
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.
రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులతో భారీగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చారు.

కౌశిక్‌రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు.
ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment