సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపులపై ఏ ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి మంచిదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్‌ఎస్ పార్టీ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని, 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ‘బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా? అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేనని, కోర్టుల తీర్పులు తమకే మేలు చేస్తాయని చెప్పారు.
చదవండి: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన
Comments
Please login to add a commentAdd a comment