సాక్షి, ఢిల్లీ: ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ కౌంటరిచ్చారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు అంటూ ఎద్దేవా చేశారు. మీ నాన్నాగారు(ఎన్టీఆర్) మహానటులు.. మీరు(పురంధేశ్వరి) కాదనుకున్నాం అంటూ పొలిటికల్ పంచ్ ఇచ్చారు.
కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ట్విట్టర్ ‘అమ్మా, పురందేశ్వరిగారు.. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్.. వదినది డైలాగ్! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్!. మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!’ అంటూ కామెంట్స్ పెట్టారు.
అయితే, 2013లో పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పురంధశ్వేరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘వెన్నుతట్టి ప్రొత్సహించిన నాయకురాలు, కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీకి, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, పురంధేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అమ్మా, పురందేశ్వరిగారు...బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్... వదినది డైలాగ్! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ...మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్!
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 30, 2023
మీ నాన్నగారు మహానటులు... మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన… pic.twitter.com/5ZJnpdxqWQ
ఇది కూడా చదవండి: ‘ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా ప్రచారం’
Comments
Please login to add a commentAdd a comment