ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా నేతల అరెస్టులు అన్యాయం: హరీశ్‌రావు
అరికెపూడి గాం«దీకి బందోబస్తు ఇచ్చి మరీ కౌశిక్‌రెడ్డిపై దాడి చేయించారు
సీఎం బజారు భాష వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం.. మీడియా లీకులు, చిట్‌చాట్‌లతో శాంతిభద్రతలు సాధ్యం కావు
ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టు చేసి అటవీ ప్రాంతాల్లో తిప్పారని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం రేవంత్ చేస్తున్న రాజకీయ డ్రామాలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు దుర్మార్గమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై ఉన్న కక్షను తెలంగాణ మీద చూపుతున్నారని.. నంబర్ వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని నియంతృత్వ పోకడలతో నిరీ్వర్యం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వైఖరి వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
గురువారం కోకాపేటలోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతి భద్రతలను అదుపు చేయకుండా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు. రేవంత్, డీజీపీ ఎమ్మెల్యే గాం«దీకి బందోబస్తు ఇచ్చి ఎమ్మెల్యే కౌశిక్ నివాసంపై దాడులు చేయించారు. కౌశిక్ నివాసంపై దాడి చేసింది గాంధీ కాదు సీఎం రేవంత్. బీఆర్‌ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు గాం«దీని ఎందుకు నిర్బంధించలేదు?’’అని ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన అరికెపూడి, ఆయన అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపి.. తమను మాత్రం అరెస్టు చేసి అర్ధర్రాతి అటవీ ప్రాంతాల్లో తిప్పారని విమర్శించారు.
భాషను మార్చుకోకుండా నీతులా?
సీఎం రేవంత్ తన అసభ్య, సంస్కారహీనమైన భాషను మార్చుకోకుండా యూట్యూబ్ చానళ్లకు నీతులు చెబుతున్నారని.. తొమ్మిది నెలలుగా పాలనపై కాకుండా పైసలపై దృష్టి పెట్టడంతో శాంతి భద్రతలు పాతాళానికి పడిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘మీడియాకు లీకులు, చిట్‌చాట్‌లతో శాంతి భద్రతలు అదుపులోకి రావు. సీఎం వాడుతున్న బజారు భాషతో రాష్ట్రంలో విద్వేషాలు చెలరేగి ప్రశాంతత మంటగలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై సీఎం ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతున్నారు. పీఏసీ చైర్మన్ నియామకంలో రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గం. డీజీపీ రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దారుణం’’అని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు, పీఏసీ చైర్మన్ నియామకాన్ని వ్యక్తుల మధ్య కొట్లాటగా చిత్రీకరించి పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment