కరీంనగర్: హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార‍్తల్లో నిలిచారు. నిన్న(మంగళవారం) జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు అయంది. బీఎన్ఎస్ యాక్టు కింద కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం.
కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ ఆగ్రహం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసినట్లు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదన్న కేటీఆర్ తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment