టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల అనర్హతపై అక్కడే తేల్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అధ్యక్షతన ఈ కమిటీ ఆదివారం తొలిసారిగా సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల అంశంపైనే ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కేసును కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమన్వయపరుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ అంశాలను ధ్రువీకరించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.
ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు..
Published Mon, Nov 24 2014 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement
Advertisement