అంచనాలను నిజం చేస్తూ టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. ఈమేరకు నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖను ఇవ్వడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అందుకు అంగీకారం తెలిపారు. అనంతరం టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ తీర్మానించిన లేఖను ఆ పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి అందజేశారు.