ఆత్మకూర్ : ‘‘దిగువ జూరాల పవర్‌హౌజ్‌లో విధినిర్వహణలో భాగంగా నాతోపాటు వీఆర్క్స్ కంపెనీ డెరైక్టర్ కౌషిక్‌కుమార్‌రెడ్డి, మరో నలభైమంది సిబ్బంది ఉన్నాం. రాత్రి 10:30గంటల సమయంలో ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారి అందరం ఉరుకులు పరుగులు తీశారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే పవర్‌హౌజ్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చిచేరింది. పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన నేను ఈదుకుంటూ ఒకరాడ్‌ను పట్టుకుని అరుపులు కేరింతలు కొట్టడంతో కొంతమంది తాడ్ల సహాయంతో నన్ను పైకిలాగారు. ఇదినాకు పునర్జన్మగా భావిస్తున్నా..’’అని జెన్‌కో ఏడీ శ్రీనివాస్‌రెడ్డి పవర్‌హౌస్‌లోకి చేరిన వరద నుంచి బయటపడ్డ క్షణాలను ఆయన గుర్తుచేశారు. ఆత్మకూర్ మండలం జూరాల మూలమళ్ల గ్రామ శివారులో రూ.1400కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తికేంద్రంలోకి బుధవారం అర్ధరాత్రి భారీగా వరదనీరు చేరింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువకు 1.50లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో జూరాలకు పెద్ద ఎత్తున వరదఉధృతి చేరింది.
దీంతో జూరాల అధికారులు దిగువకు గురువారం రాత్రి 9గంటల సమయంలో 90వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. జెన్‌కో అధికారులు ఏర్పాటుచేసిన ఇన్‌టెక్‌వెల్ గేట్‌వాల్వ్స్ వరదధాటికి కొట్టుకుపోవడంతో రాత్రి 10 గంటల సమమంలో వరదనీరు ఒక్కసారిగా పవర్‌హౌజ్‌లోకి చేరింది. అప్పటికే పవర్ హౌజ్‌లో విధుల్లో ఉన్న జెన్‌కో అధికారులు, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర కార్మికుల సహాయంతో బయటపడ్డారు. ఈ సంఘటన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియపర్చడంతో తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బృందం దిగువ జూరాల ప్రాజెక్టు సందర్శించింది. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో శ్రీశైలం ప్రాజెక్టులో ప్రమాదం జరిగిందనప్పుడు రూ.30కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన నష్టం అంతకంటే తక్కువగానే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారులు అప్రమత్తంగా వుండటంతోనే ఎలాంటి ప్రాననష్టం వాటిల్లలేదని అన్నారు. కాపర్‌డ్యాం ఏర్పాటుచేసి వారం రోజుల్లోపు పవర్‌హౌజ్‌లో చేరిన నీటిని తోడేస్తామన్నారు. సంఘటనకు గల కారణాలను పూర్తి స్థాయిలో తెలుసుకుంటామని, నెల రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపర్చుతామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. సీఎండీ వెంట జెన్‌కో ఎస్‌ఈలు శ్రీనివాస్, శ్రీనివాసా, ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, బీవీ వ్యాసరాజ్, ఏడీఈలు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్షమే: ఎమ్మెల్యేలు
దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి నిర్మాణ కేంద్రంలో జరిగిన ఘటనకు అధికారులు, కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలని ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, కె.దయాకర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌గౌ డ్, జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న అన్నా రు. గురువారం వారు వేర్వేరుగా జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరి పించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌చేశారు.
హమ్మయ్య.. బతికి బయటపడ్డాం
Published Fri, Aug 1 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM
Advertisement
Advertisement