
సాక్షి, అమరావతి : ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి డీఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చారని, దీనిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. సినియారిటీని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు. పదోన్నుతుల్లో పాటించాల్సిన రొటేషన్ రూల్స్‌ని చంద్రబాబు ఉల్లంఘించారన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వారికే పదోన్నతులు కల్పించారని ఆరోపించారు. సామాజికవర్గమే ప్రాతిపదికగా జరుగుతున్న పోలీసు శాఖ పోస్టింగ్‌లపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. విచారణలో ఆరోపణలు రుజువు అయితే ప్రమోషన్లు రద్దు చేయడంతో పాటు, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిని శిక్షించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.