( ఫైల్ ఫోటో )
ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్‌లో బైపీసీ చేయాలంటూ ఇటీవల ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మరోసారి తన అజ్జానాన్ని ప్రదర్శించి పరువును దిగజార్చుకోవడంతో ఇదెక్కడి విజనరీ అనుకోవడం ప్రజల వంతైతే.. తాజాగా బాబు ‘ఇంజినీరింగ్ బైపీసీ’ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో దానిని చమత్కరించారు.
‘చంద్రబాబు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీర్ కావొచ్చు . పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావొచ్చు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు - అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చు’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
చంద్రబాబు గారు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీర్ కావచ్చు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చు, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు. అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 21, 2023
Comments
Please login to add a commentAdd a comment