
సాక్షి, కరీంనగర్ : ప్రజా సమస్యల గురించి పోరాడుతుంటే తనపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని టీపీసీసీ సెక్రటరీ పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కౌశిక్ రెడ్డికి ముందస్తు బెయిల్ పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా బనాయించే కేసులకు తాను బయపడనని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. 2023లో తప్పక ఈటల రాజేందర్‌ను ఓడిస్తానని, లేకుంటే తన పేరు కౌశిక్ కాదు అని సవాల్ విసిరారు. (ఏం డాక్టర్‌వయ్యా.. దిమాక్ ఉందా?)
పదవి ఉంది కదా అని ప్రజలను ఇబ్బంది పెడితే అంతకు రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటారని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. 2004 లో మాజీ నక్సలైట్లు వారి సిద్ధాంతాలు కల్గిన వ్యక్తిగా ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పుడు ఆయన వెంట ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆస్పత్రిలో పనిచేసే ప్రవీణ్ యాదవ్ చావుకు కారణమైన హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రవీణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ప్రవీణ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment