Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు.