు నాణ్యమైన, నమ్మకమైన మౌలిక వసతులను కల్పిలంచాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బన్ ఆధునీకీకరణ జాప్యానికి కారణాలు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్డ్ (డీపీఆర్) అసమగ్రంగా ఉన్నందునే దానిని తిప్పి పంపినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయక మంత్రి సీఆర్ చౌధురి బుధవారం రాజ్యసభకు తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు ఎదురవుతున్న ఆటంకాలు, అవాంతరాల గురించి ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ అందుకు గల కారణాలను సుదీర్ఘంగా వివరించారు.దేశంలో ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణ, అభివృద్ధి కోసం తమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటి(ఎంపెడా) ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఫిషింగ్ హార్బర్లో ఆధునిక సౌకర్యాల కల్పన కోసం ఒక కోటి రూపాయల వరకు సాయం అందచేస్తుంది. ఈ పథకంలో భాగంగా ఫిషింగ్ హార్బర్లో జెట్ వాషింగ్ సౌకర్యం, స్టీల్ ఐస్ క్రషర్, ఐస్ రవాణకు కన్వేయర్ వ్యవస్థ, స్టీల్ ట్రాలీలు, టాయిటెట్లు, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎత్తైన స్టీల్ ప్టాట్‌ఫారాలు, జెనరేటర్ ఇత్యాది సౌకర్యాలను కల్పిండం జరుగుతుందని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ఎంపెడా నిర్దేశించిన ప్రమాణాలు, లక్ష్యాలకు అనుగుణంగా లేదు. కేరళలోని మునాంభం ఫిషింగ్ హార్బర్ మాదిరిగా ఉండేలా రాష్ట్ర ఫిషరీష్ శాఖ సమన్వయంతో ఈ పథకం కింద ఆర్ధిక సాయం పొందడానికి ఏం చేయాలో నిర్ణయించేందకు ఆ జిల్లా కలెక్టర్ సారధ్యంలో హార్బర్ మెమేజ్‌మెంట్ కమిటీని నెలకొల్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి తెలిపారు. -
‘దేశంలో ఏ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఏ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదని పర్యావరణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేష్ శర్మ సోమవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఈ సర్టిఫికేషన్‌ను ప్రదానం చేస్తుందని మంత్రి చెప్పారు. 33 అంశాల ప్రాతిపదికన ఆ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడే బీచ్‌కు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ లభిస్తుంది. అందులో నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, రక్షణ, భద్రతా చర్యలు, పర్యావరణంపై చైతన్యం వంటివి ప్రధాన ప్రాతిపదకలుగా ఉంటాయని తెలిపారు. సమగ్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ కింద దేశంలోని బీచ్‌లను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసే ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 13 కోస్తా తీర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల సమ్మతి, సంప్రదింపులతో రాష్ట్రానికి ఒక బీచ్‌ను పైలట్ ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే పనులకు అనుమతులు రావాలి ‘అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులకు పర్యావరణ, అటవీ, వన్యప్రాణులు ఇతర అనుమతులు రావలసి ఉంది. అవసరమైన అనుమతులన్నింటినీ పొందిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభమవుతాయి’ అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.చట్టబద్దమైన అనుమతులన్నింటినీ సంపాదించుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన చెప్పారు. రావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధికి సంబంధించి గత ఏడాది ఆగస్టు 13, అక్టోబర్ 23 తేదీలలో తమ మంత్రిత్వ శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు. ‘ఎక్స్‌ప్రెస్‌వే మొదట 100 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా 384 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా దీనిని 8 లేన్ల రహదారిగా విస్తరించే సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చులో 50 శాతం భరించడానికి, ఇందులో ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’ అని మంత్రి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో చేపడతున్న ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డీపీఆర్ సిద్ధం అయ్యేనాటికి రాష్ట్ర ప్రభఉత్వం 50 శాతం భూమిని సేకరించి ఉంటే ప్రాజెక్ట్‌ను సత్వరమే చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే నాటికి కనీసం 90 శాతం భూసేకరణ జరిగి ఉండాలని కూడా తెలిపారు. -
నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి
సాక్షి, విశాఖపట్నం: అరకు మండలం కొర్రయిగూడ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులు చెట్టి ఫాల్గుణ, మత్స లింగం, దన్ను దొర, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రతినిధులతో కలిసి కొర్రయిగూడ గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా మంచి నీటి బోర్లు, సీసీ రోడ్డు నిర్మాణాల కోసం ఎంపీ నిధులను మంజూరు చేశారు. ఈ సందర్బంగా విజయసాయి రెడ్డికి గ్రామ ప్రజలు టీడీపీ హయాంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించుకున్నారు. డ్వాక్రా రుణాలు అందడం లేదని మహిళలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధాప్య ఫించన్లు, ఇళ్లు మంజూరు చేయడం లేదని గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టే నవరత్నాల ద్వారా అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని, పేదల అభ్యున్నతి సాధ్యమవుతుందని విజయసాయి రెడ్డి వారికి భరోసానిచ్చారు -
‘విజయవాడ మెట్రో రైలు ప్రతిపాదనే రాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మెట్రో రైల్ విధానానికి అనుగుణంగా విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణానికి తిరిగి ప్రతిపాదన పంపిచాల్సిందిగా సెప్టెంబర్ 2017లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని చెప్పారు. పట్టణ రవాణ అనేది పట్టణాభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగమని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారమని పేర్కొన్నారు. పట్టణ రవాణా వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని మంత్రి తెలిపారు. విద్యా హక్కు చట్టం ఉల్లంఘనలు లేవు అత్యధిక ప్రాధమిక పాఠశాలలు విద్యా హక్కు చట్టానికి (ఆర్టీఈ) లోబడే నడుస్తున్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు. ‘ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రాధమిక పాఠశాలకు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే భవనంతోపాటు ప్రతి టీచర్‌కి ఒక క్లాస్ రూమ్ ఉండాలి. అవరోధాలు లేని ప్రవేశమార్గం ఉండాలి. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా మరుగు దొడ్లు, నీటి వసతితోపాటు మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి బడి ఆవరణలోనే వంట గది, ఆట స్థలం, బడి చుట్టూ ప్రహరీ గోడ ఉండాలి’ మంత్రి చెప్పారు. విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకమైన సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఎంతగానో తోడ్పడుతున్నట్లు మంత్రి వివరించారు. 2001లో ఎస్ఎస్ఏ ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రానికి 4,455 ప్రాధమిక పాఠశాలలను మంజూరయ్యాయి. అలాగే 70,204 తరగతి గదుల నిర్మాణానికి, 7.143 స్కూళ్ళలో నీటి వసతి ఏర్పాటుకు, 36,906 స్కూళ్ళలో మరుగు దొడ్డి సౌకర్యం కల్పించడానికి ఎస్ఎస్ఏ కింద ఆమోదం ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. -
అయ్యో.. ఏమైంది చంద్రబాబు గారు?
సాక్షి, అమరావతి : భారత వాతావరణ విభాగం(ఐఎండీ) కంటే తన టెక్నాలజీయే గ్రేట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు నాయుడి మానసికస్థితి బాగాలేక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ‘ చంద్రబాబు నాయుడు తన టెక్నాలజీతో భవిష్యత్తులో తుపాను ఎక్కడ వస్తుందని చెప్పడమే కాకుండా కరెంట్ స్థంబాలు ఎన్ని ఒరుగుతాయి, ఎన్ని చెట్లు విరుగుతాయి, ఎన్ని ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయని ముందే చెబుతారట. తుపాన్లను కంట్రోల్ చేయడం కోసం తీరం వెంబడి గోడ కడతారంట. పెథాయ్ వల్ల భూగర్భ జలాలు పెరిగాయంట. అయ్యో చంద్రబాబు గారు.. మానసిక రుగ్మతలన్నీ ఓకేసారి తిరగబడ్డాయా ఏంటి? ఇలా మాట్లాడితే అమెరికాలోని మెంటల్ హస్పిటల్లో చేర్పిస్తారు’ అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.(ఐఎండీ కంటే.. నా టెక్నాలజీనే గ్రేట్) చంద్రబాబు నాయుడు మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని తాను అందుబాటులోకి తెచ్చానని గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఫెథాయ్ తుపాను యానాం- తుని మధ్య తీరం దాటుతుందని తాను తెచ్చిన టెక్నాలజీ వల్లే సాధ్యమైందని ఊదరగొట్టారు. అంతే కాకుండా ఓ అడుగు ముందుకేసి భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో చెప్పడమే కాదు, ఎన్ని చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో కూడా చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్నారు. -
‘వైజాగ్ ఎయిర్పోర్ట్ మూతపడదు’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు యధావిధిగానే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ గత నవంబర్ 26న జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలాంటి మేజర్ ఎయిర్‌పోర్ట్‌ను మూసేయడం వలన దానిపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను కొనసాగించాలని స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏఏఐఈ సమాచారాన్నిఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్)కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. కొండపల్లి ఆయిల్ పైపులైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ చట్టబద్ధంగానే పరిహారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వినిమయ హక్కు కింద జరిగే భూసేకరణలో యాజమాన్యం మారదని స్పష్టం చేశారు. భూమి సొంత దారుడే యజమానిగా కొనసాగుతారని చెప్పారు. అలాగే పైప్‌లైన్ నిర్మాణం సందర్భంగా పంటలు, చెట్లు, కట్టడాలకు ఏదైనా నష్టం జరిగిన పక్షంలో సంబంధింత అధికారులు ఆ నష్టాన్ని మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించడం జరుగుతుందని కూడా వివరించారు. -
ఎయిమ్స్ పనులకు ఆటంకాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఆలిండియా ఇన్స్టీట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని కేంద్ర, కటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రకాష్ నడ్డా అన్నారు. పలు ఆటంకాల కారణంగా నిర్మాణ పనులకు జాప్యం కలుగుతుందని రాజ్యసభకు తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణ జాప్యానికి గల కారణాల గురించి మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక రోడ్డు ఎయిమ్స్ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాంతంలో ఉండటం, అలాగే ఎయిమ్స్ నిర్మాణానికి కేటాయించిన భూములను వ్యవసాయ భూముల నుంచి సంస్థ భూములుగా బదలాయించడంలో జరిగిన జాప్యం కారణంగా భవన నిర్మాణ పనులు మందగతిన సాగుతున్నట్లు మంత్రి చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణ ప్రాంతంలో రోడ్డు కోసం మాస్టర్ ప్లాన్‌లో చేసిన ప్రతిపాదనను రద్దు చేయవలసిందిగా పలుమార్లు కోరిన మీదట జూన్ 2018లో ఏపీసీఆర్డీఏ అనుమతించినట్లు మంత్రి చెప్పారు.ఎయిమ్స్ నిర్మాణాలను ముందుగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారమే సెప్టెంబర్ 2020 నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. తొలి దశ కింద ఓపీడీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పనులను సెప్టెంబర్ 2017లో ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 45 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. రెండో దశ కింద హాస్పిటల్, అకడమిక్ క్యాంపస్ నిర్మాణ పనులను మార్చి 2018లో ప్రారంభించగా ఇప్పటి వరకు 14 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడించారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు 231 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా అందులో 156 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. -
పడిపోయిన ఏపీ ర్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్టుబడుల ఆకర్షణ జాతీయ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ మరింత దిగజారింది. గత ఏడాది కంటే నాలుగు స్థానాల దిగువకు పడిపోయి 7వ ర్యాంక్‌కు చేరింది. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ వరసగా 7, 8 స్థానాల్లో నిలిచాయని మంత్రి చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏపీ నాలుగు ర్యాంకుల కిందకు పడిపోయిందని రాధాకృష్ణన్ వివరించారు. 2016లో 4వ ర్యాంక్, 2017లో 3వ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్.. 2018 నాటికి నాలుగు స్థానాలు దిగజారి 7వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు సుశిక్షితులైన శ్రామిక శక్తి, మౌలిక వసతుల లేమి, వ్యాపార, వాణిజ్యాలలో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణమే ఏపీ ర్యాంక్ పడిపోవడానికి కారణమని మంత్రి వివరించారు. -
‘కాంగ్రెస్ పార్టీలోనే దొంగిలించిన పార్టీ విలీనం’
సాక్షి, హైదరాబాద్ : ‘యూ - టర్న్’ అంకుల్ చంద్రబాబు నాయుడు మరో చారిత్రక యూ టర్న్‌కు సిద్ధపడిపోయారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ - టీడీపీ దోస్తిని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయిపోయారు. బాబు రాహుల్ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ యూ - టర్న్ అంకుల్ మరో చారిత్రక యూ టర్న్‌కు సిద్ధపడిపోయినట్లు తెలుస్తోందంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలో.. తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయం’టూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. దేశాన్ని రక్షించాలి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రచారం చేస్తున్నది ఎవరంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అరవీర సూడో మీడియా ప్రజాస్వామ్యవాది చంద్రబాబు అంటూ ఆయన మండి పడ్డారు. అన్నింటా ఏపీ నం.1. జల హారతులు, బోట్ రేసులతో రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్‌కి చేరింది. ప్రపంచపటంలో అమరావతికి సింగపూర్ పక్కనే చోటు. సంతృప్తస్థాయి 100% దాటేసింది. ఆనంద ఆంధ్రను చూసి అమెరికా, చైనా, రష్యా కుళ్ళిపోతున్నాయంటూ...చంద్రబాబు ఊదరగొడుతున్నారన్నారు. ఈ ప్రేలాపనలతో చంద్రబాబుకు ఏం జబ్బో తెలియక డాక్టర్లు బిత్తరపోయారట అంటూ విజయసాయి రెడ్డి ఎద్దెవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్ అయిపోయి, రాహుల్ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ ‘యూ-టర్న్ అంకుల్’ మరో చారత్రక ‘యూ టర్న్’కు సిద్ధపడిపోతున్నాడు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలోనే తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులుదగ్గరలోనే ఉన్నాయి. — Vijayasai Reddy V (@VSReddy_MP) 22 November 2018 దేశాన్ని రక్షించాలి....ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎవరంటున్నారు ఈ మాటలు? నాలుగున్నరేళ్ళలో ప్రజాధనాన్ని విచ్చల విడిగా దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, ప్రజలను నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిన అరివీర pseudo మీడియా ప్రజాస్వామ్యవాది...చంద్రబాబే! — Vijayasai Reddy V (@VSReddy_MP) November 22, 2018 అన్నింటా ఏపీ నం.1. జల హారతులు, బోట్ రేసులతో రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్‌కి చేరింది. ప్రపంచపటంలో అమరావతికి సింగపూర్ పక్కనే చోటు. సంతృప్తస్థాయి 100% దాటేసింది. ఆనంద ఆంధ్రను చూసి అమెరికా, చైనా, రష్యా కుళ్ళిపోతున్నాయి...చంద్రబాబు ప్రేలాపనలతో ఏం జబ్బో తెలియక డాక్టర్లు బిత్తరపోయారట! — Vijayasai Reddy V (@VSReddy_MP) November 22, 2018 -
‘నాయుడు బాబు కాపీ క్యాట్’
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నేతను నేనే, ఎన్టీఆర్‌కు, నరేంద్ర మోదీకి రాజకీయ సలహాలు ఇచ్చింది నేనే.. ఎక్కడా లేనటువంటి పథకాలు ప్రవేశ పెట్టింది నేనే’ అంటూ గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాయుడు బాబు పక్కా కాపీ క్యాట్. ఏ ఐడియా, స్కీము బాబు సొంతం కాదు. చదువులో మొదలెట్టి రాజకీయాల వరకు కాపీ కొట్టడంలో బాబు చూపిన నేర్పరితనానికి డాక్టరేట్ ఇవ్వడానికి ఏ యూనివర్సిటీ ముందుకు రాకపోవడం విచారకరం. ఐటీ పరిభాషలో బాబు కాపీ-పేస్ట్ మ్యాన్’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. అలా చేస్తే ఏపీ అప్పులు తీరుతాయి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని పదేపదే చెబుతున్న టీడీపీ ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మరో ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజానా దోచుకోవడంతోనే ఏపీ అప్పుల్లో కూరుకపోయింది. చంద్రబాబు ఆస్తులు, అదేవిధంగా ఆయన బినామీ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తే ఏపీ అప్పుల నుంచి కచ్చితంగా బయటపడుతుంది’ అంటూ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. -
ఆ విషయంలో నాయుడుబాబుది గిన్నిస్ స్థాయి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘జిమ్మిక్కులలో సీఎం నాయుడుబాబుది గిన్నిస్ బుక్ స్థాయి. ఐడియాలు నిస్సిగ్గుగా కాపీకొట్టి అవి తన బుర్ర నుంచే పుట్టినవిగా చెప్పుకుంటూ పబ్లిక్‌గా అమ్మేసుకుంటాడు. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసేది శూన్యం’ అని ఆయన మండిపడ్డారు. ‘10 వేల కోట్లతో టూరిజం మిషన్, హెలీ టూరిజం, బీచ్ టూరిజం అంటూ చంద్రబాబు ఊదరగొట్టేశాడు. ఐఎన్ఎస్ విరాట్‌ను కన్వెన్షన్ సెంటర్‌గా మారుస్తానని కన్సల్టెంట్లకు కోట్లు ధారపోశాడు. రాజమండ్రి రైల్ బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్ చేస్తానన్నాడు. మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు’ అని మరో ట్వీట్లో విమర్శించారు. ‘చంద్రబాబు స్వార్థపరుడు, తన గురించే ఆలోచిస్తారు.. తనను తాను ప్రమోట్ చేసుకుంటారు. ఆయన ఎప్పటికీ మంచి నాయకుడు కాలేరు. చంద్రబాబు ఎప్పటికీ ఏపీని అభివృద్ధి చెందనీయరు. ప్రజలను ప్రశాంతంగా జీవించనీయరు’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ.. ఆయన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విజయసాయిరెడ్డి గతకొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. జిమ్మిక్కులలో సీఎం నాయుడుబాబుది గిన్నిస్ బుక్ స్థాయి. ఐడియాలు నిస్సిగ్గుగా కాపీకొట్టి అవి తన బుర్ర నుంచే పుట్టినవిగా చెప్పుకుంటూ పబ్లిక్‌గా అమ్మేసుకుంటాడు. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసేది శూన్యం. — Vijayasai Reddy V (@VSReddy_MP) 20 November 2018 10 వేల కోట్లతో టూరిజం మిషన్.హెలీ టూరిజం, బీచ్ టూరిజం అంటూ చంద్రబాబు ఊదరగొట్టేశాడు. ఐఎన్ఎస్ విరాట్‌ను కన్వెన్షన్ సెంటర్‌గా మారుస్తానని కన్సల్టెంట్లకు కోట్లు ధార పోశాడు. రాజమండ్రి రైల్ బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్ చేస్తానన్నాడు. మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) 20 November 2018 Chandrababu is Selfish, Self-centred, self-serving, self-promoting. He can never be a good leader. He can never allow State to Develop and people of AP live in peace and prosper. — Vijayasai Reddy V (@VSReddy_MP) 20 November 2018 -
