kaushik reddy
-
HYD: కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి బెయిల్
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులతో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్‌రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు. ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత -
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతల ఆందోళన
-
హైదరాబాద్ లో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
-
అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తనను హత్య చేయడానికి అనుచరులను పంపించానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సహచ ఎమ్మెల్యేను హత్య చేయడానికి పంపించారంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉండదని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు పార్టీ నాయకులు కొట్లాడుకున్నారని అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ డ్యామేజ్ చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో నేనే అనుచరులను పంపిన అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాని ప్రశ్నించినదుకు సీఎం రేవంత్ నన్ను హత్య చేయాలని అనుకున్నారా?. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ, హోమ్స్ సెక్రెటరీ స్పదించాలి. .. డీజీపీ, హోం శాఖ స్పదించక పోతే రేపు(మంగళవారం) గవర్నర్‌ను కలుస్తా. పోలీసులు సీఎం రేవంత్పైన 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. సైబరాబాద్ పోలీస్ కమిషన్‌కు మంచి పేరు ఉంది. అవినాష్ మహంతి కరీంనగర్ సీపీగా డైనమిక్‌గా పని చేస్తున్నారు. డైనమిక్ లాగా అవినాష్ మహంతి పని చేయాలి. ఎమ్మెల్యే ఇంటి మీద ఎటాక్ జరిగితే ఎం జరిగిందో పోలీసులు చెప్పరా? ..ఒకన్నీ అరెస్ట్ చేసి ఇంకొకనికి ఎస్కార్ట్ ఇచ్చి చింతపండు చేసినం అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. మరీ ఓటుకు నోటు కేసులో చింతపండు అయిన విషయం మర్చిపోయినవా? నేను తెలంగాణ జనం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. సీఎం రేవంత్ స్థాయి.. వీధి రౌడీ స్థాయికి దిగజారిపోయింది. సీఎం రేవంత్ మనుషులు హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డికి ఫోన్ కాల్స్ వివరాలు ఇచ్చాను. నా ప్రాణానికి హాని జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. రాష్ట్రంలో మల్లా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది.. ఇది పక్కా. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం’ అని అన్నారు. -
డీసీపీ ఫిర్యాదు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్ఎస్ 132 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ప్రాంతీయతపై కేటీఆర్‌కు పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రవాణా శాఖ, హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(సెప్టెంబర్14) కౌశిక్‌రెడ్డి ఇంట్లో మీడియాతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.‘ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ సభ్యులు కాదా.హైదరాబాద్ లో నివసించే వారిని ఏనాడూ కాంగ్రెస్ విమర్శించలేదు. అత్యంత దారుణంగా ఆంధ్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్ కాదా.బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీనే చెప్తున్నారు.ప్రాంతీయతను రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలా నియంతృత్వ పోకడలకు మేం పోవడం లేదు.గాంధీ,కౌశిక్ చేసింది తప్పే.కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం కరెక్టా.భౌతిక దాడులు మంచివి కావు’అని పొన్నం అన్నారు. ఇదీ చదవండి.. కౌశిక్‌రెడ్డిపై దాడి వెనుక పోలీసులు: కేటీఆర్ -
హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగ: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.శనివారం కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పోలీస్ ఎస్కార్ట్‌తో వచ్చి కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీ దాడి చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను రేవంత్ కాపాడలేకపోయారన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, ఇక్కడి ప్రజలను రేవంత్ పగబట్టారని విమర్శించారు. ఇందుకే హైడ్రా తీసుకు వచ్చారన్నారు. నగరంలోప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.‘మా పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి రేవంత్‌రెడ్డి కండువా కప్పారు. రేవంత్‌రెడ్డి ఆయన తొత్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ స్వయంగా కండువా కప్పారు. కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణికి పోతున్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో రేవంత్ అన్నారు.మరి ఇప్పుడెందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటనా. పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. దాడికి సహకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయమే కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తొలుత కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కౌశిక్ రెడ్డిని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు. కాగా, పార్టీ ఫిరాయింపుల విషయమై రెండు రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. ఇవి కాస్తా ముదిరి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరుతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో పోలీసులు హైదరాబాద్ నగరంలోని బీఆర్స్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో శుక్రవారం పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు
సాక్షి,హైదరాబాద్:శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితమే ఒక కేసు నమోదవగా ఆ కేసులో గాంధీ ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు పెట్టారు.కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఇవి కాస్తా హద్దు మీరి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద గాంధీ దాడి చేసే దాకా వెళ్లింది. ఈ దాడిపై బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారడంతో హరీశ్‌రావు సహా ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు. ఇదీ చదవండి.. ఎమర్జెన్సీ కన్నా దారుణం: హరీశ్‌రావు -
ఇరు పార్టీల నేతల మధ్య పేలిన మాటల తూటాలు
-
హరీశ్ నీచ రాజకీయాలతో బీఆర్ఎస్ ఖతం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హరీశ్‌రావు చేస్తున్న నీచ రాజకీయాలతో ఖతం అవుతుందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావు.. కౌశిక్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలకు తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న చిల్లర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో తన సోదరి కవితకు బెయిల్ రాగానే కేటీఆర్ అమెరికాకు చెక్కేశారని, ఇక్కడ వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ఏమాత్రం సోయి లేకుండా అమెరికాలో ఎంజాయ్ చేయడానికి వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబం చేసిన క్షుద్ర ఆలోచనలతో ఎంతో మంది యువకులు బలి అయ్యారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఉన్మాదిలా తయారయ్యారని అన్నారు. మహిళల ఆత్మగౌరావన్ని దెబ్బతీసేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి ఉందని విమర్శించారు. ఆ పారీ్టలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే కౌశిక్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరికెçపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడే అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలన అంతా కమీషన్ల కోసమే సాగిందని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో కేసీఆర్ కుటుంబం ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. కౌశిక్రెడ్డివి పిల్ల చేష్టలని, ఆయన బీఆర్ఎస్ పార్టీ పరువు తీస్తుంటే హరీశ్‌రావు ప్రోత్సహిస్తున్నట్లు ఉందని అన్నారు. గతంలో గవర్నర్ తమిళిసై మీద ఇష్టానుసారంగా మాట్లాడి కౌశిక్‌రెడ్డి మహిళలను అగౌరవపర్చాడన్నారు. కౌశిక్‌రెడ్డి తన ప్రవర్తన మార్చుకోకపోతే బడిత పూజ ఖాయమని హెచ్చరించారు. -
ఎమర్జెన్సీకన్నా దారుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం రేవంత్ చేస్తున్న రాజకీయ డ్రామాలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు బీఆర్ఎస్ నేతల అరెస్టులు దుర్మార్గమని విమర్శించారు. బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై ఉన్న కక్షను తెలంగాణ మీద చూపుతున్నారని.. నంబర్ వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని నియంతృత్వ పోకడలతో నిరీ్వర్యం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వైఖరి వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.గురువారం కోకాపేటలోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతి భద్రతలను అదుపు చేయకుండా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు. రేవంత్, డీజీపీ ఎమ్మెల్యే గాం«దీకి బందోబస్తు ఇచ్చి ఎమ్మెల్యే కౌశిక్ నివాసంపై దాడులు చేయించారు. కౌశిక్ నివాసంపై దాడి చేసింది గాంధీ కాదు సీఎం రేవంత్. బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు గాం«దీని ఎందుకు నిర్బంధించలేదు?’’అని ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన అరికెపూడి, ఆయన అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపి.. తమను మాత్రం అరెస్టు చేసి అర్ధర్రాతి అటవీ ప్రాంతాల్లో తిప్పారని విమర్శించారు. భాషను మార్చుకోకుండా నీతులా? సీఎం రేవంత్ తన అసభ్య, సంస్కారహీనమైన భాషను మార్చుకోకుండా యూట్యూబ్ చానళ్లకు నీతులు చెబుతున్నారని.. తొమ్మిది నెలలుగా పాలనపై కాకుండా పైసలపై దృష్టి పెట్టడంతో శాంతి భద్రతలు పాతాళానికి పడిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘మీడియాకు లీకులు, చిట్‌చాట్‌లతో శాంతి భద్రతలు అదుపులోకి రావు. సీఎం వాడుతున్న బజారు భాషతో రాష్ట్రంలో విద్వేషాలు చెలరేగి ప్రశాంతత మంటగలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై సీఎం ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతున్నారు. పీఏసీ చైర్మన్ నియామకంలో రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గం. డీజీపీ రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దారుణం’’అని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు, పీఏసీ చైర్మన్ నియామకాన్ని వ్యక్తుల మధ్య కొట్లాటగా చిత్రీకరించి పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. -
