సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?.
ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’ అంటూ విమర్శలు చేశారు.
ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.
ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024
Comments
Please login to add a commentAdd a comment