defection
-
అప్పుడు ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపులపై ఏ ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి మంచిదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని, 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ‘బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా? అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేనని, కోర్టుల తీర్పులు తమకే మేలు చేస్తాయని చెప్పారు. చదవండి: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన -
TG: పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: శాసన సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌర పరిచేలా మాట్లాడటం సరికాదని బీఆర్ఎష్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.‘‘ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావ్ల అనర్హతపై నాలుగు వారాల్లో నివేదిక ప్రకటించాలని ఆ సెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వక పొతే సుమోటోగా హైకోర్టు కేసును నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. తీర్పు కాపీ రాలేదని.. టై పాస్ చేయొద్దని, తక్షణం యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని కలిశాం. మిగతా ఎడుగురి ఎమ్మెల్యే అనర్హత స్పీకర్ కార్యాలయంలో వుంది. వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి.. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మంత్రి శ్రీధర్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌరపరిచేలా మాట్లాడటం సరికాదు. శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. 10 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. పార్టీ పిరాయించిన రాహుల్ గాంధీ ఏమో వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. చట్టం తీసుకొస్తా అని చెప్పింది రాహుల్ గాంధే కదా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. సీఏసీ చైర్మన్ నియామకం సభ నియమావళికి విరుద్దంగా జరిగింది. 14 నామినేషన్ వేస్తే ఎన్నికలు పెట్టాలి.. కానీ పెట్టలేదు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. హరీశ్ రావ్ నామినేషన్ ఎక్కడికి పోయింది. పార్టీ తరుపున 3 పేర్లు ఇచ్చారు. నాలుగో పేరు ఎవరు ఇచ్చారు. శ్రీధర్ బాబు దిగజారి మాట్లాడుతున్నారు. తీర్పు వచ్చాక పార్టీ మరీనా ఎమ్మెల్యేలు ఒక్కోరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. 10 ఎమ్మెల్యేలను మోసం చేశారు రేవంత్ రెడ్డి. ముందు నోయీ వెనక గొయ్యిలాగా వుంది వారి పరిస్థితి.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయంతెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘ దానం నాగేందర్ బిచ్చగాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, దానం నాగేందర్ బిగ్ చీటర్, మాజీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ మిలిగిపోతారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు. కడియం రాజీనామా చేయాలి. డిపాజిట్ కూడా కడియంకు రాదు. చీరలు , గాజులు 10 మంది ఎమ్మెల్యేలకు కొరియర్ చేస్తా వేసుకొని తిరగండి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే మీరు రాజీనామా చేయాలి. గత 10 ఏళ్లలో ఒక్క ఎమ్మెల్యేకు అయినా వ్యక్తి గతంగా పార్టీ కండువా కేసీఆర్ కప్పినట్టుగా చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’అని అన్నారు. ప్రస్తుతం కౌశిక్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.చదవండి: పార్టీ ఫిరాయింపుల కేసు: అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుచదవండి: నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ -
‘వైఎస్సార్సీపీని వీడి.. కాలగర్భంలో కలిశారు’
గుంటూరు,సాక్షి: ప్రజలను దృష్టి మరల్చేందుకు.. రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై తమ స్పందన తెలియజేస్తున్నారు. సభ్యుల పార్టీ మార్పుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఫైర్ అయ్యారు. ఆయన గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.‘‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే చంద్రబాబు పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజలను దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారినవారు కాలగర్బంలో కలిసిపోయారు. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదు’’ అని అన్నారు.ఇది చారిత్రిక సత్యం!అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై అంబటి రాంబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు.. ఇది చారిత్రిక సత్యం!’ అని అన్నారు.అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ,ప్రజాదరణ పొందలేదు ఇది చారిత్రిక సత్యం !— Ambati Rambabu (@AmbatiRambabu) August 29, 2024 -
అది వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం: విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి కీలక నేతల వలసలు ఉండబోతున్నాయంటూ ఈ ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా తెగ హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఐ-టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు సైతం ఆ ప్రచారానికి కొన్ని పేర్లను జోడించి పోస్టులు వైరల్ చేస్తున్నాయి. అయితే..ఆ దుష్ప్రచారం తీవ్రంగా స్పందించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైఎస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.తాను ఎప్పటికీ వైస్సార్సీపీలోనే ఉంటానని.. మరో పార్టీలో చేరబోతున్నారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు. I wish to make it clear that I am a loyal, dedicated, and committed worker of the YSRCP. I will remain with YSRCP and work under the leadership of Sri @ysjagan Garu. I condemn the baseless speculation and misinformation being spread by a section of the media about me quitting…— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2024 -
ఫిరాయింపులతో మేమేం లాభపడలేదు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆయన మంగళవారం ఫిరాయింపులపై మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీలో చేరిన వారిలో 10 మంది ఓడిపోయారు. ఫిరాయింపులతో మాకు లాభం జరగలేదు. మేమేం లాభపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎప్పుడూ చెప్పలేదు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాము. .. కాంగ్రెస్ పార్టీ వలే ఇతర పార్టీ నేతలకు ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పలేదు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటేనే.. మేము ఏంటి? మా విలువ ఏంటి? అనేది ప్రజలకు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన మాకు, పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు’’ అని అన్నారు. -
తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్.. కేసీఆర్ ప్యూచర్ ప్లాన్ ఏంటి?
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, ఏడుసార్లు గెలుపొందిన ఎన్నికైన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి జంప్ చేయడం భారత రాష్ట్ర సమితికి పెద్ద దెబ్బే అవుతుంది. శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశేష గౌరవమే ఇచ్చారు. సంజయ్ అయితే కేసీఆర్‌కు సొంత మనిషి కింద లెక్క. అయినా వారిద్దరూ పార్టీని వీడారంటే ఏమిటి అర్థం. రాజకీయాలలో తమ వ్యక్తిగత అవసరాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని మరోసారి వెల్లడైంది. ఇందులో కులం లేదు. ప్రాంతం లేదు. సిద్దాంతం లేదు.. తమ స్వప్రయోజనాలే మిన్నగా ఉంటాయి. ప్రత్యేకించి రాజకీయంగా ఇప్పటికిప్పుడు జరిగే నష్టం కన్నా, నైతికంగా పార్టీ క్యాడర్‌పై దీని ప్రభావం పడుతుంది.పెద్ద నేతలు, పలు ముఖ్యమైన పదవులు చేసినవారు సైతం పార్టీని వీడుతున్నారన్న అభిప్రాయం ప్రబలితే కిందిస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తాము కూడా పక్క చూపులు చూడాలా అన్న ఆలోచనకు వస్తారు. విశేషం ఏమిటంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన పోచారం శ్రీనివాసరెడ్డి తాను కూడా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చెబుతారు. దానికి పోచారం ఉదంతం కూడా ఒక ఉదాహరణే. పోచారం ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఆహ్వానించడం విశేషం. దీని ద్వారా ఆయనకు గౌరవం ఇచ్చినట్లయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా రేవంత్ వెంట వెళ్లారు.ఇప్పటికే మరో సీనియర్ నేత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు వంటివారు కాంగ్రెస్‌లో చేరిపోయారు. బహుశా అలాంటివారి ప్రభావం కూడా పోచారంపై పడి ఉండవచ్చు. 1994లో తొలిసారి శాసనసభకు టీడీపీ పక్షాన ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్ వాడ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేతగా ఎదిగారు. 1995లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలానికి పోచారానికి మంత్రి పదవి వచ్చింది. కాని ఆయన అల్లుడుపై వచ్చిన స్టేషనరీ స్కామ్ కారణంగా పదవికి రాజీనామా చేశారు. ఆ స్కామ్ రుజువు కాకపోవడంంతో సేఫ్‌గా బయటపడ్డారు. 2004లో ఓటమి చెందిన ఈయన 2009లో తిరిగి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవడంతో కెసిఆర్ కోరిక మేరకు ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు.అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈయన కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి పొందారు. ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉన్న ఆయన 2018లో మరోసారి గెలిచారు. ఈసారి ఆయన తెలంగాణ శాసనసభ స్పీకర్ అయ్యారు. స్పీకర్‌గా ఇతరత్రా పెద్ద వివాదాస్పదుడు కాకపోయినప్పటికీ, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి కొందరుఎమ్మెల్యేలు చేరే క్రమంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ సూచనల ప్రకారమే వ్యవహరించారు తప్ప ఈ విషయంలో స్వతంత్రంగా పనిచేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో విలీనం చేసినట్లు ప్రకటించారు. 2023 ఎన్నికలలో మరోసారి గెలిచారు. నిజానికి పోచారం బదులు ఆయన కుమారుడు 2023 ఎన్నికలలో పోటీచేయవచ్చని అనుకున్నారు. కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈయననే పోటీచేయాలని కోరారు .దాంతో పోటీచేయక తప్పలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోయింది.అయినా గత ఆరు నెలలుగా పార్టీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. పోచారం కదలికలపై కొంత అనుమానం ఉన్నప్పటికీ, ఈ వయసులో పార్టీ మారతారా అన్న భావన ఉండేది. బహుశా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చి ఉండాలి. అలాగే బీఆర్ఎస్కు మళ్లీ అధికారం వచ్చే అవకాశం లేదని ఆయన భావిస్తుండాలి. ఈ క్రమంలోనే స్థానిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఉండవచ్చు. మరో వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి నేతలను, క్యాడర్‌ను ఆకర్షించే యత్నాలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది.దీంతో రేవంత్, కాంగ్రెస్ నేతలు మరింత అప్రమత్తమై బీఆర్ఎస్ నుంచి వీలైనంతమందిని ఆకర్షించే పనిలో పడ్డారు. వీరు తొందరపడకపోతే బీజేపీ నాయకత్వం గాలం వేసి వారివైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచినా, లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీకి సహకరించారన్న అభిప్రాయం వచ్చింది. బీజేపీ పక్షాన గెలిచింది కూడా ఒకప్పుడు టీఆర్ఎస్లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కావడం గమనార్హం.ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ను ఖాళీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. రేవంత్ చొరవ తీసుకుని పార్టీని బలోపేతం చేసుకోవడం, సొంత వర్గాన్ని పెంచుకోవడం చేయకపోతే కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్న భయం ఉంటుంది. అందుకే టీడీపీ బాగ్రౌండ్ ఉన్న నేతలను ఆకట్టుకునే పనిలో ఉన్నారనిపిస్తుంది. గతం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలను ఆయన తనతో పాటు క్యారీ చేస్తున్నారు. ఉదాహరణకు వేం నరేంద్రరెడ్డి వంటివారు సలహాదారు పదవిలో కీలకంగా ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నేత కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి తెచ్చారు.ఆయన కుమార్తెకు ఎంపీ పదవి కూడా వచ్చింది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీని పటిష్టం చేయడం కోసం ఈయనను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చి ఉండాలి. పోచారం కాంగ్రెస్‌లో చేరడంతో ఇబ్బంది రాలేదు కాని, జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లోకి రావడం సీనియర్ నేత టి.జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. కనీసం తనకు చెప్పకుండా చేస్తారా అని తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్దమయ్యారు.అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఆయనను చల్లబరిచారు. ఇలాంటి సమస్యలు అక్కడక్కడా ఉన్నా, ఈ నాలుగేళ్లు ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి, బీజేపీకి అవకాశాలు తగ్గించి, బీఆర్ఎస్ను బలహీనపరచడానికి రేవంత్ ఇదే రూట్ లో వెళ్లవచ్చు. కాగా పోచారం తాను ఎందుకు పార్టీ మారింది చెప్పిన విషయాలు వింటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్న చందంగా ఉందని చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తోందని, అందుకే కాంగ్రెస్‌లోకి వెళుతున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే మొదలైందని వెల్లడించారు. మరి కొందరు నేతలు కే.కేశవరావు, దానం నాగేందర్ వంటివారు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి జారుకున్నారు.వరంగల్ ప్రాంతానికి చెందిన ఎర్రబెల్లి దయాకరరావు కూడా పార్టీ మారవచ్చని ప్రచారం జరిగినా, ఆయనైతే ఖండించారు. పోచారం పార్టీ మారుతున్న సమాచారంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేశారు. పోచారం పార్టీ మారడాన్ని వారు తప్పు పట్టారు. ఆయనకు ఏమి తక్కువ చేశామని పార్టీ ఫిరాయించారని ప్రశ్నించారు. నిజానికి బీఆర్ఎస్ నేతలకు ఇలా ప్రశ్నించే నైతిక హక్కు లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీల నుంచి నయానోభయానో తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అధికారం పోవడంతో ఇప్పుడు అదే పనిని ఇతర పార్టీలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎందరు వస్తే అందరిని, ప్రత్యేకించి ఎమ్మెల్యేలను లాగడానికి కాంగ్రెస్ కృషి చేస్తోంది. పదిహేను నుంచి ఇరవైమంది ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చని చెబుతున్నా, అవన్ని ఒక కొలిక్కి రాలేదు. ఈలోగా బీజేపీ వారు కూడా వలపన్నుతున్నట్లుగా ఉంది.ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఈడి దాడులు ఇందులో భాగమేనా అన్న సందేహం పలువురికి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను బలహీనపర్చితే కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వీక్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నా, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోకూడదని ఏమీ లేదు. ఉదాహరణకు శాసనసభ ఎన్నికల ముందువరకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అయినా సాధారణ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టింది. కాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ను నైతికంగా దెబ్బతీస్తున్నాయి. అందువల్లే కేసీఆర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలతో భేటీ అవుతూ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుందని వారికి నమ్మకం కలిగించే యత్నం చేస్తున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయో అప్పుడే చెప్పలేం. ప్రజలలో కేసీఆర్ మళ్లీ పట్టు సాధిస్తారన్న విశ్వాసం ఏర్పడడానికి ఇంకా సమయం పడుతుంది. సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ ఏ మేరకు ఈ ఫిరాయింపు రాజకీయాలను తట్టుకుని నిలబడుతుందన్నదానికి కాలమే సమాధానం ఇస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అనర్హత విచారణ.. ఎమ్మెల్సీ రఘురాజు గైర్హాజరు
గుంటూరు, సాక్షి: అనర్హత వేటు పిటిషన్ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.ఈ ఫిరాయింపుపై వైఎస్సార్సీపీ, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే రఘురాజు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. బొత్స కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. ఉపేక్షించేది లేదు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై, అంతకు ముందు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేశారు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై.. వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు. దీనకంటే ముందు.. ఎనిమిదిమంది రెబల్ ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. వైఎస్సార్సీపీలో గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకున్నారు. అలాగే టీడీపీలో గెలిచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాళి గిరిలపైనా వేటు పడింది. -
ఎమ్మెల్యే ‘తెల్లం’కు కాంగ్రెస్ కండువా.. స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం(ఏప్రిల్ 7) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫొటోను కేటీఆర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తాజాగా రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టేకి వెళితే ఆటోమెటిక్‌గా అనర్హతకు గురయ్యేలా చట్ట సవరణ చేస్తాం అని మేనిఫెస్టోలో చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కండుడవా కప్పి మరీ చేర్చుకుంటున్నారన్నారు. గెలిచేంత వరకు ఒక మాట ... గెలిచాక ఇంకో మాట. ఇదే కాంగ్రెస్ రీతి .. నీతి. బీజేపీకి కాంగ్రెస్‌కు తేడా ఏంటి. మేనిఫెస్టోలు అమలు చేసే ఉద్దేశం లేనపుడు ఎందుకీ నాటకాలు రాహుల్‌గాంధీ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే -
బిహార్‌లో ఆగని ఫిరాయింపుల పర్వం
పట్నా: బిహార్‌లోని మహాఘఠ్బంధన్ కూటమిలో ఫిరాయింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీకి చెందిన మరో ఎమ్మెల్యే భరత్ బిండ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఎన్డీఏ పక్షంలోకి మారారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే నీతూ కుమారి పార్టీ లోక్‌సభ టిక్కెట్ ఇస్తే సరేసరి లేకుంటే బీజేపీలో చేరడం ఖాయమని ప్రకటించారు. ఇప్పటికే ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటేయడం, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం తెలిసిందే. తాజా పరిణామాలతో 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీఏ బలం 135కు చేరుకుంది. -
మిమ్మల్ని కూడా కలుపుకుంటారేమో సార్!
మిమ్మల్ని కూడా కలుపుకుంటారేమో సార్! -
'ఆపరేషన్ హస్త'.. పొలిటికల్ వార్..
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంత పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికే 'ఆపరేషన్ హస్త' పేరుతో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లను కలుస్తున్నారు. యశ్వంతాపూర్ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు చెబుతున్నప్పటికీ.. అసలు విషయం పార్టీ మార్పేనని రాజకీయ వర్గాల సమాచారం. ఇటీవలే సీఎం సిద్ధరామయ్యను తమ రాజకీయ గురువుగా పేర్కొంటూ సోమశేఖర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల జేడీఎస్ నాయకుడు ఆయనూర్ మంజునాథ్ కూడా డిప్యూటీ సీఎం శివకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టనున్న ఆపరేషన్ హస్త వెలుగులోకి వచ్చింది. బీజేపీ నాయకులను కాంగ్రెస్‌లోకి తీసుకురావడమే దీని ప్రధాన ధ్యేయం. ఆపరేషన్ హస్త అనేది ఆపరేషన్ లోటస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యగా పరిగణించవచ్చు. 2019లో ఆపరేషన్ లోటస్‌లో భాగంగా 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. దీంతో అప్పట్లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో కమల దళం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ మఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ ఎమ్మెల్యేలతో రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. తమ సభ్యులు ఎవరూ ఫిరాయింపుకు సిద్ధంగా లేరని అన్నారు. తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. ఈ పరిణామాల అనంతరం బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి స్పందించాడు. కాంగ్రెస్ ఆపరేషన్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ చర్యలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసని అన్నారు. దీనిపై శివకుమార్ కూడా స్పందించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులు గుర్తుకు లేవా? అని ప్రశ్నించారు. తమ పార్టీలో చేరమని ఎవరినీ పిలవట్లేదని అన్నారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
తమ్ముళ్లు జంప్..!
-
టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం
సాక్షి, న్యూఢిల్లీ: అంచనాలను నిజం చేస్తూ టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. ఈమేరకు నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖను ఇవ్వడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అందుకు అంగీకారం తెలిపారు. అనంతరం టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ తీర్మానించిన లేఖను ఆ పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి అందజేశారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ సమయంలో వారి వెంట ఉన్నారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి అందజేశారు. అనంతరం వారు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. బీజేపీలో విలీనం లేఖపై సంతకం చేసిన నలుగురు టీడీపీ ఎంపీల్లో ఒకరైన గరికపాటి మోహన్‌రావు అస్వస్థతకు గురికావడంతో ఉప రాష్ట్రపతి నివాసానికి, బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాలేదు. జేపీ నడ్డా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు ఎంపీలకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. తొలుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, దీనిద్వారా ప్రభావితమై టీడీపీ రాజ్యసభా పక్షానికి చెందిన నలుగురు సభ్యులు బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ ‘చాలాకాలంగా వైఎస్ చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, మోహన్‌రావుల మనసులో ఈ ఆలోచన ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వృద్ధిపథంలో నడుస్తుండడం, అమిత్‌షా సంస్థాగత నిర్వహణ సామర్థ్యాలను చూసి ప్రభావితులై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వీరంతా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ చౌదరి నేతృత్వంలో టీడీపీ పక్షం సమావేశమై బీజేపీలో విలీనం కావాలని తీర్మానించారు. ఇప్పుడు వారు బీజేపీ సభ్యులు. బీజేపీ సానుకూల రాజకీయాలను నమ్ముతుంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ను విశ్వసిస్తుంది. తద్వారా మేం ముందుకు సాగుతాం. ఈ నలుగురు నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేస్తారని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలనే: సుజనా ‘సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశం ఆలోచన ఏమిటన్నది మీ అందరికీ తెలుసు. మేం జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాం. గత ఎన్డీఏ ప్రభుత్వంలో మూడున్నరేళ్లపాటు మోదీ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలు సాధ్యమైనంత త్వరగా సామరస్యపూర్వకంగా పరిష్కారం కోసం బీజేపీలో చేరుతున్నాం’ అని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఉదయమే ముహూర్తం గురువారం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం రాజ్యసభ సమావేశమై వాయిదాపడింది. ప్రధాని అందరికీ అభివాదం చేస్తూ వెళుతున్న సందర్భంలో వైఎస్ చౌదరి అధికారపక్షం వైపు వెళ్లి జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులను పలకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అక్కడే ఉన్నారు. విలీన ప్రక్రియను ఈరోజే పూర్తి చేయాలని ఆయన వైఎస్ చౌదరికి సూచించినట్టు సమాచారం. అనంతరం నలుగురు టీడీపీ సభ్యులు రాజ్యసభ చైర్మన్ చాంబర్లోకి వెళ్లి సభలోకి వస్తూ మెట్లు దిగుతుండగా గరికపాటి మోహన్‌రావు పట్టుతప్పి కిందపడ్డారు. ఆయన కాలు బెణకడంతోపాటు బీపీ పెరగడంతో వైద్య పరీక్షల అనంతరం రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత టీడీపీ రాజ్యసభా పక్ష సమావేశం నిర్వహించి విలీనంపై తీర్మానం చేశారు. విలీన పత్రంపై గరికపాటి మోహన్‌రావు కూడా సంతకం చేశారు. విలీనం లేఖ ఇలా.. ‘రాజ్యసభలో తెలుగుదేశం పక్షం ఈరోజు పక్ష నేత వైఎస్ చౌదరి, ఉప నేత సీఎం రమేశ్‌ల నాయకత్వంలో సమావేశమైంది. నరేంద్రమోదీ నాయకత్వం, అభివృద్ధి విధానాల నుంచి స్ఫూర్తి, ప్రోత్సాహం పొంది జాతి శ్రేయస్సు దృష్ట్యా మేం రాజ్యాంగం పదో షెడ్యూలులోని పేరా 4 పరిధిలో బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించాం. సంప్రదింపుల అనంతరం ఈ కింది తీర్మానం చేశాం. 1. టీడీపీ రాజ్యసభ పక్షాన్ని తక్షణం పదో షెడ్యూలు ప్రకారం బీజేపీలో విలీనం చేయాలి. 2. విలీనాన్ని ఆమోదించాలని బీజేపీ అధ్యక్షుడికి లేఖ రాయాలి. ఆయన సమ్మతిని ఒక తీర్మానం ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌కు తెలియపరచాలని కోరాలి. 3. విలీనాన్ని పదో షెడ్యూలు ప్రకారం ఆమోదించాలని, మమ్మల్ని బీజేపీ పక్షంలో భాగస్వాములుగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయాలి..’ అని తీర్మానిస్తూ నలుగురు ఎంపీలు సంతకాలు చేశారు. -
నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు
సాక్షి, హైదదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనడం అనైతికమని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రభుత్వం కొంటోందని ఆరోపించారు. తమ పార్టీ నాయకులతో కలిసి శాసనసభ ఎదుట రోడ్డుపై ఆయన నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార పార్టీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తమ ఎమ్మెల్యేలను కొంటోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల తీర్పును కేసీఆర్ అవమానపరిచారని, ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని, అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్రగా వెళతామని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఉత్తమ్‌తో పాటు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి.. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. (చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్) -
సేవ్ డెమోక్రసీ
-
ఫిరాయించిన ఎమ్మెల్యేపై న్యాయపోరాటం
-
సొంత సైనికుడిపైనే కిమ్ సేన బుల్లెట్ల వర్షం
సియోల్ : తమ దేశం నుంచి పారిపోతున్న సైనికుడిపై ఉత్తర కొరియా సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. అయితే చివరకు ఎలాగోలా అతను దక్షిణ కొరియా సరిహద్దుకు చేరుకోగా.. అతన్ని కాపాడిన అధికారులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పన్ మున్ జామ్ అనే గ్రామం ఉత్తర, దక్షిణ కొరియాలకు సరిహద్దుగా ఉంది. ఇది పర్యాటక ప్రాంతం కూడా. సోమవారం సాయంత్రం ఓ సైనికుడు వాహనంలో దక్షిణ కొరియా వైపుగా దూసుకొచ్చాడు. అయితే అతన్ని వెంబడించిన ఉత్తర కొరియా సైనిక దళాలు తుటాల వర్షం కురిపించాయి. సోమవారం సెలవు రోజు కావటంతో పర్యాటకులు లేకపోవటం.. తద్వారా భారీ ప్రాణ నష్టం తప్పినట్లయ్యింది. సుమారు 40 రౌండ్లు కాల్పులు జరపగా.. ఐదు బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకుపోయాయి. చివరకు వాహనం నుంచి కింద పడిపోయిన అతను పాకుతూనే దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు. గస్తీ బాధ్యతలు నిర్వర్తించే యునైటెడ్ నేషన్స్ కమాండ్ (యూఎన్సీ) సిబ్బంది దీనిని గమనించి, హెలికాప్టర్ లో అతడిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఒప్పందం ఉండటంతో తాము తిరిగి కాల్పులు చేపట్టలేకపోయామని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. కాగా, కిమ్ ఆరాచకాలపై ఆ దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా.. ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలీనీయకుండా కిమ్ నియంత పాలన కొనసాగిస్తున్నాడు. దీనికి తోడు అమెరికాతో యుద్ధానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజల్లో భయం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే పలువురు చైనా గుండా ఇతర దేశాలకు వలస వెళ్తుండగా.. ఇప్పుడు ఇలా సొంత సైనికుడు దేశం వదిలి పారిపోయే పరిస్థితికి చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని దక్షిణ కొరియా చెబుతోంది. మరోపక్క ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తునకు ఆదేశించింది. -
బాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
-
ఫిరాయింపుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి
► వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారు ► వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం) : వైఎస్సార్సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లి పార్టీ ఫిరాయించిన నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల్లో వీరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే తగిన రీతిలో బుద్దిచెబుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 439 మంది స్థాని క సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారని, టీడీపీకి 350 మాత్రమే ఉన్నారన్నారు. అనైతిక రాజకీయాలకు, ప్రలోభాలకు గురై కొం దరు పార్టీ మారారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు అభిమానించి వారిని గెలిపించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వై ఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ప్రజాప్రతినిధులు నైతిక విలువలు పాటిస్తారని భావించారన్నారు. ఫిరాయించిన నాయకులు 6 నుంచి 8 శాతం వరకు వైఎస్సార్సీపీకి ఓటు వేయలేదన్నారు. వీరి వైఖ రిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు 180 ఓట్లు ఆధిక్యత వస్తుం దని ప్రకటించుకున్నారని, ఆ పరిస్థితి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. పోలింగ్ రోజున మనుబోలు ఎంపీపీ చిట్టమూరు అని తమ్మ కుమర్తె చనిపోయిన దుఃఖం లో ఉన్నప్పటికీ పార్టీపై ఉన్న అభిమా నం, నైతిక విలువలు పాటించి వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్నారు. ఎన్నికల్లో తన కోసం కృషిచేసిన నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవ య్య, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేం ద్రరెడ్డి, నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఎల్లసిరి గో పాల్‌రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలి యజేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బత్తల కృష్ణ, పుచ్చలపల్లి రాంప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆనం కార్తీక్‌రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, హనుమంతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
‘ఫిరాయింపుల’ తీర్పుపై అప్పీల్
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గురువారం విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తమ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, జి.సాయన్న, ప్రకాశ్‌గౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కె.పి.వివేకానంద్, మాగంటి గోపీనాథ్, అరెకపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ నేతలు స్పీకర్ ముందు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిష్కరించకుండానే టీఆర్ఎస్లో టీటీడీఎల్పీ వీలైనమైనట్లు పేర్కొంటూ శాసనసభ కార్యదర్శి పేరు మీద బులిటెన్ జారీ అయింది. ఈ బులిటెన్ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, స్పీకర్ తీరును ఆక్షేపించారు. తన ముందున్న అనర్హత పిటిషన్లను పరిష్కరించకుండానే, టీటీడీఎల్పీ విలీనంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ కేసులో స్పీకర్ ఓ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయన నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ గత సెప్టెంబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 21తో మూడు నెలల గడువు ముగియనున్న నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం ధర్మాసనం విచా రణ చేపట్టింది. ఈ సందర్భంగా కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండిం గ్లో ఉన్నప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని తెలిపారు. అధికరణ 212 ప్రకారం శాసన వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం తగదని చెప్పారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
స్పీకర్లు పావులుగా మారుతున్నారు
హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. స్పీకర్లు అధికార పార్టీ చేతిలో పావులుగా మారుతున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయాలపై కోర్టులు పరిశీలించే అవకాశం ఇవ్వాలని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అనే అంశంపై బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో జైపాల్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి, జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పీ లక్ష్మణరెడ్డి, జస్టిస్ బి, శేషశయనారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి, లోక్‌సత్తా జేపీ, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో నిబంధనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్పీకర్ నిర్ణయమే అంతిమం కాకుండా, దానిపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉండాలని జస్టిస్ జీవన్ రెడ్డి అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా గెలిచినవారే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఫిరాయింపుదారులపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. షెడ్యూల్ 10లో సవరణలు తేవాలని సూచించారు. స్పీకర్ వ్యవస్థపై కూడా చర్చ జరగాలని అన్నారు. -
'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అంశంపై సదస్సు
హైదరాబాద్: 'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అనే అంశంపై బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టీస్ బీపీ జీవన్ రెడ్డి, జస్టీస్ బీ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టీస్ పి. లక్ష్మణరెడ్డి, జస్టీస్ బి, శేషశయనారెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే. రామచంద్రమూర్తి, లోక్‌సత్తా జేపీ, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. -
'పార్టీ ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర'పై నేడు సదస్సు
సాక్షి,సిటీబ్యూరో: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘పార్టీ ఫిరాయింపులు - స్పీకర్ పాత్ర’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి తెలిపారు. బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం (జులై 31న) ఉదయం 10 గంటకు సదస్సు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. ప్రముఖ న్యాయ కోవిదులు జస్టిస్ బి.జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ బి. శేషశయన రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి , ప్రముఖ రాజనీతి ఆచార్యులు ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావులు సదస్సులో ప్రసంగిస్తారని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. -
పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి సాక్షి, హైదరాబాద్: జనం ఓటుతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి నిదర్శనమని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పలు సంఘాల నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయడంతో పాటు తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధన విధించాలన్నారు. ఈ అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. స్పీకర్ల నిర్ణయాలపై న్యాయ స్థానాలకు వెళ్లే అవకాశం పార్టీలకు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’పై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెమినార్లో ప్రముఖ న్యాయ కోవిధులు జస్టిస్ బి. జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రసంగిస్తారన్నారు. -
ఫిరాయింపులపై సుప్రీంకు: ఉత్తమ్
గుత్తాపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు... సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని పీసీసీ నిర్ణయిం చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ అంశంపై గురువారం గాంధీభవన్‌లో న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. దీనిపై ఇప్పటికే అన్ని ప్రజాస్వామిక వేదికలపైనా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. సీఎం కేసీఆర్ నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారన్నారు. ‘‘రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ఈ నెల 28న సుప్రీంకోర్టుకు సెలవులు పూర్తవగానే పిటిషన్ వేస్తాం’’ అన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. గుత్తాపై సుప్రీంకోర్టులోనూ కేసు వేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్‌అలీ, డి.కె.అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సంపత్‌కుమార్, మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి: గుత్తా
కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ మారినందుకు తనపై విమర్శలు గుప్పించటం మానుకోవాలని హితవు పలికారు. గురువారం సాయంత్రం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. బుధవారం జరిగిన సమన్వయక మిటీ సమావేశంలో కూడా ఆ పార్టీ నేతలు పరస్పరం దూషించుకున్నారన్నారు. వాళ్లలో వాళ్లకే ఐకమత్యం లేదని చెప్పారు. కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారాననడం సిగ్గుచేటని తెలిపారు. తనకు కాంట్రాక్టులు లేవని, తన వియ్యంకుడు నిజాం కాలం నుంచే పెద్ద కాంట్రాక్టరని గుత్తా తెలిపారు. సమయం, సందర్భంగా చూసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. -
'ఆయనకు ఫిరాయింపులే ప్రియం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో చూపించే శ్రద్ధ పాలనా వ్యవహారాల్లో లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. బుధవారం కొత్త టీచర్ల నియామకం సందర్భంగా ప్రతిజ్ఞా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి ఓ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కార్యక్రమానికి వెళ్లారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ ఫిరాయింపు సందర్భంగా కండువా కప్పడానికి.. 8,926 మంది నవ ఉపాధ్యాయులను చంద్రబాబు కార్యక్రమం మధ్యలో వదిలేసి వెళ్లారు. దీంతో చేసేదేంలేక అధికారులు చంద్రబాబు వచ్చేంత వరకు టీచర్లను వెయిట్ చేయించారు. ముఖ్యమంత్రి చర్యతో అధికారులతో పాటు ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న టీచర్లలో స్పూర్తిని నింపాల్సిన కార్యక్రమంలో సాక్షాత్తూ.. ముఖ్యమంత్రే ఇలా దిగజారుడుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
'వారికి అవమానాలే మిగులుతున్నాయ్'
తిరుపతి: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు వద్ద అవమానాలే మిగులుతున్నాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ధమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ఉపాధి హామీ నిధుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి, మంత్రులను కలిసి అక్రమాలను బయటపెడతామన్నారు. -
రాజకీయ ఫిరాయింపులు దారుణం: లోక్‌సత్తా
విజయవాడ: రాష్ట్రంలో రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ తెలిపారు. పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ఆదివారం ఇక్కడ వర్మ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ ఫిరాయింపులు దారుణమన్నారు. ఎమ్మెల్యే రాజ్య వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని... దాంతో ఎమ్మెల్యేలు కోట్లు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి ఫిరాయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సమర్థుడైతే తెలంగాణలో టీడీపీ నాయకులు టీఆర్ఎస్లోకి ఎందుకు ఫిరాయిస్తున్నారని ప్రశ్నించారు. -
పార్టీ ఫిరాయింపులు అనైతికం
కబ్జాలు, కాలేజీలను కాపాడుకోవడానికే అజయ్ ఫిరాయిస్తున్నారు: పీసీసీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు అనైతిక రాజకీయాలకు పరాకాష్ట అని పీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పక్షం రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులను పట్టించుకోకుండా ఫిరాయింపులపైనే దృష్టి పెట్టిందన్నారు. గ్రామా ల్లో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనులు దొరక్క పేదలు వలసలు పోతున్నారని, అయినా సీఎం కేసీ ఆర్, మంత్రులు పట్టించుకోవడం లేద న్నారు. టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బెదిరించి, బతిమిలాడి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. స్వార్థం కోసమే: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కేవలం స్వార్థ ప్రయోజనాలకోసమే టీఆర్ఎస్లోకి ఫిరాయిస్తున్నారని కోదండరెడ్డి, నిరంజన్లు ఆరోపించారు. అజయ్ పార్టీలోకి వచ్చి రెండేళ్లు కాకున్నా సీఎల్పీ కోశాధికారి పదవి, పార్టీ సీనియర్లతో ఏర్పాటుచేసిన కార్యనిర్వాహక కమిటీలో చోటు దక్కిందన్నారు. పాలేరు ఉప ఎన్నికకు ముందు అజయ్ పార్టీ మార డం స్వార్థం, మోసాలకు పరాకాష్ట అని అన్నారు. వ్యాపారాలను, కాలేజీలను, కబ్జాలను కాపాడుకోవడానికే అజయ్ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో దశాబ్దాలు పనిచేసిన వారిని కాదని టికెట్ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీపై తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. -
సీట్లు... ఫీట్లు!
త్రికాలమ్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావూ (కేసీఆర్) యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉత్సవ వాతావరణంలో ఫిరాయింపుదార్లకు కండువాలతో స్వాగతం చెబుతున్నారు. ఇద్దరి ఆశలూ అసెంబ్లీ స్థానాల పెంపుదల మీదనే. ఈ ఆశ నెరవేరకపోతే కేసీఆర్ కంటే చంద్రబాబునాయుడు ఎక్కువ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను నానావిధాలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటున్నారు. వారి నియోజక వర్గాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏమని సర్దిచెబుతున్నారు? అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి పెరగడం ఖాయం, కనుక 2014లో గెలిచి, పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ శాసనసభ్యుడికీ, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థికీ-ఇద్దరికీ 2019లో టిక్కెట్లు ఇస్తానంటూ నమ్మబలుకుతు న్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్థానాలు సైతం 119 నుంచి 153కు పెరుగు తాయని కేసీఆర్ చెబుతున్నారు. ఈ ఒక్క పని చేసిపెట్టాలంటూ ముఖ్య మంత్రులు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తున్నారు. ఫిరాయింపుదా రులకు నమ్మకం కలిగే విధంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కూడా సందర్భం కల్పించుకొని అసెంబ్లీ స్థానాలు పెరగడం ఖాయం అంటూ చీటికీమాటికీ ప్రకటనలు చేస్తున్నారు. అయినా శాసన సభ్యులలో అనుమానాలు ఉన్నాయి. ఫిరాయింపులకు ప్రోత్సాహం శనివారంనాడు పసుపు శాలువా కప్పించుకున్న అనంతపురం జిల్లా కదిరి శాస నసభ్యుడు చాంద్ బాషా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్టీ ఫిరాయించిన 13వ వైఎస్ఆర్సీపీ సభ్యుడు. మరి కొందరు శాసనసభ్యులు ఇదే బాటలో ప్రయా ణం చేయవచ్చునని అంటున్నారు. శనివారమే ప్రారంభమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఈ పెడధోరణికి సమాధానం. పార్టీ ఫిరాయింపుల కార ణంగా రాష్ట్రంలో ప్రజా ఉద్యమాన్ని అనివార్యం చేస్తున్న ముఖ్యమంత్రిని ఎవరు నియంత్రించాలి? మొన్ననే సుప్రీంకోర్టు డివిజన్ బెంచి రాష్ట్ర అభివృద్ధిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా ప్రభుత్వానికి హితవు చెప్పింది. చట్టాన్ని అపహాస్యం చేస్తుంటే రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ జోక్యం చేసుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తే బాధితులు ఎవరికి మొరపెట్టుకోవాలి? సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయి 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరు ముఖ్యమంత్రులూ శాసనమండలి సభ్యుల చేత సామూహిక ఫిరాయింపులు చేయించి సభాధ్యక్ష పదవులు కైవసం చేసుకున్నారు. రెండు శాసన మండళ్ళలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉండేది. కొద్దివారాలకే అవి అధికార పార్టీల హస్తగతమైనాయి. తెలంగాణలో టీడీపీ శాసనమండలి సభ్యు లందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం కావాలని తీర్మానించారు. ఒక్క చేతి వేళ్ళపైన లెక్కపెట్టడానికి సరిపడని సభ్యులున్న టీఆర్ఎస్- కాంగ్రెస్, టీడీపీ సభ్యుల ఫిరాయింపు ఫలితంగా మెజారిటీ సాధించడమే కాకుండా మండలి అధ్యక్ష స్థానంలో స్వామిగౌడ్‌ను దర్జాగా కూర్చోబెట్టింది. 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షంలో 12 మంది టీఆర్ఎస్లో చేరిపోయారు. తమ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని అభ్యర్థిస్తూ టీడీపీ శాసనసభా పక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు సభాపతికి లేఖ సమర్పించారు. అయిదుగురు కాంగ్రెస్ శాసనసభ్యులూ, ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యులూ, ఇద్దరు బీఎస్పీ సభ్యులూ టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రజాతీర్పు తుంగలో... ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు అవసరార్థం పార్టీ ఫిరాయింపు లను ప్రోత్సహిస్తే అర్థం చేసుకోవచ్చు. ఆపద్ధర్మం అని సమాధానం చెప్పుకో వచ్చు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో కానీ ప్రభుత్వాల సుస్థిరతకు వచ్చిన ఆపదంటూ ఏదీ లేదు. సంఖ్యాబలానికి కొదవలేదు. రాజ్యసభ సీట్లు గెలుచు కోవడం కోసమో, ప్రతిపక్షాలని బలహీనపరచడం కోసమో ఫిరాయింపుల చట్టా నికి తూట్లు పొడుస్తున్నారు. రెండు సంవత్సరాల కిందటే వెలువడిన ప్రజా తీర్పును ఎద్దేవా చేస్తూ ఏ పార్టీ అభ్యర్థినైతే ఓడించి శాసనసభ్యులైనారో ఆ పార్టీలోనే అట్టహాసంగా చేరడం తమకు ఓటు వేసిన ప్రజలను వంచించడమనే ఇంగితం కూడా లేదు. తెలంగాణలో తమ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన టీడీపీ శాసనసభ్యులు టీఆర్ఎస్లో చేరిపోయి ఉండవచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండటం అనేది అసాధ్యం. బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీల వంటి పెద్ద పార్టీలకే ఉత్తరప్రదేశ్ వెలుపల దిక్కులేదు. తెలంగాణలో టీడీపీ బిస్తరు సర్దుకోవచ్చునని మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. క్షేత్ర వాస్తవికతను తెలుసుకున్న చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతానికి స్వస్తి చె ప్పి ఆంధ్రప్రదేశ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులను టీడీపీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి ఒన గూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. నియోజకవర్గం అభివృద్ధి నిధులను టీడీపీ ఎమ్మెల్యే లేని (వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలున్న) నియోజకవర్గాలలో టీడీపీ పర్యవేక్షకుడి(ఓడిపోయిన అభ్యర్థి)కి ఇస్తూ వచ్చారు. ప్రతిపక్ష శాసనసభ్యుడు అధికార పార్టీలోకి చేరితే నియోజకవర్గం అభివృద్ధి నిధులు శాసనసభ్యుడికి అందుతాయి. ఆ మేరకు టీడీపీని నమ్ముకొని ఉన్న నాయకులకు నష్టం జరుగు తుంది. మనసుకు కష్టం అనిపిస్తుంది. అందుకే వారు వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుల ప్రవేశాన్ని తమదైన శైలిలో ప్రతిఘటిస్తున్నారు. కొత్తగా చేరిన ఆది నారాయణరెడ్డికీ, పాత కాపు రామసుబ్బారెడ్డికీ మధ్య ఘర్షణ, భూమానాగి రెడ్డికీ, శిల్పామోహనరెడ్డికీ మధ్య స్పర్థ ఈ కారణంగానే. చాంద్‌బాషా చేరడం పట్ల కదిరి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కందికుంట ప్రసాద్ బహిరంగంగా నిరసన ప్రకటించి ముఖ్యమంత్రి నివాసం నుంచి విసవిసా వెళ్ళిపోవడానికీ ఇదే కారణం. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఫిరాయింపుదారులందరూ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అధికారపార్టీలోకి లంఘిస్తున్నట్టు ప్రకటి స్తున్నారు. ఏ మాత్రం సంకోచం లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూనే తప్పు చేస్తు న్నట్టు కాకుండా ఏదో ఉదాత్తమైన కార్యక్రమం చేస్తున్నట్టు ఫిరాయింపుదా రులూ, వారి మెడలో కండువాలు వేసే అధినాయకులూ వ్యవహరించడం కాలమహిమ. ఈ పని ఎవరు చేసినా తప్పే- మినహాయింపులు లేకుండా. సీట్లు పెరుగుతాయా? ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆశిస్తున్నట్టు శాసనసభ స్థానాలు పెరుగుతాయా? అటువంటి అవకాశాలు 2026 వరకూ లేవనేది నిపుణుల అభిప్రాయం. చంద్ర బాబునాయుడికి సానుకూలంగా వ్యవహరించే వాతావరణం కేంద్రంలో కనిపిం చడం లేదు. వాజపేయి ప్రధానిగా ఉన్న రోజులు వేరు, నరేంద్రమోదీ హయాం వేరు. మొన్న నౌకావిన్యాసాల వీక్షణంకోసం విశాఖపట్టణం వచ్చిన ప్రధాన మంత్రి తన పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని మాటవరుసకైనా పలుకరించలేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు చెప్పారు. ఇదివరకటిలాగా ఢిల్లీ ఎప్పుడు పోయినా ప్రధానితో మాట్లాడే అవకాశం చంద్రబాబునాయుడికి ఇప్పుడు లేదు. హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు ఎప్పుడో పోయాయి. పైగా ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరమైన నిధులు అందడం లేదు. అనుకూలమైన నిర్ణ యాలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఉద్దేశం కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించే వైఖరి కానీ కనిపించడం లేదు. అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఫిరాయింపులకు వెసులు బాటు కలిగించే విధంగా చట్టాన్ని సవరించే అసాధారణమైన చొరవను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుందనుకోవడం భ్రమ. ఒక వేళ ఎన్డిఏ సర్కార్ చంద్రబాబునాయుడి అభ్యర్థనను మన్నించాలని నిర్ణయించినప్పటికీ రాజ్యాంగం 170వ అధికరణలోని 3వ సెక్షన్ అడ్డు తగులు తుంది. చట్టసభలలో స్థానాల సంఖ్య 2026 వరకూ మారడానికి వీలులేదంటూ ఈ సెక్షన్ నిర్దేశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం (2014)లోని 26(1)వ సెక్షన్లో శాసనసభ స్థానాల హెచ్చింపునకు సంబంధించి ఈ విధంగా ఉంది: 'Subject to the provisions contained in Article 170 of the Constitution and without prejudice to Section 15 of this Act. the number of seats in the Legislative Assembly of the successor States of Andhra Pradesh and Telangana shall be increased from 175 and 119 to 225 and 153 respectively,. (‘రాజ్యాంగం 170వ అధికరణను దృష్టిలో పెట్టుకొని, అందు లోని 15వ సెక్షన్‌తో నిమిత్తం లేకుండా, విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలలో స్థానాలను 175, 119 నుంచి 225, 153కు పెంచాలి).. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే మొదటి వాక్యంలో ఉన్న 'subject to the provision...' అనే మాటలకు బదులు 'not withstanding the provisions...' అని సవరించాలి. కేంద్రం ఎదుట ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సవరణ చేయడం. రెండు- ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయడం. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదిం చాలనీ, అనంతరం మొత్తం 29 రాష్ట్రాలలోనూ 15 రాష్ట్రాల శాసనసభలు అంగీక రిస్తూ తీర్మానించిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం వెడుతుందని రాజ్యాంగంలోని 368వ అధికరణ చెబుతున్నది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న బలాలను పరిగణనలోకి తీసుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ సహక రిస్తే తప్పించి ఆ బిల్లు ఆమోదం సాధ్యం కాదు. తమ పార్టీ శాసనమండలి సభ్యు లనూ, శాసనసభ్యులనూ ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయిస్తుంది? పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెంచితే మా సంగతి ఏమిటని 2000 సంవత్సరంలోనే ప్రత్యేక ప్రతిపత్తి సాధించిన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు అడుగుతాయి. గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ మద్దతు ఎట్లా కూడగట్టాలా అన్నది ఎన్డీఏ ప్రభుత్వం దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల లో చట్టసభల స్థానాలు పెంచడం మోదీ ప్రాథమ్యాల జాబితాలో ఉండదు. ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్న తీరును బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు సైతం పరోక్షంగానో, ప్రత్యక్షంగానో విమర్శిస్తున్నారు. శాసనసభ స్థానాలు పెంచేందుకు కేంద్రం సుముఖంగా లేకపోతే చంద్ర బాబునాయుడు ఏమి చేస్తారు? 2014లో ఓడిపోయిన నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన శాసనసభ్యుడికి టిక్కెట్టు ఇస్తారా, 2014లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థికి ఇస్తారా? తెలంగాణలో ఇటువంటి సమస్య లేదు. టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి గానీ టీఆర్ఎస్కు ఫిరాయించిన శాసన సభ్యులకు 2019 టీఆర్ఎస్ టిక్కెట్లు ఇవ్వడం కష్టం కాదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో టీఆర్ఎస్కు పెద్దగా బలం లేదు. టిక్కెట్టు కోసం పోటీ పడే నాయకులు తక్కువ. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశానికి ముందు టీఆర్ఎస్ తరఫున చెప్పుకోదగిన నాయకుడంటూ లేరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. టీడీపీకి దాదాపు అన్ని నియోజకవర్గాల లోనూ బలమైన నాయకులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ముస్లిం, ఎస్సి, కాపు శాసనసభ్యులను ఏరికోరి తమ పార్టీలో చేర్చుకోవడంలో గొప్ప వ్యూహం ఉన్నదని టీడీపీ నాయకులు అంటున్నారు. జలీల్‌ఖాన్, చాంద్‌బాషాలతో పాటు విజయవాడ, కదిరి నియోజకవర్గాలలోని ముస్లింలతో సహా వైఎస్ఆర్సీపీ ఓటర్లు అందరూ టీడీపీకి వలస వెడతారా? ఎస్సి శాసనసభ్యులతో పాటు ఎస్సి ఓటర్లందరూ ఆ పార్టీ పక్షాన చేరిపోతారా? కె.రామచంద్రమూర్తి -
చాంద్‌బాషాపై మైనారిటీల ఆగ్రహం
► అమ్ముడుపోయావంటూ దిష్టిబొమ్మ దహనం ► ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కదిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా టీడీపీలో చేరడంపై శనివారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. 'ఎన్నికల్లో ఆ రోజు మేము నిన్ను చూసి ఓట్లు వేయలేదు. వైఎస్సార్ కుటుంబాన్ని చూసి నిన్ను గెలిపించుకున్నాం. నీకు ఏమాత్రమూ సిగ్గు..లజ్జ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీచేసి గెలువు. కదిరికి వస్తే చొక్కా పట్టుకొని నిలదీస్తాం' అని మైనార్టీలు హెచ్చరించారు. కదిరి పట్టణంలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో ఎమ్మెల్యేకు చెందిన అత్తార్ రెసిడెన్సీ ఎదుట చాంద్‌బాషా దిష్టిబొమ్మను దహనం చేశారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మక్కాకు పలుమార్లు వెళ్లొచ్చి, హాజీగా పేరు గడించి, ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసగించడం సరికాదని మండిపడ్డారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓట్లు వేయొద్దని చెప్పి ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా వెళ్లావని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీల ద్రోహి..అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు బాబా, జిలాన్, అల్లాబక్ష్, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు జక్కల ఆదిశేషు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, లీగల్‌సెల్ రాష్ట్ర నేత లింగాల లోకేశ్వర్‌రెడ్డి, ఎన్పీకుంట సింగిల్‌విండో అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, రైతువిభాగం జిల్లా నాయకులు కుర్లి శివారెడ్డి, గాండ్లపెంట మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు సలీం, ఉపేంద్రశీనా, నాగేంద్ర, కోటి, ఎస్సీ సెల్ నాయకులు రాంప్రసాద్, విద్యార్థి విభాగం నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు. -
అయినా వారు మారలేదు...
అటు ఏపీలో, ఇటు తెలంగాణలో పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ విషయానికొస్తే వివిధపార్టీల నుంచి అధికారపార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. ఆయా పార్టీల నుంచి పలువురి ఎమ్మెల్యేల చేరిక పూర్వాపరాలు, ప్రస్తుత పరిస్థితిపైన చర్చ జరుగుతోంది. ఒకపార్టీలో చేరి కొన్నేళ్ల పాటు అందులోనే ఎదిగి అనేక పదవులను అలంకరించాక మరో పార్టీలో చేరి అక్కడి పరిస్థితికి అడ్జస్ట్ కావడం కొందరికి కష్టమవుతోందట. దీనితో ఎక్కడికెళ్లినా గతంలో తమతో పాటు ఉండి పార్టీ మారినపుడు కూడా తమ వెంటే ఉన్నవారితోనే వారు వెళుతున్నారట. కొత్తపార్టీలో చేరినా ఆ పార్టీలో ఉన్న పాత నాయకులతో ముఖ్యంగా ఎమ్మెల్యేలతో మమేకం కాలేకపోతున్నారట. అందువల్లే పాతపార్టీ బృందాలకే పరిమితమై అన్నిచోట్ల కనిపిస్తున్నారట. ఇటీవల ముగిసిన అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కూడా ఏ పార్టీ నుంచి వచ్చిన వారు ఆ పార్టీ బృందంతో విడిగా తిరగడాన్ని రాజకీయనాయకులు ప్రస్తావిస్తున్నారు.ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అన్న నానుడి ఇక్కడి రాజకీయాలకు మాత్రం ఎందుకో సరిపోవడం లేదని ఇతర పార్టీల నాయకులు ముక్తాయింపునిస్తున్నారు... -
చట్టం ఫిరాయింపుదార్ల చుట్టమా?
రెండో మాట ఒక పార్టీ తరఫున ఎన్నికైన లెజిస్లేటర్లలో మూడింట ఒక వంతు సభ్యులు మరొక పార్టీలో విలీనం కావడానికి నిర్ణయిస్తే దానిని ఇంతకు ముందు చట్టం అనుమతించేది. కానీ 2003లో వచ్చిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ వెసులుబాటును మార్చింది. కానీ ‘గొర్రెలు తినేవాడికి బదులు, బర్రెలు తినేవాడు వచ్చాడు’ అన్నట్టు సభ్యులలో మూడింట రెండువంతులు సమ్మతిస్తే ఆమోదించాలని అవకాశవాద సవరణ తెచ్చారు. ఇదొక తాతాచార్యుల ముద్ర. ‘లెజిస్లేటర్లు (శాసనకర్తలు) ఏ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికలలో నిలబడి గెలిచారో, ఆ పార్టీకి కట్టుబడి ఉండకుండా మరో పార్టీలోకి అర్ధంతరంగా ఫిరాయించడం అనే రోగం 1967 సాధారణ ఎన్నికల తరువాత రాష్ట్రాలలో విస్తృతంగా వ్యాపించడం మొదలైంది. ఆ తరువాత ఈ గోడదూకుళ్లను కట్టడి చేస్తూ వచ్చిన చట్టం కూడా రాష్ట్రాల స్థాయిలో లెజిస్లేటర్ల ఫిరాయింపులను నిరోధించడంలో విఫలమవుతూ వచ్చింది. చట్టంలో అనేక బలహీనతలు చోటు చేసుకున్నాయి.’ న్యాయశాస్త్ర కోవిదుడు ఆచార్య ఎం.పి. జైన్ (ఇండియన్ కానిస్టిట్యూషనల్ లా: 2011) భారత రాజ్యాంగం ఆచరణలో సక్రమంగా అమలు కాకపోవడానికి కారణం రాజ్యాంగ పత్రం కాదు, దానిని అమలు పరిచే పాలకులేనని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పారు. అనంతరకాలాలలో పాలకులు రాజ్యాంగానికి చేసిన సవరణల చట్టాలలోని లొసుగుల వల్లనే ప్రజాస్వామిక వ్యవస్థ దేశంలో మూడుపూవులు, ఆరుకాయలుగా పరిఢవిల్లడంలో విఫలమవుతున్నదన్న సంగతి కూడా వాస్తవం. దీని దుష్ఫలితాన్ని నేడు ప్రజలూ, వ్యవస్థలూ అనుభవించడం చూస్తున్నాం. లెజిస్లేచర్లలో మెజారిటీ పాలక పక్షాలు మైనారిటీలుగా తారుమారు కావడానికీ, మైనారిటీలో ఉన్న ప్రతిపక్షాలు మెజారిటీ సంతరించుకోవడానికీ; ప్రభుత్వాలు కుప్పకూలడానికీ ఈ ఫిరాయింపులే కారణమవుతున్నాయి. పెట్టుబడిదారీ ప్రపంచంలో పలుచోట్ల ఉన్న పరిమిత ప్రజాస్వామ్యంలో ఇలాంటి తమాషా అరుదే అయినా, ఎదిగీ ఎదగని ఇండియా వంటి భారీ అసమ వ్యవస్థలో మైనారిటీ ప్రజాస్వామ్యం ప్రభావం వల్ల మనది ‘ఫిరాయింపుల డెమోక్రసీ’గానే చూడవలసి వస్తున్నది. చివరికి పరిస్థితులు ఏ స్థితికి దిగజారిపోతున్నాయంటే పాలకులూ, రాజకీయులే కాకుండా, ఇటీవల అవినీతిలో భాగ స్వాములుగా అనేక సందర్భాలలో బయటపడిన క్రికెట్ నిర్వహణ సంస్థలు, క్రికెట్ బోర్డు వంటి సంస్థలు కూడా సుప్రీంకోర్టును ‘పరిమితులు దాటుతోంద’ని విమర్శించే సాహసం చేస్తున్నాయి. ఆ సంస్థల, బోర్డుల ప్రైవేటు వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం వాటికి నచ్చడం లేదు. ఈ జాడ్యం పాలకుల నుంచి సంక్రమించింది. న్యాయ వ్యవస్థల నిర్వహణలో కూడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఒక్క విషయంలో రాజ్యాంగం ఆ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. అదేమిటంటే- ప్రభుత్వ చట్టాలకూ, లెజిస్లేచర్ల నిర్ణయాలకూ భాష్యం చెప్పే హక్కు. తన అవినీతికర చర్యలను మార్చుకోవడానికీ లేదా సంస్కరించుకోవడానికీ క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్టేనా? అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు నిగ్గుతీయవలసి వచ్చింది. 1967 తరువాతి పరిణామం లెజిస్లేటర్ల ఫిరాయింపులను అరికట్టడానికీ, ప్రవేశపెట్టిన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాలక, ప్రతిపక్షాల ఎత్తుగడలకు అడ్డుకట్ట వేయడానికీ న్యాయస్థానాలు చేస్తున్న యత్నాలు పూర్తిగా సఫలం కావడం లేదు. ఇంతకూ ఎక్కడుంది అసలు లోపం? రాజ్యాంగంలో భాగంగా అవతరించిన పదో షెడ్యూలు ఆసరాగా 1985లో 52వ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందింది. ఈ షెడ్యూలు కిందనే, ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందనే సుప్రీంకోర్టు అనేక తీర్పులు (1993/1994/1996లలో) ఇచ్చింది. పాలకపక్షం తరఫున, ప్రతిపక్షాల సహకారంతో శాసనసభలకు స్పీకర్లుగా ఎంపికైన సభాపతులు తీసుకున్న పాక్షిక నిర్ణయాలను కూడా ఆ తీర్పులు ప్రశ్నించాయి, విమర్శించాయి. నిజానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలో చేయవలసిన మార్పులనూ సుప్రీంకోర్టు పరామర్శించింది. 1967 ఎన్నికల తరువాతనే ఫిరాయింపుల సమస్య దేశానికీ, న్యాయస్థానాలకూ ఎందుకు ప్రశ్నార్థకమైంది? 1950ల నాటికి గానీ, 1960 తొలిదశకు గానీ దేశంలో బహుళ రాజకీయ వ్యవస్థ రూపుదాల్చలేదు. అందుకే ఫిరాయింపులు, వాటితో వచ్చే దుష్ఫలితాలు అప్పటికి అనుభవంలో లేవు. 1967లో పదహారు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయింది. ఒక్క రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. సరిగ్గా ఈ పరిణామం నేపథ్యంగానే, ఆ సంవత్సరం నుంచే సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధమైంది. లెజిస్లేటర్లు ఫిరాయింపులకు పాల్పడడానికి ‘ఉప్పు’ అందించింది కూడా ఈ దశే. 1967 - 1971 మధ్య దేశంలో 142 మంది పార్లమెంట్ సభ్యులు, 1900 మంది శాసనసభల సభ్యులు తమ తమ పార్టీలకు చెల్లుచీటీలిచ్చి, ప్రలోభాలకు లోనై వలసల స్థాయిలో ఇతర పార్టీలలోకి దూకడం జరిగింది. హరియాణాలో ఆరంభమైన ఈ తతంగం మిగతా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలిపోయే వరకు సాగింది. ఈ వలసలన్నీ, ‘ముఖ్యమంత్రి పదవి సహా అనేక పదవులు తాయిలం చూపడం వల్ల లేదా మనం గౌరవంగా ఇక్కడ చెప్పుకోవడానికి వీల్లేని పద్ధతుల ద్వారానూ సంభవించాయి’ (ప్రొఫెసర్ ఎం. పి. జైన్). ఇంత అనుభవం తరువాత మాత్రమే ఈ ఫిరాయింపుల డెమోక్రసీకి సవరణ చట్టం తేవడానికి, అది కూడా లోపభూయిష్టంగానే- పాలకులు ముందుకు వచ్చారు. ఈ చట్టంలో ఉన్న ప్రధానమైన బలహీనత లేదా లోపం ఏమిటి? కోరలు లేని చట్టం ఒక లెజిస్లేటర్ వ్యక్తిగత స్థాయిలో పార్టీ ఫిరాయిస్తే ఈ చట్టం శిక్షించగలుగుతుంది. కొందరు సభ్యులు మూకుమ్మడిగా పార్టీ ఫిరాయిస్తే దానిని ఆ పార్టీలో చీలికగానే ఈ చట్టం పరిగణిస్తుంది. దీనికి శిక్ష లేదు. ఎందుకని? ఫిరాయింపుల మీద నిర్ణయం ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉన్నా తటస్థ వ్యక్తిగా వ్యవహరించడానికి ఆయన తటపటాయిస్తున్నాడు. స్పీకర్ తన పార్టీ ‘మైకం’ నుంచి బయటపడలేకపోతున్నాడు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ నుంచి తాత్కాలికంగా తెగతెంపులు చేసుకున్నట్టు కనిపించినా, విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలులేని వాతావరణాన్ని అధికారపక్షం నుంచే కల్పించుకుంటున్నాడు. లొసుగుల కారణంగా ఈ ధోరణికి కూడా చట్టం అడ్డుకట్ట వేయలేకపోతున్నది. ఈ ధోరణి తీవ్రత ఎలాంటిది? ఆ తీవ్రతకు తొలి ఉదాహరణగా గయాలాల్ అనే హరియాణా శాసనసభ్యుడు ఒకే రోజు మూడు పార్టీలు మార్చాడు. అప్పటి నుంచి ‘ఆయారామ్-గయారామ్’ అని రాజకీయ నిఘంటువులో ఫిరాయింపుదారులకు ఒక మారుపేరు అవతరించింది. 1991లో తమిళనాడులో ఇద్దరు అభ్యర్థులు ఏఐఏడీఎంకే తరఫున గెలిచారు. తరువాత మరొక పార్టీలోకి ఫిరాయించారు. అయితే తాము ఇండిపెండెంట్లమని వారు వాదించబోతే సుప్రీంకోర్టు నోటికి కళ్లెం వేసింది. ఆ శాసనసభ్యులను అనర్హులనే తేల్చింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి పార్టీ మారినా శాసన సభ్యత్వానికి అతడిని అనర్హుడిగానే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒక సభ్యుడు స్పీకర్‌గా ఎన్నికైతే తను ఎన్నికైన పార్టీకి రాజీనామా చేయవచ్చు. ఐదేళ్ల కాలం పూర్తయిన తరువాత మళ్లీ సొంత పార్టీలో చేరినా ఆయన మీద అనర్హత వేటు పడదని చట్టం భరోసా ఇస్తోంది. ఈ మినహాయింపు క్లాజునూ మార్చవలసి ఉంది. అలాగే ఒక పార్టీ తరఫున ఎన్నికైన లెజిస్లేటర్లలో మూడింట ఒక వంతు సభ్యులు మరొక పార్టీలో విలీనం కావడానికి నిర్ణయిస్తే దానిని ఇంతకు ముందు చట్టం అనుమతించేది. కానీ 2003లో వచ్చిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ వెసులుబాటును మార్చింది. కానీ ‘గొర్రెలు తినేవాడికి బదులు, బర్రెలు తినేవాడు వచ్చాడు’ అన్నట్టు సభ్యులలో మూడింట రెండువంతులు సమ్మతిస్తే ఆమోదించాలని అవకాశవాద సవరణ తెచ్చారు. ఇదొక తాతాచార్యుల ముద్ర. ఆ ముద్ర నుంచి వీపు తప్పించుకున్నా, భుజం తప్పించుకోలేకపోయిందని అంటారు పెద్దలు. అయితే సభ్యులు ఒక బృందంగా గానీ, వ్యక్తులుగా గానీ పార్టీ ఫిరాయించాలంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లవలసిందేనని అదే 91వ సవరణ స్పష్టం చేసిందన్న వాస్తవం మరచిపోరాదు. ఫిరాయింపులను ప్రశ్నించే హక్కు ఇంతకు ముందు ఏ న్యాయస్థానానికీ ఉండేది కాదు. కానీ ఈ తప్పుడు క్లాజును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిరాయింపు నిరోధక చట్టం అప్పటినుంచి న్యాయవ్యవస్థ సమీక్షా పరిధిలోకి వచ్చిందన్న నిజాన్ని పాలకులు విస్మరించరాదు. ఈ పూర్వరంగంలో ఆ మూడింట రెండువంతుల మెజారిటీ కోసమే చంద్రబాబు ప్రభుత్వం గానీ, కేసీఆర్ ప్రభుత్వం గానీ అడ్డదారులు తొక్కుతున్నాయి. అసలు ప్రతిపక్షాన్నే ఖాళీ చేయించే వ్యూహంతో అవసరం ఉన్నా లేకున్నా చెరొక డజను లేదా రెండు డజన్ల మంది ప్రతిపక్ష సభ్యులను ఇప్పటికే బజారుకెక్కిన ప్రలోభాలకు గురిచేశారు. దీని దుష్ఫలితాలకు 1993, 1994, 1996 నాటి సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ప్రజాబాహుళ్యం కూడా సాక్ష్యంగా నిలుస్తాయి. వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఫిరాయింపుల పీచమణగాలి!
రెండో మాట ‘ఒక పార్టీ టికెట్ పైన ఎన్నికలలో గెలిచిన లెజిస్లేటర్లు మరో పార్టీలోకి ఉడాయించడం అనేది జాతీయ స్థాయిలో ప్రబలిపోతున్న జబ్బు. ఈ జబ్బు మన ప్రజాస్వామ్య వ్యవస్థ జవజీవాలను తోడేస్తున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజకీయ పక్షాలు నిర్దిష్ట ప్రవర్తనా నిబంధనావళికీ, నియమబద్ధ సంప్రదాయాలకూ బద్ధమై ఉండడం వల్లనే సాధ్యం. అలాగే ప్రజాస్వామ్య సంస్థలను, కార్యకలాపాలను శాసించగల మౌలికమైన యోగ్యతా మర్యాదల ను, ఔచిత్యాన్ని పరిగణనలోనికి తీసుకుని పార్టీలు వ్యవహరించేలా ఉండాలి.’ (ఫిబ్రవరి 18, 1969న నాటి కేంద్ర హోంమంత్రి వైబీ చవాన్ కమిటీ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక) ఆనాటి లోక్‌సభలో సోషలిస్ట్ నాయకుడు మధు లిమాయే ప్రతిపాదించిన సవరణలతో ఏర్పడిన చవాన్ కమిటీ, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి అనంతరం మరో పార్టీ ఒరలోకి దూరిపోయే జంప్ జిలానీల (ఆయారామ్ గయారామ్‌లు) ప్రవర్తన అరికట్టేందుకు తన నివేదికలో అనేక విలువైన ప్రతిపాదనలు చేసింది. అయినా, ‘బుద్ధి గడ్డి తినడానికి’ అలవాటు పడినప్పుడు ఈ గోడ దూకుడు గాళ్లకు ఏ రాజ్యాంగం గానీ, ఏ నిబంధన గానీ, ఏ చట్టం గానీ అడ్డంకాదని స్వతంత్ర భారత లె జిస్లేచర్లలో ఇన్నేళ్లుగానూ జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. లెజిస్లేచర్లలో (పార్లమెంట్/ అసెంబ్లీలు) మెజారిటీ ఉన్న అధికార పార్టీలు కూడా విద్వేషభావంతో ప్రతిపక్షాలకు శాసన వేదికలలో ప్రాతినిధ్యం అంటూ లేకుండా అందులో ఉన్న సభ్యులను కూడా రకరకాల ప్రలోభాలతో అధికార పార్టీలో చేర్చుకుంటున్నాయి. అలా ప్రతిపక్షాన్ని క్రమంగా నిశ్శేషం చేసే ఓ కొత్త రాజకీయ క్రీడకు పాల్పడుతున్నాయి. అధికార పార్టీలు (రెండు తెలుగు రాష్ట్రాలు సహా) ఆది నుంచి జంప్ జిలానీల మీదనే ఆధారపడుతూ వచ్చాయి. ఈ రెండు రకాల అధికార పార్టీలూ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలోను అధికార పీఠాలను ఇలాగే కాపాడుకోజూస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఒక తెలుగు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో చిన్న భాగస్వామిగా కూడా ఉంది. అయితే రేపోమాపో ఏ మిషతో అయినా ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఈ ప్రాంతీయ పార్టీ మొదటి నుంచి భావిస్తూ బలమైన విపక్షంగా ఉన్న పార్టీ లెజిస్లేటర్లను ప్రలోభ పెట్టే దశకు చేరుకుంది. అదే రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రతిబింబిస్తున్నది. కప్పదాట్లు సాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలోకి వెళితే, లెజిస్లేటర్ల కప్పదాట్లను అరికట్టడం కోసం 1973లో ఆనాటి కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యాంగంలో చేర్చడానికి సిద్ధంచేసిన ఎనిమిది అధికరణలకు అవకాశవాద రాజకీయాల వల్ల విలువ లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ విధానాలతో సంబంధం లేకుండా లెజిస్లేటర్లు జంప్ జిలానీలుగా మారుతున్న దశలో చవాన్ కమిటీ నివేదిక లోని సిఫారసులను బిల్లులో చేర్చకుండా స్వార్థం కొద్దీ తప్పించారు. 1977 వచ్చేసరికి ఎవరో కొందరు ధనవంతులు, అవకాశవాదుల కుట్ర వల్ల లోక్‌సభ రద్దయింది. అలా 395 అధికరణలతో 12 షెడ్యూల్స్‌తో పలు సవరణలతో కూడిన రాజ్యాంగం మనకు ఉండి కూడా ఆచరణలో ప్రజలు మోసాలకు గురి కావలసి వస్తున్నది. కమిటీలతో పాలకపక్షం, ప్రతిపక్షం చేస్తున్న కాలయాపన కారణంగా నివేదికలకు విలువ లేకుండా పోయింది. అయినా కమిటీల మీద కమిటీలు వస్తూనే ఉన్నాయి. జనతా పాలనలోనూ ఇదే తంతు నడిచింది. ఫిరాయింపులు అరికట్టడమనే మిషతో చరణ్‌సింగ్ హోంమంత్రిగా మరో రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చింది. ఈ బిల్లు పార్టీ ఫిరాయించే లెజిస్లేటర్లపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది (102,191 అధికరణల కింద). ఇది రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద అనివార్యమయింది. అయినా ప్రలోభాల ద్వారా ప్రతిపక్షం నుంచి లెజిస్లేటర్ల ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించి మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియనే అవహేళన చేసే దశకు పాలక పక్షాలు చేరుకున్నాయి. సభ్యుల భిన్నాభిప్రాయ ప్రకటనకు, పార్టీ ఫిరాయింపులకు తేడాను గుర్తించలేనంత గుడ్డివాళ్లుగా జంప్ జిలానీ లెజిస్లేటర్లు తయారవుతున్నారు. పార్టీనీ, పార్టీ విప్‌నూ లెక్క చేయకుండా ప్రలోభం మత్తులో గోడ దూకే లెజిస్లేటర్ లెజిస్లేచర్ సభ్యునిగా అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పులు (1987/1992) తీర్పు ఇచ్చిందని మరచిపోరాదు. ‘ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద ఎన్నికైన లెజిస్లేటర్ ఆ పార్టీ నిర్ణయం లేదా అనుమతి లేకుండా మరో పార్టీలోకి దూకేయడాన్ని విభీషణ పాత్రగా, లేదా కప్పగంతుగా పరిగణించాల్సిందే’నని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపుదారు అనర్హుడే 1967-1977 మధ్య 542 ఫిరాయింపు కేసులు నమోదైనాయి. అందులో ఒక్క ఏడాది మాత్రం 438 కేసులు నమోదైనాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన వారిలో 157 మందికి పైగా వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. 1985లో రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ప్రకారం ఇలాంటి ఫిరాయింపుల గురించి సుప్రీంకోర్టు ఇలా ఘాటైన హెచ్చరిక చేసింది: ‘మన ప్రజాస్వామిక వ్యవస్థ ఒక గర్వకారణమైన వ్యవస్థగా మాత్రమే మిగిలిపోకుండా, బాహ్య ప్రపంచానికి ఆదర్శనీయమైన పాలనా వ్యవస్థగా కూడా భావించేలా ఉండాలి’. బహుశా అందుకే బ్రిటిష్ రాజ్యాంగ వ్యవహారాల మీద సాధికార వ్యాఖ్యాతలలో ఒకరైన ఐవర్ జెన్నింగ్స్ కూడా ‘మధ్యలో ఒక పార్టీని విడనాడడమంటే తరువాతి ఎన్నికలలో ఆ పార్టీ మద్దతును కోల్పోవడమే’ అన్న స్పృహ ఉండాలన్నాడు. అంతేగాదు, ఓటు హక్కును వినియోగించుకునే సగటు సామాన్య ఓటరు పార్టీ గుర్తుకు మాత్రమే ఓటు వేస్తాడు. అంటే అంతకు ముందు ఆ పార్టీని అర్ధాంతరంగా ఫిరాయించిన లెజిస్లేటర్ ఇక ఎన్నిక కాబోడనే దాని అర్థం కూడా అని జెన్నింగ్స్ అన్నాడు. అందుకని భారత రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ఎందుకంత కీలకమైంది? లెజిస్లేటర్ లేదా ఫిరాయింపుదారు ఈ సవరణ ప్రకారం లెజిస్లేచర్ సభ్యత్వాన్ని వదులుకోవలసిందే, సీటు ఖాళీ చేయవలసిందే, లెజిస్లేటర్‌గా అనర్హుడు కావలసిందేనని ఆ సవరణ స్పష్టం చేసింది. అందుకే సుప్రీం కోర్టు లెజిస్లేటర్ల ఫిరాయింపుల నిషేధ చట్టం రాజ్యాంగ బద్ధతను ఖాయం చేస్తూ 1993లోనే విలువైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యులుగల సుప్రీంకోర్టు ధర్మాసనంలో సుప్రసిద్ధ న్యాయమూర్తి వెంకటాచలయ్య కూడా ఉన్నారు (కిహోటా హల్లోహన్ జాబిల్హూ కేసు). చివరికి ఇలా ఫిరాయించే లెజిస్లేటర్లు స్వతంత్ర/ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సభలో కూర్చోవడానికి సిద్ధపడడం కూడా ‘ఓటర్లను మోసగించడం’గా ఆస్ట్రేలియా రాజ్యాంగ చట్టం, మరికొన్ని దేశాల రాజ్యాంగాలు పరిగణించాయి. మన దేశంలో కూడా ఎన్నికల కమిషన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం లాంటి అనేక రాజ్యాంగ సంస్థలు పదే పదే ఫిరాయింపులను గురించి హెచ్చరిస్తూ వచ్చినా రాజకీయాలలో నేరపూరిత వ్యూహాలు, పద్ధతులు పెరిగిపోతున్నాయి తప్ప, ఆగడం లేదని ప్రజల అనుభవం. ఇదే అంశాన్ని పాతికేళ్ల క్రితం ప్రస్తావించి నపుడు హోంశాఖ మాజీ కార్యదర్శి ఓరా కమిటీ పోలీసులు, రాజకీయులు, మాఫియా మధ్య బలమైన పీటముడి ఉందని హెచ్చరించ వలసి వచ్చింది. నేరమయ రాజకీయాలలో ఫిరాయింపులు ఒక భాగం. రాజకీయాలు నేరమయం కావడం గురించి కోర్టులు, సుప్రీంకోర్టులలో అనేక ఫిర్యాదులు అప్పీళ్ల రూపంలో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే కోర్టులు మాత్రం ఎన్ని పెండింగ్ కేసులని పరిష్కరిస్తాయి? బలవంతులకు, ధనవం తులకు కొమ్ము కాసే స్థితికి పాలకపక్షం, ప్రభుత్వాల రాజకీయ స్థాయి చేరకూ డదు. రైతుల, మధ్య తరగతి ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడు లేడు. నియంతృత్వ శక్తులకు ఊతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి గెంతి స్పీకర్స్ చాటున దాగి నెలల తరబడి గుర్తింపు పొందాలన్న తహతహను కూడా సుప్రీం నిరసించింది. ఒక పార్టీ అభ్యర్థి ఒకే రోజున మూడు పార్టీలు ఫిరాయించిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది. స్పీకర్ నిర్ణయానికి తిరుగులేదనుకునే వారికి కూడా సమాధానంగా అత్యున్నత ధర్మాసనానికి స్పీకర్ల నిర్ణయాలను కూడా సమీక్షించే హక్కు ఉందని చెప్పవలసి వచ్చిందని మరువరాదు. అంతేగాదు, 2007లో లోక్‌సభలో ఆ తరువాత రాష్ట్ర శాసనసభలలో ఫిరాయింపులను ప్రోత్సహించడానికి లేదా సభలో ఫలానా ప్రశ్న వేస్తే ఇంత రొఖ్ఖం చెల్లిస్తామని బేరాలాడే సందర్భాలలో సుప్రీం ముందుకు ఒక కేసు విచారణకు వచ్చింది (రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్: క్యాష్ ఫర్ క్యారీ). ఆ కేసులో వాదించిన సుప్రీం న్యాయవాది డాక్టర్ చౌహాన్ ఒక సందర్భంలో ఫిరాయింపులలో ఎక్కువ భాగం తమను మంత్రులుగా నియమించవచ్చునన్న ఆశలతో ఉండి ఆ పదవులు రాకపోతే హతాశులైన సభ్యులని వెల్లడించాడు. ఇందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాది పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపుదారులతో (1997)బీజేపీ కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అలాగే 2008లో కాంగ్రెస్‌పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కర్ణాటకలో బీఎస్ ఎడ్యూరప్ప (బీజేపీ) మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. లెజిస్లేటర్లలో వక్రీకరించే బుద్ధుల నుంచి పుట్టే ఫిరాయింపుల సంస్కృతికి ధనిక వర్గ రాజకీయ పక్షాలే ప్రధాన కారణం. ఈ సంస్కృతి వల్ల ప్రజాతంత్ర శక్తుల ఉదాసీనత వల్ల ఫిరాయింపుల ద్వారా విపక్షాన్ని నిశ్శేషం చేసి నియంతృత్వ శక్తులు పెట్రేగిపోయే ప్రమాదం ఉంది. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏం ఆశించి వెళ్లారో చెప్పాలి: రాఘవులు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్లడం అనైతికమని, నేతలు ఏం ఆశించి అధికార పార్టీలోకి వెళ్లారో చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార పార్టీ భావిస్తోందని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు తగదని రాఘవులు హితవు పలికారు. ఓటుకు కోట్ల కేసు, కాల్‌మనీ కేసులు ఎందుకు మూత పడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్‌మనీ కేసులో టీడీపీ నేతలు దొంగల్లా దొరికారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో ఒకే దగ్గర నిధులు కెటాయించడం సరికాదని రాఘవులు తెలిపారు. -
'బాబూ.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి'
విజయవాడ: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించడం చంద్రబాబు దివాలాకోరు విధానాలకు నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని, రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని మధు తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అనుసరించిన విధానాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. -
అభద్రతా వలయంలో చంద్రుడు
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిన ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో తమ పార్టీకి అన్యాయం జరిగిందంటూ నోరెత్తి చెప్పుకునే అర్హత పూర్తిగా కోల్పోయారు. ఓటుకు కోట్లు వ్యవహారం నడిపించి ఇంకొన్నాళ్లు హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించే అవకాశాన్ని వదులుకున్న చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పెద్దలు తెలంగాణలో తమ పార్టీకి అక్కడి అధికార పార్టీ వల్ల జరిగిన నష్టాన్ని గురించి నోరెత్తే అర్హతను కూడా సోమవారం రాత్రి భూమా నాగిరెడ్డి బృందాన్ని తమ పార్టీలో చేర్చుకుని కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజులలోనే ఆయనకు ఒక కోరిక ఉండేదట. దాని గురించి స్నేహితులతో చెబుతూ ఉండేవారట కూడా. ఏనాటికయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అన్నదే ఆ కోరిక. నారావారిపల్లె నుంచి తిరుపతికి బస్సులో రావడానికి కూడా డబ్బులు లేని రోజులవి. తాడూ బొంగరం లేదు, కాణీకి ఠికానా లేదు. బాబు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడని సావాసగాళ్లంతా ముక్కున వేలేసుకునేవారట. అవి యూనివర్సిటీలో ఎం.ఎ. చదువుతున్న రోజులు. తీరిక దొరికి నప్పుడల్లా ఇదే పాట. కోరికలు అందరికీ ఉంటాయి. అవన్నీ నేరవేరేనా? అని ఆయన మాటలను తేలిగ్గా తీసుకునేది ఆయన మిత్రబృందం. ఓ ఇరవయ్యేళ్లు కాలగర్భంలో కలసిపోయాయి. చంద్రబాబునాయుడు 1995 చివర్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కల నెరవేరింది. పాత మిత్రులంతా ఆయన చిరకాల వాంఛను గుర్తు చేసుకుని మనవాడు పట్టుదలతో అనుకున్నది సాధించాడు, పట్టుదల అంటే అలా ఉండాలి! భేష్ అని మెచ్చుకున్నారు. ఇదంతా చంద్రబాబు తన మామగారు ఎన్.టి. రామారావుకు శ్రమతో దక్కిన అధికారాన్ని అక్రమంగా లాగేసుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పుడు కొన్ని పత్రికలలో ఆయన దృఢసంకల్పాన్ని వేనోళ్ల కీర్తిస్త్తూ రాసిన కథనాలలో భాగంగా మనం కూడా చదువుకున్నదే. పదవే ముఖ్యం చంద్రబాబు కోరిక నెరవేరింది నిజమే, కానీ అది ఏ విధంగా అన్నది ఆ మిత్రులు మరిచిపోయారు. మిత్రులు కాబట్టి, విషయం తెలిసినా, ఎలా అయితే ఏమి మన మిత్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని మురిసిపోయి ఉంటారు. ఏ మార్గంలో వెళ్లామన్నది అనవసరం. అంతిమ ఫలితం ఏమిటన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారై చాలా కాలమైంది. ఓ ఇరవై సంవత్సరాల క్రితమే రాజకీయాలలో నీతి అనేది నేతి బీరకాయలో నెయ్యి వంటిదని చెప్పినవారు చంద్రబాబు. దేశమంతటా సాగుతున్న ఫిరాయింపు రాజకీయాలకు ఆయన ఆదర్శం. చంద్రబాబు 1995 ఆగస్ట్ సంక్షోభం సమయంలో వైస్రాయ్ హోటల్లో శిబిరం ఏర్పాటు చేసిననాడు 30, 35 మంది ఎమ్మెల్యేలకు మించి ఆయనతో లేరు. రెండోరోజు, మూడోరోజు గడిచే సరికి పత్రికల వార్తలకు భయపడి కొందరు, ప్రలోభాలకు లొంగి కొందరు మొత్తానికి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమయిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆయన పక్కన చేరారు. ఆ సంక్షోభం నాటి విషయాలు ఇప్పుడెందుకు అన్న సందేహం ఎవరికయినా కలగవచ్చు. అట్లా సందేహం కలగడం సహజం. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు లాక్కున్నాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పార్టీని గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారు కదా అన్న వాదన రావడం కూడా సహజమే. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ని సర్కస్‌లు చేస్తే అధికారంలోకి వచ్చిందీ అందరికీ తెలుసు. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ మధ్య ఓట్ల తేడా ఎంతో కూడా అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సిందే కానీ, ఈ 20 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజల భ్రమలు తొలగిపోయి ఎంత అసంతృప్తిలో ఉన్నారో కూడా ఆయనకు తెలుసు. ఎప్పుడేం జరుగుతుందో అనే అభద్రత ఆయనను వెన్నాడుతున్నట్టే ఉంది. ఆది నుంచీ అభద్రతా భావమే సోమవారం నాటి సాక్షి చానల్లో ఫోర్త్ ఎస్టేట్ చర్చలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం, అక్కడి ప్రభుత్వంలో భాగస్వామి భారతీయ జనతా పార్టీ నాయకుడు గరిమెళ్ళ చిట్టిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అభద్రతాభావం వల్లనే ప్రతిపక్ష శాసన సభ్యులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయిదేళ్లు పాలించమని ప్రజలు తీర్పు ఇచ్చాక అభద్రతాభావం ఎందుకు అన్న అంశం దగ్గరే 1995 ప్రస్తావన కూడా అవసరం. చంద్రబాబు నాయుడు చదువుకునే రోజులలో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న మాట నిజమే. అప్పుడాయన యువకుడు. విద్యావంతులయిన యువకులు సహజం గానే నీతిమంతమయిన రాజకీయాల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమయినా మంచి చేద్దామనుకుంటారు. ఆయన ఆ దారి వదిలేసి, రెండో దారి వెతుక్కున్నారన్న విషయం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది. అడ్డదారులంటే కోపం రావచ్చు. ఇంగ్లిష్‌లో షార్ట్ కట్స్ అందాం. ఆయన షార్ట్ కట్స్ ద్వారానే ముఖ్యమంత్రి స్థాయికి రాగలిగారు. కాబట్టే అడుగడుగునా ఆయనను అభద్రతాభావం వెంటాడుతూ ఉంటుంది. అందుకే షార్ట్ కట్ పద్ధతులు అనుసరిస్తుంటారు. అత్యద్భుతమయిన ప్రజా తీర్పుతో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చాలా కొద్ది మాసాలలోనే కూలదోసి అధికారంలోకి రావడానికి కూడా చంద్రబాబునాయుడులో ఆనాడు ఉన్న అభద్రతాభావమే కారణం. ఆనాటి మంత్రివర్గంలో రెండు ముఖ్య శాఖలు- రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇచ్చినా కూడా ఆయనలో అభద్రతాభావం అలాగే ఉండిపోయి, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసే దాకా వెళ్ళింది. ఆ తరువాత కూడా ఎన్టీఆర్‌తో ఉన్న శాసనసభ్యులను కూడా తన శిబిరంలోకి రప్పించుకునే వరకూ ఆయనను అభద్రత వదలలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని నడుపుకునేందుకు అవసరమైనంతమంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉన్నారు. అయినా ఎందుకు ప్రతిపక్ష శాసన సభ్యులను పార్టీలోకి లాక్కునే పనిలో పడ్డారు? తమ ప్రభుత్వ పనితీరు నచ్చి, అభివృద్ధిని కాంక్షించి ఓ నలుగురు శాసన సభ్యులు ప్రతిపక్షాన్ని వీడి తమ పంచన చేరారని తెలుగుదేశం వారు చెబుతున్నారు. మరి పక్క రాష్ర్టం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అధికార పార్టీలోకి వలసపోతే నీతిబాహ్యం అని నోరు పారేసుకున్నారెందుకు? చంద్రబాబు అభద్రతాభావం కారణంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. అభద్రత కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అందులో నుంచి బయట పడాలనుకున్నారు. అది బెడిసి కొట్టి చివరికి తెలంగాణలో పార్టీ ఉనికి కూడా లేకుండా చేసుకున్నారు. తెలంగాణలో మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటున్నారు చూశారా తమ్ముళ్లూ అని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు పక్షం రోజులు తిరక్కుండానే చేసిందేమిటి? ఆయనలో అభద్రతాభావం 2014 నాటి ఎన్నికలలో గెలిచిన క్షణం నుంచే ఉంది. అందుకే ప్రమాణ స్వీకారాలయినా కాకుండానే ఇద్దరు ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులకు తన పార్టీ కండువా కప్పారు. ప్రతిపక్ష శాసన సభ్యుల వేట కూడా ఆయన ఆనాడే ప్రారంభించారు. ఆ నలుగురిని లాక్కోడానికి 20 నెలలు పట్టింది. నైతిక హక్కును కోల్పోలేదా? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిన ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో తమ పార్టీకి అన్యాయం జరిగిందంటూ నోరెత్తి చెప్పుకునే అర్హత పూర్తిగా కోల్పోయారు. ఓటుకు కోట్లు వ్యవహారం నడిపించి ఇంకొన్నాళ్లు హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించే అవకాశాన్ని వదులుకున్న చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పెద్దలు తెలంగాణలో తమ పార్టీకి అక్కడి అధికార పార్టీ వల్ల జరిగిన నష్టాన్ని గురించి నోరెత్తే అర్హతను కూడా సోమవారం రాత్రి భూమా నాగిరెడ్డి బృందాన్ని తమ పార్టీలో చేర్చుకుని కోల్పోయారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడే తల ఎగరేశారు. ఫిరాయింపు రాజకీయాల గురించి ఇక తెలంగాణ తెలుగుదేశం వీరుడు రేవంత్‌రెడ్డి ఏం ఫిర్యాదు చేస్తారు? తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరి చేతా రాజీనామాలు చేయించి మళ్లీ పోటీ చేసి గెలవండని శాసించే స్థితిలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మీ నిర్వాకం మాటేమిటి అని ఎవరయినా ఎదురు ప్రశ్నిస్తే? భవిష్యత్ రాజకీయాలను నడిపించాల్సిన యువతరం ఈ నీతిమాలిన వ్యవహారాలను నిలదీసి కడిగెయ్యాలి. కానీ నాన్న వేలు పట్టుకుని అలవోకగా పార్టీ మారిపోయిన యువ రాజకీయవేత్త అఖిలప్రియను చూశాక ఆ ఆశ కూడా సన్నగిల్లుతున్నది. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
పార్టీ ఫిరాయింపులపై ముగిసిన వాదనలు
తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్: తమ పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు , అలాగే రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి, మదన్ లాల్లు తమ తమ పార్టీల నుంచి ఫిరాయించారని, వాటిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని మొదట విచారించిన సింగిల్ జడ్జి విచారణార్హత లేదంటూ కొట్టేశారు. దాన్ని సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ఆయా పార్టీల నేతలు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ ఫిర్యాదులు స్పీకర్ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నాయని, కాబట్టి ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. ఇదే విషయాన్ని 1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులు ఇచ్చిన 9 నెలలు కావొస్తున్నా స్పీకర్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, 9 నెలలుగా ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉండటం మంచిదికాదని తాము భావిస్తున్నామంది. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని నిరూపిస్తే తప్పక ఆ మేరకు ఆదేశాలిస్తామని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
ఫిరాయింపుదారులతో బంగారు తెలంగాణానా?
హైదరాబాద్ సిటీ: తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన వారితో బంగారు తెలంగాణను నిర్మిస్తారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్ నియంతృత్వం, అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే ఉండకూడదనే విధంగా పాలనసాగిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్లో చేరితేనే నిధులు, పనులు, అభివృద్ధి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే గెలిచిన ప్రజాప్రతినిధులను ఎందుకు అవమానిస్తున్నాడని ప్రశ్నించారు. ప్రజల్లో ఓడిపోయినవారు, ప్రజలు ఛీకొట్టినవారే మంత్రులు అవుతున్నారని, ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నియోజకవర్గంలో ఇళ్లు తప్ప రాష్ట్రంలో ఎక్కడా లేవన్నారు. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి దగ్గర సచివాలయం అని చెప్పి ఇప్పుడేమో సికింద్రాబాద్‌లో సచివాలయం అంటూ రోజుకో కొత్త మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు. -
ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు..
టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల అనర్హతపై అక్కడే తేల్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అధ్యక్షతన ఈ కమిటీ ఆదివారం తొలిసారిగా సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల అంశంపైనే ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కేసును కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమన్వయపరుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ అంశాలను ధ్రువీకరించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.