power house
-
బరువు తగ్గడంలో పుచ్చకాయ గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసా..!
పుచ్చకాయ గింజలతో బరువుకి చెక్ పెట్టొచ్చట. సమ్మర్లో దాహార్తిని తీర్చే ఈ పుచ్చకాయతో బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అద్భుతమైన హైడ్రేటింగ్ పండు మాత్రమే గాక దీనిలో ఉండే చిన్న విత్తనాలు బరువుని తగ్గించడంలో ఎంతో పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మంచి రిఫ్రెష్‌ని ఇచ్చే జ్యూసీ పండు ఇది.అయితే దీనిలో ఉండే విత్తనాలను పారేస్తామే గానీ వినియోగించం. వీటిలో కూడా అవసరమైన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయట. అవి బరువు తగ్గించడంలో ప్రభావవంతగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ని అని చెబుతున్నారు. ఈ పుచ్చకాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో సవివరంగా చూద్ధామా..!అధిక ప్రోటీన్: పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాలను బలోపేతం చేయడానికి అవసరం. ఇందులో ఉండే ప్రొటీన్ ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. అల్పాహారం చేయాలనే కోరికను తగ్గించి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఈ విత్తనాలలో కొన్ని మాత్రమే రోజువారీ ప్రోటీన్‌లో గణనీయమైన మొత్తాన్ని అందించగలవు.ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి: ఈ గింజల్లో ఒమేగా-6 తో సహా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కొవ్వులు తక్షణ శక్తిని అందిస్తాయి. చురుకుగా ఉండటానికి, రోజంతా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడతాయి.ఫైబర్ కంటెంట్: పుచ్చకాయ గింజలు ఫైబర్ మూలం. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. సంపూర్ణత్వ భావనను ప్రోత్సహిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.జీవక్రియను పెంచుతుంది: పుచ్చకాయ గింజలలో లభించే మెగ్నీషియం జీవక్రియకు సంబంధించిన శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సమర్థవంతమైన బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీవక్రియ అవసరం. ఎందుకంటే ఇది శరీరంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో అదనపు కిలోలను తగ్గించడంలో సహాయపడుతుంది.కేలరీలు తక్కువ: అనేక ఇతర చిరుతిండి ఎంపికలతో పోలిస్తే పుచ్చకాయ గింజలు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి పోషకమైన సంతృప్తికరమైన ఎంపికగా మారుస్తుంది.ఎలా చేర్చుకోవాలంటే..వేయించిన పుచ్చకాయ గింజలు భోజనానంతరం స్నాక్‌గా తీసుకోవడం సరైనది. ఆరోగ్యకరమైన స్నాకింగ్ తినాలనుకుంటే చిటికెడు ఉప్పు, కొంచెం ఆలివ్ నూనెతో వేయించండి. అలాగే ప్రోటీన్లు, అవసరమైన పోషకాల కోసం స్మూతీస్‌లో కూడా జోడించండి. ముఖ్యంగా సలాడ్ల పైన వేయించిన పచ్చి పుచ్చకాయ గింజలను చిలకరించడం వల్ల క్రంచి క్రంచి వగరు రుచిని ఆస్వాదించవచ్చు. (చదవండి: కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి సెంచరీ కొట్టిన తాత! ఎలాగంటే..) -
అనుకున్న సమయానికే ‘పోలవరం పవర్ హౌస్’
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2025 జూన్‌కి పూర్తవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అదే సమయానికి పోలవరం జల విద్యుత్ కేంద్రం (పవర్ హౌస్) పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు వెల్లడించారు. 12 యూనిట్లతో 960 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించే ఈ విద్యుత్ కేంద్రం ప్రగతిపై ఆయన సోమవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు చౌకగా విద్యుత్ అందించడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► పోలవరం పవర్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) నూతన కాంట్రాక్టు ప్రకారం మొదటి మూడు యూనిట్లను 2024 జూలై నాటికి పూర్తి చేయనుంది. తర్వాత రెండు నెలలకు ఒకటి చొప్పున మిగిలిన 9 యూనిట్లను పూర్తి చేస్తుంది. తొలిదశ కింద 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఏడు యూనిట్లను ప్రారంభించి 560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుడుతుంది. ఆ తర్వాత మిగిలిన 5 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. నీటి నిల్వ స్థాయి తేలే వరకు ప్రాజెక్టు భవితవ్యాన్ని నిర్ణయించడం సాధ్యం కాదని, 2026 నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందా అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నిర్ణీత సమయానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 12 యూనిట్లు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. ► పోలవరం వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకే నీరు నిల్వ చేస్తే జల విద్యుత్ కేంద్రం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదనే అపోహలున్నాయి. వాస్తవానికి ఒక్కో యూనిట్ 80 మెగావాట్ల పూర్ధిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నెట్ హెడ్ వద్ద 27 మీటర్లు, రిజర్వాయరు వద్ద 41.15 మీటర్లు, టెయిల్ వద్ద 13.64 మీటర్ల నీరు నిల్వ ఉంటే సరిపోతుంది. దీన్నిబట్టి రిజర్వాయరు నీటి మట్టం 41.15 మీటర్లు ఉంటే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని స్పష్టమవుతోంది. ► ఒకవేళ స్పిల్‌వే ద్వారా వదిలే నీటి వల్ల టెయిల్ వాటర్ లెవల్ పెరిగి నెట్ హెడ్ వద్ద 27 మీటర్లకంటే తక్కువ నిల్వ ఉంటే ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి నిల్వ 41.15 మీటర్లకు పరిమితం చేసినా జల విద్యుత్ కేంద్రం నిర్వహణకు నష్టం లేదు. వరదల సీజన్లో ముందే విద్యుదుత్పత్తి ప్రారంభించొచ్చు. ► ముందు నిర్ణయించిన కాంట్రాక్టు సంస్థను తప్పించి వేరే సంస్థకు నిర్మాణం అప్పగించడంవల్ల సంప్రదింపులు (ఆర్బిట్రేషన్) కింద ఏపీ జెన్కో రూ.600 కోట్ల వరకు చెల్లించాలని, అది జెన్కోపై అదనపు భారమనే ప్రచారం జరుగుతోంది. కానీ గత కాంట్రాక్టు సంస్థతో ఇంకా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆర్బిట్రేషన్ వల్ల ఏపీజెన్కోపై ఏమాత్రం భారం పడదని, తీర్పు అనుకూలంగా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. -
వెలుగుల స్మృతి.. మసకబారింది
భాగ్యనగరంలో దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే ముందే విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అప్పట్లోనే ఇక్కడ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. 110 సంవత్సరాల క్రితమే సిటీలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సాక్షి సిటీబ్యూరో: డీజిల్ జనరేటర్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరా నాటి నగర అవసరాలకు సరిపోని పరిస్థితి. దాంతో కొందరు పరిపాలనాధికారులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాలని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సూచించారు. దీంతో 1920లో హైదరాబాద్ పవర్ హౌస్ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. అందులో నాలుగు యూనిట్లు నిరంతరం పనిచేసేవి. ఆ కట్టడంలో మొగలాయిల శైలి దర్శనమిచ్చేది. ‘హైదరాబాద్ పవర్ హౌస్ భవనం తాజ్‌మహల్ నిర్మాణమంత అందంగా ఉండేది’ అని ప్రముఖ చరిత్రకారులు అల్లమా ఏజాజ్ ఫారుఖీ తెలిపారు. అమెరికా నుంచి మిషనరీ.. మిషనరీని అమెరికా, యూరప్ దేశాల నుంచి తెప్పించారు. 22.5 మెగా ఓల్ట్‌ల సామర్థ్యం గల ప్లాంటులో రోజుకు 200 టన్నుల బొగ్గు వాడేవారు. తద్వారా జంట నగరాలతోపాటు ఆనాటి హైదరాబాద్ రాజ్యంలోని 18జిల్లాలకు విద్యుత్ సరఫరా అయ్యేది. గోదావరిఖని నుంచి బొగ్గును తరలించేందుకు ప్రత్యేక రైలు మార్గాన్ని కూడా నిర్మించారు. నాటి రైలు పట్టాల ఆనవాళ్లు ఖైరతాబాద్ గణపతి భవనం వెనుక భాగంలోని గల్లీలో నేటికీ దర్శనమిస్తాయి. జాడలేవి..! హైదరాబాద్ పవర్ హౌస్‌ను హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్‌గా పిలిచేవారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన పాత్ర వహించిన ఆ కేంద్రం తాలూకూ జాడలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు. 1972లో రెండు ఉత్పత్తి యూనిట్లు మూతబడ్డాయి. మిగతా రెండు యూనిట్లూ నిరంతరాయంగా పనిచేసేవి. అనంతరం హైదరాబాద్ పవర్ హౌస్ 1992 నాటికి పూర్తిగా బంద్ అయింది. పవర్ హౌస్ ఓ జ్ఞాపకం.. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతేనేం.. ఆ ఆవరణలోని కట్టడాలను పరిరక్షించాలని కొందరు చరిత్ర అధ్యయనకారులు ప్రభుత్వానికి విన్నవించారు. వారసత్వ కట్టడమైన ఆ అందమైన భవన సముదాయాలను మ్యూజియంగా మార్చాలని సూచించినా పట్టించుకోలేదు. 1995లో పవర్ హౌస్ నిర్మాణాలను కూల్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్ నిర్మాణాలున్న ప్రదేశంలోనే హైదరాబాద్ పవర్ హౌస్ ఉండేది. అంతర్జాతీయ ఖ్యాతి.. హైదరాబాద్ థర్మల్ విద్యుత్ కేంద్రంపై 1939లో ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రత్యేక కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించింది. నిజాం రాజ్యంలో ఆధునిక, పారిశ్రామికాభివృద్థికి ప్రతీక హైదరాబాద్ పవర్ హౌస్ నిర్మాణమని ప్రశంసింది. దానిపై ప్రత్యేకంగా ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేయడాన్ని కూడా ప్రస్తావించింది. అలా అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1930 నాటికి దేశంలోనే విద్యుద్ధీకరణ చెందిన నగరాల్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందని ఆర్కాయిస్ రిటైర్డ్ సూపరిటెండెంట్ అబ్దుల్ నయీమ్ చెబుతున్నారు. 1924–25 మధ్య కాలానికి భాగ్యనగరం కేంద్రంగా 121 పరిశ్రమలు వెలిశాయి. కర్ణాటక స్ఫూర్తి.. దేశంలో చారిత్రక నేపథ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కర్ణాటకలోని శివనసమద్ర హైడ్రో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేకమైంది. 700కిలో ఓల్ట్‌ల సామర్థ్యం గత ఆ విద్యుత్తు ప్రాజెక్టును 1902లో మైసూరు మహారాజు నిర్మించారు. అది ప్రారంభమైన రెండేళ్లలోనే బెంగుళూరు నగరానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆ కేంద్రాన్ని అక్కడి చరిత్రకారులు కాపాడుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ చారిత్రక ప్రాజెక్టుకు హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది. అదే మన దగ్గర మాత్రం హైదరాబాద్ పవర్ హౌస్ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. -
వెలుగుల నగరి.. తొలి థర్మల్ ప్రాజెక్టు
భాగ్యనగరం అప్పట్లోనే విద్యుత్ వెలుగులతో విరాజిల్లింది. వందేళ్ల క్రితమే దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే ముందే విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అప్పట్లోనే ఇక్కడ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటైంది. 110 సంవత్సరాల క్రితమే సిటీలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. సాక్షి సిటీబ్యూరో :అప్పట్లో డీజిల్ జనరేటర్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరా నాటి నగర అవసరాలకు సరిపోని పరిస్థితి. దాంతో కొందరు పరిపాలనాధికారులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాలని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సూచించారు. దీంతో 1920లో హైదరాబాద్ పవర్ హౌస్ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. అందులో నాలుగు యూనిట్లు నిరంతరం పనిచేసేవి. ఆ కట్టడంలో మొగలాయి ల శైలి దర్శనమిచ్చేది. ‘హైదరాబాద్ పవర్ హౌస్ భవనం తాజ్‌మహల్ నిర్మాణమంత అందంగా ఉండేది’ అని ప్రముఖ చరిత్రకారులు అల్లమా ఏజాజ్ ఫారుఖీ తెలిపారు. అమెరికా నుంచి మిషనరీ మిషనరీని అమెరికా, యూరప్ దేశాల నుంచి తెప్పించారు. 22.5 మెగా ఓల్ట్‌ల సామర్థ్యం గల ప్లాంటులో రోజుకు 200 టన్నుల బొగ్గు వాడేవారు. తద్వారా జంట నగరాలతోపాటు ఆనాటి హైదరాబాద్ రాజ్యంలోని 18జిల్లాలకు విద్యుత్ సరఫరా అయ్యేది. గోదావరిఖని నుంచి బొగ్గును తరలించేందుకు ప్రత్యేక రైలు మార్గాన్ని కూడా నిర్మించారు. నాటి రైలు పట్టాల ఆనవాళ్లు ఖైరతాబాద్ గణపతి భవనం వెనుక భాగంలోని గల్లీలో నేటికీ దర్శనమిస్తాయి. హుస్సేన్ సాగర్ (ఫైల్) జాడలేవీ..! హైదరాబాద్ పవర్ హౌస్‌ను హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్‌గా పిలిచేవారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన పాత్ర వహించిన ఆ కేంద్రం తాలూకూ జాడలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు. 1972లో రెండు ఉత్పత్తి యూనిట్లు మూతబడ్డాయి. మిగతా రెండు యూనిట్లూ నిరంతరాయంగా పనిచేసేవి. అనంతరం హైదరాబాద్ పవర్ హౌస్ 1992 నాటికి పూర్తిగా బంద్ అయింది. పవర్ హౌస్ ఓ జ్ఞాపకం విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతేనేం.. ఆ ఆవరణలోని కట్టడాలను పరిరక్షించాలని కొందరు చరిత్ర అధ్యయనకారులు ప్రభుత్వానికి విన్నవించారు. వారసత్వ కట్టడమైన ఆ అందమైన భవన సముదాయాలను మ్యూజియంగా మార్చాలని సూచించినా పట్టించుకోలేదు. 1995లో పవర్ హౌస్ నిర్మాణాలను కూల్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్ నిర్మాణాలున్న ప్రదేశంలోనే హైదరాబాద్ పవర్ హౌస్ ఉండేది. హుస్సేన్ సాగర్ (ఫైల్) అంతర్జాతీయ ఖ్యాతి హైదరాబాద్ థర్మల్ విద్యుత్ కేంద్రంపై 1939లో ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రత్యేక కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించింది. నిజాం రాజ్యంలో ఆధునిక, పారిశ్రామికాభివృద్థికి ప్రతీక హైదరాబాద్ పవర్ హౌస్ నిర్మాణమని ప్రశంసింది. దానిపై ప్రత్యేకంగా ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేయడాన్ని కూడా ప్రస్తావించింది. అలా అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1930 నాటికి దేశంలోనే విద్యుద్ధీకరణ చెందిన నగరాల్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందని ఆర్కాయిస్ రిటైర్డ్ సూపరిటెండెంట్ అబ్దుల్ నయీమ్ చెబుతున్నారు. 1924–25 మధ్య కాలానికి భాగ్యనగరం కేంద్రంగా 121 పరిశ్రమలు వెలిశాయి. కర్ణాటక స్ఫూర్తి దేశంలో చారిత్రక నేపథ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కర్ణాటకలోని శివనసమద్ర హైడ్రో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేకమైంది. 700కిలో ఓల్ట్‌ల సామర్థ్యం గత ఆ విద్యుత్తు ప్రాజెక్టును 1902లో మైసూరు మహారాజు నిర్మించారు. రెండేళ్లలోనే బెంగుళూరుకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆ కేంద్రాన్ని చరిత్రకారులు కాపాడుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ ప్రాజెక్టుకు హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది. అయితే ఇపుడు హైదరాబాద్ పవర్ హౌస్ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. -
పవర్ హబ్‌గా రామగుండం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ అవసరాలు స్థానికంగా ఏర్పాటు చేసే థర్మల్ ప్రాజెక్టుల ద్వారానే తీరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. సింగరేణి సంస్థ ద్వారా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌లో రెండు 600 మెగావాట్ల యూనిట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న 1200 మెగావాట్ల విద్యుత్తును పూర్తిస్థాయిలో గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు పంపిస్తున్న ప్రభుత్వం, భవిష్యత్ అవసరాల కోసం ఎన్టీపీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఎన్టీపీసీ ద్వారా రామగుండంలోనే ఉత్పత్తి అయ్యేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రామగుండంలో ఆమోదం పొందిన 1600 మెగావాట్ల (800 మెగావాట్ల 2 యూనిట్లు) విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) శరవేగంగా పూర్తి చేస్తోంది. జాతీయ స్థాయి ప్రాజెక్టు అయినప్పటికీ, బొగ్గు, నీరు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తూ, అందులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను కూడా రాష్ట్ర అవసరాలకే వినియోగించుకు ఒప్పందంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మూడేళ్ల క్రితం రామగుండంలో మొదలైన ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–1 విద్యుత్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో స్టేజ్–2 కింద మరో మరో మూడు యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కాళే«శ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు విద్యుత్ వినియోగం అధికంగా అవసరమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో, సింగరేణి అధికారులు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం పర్యటన శనివారం ఖాయం కావడంతోఆయా విభాగాల అధికారులు తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనతో స్టేజ్–1 పనులు వేగవంతం కావడమే కాక, స్టేజ్–2 అనుమతులు కూడా వీలైనంత తొందరలోనే లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎంతో కీలక సమావేశం నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనధికారిక షెడ్యూల్ ప్రకారం... శనివారం ఉదయం ఆయన ఎన్టీపీసీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకుని తెలంగాణ స్టేజీ వన్ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడంతోపాటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టుకు ఎన్టీపీసీ బోర్డుఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపి, సంతకాలు కూడా పూర్తయిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–ఎన్టీపీసీ సంస్థతో కుదిరితేనే రెండోస్టేజ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ స్టేజీ వన్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పర్యవేక్ష సమావేశం జరుగనుంది. ఎన్టీపీసీ సీఅండ్ఎండీ గురుదీప్‌సింగ్, జెన్కో సీఅండ్ఎండీ ప్రభాకర్‌రావు, సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కానున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం అవసరం ఉన్న నేపథ్యంలో రెండో ప్రాజెక్టు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. 800మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు నిర్మించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన భూమి, నీరు, సింగరేణి బొగ్గు అందుబాటు ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం కీలకంగా మారనుంది. శనివారం రామగుండం ఎన్టీపీసీకి రానున్న నేపథ్యంలో తెలంగాణా స్టేజ్–2 నిర్మాణానికి మోక్షం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు ఎదురు చూస్తున్నాయి. శరవేగంగా స్టేజ్–1 నిర్మాణం పనులు స్టేజ్–1 ప్రాజెక్టులో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి మే 2020లోనే తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టు ఉత్పత్తి దశలోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. 2016 జనవరి 29న పనులు ప్రారంభించి 70 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 8 డిసెంబర్ 2017న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాంటు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే 2600 మెగావాట్ల థర్మల్ పవర్, 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తితో తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్న ఎన్టీపీసీ, తెలంగాణ విద్యుత్ సమస్యలు తీర్చేందుకు మరో 1600 (800చొప్పున రెండు) మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశ పనులు వేగంగా చేస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం అంచనా రూ.10,598.98. స్టేజ్–2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభిస్తే మరో 2,400మెగావాట్లు.. రెండవ దశలో 2400 మెగావాట్ల (800 చొప్పున3) ప్రాజెక్టు నిర్మాణానికి సైతం బోర్డు ఆమోదం తెలిపింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసేందుకు ఎన్టీపీసీ సంస్థ పూర్తి స్థాయి చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం–2014 ప్రకారం బొగ్గు ఆధారిత 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటును తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 1600 మెగావాట్లు, రెండో దశలో 2400 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి జరగాల్సి ఉంది. పవర్ హబ్.. ప్రస్తుతం ఉన్న 2,600, 10 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుతోపాటు కొత్తగా చేపట్టనున్న స్టేజ్–1, స్టేజ్–2 ప్రాజెక్టుల ద్వారా 4,000వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలుపుకొంటే.. 6,610 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా రామగుండం ఎన్టీపీసీ అభివృద్ధి చెందనుంది. సింగరేణి బొగ్గుగనుల నుంచి బొగ్గు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు అందుబాటులో ఉన్నాయి. మేడిపల్లి సింగరేణి ఓసీపీ జీవిత కాలం పూర్తవుతున్న క్రమంలో దానిని యాష్‌పాండ్ కోసం ఎన్టీపీసీ సంస్థ వినియోగించుకోనున్నది. తెలంగాణలో ఎన్టీపీసీ సంస్థ మొదటి దశ 1600, రెండవ దశ 2400మెగావాట్లు మొత్తంగా నిర్మించే 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం రామగుండంలోనే నిర్మితమవుతున్నట్లు స్పష్టమైంది. దీంతో భారత దేశంలో కెల్లా అతిపెద్ద థర్మల్ కేంద్రంగా రామగుండం నిలువనున్నది. ఎన్టీపీసీ ప్రస్తుతం ఉన్న ఎంజీఆర్ అన్లోడింగ్ బల్బ్ ఏరియాలోని అందుబాటులో ఉన్న దాదాపు 235 ఎకరాల స్థలంలో ప్రతిపాదించబడిన ప్రాజెక్టు ఏర్పాటు జరుగుతుంది. తెలంగాణ స్టేజీ–2(3్ఠ800=2400) కోసం ఎన్టీపీసీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. -
శ్రీశైలం నుంచి నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు విద్యుత్ ఉత్పాదన అనంతరం 34063 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 10.157 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.090 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు రెండో పవర్‌హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. హంద్రీనీవా సుజల స్రవంతికి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జలా«శయంలో 57.3866 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 836.90 అడుగులుగా నమోదైంది. -