సీఎం కనుసన్నల్లోనే దాడులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు సమావేశం పెట్టుకునేందుకు కూడా అనుమతులు లేవా అనిప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రి వెన్నులో వణుకు వస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులు, గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కౌశిక్‌రెడ్డిపై దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ జులుంను సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. ప్రశి్నస్తున్న ప్రజాప్రతినిధులపై సీఎం కనుసన్నల్లోనే గూండాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని రేవంత్ తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
సాక్షి, హైదరాబాద్/ దుండిగల్/ గచ్చిబౌలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి హరీశ్‌రావును, ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేసి, నివాసం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. నేతలతోపాటు క్షేత్రస్థాయి క్రియాశీల నాయకులు, కార్యకర్తలను కూడా పోలీస్స్టేషన్లకు రావాలంటూ ఆదేశించడం గమనార్హం. ఎక్కడికక్కడ బలగాల మోహరింపుతో.. ఫిరాయింపుల అంశంపై వివాదం, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి నేపథ్యంలో.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ గురువారం రాత్రి ప్రకటించింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే భారీగా మోహరించారు. జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసేందుకు ప్రయతి్నంచగా.. అడ్డుకుని అరెస్టులు చేశారు. ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకుని.. మంత్రి హరీశ్‌రావు కేశంపేట పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యాక శుక్రవారం తెల్లవారుజామున కోకాపేటలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పట్నుంచే అక్కడ పోలీసులు మోహరించారు. పార్టీ నేతలెవరూ హరీశ్‌రావు ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురువారం నాటి తోపులాటలో భుజానికి గాయమై నొప్పితో బాధపడుతున్న హరీశ్‌రావు.. ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భుజానికి గాయమైన హరీశ్‌రావును పరామర్శించేందుకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి,, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వారు పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పోలీసులు హరీశ్‌రావును ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఎడమ భుజానికి స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేశారు. పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ తీసుకోవాలని హరీశ్‌కు వైద్యులు సూచించారు.శంభీపూర్ రాజు నివాసం వద్ద ఉద్రిక్తత మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి అరికెపూడి ఇంటికి వెళతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అప్పటికే శంభీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆ ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో శంభీపూర్ రాజు నివాసం వద్ద పాడి కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు ప్రయతి్నంచారని, తన ఇంటిపై దాడికి ఉసిగొల్పాడని ఆరోపించారు.హైడ్రా పేరిట ఇష్టానుసారం బిల్డింగులను కూల్చివేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తనకు దూకుడు ఎక్కువని అంటున్న దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువని వ్యాఖ్యానించారు. అరికెపూడి గాం«దీకి నీతి, నిజాయతీ ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద గురువారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన విధులకు కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని సైబరాబాద్ అడ్మిన్ ఏడీసీపీ రవి చందన్‌రెడ్డి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కౌశిక్‌రెడ్డిపై బీఎన్ఎస్ 132, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కౌశిక్ రెడ్డికి దానం నాగేందర్ కౌంటర్
-
KSR Live Show: గాంధీకి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
గాంధీకి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
కౌశిక్ రెడ్డి పై ఆరెకపూడి గాంధీ కామెంట్స్
-
కౌశిక్ రెడ్డి, ఆరెకపూడి గాంధీ ఎపిసోడ్ పై కాంగ్రెస్ నేత రియాక్షన్..
-
కౌశిక్ రెడ్డి ఇంటినుండి బయటకు వస్తే అడ్డుకుంటారు గాంధీ ర్యాలీగా వస్తుంటే అడ్డుకోరా..
-
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతకుముందు కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆందోళన చేశారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు -
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన గాంధీ, కౌశిక్ రెడ్డి ఎపిసోడ్
-
బీఆర్ఎస్లోనే గాంధీ.. ప్రతిపక్షానికే పీఏసీ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఎన్నికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముమ్మాటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్షానికి పీఏసీ పదవి కట్టబెట్టామని తేల్చిచెప్పారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అడ్డగోలు నియామకాలు చేసింది బీఆర్ఎస్ కాదా అని విరుచుకుపడ్డారు. ‘అసెంబ్లీ చివరి రోజు పార్టీ బలాబలాలను స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబితే ఆరోజు బీఆర్ఎస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మా సంఖ్య 38 కాదు.. 28 మాత్రమే అని వాళ్లు అనలేదు. అలాంటప్పుడు అనర్హత అనే అంశమే ఇక్కడ తలెత్తదు’ అని స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్.. తన అధికార నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా అరికెపూడి గాందీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వివాదంతోపాటు పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో పీఏసీ ఎంపిక తీరును తప్పుపట్టారు. ‘కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2018 నుంచి 2023 వరకు అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్ ఎలా ఉన్నారు. అప్పుడు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అంటే... అది స్పీకర్ విచక్షణాధికారమని బీఆర్ఎస్ నేతలన్నారు. 2014లో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బీఏసీ సభ్యులుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్‌రెడ్డి పేర్లు ఇస్తే... రేవంత్‌రెడ్డి పేరుకు ప్రత్యామ్నాయం సూచించాలని స్పీకర్ ఎందుకు అన్నారు? ఎర్రబెల్లి పార్టీ మారినప్పుడు నన్ను ఫ్లోర్ లీడర్‌గా గుర్తించాలని చెబితే ఎందుకు గుర్తించలేదు? 2014, 2018లో ఈ విధానాన్ని ప్రారంభించింది మీరే కదా’ అని అన్నారు. పీఏసీలో 13 మంది సభ్యులుంటే బీఆర్ఎస్ నుంచి ఆరుగురికి, సీపీఐ, ఎంఐఎం, బీజేపీ నుంచి ఒక్కక్కరికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కోరలేదు కాబట్టే స్పీకర్ నామినేషన్లను పరిశీలించి గాందీకి అవకాశం కల్పించారని తెలిపారు. కౌశిక్ వ్యాఖ్యలపై వారంతా క్షమాపణ కోరాలి కౌశిక్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌రెడ్డి, ‘బతకడానికి వచ్చినోళ్లు అంటూ గాం«దీని ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి వాళ్ల బాస్ చెప్పిందే మాట్లాడారు. కౌశిక్ అలా మాట్లాడొచ్చా లేదా అనేది కేసీఆరే చెప్పాలి. కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పాలి’ అని అన్నారు. బతకడానికి వచ్చిన వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లు వద్దా? అని నిలదీసిన ముఖ్యమంత్రి.. వాళ్లు ఓట్లేస్తేనే కదా గ్రేటర్లో గెలిచిందని గుర్తుచేశారు. ‘బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడమంటే కౌశిక్ మాట్లాడాడా, లేక ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా అనేది స్పష్టం చేయాలి. వీళ్లు మాట్లాడమంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కౌశిక్ వ్యక్తిగతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ది సైకలాజికల్ గేమ్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పును ప్రస్తావించగా, ‘తీర్పును నేను అధ్యయనం చేయలేదు. అది చూస్తేనే దీనిపై మాట్లాడగలను’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారనగా.. ‘బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. మా పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ 66 మంది ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులేం ఉండవు. ప్రభుత్వాన్ని పడగొడతామన్నందుకే ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఈ చర్చలన్నీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నందుకే చర్చ జరుగుతోంది. ఆ రెండు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉన్నట్లే కదా. ఏ ఎమ్మెల్యే అయినా అటూఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే ఇక ప్రభుత్వానికి ఢోకా ఎక్కడుంది’ అని అన్నారు. ఇదే అంశంపై మరింత స్పష్టతనిస్తూ ‘కోర్టుకెళ్లి అనర్హతలపై ఆర్డర్ తెచ్చామంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏ ఆర్డర్ తెచ్చినా.. ప్రభుత్వంలోని పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే అవకాశమే లేదని చట్ట ప్రకారం నిర్ణయం వస్తే, ప్రతిపక్ష పార్టీలకన్నా, మా పార్టీ వాళ్లమే ఎక్కువ సంతోషిస్తాం. ఎమ్మెల్యేలు ఎక్కడివారక్కడే ఉండాలని బీఆర్ఎస్ వాళ్లంటున్నారు. మేమూ అదే కోరుకుంటున్నాం. ఎక్కడివారు అక్కడే ఉంటే నా 66 మంది నాతో ఉంటారు. కేసీఆర్ లక్కీ నంబర్ నా వద్దే ఉంది కదా’ అని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొడతామని తిరిగేకంటే పథకాల అమలు గురించి ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రివర్గం విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాతే ఎవరిని తీసుకోవాలనే విషయంలో సీఎం పాత్ర వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలుగా 14 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులిచ్చారని, వీటిని ఫిల్టర్ చేసేలా జర్నలిస్టు సంఘాలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసి.. పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ‘‘పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వం దాడి చేయించటమే ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనా?’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను కచి్చతంగా రాసి పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. అరికెపూడి ఇంటికి వెళ్తానన్న కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. అరికెపూడిని మాత్రం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.వందల మంది కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కాగా ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధగా ఉందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న కౌశిక్‌రెడ్డిని ప్రభు త్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డీ.. మా పార్టీ సైనికుల పోరాటాని కి నీకు నచ్చిన పేరు పెట్టుకో. కాంగ్రెస్ గూండాల దౌర్జన్యాలు, దాడులు బీఆర్ఎస్ సైనికుల స్థైర్యాన్ని ఇసుమంత కూడా దెబ్బ తీయలేవు. తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని మీ అవినీతి, దుర్మార్గ పాలన నుంచి కాపాడుకుంటాం. కౌశిక్‌రెడ్డితో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు..’’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
తెలంగాణ భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్/మణికొండ: మహిళలను కించపరిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. ఖబడ్దార్ కౌశిక్‌రెడ్డి అంటూ కల్వ సుజాతతోపాటు పలువురు మహిళా నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భవన్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకు దిగిన మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా చీర, గాజులను చూపారని ధ్వజమెత్తారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే కౌశిక్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కౌశిక్ క్షమాపణ చెప్పకపోతే గవర్నర్‌ను, స్పీకర్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.కౌశిక్‌రెడ్డి.. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లో తిరిగే పరిస్థితి ఉండదని ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.ప్రకాశ్‌గౌడ్ హెచ్చరించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీకి సంఘీభావం తెలిపేందుకు వారు తమ అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి పిల్ల బచ్చా అని, తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు సీజనల్ పొలిటీషియన్ అని, వారు మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కౌశిక్ యత్నిస్తున్నారని, దానిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రాష్టం విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేçశం, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫయూమ్ పాల్గొన్నారు. కేసీఆర్ స్పందించాలి: అద్దంకి దయాకర్ పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీని ఆంధ్రోడు అన్న కౌశిక్ మాట లు హాస్యాస్పదమని, ఈ మాటలపై కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. పదేళ్లు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నాడని, అప్పుడు ఆంధ్రోడని ఎందుకు అనలేదో చెప్పాలన్నారు. సెంటిమెంట్‌ను వాడుకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల ని డిమాండ్ చేశారు. కౌశిక్ లాంటి కమెడియన్‌ను ఎందుకు ఎన్నుకున్నామా అని హుజూరాబాద్ ఓటర్లు ఫీలవుతున్నారని పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళలంటే చిన్న చూపని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. అధికారం పోగానే మళ్లీ ఆంధ్ర.. తెలంగాణ లొల్లి గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కౌశిక్ ఆంధ్రోళ్ల పేరుతో మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కౌశిక్ వ్యాఖ్యలను సమర్థించకపోతే కేసీఆర్ ఆయనను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
నన్ను చంపేందుకు కుట్ర