
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(పాత చిత్రం)
ప్రజల నుంచి దోచుకున్న లక్షల కోట్లు సరిపోవట్లేదేమో?..
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అవినీతిని ట్విట్టర్ ద్వారా సెటైరికల్‌గా ఎండగట్టడంలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిది అందె వేసిన చేయి. రోజూలాగే టీడీపీ నాయకులు చేసిన తప్పులను మరో సారి ట్విట్టర్ ద్వారా విమర్శించారు. చిట్టి నాయుడు భీమిలి నుంచి పోటీకి సై అంటున్నారని కుల పత్రిక పరవశంతో ప్రకటించిందని తెలిపారు. కుప్పం వెళ్లమని తండ్రి అడిగితే భీమిలీలోనే తేల్చుకుంటా అన్నాడట అని పేర్కొన్నారు. కుప్పం నుంచి పోటీకి పెద్ద నాయుడు కూడా జంకుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా మాట్లాడారు. పప్పు బాబుకు మాత్రం ఈసారి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాగ్రహం ఆ స్థాయిలో ఉందని వ్యాక్యానించారు.
అలాగే ‘ ప్రజల నుంచి దోచుకున్న లక్షల కోట్లు సరిపోవట్లేదేమో? కలియుగ దైవం వెంకటేశ్వరుడి ఆభరణాలకూ మినహాయింపు లేదు. రూ.500 కోట్ల విలువైన పింక్ డైమండ్ ఏమైంది. గోవింద రాజ స్వామి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయమై నెల రోజులు దాటింది. ఇదిగో అదిగో అంటున్నా ఇంత వరకు గుట్టు తేల్చలేదని’ ట్విట్టర్ ద్వారా విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.