కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు.