ఫిరాయింపుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి
ఫిరాయింపుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి
Published Wed, Mar 22 2017 3:57 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
► వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారు
► వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు(వేదాయపాళెం) : వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లి పార్టీ ఫిరాయించిన నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల్లో వీరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే తగిన రీతిలో బుద్దిచెబుతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 439 మంది స్థాని క సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందారని, టీడీపీకి 350 మాత్రమే ఉన్నారన్నారు.
అనైతిక రాజకీయాలకు, ప్రలోభాలకు గురై కొం దరు పార్టీ మారారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు అభిమానించి వారిని గెలిపించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వై ఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన ప్రజాప్రతినిధులు నైతిక విలువలు పాటిస్తారని భావించారన్నారు. ఫిరాయించిన నాయకులు 6 నుంచి 8 శాతం వరకు వైఎస్సార్‌సీపీకి ఓటు వేయలేదన్నారు. వీరి వైఖ రిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు 180 ఓట్లు ఆధిక్యత వస్తుం దని ప్రకటించుకున్నారని, ఆ పరిస్థితి ఇప్పుడేమైందని ప్రశ్నించారు.
పోలింగ్ రోజున మనుబోలు ఎంపీపీ చిట్టమూరు అని తమ్మ కుమర్తె చనిపోయిన దుఃఖం లో ఉన్నప్పటికీ పార్టీపై ఉన్న అభిమా నం, నైతిక విలువలు పాటించి వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్నారు. ఎన్నికల్లో తన కోసం కృషిచేసిన నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవ య్య, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేం ద్రరెడ్డి, నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఎల్లసిరి గో పాల్‌రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలి యజేశారు.
సమావేశంలో పార్టీ నాయకులు బత్తల కృష్ణ, పుచ్చలపల్లి రాంప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆనం కార్తీక్‌రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, హనుమంతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Advertisement