‘మా నోట్లను మేమే ముద్రించుకుంటామంటారేమో’
సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్లకోసారి ఎన్నికలలతో అభివృద్ధి నిలిచిపోతుందని 2050 వరకూ ఎలక్షన్లు అవసరం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో తెచ్చినా తెస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పొంతన లేకుండా పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హత్యకు స్కెచ్ వేసి అది కేంద్ర నియంత్రణలో ఉంది..మాకేం సంబంధం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాడని.. అందుకే మా నోట్లను మేమే ముద్రించుకుంటామని చంద్రబాబు జీవో తెచ్చిన తెస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మానసిన స్థితి బాగాలేదని, ఆయన్ని డాక్టర్లకు చూపించాలంటూ పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. pic.twitter.com/eRYqZtJdFA — Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2018 pic.twitter.com/fPiz2aSEdg — Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2018 -
మహాకూటమి ఫైనాన్షియర్ నాయుడు బాబే!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి మరోసారి పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ రాహుల్‌గాంధీ దూతగా అమరావతికి వచ్చి చంద్రబాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యమిదేనని ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద రూ. వెయ్యి కోట్లు పెట్టడానికి డీల్ కుదిరిందని, ఈ సొమ్మంతా పాలు, కూరగాయలు అమ్మతే వచ్చిన లాభం కదా! అంటూ చంద్రబాబును వ్యంగ్యంగా ప్రశ్నించారు. జననేత వైఎస్ జగన్ హత్యకు ప్రయత్నించిన కోడి కత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదని హెచ్చరిస్తూ మరో ట్వీట్ చేశారు. ‘వెయ్యిగొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. పింగళి దశరథ రామ్‌ను, రాఘవేంద్ర రావును, మల్లెల బాబ్జీని, వంగవీటి రంగాను చంపించిన, ఇంకా ఎంతోమంది హత్యలకు పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు. కానీ జననేత వైఎస్ జగన్ హననానికి ప్రయత్నించిన కోడికత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్. కాంగ్రెస్ నేత గెహ్లాట్ రాహుల్ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే. మొత్తం మీద 1000 కోట్లు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా! — Vijayasai Reddy V (@VSReddy_MP) 14 November 2018 వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలుతుంది.పింగళి దశరథ రామ్‌ను,రాఘవేంద్ర రావును,మల్లెల బాబ్జీని,వంగవీటి రంగాను చంపించిన,ఇంకా ఎందరి హత్యలకో పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు.కానీ జననేత జగన్ గారి హననానికి ప్రయత్నించిన కోడి కత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) 14 November 2018 -
రాష్ట్రంలో రాక్షసపాలన.. అవినీతి పాలన..
-
‘అవినీతికి మారుపేర్లుగా నిప్పు నాయుడు, పప్పు నాయుడు’
సాక్షి, విశాఖపట్నం: గత నాలుగేళ్ల పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, అన్ని వర్గాలను టీడీపీ సర్కార్ మోసం చేసిందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా.. విశాఖ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లాలో రెండో రోజు పాదయాత్ర చేశారు. విశాఖపట్నం జిల్లా మల్కాపూరంలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నానికి సంబంధించి పలు అంశాలను పార్లమెంట్లో లెవనెత్తి వాటిని పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేశానన్నారు. ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్నటువంటి కొన్ని సంస్థలున్నాయని, తాము పరిశ్రమల అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. కానీ అభివృద్ధితో పాటు కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నదే వైఎస్ జగన్ ఉద్దేశమని తెలిపారు. పారిశ్రామిక వాడలోని ప్రజల స్థితిగతులు అంతంత మాత్రమే. వాయు, జల, శబ్ధ కాలుష్యాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉద్యోగావకాశాల కోసం ఏ పరిశ్రమ ఇక్కడ స్థాపించినా.. 75 శాతం స్థానికులకే ఉద్యోగం అని చెప్పారు. పాటించి చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్. స్థానిక ఎమ్మెల్యే అవినీతితో సొమ్మును ఆర్జించాలి, ధనవంతుడు ఎలా కావాలన్నదానిపై దృష్టి సారించారు. పరిస్థితులు మారాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలి. సంఘీభావ యాత్రలో ఓ విషయం స్పష్టమైంది. కొండ వాలు ప్రాంతంలో రోడ్లు ఇరుకిరుకిరుకుగా ఉన్నాయి. కొండ చరియలు విరిగిపడే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాన్ని గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఒక్క ఇళ్లయినా కట్టిచ్చారా? గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇళ్లు కూడా కట్టించిన పాపాన పోలేదు. కేవలం పచ్చ తమ్ముళ్లకే ఆయన లబ్ధి చేకూర్చారు. ఏపీలో విశాఖలోనే అధిక కుంభకోణాలు జరిగాయి. అప్పట్లో ఎకరా 850 రూపాయలకు ప్రభుత్వానికి ఇచ్చారు. ఈరోజు హిందుస్తాన్ షిప్‌యార్డును ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు కట్టబెట్టగా, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ గతంలో షిప్‌యార్డ్ నష్టాల్లో కూరుకుపోయిందని గ్రహించిన వైఎస్సార్ దాన్ని రక్షణశాఖకు అప్పగించి లక్షల మంది ఉద్యోగాలు కాపాడారు. వైఎస్సార్ అందించిన జనరంజకమైన పాలన మళ్లీ రావాలంటే జననేత వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో రాక్షసపాలన.. అవినీతి పాలన.. ఏపీలో గత నాలుగేళ్లుగా 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌లు అన్ని విభాగాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారు. పరమక్రూరుడైన జర్మనీ నియంత హిట్లర్ పుట్టినరోజే (ఏప్రిల్ 20న) చంద్రబాబు పుట్టారు. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు లక్షల మంది మృతికి కారమైన హిట్లర్‌లా.. నేడు చంద్రబాబు వ్యవరిస్తున్నారు. హిట్లర్ మంత్రి వర్గంలో జోసెఫ్ గోబెల్స్ అనే వ్యక్తి పనిచేసేవారు. అబద్దాలను నిజాలుగా ప్రచారం చేయడమే ఆయన బాధ్యత. ఆ హిట్లర్-గోబెల్స్ ఇద్దరూ ప్రస్తుతం చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేశారని అనుమానం కలుగుతోంది. తన సామాజిక వర్గానికి తప్ప, ఎవరికీ ప్రయోజం చేకూర్చని వ్యక్తి చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికల కోసం దొంగసొమ్ము దాచిన చంద్రబాబు ఇక్కడ ఏపీలో డబ్బులు లేకుండా పోయాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఎందుకు డబ్బుల్లేవ్ అంటే.. దానిక్కూడా వైఎస్సార్సీపీనే కారణమంటూ అనవసర ఆరోపణలు చంద్రబాబు చేస్తున్నారు. నిజం ఏంటంటే.. కేంద్రం నుంచి డబ్బులు రాగానే.. కేవలం తన పార్టీకి, తన వ్యక్తిగత లబ్ధి చేకూర్చే అంశాలకు ఖర్చు చేయడం వల్లే ఏటీఎంలు, బ్యాంకులల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఆర్బీఐ వద్ద కూడా 500, 2000 రూపాయల నోట్లు లేవు. అవి ఎక్కడకి పోయాయంటే కేవలం చంద్రబాబు వ్యక్తిగత ఖజానాలోకి పోయాయి. రాబోయే ఎన్నికల తాను దాచిన దొంగసొమ్మును చంద్రబాబు ఖర్చుపెట్టనున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బీసీలకు చంద్రబాబు హయాంలో అన్యాయయే ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్వయంగా చంద్రబాబే చెప్పిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. జ్యోతిబాపూలే జయంతి రోజు చంద్రబాబు వ్యాఖ్యలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. బీసీలంటే తనకెంతో ప్రేమ అని చంద్రబాబు కబుర్లు చెబుతారు. అయితే బీసీ క్లాస్ వాళ్లు ఎప్పుడూ బాగుపడలేదు. ఎందుకంటే.. ఏపీ సీఎం దృష్టిలో బీసీ క్లాస్ అంటే.. బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బాబుగారి క్లాస్ మాత్రమేనని చెప్పారు. బీసీ కార్పొరేషన్‌కు ప్రతి ఏడాది 10 వేల కోట్లు ఇస్తానన్నారు. ఈ నాలుగేళ్లలో బీసీ కమిషన్, కార్పొనేషన్లకు ఎంత ఇచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం రాగానే ఏదో కంటి తుడుపు చర్యగా కొంత కేటాయించారు. వైఎస్సార్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేవారు. ఓసీ విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్ సదుపాయం కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. కానీ చంద్రబాబు ఏం చేశారంటే కేవలం నారాయణ సంస్థలకు తోడ్పాడు అందించడం తప్ప, ఇంకేం చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. 'వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాట్లు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ ఇదివరకే హామీ ఇచ్చారు. దళిత గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. నవంబర్ 6వ తేదీన ప్రజాసంకల్పయాత్ర పేరుతో జూలైలో ప్రకటించిన నవరత్నాలుపై ప్రజల అభిప్రాయలు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూపీఏ ఇవ్వకపోతే తామిస్తామంటూ బీజేపీ ప్రకటించింది. కానీ నాలుగేళ్లు గడిచినా ఎన్డీఏ సర్కార్ ఇప్పటికీ హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తోందంటూ' వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. -
‘లోకేశ్‌నూ చంద్రబాబు నమ్మడం లేదు’
-
‘లోకేశ్‌నూ చంద్రబాబు నమ్మడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు రంగులు మారుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. అవసరాన్ని బట్టి పూటకో మాట మార్చడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. రాత్రికి రాత్రే ప్రెస్‌మీట్ పెట్టి అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది తామేనని తెలిపారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఎలా మాట మార్చారో అందరికీ తెలుసునని అన్నారు. తన నీడను తానే నమ్మలేరని, లోకేశ్ కూడా ఆయన నమ్మడం లేదని.. అటువంటి వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
బాబుకు ఎంపీ విజయసాయిరెడ్డి సూటిప్రశ్న
సాక్షి, తిరుపతి: తన వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై రుద్దుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు కాదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేశారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటం చేస్తూనే ఉన్నారని, కానీ అధికార టీడీపీ నేతలు మాత్రం తమ రాజకీయ లబ్ధి కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో తాము కూడా పోరాడినట్లు టీడీపీ ఎంపీలు వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఓ ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగా అందరినీ కలుస్తున్నామని, సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఈసీని కలుస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. -
28న జగనన్నతో నడుద్దాం
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటుతున్న సందర్భంగా తలపెట్టిన ‘జగనన్నతో నడుద్దాం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకొని కోస్తాలో అడుగుపెట్టిన వై.ఎస్.జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో తాము పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారని చెప్పారు. దారిపొడవునా వేలాది మందిని కలుస్తూ వారి కష్టసుఖాలు వింటూ వైఎస్ జగన్ అప్రతిహాతంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కో ఆర్డినేటర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పాదయాత్ర ఈ నెల 28న నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాట బోతుందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టామన్నారు. జిల్లాలో కూడా ఇదేరీతిలో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలతో కలిసి పాదయాత్రలు చేయాలన్నారు. పార్టీ కో ఆర్డినేటర్లతో పాటు అనుబంధ కమిటీలు, ఇతర విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల నేతలంతా పాదయాత్రలో పాల్గొనేలా చూసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయం చేయాలన్నారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. నెలఖారులోగా కమిటీల నియామకం పూర్తి చేయాలి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వార్డు, మండల కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కో ఆర్డినేటర్లను ఆదేశించారు. వార్డు, మండల కన్వీనర్లతో పాటు అనుబంధ విభాగాలకు కూడా అధ్య క్షులు, ఇతర కార్యవర్గాల నియామకాలను నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాను మూడు పార్లమెంటు జిల్లాలుగా వేరు చేసినందున వాటి పరిధిలో కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలన్నారు. అదే విధంగా ప్రతి బూత్‌కు పదిమంది చొప్పున కమిటీల ఏర్పాటును ఫిబ్రవరి నెలాఖరులోగా నియమించాలని సూచించారు. బూత్ కమిటీల్లో ఖాళీగా ఉన్న నియామకాలను భర్తీ చేయాలన్నారు. సైనికుల్లా పనిచేసే వార్ని గుర్తించి బూత్ కమిటీల్లో వేయాలన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కమిటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఐటీ విభాగం రాష్ట్రకన్వీనర్ చల్లా మధుసూదన రెడ్డి, విశాఖ, అనకాపల్లి, అరుకు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాధ్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పలనాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజు, అక్కరమాని విజయనిర్మల, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, చెట్టి ఫల్గుణ, బొడ్డేడ ప్రసాద్, ఏకేవి జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. పాడేరు నుంచి భారీగా చేరికలు సాక్షి, విశాఖపట్నం :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని.. ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు అసెంబ్లీ కో ఆర్డినేటర్ చెట్టి పాల్గుణల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సీనియర్ నేతలు మంగళవారం పార్టీలో చేరారు. విశాఖలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు వందమంది చేరగా.. వారందరికీ ఎంపీ విజయసాయిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహానేత సంక్షేమ ఫలాల ద్వారా లబ్ధి పొందిన గిరిజనులు దివంగత వైఎస్సార్‌ను తమ గుండెల్లో పెట్టుకుని దైవంలా కొలుచుకుంటున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీకి చెందిన ఎంపీటీసీల ఫోరం చింతపల్లి అధ్యక్షుడు ఉల్లి సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం చింతపల్లి మండల అధ్యక్షుడు బోయిన సత్యనారాయణ, పీసా కమికీ చింతపల్లి మండల అధ్యక్షుడు ఉల్లి నూకరాజు, బీజేపీ చింతపల్లి డివిజన్ నాయకులు వసుపరి ప్రసాద్, బీఎస్పీ డివిజన్ అధ్యక్షుడు సుమర్ల సూరిబాబు, జల్లిబాబు, పీసా కమిటీ సభ్యులు బురిటి ఆదినారాయణ, పొటుకూరి ధారబాబు, అరుకు చిన్నయ్య, ఉల్లి సతీష్, సెగ్గె నూకరాజు, కాంగ్రెస్ యూత్ నాయకులు మాజీ ఎంటీపీసీ సభ్యుడు బురిటి ధనుంజయ, ఉన్నారు. -
మత్స్యకారుల దీక్షకు వైఎస్సార్సీపీ సంఘీభావం
సాక్షి, విశాఖపట్నం : తమను ఎస్టీల్లో చేర్చాలని 20 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వారికి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావులు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం మత్సకారుల వద్దకు వెళ్లి తమ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. మత్స్యకారులను కూడా మోసం చేస్తే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని వారు టీడీపీని హెచ్చరించారు. -
మోదీని కలిసిన విజయసాయిరెడ్డి
-
ప్రధాని మోదీని కలిసిన విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్‌లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో మోదీతో మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డికి మోదీ వైకుంఠ ఏకాదశి విషెస్ చెప్పారు. దాదాపు 15 నిమిషాలపాటు సాగిన భేటీలో రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర వివరాలను, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన గురించి ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి తెలిపారు. గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ, హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
'ఆయన వైఎస్ఆర్ సీపీ నేత కాదు'
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ జనరల్ సెక్రెటరీ, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 'గంగుల ప్రతాపరెడ్డి 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి' తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరినట్టు కొన్ని చానళ్లు, పత్రికల ద్వారా జరిగిన ప్రచారాన్ని ఖండిస్తున్నాం. గంగుల ప్రతాపరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరనూ లేదు. మా సభ్యుడు కాదు. మా పార్టీకి సంబంధించిన నాయకుడూ కాదు. కాబట్టి ఆయన మా పార్టీని వీడటం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెయాల్సిందిగా మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు' విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు వైఎస్ఆర్ సీపీ నేత గంగుల ప్రతాపరెడ్డి అధికార టీడీపీలో చేరారని కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్‌కు వెంకయ్య గర్వకారణం
► రాజ్యసభ చైర్మన్‌గా స్వాగత చర్చలో విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు వెంకయ్యనాయుడు గర్వకారణమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈసందర్భంగా రాజ్యసభలో ఆయనకు స్వాగతం పలికే చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. వెంకయ్యనాయుడు స్ఫూర్తితో తాను హిందీలో ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నానని.. తొలుత హిందీలో ప్రసంగించారు. అనంతరం ఆంగ్లంలో విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచారు. ఎమర్జెన్సీ కాలంలో మీరు చేసిన పోరాటం మరువలేనిది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుడిగా మీ పనితీరు చరిత్రాత్మకం. ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని మరిచిపోలేరు. మీ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉండటమనేది కొద్ది మందికి మాత్రమే సాధ్యం. ఉపరాష్ట్రపతిగా మీరు దేశానికి గొప్ప నాయకత్వం వహిస్తారని నమ్ముతున్నాం. నేను, మా పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు. -
బాల్యవివాహాలు అరికట్టాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: బాల్యవివాహాల అంశాన్ని రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తారు. బాల్యవివాహాల నిరోధక చట్టం-2006 ఉన్నా.. ఏపీలో సరిగా అమలు కావడం లేదన్నారు. బాల్య వివాహాలలో ఏపీలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. 20,584 మంది బాలికలు, 19,557 మంది బాలురకు వివాహ వయసుకు ముందే బాల్య వివాహాలు జరిగాయని వెల్లడించారు. విశాఖ, అనంతపురం, కర్నూల్, చిత్తూరు జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని చెప్పారు. విశాఖలో 16,876 మంది బాలికలు, అనంతపురం జిల్లాలో 16,738 మంది బాలికలు కర్నూలు జిల్లాలో 16,532 మంది బాలికలు, చిత్తూరు జిల్లాలో 15, 769 మంది బాలికలు బాల్యవివాహాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్య వివాహాలు సమాజంపై తీవ్ర దుష్పరిణామం చూపిస్తాయని.. దీనివల్ల ఆడపిల్లల విద్యావకాశాలు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తిచేశారు. బాల్యవివాహాల వల్ల తలెత్తే సమస్యలు, అనర్ధాలపై గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.