అది వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం: విజయసాయిరెడ్డి | I Am Loyal to YSRCP Vijayasai Reacts To Party Change Rumours | Sakshi
Sakshi News home page

పార్టీ మార్పు ప్రచారంపై మండిపడ్డ విజయసాయిరెడ్డి

Published Wed, Aug 28 2024 9:19 PM | Last Updated on Thu, Aug 29 2024 8:52 AM

I Am Loyal to YSRCP Vijayasai Reacts To Party Change Rumours

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీకి కీలక నేతల వలసలు ఉండబోతున్నాయంటూ ఈ ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా తెగ హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఐ-టీడీపీ, దాని అనుబంధ సోషల్‌ మీడియా విభాగాలు సైతం ఆ ప్రచారానికి కొన్ని పేర్లను జోడించి పోస్టులు వైరల్‌ చేస్తున్నాయి. అయితే..

ఆ దుష్ప్రచారం తీవ్రంగా స్పందించారు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.

తాను ఎప్పటికీ వైస్సార్‌సీపీలోనే ఉంటానని.. మరో పార్టీలో చేరబోతున్నారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్‌ ఖాతాలో సందేశం ఉంచారు. 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement