
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఫోన్ సంభాషణ లీక్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించిన మరో ఆడియో టేప్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. ‘టీఆర్‌ఎస్ టికెట్టు నాకే.. ’అంటూ ఆయన జరిపిన ఫోన్ సంభాషణ సోమవారం లీకై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మేకల తిరుపతితో కౌశిక్ జరిపిన మరో ఫోన్ సంభాషణ లీకైంది. అయితే ఈ ఆడియోలో టీఆర్‌ఎస్ గురించిన ఎలాంటి ప్రస్తావన లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీరును తప్పుపట్టడంతో పాటు, ‘మనం సుఖపడే టైమొచ్చింది..’అంటూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ సంభాషణ ఇదీ..
అధ్యక్షుడే అలా అంటే ఎలక్షన్ ఉంటదా?
‘తిరుపతన్న ఒక్కసారి నేను నిన్ను కలవాలి పర్సనల్‌గా. ఒక్కసారి ఆలోచన చెయ్. నేను చేసిన తప్పేమీ లేదు. రేవంతన్నకు నేను కొట్లాడుతా అనే ఆలోచన ఉన్నప్పుడు, మనం ఓడిపోతామనే స్టేట్‌మెంట్ ఎలా ఇస్తడు. రాజేందర్ గెలుస్తడని ఎట్ల చెప్తడు. నేను ఎట్ల పోరాటం చేయాలె చెప్పు. గెలుస్తం .. ఓడిపోతం తరువాత ముచ్చట. రాష్ట్ర అధ్యక్షుడే అట్ల అన్న తర్వాత ఎలక్షన్ ఏమైనా ఉంటదా. రాజేందర్ మంచి క్యాండెట్ అని చెప్పిన తర్వాత ఎలక్షన్ ఏమైనా ఉంటదా. ఇక్కడ ప్రభాకర్ (పొన్నం ప్రభాకర్)ను కోవర్టు చేసి అందర్నీ రాజేందర్ వద్దకు పంపుతుండు.
ఇది నీకు, నాకు కూడా తెలుసు. నేనేమి చేయాలె ఇప్పుడు. బీజేపీ ఇన్‌చార్జ్‌లను వేసింది. తిరుగుతుండ్రు. టీఆర్‌ఎస్ తిరుగుతంది. నేను రెన్నెల్ల నుంచి రోజూ బతిమిలాడుతన్న. వెయ్యరు, రారు. రాత్రికి వచ్చి నిన్ను కలుస్తా. మనం సుఖపడే టైం వచ్చింది. దాంట్లో మీరు కూడా పాలుపంచుకోవాల్ననేది నా కోరిక..’’అని కౌశిక్ అనగా.. ‘అన్న అన్న అన్న.. మీరు హైదరాబాద్‌లో ఉన్నరా? హుజురాబాద్‌లోనా’అనే మాటలు తప్ప తిరుపతి పెద్దగా ఏం మాట్లాడలేదు.
Comments
Please login to add a commentAdd a comment