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 853.60 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 853.60 అడుగులకు చేరకుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు రెండు పవర్‌హౌస్‌లలో విద్యుత్ ఉత్పాదన అనంతరం 1,459 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 0.613 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 0.132 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 300 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 420 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 88.2691 టీఎంసీల నీరు నిల్వఽ ఉంది. -
వెన్ను నొప్పా..అశ్రద్ధ చేస్తే మిగిలేది వైకల్యమే
వెన్ను పూస ఒక పవర్ హౌస్ లాంటిది. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా ఉంటాయో అలగే మానవ శరీరానికి వెన్ను పూస పిల్లర్ లాంటిది. కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీనివల్ల మెడ, భుజం, తల, కాళ్ళు, చేతులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, జిల్ జిల్ మని కరెంట్ షాక్ కొట్టినట్టు, బలహీన పడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. మరికొంత మందికి లైంగిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇలాంటి నిర్జీవమైన పవర్ హౌస్‌కి తిరిగి శక్తిని ఇవ్వాలంటే అదేమి ఆషామాషి చికిత్సలతో కాకుండా కేవలం కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలతోనే సాధ్యం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ డా ॥పి.కృష్ణప్రసాద్. అసలు ఏమైంది? ఒకరోజు హాస్పిటల్లో బాగా బిజీగా ఉన్న సమయంలో ఒక పేషెంట్‌కి సంబంధించిన బంధువులు ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కలిశారు. పేషెంట్‌కి ఏమయిందని డాక్టర్ గారు అడిగితే వారి బంధువులు ఈ విధంగా చెప్పారు. ‘నడుము, మెడ నొప్పులు బాగా తీవ్రంగా ఉంటాయి బెడ్ పై ఏ పక్కకు తిరిగిన కాళ్లల్లో, చేతుల్లో, భుజాలు, నడుము అంతా కరెంట్ షాక్‌లు వచ్చినట్టు ఉంటుంది, పట్టుమని ఐదు నిమిషాలు కూడా కూర్చోలేడు, నిల్చోలేడు, పడుకొని కుడి, ఎడమలకు తిరిగితే జిల్లుమని కరెంట్ షాక్‌లు కొట్టినట్టు ఉండేది, నడుముతో పాటు మెడ ప్రాంతంలో కూడా తీవ్రమైన నొప్పి వచ్చేది. రెండు చేతులు, కాళ్లు తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్నట్లు పోట్లు, మంటలు, నడిస్తే తల తిరిగి ఎక్కడ పడిపొతాడోనన్న భయం, చేతులతో ఏ వస్తువులు ఎత్తలేని పరిస్థితితో ఇలా ఈ సమస్యల చాలా కాలంగా ఉండటంతో జీవితం ఇలా అయిందేమిటన్న డిప్రెషన్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు’ అని చెప్పారు. ప్రత్యక్షంగా పేషెంట్‌ని, రిపోర్ట్స్ క్షుణ్ణంగా చూసిన తర్వాత అతనికి వెన్నుపూసలో లంబార్ వర్టిబ్రా లోని ఔ2, ఔ4, ఔ5, ఔ1 మధ్య ఉండాల్సిన జ్చఞ తగ్గి అక్కడ ఉన్న డిస్క్‌లు బయటకు వచ్చి నరాల మీద బాగా ఒత్తిడి పడుతుంది, అలాగే మెడ ప్రాంతానికి వస్తే ఇ3, ఇ4, ఇ5, ఇ6 మధ్య కూడా ఇదే సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. పవర్ హౌస్‌కి చికిత్స: ఈ సమస్య గురించి పెయిన్ కిల్లర్స్, బెడ్‌రెస్ట్, ఫిజియోథెరపీ సర్జరీ అనేది శాశ్వత పరిష్కారం కాదు అని ఇట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు పేషెంట్ యొక్క శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సను ప్రారంభించారు. కేరళ పంచకర్మతో: ఎన్ని చికిత్సలు చేసిన తగ్గని వెన్ను నొప్పులకు ఆయుర్వేదంతో మంచి నాణ్యత కలిగిన, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన నానో రకేణువులతో కూడిన నూనెలు, ఔషధాలతో ప్రత్యేకంగా చికిత్సలు చేయటం జరిగింది. పంచకర్మ చికిత్సలతో అతిముఖ్యమైన అభ్యంగనం, తైలధార, కటిబస్తీ, గ్రీవబస్తీ, విరోచనం, వస్తి చికిత్సలు అందించారు. ఇలా మొదటి పది రోజులు తరువాత అరగంట సేపు కూర్చోవటం అతనిలో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పక్కమీద ఎటు తిరిగినా జిల్లుమన్న కరెంట్ షాక్‌లు ఇప్పుడు లేవు ఇప్పుడు నొప్పి ఉన్నా స్థిరంగా నడవ సాగుతున్నారు. మెడపై ఉంటే ఒత్తిడి బాగాతగ్గింది ఇంకొక 2 వారాలు తర్వాత నడుము గట్టిగా పిసికేసినట్టు ఉన్న నొప్పి అంతగా లేదు. చేతులు, కాళ్లు చాలా తేలికయ్యాయి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు చాలా వరకు తగ్గుముఖం పట్టి అన్ని పనులు చేసుకోవచ్చన్న ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలా 25 రోజులు అత్యంత శక్తివంతమైన కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలు ఇచ్చి, ఇంకొక మూడు నెలల పాటు కొన్ని ఔషధాలు ఇచ్చి సూచించిన వ్యాయామాలు చేయమని, మలబద్ధకం లేకుండా చూసుకోమని చెప్పారు. ఇప్పటికి ఆరునెలల గడిచాయి నొప్పి అన్న మాటే లేదు, ఒక ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న, చిన్న వ్యాయామాలు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. -
నిండుకుండలా జూరాల ప్రాజెక్టు
-
హమ్మయ్య.. బతికి బయటపడ్డాం
ఆత్మకూర్ : ‘‘దిగువ జూరాల పవర్‌హౌజ్‌లో విధినిర్వహణలో భాగంగా నాతోపాటు వీఆర్క్స్ కంపెనీ డెరైక్టర్ కౌషిక్‌కుమార్‌రెడ్డి, మరో నలభైమంది సిబ్బంది ఉన్నాం. రాత్రి 10:30గంటల సమయంలో ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారి అందరం ఉరుకులు పరుగులు తీశారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే పవర్‌హౌజ్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చిచేరింది. పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన నేను ఈదుకుంటూ ఒకరాడ్ను పట్టుకుని అరుపులు కేరింతలు కొట్టడంతో కొంతమంది తాడ్ల సహాయంతో నన్ను పైకిలాగారు. ఇదినాకు పునర్జన్మగా భావిస్తున్నా..’’అని జెన్కో ఏడీ శ్రీనివాస్‌రెడ్డి పవర్‌హౌస్‌లోకి చేరిన వరద నుంచి బయటపడ్డ క్షణాలను ఆయన గుర్తుచేశారు. ఆత్మకూర్ మండలం జూరాల మూలమళ్ల గ్రామ శివారులో రూ.1400కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తికేంద్రంలోకి బుధవారం అర్ధరాత్రి భారీగా వరదనీరు చేరింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువకు 1.50లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో జూరాలకు పెద్ద ఎత్తున వరదఉధృతి చేరింది. దీంతో జూరాల అధికారులు దిగువకు గురువారం రాత్రి 9గంటల సమయంలో 90వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. జెన్కో అధికారులు ఏర్పాటుచేసిన ఇన్‌టెక్‌వెల్ గేట్‌వాల్వ్స్ వరదధాటికి కొట్టుకుపోవడంతో రాత్రి 10 గంటల సమమంలో వరదనీరు ఒక్కసారిగా పవర్‌హౌజ్‌లోకి చేరింది. అప్పటికే పవర్ హౌజ్‌లో విధుల్లో ఉన్న జెన్కో అధికారులు, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర కార్మికుల సహాయంతో బయటపడ్డారు. ఈ సంఘటన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియపర్చడంతో తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు బృందం దిగువ జూరాల ప్రాజెక్టు సందర్శించింది. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో శ్రీశైలం ప్రాజెక్టులో ప్రమాదం జరిగిందనప్పుడు రూ.30కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన నష్టం అంతకంటే తక్కువగానే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారులు అప్రమత్తంగా వుండటంతోనే ఎలాంటి ప్రాననష్టం వాటిల్లలేదని అన్నారు. కాపర్‌డ్యాం ఏర్పాటుచేసి వారం రోజుల్లోపు పవర్‌హౌజ్‌లో చేరిన నీటిని తోడేస్తామన్నారు. సంఘటనకు గల కారణాలను పూర్తి స్థాయిలో తెలుసుకుంటామని, నెల రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపర్చుతామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. సీఎండీ వెంట జెన్కో ఎస్ఈలు శ్రీనివాస్, శ్రీనివాసా, ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, బీవీ వ్యాసరాజ్, ఏడీఈలు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్షమే: ఎమ్మెల్యేలు దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి నిర్మాణ కేంద్రంలో జరిగిన ఘటనకు అధికారులు, కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలని ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, కె.దయాకర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీధర్గౌ డ్, జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న అన్నా రు. గురువారం వారు వేర్వేరుగా జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరి పించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌చేశారు. -
నత్తే నయం
పోలవరం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. స్పిల్‌వే, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం, పవర్ హౌస్ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చేపట్టింది. ఏడాది గడచినా నిర్మాణాన్ని వేగవంతం చేయలేదు. స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ నిర్మాణాల కోసం అడ్డుగా ఉన్న కొండలను బ్లాస్టింగ్ ద్వారా తొలగించడం, అవసరమైన చానళ్లను తవ్వడం వంటి ఎర్త్ వర్క్ పనులు చేస్తున్నారు. నిర్దేశించిన ప్రకారం రోజుకు 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. కానీ.. కేవలం 40 నుంచి 50 వేల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. అధునాతన యంత్రాలను ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టు ఏజెన్సీ వాటిని పని ప్రాంతానికి తీసుకురావడం లేదు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతం వద్ద ఇంకా 5 నుంచి 15 మీటర్ల లోతున తవ్వకాలు సాగించాల్సి ఉంది. పనులు ఇలాగే కొనసాగితే గడువు నాటికి పూర్తికావని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అధునాతన యంత్రాలను తీసుకువచ్చి పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు జారీచేసినా ప్రయోజనం కనిపిం చడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 2015 జూన్ నాటికి ఎర్త్ వర్క్ పనులను పూర్తిచేసి గోదావరి నీటిని స్పిల్ చానల్ ద్వారా మళ్లించాల్సి ఉంది. 2015 డిసెంబర్ నాటికి నదిలో కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయూలి. అనంతరం నదిలో ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పనులు చేపట్టి 2018 నాటికి పూర్తి చేయాలి. అక్కడి పరిస్థితిని చూస్తే గోదావరి నీటిని స్పిల్ చానల్‌కు తరలించే సమయానికి కూడా ఎర్త్ వర్క్ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులను తరచూ కొన్ని రోజులపాటు నిలి చిపోతున్నారుు. ఇదేమని అధికారులు అడుగుతుంటే.. డీజిల్ కొరత కారణంగా పనులకు అంతరాయం కలుగుతోందని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం కాదని అధికారులు పేర్కొంటున్నారు. -
ఇదేమి న్యాయం..!
నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్ : విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ల ఎంపికలో ఆరోపణలు వచ్చినట్లుగానే... మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోగా, అనర్హులకే ఉద్యోగాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ ఎన్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాల తంతు! మొదటి విడతలో ఆపరేటర్ల పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు స్తంభం ఎక్కే పరీక్షలను బుధవారం జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌లో నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ డివిజన్లకు సంబంధించిన సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భ ర్తీకి అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం నాడు ఆర్మూర్ డివిజన్‌కు సంబంధించిన అభ్యర్థులకు పరీక్షలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా ఆర్మూర్ డివిజన్‌కు చెందిన సీహెచ్ కొండూరు గ్రామంలోని బీసీ-డి కేటగిరికి చెందిన అభ్యర్థి తనకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కాల్ లెటర్ రాలేదనీ, తనకంటే తక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థికి కాల్‌లెటర్ వచ్చినట్లు వాపోయాడు. బాధితుడు ఈ విషయాన్ని ఆర్మూర్ డివిజన్లోని సంబంధిత అధికారులను విన్నవించిన ఫలితం దక్కలేదని ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే తన పేరును పత్రికలో ప్రచురించ వద్దని వేడుకున్నాడు. భవిష్యత్తులో అధికారులు కొర్రీలు పెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇదేవిధంగా తనకు అన్యాయం జరిగిందని నిజామాబాద్ మండలం ఆమ్రాబాద్‌కు చెందిన ఎస్టీ అభ్యర్థి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్‌లెటర్ వచ్చిందన్నారు. ట్రాన్స్‌కో అధికారులు అభ్యర్థుల మార్కుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించక పోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
కర్నూలు జిల్లా శ్రీశైలం పవర్ హొస్ దగ్గర ఉద్రిక్తత