ధాని నరేంద్ర మోదీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. విభజన హామీలను నెరవేర్చాలని, ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేయాలని మోదీని కోరారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్ ప్లాంట్, పోలవరం, దుగరాజపట్నం పోర్టు వంటి భారీ ప్రాజెక్టులకు అదనపు నిధులను కేటాయించాలని మోదీని కోరారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రం అందకారంలో ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించారు. గంటలకు పైగా సాగిన భేటీలో రాష్ట్ర సమస్యలే ఎజెండాగా సాగింది.