ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్‌లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో మోదీతో మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డికి మోదీ వైకుంఠ ఏకాదశి విషెస్ చెప్పారు.