హైదరాబాద్, సాక్షి: శాసన సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌర పరిచేలా మాట్లాడటం సరికాదని బీఆర్‌ఎష్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘‘ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్‌రావ్‌ల అనర్హతపై నాలుగు వారాల్లో నివేదిక ప్రకటించాలని ఆ సెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వక పొతే సుమోటోగా హైకోర్టు కేసును నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. తీర్పు కాపీ రాలేదని.. టై పాస్ చేయొద్దని, తక్షణం యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని కలిశాం. మిగతా ఎడుగురి ఎమ్మెల్యే అనర్హత స్పీకర్ కార్యాలయంలో వుంది. వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి.. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మంత్రి శ్రీధర్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌరపరిచేలా మాట్లాడటం సరికాదు. శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. 10 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. పార్టీ పిరాయించిన రాహుల్ గాంధీ ఏమో వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. చట్టం తీసుకొస్తా అని చెప్పింది రాహుల్ గాంధే కదా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. సీఏసీ చైర్మన్ నియామకం సభ నియమావళికి విరుద్దంగా జరిగింది.
14 నామినేషన్ వేస్తే ఎన్నికలు పెట్టాలి.. కానీ పెట్టలేదు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. హరీశ్ రావ్ నామినేషన్ ఎక్కడికి పోయింది. పార్టీ తరుపున 3 పేర్లు ఇచ్చారు. నాలుగో పేరు ఎవరు ఇచ్చారు. శ్రీధర్ బాబు దిగజారి మాట్లాడుతున్నారు. తీర్పు వచ్చాక పార్టీ మరీనా ఎమ్మెల్యేలు ఒక్కోరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. 10 ఎమ్మెల్యేలను మోసం చేశారు రేవంత్ రెడ్డి. ముందు నోయీ వెనక గొయ్యిలాగా వుంది వారి పరిస్థితి.
పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం
తెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘ దానం నాగేందర్ బిచ్చగాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, దానం నాగేందర్ బిగ్ చీటర్, మాజీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ మిలిగిపోతారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు. కడియం రాజీనామా చేయాలి. డిపాజిట్ కూడా కడియంకు రాదు. చీరలు , గాజులు 10 మంది ఎమ్మెల్యేలకు కొరియర్ చేస్తా వేసుకొని తిరగండి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే మీరు రాజీనామా చేయాలి. గత 10 ఏళ్లలో ఒక్క ఎమ్మెల్యేకు అయినా వ్యక్తి గతంగా పార్టీ కండువా కేసీఆర్ కప్పినట్టుగా చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’అని అన్నారు. ప్రస్తుతం కౌశిక్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
చదవండి: పార్టీ ఫిరాయింపుల కేసు: అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
చదవండి: నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment